టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానున్న కేరళ క్రికెట్ లీగ్ (KCL 2026) మూడో సీజన్ నుంచి శాంసన్ వైదొలిగాడు. జూలై 11న జరగబోయే ప్లేయర్స్ వేలం కోసం కూడా అతడు తన కూఐడా పేరును నమోదు చేసుకోలేదు. ఈ విషయాన్ని కేసీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ నాజర్ మచాన్ ధ్రువీకరించారు.
వ్యక్తిగత కారణాల వల్ల సంజూ ఈ ఏడాది సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని మచాన్ స్పష్టం చేశారు. గత సీజన్‌లో శాంసన్ 'కొచ్చి బ్లూ టైగర్స్' ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. కేవలం మూడు మ్యాచ్‌లలోనే ఓ అద్భుత సెంచరీతో సహా మొత్తం 221 పరుగులు చేశాడు. అయితే ఈ ఏడాది సీజన్ వేలానికి ముందు అతడిని కొచ్చి విడుదల చేసింది.
దీంతో శాంసన్ వేలంలోకి వస్తాడని అంతా భావించారు. కానీ అతడు ఇప్పుడు పూర్తిగా తప్పుకొని షాకిచ్చాడు. కాగా సంజూ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమవుతున్నాడు. యూకే పర్యటనలో ఉన్న శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌లలో తీవ్ర నిరాశపరిచాడు. ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమైన సంజూ.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.
దీంతో తర్వాత రెండు మ్యాచ్‌లకు అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. అంతేకాకుండా జింబాబ్వేతో సిరీస్‌కు సంజూను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అతడి స్ధానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు అవకాశమిచ్చారు. అయితే మిగితా సీనియర్ బ్యాటర్లంతా ఉన్నప్పటికి ఒక్క శాంసన్‌నే జట్ట నుంచి తప్పించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
అతడిని కావాలనే పక్కన పెట్టారాని బీసీసీఐ సెలక్టర్లపై కొంతమంది విమర్శలు గుప్పించారు. కానీ గత 6 నెలలగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్నందునే సంజూకు విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడల (Asian Games 2026)కు ఎంపిక చేసిన భారత జట్టులో మాత్రం సంజూకు చోటు దక్కింది.


