చెన్నై లవ్‌స్టోరీలో స్వచ్ఛమైన ప్రేమను చూస్తారు | Chennai Love Story release date fixed | Sakshi
Sakshi News home page

చెన్నై లవ్‌స్టోరీలో స్వచ్ఛమైన ప్రేమను చూస్తారు

Jul 16 2026 4:54 AM | Updated on Jul 16 2026 4:54 AM

Chennai Love Story release date fixed

– కిరణ్‌

‘‘చెన్నై లవ్‌స్టోరీ’ చిత్రంలో స్వచ్ఛమైన ప్రేమను చూస్తారు. ఈ సినిమాలోని సన్నివేశాలకు ప్రేక్షకులు బాగా రిలేట్‌ అవుతారు. ఈ చిత్రంలోని పాటలు చూసి, అందరూ క్లాస్‌ అనుకుంటున్నారు. కానీ ఇదిప్రాపర్‌ మాస్‌ మూవీ’’ అని కిరణ్‌ అబ్బవరం అన్నారు. కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్‌కేఎన్ , సాయి రాజేష్‌   నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్‌ కానుంది. బుధవారం (జూలై 15) కిరణ్‌ అబ్బవరం బర్త్‌ డే సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 

ఈ వేడుకలో రవి నంబూరి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో స్టీవెన్  (కిరణ్‌ అబ్బవరం), నివి (గౌరి) పాత్రలు బలంగా కనిపిస్తాయి’’ అన్నారు. ‘‘చెన్నైకి, ఈ సినిమా కథకు సంబంధం ఉంది. అందుకే చెన్నై లవ్‌స్టోరీ అని టైటిల్‌ పెట్టాం’’ అన్నారు సాయి రాజేష్‌. ‘‘మా అందరి కెరీర్‌లో హయ్యస్ట్‌ థియేటర్స్‌లో ‘చెన్నై లవ్‌స్టోరీ’ రిలీజ్‌ కానుంది’’ అన్నారు ఎస్‌కేఎన్ . ‘‘ప్రేమ అనే పదం ఒక్కో టైమ్‌లో ఒక్కోలా వినిపిస్తుంటుంది. ఇప్పుడు నాకు ప్రేమంటే చెన్నై లవ్‌స్టోరీనే’’ అన్నారు సహనిర్మాత ధీరజ్‌ మొగిలినేని. ‘‘ఈ సినిమాలోని నా పాత్రలో డిఫరెంట్‌ లేయర్స్‌ ఉన్నాయి’’ అన్నారు శ్రీ గౌరి ప్రియ. నటి సిరి హన్మంతు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement