జానకమ్మ మీ స్వరం అమరం.. సినీ ప్రముఖుల నివాళి | Singer Janaki Demise And Actress Condolences | Sakshi
Sakshi News home page

Singer Janaki: జానకమ్మ జ్ఞాపకాల్లో సెలబ్రిటీలు.. ప్రగాఢ సానుభూతి

Jul 11 2026 10:07 PM | Updated on Jul 11 2026 10:07 PM

Singer Janaki Demise And Actress Condolences

దిగ్గజ గాయని జానకి (88) సంగీత ప్రియుల్ని వదిలి వెళ్లిపోయారు. మైసూరులో శనివారం గుండెపోటుతో అకస్మాత్తుగా తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు ఈమెకు నివాళి అర్పిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: జానకి పాడిన చివరి పాట ఏంటంటే?)

జానకి గురించి పోస్ట్ పెట్టిన చిరంజీవి.. నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు,  ఆ జ్ఞాపకాలు మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం అని రాసుకొచ్చారు. కమల్, రజనీకాంత్ కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు.

(ఇదీ చదవండి: సింగర్ జానకి చివరి వీడియో.. ‍మొన్ననే ఉత్సాహంగా కనిపించారు కానీ ఇప్పుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement