breaking news
kerala cricket
-
టీ20ల్లో ప్రపంచ రికార్డు.. రెండు ఓవర్లలో 71 పరుగులు! వీడియో
కేరళ క్రికెట్ లీగ్ 2025లో పెను సంచలనం నమోదైంది. శనివారం త్రివేండ్రం రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కాలికట్ గ్లోబ్‌స్టార్స్ బ్యాటర్ సల్మాన్ నిజార్ విధ్వంసం సృష్టించాడు. నిజార్ కేవలం 26 బంతుల్లోనే 12 సిక్సర్లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తాను ఆడిన 26 బంతుల్లో అతను వరుసగా 1, 0, 1, 1, 6, 1, 0, 1, 1, 1, 2, 1, 1, 6, 6, 6, 6, 6, 1, 6, 2, 6, 6, 6, 6, 6 బాదాడు. నిజార్ 72 పరుగులు సిక్సర్ల ద్వారానే వచ్చాయి. తొలుత బ్యాటింగ్‌కు ఇబ్బంది పడ్డ నిజార్.. ఆఖరి రెండు ఓవర్లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బాసిల్ థంపి వేసిన 19వ ఓవర్లో తొలి ఐదు బంతుల్లో వరుసగా 6, 6, 6, 6, 6 కొట్టిన అతను చివరి బంతికి సింగిల్ తీసి మళ్లీ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. అభిజిత్ ప్రవీణ్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి సిక్స్ బాదగా, తర్వాతి బంతి వైడ్ అయింది. దాంతో అదనపు బంతికి 2 పరుగులు సాధించిన నిజార్...తర్వాతి ఐదు బంతుల్లో మళ్లీ వరుసగా 6, 6, 6, 6, 6 కొట్టి ముగించాడు. అతడి విధ్వంసం ఫలితంగా కాలికట్ జట్టు చివరి 12 బంతుల్లో 71 పరుగులు చేసింది. తద్వారా టీ20 క్రికెట్లో ఆఖరి రెండు ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా కాలికట్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. నిజార్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్ కంటే ముందు అల్లెప్పీ రిపిల్స్పై కేవలం 26 బంతుల్లో 44 పరుగులు చేశాడు.అంతేకాకుండా రంజీ ట్రోఫీ గత సీజన్లో కేరళ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. 86.71 యావరేజ్‌తో 607 పరుగులు నమోదు చేశాడు. ఈ క్రమంలో అతడిని ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్‌కు పిలిచింది. కానీ వేలంలో అతడిని సీఎస్కే కొనుగోలు చేయలేదు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. త్రివేండ్రం రాయల్స్‌పై 13 పరుగుల తేడాతో కాలికట్ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత కాలికట్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయింది.చదవండి: T20 WC 2026: టీమిండియా ఓపెనర్లుగా ఊహించని పేర్లు! -
పంజాబ్ కింగ్స్ ఆటగాడి విధ్వంసం.. 10 సిక్సర్లతో వీరంగం
కేరళ టీ20 లీగ్‌లో నిన్న (ఆగస్ట్ 24) రసవత్తర మ్యాచ్ జరిగింది. ఏరీస్ కొల్లమ్ సైలర్స్, కొచ్చి బ్లూ టైగర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు అసలుసిసలు టీ20 మజాను అందించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సైలర్స్ 236 పరుగుల భారీ స్కోర్ చేయగా.. టైగర్స్ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి అద్బుత విజయం సొంతం చేసుకుంది.టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ విధ్వంసకర శతకంతో (51 బంతుల్లో 121; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) టైగర్స్‌ను విజయతీరాలకు చేర్చగా.. ఆషిక్ అనే ఆటగాడు ఆఖరి బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించాడు.ఈ మ్యాచ్‌కు సంబంధించి అందరూ సంజూ శాంసన్, అషిక్ హీరోయిక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్‌మీడియా మొత్తం సంజూ నామస్మరణతో మార్మోగిపోతుంది.అయితే సంజూ విధ్వంసకర శతకం నీడలో కొల్లమ్ సైలర్స్ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ వికెట్‌కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ సుడిగాలి ఇన్నింగ్స్ మరుగున పడింది. ఈ మ్యాచ్‌లో కొల్లమ్ సైలర్స్ అంత భారీ స్కోర్ చేయడంలో విష్ణు వినోద్ కీలకపాత్రధారి.వినోద్ 41 బంతుల్లో 10 భారీ సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 94 పరుగులు చేశాడు. వినోద్ సిక్సర్ల సునామీ ధాటికి గ్రీన్ ఫీల్డ్ స్టేడియం తడిసి ముద్దైంది. వినోద్ 229.28 స్ట్రయిక్‌రేట్‌తో మెరుపులు మెరిపించాడు. శతకానికి మరో సిక్సర్ దూరంలో ఔటయ్యాడు.వినోద్‌కు అతని కెప్టెన్ సచిన్ బేబి కూడా జతకలిశాడు. సచిన్ బేబి కూడా ఇంచుమించు విష్ణు తరహాలోనే విధ్వంసం సృష్టించాడు. 44 బంతుల్లో 6 సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో 91 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్‌లో సైలర్స్ ఓడినా విష్ణు వినోద్ భారత టీ20 సారధి సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేశాడు. విష్ణు అచ్చం స్కై లాగే 360 డిగ్రీస్‌లో షాట్లు ఆడి అలరించాడు. గత ఐపీఎల్ సీజన్లో విష్ణును పంజాబ్ కింగ్స్ ఎంపిక చేసుకున్నప్పటీకీ అతనికి ఒక్క అవకాశం కూడా రాలేదు. విష్ణు 2017, 2023 ఐపీఎల్ సీజన్లలో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తరఫున అవకాశాలు దక్కించుకున్నా పెద్దగా రాణించలేకపోయాడు.తాజా ప్రదర్శనతో విష్ణు ఐపీఎల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యాడు. ఒకవేళ పంజాబ్ విష్ణును వేలానికి వదిలేస్తే అతడికి మంచి గిరాకీ ఉండవచ్చు. కొన్ని ఫ్రాంచైజీలు స్థానిక విధ్వంసకర వికెట్‌కీపర్ బ్యాటర్ కోసం అన్వేషిస్తున్నాయి. ఈ పాత్రకు విష్ణు లాంటి టాలెంటెడ్ బ్యాటర్ న్యాయం చేయవచ్చు. -
సంజూ శాంసన్ విధ్వంసం.. 16 బంతుల్లోనే! వీడియో వైరల్
ఆసియాకప్-2025కు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. కేరళ క్రికెట్ లీగ్(KCL)లో కొచ్చి బ్లూ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న శాంసన్.. ఆదివారం అరైస్ కొల్లాం సైలర్స్తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు.ఈ మ్యాచ్‌లో సంజూ కేవలం 42 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో ఈ కేరళ ఆటగాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. అతడి విధ్వంసం ధాటికి గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం బౌండరీలు చిన్నబోయాయి ఓపెనర్‌గా వచ్చిన శాంసన్ తొలి బంతి నుంచే ఎటాక్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలో శాంసన్ తన తొలి కేసీఎల్ హాఫ్ సెంచరీని కేవలం 16 బంతుల్లోనే అందుకున్నాడు. తద్వారా కేరళ క్రికెట్ లీగ్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా శాంసన్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు అబ్దుల్ బాజిత్ పేరిట ఉండేది. అతను 22 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. తాజా మ్యాచ్‌తో బాజిత్ను శాంసన్ అధిగమించాడు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న శాంసన్.. 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 121 పరుగులు చేశాడు.ఆఖరి బంతికి గెలిపించిన ఆషిక్..అయితే అప్పుడు వరకు దూకుడుగా ఆడిన శాంసన్‌ను కొల్లాం పేసర్ బిజు నారాయణన్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ స్వరూపామే మారిపోయింది. ఆఖరి ఓవర్లో కొచ్చి విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో కొచ్చి బ్యాటర్ ముహమ్మద్ ఆషిక్ అద్భుతం చేశాడు. తొలి రెండు బంతుల్లో సిక్స్, ఫోరు బాదడంతో గెలుపు సమీకరణం నాలుగు బంతుల్లో 7 పరుగులగా మారింది. అయితే తర్వాత రెండు బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి.దీంతో ఆఖరి రెండు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతికి ఎటువంటి పరుగు రాలేదు. ఈ క్రమంలో చివరి బంతికి ఆషిక్ సిక్స్ కొట్టి తన జట్టు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆషిక్ కేవలం 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 45 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.ఓపెనర్‌గా వస్తాడా?కాగా ఆసియాకప్‌కు శాంసన్ ఎంపికైనప్పటికి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే రెగ్యూలర్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తిరిగి టీ20 జట్టులోకి వచ్చాడు. దీంతో ఆసియాకప్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ, గిల్ ప్రారంభించే అవకాశముంది.అయితే టీ20ల్లో సంజూకు ఓపెనర్‌గా తప్ప మిడిలార్డర్లో అంత మంచి ట్రాక్ రికార్డు లేదు. దీంతో అతడి స్ధానంలో జితేష్ శర్మ వికెట్ కీపర్‌గా ఛాన్స్ లభించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కానీ ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ శాంసన్ అద్భుత శతకంలో సెలక్టర్లకు సవాలు విసిరాడు. -
Asia Cup 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ ఆడే జట్టులో ఎట్టకేలకు సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టుకు ఈ కేరళ స్టార్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక.. ఈ టోర్నీ ద్వారానే శుబ్‌మన్ గిల్ అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఫస్ట్ ఛాయిస్ అతడేఅంతేకాదు.. వైస్ కెప్టెన్ స్థాయిలో గిల్ (Shubman Gill) జట్టులోకి వచ్చాడు. అతడి గైర్హాజరీలో ఇన్నాళ్లూ ఓపెనర్‌గా ఉన్న సంజూ శాంసన్‌కు ఇది తలనొప్పిగా మారింది. మొదటి ప్రాధాన్య ఓపెనర్‌గా అభిషేక్ శర్మకు పెద్ద పీట వేస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ బహిరంగంగానే వెల్లడించాడు.అంతేకాదు.. గిల్, యశస్వి జైస్వాల్ లేరు కాబట్టే సంజూను ఓపెనర్‌గా పంపించామని అగార్కర్ స్పష్టం చేశాడు. దీనిని బట్టి కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే సంజూకు జట్టులో స్థానం ఇచ్చారన్నది సుస్పష్టం. కీపర్ కోటాలో జితేశ్ శర్మ కూడా ఉన్నందున సంజూ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.తుదిజట్టులో సంజూ ఉండకపోవచ్చుఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సంజూను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘శుబ్‌మన్ గిల్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అంతేకాదు.. అతడు ఇప్పుడు వైస్ కెప్టెన్ కూడా!.. కాబట్టి సంజూ శాంసన్ ప్లేస్ డేంజర్లో ఉన్నట్లే!గిల్‌ను ఓపెనర్‌గా పంపుతారు కాబట్టి సంజూకు భంగపాటు తప్పదు. ఒకవేళ.. సంజూ కోసం గిల్‌ను మూడో స్థానంలో పంపుతారా? అంటే అది కుదరని పని’’ అని అశూ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి తరుణంలో సంజూ చేసిన పని క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.సంజూ కీలక నిర్ణయంఆసియా కప్ సన్నాహకాల్లో భాగంగా సంజూ ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్ ఆడుతున్నాడు. ఈ టీ20 టోర్నీలో కొచ్చి బ్లూ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంజూ.. ఓపెనర్‌గా రావాల్సి ఉంది. అయితే, అదానీ త్రివేండ్రం రాయల్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో మాత్రం అతడు ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేందుకు సిద్ధపడ్డాడు.ఐదో స్థానంలో బ్యాటింగ్!ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టైగర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. రాయల్స్ జట్టును 97 పరుగులకే కట్టడి చేసింది. ఇక లక్ష్య ఛేదనలో 59 బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో టైగర్స్ జయభేరి మోగించింది. దీంతో సంజూ బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరమే లేకుండా పోయింది.ఏదేమైనా తన బ్యాటింగ్ స్థానాన్ని డిమోట్ చేసుకోవడం ద్వారా.. ఆసియా కప్ టోర్నీలో ఏ స్థానంలో వచ్చేందుకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు సంజూ మేనేజ్మెంట్కు సంకేతాలు ఇచ్చినట్లయింది. కాగా సెప్టెంబరు 9-28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది.చదవండి: నా బెస్ట్ కెప్టెన్ అతడే.. ధోనికి కూడా అంత సులువుగా ఏదీ రాలేదు: ద్రవిడ్ -
బిగ్ ట్విస్ట్: అన్న కెప్టెన్సీలో సంజూ శాంసన్ అరంగేట్రం?
కేరళ క్రికెట్ లీగ్ (KCL) 2025 సీజన్లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆడనున్న సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన వేలంలో శాంసన్‌ను కొచ్చి బ్లూ టైగర్స్ రూ. 26.80 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో కొచ్చి బ్లూ టైగర్స్ కెప్టెన్‌గా సంజూ ఎంపిక అవుతాడని అంతా భావించారు.కానీ ఆఖరి నిమిషంలో కొచ్చి ఫ్రాంచైజీ అందరికి షాకిచ్చింది. సంజూను కాదని అతడి అన్నయ్య సాలీ శాంసన్‌ను తమ జట్టు కెప్టెన్‌గా కొచ్చి బ్లూ టైగర్స్ ఫ్రాంచైజీ నియమించింది. తన అన్నయ్యకు డిప్యూటీగా శాంసన్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కొచ్చి ఫ్రాంచైజీ వెల్లడించింది. కాగా కేసీఎల్ వేలంలో సాలీ శాంసన్‌ను రూ.75,000 వేలలకు కొచ్చి కొనుగోలు చేసింది. 34 ఏళ్ల సాలీ శాంసన్ తన కెరీర్ ఆరంభం నుంచి గాయాలతో సతమతమవుతూ వస్తున్నాడు. గత నాలుగేళ్లగా అతడు కేరళ జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ క్లబ్ క్రికెట్లో మాత్రం ఆడుతూ వస్తున్నాడు.కేరళ తరపున ఇప్పటివరకు 6 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. అతడికి బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. క్లబ్ క్రికెట్లో శాంసన్ కెప్టెన్సీ అనుభవం ఉంది. ఈ క్రమంలోనే అతడి కెప్టెన్సీ స్కిల్స్‌పై నమ్మకంతో కొచ్చి తమ జట్టు పగ్గాలను అప్పగించింది. ఇక కేసీఎల్ తొట్టతొలి సీజన్(2024)లో కొచ్చి బ్లూ టైగర్స్ తీవ్ర నిరాశపరిచింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో బ్లూ టైగర్స్ నిలిచింది. ఇప్పుడు సంజూ శాంసన్ రాకతో ఎలాగైనా ఈ ఏడాది ఛాంపియన్‌గా నిలవాలని కొచ్చి బ్లూ టైగర్స్ ఉవ్విళ్లూరుతోంది. కాగా కేరళ క్రికెట్ లీగ్‌లో సంజూ ఆడడం ఇదే తొలిసారి. అన్నయ్య కెప్టెన్సీలో శాంసన్ అరంగేట్రం చేయనున్నాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సీజన్‌కు ముందు సీఎస్కేకు ట్రేడ్ అవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చదవండి: అతడి ఆటిట్యూడ్ వల్లే టీమిండియా ఓడిపోయింది: మహ్మద్ కైఫ్ -
వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(Sanju Samson) తొలిసారి కేరళ క్రికెట్ లీగ్ (KCL)లో ఆడనున్నాడు. శనివారం తిరువనంతపురంలో జరిగిన కేసీఎల్ సీజన్-2 ఆటగాళ్ల వేలంలో శాంసన్‌ను కొచ్చి బ్లూ టైగర్స్ రూ. 26.80 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది.తద్వారా కేరళ క్రికెట్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ నిలిచాడు. అతడి కోసం కొచ్చి ఫ్రాంచైజీ తమ పర్స్‌లో ఉన్న సగానికిపైగా మొత్తాన్ని వెచ్చింది. తొలుత శాంసన్ బిడ్డింగ్ పోరు రూ.5 లక్షలతో ప్రారంభమైంది. త్రిస్సూర్ టైటాన్స్ ఒక్కసారిగా రూ.20 లక్షలకు బిడ్‌ను పెంచింది.అయితే ఆఖరికి కొచ్చి 26.80 లక్షలు వెచ్చించి అతడిని కైవసం చేసుకుంది. వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలకు కేసీఎల్ మెనెజ్‌మెంట్ రూ. 50 లక్షలు కేటాయించింది. ఇప్పుడు సంజూ శాంసన్‌పైనే 26.80 లక్షలు వెచ్చించడంతో కొచ్చి వద్ద రూ. 23.2 లక్షలే మిగిలియాయి. దీంతో వేలంలో మిగితా స్టార్ ప్లేయర్లను సొంతం చేసుకోవడం కొచ్చి కష్టం కావచ్చు.ఈ వేలం ముందువరకు కెసీఎల్లో అత్యధిక ధర కలిగిన రికార్డు ఎం. సజీవన్ పేరిట ఉండేది. తొలి ఎడిషన్‌లో సజీవన్‌ను త్రివేండ్రం రాయల్స్ రూ.7.4 లక్షలకు సొంతం చేసుకుంది. ఇప్పుడు సంజూ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.ఈ ఏడాది వేలంలో సంజూ కంటే ముందు బాసిల్ తంపిని రూ.8.4 లక్షలకు తివేండ్రం రాయల్స్ సొంతం చేసుకుంది. సంజూ ప్రస్తుతం భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ మధ్యలో టీ20 సిరీస్‌లు లేకపోవడంతో కెసీఎల్ టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండనున్నాడు. కెసీఎల్ సీజన్-2 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరగనుంది.చదవండి: IND vs ENG: రివ్యూ తీసుకున్న జైశ్వాల్.. అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన స్టోక్స్! వీడియో -
దానిశ్ ధమాకా.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన విదర్భ
