భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే విద్యకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఎస్వీకేఎం వారి నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎన్ఎంఐఎంఎస్) మల్టీ డిసిప్లైనరీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను రూపొందించింది. విద్యార్థులను పరిశ్రమ-ఆధారిత పాఠ్యాంశాలు, అనుభవపూర్వకమైన అభ్యాసం,విమర్శనాత్మక ఆలోచన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వాస్తవ-ప్రపంచ అనుభవం కోసం సిద్ధం చేసే ఒక అండర్ గ్రాడ్యుయేట్ అభ్యాస వ్యవస్థను తయారు చేసినట్లు ఎన్ఎంఐఎంఎస్ తెలిపింది.
2026—27 విద్యా సంవత్సరానికి గానూ ఎన్ఎంఐఎంఎస్ ముంబై, నవి ముంబై, శిర్పూర్, బెంగళూరు, హైదరాబాదు, ఇండోర్, చండీఘడ్, అహ్మదాబాద్ లోని తమ ప్రాంగణాలలో అండర్ గ్రాడ్యుయేట్ అవకాశాలను అందిస్తోంది. ఎన్పిఏటి (కామర్స్), ఎన్సిఈటి (ఇంజనీరింగ్ & ఫార్మసీ), ఎన్ఎల్ఏటి (లా), ఎన్డిఏటి (డిజైన్), ఎంఎస్టి (మ్యాథమాటిక్స్, స్టాటిస్టిక్స్ & డేటా సైన్సెస్) సహా ఎంచుకున్న కోర్స్ ఆధారంగా వివిధ ప్రవేశ పరీక్షల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ రిజిస్ట్రేషన్లకు గడువు మే 26న ముగుస్తుంది.


