నెయిల్‌ ఆర్టిస్ట్‌గా నెలకు రూ. 10 లక్షలు..! కట్‌చేస్తే కొద్ది నెలల్లోనే.. | 32 year old Dubai nail artist earns over Rs 10 lakh | Sakshi
Sakshi News home page

నెయిల్‌ ఆర్టిస్ట్‌గా నెలకు రూ. 10 లక్షలు..! కట్‌చేస్తే కొద్ది నెలల్లోనే..

Jun 29 2026 11:03 AM | Updated on Jun 29 2026 4:13 PM

32 year old Dubai nail artist earns over Rs 10 lakh

ఏ వ్యక్తి కెరీర్‌ అయినా.. చిన్న ఉద్యోగిగా మొదలవ్వుతుంది. కానీ కొందరే ఉన్నత స్థాయికి చేరేలా కష్టపడతారు, విజయం సాధిస్తారు. మరికొందరు అక్కడితే ఆగిపోతే.. కొందరు ఇంకో అడుగు ముందుకేసి..పదవీ విరమణ జీవితాన్ని కూడా అందంగా ప్లాన్‌ చేసే పనిలో ఉంటారు. ఇక్కడ ఈ మహిళ కూడా అలానే చేస్తోంది. ఆ విషయాన్నే ఆమె సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. అంతేగాదు నచ్చినట్లు మన తలరాతను మనమే రాయాలి అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఎవరామె అంటే..

వియత్నాంకు చెందిన 32 ఏళ్ల న్గుయెన్ ఫుయోంగ్ అన్హికి అపారమైన నెయిల్‌ ఆర్ట్‌ నైపుణ్యం ఉంది ఆ నేపథ్యంలోనే ఆరేళ్ల క్రితం దుబాయ్‌కి వచ్చి..నెయిల్ టెక్నీషియన్‌గా పనిచేశారు. ఆమె పువ్వులు, జంతువులు, చార్మ్స్‌ వంటి త్రీడీ నెయిల్‌ డిజైన్లలో మంచి నైపుణ్యం గల మహిళ. మొదట రూ. 89 వేలకు చిన్న సెలూన్‌లో రెండేళ్లు కాంట్రాక్ట్‌పై పనిచేసింది. 

ఆ తర్వాతర ఫ్రీలాన్సర్‌గా మారిది. ఆమె క్లయింట్లలో యువతలే ఉండేవారు. ఆమె ధరలను అందుబాటులో ఉంచుతూనే క్లిష్టమైన డిజైన్లపై దృష్టి సారించింది. దాంతో ఆమె ఆదాయం ఏకంగా నెలకు రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలు సంపాదించే రేంజ్‌కు చేరింది. ఆ తర్వాత 2026లో, ఫుల్లా అన్ని ప్రాథమిక సౌకర్యాలతో 'బ్యూటీ బై ఫుల్లా'అనే సెలూన్‌ను ప్రారంభించింది. 

ఆ తర్వాత నుంచి జీతం తీసుకోకుండా సంపాదించిన మొత్తం తిరిగి వ్యాపారంలోనే పెట్టుబడి పెడుతూ లాభాల బాట పట్టించింది. అందేగాదు ఇతరులకు ఉపాధి కల్పిస్తూ..మునుపటి ఆదాయాన్ని పెంచుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. తన ఖర్చులను తగ్గించుకుంటూ తన వ్యాపార విజయం కోసం ఆహర్నిశలు కష్టపడేది. నెల ఖర్చులు లక్షలోపే ఉండేలా చూసుకుంటూ..కొత సొమ్ముని వియత్నాంకు పంపించి..అక్కడ రెండిళ్లు కొనుగోలు చేసింది. 

మిగిలిన మొత్తం తన సెలూన్‌ మెయింటైనింగ్‌ ఖర్చుపెడుతుంది. తాను ఈ పనిని  2012 నుంచి చేస్తున్నానని, అలాగే తన సెలూన్‌ వ్యాపారాన్ని విస్తరించేలా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్లు తెలిపింది. తద్వారా 20 ఏళ్లలోనే రిటైర్మెంట్‌ తీసుకునేలా ప్లాన్‌ చేసుకుంటున్నట్లు వెల్లడించింది. తన 50 ఏళ్ల ప్రారంభంలోనే పదవీ విరమణ చేయడానికి సరిపడా నిష్క్రియాత్మక ఆదాయాన్ని సంపాదించాలని చూస్తున్నట్లు పేర్కొంది. 

తన సెలూన్‌ బ్రాంచ్‌లు కేవలం దుబాయ్‌లోనే కాకుండా అబుదాబి లేదా ఫుజారా వంటి ఇతర ఎమిరేట్స్‌లో కూడా ఐదు బ్రాంచ్‌లు పెట్టేలా పెట్టుబడు పెట్టాలని చూస్తున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత కొంత పొలం కొనుగోలు చేసి..తన శేష జీవితాన్ని వ్యవసాయం చేస్తూ గడపాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. 

ఈమె కథ..మన నైపుణ్యానికి పదును పెట్టి..అనతి కాలంలోనే వ్యాపారంగా మార్చుకోవడం..దాన్ని అంచెలంచెలుగా విస్తరించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని, తద్వారా భవిష్యత్తు ప్రణాళికకు అనుగుణంగా చీకు చింత లేని వృద్ధాప్య జీవితాన్ని గడిపేలా ఎలా ప్లాన్‌ చేసుకోవాలో చెబుతోంది. అలాగే సక్సెస్‌ అంటే పులిస్టాప్‌ కాదు..కామ అని తన సక్సెస్‌తో నిరూపించింది. !.

(చదవండి: బస్‌స్టాపే పాఠశాలగా..! జస్ట్‌ నాలుగు గోడల మధ్యే కాదు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement