ప్రముఖ లెజెండరీ సింగర్ జానకి మరణంపై గాయని శ్వేతా మోహన్ ఎమోషనల్ అయ్యారు. జానకమ్మ మరణాన్ని తలచుకుని వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. జూలై 11న లండన్‌లో జరిగిన ఇళయరాజా సంగీత కచేరీలో శ్వేతా మోహన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె అంత్యక్రియలకు ఎందుకు రాలేదని చాలామంది అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. జానకి అంత్యక్రియలకు హాజరు కాలేదని శ్వేతపై కొందరు ట్రోలింగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాను హాజరు కాకపోవడానికి గల కారణాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.
శ్వేతా మోహన్ తన ఇన్‌స్టాలో రాస్తూ "జానకి అమ్మ అంత్యక్రియలకు నేను ఎందుకు హాజరు కాలేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు... ఆ టైమ్‌లో నేను లండన్‌లో ఇళయరాజా సార్ సంగీత కచేరీలో పాల్గొన్నా. ఆమెను చివరిసారిగా చూసి ఆశీర్వాదం తీసుకోలేకపోవడం నాకు ఎంతో కష్టంగా అనిపించింది. ఈ విషయాన్ని నేను ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఆమె అంబులెన్స్‌లో ఉన్నప్పుడు చివరిసారిగా వీడియో కాల్‌లో చూశా. నన్ను విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెడుతున్నా. నన్ను ఎగతాళితో ప్రశ్నించిన వారందరికీ నా విజ్ఞప్తి. దయచేసి ఇది మానసికంగా చాలా కష్టమైన సమయం. దయచేసి నన్ను మరింత బాధపెట్టకండి," అని ఆమె రాసింది.
ఈ పోస్ట్‌కు ఆమె అభిమానుల నుంచి మద్దతు లభించింది. జానకమ్మ మరణంతో మీరు ఎంతగా కుంగిపోయారో మేము చూశామని రాసుకొచ్చాడు. మీరు అంతలా నిబ్బరంగా ఉన్నందుకు మీకు చాలా గౌరవంగా ఉందని మరొకరు పోస్ట్ చేశారు. కాగా.. జానకి మరణవార్త విన్న తర్వాత శ్వేత సోషల్ మీడియాలో నివాళులర్పించారు.


