breaking news
Sri Gouri Priya
-
‘చెన్నై లవ్‌స్టోరీ’ సక్సెస్ మీట్...ముఖ్య అతిథిగా హీరో నాగచైతన్య (ఫొటోలు)
-
నేనే దర్శకత్వం వహించినా.. ఇంత బాగా తీసేవాడిని కాదు : సాయి రాజేష్
‘‘చెన్నై లవ్ స్టోరీ’కి నేను కథా రచయితను అయినా నాకంటే ఎక్కువగా ఈ కథను ప్రేమించి, అర్థం చేసుకుని సినిమా తీశారు రవి నంబూరి. నేను దర్శకుడిని అయినా ఇంత బాగా తెరకెక్కించేవాడిని కాదేమో. ‘బేబి’ తర్వాత మా గౌరవాన్ని పెంచే సినిమా చేయాలనుకున్నాం. ‘బేబి’ కన్నా ‘చెన్నై లవ్ స్టోరీ’ చాలా గొప్ప సినిమా’’ అని సాయి రాజేష్ తెలిపారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. శనివారం జరిగిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో రవి నంబూరి మాట్లాడుతూ– ‘‘మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఏ దర్శకుడికైనా ఓ కల. ఆ కల నిజం కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.శ్రీ గౌరీప్రియ మాట్లాడుతూ– ‘‘కొంచెం ఎమోషనల్‌గా ఉన్నాను. నాకు చాలా ముఖ్యమైన రోజు ఇది. మా అమ్మ ఉండి ఉంటే నిజంగా చాలా సంతోషపడేవారు. కానీ, మా అమ్మ రూపంలో విశాల, ప్రమోదినిగార్లు అప్పుడప్పుడు వచ్చి నాకు మంచి మాటలు చెబుతుంటారు. ఇక్కడికి రాగానే ‘చెన్నై లవ్ స్టోరీ’లో నువ్వు చేసిన నివి పాత్రకు నీకు మంచి పేరు, ప్రశంసలు వస్తున్నాయి... అమ్మ చూసుంటే చాలా బాగుండేది’’ అని వారు అన్నారు. కానీ, మా అమ్మ చూస్తోంది.. తన వల్లే నాకీ పేరు వస్తోందని నా ఫీలింగ్’’ అన్నారు. ‘‘అప్పట్లో బాలచందర్, భారతీరాజాగారి కథల్లా సాయి రాజేష్‌గారి కథల్లో లోతు ఉంటుంది. మా సినిమా తొలి రోజు రూ. 12.3 కోట్లు వసూలు చేసిందని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అని ఎస్కేఎన్ పేర్కొన్నారు. ‘‘నా కెరీర్లో స్టీవెన్ శంకర్ అనే గుర్తుండిపోయే పాత్ర ఇచ్చిన రవి నంబూరిగారికి థ్యాంక్స్’’ అన్నారు కిరణ్ అబ్బవరం. కెమెరామేన్ విశ్వాస్ డేనియల్, రచయిత అనంత శ్రీరామ్, నటీనటులు ప్రమోదిని, త్రిగుణ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సందడిగా 'చెన్నై లవ్ స్టోరీ' సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
అమ్మ ఉంటే చాలా సంతోషించేది.. హీరోయిన్ ఎమోషనల్
ఈ వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'చెన్నై లవ్ స్టోరీ'కి పాజిటివ్ టాక్ వస్తోంది. సెకండాఫ్ మీద కంప్లైంట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా పర్లేదని అంటున్నారు. మరోవైపు ఇందులో హీరోయిన్గా చేసిన తెలుగమ్మాయి శ్రీ గౌరిప్రియకి ప్రశంసలు దక్కుతున్నాయి. అన్ని రకాల ఎమోషన్స్ అద్భుతంగా పండిందని అంతా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈమె, సక్సెస్ మీట్లో అమ్మని తలుచుకుని ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: రిలీజ్ రోజే కలెక్షన్స్ పోస్టర్.. ఇదేం విడ్డూరం?)'ఇంత మంచి పేరు, విజయం వస్తున్నప్పుడు మా అమ్మ ఉండి ఉంటే చాలా సంతోషించేవారు. నన్ను ఇప్పుడు ఆమె చూసి ఉంటే బాగుండేదని అందరూ అంటున్నారు. కానీ మా అమ్మ ఎప్పుడూ పైనుంచి నన్ను చూస్తూనే ఉంటుంది' అని గౌరిప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.కిరణ్ అబ్బవరం, గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో రవి నంబూరి దర్శకుడిగా పరిచయమయ్యారు. 'బేబి' తీసిన దర్శకుడు సాయి రాజేశ్.. ఈ చిత్రానికి కథ అందించారు. ఎస్కేఎన్ నిర్మించారు. ఇకపోతే ప్రీమియర్లకే రూ.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. తొలిరోజు మరో రూ.6 కోట్ల వసూళ్లు.. అంటే ఓవరాల్‌గా ఇప్పటివరకు రూ.9 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ.. కిరణ్, శ్రీ గౌరి చేయాల్సింది కాదు..!)స్టేజ్‌పై హీరోయిన్ గౌరీ ప్రియ ఎమోషనల్‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర విజయోత్సవ సమావేశంలో హీరోయిన్ గౌరీ ప్రియ భావోద్వేగానికి లోనయ్యారు. “ఇంత మంచి పేరు, విజయం వస్తున్నప్పుడు మా అమ్మ ఉండి ఉంటే చాలా సంతోషించేవారు.. నన్ను చూసి ఉంటే బాగుండేదని అందరూ అంటున్నారు. కానీ మా అమ్మ ఎప్పుడూ పైనుంచి… pic.twitter.com/8x0pieJSmx— ChotaNews App (@ChotaNewsApp) July 25, 2026 -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘చెన్నై లవ్‌స్టోరీ’
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సాయి రాజేష్, ఎస్ కే ఎన్ నిర్మించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 24) విడుదలైన ఈ చిత్రానికి ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. సెకండాఫ్‌ని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదని పలు న్యూస్ వెబ్సైట్లు తమ రివ్యూలో పేర్కొన్నాయి. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా దూసుకెళ్తోంది. కేవలం కొన్ని చోట్ల మాత్రమే వేసిన ప్రీమియర్ షోకి రూ. 3.13 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక తొలి రోజు మొత్తంగా రూ. 12.3 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం.. బరిలో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
చెన్నై లవ్ స్టోరీ.. కిరణ్, శ్రీ గౌరి చేయాల్సింది కాదు..!
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా వచ్చిన ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. తొలి రోజే ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ లవ్ స్టోరీకి యూత్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రవి నంబూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఆదరణ లభిస్తోంది.ఇక సినిమా సంగతి అటుంచితే ఈ మూవీకి మొదటి అనుకున్నది కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ కాదని తెలుస్తోంది. ఈ లవ్ స్టోరీకి బేబి జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చేయాల్సింది. కానీ పలు కారణాలు చేత వారిద్దరూ ఈ కల్ట్ బొమ్మ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం. అలా ఈ ఛాన్స్ కిరణ్, శ్రీగౌరి ప్రియకు దక్కింది. గతంలో సాయి రాజేశ్ డైరెక్షన్లో వచ్చిన కల్ట్ ప్రేమకాథా చిత్రం బేబీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
రిలీజ్ రోజే కలెక్షన్స్ పోస్టర్.. ఇదేం విడ్డూరం?
కిరణ్ అబ్బవరం, గౌరిప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా థియేటర్లలోకి వచ్చింది. ప్రేమకథగా తీసిన ఈ చిత్రంపై ఓ మాదిరి అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్లే కొన్నిచోట్ల పాజిటివ్ టాక్ మరికొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఒకటి రెండు రోజులు ఆగితే అసలు ఫలితం ఏంటనేది తేలుతుంది. ఇదంతా పక్కనబెడితే రిలీజైన రోజే మూవీ టీమ్, కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేయడం ఇక్కడ విచిత్రంగా అనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)'చెన్నై లవ్ స్టోరీ' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని కొన్నిచోట్ల గురువారం రాత్రి ప్రీమియర్స్ వేశారు. కేవలం పెయిడ్ ప్రీమియర్ షోల ద్వారానే రూ.3.13 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని మూవీ టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే కిరణ్ అబ్బవరం స్టార్ హీరో కాదు, అలా అని టికెట్ రేట్లు కూడా పెంచలేదు. ప్రీమియర్లు కూడా గురువారం రాత్రి ఒకటి రెండు షోలు వేశారు. అంతమాత్రానికే రూ.3 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయా అనేది ఇక్కడ ప్రశ్న.టాలీవుడ్లో ఒకప్పుడు కలెక్షన్స్ పోస్టర్స్ వేస్తే జనాలు కూడా అదే నిజమని నమ్మేసేవాళ్లు. కానీ తర్వాత రోజుల్లో దిల్ రాజు, నాగవంశీ లాంటి ప్రముఖ నిర్మాతలే.. ప్రేక్షకులని ఆకట్టుకోవడం కోసం కొంత మొత్తం పెంచేసి నంబర్లు వేస్తుంటామని బాహాటంగానే ఒప్పుకొన్నారు. దీంతో ఆడియెన్స్ కూడా వసూళ్ల పోస్టర్ రిలీజ్ కాగానే ఇది నిజమా కాదా అని కనిపెట్టేస్తున్నారు.'చెన్నై లవ్ స్టోరీ' విషయానికొస్తే.. నివి(గౌరీప్రియ) తన ప్రియుడు అజయ్(త్రిగుణ్)తో పెళ్లికి రెడీ అవుతుంది. కానీ ముహూర్తం టైంకి మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి, అజయ్ వెళ్లిపోతాడు. దీంతో హీరోయిన్ చెన్నై వెళ్లిపోతుంది. దేవదాసులా మందుకు బానిసవుతుంది. ఆ టైంలో స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) ఈమెకు పరిచయమవుతాడు. దర్శకుడు అవ్వాలనే ఆశతో చెన్నైలోకి అడుగు పెట్టిన ఇతడికి నివి ఫ్రెండ్స్ గ్యాంగే ఆశ్రయమిస్తారు.తొలుత స్టీవెన్, నివికి చిరాకు తెప్పించినా తర్వాత అతడికి దగ్గరవుతుంది. మళ్లీ ఈమెలో ప్రేమ చిగురిస్తుంది. తర్వాత వాళ్లిద్దరి ప్రయాణం ఎలా సాగింది? వీళ్ల ప్రేమకథలో ఎదురైన సవాళ్లేంటి? మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి పెళ్లి పీటలపై నివిని వదిలేసి వెళ్లిపోయిన అజయ్.. మళ్లీ ఆమె జీవితంలోకి ఎందుకొచ్చాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ) -
రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ'.. ట్రెండింగ్‌లో గౌరిప్రియ (ఫొటోలు)
-
చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: చెన్నై లవ్ స్టోరీ నటీనటులు : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, త్రిగుణ్ , సిరి హనుమంతు, నవీన్ తదితరులునిర్మాతలు - ఎస్ కేఎన్, సాయి రాజేశ్కథ : సాయి రాజేశ్స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - రవి నంబూరిసంగీతం : మణిశర్మఎడిటర్ : సంతోష్ నాయుడుసినిమాటోగ్రఫీ : విశ్వాస్ డేనియల్విడుదల తేదీ: 24 జులై 2026మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సాయి రాజేష్, ఎస్ కే ఎన్ నిర్మించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ . ఈ మూవీ రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని జూలై 24న రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏంటి? ఈ చిత్రం ఆడియెన్స్ ఏ మేరకు నచ్చుతుంది? అన్నది ఓ సారి చూద్దాం. కథ ఏంటంటే?కాలేజ్ రోజుల నుంచే అజయ్ (త్రిగుణ్), నివి అలియాస్ నివేదిత (గౌరీ ప్రియ) ప్రేమించుకుంటారు. రెండేళ్ల స్నేహం, మూడేళ్ల ప్రేమతో పెళ్లికి సిద్దం అవుతారు. సరిగ్గా పెళ్లి రోజే అజయ్ చెప్పాపెట్టకుండా వెళ్లిపోతాడు. వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాని అజయ్ చెప్పడంతో నివేదిత తట్టుకోలేకపోతుంది. ఆ బాధతో నివేదిత మందుకు బానిస అవుతుంది. ఆఫీసులో సరిగ్గా వర్క్ మీద ఫోకస్ కూడా పెట్టదు. ఇక నివేదిత రూంలోకి ఓ అతిథిగా వస్తాడు స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం). అనాథ అయిన స్టీవెన్.. ఫిల్మ్ మేకర్ అవ్వాలని, చచ్చేలోపు ఒక్కసారి అయినా తన పేరుని సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలని అవకాశాల కోసం తిరుగుతుంటాడు. స్టీవెన్ రాకతో నివిలో వచ్చిన మార్పులు ఏంటి? నివి, స్టీవెన్ ప్రయాణం ఎంత వరకు సాగుతుంది? దర్శకుడు అవ్వాలనే స్టీవెన్ కోరిక నెరవేరుతుందా? అజయ్ మళ్లీ నివి జీవితంలోకి వస్తాడా? చివరకు ఈ ప్రేమ కథలో ఎవరెవరు ఒకటి అవుతారు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే?..ప్రేమ కథల్లో చెన్నై లవ్ స్టోరీ మాత్రం కాస్త కొత్త ప్రేమ కథే అని చెప్పుకోవాలి. ప్రేమ కథ అన్నాక.. ప్రేమికుడు, ప్రేయసి ఉంటుంది.. వీరి మధ్య ఓ సంఘర్షణ ఉంటుంది.. ఇద్దరినీ దూరం చేసే కారణం ఏదో ఒకటి ఉంటుంది.. ఈ పాయింట్స్‌ని పట్టి చూస్తే ఈ ప్రేమ కథ చాలా కొత్తగా అనిపిస్తుంది. తొలి ప్రేమ తోపు కాదే అన్న మాట, పాటలోనే ఈ కథ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. అయితే ఈ కథను ఎలా డీల్ చేశారన్న దానిపైనే రిజల్ట్ ఆధార పడి ఉంటుంది. తొలి ప్రేమ అయినా, మలి ప్రేమ అయినా ప్రేయసి సుఖాన్ని, సంతోషాన్నే ప్రేమికుడు కోరుకోవాలి. నివి ప్రేమలో విఫలం అవ్వడం, పెళ్లి క్యాన్సిల్ అవ్వడం, ఆపై మందుకు బానిస అవ్వడం వంటి సీన్లతో ఆరంభం నుంచే ప్రేక్షకుడ్ని హుక్ చేసేస్తాడు దర్శకుడు. ఆ తర్వాత హీరో పాత్రను పరిచయం చేయడం, అక్కడితో కాస్త ఎంటర్టైన్మెంట్ ట్రాక్ నడిపించడంతో కథ అలా ముందుకు వెళ్తుంటుంది. హీరో, హీరోయిన్ల మధ్య మొదట్లో వచ్చే గొడవలు, ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ చిగురించడం వంటి సీన్లతో కథ మరింత స్పీడుగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అయితే అన్నీ బాగానే ఉన్నాయ్ అని అనుకునే టైంకి కథ ఎవ్వరూ ఊహించని టర్న్ తీసుకుంటుంది. ఆ ఇంటర్వెల్ బ్లాక్‌తో అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. సెకండాఫ్‌ని ఎలా డీల్ చేస్తారు? అసలు కథ ఎలా ముందుకు సాగుతుంది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్లతో ద్వితీయార్దాన్ని ప్రేక్షకుడు చూస్తాడు. ఇక ఆడియెన్స్ ఇంట్రెస్ట్‌కి తగ్గట్టుగానే కథనం సాగుతుంటుంది. హీరో, హీరోయిన్ల ట్రాక్ అక్కడ చాలా కొత్తగా అనిపిస్తుంది. మళ్లీ అజయ్ పాత్రను తీసుకు రావడంతో కథ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఆ తరువాత కథ అక్కడక్కడే తిరుగుతుండటం, చాలా వరకు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లోని కొన్ని ఎమోషనల్ సీన్స్ గుండెల్ని మెలిపెట్టేలా ఉంటాయి. క్లైమాక్స్‌కి కన్నీరు పెట్టాల్సిందే. అలా చివరకు ఓ సంతృప్తితో ప్రేక్షకుడు బయటకు వెళ్తాడు. అయితే ద్వితీయార్దాన్ని ఇంకాస్త బెటర్‌గా మల్చి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేదనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..కిరణ్ అబ్బవరం తనకు ఇచ్చిన స్టీవెన్ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో అమాయకుడిగా అందరినీ నవ్విస్తూ కనిపించే కిరణ్ అబ్బవరం, సెకండాఫ్‌లో మరింత కొత్తగా కనిపిస్తాడు. చాలా వరకు ఎమోషనల్ సీన్స్‌తో కిరణ్ అబ్బవరం ఏడ్పించేస్తాడు. గౌరి ప్రియ అయితే ఈ చిత్రానికి సోల్. ఆమె కారెక్టర్‌ను అద్భుతంగా రాసుకున్నారు.. ఆమె కూడా అంతే అద్భుతంగా నటించారు. త్రిగుణ్ పాత్ర కూడా బాగుంటుంది. హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్, మురుగన్ తల్లి, కరుణ కుమార్ పాత్రలు బాగుంటాయి. మిగిలిన వారంతా తమ పరిధి మేరకు మెప్పించారు.సాంకేతిక విషయాలకు వస్తే.. ఈ సినిమాకి మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం అని చెప్పాలి. తనదైన బీజియం తో మ్యాజిక్ చేశాడనే చెప్పుకోవచ్చు. పాటలు ఆహ్లాదకరంగా ఉంటాయి. కెమెరావర్క్ గొప్పగా అనిపిస్తుంది. విజువల్స్ ఎంతో ప్లెజెంట్‌గా ఉంటాయి. మాటలు మనసుని హత్తుకుంటాయి. క్యాస్టూమ్స్, ఎడిటింగ్ అన్నీ బాగుంటాయి. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా అనిపిస్తాయి.అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
నారింజ రంగు డ్రెస్‌లో మెరిసిపోతున్న నటి సిరి హనుమంత్ (ఫొటోలు)
-
చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్‌స్టోరీ' ట్రైలర్ రిలీజ్
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన సినిమా 'చెన్నై లవ్ స్టోరీ'. వచ్చే శుక్రవారం (జూలై 24) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మూడు నాలుగు పాటల్ని వదిలారు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంటూ మూవీ చూడాలని ఆసక్తి పెంచుతోంది.(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ట్రైలర్ బట్టి చూస్తే.. చెన్నైలో ఉండే హీరోయిన్ అప్పటికే లవ్‌లో ఫెయిలై, ఆ బాధని మర్చిపోయేందుకు రోజంతా తాగుతూ ఉంటుంది. ఇక సినిమా డైరెక్టర్ అవ్వాలని ఈమె ఉంటున్న చోటుకి హీరో వస్తాడు. తనదైన శైలిలో హీరోయిన్ మూడ్ మార్చేందుకు ప్రయత్నిస్తాడు. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. తర్వాత ఈ లవ్ స్టోరీ ఎలాంటి టర్న్‌లు, ట్విస్టులు తీసుకుంది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: జాతీయ సినీ అవార్డుల్లో తెలుగు సినిమా ప్రభంజనం) -
చెన్నై లవ్‌స్టోరీలో స్వచ్ఛమైన ప్రేమను చూస్తారు
‘‘చెన్నై లవ్‌స్టోరీ’ చిత్రంలో స్వచ్ఛమైన ప్రేమను చూస్తారు. ఈ సినిమాలోని సన్నివేశాలకు ప్రేక్షకులు బాగా రిలేట్ అవుతారు. ఈ చిత్రంలోని పాటలు చూసి, అందరూ క్లాస్ అనుకుంటున్నారు. కానీ ఇదిప్రాపర్ మాస్ మూవీ’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్కేఎన్ , సాయి రాజేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది. బుధవారం (జూలై 15) కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో రవి నంబూరి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో స్టీవెన్ (కిరణ్ అబ్బవరం), నివి (గౌరి) పాత్రలు బలంగా కనిపిస్తాయి’’ అన్నారు. ‘‘చెన్నైకి, ఈ సినిమా కథకు సంబంధం ఉంది. అందుకే చెన్నై లవ్‌స్టోరీ అని టైటిల్ పెట్టాం’’ అన్నారు సాయి రాజేష్. ‘‘మా అందరి కెరీర్లో హయ్యస్ట్ థియేటర్స్‌లో ‘చెన్నై లవ్‌స్టోరీ’ రిలీజ్ కానుంది’’ అన్నారు ఎస్కేఎన్ . ‘‘ప్రేమ అనే పదం ఒక్కో టైమ్‌లో ఒక్కోలా వినిపిస్తుంటుంది. ఇప్పుడు నాకు ప్రేమంటే చెన్నై లవ్‌స్టోరీనే’’ అన్నారు సహనిర్మాత ధీరజ్ మొగిలినేని. ‘‘ఈ సినిమాలోని నా పాత్రలో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి’’ అన్నారు శ్రీ గౌరి ప్రియ. నటి సిరి హన్మంతు మాట్లాడారు. -
రోజా పువ్వుతో మ్యాడ్ బ్యూటీ పోజులు.. ఫోటోలు
-
'నాన్న బ్రాండ్‌లోనే విచిత్రమైన నాన్న సార్'.. హ్యాపీరాజ్ ట్రైలర్ చూశారా?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ హ్యాపీరాజ్. ఈ చిత్రానికి మరియా రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవర్ద నిర్మించారు. ఈ మూవీతోనే సీనియర్ హీరో అబ్బాస్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ పెద్దింటి అమ్మాయిని మిడిల్ క్లాస్ అబ్బాయి లవ్ చేస్తే వచ్చే సమస్యలు ఏంటనే కోణంలో తీసినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా సీనియర్ హీరో అబ్బాస్ నటించడం ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. -
తమిళ హీరోలతో రొమాన్స్.. తెలుగు హీరోలపై కోపం?
తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం హ్యాపీ రాజ్. శ్రీగౌరీ ప్రియ హీరోయిన్గా నటించింది. ఒకప్పటి హీరో అబ్బాస్ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నాడు. లవ్‌టుడే సినిమాకు ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియ రాజ్ (మరియ ఇళంజెళియన్) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.తెలుగు హీరోలపై కోపం?ఈ క్రమంలో శుక్రవారం నాడు హ్యాపీరాజ్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీ గౌరీప్రియకు వింత ప్రశ్న ఎదురైంది. మీరు సినిమాల్లో తమిళ హీరోలతో రొమాంటిక్‌గా ప్రవర్తిస్తారు.. అదే తెలుగు హీరోలతో యారొగెంట్‌గా ప్రవర్తిస్తున్నారు, అంటే వాళ్లను కొడతారు. తెలుగు హీరోలపై ఎందుకంత కోపం? అని ఓ విలేకరి ప్రశ్నించాడు.నేనేమైనా కంకణ కట్టుకున్నానా?ఆ ప్రశ్న విని గౌరీప్రియ అవాక్కయింది. నేను ఒక్క సినిమాలోనే హీరోను కొట్టాను.. నేనేమైనా హీరోలను కొట్టాలని కంకణం కట్టుకున్నానా? అసలు నాకు ఎవరి మీదా కోపం లేదు. ఆ లెక్కన చూస్తే.. నేను అన్ని సినిమాల్లో ఏడుస్తానని అంటారు. తమిళ సినిమాల్లో ఏడుస్తుంది, తెలుగు మూవీస్‌లో మాత్రం సంతోషంగా నవ్వుతుందంటారు. అవేవీ నిజం కాదు.. సినిమాలో నా పాత్ర అలా డిజైన్ చేస్తున్నారు అని బదులిచ్చింది.సినిమాతెలుగమ్మాయి అయిన శ్రీ గౌరీ ప్రియ.. లవర్, మ్యాడ్, మెయిల్ వంటి సినిమాల్లో నటించింది. మ్యాడ్ మూవీలో ఈమె.. హీరో రామ్ నితిన్ చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో తెగ వైరలయింది. ప్రస్తుతం ఆమె చేతిలో వింటారా సరదాగా, చెన్నై లవ్‌స్టోరీ చిత్రాలున్నాయి.చదవండి: 10 ఏళ్ల కిందట విడాకులు.. కలిసిపోయిన స్టార్ కపుల్ -
'వింటారా సరదాగా' ఓ మెలోడీ సాంగ్
ఈ ఏడాది సంక్రాంతికి 'అనగనగ ఒక రాజు' సినిమాతో సక్సెస్ అందుకున్న సితార నిర్మాణ సంస్థ నుంచి ఈ ఏడాదిలో పలు చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ఒకటి 'వింటారా సరదాగా'. మహేశ్ మేనల్లుడు అశోక్ హీరో కాగా శ్రీ గౌరీప్రియ హీరోయిన్. పూర్తిగా అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి 'అనగాఅనగా అమెరికా' అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. ఇది వినసొంపుగా ఆకట్టుకుంటోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్)ఉద్భవ్ అనే నటుడు.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అమెరికాలో ఉంటున్న తెలుగు యువతీయువకుడు ప్రేమలో పడటం, తర్వాత జరిగే పరిస్థితులు నేపథ్యంగా మూవీ తీసినట్లు తెలుస్తోంది. ఈ వేసవిలో థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్‌బాస్' భామ డ్యాన్సులు) -
టాలీవుడ్లో తెలుగమ్మాయిల హవా.. ట్రెండ్ మారుతోందా?
టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్స్‌గా తెలుగమ్మాయిలు కనిపించడం చాలా అరుదు. అస్సలు తెలుగమ్మాయి హీరోయిన్ అయిందా? అని మనవాళ్లే ఆశ్చర్యపోతుంటారు. అలాంటి సందర్భాలు గతంలో చాలా చూశాం. టాలీవుడ్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ అయినప్పటికీ ఇక్కడ కన్నడ భామలదే హవా. వాళ్లతో పాటు కోలీవుడ్ బ్యూటీలు ఎక్కువగా ఛాన్స్ కొట్టేస్తుంటారు. తెలుగమ్మాయిలు హీరోయిన్గా కనిపించే సందర్భాలు చాలా అరుదుగానే కనిపించేవి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల్లో రష్మిక, శ్రీలీల, మీనాక్షి చౌదరి డామినేషన్ ఉందన్న వాస్తవాన్ని మనం అంగీకరించాల్సిందే.కానీ ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మన తెలుగమ్మాయిలు కూడా గ్లామర్‌లో ఏ మాత్రం తగ్గేదేలే అని నిరూపిస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథానాయికల విషయంలో మార్పులొస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన మన తెలుగమ్మాయి సైతం వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో మన తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. దాదాపు అరడజన్కు పైగా సినిమాలతో బిజీగా అయిపోయారు. ఇంతకీ రష్మిక, శ్రీలీల లాంటి కన్నడ భామలక పోటీగా వస్తోన్న మన తెలుగు హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం.మానస వారణాసి..మానస వారణాసి మన తెలుగమ్మాయే. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్ ఇండియా 2020 కిరీటాన్ని సొంతం చేసుకున్న మానస వారణాసికి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.శివానీ నాగారం..తెలుగమ్మాయి శివానీ నాగారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీగా మారిపోయింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌తో మొదలైన జర్నీ మరిన్ని అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సుహాస్ హీరోగా వస్తోన్న హే బల్వంత్ మూవీలో కనిపించనుంది. ఫిబ్రవరి 20న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. లిటిల్ హార్ట్స్ మూవీతో యూత్‌ను కట్టిపడేసిన శివానీ నాగారం తెలుగులో మరిన్ని అవకాశాలతో దూసుకెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.బేబీ వైష్ణవి చైతన్య..బేబీ మూవీతో ఫుల్ ఫేమ్ దక్కించుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఈ మూవీలో తన మాస్ నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఆ తర్వాత వైష్ణవి లవ్ మీ ఇఫ్ యూ డేర్, సిద్ధు జొన్నలగడ్డతో జాక్ మూవీ మెరిసింది. ప్రస్తుతం వైష్ణవి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఓ ప్రాజెక్ట్‌లో కనిపించనుంది. తెలుగమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి వెండితెరపై సత్తా చాటుతోంది.శ్రీ గౌరి ప్రియ..మ్యాడ్ బ్యూటీ శ్రీ గౌరిప్రియ కూడా మన తెలుగమ్మాయే. రైటప్ పద్మభూషణ్, లవర్ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. యూత్‌లో క్రేజ్ కొట్టేసిన తెలుగు బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం శ్రీగౌరి ప్రియ వింటారా సరదాగా, చెన్నై లవ్ స్టోరీ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనుంది.కోర్ట్ బ్యూటీ శ్రీదేవి..కోర్ట్ మూవీతో ఓవర్‌నైట్ క్రేజ్ దక్కించుకున్న తెలుగమ్మాయి శ్రీదేవి. ఈ సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయిపోయింది. ఈ మూవీ తర్వాత శ్రీదేవికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్లోనే కాదు.. కోలీవుడ్ డైరెక్టర్స్ సైతం శ్రీదేవి ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి బ్యాండ్‌మేళం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా తమిళంలోనూ ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.ఈషా రెబ్బా..మన వరంగల్‌కు చెందిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత అంతకుముందు.. ఆ తర్వాత అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే తరుణ్ భాస్కర్ హీరోగా వచ్చిన ఓ శాంతి శాంతి శాంతిః చిత్రంలో కనిపించింది. తన గ్లామర్‌తో అభిమానులను అలరిస్తోన్న ఈషా రెబ్బా టాలీవుడ్లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలోనూ అవకాశాలతో రాణిస్తోంది.వీరితో పాటు అనన్య నాగళ్ల, చాందిని చౌదరి లాంటి తెలుగమ్మాయిలు టాలీవుడ్లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలో తెలుగమ్మాయిల హవా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాగే మనవాళ్లు మరిన్ని అవకాశాలతో ముందుకెళ్లాలని టాలీవుడ్ అభిమానులుగా ఆశిద్దాం. ఈ తెలుగు భామలు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం. -
తెలుగు బ్యూటీ న్యూ బిగినింగ్స్.. పెళ్లికి రెడీ అన్న ఐశ్వర్య
దుబాయ్‌లోనే చిల్ అవుతున్న సమంత... నక్షత్రాలను అందుకుంటానంటూ పోస్ట్ఫుట్బాల్ గ్రౌండ్లో జెనీలియా దేశ్ముఖ్న్యూ బిగినింగ్స్ అంటూ గుడికి వెళ్లిన ఫోటోలు షేర్ చేసిన గౌరీప్రియడోసు పెంచిన రాశీ ఖన్నారెడ్ మిర్చిలా 3 రోజెస్ బ్యూటీ రాశీ సింగ్ పెళ్లికి రెడీ అంటున్న ఐశ్వర్య.. కాకపోతే ఎవరో పెళ్లో గెస్ చేయమన్న బ్యూటీ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Aishwarya pisse__Official (@aishwarya_pisse_) -
True Lover Movie Review: ‘ట్రూ లవర్’ మూవీ రివ్యూ
టైటిల్: ట్రూ లవర్ నటీనటులు: మణికందన్.కె, గౌరీ ప్రియా రెడ్డి, కన్నా రవి, హరీశ్ కుమార్, నిఖిల శంకర్ తదితరులు రచన, దర్వకత్వం: ప్రభు రామ్ వ్యాస్ నిర్మాతలు: హరీష్, యువరాజ్ తెలుగు విడుదల: మారుతి, ఎస్కేఎన్ సంగీతం: సీన్ రోల్డన్ సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ ఎడిటింగ్: భరత్ విక్రమన్ విడుదల తేది: ఫిబ్రవరి 10, 2024 కథేంటంటే.. అరుణ్(మణికందన్), దివ్య(గౌరీ ప్రియ) ఇద్దరు కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడతారు. కాలేజీ పూర్తి కాగానే దివ్యకు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అరుణ్ మాత్రం ఖాలీగా తిరుగుతూ.. కాఫీ కేఫ్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. తోటి ఉద్యోగులతో క్లోజ్ ఉండడంతో దివ్య ప్రేమ విషయంలో అరుణ్‌కి అభద్రతా భావం కలుగుతుంది. ప్రేమని వదిలి ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు. దివ్య తన ఆఫీస్‌లో పని చేసే అబ్బాయిలతో మాట్లాడినా.. ఎక్కడికైనా వెళ్లినా సహించడు. ఆమెతో గొడవపడడం..మళ్లీ సారి చెప్పడం అరుణ్‌కి సర్వసాధారణం అయిపోతుంది. అరుణ్ ప్రవర్తన కారణంగా దివ్యకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అరుణ్ పొసెసివ్‌నెస్ దివ్యకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది? చివరకు వీళ్లిద్దరు కలిశారా? విడిపోయారా? కేఫ్ పెట్టాలన్న అరుణ్ లక్ష్యం నెరవేరిందా?లేదా? అన్నది మిగతా కథ. ఎలా ఉందంటే.. అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఒక్కసారి ఒకరిపై అనుమానం మొదలైతే..వాళ్లు ఏం చేసినా అది తప్పులాగే అనిపిస్తుంది. ఇక ఇద్దరి ప్రేమికుల మధ్య ఆవగింజంత అనుమానం ఉన్నా..అది ఆకాశమంత శోకాన్ని మిగులుస్తుంది. అనుమానం, అభద్రతా భావం పెట్టే మానసిక క్షోభ వర్ణణాతీతం. ట్రూ లవర్ కూడా ఓ అనుమానపు ప్రేమ కథే. అనుమానపు ప్రేమ కారణంగా ఓ జంట ఎంత మానసిక సంఘర్షణకు లోనయింది? అనేది ఈ సినిమా కథ. నేటితరం ప్రేమికులకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో చాలా నేచురల్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. రొమాన్స్, ఎమోషన్..ఫన్ అన్ని రకాల సన్నివేశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. నేటితరం ప్రేమికుల ఆలోచనా ధోరణికి అద్దం పట్టేలా కథను తీర్చిదిద్దారు. కేవలం ప్రేమ కథనే కాకుండా.. అరుణ్ ఫ్యామిలీ కథను కూడా చెప్పడం సినిమాకు ప్లస్ అయింది. అక్కడ ఎమోషన్ పండించేందుకు అవకాశం దక్కింది. అరుణ్, దివ్యల మధ్య ప్రేమ సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు. దివ్య తోటి ఉద్యోగులతో మాట్లాడిన ప్రతిసారి అరుణ్ అనుమానం వ్యక్తం చేయడం..ఇద్దరి మధ్య గొడవలు.. మళ్లీ కలిసిపోవడం.. ఫస్టాఫ్ చాలా వరకు ఇలానే సాగుతుంది. అనుమానం కారణంగా దివ్య నిజాన్ని దాచేయడం.. ఆ విషయం అరుణ్‌కి తెలిస్తే ఎలా ప్రవర్తిస్తాడో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగిస్తూ కథనాన్ని నడిపించాడు దర్శకుడు. అయితే ఫస్టాఫ్‌లో చాలావరకు రిపీట్ సన్నివేశాల్లో ఉండడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. అరుణ్ అంత గొడవ చేస్తున్నప్పటికీ దివ్య ఎందుకు అతన్ని భరిస్తుందనే విషయాన్ని బలంగా చూపించలేకపోయాడు. అయితే హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమ కథ మాత్రం ఎంతో సహజంగా చిత్రీకరించారు. ఆ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. ఇంటర్వెల్ సీన్ ద్విదియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కూడా హీరో హీరోయిన్ల మధ్య గొడవలు కొనసాగుతూనే ఉంటాయి. అరుణ్ అమ్మ నాన్న రిలేషన్లో వచ్చిన సమస్యకి ఈ ప్రేమ కథతో ముడిపెట్టి చెప్పడం బాగుంది. అరుణ్‌కి తన తల్లికి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో హీరోని ఎక్కువగా సిగరేట్ తాగుతూ..లేదా మద్యం సేవిస్తూ చూపించడం ఓ వర్గం ఆడియెన్స్‌కి ఇబ్బంది కలిగించొచ్చు. యూత్‌ని ఆకట్టుకోవడానికే హీరోని అలా చూపించారే తప్ప ఈ కథకు అవసరం లేదనిపిస్తుంది. ఓవరాల్‌గా ట్రూలవర్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నవారికి, బ్రేకప్ అయినవారికి నచ్చే అవకాశం ఉంది. . ఎవరెలా చేశారంటే.. అరుణ్ పాత్రలో మణికందన్ ఒదిగిపోయాడు. అనుమానపు ప్రేమికుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దివ్య పాత్రకి గౌరీ ప్రియ వంద శాతం న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించింది. తెరపై మణికందన్, గౌరీ ప్రియల కెమిస్ట్రీ బాగా పండింది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. స్నేహితుల పాత్రలు పోషించినవారంతా చక్కగా నటించారు. సాంకెతిక పరంగా సినిమా బాగుంది. సీన్ రోల్డన్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలతో పాటు బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.


