ఈశా గ్రామోత్సవం 2026: రూ.కోటి నగదు బహుమతులు | ISHA Gramotsavam 2026 Registrations for Volleyball Throwball Tournament | Sakshi
Sakshi News home page

ఈశా గ్రామోత్సవం 2026: రూ.కోటి నగదు బహుమతులు

Jul 11 2026 5:26 PM | Updated on Jul 11 2026 5:29 PM

ISHA Gramotsavam 2026 Registrations for Volleyball Throwball Tournament

భారతదేశంలోని అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవాలలో ఒకటైన ఈశా గ్రామోత్సవం 18వ సారి, 10 రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 40,000 కంటే ఎక్కువ గ్రామాల నుండి 80,000 మందికి పైగా ఆటగాళ్ళను ఒక చోటికి తీసుకురాబోతుంది. ఖేలో ఇండియా చేత గుర్తింపు పొందిన ఈ సంవత్సరం టోర్నమెంట్‌లో 7వేలకుపైగా జట్లు, సుమారు 15వేల మంది మహిళా పాల్గొంటారని అంచనా. పోటీలోని వివిధ దశలలో మొత్తం రూ.1 కోటి నగదు బహుమతులు అందజేయనున్నామని  ఈశా ఫౌండేషన్‌  ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈశా అవుట్‌రీచ్ - యాక్షన్ ఫర్ రూరల్ రీజువెనేషన్ కార్యక్రమం కింద ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. తమిళనాడు, ఈశా గ్రామోత్సవం 2026 కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ , కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో జరుగుతుందని,  దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయని  తెలిపింది. అర్హత కలిగిన క్రీడాకారులు isha.co/gramotsavam వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చుని వెల్లడించింది.

ఈశా గ్రామోత్సవం ప్రధాన లక్ష్యం గ్రామీణ భారత స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడం. అందుకు క్రీడలను మాధ్యమంగా ఎంచుకున్నారు. జట్టులోని ఆటగాళ్లందరూ ఒకే గ్రామానికి చెందినవారు కావడం గ్రామోత్సవానికి ఉన్న ప్రత్యేకత. తద్వారా సామాజిక స్పృహ ఇంకా ఆరోగ్యకరమైన పోటీ భావనను పెంచడమే లక్ష్యం.

పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్ గ్రామీణ ఆటలు, సాంప్రదాయ కళలు ఇలా ప్రస్తుతం తెలంగాణలో 15 జిల్లాలలో జోరుగా సాగుతోంది, జూలై 18, 19 తేదీలలో జనగాం, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి మరియు ఖమ్మం క్లస్టర్లలో వాలీబాల్ మరియు త్రోబాల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నమెంట్ రెండవ దశ జూలై 25 , 26 తేదీలలో కొనసాగుతుంది. జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, రంగారెడ్డి క్లస్టర్లలో వాలీబాల్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జూలై 25న వాలీబాల్ , త్రోబాల్ పోటీలు మహబూబ్‌నగర్, మెదక్, సంగారెడ్డి , వరంగల్ క్లస్టర్లలో ఉంటాయి. అదే సమయంలో, నల్గొండ , రాజన్న సిరిసిల్ల క్లస్టర్లలో జూలై 26న త్రోబాల్ మ్యాచ్‌లు జరుగుతాయి. గెలిచిన జట్లు సెప్టెంబర్ 4-6 వరకు కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో, ప్రసిద్ధ ఆదియోగి ఎదురుగా జరిగే గ్రాండ్ ఫైనల్‌కు చేరుకుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement