టెస్ట్‌ షూట్‌లోనే హీరోయిన్‌పై దర్శకుడి ప్రశంసలు | Priyanka Mohan and Kayadu Lohar to be part of Mari Selvaraj Film Manjanathi | Sakshi
Sakshi News home page

టెస్ట్‌ షూట్‌లోనే హీరోయిన్‌పై దర్శకుడి ప్రశంసలు

Jun 5 2026 11:14 AM | Updated on Jun 5 2026 12:23 PM

Priyanka Mohan and Kayadu Lohar to be part of Mari Selvaraj Film Manjanathi

ఎవరికై నా ప్రశంసలు అంత సులభంగా రావు. కొందరు ముఖస్తుతి కోసం ప్రశంసలు కురిపించినా, నిజమైన ప్రశంసలు ప్రతిభతోనే వస్తాయి. అలా నటి కయదులోహర్‌ టెస్ట్‌ షూట్‌లోనే దర్శకుడు మారిసెల్వరాజ్‌ ప్రశంసలు అందుకున్నారు. బైసన్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రం తరువాత మారిసెల్వరాజ్‌ ధనుష్‌ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రం ప్రారంభానికి మరి కొంత సమయం పడుతుండడంతో మారి ఈ మధ్యలో మరో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. 

ఈ చిత్రానికి మంజనధి అని టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో తన తొలి చిత్రం పరియేరుమ్‌ పెరుమాళ్‌లో నటించిన కదిర్‌ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. అందులో కయదులోహర్‌, ప్రియాంకమోహన్‌ ఇప్పటికే ఎంపికయ్యారు. 

ఇందులోని ఒక కథానాయకి పాత్రకు నటి కయదులోహర్‌ సరిగా నప్పుతారా అన్న సందేహం దర్శకుడు మారికి కలిగిందట. దీంతో ఆమెకు మాత్రం టెస్ట్‌ షూట్‌ నిర్వహించారట. అందులో ఆమె నటన చూసి దర్శ కుడు ఫిదా అయినట్లు యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. 

ఈ చిత్రం తరువాత కయదులోహర్‌ ఇంతకుముందు నటించిన చిత్రాలన్నింటిని మరిచిపోయారని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నాయి. అలా టెస్ట్‌ షూట్‌లోనే దర్శకుడు ప్రశంసలు అందుకోవడం ఆమెకు పెద్ద ఎసెట్‌ అవుతుంది. ఈచిత్రంలో మరో కథానాయికి కూడా ఉంటుందని సమాచారం. ఇకపోతే దర్శకుడు మారినే నిర్మాతగా వ్యవహరిసు న్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement