విఫ‌ల‌మైన భార‌త బౌల‌ర్లు.. భారీ స్కోర్ దిశ‌గా శ్రీలంక‌ | IND A bowlers struggle against SL A on lifeless Galle wicket | Sakshi
Sakshi News home page

IND vs SL: విఫ‌ల‌మైన భార‌త బౌల‌ర్లు.. భారీ స్కోర్ దిశ‌గా శ్రీలంక‌

Jul 2 2026 7:00 PM | Updated on Jul 2 2026 8:17 PM

IND A bowlers struggle against SL A on lifeless Galle wicket

గాలే వేదికగా శ్రీలంక-ఎతో జరుగుతున్న రెండో అనాధికర టెస్ట్ తొలి రోజులో భారత-ఎ బౌలర్లు విఫలమయ్యారు. గాలే వంటి ఫ్లాట్ వికెట్‌పై బౌలింగ్ చేయడం ఇండియా పేసర్లకు కఠిన సవాల్‌గా మారింది. తొలి అనాధికరిక టెస్ట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన జమ్మూ కాశ్మీర్ పేసర్ అకిబ్ నబీ సైతం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

అతడు తీవ్రంగా శ్రమించినప్పటికి తొలి రోజు ఆటలో కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. 

లంక బ్యాటర్లలో సహన్ అరచ్చిగే(83 నాటౌట్‌) క్రీజులో ఉండగా.. అంజల బండార(42), నువనిదు ఫెర్నాండో(44) రాణించారు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, సారాన్ష్ జైన్ తలా 2 వికెట్లు పడగొట్టగా.. గుర్నూర్ బ్రార్ ఓ వికెట్ సాధించాడు.

తుది జట్లు
శ్రీలంక-ఎ: పవంత వీరసింగ్, సోహన్ డి లివెరా, నువానీదు ఫెర్నాండో, అషెన్ బండార, సహన్ అరాచ్చిగే(కెప్టెన్‌), అంజల బండార(వికెట్ కీపర్‌), చమిక గుణశేఖర, దిలుమ్ సుదీర, కేశర నువంత, దులజ్ సముదిత, అసంక మనోజ్

ఇండియా-ఎ: సాయి సుదర్శన్, అమన్ మొఖడే, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్‌), షేక్ రషీద్, సరాంశ్ జైన్, జీషన్ అన్సారీ, ఔకిబ్ నబీ దార్, యశ్ ఠాకూర్, గుర్నూర్ బ్రార్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement