స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ హ్యాపీరాజ్. ఈ చిత్రానికి మరియా రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాను బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవర్ద నిర్మించారు. ఈ మూవీతోనే సీనియర్ హీరో అబ్బాస్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ పెద్దింటి అమ్మాయిని మిడిల్ క్లాస్ అబ్బాయి లవ్ చేస్తే వచ్చే సమస్యలు ఏంటనే కోణంలో తీసినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా సీనియర్ హీరో అబ్బాస్ నటించడం ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు.


