breaking news
s janaki
-
గాన కోకిల జానకమ్మకు జన గాన ఘన నీరాజనం
ఒక్కటే గొంతు... దాదాపు ఇరవై భాషల్లో 45 వేల కంటే ఎక్కువ పాటలను ఆలపించి, ఆరు దశాబ్దాలుగా కోట్లాది మంది హృదయాలను మురిపించిన కమ్మని కంఠం మన శిష్టాల జానకమ్మ. ఈ అమర గాన కోకిల భౌతికంగా దూరమైనా, ఆవిడ పంచిన గానామృతం తరతరాల పాటు విశ్వమంతటా మారు మోగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో సంగీత సామ్రాజ్ఞి ఎస్. జానకి స్మరణార్థం ‘సాక్షి డిజిటల్’ సగర్వంగా ‘జన గాన ఘన నీరాజనం’ పేరిట ఒక అపూర్వమైన డిజిటల్ నివాళి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.జానకమ్మకు మనసారా వీడ్కోలు పలుకుతూ, ఆమె జ్ఞాపకాలను పదిలపరచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరినీ ఈ వేదిక ద్వారా ఒకే తాటిపైకి తెస్తోంది. ఈ మహోన్నతమైన కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి సంగీత ప్రియులు, అభిమానులు తమకు నచ్చిన జానకమ్మ పాటను గానీ, ఆవిడ గురించిన మాటలను గానీ ఒక నిమిషం పాటు రికార్డ్ చేసి #tribute2 janaki పేరిట అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.ఇలా దేశ విదేశాల నుండి వచ్చే అభిమానుల సందేశాలను, గీతాలను క్రోడీకరించి ఆగస్టు 21న ప్రత్యేక నీరాజన కార్యక్రమంగా ‘సాక్షి డిజిటల్’ ప్రసారం చేయనుంది. ఆ మధుర గాయని వైభవాన్ని, సంగీత ప్రస్థానాన్ని స్మరించుకుంటూ సగర్వంగా సమర్పించే ఈ స్వరార్చనలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం. -
'అందుకే జానకమ్మను చివరిసారి చూడలేకపోయా'.. సింగర్ శ్వేత ఎమోషనల్
ప్రముఖ లెజెండరీ సింగర్ జానకి మరణంపై గాయని శ్వేతా మోహన్ ఎమోషనల్ అయ్యారు. జానకమ్మ మరణాన్ని తలచుకుని వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. జూలై 11న లండన్‌లో జరిగిన ఇళయరాజా సంగీత కచేరీలో శ్వేతా మోహన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె అంత్యక్రియలకు ఎందుకు రాలేదని చాలామంది అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. జానకి అంత్యక్రియలకు హాజరు కాలేదని శ్వేతపై కొందరు ట్రోలింగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాను హాజరు కాకపోవడానికి గల కారణాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.శ్వేతా మోహన్ తన ఇన్‌స్టాలో రాస్తూ "జానకి అమ్మ అంత్యక్రియలకు నేను ఎందుకు హాజరు కాలేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు... ఆ టైమ్‌లో నేను లండన్‌లో ఇళయరాజా సార్ సంగీత కచేరీలో పాల్గొన్నా. ఆమెను చివరిసారిగా చూసి ఆశీర్వాదం తీసుకోలేకపోవడం నాకు ఎంతో కష్టంగా అనిపించింది. ఈ విషయాన్ని నేను ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఆమె అంబులెన్స్‌లో ఉన్నప్పుడు చివరిసారిగా వీడియో కాల్లో చూశా. నన్ను విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెడుతున్నా. నన్ను ఎగతాళితో ప్రశ్నించిన వారందరికీ నా విజ్ఞప్తి. దయచేసి ఇది మానసికంగా చాలా కష్టమైన సమయం. దయచేసి నన్ను మరింత బాధపెట్టకండి," అని ఆమె రాసింది.ఈ పోస్ట్‌కు ఆమె అభిమానుల నుంచి మద్దతు లభించింది. జానకమ్మ మరణంతో మీరు ఎంతగా కుంగిపోయారో మేము చూశామని రాసుకొచ్చాడు. మీరు అంతలా నిబ్బరంగా ఉన్నందుకు మీకు చాలా గౌరవంగా ఉందని మరొకరు పోస్ట్ చేశారు. కాగా.. జానకి మరణవార్త విన్న తర్వాత శ్వేత సోషల్ మీడియాలో నివాళులర్పించారు. View this post on Instagram A post shared by Shweta Mohan (@_shwetamohan_) -
కన్నీళ్లు కనిపించలేదని ట్రోలింగ్.. ఎస్.జానకి మనవరాలు ఎమోషనల్ పోస్ట్
గానకోకిల ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచాన్ని తీవ్ర శోకసముద్రంలో ముంచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషాద సమయంలో ఆమె మనవరాలు అప్సర విద్యుల(Apsara Vydyula)పై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అనవసరపు విమర్శలు, ట్రోలింగ్‌కు దిగారు. జానకి భౌతికకాయం వద్ద అప్సర ఏడవలేదంటూ కొందరు చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న ట్రోలింగ్‌కు అప్సర సోషల్ మీడియా వేదికగా అత్యంత హుందాగా, ఎమోషనల్‌గా సమాధానమిచ్చారు.కంటికి కనిపించని కన్నీళ్లతో మా బాధను కొలవొద్దు‘మనకు ఇష్టమైన మనిషిని కోల్పోయినప్పుడు వచ్చే దుఃఖం కేవలం కొన్ని రోజుల్లో మాయమైపోయేది కాదు. అది జీవితాంతం ఒక గుండె బరువుగా మారి, మనసును మెలిపెడుతూనే ఉంటుంది. దయచేసి కంటికి కనిపించని కన్నీళ్లతో మా గుండెల్లోని బాధను ముడిపెట్టొద్దు’ అంటూ అప్సర ఆవేదన వ్యక్తం చేశారు.ఆ దుఃఖం నుంచి ఇంకా కోలుకోలేదుఈ ప్రపంచంలో మా నానమ్మ(జానకి)కు మా అక్క వర్ష అంటే ప్రాణం. వాళ్లిద్దరూ ఒకేలా ఉండేవారు. పోలికల దగ్గర నుంచి మాట్లాడడం వరకూ ఒకరి కోసం ఒకరు పుట్టారా అనేలా ఉండేవారు. నిజానికి నానమ్మ అంతక్రియలు మా అక్క వర్ష నిర్వహించాలి. కానీ, ఆమె 2023లోనే కన్నుమూసింది. ఆ దుఃఖం నుంచి మేం ఇప్పటికీ కోలుకోలేదు. వర్ష చేయాల్సిన బాధ్యతలు నేను ఎంత బాధతో నిర్వహించానో నా మనసుకు తెలుసు. మాకెంతో ఇష్టమైన అక్క, నానమ్మ మమ్మల్ని వదిలి వెళ్లారనే బాధ కంటే.. వారిద్దరూ స్వర్గంలో ఒకరినొకరు కలుసుకుని ఉంటారనే ఆలోచనే నాకు ఇప్పుడు పెద్ద ఓదార్పునిస్తోంది’ అని అప్సర తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం అప్సర చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దుఃఖాన్ని ప్రదర్శించే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుందని, కష్ట సమయంలో ఉన్న ఒక కుటుంబంపై ఇలాంటి ట్రోలింగ్ చేయడం సరికాదంటూ నెటిజన్లు అప్సరకు మద్దతుగా నిలుస్తున్నారు. View this post on Instagram A post shared by Apsara Vydyula (@apsaravydyula) -
మా మధ్య దూరం పెంచాలని కుట్రలు చేశారు
ప్రముఖ సింగర్ జానకి.. రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆమెకు నివాళి అర్పించారు. మరో ప్రముఖ సింగర్ సుశీల కూడా జానకి మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వీడియోని రిలీజ్ చేశారు.'జానకమ్మ లేని సంగీత ప్రపంచాన్ని ఊహించలేం. ఆమెకు మరణం లేదు. మా కెరీర్ రోజుల్లో కొందరు స్వార్థపరులు మా మధ్య లేనిపోని తగాదాలు పెట్టేందుకు కుట్రలు చేశారు. ఆనాడు దూరం పెంచాలని చూసిన వారి కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయి. జానకి లేదంటే ఈరోజు నా కళ్లలో నుంచి నీళ్లు కూడా రావట్లేదు. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. కచేరీ పాడాలి నువ్వు అందుకే వచ్చేసేయ్ అని సరస్వతి దేవి పిలిచి ఉంటుంది' అని సుశీల చెప్పుకొచ్చారు.ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి: సుశీలప్రముఖ సింగర్ ఎస్.జానకి మృతిపై లెజెండరీ సింగర్ పి.సుశీల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జానకమ్మ లేని సంగీత ప్రపంచాన్ని ఊహించలేమని, ఆమెకు మరణం లేదని కొనియాడారు. తమ కెరీర్ రోజుల్లో కొందరు స్వార్థపరులు తమ మధ్య లేనిపోని తగాదాలు పెట్టేందుకు కుట్రలు… pic.twitter.com/nsorY2JgaW— ChotaNews App (@ChotaNewsApp) July 13, 2026 -
గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు
మైసూరు: తన గానామృతంతో కోట్లాది మందిని ముగ్ధుల్ని చేసిన ఆ మధుర కంఠం చితి మంటల్లో పంచభూతాల్లో కలిసిపోయింది. తన సుమధుర కంఠంతో కోట్లాది గుండెల్లో చెరగని స్థానం సంపాదించిన గాన కోకిల ఎస్.జానకి పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం మైసూరులోని కనియనహుండి ఫామ్‌హౌస్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు, బంధు మిత్రుల కన్నీటి సంద్రం మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. 88 ఏళ్ల వయసులో శనివారం సాయంత్రం ఆమె వయో సమస్యలతో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.జానకి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 8:53 గంటలకు జిల్లా అధికారులు అంబులెన్సులో మహారాజా కళాశాల మైదానానికి తీసుకువచ్చారు. ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు మైసూరుకు తరలివచ్చారు. రచయితలు, గాయకులు, సంగీత దర్శకులు, సినీ నటీమణులు, నిర్మాతలు, కళాకారులు కన్నీటితో నివాళులర్పించారు.ప్రముఖ గాయని చిత్ర, సీనియర్ నటి జయమాల, తార, నిర్మాత కె.మంజు, నటుడు వినోద్ రాజ్, గాయకుడు రాజేష్ కృష్ణన్, ప్రముఖ సంగీత దర్శకుడు సాధు కోకిల తదితర శాండల్‌వుడ్ నటీనటులు ఈ సందర్భంగా సంగీత ప్రపంచానికి ఎస్.జానకి చేసిన సేవల గురించి కొనియాడారు. వేలాది మంది ప్రజలు క్యూలో నిలబడి ఆమెను కడసారి చూసుకున్నారు. అక్కడికి తరలి వచి్చన వారందరికీ కనిపించేలా ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేశారు. కర్ణాటకతో పాటు పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తరలివచ్చారు.కొందరైతే తమ కుటుంబాలతో సహా వచ్చి కన్నీటితో నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాల గాయకుల బృందం ఎస్.జానకి సూపర్ హిట్ గీతాల ఆలాపన నిర్వహించడం అందరి గుండెల్లో ఆర్ర్ధత నింపింది. అనంతరం కర్ణాటక సీఎం డీకే శివకుమార్, మైసూరు జిల్లా ఇన్చార్జి మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం డి.కె.శివకుమార్ మాట్లాడుతూ.. ఎస్.జానకి భారతదేశం గర్వించదగ్గ సంగీత దిగ్గజాల్లో ఒకరని కొనియాడారు. ఆమె వారసత్వాన్ని చిరస్థాయిగా నిలిపేందుకు చిత్ర పరిశ్రమతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చితికి నిప్పంటించిన మనవరాలు అప్సర ఎస్.జానకి అంత్యక్రియల నిర్వహణకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3:05 గంటలకు ఎస్.జానకి పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో రాజ లాంఛనాలతో ఊరేగింపుగా మైసూరు సమీపంలోని హెచ్డి కోటె తాలూకా కణియర హుండిలోని ఫాంహౌస్‌లో అంత్యక్రియల స్థలికి తీసుకొచ్చారు. పోలీసులు జాతీయ గీతాలాపన మధ్య గన్ సెల్యూట్ ఇచ్చి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మనవరాలు వైద్యుల అప్సర తన నాన్నమ్మను దగ్గరగా చూస్తూ కొన్ని క్షణాలు గడిపారు.అది చూసి అందరి కళ్లు చెమర్చాయి. అనంతరం వేద మంత్రాల మధ్య ఆమె తన నాన్నమ్మ చితికి నిప్పంటించి కుటుంబ సంప్రదాయం మేరకు అంత్యక్రియలు నిర్వహించారు. మట్టి కుండను భుజంపై మోస్తూ చితి చుట్టూ ప్రదక్షిణ చేశారు. వేద పండితులు రమేష్ శర్మ బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తయింది. అప్సర.. జానకి కుమారుడు మురళీకృష్ణ కుమార్తె. మురళీకృష్ణ ఈ ఏడాది జనవరి 22న మరణించారు. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పల్లపట్లలో జన్మించిన ఎస్.జానకి.. చివరి ఆరేళ్లు మైసూరును తన నివాసంగా ఎంచుకున్నారు. ఆమె కోరిక మేరకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. -
లెజెండరీ సింగర్ జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
గాన కోకిల ఎస్ జానకి అంత్యక్రియలు ముగిశాయి. మైసూరు సమీపంలోని కణియర హుండి గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్‌లో ఆమె అంత్యక్రియలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని ముగిసింది. బ్రాహ్మణ సంప్రదాయంలో జానకమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. జానకి అంత్యక్రియల్లో పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు పాల్గొన్నారు. అంతకుముందు లెజెండరీ సింగర్ చివరి చూపు కోసం అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని మైసూర్‌లోని మహారాజ కాలేజీ గ్రౌండ్స్‌లో సాయంత్రం వరకు ఉంచారు. అనంతరం కణియర హుండి గ్రామంలోని ఫామ్ హౌస్‌కి పార్థీవదేహాన్ని తరలించారు.ప్రముఖ గాయని ఎస్.జానకి(88) కన్నుమూశారు. వయోభారంతో ఇబ్బందిపడుతున్న ఈమె మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం(జూలై 11) సాయంత్రం గుండెపోటుతో మరణించారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు కొన్నాళ్ల క్రితం చనిపోవడంతో మనోవేదనకు గురయ్యారు. ఆ బాధకి తోడు అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు తుదిశ్వాస విడిచారు. సినీ ప్రస్థానం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకుని, నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలయాత్తు' ద్వారా నేపథ్య గాయనిగా ప్రస్థానం ప్రారంభించారు. అదే ఏడాది 'ఎమ్మెల్యే' చిత్రంలో 'నీతియే జయమౌనురా' అనే పాట పాడారు. చిన్న పిల్లల గొంతు నుండి ముసలివారి వరకు ఏ వయసు పాత్రకైనా సరిపోయేలా తన స్వరంలో మార్పులు (Voice Modulation) చేయడం ఆమె ప్రత్యేకత. లెజండరీ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతో ఆమె పాడిన యుగళ గీతాలు భారతీయ సంగీత చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి. 17 భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడారు ఎస్ జానకి. -
మూగబోయిన స్వర కోయిల
మైసూరు/బెంగళూరు/తెనాలి: తేనెలూరు తెలుగువారి గళ మాధుర్యాన్ని అనేక భాషల్లో శ్రోతలకు రుచి చూపించి మన కీర్తి పతాకను దశ దిశలా ఎగురవేసిన స్వర కోయిల మూగవోయిందన్న వార్త సంగీత ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తన పాటలతో జగమే ఊయల చేసిన మధుర గాయని ఎస్.జానకి ఇక లేరన్న చేదు వార్త విని సర్వత్రా ఆవేదన వ్యక్తమైంది. తన సుమధుర కంఠంతో ఆబాలగోపాలాన్ని ఓలలాడించిన బహుభాషా గాయని ఎస్.జానకి (88) శనివారం రాత్రి మైసూరు నగరంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె పాత తాలూకాలోని నిజాంపట్నం మండలం పల్లపట్ల వాస్తవ్యురాలైన ఆమె ఆరేళ్లుగా మైసూరు బన్నూరు రోడ్డులోని ఫార్మ్‌హౌజ్‌లో నివాసం ఉంటున్నారు. ఎల్లప్పుడూ ధవళ వర్ణ సంప్రదాయ చీరకట్టులో కనిపించేవారు. కొన్నేళ్లుగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇటీవలే బోగాది నగరలోని ఎస్బీఎం లేఔట్ నివాసంలో అద్దెకు ఉంటున్నారు. నవీన్, పవన్ అనే వ్యక్తులు ఆమెకు తోడునీడగా ఉంటూ సేవలు చేస్తూ వచ్చారు. వారం క్రితమే ఆమె మంగళూరుకు తన అక్క ఇంటికి వెళ్లి తిరిగి వచ్చారు. ఈ సమయంలో ఆమెతో పాటు కోడలు ఉమా, మనమరాలు అప్సరా కూడా ఉన్నారు. గత సంవత్సరం ఆమె తన కుమారుడు మురళీకృష్ణను కోల్పోవడంతో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని మౌనంగా ఉండిపోయారు. ఈ క్రమంలో శనివారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మధ్యాహ్నం 12.49 గంటలకు మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయినా ఆమె మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూల్ (బహుళ అవయవ వైఫల్యం)తో గుండెపోటుకు గురయ్యారు. రాత్రి 7.30 గంటలకు ఆమె మరణించారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకుని ఆమె బంధువులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీగా తరలివచ్చారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మైసూరు బోగాది సమీపంలోని కణియర హుండి గ్రామంలోని ఫామ్‌హౌజ్‌లో జరుగుతాయని బంధువులు మీడియాకు తెలిపారు. అంతంకు ముందు ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఉంచుతారు. ప్రభుత్వ లాంఛనాలతో జానకి అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆటుపోట్ల జీవితం ఎస్.జానకి తన తీయని కంఠం ద్వారా ప్రజలను ఎంతగా ముగ్ధుల్ని చేశారో ఆమె జీవితం అంతగా ఆటుపోట్లకు గురైంది. 1938 ఏప్రిల్ 23న సత్యవతి, శ్రీరామమూర్తి దంపతులకు జన్మించారు. తండ్రి ఆయుర్వేద వైద్యుడు. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో నాలుగో సంతానం జానకి. చదువంటే శ్రద్ధ లేదు. బడి అంటే ఆమడదూరం వెళ్లేవారు. రేడియోలో పాటలు వింటూ కాలక్షేపం. రోడ్డుపైకి వెళ్లినపుడు లతా మంగేష్కర్ పాటలు వింటూ, తాను పాడుతూ పెరిగారు. వివిధ కారణాలరీత్యా శ్రీరామమూర్తి కుటుంబం కొంతకాలం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో, తర్వాత రాజమండ్రిలో ఉన్నారు. సిరిసిల్లలోనే తన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తన చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఎండ్ల బండిలో వేములవాడకు వెళ్లి బాలనాగమ్మ సినిమాను చూసి వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో జానకి గుర్తుచేసుకున్నారు. పాటలపై కూతురుకు గల ఆసక్తిని గమనించిన తల్లి సత్యవతి, రాజమండ్రిలో నాదస్వర విద్వాన్ గాడవల్లి పైడిస్వామి దగ్గర సంగీతంలో ప్రాథమిక శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా శాస్త్రీయ సంగీతం ఎవరి వద్దా నేర్చుకోలేదు. గురువు గారు కీర్తనలతో ఆరంభించినా, జానకి ధ్యాసంతా సినిమా పాటలపైనే ఉండేది. అక్కడుండే ‘క్రాంతి కళామండలి యూత్ అసోసియేషన్’లో సినిమా పాటల కచేరీల్లో పాటలు పాడుతున్న కాలంలో, అమ్మ మరణంతో మళ్లీ ఆ కుటుంబం హైదరాబాద్‌కు చేరుకుంది.జానకి మామయ్య ‘ఫన్ డాక్టర్’చంద్రశేఖర్ వేదికపై ప్రదర్శనలిస్తుండేవారు. మధ్యమధ్యలో జానకి పాటలు పాడుతూ వచ్చారు. ఆయన కుమారుడు వి.రాంప్రసాద్, జానకి స్వరంలోని ప్రత్యేకతను గమనించారు. కుమారుడు చేసిన సూచనతో చంద్రశేఖర్, చెన్నైలోని రెండు మూడు స్టూడియోలకు జానకి గురించి లేఖ రాశారు. ఏవీఎం స్టూడియో నుంచి ఆడిషన్‌కు రమ్మని కబురొచి్చంది. స్టూడియో స్టాఫ్‌గా ఎంపిక చేసుకున్నారు. తాను ఇష్టపడిన రాంప్రసాద్‌తోనే ఆమెకు 1959లో వివాహమైంది. పాటలకు సంబంధించిన ఒప్పందాలు, రెమ్యూనరేషన్, రాయల్టీలు అన్ని విషయాలు ఆయనే చూసుకున్నారు.1997లో గుండెపోటుతో భర్త మృతి చెందారు. చెన్నైలో స్థిరపడిన జానకి దంపతులకు ఏకైక కుమారుడు మురళీకృష్ణ కొన్ని సినిమాల్లో నటించినా ఎక్కువకాలం కొనసాగలేదు. కోడలు ఉమ నర్తకి. దూరదర్శన్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’అవార్డు కూడా తీసుకున్నారు. ‘పాట నాకు ప్రాణం.. ప్రాణమున్నంతకాలం పాడుతూనే ఉంటాను’అంటుండే జానకి, భౌతికంగా ఊపిరి కోల్పోయినా ఆమె పాట ఇప్పటికీ, ఎప్పటికీ అభిమాన శ్రోతలను అలరిస్తూనే ఉంటుంది. కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంతోనూ ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తుమ్మలూరు గ్రామంలోని మ్యాక్ ప్రాజెక్టులో 279 నంబర్ విల్లాను కొనుగోలు చేసి కుమారుడు మురళీకృష్ణతో ఆమె నివసించారు. ఒక ఊపు ఊపిన ‘నీ లీల పాడెద దేవా..’ ⇒ 1957లో సంగీత దర్శకుడు టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో ‘విధియిన్ విళైయట్టు’తమిళ సినిమాలో రెండు పాటలు పాడించారు. ఆ సినిమా విడుదల కాలేదు. ఆ వెంటనే తెలుగులో ‘ఎంఎల్ఏ’సినిమా కోసం ‘నీ ఆశ అడియాశ చెయి జారే మణిపూస’పాటను ఘంటసాలతో కలిసి పాడారు. తొలిగా విషాదగీతంతో ఆరంభించినా, ఆమె సినీ కెరీర్ మధుర వెన్నెలలా కొనసాగింది. బావా మరదళ్లు సినిమాలో ‘నీలి మేఘాలలో గాలి కెరటాలలో’పాటతో బిజీ అయ్యారు. ⇒ ఆ క్రమంలోనే ‘మురిపించే మువ్వలు’సినిమాలో జానకి పాడిన ‘నీ లీల పాడెద దేవా’పాట దక్షిణాదిని ఒక ఊపు ఊపింది. తద్వారా సినీ రంగంలో ఆమెకో ప్రత్యేక స్థానం లభించింది. వాస్తవానికి ఆ పాటను పి.లీలతో పాడించాలని నిర్ణయించారు. అంత హైపిచ్‌తో తాను పాడలేనని, జానకిచే పాడించమని పి.లీల సూచించారు. ఆ పాటకు అభినయించే సావిత్రి మాత్రం సుశీలతో పాడించాలని పట్టుబట్టారు. ఆ చిత్ర సంగీత దర్శకుడు సుబ్బయ్యనాయుడు జానకి చేతనే పాడించారు. ⇒ ఇక జానకి వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. దిగ్గజ సంగీత దర్శకుల సంగీతానికి పాటలు పాడుతూ బిజీ అయ్యారు. మరో సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు జానకి పాటను అనుకోకుండా విన్నారు. వెంటనే పూజాఫలం సినిమాలో ‘పగలే వెన్నెలా.. జగమే ఊయల’పాడించటంతో మరింత బిజీ గాయనిగా మారారు. ⇒ ఆరాధనలో ‘ఆడదాని ఓరచూపులో’, రంగులరాట్నంలో ‘నడిరేయి ఏ జాములో’వంటి సూపర్ హిట్ పాటలతో జానకి సినిమా పాటల ప్రయాణం ప్రవాహంలా సాగింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, పంజాబి, ఒరియా, తుళు, కొంకణి, బడగ, సింహళం, ఇంగ్లి‹Ù, సంస్కృతం, జర్మన్, జపాన్ వంటి 20 భాషల్లో 48 వేలకు పైగా పాటలతో అలుపెరగని కోయిల అనిపించుకున్నారు. వీటిలో 17 వేలకు పైగా సినిమా పాటలు కాగా, మిగిలినవి ప్రైవేటు రికార్డులు, త్యాగరాజ కృతులు, మీరా భజన్లు. సొంత సంగీతంలో పాడారు. వీటితో పలు భక్తి సంగీత క్యాసెట్లు వచ్చాయి.ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు ⇒ చిన్న పిల్లలకు పాడాలన్నా జానకమ్మనే పిలిచే వారు సంగీత దర్శకులు. ‘చందమామ రావే’(1987), ‘జడ్జిమెంట్’(1990) సినిమాల్లో బేబి సుజితకు డబ్బింగ్ చెప్పారు. ఉషాకిరణ్ మూవీస్ వారి ‘మౌన పోరాటం’సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. తన గాన మాధుర్యానికి వరించిన గౌరవాలెన్నో. ఆకాశవాణి పాటల పోటీల్లో ద్వితీయస్థానం సాధించి అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. నాలుగుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డును స్వీకరించారు. ⇒ 13 సార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ఆరుసార్లు తమిళనాడు ప్రభుత్వ అవార్డులు, మరో ఆరుసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవార్డులు, 12 నంది అవార్డులు (ఇందులో రెండు టెలివిజన్), ఒడిశా ప్రభు త్వ అవార్డులు లభించాయి. కలైమామణి, సుర్సింగార్, సింగర్ ఆఫ్ ది సెంచరీ, భారతీదాసన్ వంటి అవార్డులు మరికొన్ని. సంగీత ప్రపంచంలో రారా ణిగా వెలుగొందిన జానకి తమిళనాడు కోటాలో కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’పురస్కారాన్ని ప్రకటించింది. అప్పుడా గౌరవాన్ని జానకి తిరస్కరించటం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. అయిదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో చేసిన కృషికి ప్రభుత్వం ఆలస్యంగా స్పందించినా, దేశ ప్రజలందరి హృదయాల్లో తనకున్న స్థానమే చాలని ఆమె సంతృప్తి చెందారు. గాయనిగా ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎప్పుడో ఇస్తే ఎలాగని తిరస్కరించారని అంతా భావించారు. ⇒ ఎస్.జానకికి దైవ భక్తి ఎక్కువ. నంజనగూడులోని నంజుండేశ్వర, చాముండేశ్వరి, యోగా నరసింహస్వామి దేవాలయాల్లో తరచూ పూజలు చేసేవారు. అద్భుత సంగీత పయనం అనంతరం 2017 అక్టోబర్ 28న మైసూరు విశ్వవిద్యాలయం మానస గంగోత్రిలోని రంగమందిరంలో ఆమె తన పాటకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇకపై తాను ప్రజా వేదికల్లో పాడబోనని ప్రకటిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారువైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్.జానకి మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్.జానకి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు. తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎస్.జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించానన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంగీత ప్రపంచానికి తీరని లోటు: గవర్నర్ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి మృతిపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతాపం వ్యక్తంచేశారు. జానకి మృతి భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. తెలుగు నేల గర్వించదగ్గ మహోన్నత గాయని జానకి అని కొనియాడారు. జానకి గానామృతం తరతరాలపాటు సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోతుందన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జానకి తెలుగు ప్రజలకు గర్వకారణం: సీఎం జానకి మృతి పట్ల సీఎం ఎ.రేవంత్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె తెలుగు వారు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. జానకమ్మ మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకే కాకుండా కోట్లాది సంగీతాభిమానులకు తీరని లోటని పేర్కొన్నారు. జానకి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కిషన్‌రెడ్డి, సంజయ్, రాంచందర్‌రావు సంతాపం జానకి మృతి పట్ల కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన జానకి కన్నుమూశారనే వార్త విచారకరమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జానకి మరణం భారతీయ సంగీతానికి ఎంతో లోటని సంజయ్ తెలిపారు. ప్రపంచ సంగీతానికి జానకి మరణం తీరని లోటని రాంచందర్‌రావు పేర్కొన్నారు. జానకి మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు: కేసీఆర్ జానకి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. జానకమ్మ మరణం దక్షిణ భారత సంగీత ప్రపంచానికి, భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలపాటు వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జానకి మరణవార్త ఎంతో బాధాకరం: కేటీఆర్ జానకి మరణం చలనచిత్ర రంగానికి తీరనిలోటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జానకి తన బాల్యంలో కొన్నేళ్లు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో నివాసం ఉన్నారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. -
17 భాషలో పాటలు...32 ప్రధాన అవార్డులు
-
ప్రముఖ గాయని ఎస్.జానకి (88) కన్నుమూత
-
జానకికి నేడు మైసూర్లో అంతిమ వీడ్కోలు
దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకికి ఆదివారం (జూలై 12) మైసూర్లో అంతిమ వీడ్కోలు పలకనున్నారు. కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజల సందర్శనార్థం మైసూర్‌లోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్‌లో ఉంచనున్నారు. అభిమానులు, సినీ, సంగీత ప్రముఖులు ఈ సమయంలో నివాళులర్పించేందుకు అవకాశం కల్పించారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు మైసూర్ నగర శివారులోని కుటుంబానికి చెందిన ప్రైవేట్ ఫామ్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, సంగీత రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. అభిమానుల భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.ఆరు దశాబ్దాలకు పైగా సాగిన తన సంగీత ప్రస్థానంలో ఎస్. జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీత రంగం ఓ గొప్ప గాన కోకిలను కోల్పోయిందంటూ రాజకీయ, సినీ, సంగీత ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
జానకమ్మ మృతి సినీ సంగీతానికి తీరని లోటు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి మరణంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. 88 ఏళ్ల వయసులో మైసూరులోని ఆస్పత్రిలో వయోభారంతో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా జానకి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో భారతీయ సంగీత ప్రపంచం ఓ మహోన్నత గాన స్వరాన్ని కోల్పోయిందని కేసీఆర్ పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానుల హృదయాల్లో "జానకమ్మ"గా చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్. జానకి గాత్రం ఎన్నటికీ చెరిగిపోదని ఆయన అన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సంగీత ప్రస్థానంలో వేలాది పాటలకు ప్రాణం పోసి, తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర అనేక భారతీయ భాషల్లో తన అద్భుత గానంతో సంగీత ప్రపంచంపై చెరగని ముద్ర వేసిన మహోన్నత కళాకారిణిగా ఆమెను కొనియాడారు.తండ్రి ఉద్యోగరీత్యా అప్పటి కరీంనగర్ జిల్లాలో నివసించడం, వారి కుటుంబ మూలాలు సిరిసిల్ల ప్రాంతంతో అనుబంధం కలిగి ఉండడం తెలంగాణకు గర్వకారణమని కేసీఆర్ అన్నారు. జానకమ్మ మరణం ముఖ్యంగా దక్షిణ భారత సినీ సంగీతానికి, భారతీయ గాన ప్రపంచానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.జానకమ్మ వంటి మహా గాయనులకు మరణం ఉండదని, వారి గానమాధుర్యం చిరకాలం సంగీతాభిమానుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటుందని కేసీఆర్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, జానకమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
జానకమ్మ మీ స్వరం అమరం.. సినీ ప్రముఖుల నివాళి
దిగ్గజ గాయని జానకి (88) సంగీత ప్రియుల్ని వదిలి వెళ్లిపోయారు. మైసూరులో శనివారం గుండెపోటుతో అకస్మాత్తుగా తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు ఈమెకు నివాళి అర్పిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: జానకి పాడిన చివరి పాట ఏంటంటే?)జానకి గురించి పోస్ట్ పెట్టిన చిరంజీవి.. నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు, ఆ జ్ఞాపకాలు మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం అని రాసుకొచ్చారు. కమల్, రజనీకాంత్ కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు.(ఇదీ చదవండి: సింగర్ జానకి చివరి వీడియో.. మొన్ననే ఉత్సాహంగా కనిపించారు కానీ ఇప్పుడు)தன்னுடைய தேனமுதக் குரலால் தலைமுறை தலைமுறையாக மக்களை மகிழ்வித்த ஜானகி அம்மா அவர்களின் ஆத்மா சாந்தியடையட்டும் 🙏#JanakiAmma— Rajinikanth (@rajinikanth) July 11, 2026பாடல் என்றும் ஒலித்துக்கொண்டே இருக்கும். அந்த அன்பை எங்கு தேடுவேன் அம்மா? இறக்கி வைக்கமுடியாத சோகம் பலர்க்கும் இருக்கும். அவர்க்கெல்லாம் ஆழ்ந்த இரங்கல்கள்.— Kamal Haasan (@ikamalhaasan) July 11, 2026Actor #MSBhaskar extends his heartfelt condolences and and reflects on legendary playback singer #SJanaki's remarkable legacy.#RIPSJanaki pic.twitter.com/fNJCrpH8AP— Chennai Times (@ChennaiTimesTOI) July 11, 2026 -
మొన్ననే ఎంతో ఉత్సాహంగా కనిపించారు.. కానీ ఇప్పుడు
ప్రఖ్యాత సింగర్ ఎస్.జానకి చివరి వరకు పాటల సవ్వడులతోనే సావాసం చేశారు. 2016లో రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఆమె పాటలు వినపడుతున్నంత కాలం మన మనసుల్లో ఎప్పటికీ సజీవంగాన ఉంటారు. అయితే ఈమెకు సంబంధించిన చివరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య జానకి ప్రశాంత మరణం)ఈ ఏడాది మార్చి చివరి వారంలో టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత.. చెన్నైలోని జానకమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె పాదాల దగ్గర కూర్చొని పాటలు పాడగా గాన సరస్వతి ఎంతో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. సంతోషంగా సునీతని ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత ఎన్నాళ్లు కాలేదు ఇప్పుడు ఇలా తుదిశ్వాస విడిచారు. దీంతో సంగీత ప్రేమికులు శోకసంద్రంలో మునిగిపోయారు.60 ఏళ్ల కెరీర్లో దాదాపు 50 వేలకు పైగా 17 భాషల్లో పాటలు పాడిన జానకమ్మ.. సంగీత ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. పదేళ్ల క్రితం ఆమె రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఈమె పాడిన పాటలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.(ఇదీ చదవండి: జానకి పాడిన చివరి పాట ఏంటంటే?) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య ప్రశాంత మరణం
ప్రముఖ గాయని ఎస్.జానకి(88) కన్నుమూశారు. మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఈమె మనవరాలు అప్సరా వైద్యుల.. సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్ట్‌లో ఆమెతో అనుబంధాన్ని, తుదిశ్వాస విడిచిన సందర్భం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.'దిగ్గజ గాయని, మా నానమ్మ చనిపోయారనే విషయాన్ని తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. ఈ విషాద సమయంలో మా కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అదే సమయంలో సంగీత ప్రపంచానికి ఆమె అందించిన అపూర్వమైన సేవలు, కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆమె గానమాధుర్యం పట్ల గర్వంగా, కృతజ్ఞతతో ఉన్నాం''ప్రపంచానికి ఎస్.జానకి ఒక దిగ్గజ గాయని, ఎన్నో తరాల జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వరం. మా కుటుంబానికి మాత్రం ప్రేమ, ఆప్యాయత, వినయం, దయ, మానవత్వం పంచిన మంచి నానమ్మ. ఈ క్లిష్ట సమయంలో మా ప్రైవసీ గౌరవించాలని ప్రజలు, అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి. మా కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రేమ, ప్రార్థనలు, సానుభూతి తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు' అని అప్సరా వైద్యుల తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: జానకి పాడిన చివరి పాట ఏంటంటే?) View this post on Instagram A post shared by Apsara Vydyula (@apsaravydyula) -
లెజెండరీ గాయని జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్.జానకి మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్. జానకి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు.తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని వైఎస్ జగన్ అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎస్. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన వైఎస్ జగన్.. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.కాగా, ప్రముఖ దిగ్గజ నేపథ్య గాయని ఎస్.జానకి మైసూరులోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో మృతి చెందారు. “దక్షిణ భారత కోకిలగా ఆమె ప్రత్యేక గుర్తించారు. 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్. జానకి.. ఆరు దశాబ్దాలకు పైగా సినీ గాన సేవ చేశారు. 17 భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించిన గానకోకిల.. మధురమైన గాత్రంతో కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్నారు. గ్రామీణ జానపదం నుంచి శాస్త్రీయ, మెలోడీ, భక్తి గీతాల వరకు విశేష ప్రతిభ కనపరిచారు. భారతీయ సినీ సంగీత రంగానికి ఎస్. జానకి సేవలు చిరస్మరణీయం. ఎస్. జానకి మృతితో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. గానకోకిల ఎస్. జానకికి సినీ, సంగీత ప్రముఖులు నివాళులర్పించారు. -
ప్రముఖ గాయని ఎస్.జానకి అరుదైన ఫోటోలు
-
కన్నుమూసిన జానకి.. చివరి పాట ఏంటంటే?
దిగ్గజ సింగర్ ఎస్.జానకి చనిపోయారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలకు తోడు కుమారుడిని కోల్పోయిన వేదన ఓ వైపు ఉండగా శనివారం సాయంత్రం మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉండగా గుండెపోటు వచ్చింది. దీంతో తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలకుపైగా 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల్ని అలరించారు. మరి ఈమె పాడిన చివరి పాట ఏంటో తెలుసా?2016 అక్టోబరులో రిటైర్మెంట్ ప్రకటించిన జానకి.. ఓవరాల్ కెరీర్ ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. చివరగా 'అమ్మాపోవిను' అనే మలయాళ పాటను రికార్డ్ చేసి.. ఇకపై పాటలు పాడదలుచుకోలేదని, సినిమాలతో పాటు వేదిక మీద కూడా పాడేది లేదని ప్రకటించారు. అలా జరిగి పదేళ్లు అయింది. ఇప్పుడు ఈమె శాశ్వతంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. సుదీర్ఘ సంగీత ప్రయాణంలో దాదాపు భారతీయ భాషలన్నింటిలో పాడిన జానకి.. 4 జాతీయ అవార్డులతో పాటు 32 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. -
ప్రముఖ గాయని జానకి కన్నుమూత
ప్రముఖ గాయని ఎస్.జానకి(88) కన్నుమూశారు. వయోభారంతో ఇబ్బందిపడుతున్న ఈమె మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం(జూలై 11) సాయంత్రం గుండెపోటుతో మరణించారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు కొన్నాళ్ల క్రితం చనిపోవడంతో మనోవేదనకు గురయ్యారు. ఆ బాధకి తోడు అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకుని, నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు.సినీ ప్రస్థానం: 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలయాత్తు' ద్వారా నేపథ్య గాయనిగా ప్రస్థానం ప్రారంభించారు. అదే ఏడాది 'ఎమ్మెల్యే' చిత్రంలో 'నీతియే జయమౌనురా' అనే పాట పాడారు. చిన్న పిల్లల గొంతు నుండి ముసలివారి వరకు ఏ వయసు పాత్రకైనా సరిపోయేలా తన స్వరంలో మార్పులు (Voice Modulation) చేయడం ఆమె ప్రత్యేకత.సంగీత ప్రయాణం: లెజండరీ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతో ఆమె పాడిన యుగళ గీతాలు భారతీయ సంగీత చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి. 17 భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడారు ఎస్ జానకి.పురస్కారాలు జాతీయ అవార్డులు: ఉత్తమ నేపథ్య గాయనిగా 4 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 12 నంది అవార్డులతో పాటు వివిధ దక్షిణాది రాష్ట్రాల నుండి 30కి పైగా అవార్డులు పొందారు. 1986లో కలైమామణి అవార్డు, 1997లో ఫిలింఫేర్, 2002లో అచీవర్ అవార్డు, 2005లో జేసుదాసు అవార్డులు ఆమెను వరించాయి. 2009లో మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 2015లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2017లో వేటూరి జీవిత సాఫల్య పురస్కారం ఆమెకు లభించాయి. మౌనపోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు జానకి.పద్మభూషణ్ తిరస్కరణ: 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'పద్మభూషణ్' పురస్కారాన్ని, దక్షిణాది కళాకారులకు గుర్తింపు ఆలస్యంగా లభిస్తోందని నిరసిస్తూ ఆమె గౌరవపూర్వకంగా తిరస్కరించారు. -
బాలు అలా పాడటం అనవసరం.. నేను పాడితేనే ఇళయరాజాకి నచ్చేది..!
-
గాయని ఎస్.జానకి కుటుంబంలో విషాదం
ప్రముఖ గాయని ఎస్.జానకి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ సింగర్ చిత్ర సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. మురళీకృష్ణ మరణం తనను షాక్‌కు గురిచేసిందని తాను మంచి సోదరుడిని కోల్పోయానంటూ తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కోరారు. మురళీకృష్ణకు కూడా సినీ రంగంతో అనుబంధం ఉంది. వినాయకుడు, మల్లెపువ్వు వంటి సినిమాల్లో ఆయన నటించారు. భరతనాట్యంలో ఆయనకు ప్రావీణ్యం ఉంది. పలువురు విద్యార్థులకు శిక్షణ కూడా ఇచ్చారు. మురళీకృష్ణ మరణంతో సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. -
నాకు మీ ప్రేమ చాలు ఇంకేమీ వద్దు..!
-
నేను మగవారి గొంతుతో కూడా పాడగలను..!
-
SP balasubrahmanyam: మైమరపించే గీతాలు
చిన్నప్పుడు సుశీల పాడిన పాటలు పాడి గుర్తింపు పొందారు బాలూ. గూడూరులో ఆయన ప్రతిభ గమనించి ‘సినిమాల్లో పాడు’ అని ప్రోత్సహించారు జానకి. కలిసి పాడి హిట్స్ ఇచ్చారు వాణి జయరాం. అన్నయ్యకు దీటుగా గొంతు సవరించుకున్నారు ఎస్.పి.శైలజ . ఒక రికార్డింగ్ థియేటర్లో బాలూతో బ్రేక్‌ఫాస్ట్–పాట, మరో థియేటర్లో లంచ్–పాట, మరో థియేటర్లో డిన్నర్ –పాట... ఇలా జీవితం గడిపారు చిత్ర. బాలు మరణించాక వస్తున్న తొలి జయంతి ఇది. జీవించి ఉంటే పుట్టిన్రోజు అనుండేవాళ్లం. ఎందరో మహిళా గాయనులతో పాటలు పాడి శ్రోతలను సేదదీర్చాడు ఆయన. ప్రతి గాయనితో కనీసం ఒక్కో యుగళగీతాన్ని తలుచుకునే సందర్భం ఇది. మావిచిగురు తినగానే (పి.సుశీల) ‘మావిచిగురు తినగానే కోవిల పలుకుతుందట.. కోవిల గొంతు వినగానే మావి– చిగురు తొడుగుతుందట’... తెలుగువారికి మావిచిగురుకి, కోయిలకి, కృష్ణశాస్త్రి కవిత్వానికి, సుశీల–బాలసుబ్రహ్మణ్యంల గొంతులకు ఉన్న అనుబంధం అవిభాజ్యం. ‘సీతామాలక్ష్మి’లో కె.వి.మహదేవన్ బాణీకట్టిన ఈ పాట రైల్వేస్టేషన్లో మొదలయ్యి పచ్చటి దారుల వెంట పరుగుతీస్తుంది. ‘బింకాలు బిడియాలు.. పొంకాలు.. పోడుములు’ అని సుశీల అంటే ‘ఏమో ఎవ్వరిదోగాని ఈ విరి గడసరి’ అని బాలూ అంటూ ఒక చిరునవ్వు నవ్వుతారు. ఆ నవ్వు ఆయన సిగ్నేచర్. పాటల్లో ఆయన నవ్వుకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. అలివేణి ఆణిముత్యమా (ఎస్.జానకి) ‘స్వాతివాన లేతఎండలో... జాలి నవ్వు జాజిదండలో’ అని రాశారు వేటూరి. ఆ స్వాతివాన జానకి అయితే ఆ జాజిదండ బాలూ అయి ఉండవచ్చు. తెలుగు పాటల్లో ఇంత లోగొంతుకతో లాలిత్యంతో సున్నితంగా పాడిన మరొక పాట లేదు. ‘ముద్దమందారం’ సినిమా కోసం రమేశ్ నాయుడు స్వరకల్పనకు జానకి తో కలిసి బాలూ ఇచ్చిన ఆవిరి చిగురు... ఊపిరి కబురు కలకాలం నిలిచి ఉన్నాయి. ‘కుదురైన బొమ్మకి కులుకుమల్లె రెమ్మకి నుదుటబొట్టు పెట్టనా... బొట్టుగా’ అని బాలూ అంటే దానికి జానకి ‘వద్దంటే ఒట్టుగా’ అని పరవశంగా చెప్పే జవాబు ఇక్కడ చదివితే తెలియవు. వినండి. ఎన్నెన్నో జన్మల బంధం (వాణీజయరాం) ఈ పాటలో పల్లవి, చరణాలు ఒకెత్తు. మొదటి చరణం తర్వాత వచ్చే ఆలాపనలు ఒకెత్తు. ‘హా’ అని బాలూ అంటే ‘హా’ అని వాణిజయరాం అంటే ఆ తర్వాత ఇద్దరూ కలిసి ‘ఆ..’ అని తీసే ఆలాపన అద్భుతం. బాలూ పాడిన ఉత్తమ పది డ్యూయెట్లు ఎవరు ఏవి ఎంచినా ఈ పాట ఉంటుంది. ‘నీవు కడలివైతే నే నదిగా మారి చిందులు వేసి వేసి చేరనా’ అని దాశరథి రాశారు. బాలూ–వాణి జయరాంల కాంబినేషన్లో వచ్చిన ఈ పాట అలా శ్రోతల హృదయజలధికి ఎప్పుడో చేరింది. మాటే మంత్రము (ఎస్పి.శైలజ) ‘నీవే నాలో స్పందించినా ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే’ అని బాలూ పాడితే వెంటనే శైలజ ‘నేనే నీవుగా పూవూ తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో’... అంటారు. ఏమి యుగళగీతం ఇది. ‘సీతాకోకచిలుక’కు వందల వర్ణాలు ఇచ్చిన యుగళగీతం. అన్నయ్య బాలూతో చెల్లెలు శైలజ ఎన్నో మంచి పాటలు పాడారు. కాని సంఖ్యా పరంగా చూస్తే పాడాల్సినన్ని పాడలేదు అనిపిస్తుంది. సొంత చెల్లెలైనా ఏనాడూ ఆమెను ప్రత్యేకంగా రికమండ్ చేయలేదు బాలూ. శైలజ తన ప్రతిభ తో రాణించారు. ‘పడమటి సంధ్యారాగం’లో ‘పిబరే రామరసం’, శుభసంకల్పంలో ‘సీతమ్మ అందాలూ’... ఈ అన్నాచెల్లెళ్లు కలిసి పంచిన తీపినిమ్మతొనలు ఎన్నని. సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ (ఎల్.ఆర్.ఈశ్వరి) ‘మరో చరిత్ర’లో ‘బలేబలే మగాడివోయ్’ పాటను ఎల్.ఆర్.ఈశ్వరి, బాలూ కలిసి పాడారు. ఎల్.ఆర్.ఈశ్వరి దూకుడు ముందు నిలవడం తోటి గాయకులకు కష్టమే. కాని ఆమె సై అంటే బాలూ సై అనడం వీరిద్దరి పాటల్లో కనిపిస్తుంది. ‘సింహబలుడు’ కోసం వేటూరి రాయగా ఎం.ఎస్.విశ్వనాథన్ చేసిన ‘సన్నజాజులోయ్’ పెద్ద హిట్. ‘ఒకటున్నది నీలో ఒడుపున్నది నాలో’ అని అచ్చు ఎన్.టి.ఆర్ అన్నట్టే బాలూ అని మనల్ని మెస్మరైజ్ చేస్తారు ఈ పాటలో. పూసింది పూసింది పున్నాగ (చిత్ర) గాత్రాన్ని వెనక్కు నెట్టి బీట్‌ను ముందుకు తెచ్చిన 1990ల కాలంలో కీరవాణి రంగప్రవేశం చేసి మళ్లీ మాటను ముందుకు తెచ్చారు. ‘పూసింది పూసింది పున్నాగ’ అందుకు అతి పెద్ద ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పచ్చటి చేలలో పిల్లగాలుల్లా మారడం ఈ పాటలో బాలూ, చిత్ర చేశారు. వేటూరి సాహిత్యం అందుకు తోడైంది. ‘సీతారామయ్య గారి మనవరాలు’ వేదికయ్యింది. చిత్ర, బాలూ వేల పాటలు పాడారు. కాని ఈ పాట ఎప్పుడూ ప్రత్యేకమే. తెల్లచీరకు తకధిమి తపనలు (లతా) లతా మంగేశ్కర్ తెలుగులో బాలూతో పాడిన ఏకైక డ్యూయెట్. కె.రాఘవేంద్రరావు, ఇళయరాజాల వల్ల ఇది సాధ్యమైంది. లతాతో బాలూ హిందీలో ఎన్నో పాటలు పాడినా తెలుగులో ఇద్దరూ కలిసి పాడటం పాట ప్రియులకు పసందైన జ్ఞాపకంగా నిలిచింది. తెల్లచీరకు తపనలు వేటూరి తప్ప ఇంకెవరు రప్పించగలరు. వైశాఖం, కార్తీకం, ఆషాఢం, హేమంతం.. ఇవన్నీ ఈ పాట చరణాల్లో ఉంటాయి. ఈ ప్రకృతి సౌందర్యాలే లతా మంగేష్కర్, బాలూ గళాలు కూడా. అందుకే ఆ అందం.. ఆ గంధం. ఓ వాలుజడా (సునీత) తెలుగువారికి వాలుజడ సత్యభామ కాలం నుంచి తెలుసు. దానిని ‘రాధాగోపాళం’లో పాటగా మలిచారు బాపురమణ. ‘అన్ని అందాలు స్త్రీలు ముందు ఉన్నా నువ్వొక్కదానివి వెనకెందుకున్నావు?’ అని కవి జొన్నవిత్తుల కొంటెగా వాలుజడను ప్రశ్నిస్తారు ఈ పాటలో. ఈ అచ్చతెనుగు పాటకు బాలూతో పాటు సునీత కాకుండా ఇంకెవరు గొంతు కలపగలరు. జీవితం సప్తసాగర గీతం (ఆశాభోంస్లే) ఈ పాటను ఆశా భోంస్లే మొదలెడతారు. మొదటి చరణం చివరలో బాలూ అందుకుంటారు. ‘హే... బ్రహ్మమానస గీతం.. మనిషి గీసిన చిత్రం.. చేతనాత్మక శిల్పం... మతి కృతి పల్లవించే చోట’... ఇలా పాడేవాళ్లు... ఇలా పాడగలిగినవాళ్లు ఎందరని? ‘చిన్నకృష్ణుడు’ కోసం ఆర్.డి. బర్మన్ చేసిన ఈ పాట వేటూరి మాటల్లో తాత్త్వికంగా ఉంటుంది. బాలూ, ఆశాభోంస్లే గొంతుల వల్ల లోతుగా ఉంటుంది. ‘జీవితం వెలుగు నీడల వేదం’ అని అంటారు వేటూరి. పాటకు ఒక వెలుగు బాలూ లేరు కదా. నీడగా ఆయన జ్ఞాపకమే ఉంది. జగదానందకారకా (శ్రేయా ఘోషాల్) బాలూ ఐదు దశాబ్దాలు పాడారు. పాతతరంతో ఎంత బాగా జోడీ కట్టారో కొత్తతరంలో కూడా అంతే దీటుగా గొంతు కలిపారు. శ్రేయా ఘోషాల్ దేశంలో ఒక ఉత్తమ యువ గాయని. కాని ఆమెతో ఈ డ్యూయెట్ లో బాలూ, శ్రేయా ఇళయరాజా గీతానికి ఎంత సౌందర్యం ఇచ్చారో... ఎలాంటి వాడని తోరణం కట్టారో... జొన్నవిత్తుల ఈ గీతం రాసి ప్రశంసనీయులయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జానకమ్మ క్షేమంగా ఉన్నారు
‘ప్రముఖ గాయని ఎస్. జానకి లేరు’ అనే వార్త సోషల్ మీడియాలో ప్రచారమైంది. ఈ వార్తను ఉద్దేశించి ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో సారాంశం ఇది. ప్రియమైన మిత్రులకు... నేను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంని. సోమవారం ఉదయం నుంచి జానకి అమ్మ క్షేమసమాచారాలు అడుగుతూ నాకు దాదాపు 20 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎవరో సోషల్ మీడియాలో ‘ఆమె ఇక లేరు’ అని ప్రచారం చేశారు. ఏంటీ నాన్సెన్స్. నేను ఆమెతో మాట్లాడాను. చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కళాకారులను బాగా అభిమానించేవారికి ఇలాంటి వార్తలు గుండెపోటు తెప్పిస్తాయి. దయచేసి సోషల్ మీడియాను పాజిటివ్ విషయాలకు వాడండి. ఇలాంటి నెగటివ్ విషయాలకు కాదు. హాస్యం కోసం సోషల్ మీడియాని వాడొద్దు. ‘లాంగ్ లివ్ జానకి అమ్మా. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సేఫ్‌గా ఉన్నారు’. జెంటిల్మెన్ ఎందుకిలాంటి వార్తలు ప్రచారం చేçస్తున్నారు? ఇంతకీ మిమ్మల్ని జెంటిల్మెన్ అనాలా? అందరికీ ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ‘జానకికి చిన్న శస్త్ర చికిత్స జరిగింది. ఆమె క్షేమంగా ఉన్నారు’ అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
వదంతులు నమ్మొద్దు: ఎస్ జానకి
మైసూర్: తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని అభిమానులకు దిగ్గజ గాయని ఎస్ జానకి విజ్ఞప్తి చేశారు. దక్షిణ భారత సినీ గాయని ఎస్ జానకి ఇక లేరనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో సంగీత అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ వార్తలను జానకి కుటుంబ సభ్యులు ఖండించారు. తాజాగా తనపై వస్తున్న తప్పుడు వార్తలపై జానకి స్పందిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం మైసూర్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆమె తెలిపారు. అయితే ఇటువంటి రూమర్స్ ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని ఈ దిగ్గజ గాయని ఆవేదన వ్యక్తం చేశారు. (ఆర్జీవీ అదిరిపోయే సమాధానం) ‘జానకి గారికి ఇటీవలే ఓ ఆస్పత్రిలో చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. జానకి ఆరోగ్యంపై వదంతులను వ్యాప్తి చేయవద్దు. ఆమె క్షేమంగా ఉన్నారు’ అని జానకి కుటుంబ సభ్యులు, నటుడు మనోబాల వివరణ ఇచ్చారు. అంతేకాకుండా గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సైతం ఈ తప్పుడు వార్తలను ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ వీడియో విడుదల చేశారు. ‘జానకమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి నాకు 20 మంది వరకు ఫోన్ చేశారు. ఎందుకంటే సోషల్ మీడియాలో జానకమ్మ చనిపోయారంటూ అసత్య వార్తలను వ్యాప్తి చేశారు. ఏంటి ఈ అర్థంపర్థం లేని పనులు. నేను ఆమెతో మాట్లాడాను. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు’ అంటూ ఎస్పీ బాలు పేర్కొన్నారు. (ఆ సినిమాలకు సిగ్గు పడుతున్నా..) No...its wrong news..she got a minor operation..she s ok now https://t.co/3NuyV07eBF — manobala (@manobalam) June 28, 2020 -
స్టార్ స్టార్ సూపర్ స్టార్-ఎస్ జానకి
-
నన్ను మోసం చేసి లాక్ చేశాడు
‘‘నాకు అవార్డు ఇస్తానంటే వేడుకకు రాను..ఇవ్వనంటేనే వస్తానని సురేశ్‌కి ముందే చెప్పా. కానీ, నన్ను మోసం చేసి గానకోకిల ఎస్.జానకిగారి చేతులమీదుగా అవార్డు బహూకరించి నన్ను లాక్ చే సేశాడు. కాదనలేక ఈ అవార్డు తీసుకుంటున్నా’’ అని హీరో చిరంజీవి అన్నారు. 16వ ‘సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం’ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సింగపూర్‌లో ఓ అవార్డుల కార్యక్రమంలో జానకిగారు, నేను కలిసాం. మళ్లీ ‘సంతోషం’ వేడుకల్లోనే కలిసాం. తొలిసారి ఆమె చేతుల మీదుగా ‘సంతోషం’ అవార్డు తీసుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇందుకు సురేశ్‌కి థ్యాంక్స్. మరొకరి చేతుల మీదుగా అవార్డు ఇచ్చుంటే తిరస్కరించేవాణ్ని. ఎందుకంటే ఇలాంటి అవార్డులు కొత్త వారికి ఇచ్చి ప్రోత్సహిస్తే వాళ్లలో ఉత్సాహం నింపినట్లు ఉంటుంది’’ అన్నారు. మరో ముఖ్య అతిథి గాయని ఎస్. జానకి మాట్లాడుతూ– ‘‘సురేశ్ 5 ఏళ్ల నుంచి ఫంక్షన్‌కు రావాలని అడుగుతున్నా కుదరక రాలేకపోయా. ఈసారి కచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకుని వచ్చా. ఇక్కడ చిరంజీవిగార్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన సినిమాల్లోని అప్పటి హిట్ సాంగ్స్ అన్నీ దాదాపు నావే. ఆయన 125 ఏళ్లు సంతోషంగా జీవించాలి. ‘ఖైదీ నంబర్ 150’ సినిమా చూసా. పాత చిరంజీవిని చూసినట్లే ఉంది’’ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ– ‘‘16 ఏళ్లగా సురేశ్ ఒక్కడే అన్నీ తానై ఈ వేడుకలను నిర్వహించడం గొప్ప విషయం. సినీ పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడంలో ఎందరో పెద్దల కృషి ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడుగారులాంటి వల్ల సాధ్యమైంది’’ అన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందించారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్‌బాబు, కె.ఎల్ నారాయణ, నటులు రాజేంద్ర పసాద్, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ, ప్రసన్న, దర్శకుడు, నటుడు టి. రాజేందర్, రచయిత సాయిమాధవ్ బుర్రా, కథానాయికలు తమన్నా, మెహరీన్, ఈషా, స్నేహ, డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి, నృత్యదర్శకుడు శేఖర్ మాస్టర్, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా రాధాకృష్ణ, ‘మా’ జనరల్ సెక్రటరీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
జానకికి బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం
సాక్షి, నెల్లూరు : ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మాణం తన పుట్టిన రోజు సందర్భంగా ప్రతీ సంవత్సరం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం అందచేస్తారు. ఈ ఏడాది ఆ అవార్డును ప్రముఖ గాయని ఎస్ జానకికి అందజేయనున్నారు. శ్రీ విజేత ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘జానకమ్మ ఆశీస్సులతోనే ఇంత పెద్ద గాయకుడిని అయ్యా ఆమె సత్కరించుకనే అవకాశం రావటం గౌరవంగా భావిస్తున్నా’నన్నారు బాలు. ఎన్నో అద్భుత గీతాలతో ప్రేక్షకులను అలరించిన జానకీ 17 భాషల్లో దాదాపు 45000 వేల పాటలు పాడారు. ఇందులో జపనీస్, జర్మన్ లాంటి విదేశీ భాషలు కూడా ఉండటం విశేషం. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలకు గాను నాలుగు జాతీయ అవార్డులతో పాటు 33 వివిధ రాష్ట్రాల అవార్డులు ఆమెను వరించాయి. 2016లో ఓ మలయాళ చిత్రానికి తన చివరి పాటను ఆలపించిన జానకీ తరువాత రిటైర్మెంట్ ప్రకటించారు. -
ఎస్.జానకి సంచలన నిర్ణయం
మైసూరు: ఎస్.జానకి.. ఈ పేరు వినని భారతీయులు అరుదు. ఆమె పాట అమృత ధార. సుమారు 6 దశాబ్దాలుగా తన సుమధుర స్వరంతో అశేష ప్రజానీకాన్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తూ వేలాది సినీ, భక్తి గీతాలు ఆలపించి గానకోకిలగా పేరు గడించిన జానకి సినిమాల్లో గానానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. మైసూరులోని మానస గంగోత్రి ఆడిటోరియంలో శనివారం జరిగిన సంగీత విభావరిలో పాల్గొన్న జానకి తన వీడ్కోలు వార్తను ప్రకటించారు. సంగీత విభావరిలో చివరి సారిగా కన్నడ చిత్రాల్లో ఆమె ఆలపించిన తనకిష్ట మైన పాటలు పాడి వీడ్కోలు పలికారు. కార్యక్రమానికి అథితిగా హాజరైన రాజమాత ప్రమోదా దేవి, ఇతర నటీమణులు జానకిని సన్మానించారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ఎస్ జానకి
-
'ఇదే నా చివరి పాట'
లెజెండరీ సింగర్ ఎస్ జానకీ తన రిటైర్మెంట్ను ప్రకటించారు. దాదాపు 60 సంవత్సరాలుగా 48 వేలకు పైగా పాటలతో సినీ సంగీత అభిమానులను అలరిస్తున్న జానకీ వయో భారం కారణంగా గాయనిగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా తెలియజేశారు. చివరగా అమ్మాపోవిను అనే మలయాళ పాటను రికార్డ్ చేసిన జానకీ, ఇకపై పాటలు పాడదలుచుకోలేదని, సినిమాలతో పాటు వేదిక మీద కూడా పాడేది లేదంటూ ప్రకటించారు. సుదీర్ఘ సంగీత ప్రయాణంలో దాదాపు భారతీయ భాషలన్నింటిలో పాడిన జానకీ, 4 జాతీయ అవార్డులతో పాటు 32 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. అయితే ఆమె రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో పలు మీడియా సంస్థలు జానకి మరణించినట్టు ప్రచారం చేయటంపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారని, కేవలం గాయనిగా కొనసాగటం లేదని మాత్రమే తెలిపారు. -
కంటతడి పెట్టిన గాయని జానకి
హైదరాబాద్: నిర్మాత ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయానికి అంజలి ఘటించిన సందర్భంగా ప్రముఖ గాయని జానకి భావోద్వేగానికి గురయ్యారు. ఏడిద భౌతిక కాయాన్ని చూసి నివాళులు అర్పించిన అనంతరం ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏడిద నాగేశ్వరరావు సతీమణిని తన ఇంటికి తీసుకెళ్లి కొన్ని రోజులపాటు తనవద్దే ఉంచుకుంటానని చెప్పారు. -
ఆ సినిమాలో పాత్ర ఎంతో సంతృప్తి నిచ్చింది
భీమవరం : సినీ గాయని ఎస్.జానకి సూచనతోనే గాయకుడినయ్యానని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. చైతన్యభారతి సంగీత నృత్య నాటక పరిషత్ ప్రారంభ సభలో జీవిత సౌఫల్య పురస్కారాన్ని అందుకునేందుకు ఆయన భీమవరం విచ్చేశారు. ఈ సందర్భంగా శనివారం చైతన్య భారతి, కాస్మోపాలిటిన్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ‘మాటాడుతా తీయగా’ పరిచయ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. 1962లో గుడివాడలో కాళిదాసు కళానికేతన్ నిర్వహించిన కార్యక్రమంలో తాను పాటలు పాడిన సందర్భంలో ముఖ్య అతిథిగా వచ్చిన జానకి తనను పిలిచి సినిమాల్లో ప్రయత్నించాలని సూచించారన్నారు. ఇంజినీర్ కావాలని ఇంజినీరింగ్ చదివిన తాను జానకి సూచనతో గాయకుడిగా మారానని చెప్పారు. చిత్ర పరిశ్రమ తనకు అందించిన సహకారం మరువలేనన్నారు. పాటలకు న్యాయం చేయలేనని అనిపించినప్పుడు పాడటం మానేస్తానన్నారు. పాటలతోపాటు పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పాటలు, నాటకాలు రాయడం, ఫొటోలు తీయడం, ట్రావెలింగ్ తనకెంతో ఇష్టమన్నారు. మహ్మద్ రఫీ అంటే తనకెంతో ఇష్టమని, పాటల రచరుుత ఆత్రేయ తనకు తండ్రిలాంటి వారని అన్నారు. 40 వేల పాటలు పాడా.. మిధునం సినిమాలో పోషించిన పాత్ర తనకెంతో సంతృప్తినిచ్చిందని బాలు తెలిపారు. ఇప్పటివరకు 40 వేల వరకు పాటలు పాడానని, వీటిలో నాలుగు వేల గీతాలు తనకెంతో ఇష్టమని చెప్పారు. బాల్యంలో ఆటపాటలు ముఖ్యమని చదువు కూడా అంతే అవసరమన్నారు. ర్యాంకుల కోసం పిల్లలను వేధించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఇప్పటివరకు 66 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించానని చెప్పారు. జూనియర్ గాయకులను ఎందుకు ఎదగనివ్వడం లేదని ఒకరు ప్రశ్నించగా వారి ఎదుగుదలను ఆపడానికి తానెవరినని ముక్తసరిగా సమాధానమిచ్చారు. నిర్వాహకులు బాలసుబ్రహ్మణ్యంను గజమాలతో సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు గోకరాజు రామరాజు, గజల్ శ్రీనివాస్, రాయప్రోలు భగవాన్ తదితరులు పాల్గొన్నారు. -
గీత స్మరణం
పల్లవి : ఈలోకం అతిపచ్చన తోడుంటే నీ పక్కనా ఎదలో ఎదగా మసలే మనసుంటే జతగా నడిచే మనిషుంటే ఈలోకం అతిపచ్చన తోడుంటే నీ పక్కనా చరణం : 1 ప్రేమకు లే దూ వేరే అర్థం (2) ప్రేమకు ప్రేమే పరమార్థం (2) ప్రేమించు ఆ ప్రేమకై జీవించూ నవ్వుతూ నవ్వించూ... ॥ చరణం : 2 ప్రతినదిలోనూ అలలుంటాయి (2) ప్రతి ఎదలోనూ కలలుంటాయి (2) ఏ కలలు ఫలియించునో శ్రుతిమించునో కాలమే చెబుతుందీ... ॥ గానం : ఎస్.పి.బాలు పల్లవి : ఊరించే వయసిదీ లాలించే మనసిదీ రేయంతా మేలుకొన్నదీ పగలంతా కలలు కన్నదీ నీకోసమే... తననా నననా నననా... ॥ చరణం : 1 రేపవలు ఒంటరితనము కనుమూయనీయదూ పడకింట నీదే తలపూ ఘడియాగనీయదూ రవ్వంత జాలితో కరుణించవా... హా... ఈ రాగవీణనూ పలికించవా... బదులేదిరా... తననా నననా నననా... ॥ చరణం : 2 కోరికలు తారకలైతే మనిషి బ్రతుకెందుకురా కోరింది తీరకపోతే బ్రతికి ఫలమేమిటిరా ఏ పూవు పూచినా జతమాలకే నేనేమి చేసినా నీ పొందుకే బదులేదిరా... తరరా తరరా తరరా... ॥ గానం : ఎస్.జానకి చిత్రం : వసంతకోకిల (1982) రచన : మైలవరపు గోపి, సంగీతం : ఇళయరాజా నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : పపగ పపగ పపగ పపగ... పపగ పస... పపగ పస... ఎదలో లయ ఎగసే లయ ససమా నినిరీ... ససమా నినిరీ... గగగ మమమ ససస ససస ససస ఎదలో లయ ఎగసే లయ ఎగసి ఎగిరి ఎదలో ఒదిగి శుకమా స్వరమా పికమా పదమా శుకమా చరణం : 1 గాగా ఆ... ఆ... దివ్యమే నీ దర్శనం శ్రావ్యమేలే స్పందనం శోధనే నా జీవనం సాధనేలే జీవితం జతలే శ్రుతులై పలికే ఆలాపన వెతికి వెతికి బ్రతుకే అన్వేషణ నాలో నేడే విరులవాన ॥ చరణం : 2 కోకిలగీతం... తుమ్మెదనాదం... (2) జలజల పారే సెలగానం ఘుమఘుమలాడే సుమరాగం అరెరె... ఆ... ఆ... ఆ... కొండ కోన... ఎండ వాన... ఏకమైన ప్రేమగీతం... ఔనా... మైనా... నీవే... నేనా శుకపికముల కలరవముల స్వర లహరులలో పలికే చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ సససస.... దదదద...పపపప...రిరిరిరి....నినినిని... సససస రిరిరిరి....నినినిని... సససస పలికే చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ విరుల తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ ॥ సససస... సససస... చరణం : 3 విహంగమా... సంగీతమా... (2) సంగీతమే విహంగమై చరించగా స్వరాలతో వసంతమే జ్వలించగా ఎన్నాళ్లు సాగాలి ఏకాంత అన్వేషణ అలికిడి ఎరుగని తొలకరి వెలుగులలో ॥ చిత్రం : అన్వేషణ (1985), రచన : వేటూరి సంగీతం : ఇళయురాజా, గానం : ఎస్.జానకి - నిర్వహణ: నాగేశ్


