మెగా హీరో రామ్ చరణ్ నటించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించింది.
ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దక్షిణాది భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రంలో ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. స్ట్రీమింగ్‌కు వచ్చిన కొద్ది రోజుల్లోనే భారీ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో వచ్చేసింది. ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో 3వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
ఈ మూవీని శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.


