సంజూ శాంసన్‌కు భారీ షాక్‌..! జ‌ట్టు నుంచి రిలీజ్? | Sanju Samson released as Kerala Cricket League teams name retentions before KCL Auction | Sakshi
Sakshi News home page

KCL 2026: సంజూ శాంసన్‌కు భారీ షాక్‌..! జ‌ట్టు నుంచి రిలీజ్?

Jul 2 2026 7:45 PM | Updated on Jul 2 2026 9:50 PM

Sanju Samson released as Kerala Cricket League teams name retentions before KCL Auction

కేరళ క్రికెట్ లీగ్ (KCL)-2026 సీజన్ ముందు మొత్తం ఆరు ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆట‌గాళ్ల జాబితాను విడుదల చేశాయి. అయితే టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను 'కొచ్చి బ్లూ టైగర్స్' ఫ్రాంచైజీ వేలంలోకి విడిచిపెట్టి అందరిని షాక్‌కు గురిచేసింది. గ‌త సీజ‌న్‌లో కొచ్చి త‌ర‌పున 6 మ్యాచ్‌లు ఆడిన 186.80 స్ట్రైక్ రేటుతో 368 ప‌రుగులు చేశాడు.

అయిన‌ప్ప‌టికి అత‌డిని రిటైన్ చేసుకోలేదు. అత‌డి అందుబాటుపై స్ప‌ష్ట‌త లేకపోవ‌డంతో కొచ్చి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కేసీఎల్ మూడో సీజ‌న్ ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 5 వరకు జరగనుంది. ఈ సమయంలో భారత జట్టుకు ఎలాంటి టీ20 మ్యాచ్‌లు లేవు. సంజూ ప్ర‌స్తుతం కేవ‌లం టీ20 ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నందున, అతడు కేసీఎల్ వేలంలో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అంతేకాకుండా గత సీజన్‌లో శాంసన్‌ను రూ. 26.80 లక్షలకు కొచ్చి కొనుగోలు చేసింది. కొచ్చి త‌మ వేలం  బడ్జెట్ (రూ. 50 లక్షలు)లో స‌గానికిపైగా సంజూ కోస‌మే ఖ‌ర్చు చేసింది. దీంతో  కొచ్చి జట్టు తమ బడ్జెట్‌లో 50 శాతానికి పైగా మొత్తాన్ని ఆదా చేసిన‌ట్లైంది. అతడిని రిలీజ్ చేయడానికి ఇదొక కారణం కూడా కావచ్చు. సంజూతో పాటు కేరళ మాజీ కెప్టెన్ సచిన్ బేబీని కూడా ఫ్రాంచైజీ విడుదల చేసింది.

మరో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌-2026 నుంచి తప్పుకొన్నాడు. శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కారణంగా పంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
చదవండి: IND vs SL: విఫ‌ల‌మైన భార‌త బౌల‌ర్లు.. భారీ స్కోర్ దిశ‌గా శ్రీలంక‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement