'ప్రభాస్ నుంచి తీసుకోవడానికి ఏం లేదు.. అదొక్కటి తప్ప'.. పూజా హెగ్డే | Tollywood actress Pooja Hegde Comments about Prabhas | Sakshi
Sakshi News home page

Pooja Hegde: 'ప్రభాస్ నుంచి దొంగిలించాల్సింది అదొక్కటే'

Jul 15 2026 7:15 PM | Updated on Jul 15 2026 7:35 PM

Tollywood actress Pooja Hegde Comments about Prabhas

సినీ ప్రియుల గుండెల్లో బుట్టబొమ్మగా ముద్ర వేసుకున్న బ్యూటీ పూజా హేగ్డే. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. పలు సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన జన నాయగన్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 23 నుంచే థియేటర్లలోకి రానుంది. విజయ్ హీరోగా వస్తోన్న చివరి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సంగతి పక్కనపెడితే బుట్టబొమ్మ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మాట్లాడింది. ఆయనతో రాధే శ్యామ్ మూవీలో హీరోయిన్‌గా చేశానని తెలిపింది. ఈ మూవీ షూటింగ్‌ టైమ్‌లో నాకు ప్రభాస్ పంపిన ఫుడ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆనందం వ్యక్తం చేసింది. ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి ఇంకేం లేదని.. అవకాశం వస్తే ఆయన కుక్‌ను దొంగిలిస్తానని ఫన్నీ కామెంట్స్ చేసింది బుట్టబొమ్మ. ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement