కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా వచ్చిన ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. తొలి రోజే ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ లవ్ స్టోరీకి యూత్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రవి నంబూరి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఆదరణ లభిస్తోంది.
ఇక సినిమా సంగతి అటుంచితే ఈ మూవీకి మొదటి అనుకున్నది కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ కాదని తెలుస్తోంది. ఈ లవ్ స్టోరీకి బేబి జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చేయాల్సింది. కానీ పలు కారణాలు చేత వారిద్దరూ ఈ కల్ట్ బొమ్మ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం. అలా ఈ ఛాన్స్ కిరణ్, శ్రీగౌరి ప్రియకు దక్కింది. గతంలో సాయి రాజేశ్ డైరెక్షన్‌లో వచ్చిన కల్ట్ ప్రేమకాథా చిత్రం బేబీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.