నాగ్‌పూర్ వేదికగా కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన విదర్బ తమ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది. 254/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆరంభించిన విదర్బ.. అదనంగా 123 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. విదర్బ బ్యాటర్లలో యువ ఆటగాడు దానిశ్ మాలేవర్ (259 బంతుల్లో 153; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. కాగా ఆరంభంలో కేరళ బౌలర్ల విజృంభణతో 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (188 బంతుల్లో 86; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి దానిశ్ ఆదుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 414 బంతుల్లో 215 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత కరుణ్ నాయర్ లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. వీరిద్దరితో పాటు ఆఖరిలో నచికేత్ భూతే 32 పరుగులతో రాణించాడు.మూడేసిన ఈడెన్, నిధీష్..మొదటిసారి రంజీ ఫైనల్ ఆడుతున్న కేరళ జట్టు... ఆరంభంలోనే మ్యాచ్‌పై పట్టు సాధించినా, దాన్ని చివరివరకు కొనసాగించలేకపోయింది. మొదటి రోజు ఉదయం పచ్చికతో కూడిన పిచ్‌పై విజృంభించిన కేరళ బౌలర్లు బంతి పాతబడ్డ అనంతరం అదే జోరును కంటిన్యూ చేయలేకపోయారు. కేరళ బౌలర్లలో ఈడెన్ ఆపిల్ టామ్, నిధీష్ తలా మూడు వికెట్లు సాధించగా..బసిల్ రెండు, సక్సేనా తలా వికెట్ సాధించారు.చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు -
చరిత్ర సృష్టించనున్న కేరళ.. 91 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి..!
కేరళ క్రికెట్ జట్టు (Kerala Cricket Team) చరిత్ర సృష్టించనుంది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ (Ranji Trophy) చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించనుంది. గుజరాత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో కేరళ 2 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. తద్వారా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేయగా.. గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆట చివరి రోజు కొనసాగుతుంది. కేరళ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యం. రంజీ రూల్స్ ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టు విజేత నిలుస్తుంది. తద్వారా కేరళ ఫైనల్‌కు చేరుతుంది.దీనికి ముందు కేరళ కార్టర్ ఫైనల్లోనూ ఇలాగే స్వల్ప ఆధిక్యం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో కేరళ.. జమ్మూ అండ్ కశ్మీర్‌పై ఒక్క పరుగు లీడ్ సాధించింది. ఫలితంగా సెమీస్‌కు అర్హత సాధించింది.1957-58 సీజన్లో తొలిసారి రంజీ బరిలోకి దిగిన కేరళ.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేదు. 2018-19 సీజన్లో సెమీస్‌కు చేరినా.. తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. 1957/58కి ముందు కేరళ ట్రావన్‌కోర్-కొచ్చిన్ టీమ్‌గా రంజీల్లో ఆడింది.మ్యాచ్ విషయానికొస్తే.. వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ అజహరుద్దీన్ భారీ సెంచరీతో (177 నాటౌట్) కదంతొక్కడంతో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69), సల్మాన్ నిజర్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సగస్వల్లా 3, చింతన్ గజా 2, పి జడేజా, రవి బిష్ణోయ్, విశాల్ జేస్వాల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ప్రియాంక్ పంచల్ (148) సెంచరీతో కదంతొక్కడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్ (73), జయ్‌మీత్ పటేల్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో సర్వటే, జలజ్ సక్సేనా తలో 4 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు సైతం బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు రెండు పరుగుల దూరంలో నిలిచిపోయారు. చివరి రోజు లంచ్ సమయానికి కేరళ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహన్ కన్నుమ్మల్ (15), అక్షయ్ చంద్రన్ (9) క్రీజ్‌లో ఉన్నారు.విదర్భతో జరుగుతున్న మరో సెమీఫైనల్లో ముంబై ఓటమి అంచుల్లో నిలిచింది. 406 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే మరో 226 పరుగులు సాధించాలి. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరడంతో ఈ మ్యాచ్‌లో ముంబై గెలవడం అసాధ్యం. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విదర్భ ఫైనల్‌కు చేరుతుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేయగా.. ముంబై 270 పరుగులకే పరిమితమైంది. కాగా, గత సీజన్ ఫైనల్లో ముంబై.. విదర్భను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. -
Ranji Trophy: కేరళ కెప్టెన్ సంజూ కాదు!.. కారణం ఇదే!
టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ రంజీ బరిలో దిగనున్నాడు. సొంత రాష్ట్రం కేరళ తరఫున రెడ్‌బాల్ టోర్నీలో పాల్గొననున్నాడు. అయితే, ఈసారి కెప్టెన్‌గా గాకుండా కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గానే ఆడనున్నాడు. ఇందుకు కారణం ఏమిటంటే..?టెస్టుల్లో అరంగేట్రం చేయాలని ఉందని సంజూ శాంసన్ ఇటీవల తన మనసులోని మాట వెల్లడించిన విషయం తెలిసిందే. మేనేజ్మెంట్ సైతం ఇందుకు సుముఖంగా ఉందని పరోక్షంగా తెలిపాడు. యాజమాన్యం సూచనల మేరకే తాను దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగానన్నాడు సంజూ.ఇక ఆ టోర్నీలో విధ్వంసకర శతకంతో ఆకట్టుకున్న సంజూ శాంసన్.. తదుపరి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియాతో చేరాడు. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్ మూడో మ్యాచ్‌లో సెంచరీతో దుమ్ములేపాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి టీమిండియా 3-0తో బంగ్లాను క్లీన్‌స్వీప్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.కారణం ఇదేఈ నేపథ్యంలో ఇటీవల ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. తాను త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేస్తాననే సంకేతాలు ఇచ్చాడు. ఇందుకు రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో అతడు రాణించాల్సి ఉంది. అయితే, గత ఎడిషన్‌లో కేరళ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ ఈసారి.. సారథ్య బాధ్యతలకు దూరమయ్యాడు. టీమిండియా నవంబరులో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుండటమే ఇందుకు కారణం.రంజీ తాజా ఎడిషన్‌లో సచిన్ బేబీ సారథ్యంలో కేరళ తొలుత పంజాబ్‌తో మ్యాచ్ ఆడి.. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తదుపరి శుక్రవారం నుంచి కర్ణాటకతో తలపడేందుకు సిద్ధం కాగా.. అవుట్‌ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా టాస్ ఆలస్యమైంది. ఇదిలా ఉంటే.. టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్ కారణంగా సంజూ కొన్ని రంజీ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.ముఖ్యంగా ఉత్తరప్రదేశ్(నవంబరు 6-9), హర్యానా(నవంబరు 13- 16)తో కేరళ ఆడే మ్యాచ్‌లకు సంజూ అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ సమయంలో (నవంబరు 8 నుంచి) టీమిండియా టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికాకు వెళ్లనుంది. అందుకే సంజూ కేరళ జట్టు కెప్టెన్సీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IND Vs NZ 1st Test: పాపం రోహిత్ శర్మ!.. ఆనందం ఆవిరి.. అన్‌లక్కీ భయ్యా! -
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలనుకున్న కేరళ స్పిన్నర్ ఆశా శోభన కల ఎట్టకేలకు నేరవేరింది. సోమవారం సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలలతో జరుగుతున్న నాలుగో టీ20లో ఆశా శోభనా టీమిండియా తరపున అరంగేట్రం చేసింది. భారత బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీదగా శోభన టీమిండియా క్యాప్ అందుకుంది. కాగా ఆశా శోభన 33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఆశా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎవరీ ఆశా శోభన?ఆశా శోభన దేశీవాళీ క్రికెట్లో కేరళ సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌ను ఆదర్శంగా తీసుకుని ఆశా శోభన క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. 13 ఏళ్ల వయస్సులోనే ఆశా క్రికెట్ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత కేరళ జట్టు తరపున అద్బుతంగా రాణించడంతో భారత-ఏ జట్టులో ఆమెకు చోటు దక్కింది. కానీ సీనియర్ జట్టులో మాత్రం చోటు దక్కించుకలేకపోయింది. అయితే డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు ఆమెను సొంతం చేసుకుంది. తొలి సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆశా.. డబ్ల్యూపీఎల్-2024 సీజన్లో మాత్రం దుమ్ములేపింది. 10 మ్యాచ్‌ల్లో 7.11 ఏకానమితో 12 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఈ క్రమంలో భారత సెలక్టర్లు నుంచి ఆశాకు పిలుపు వచ్చింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వివాదాస్పద బౌలర్
Sreesanth Announces Retirement: టీమిండియా వివాదాస్పద బౌలర్, కేరళ క్రికెటర్ శాంతకుమరన్ నాయర్ శ్రీశాంత్ (39) క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటించాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమని, ఆ స్థాయికి చేరేందుకు సహకరించిన కుటుంబ సభ్యులకు, జట్టు సహచరులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలంటూ తన ట్వీట్లో పేర్కొన్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని చాలా బాధతో, బరువెక్కిన హృదయంతో ప్రకటిస్తున్నానని తెలిపాడు. యువతరానికి అవకాశం ఇచ్చేందుకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని వెల్లడించాడు. It has been an honor to represent my family, my teammates and the people of India. Nd everyone who loves the game . With much sadness but without regret, I say this with a heavy heart: I am retiring from the Indian domestic (first class and all formats )cricket , — Sreesanth (@sreesanth36) March 9, 2022 For the next generation of cricketers..I have chosen to end my first class cricket career. This decision is mine alone, and although I know this will not bring me happiness, it is the right and honorable action to take at this time in my life. I ve cherished every moment .❤️🏏🇮🇳 — Sreesanth (@sreesanth36) March 9, 2022 క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సరైన సమయమిదేనని అభిప్రాయపడ్డాడు. బాగా ఆలోచించే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇది తన వ్యక్తిగతమని చెప్పుకొచ్చాడు. టీమిండియా తరఫున 27 టెస్ట్‌లు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడిన శ్రీశాంత్ మొత్తం 169 వికెట్లు(87 టెస్ట్ వికెట్లు, 75 వన్డే, 7 టీ20 వికెట్లు) పడగొట్టాడు. ఈ వెటరన్ పేసర్ ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నప్పటికీ ఏ జట్టు అతనిపై ఆసక్తి కనబర్చకపోవడంతో అమ్ముడుపోని క్రికెటర్ల జాబితాలో మిగిలిపోయాడు. శ్రీశాంత్ 50 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో మెగా వేలంలో పేరును నమోదు చేసుకున్నాడు. చదవండి: చెన్నై సూపర్ కింగ్స్‌లోకి శ్రీశాంత్...! -
నాలుగో రోజూ ఆట రద్దు
కొచ్చి: సౌత్, నార్త్ జోన్ల మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను వర్షం వెంటాడుతూనే ఉంది. నాలుగో రోజు ఆట కూడా రద్దయ్యింది. భారీ వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో ఆదివారం ఒక్క బంతి కూడా సాధ్యపడలేదు. ఉదయం మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు సంజయ్ హజారే, సురేశ్ శాస్త్రిలు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే రిజర్వ్ డే (మంగళవారం)ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. దీంతో 15 నిమిషాలు ముందుగా మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి, మూడో రోజు ఆట కూడా రద్దు కావడంతో మొత్తం 350 ఓవర్ల మ్యాచ్ నష్టపోయింది. మరోవైపు వరుసగా ఆట రద్దు కావడంపై కేంద్ర మంత్రి శశి థరూర్.. కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ)పై ధ్వజమెత్తారు. ‘రాష్ట్ర ప్రతిష్టకు కేసీఏ మచ్చ తెస్తోంది. రెండు మేజర్ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యాయి. డ్రైనేజి సిస్టమ్ కోసం ఖర్చు చేసిన రూ. 8 కోట్లు ఎవరికి లబ్ధి చేకూర్చాయి. జేఎన్ఐ స్టేడియం, డ్రైనేజీ అధునీకరణ కోసం కోట్లు ఖర్చు చేశామని వార్షిక నివేదికలో పొందుపర్చారు. పెవిలియన్ పనులు చేసినప్పుడు అందులో డ్రైనేజీ ముఖ్యం కాదా? ఈ విషయాన్ని అభిమానులు అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని థరూర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.