హైదరాబాద్‌తో మ్యాచ్‌.. ఖమ్మంకు భారీ షాక్‌ | TG20 2026: Hyderabad E Champions vs Anvita Khammam Aces, Qualifier 1 Playing 11 Updates | Sakshi
Sakshi News home page

TG20: హైదరాబాద్‌తో మ్యాచ్‌.. ఖమ్మంకు భారీ షాక్‌

Jul 9 2026 7:26 PM | Updated on Jul 9 2026 8:06 PM

TG20 2026: Hyderabad E Champions vs Anvita Khammam Aces, Qualifier 1 Playing 11 Updates

తెలంగాణ టీ20 (TG20)-2026లో మరో హైవోల్టేజ్‌ పోరుకు తెరలేచింది. ఉప్పల్‌ వేదికగా క్వాలిఫయర్‌-1లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 

ఈ కీలక మ్యాచ్‌కు ఖమ్మం స్టార్‌ బ్యాటర్‌ హిమతేజ దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు అందుబాటులో లేనిట్లు తెలుస్తోంది. హిమతేజ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కీలక మ్యాచ్‌కు అతడు లేకపోవడం ఖమ్మంకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి.

అతడి స్ధానంలో పరాస్‌ రాజ్‌ తుది జట్టులోకి వచ్చారు. కాగా ఈ రెండు జట్లు లీగ్‌ స్టేజిలో టేబుల్‌ టాపర్స్‌గా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు ఫైనల్లో అడుగుపెట్టేందుకు మరో అవకాశముంటుంది. ఇందులో ఓడిపోయిన జట్టు క్వాలిఫయర్‌-2లో కరీంనగర్‌ డైమండ్స్‌తో తలపడనుంది.

తుది జట్లు
అన్విత ఖమ్మం ఏసెస్: వాఫీ డైమండ్ కచ్చి, జీఎస్‌కే రెడ్డి, పరాస్ రాజ్, మిక్కిల్ జైస్వాల్, ప్రతీక్ రెడ్డి(వికెట్‌ కీపర్‌), చామ వి మిలింద్(కెప్టెన్‌), సహేంద్ర మల్లు, షేక్ అజర్, విద్యానంద రెడ్డి, వేద్ రెడ్డి, హర్షిత్ సాయి వై

హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్: అభిరత్ రెడ్డి(కెప్టెన్‌), సాయి వికాస్ రెడ్డి, అన్విత్ రెడ్డి, గడుగు గణేష్, ప్రణవ్ వర్మ, వైష్ణవ్ రెడ్డి ఎ (వికెట్‌ కీపర్‌), అజయ్ దేవ్ గౌడ్, పి అరవింద్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement