కరూర్‌ ఘటన.. విజయ్‌ కీలక నిర్ణయం | Tamil Nadu CM Vijay To Visit Karur Stampede Victims In Second Week Of July, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

కరూర్‌ ఘటన.. విజయ్‌ కీలక నిర్ణయం

Jun 29 2026 1:07 PM | Updated on Jun 29 2026 1:59 PM

Tamil nadu CM Vijay Will Karur Incident Victims

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరూర్‌ తొక్కిసలాట బాధితులను కలిసేందుకు ముఖ్యమంత్రి విజయ్‌ సిద్దమయ్యారు. ఇందులో భాగంగా విజయ్‌ ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. జూలై రెండో సీఎం విజయ్‌.. కరూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బాధితులను కలిసి మాట్లాడనున్నారు. కాగా, ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కూడా విజయ్‌.. కరూర్‌ ఘటనను గుర్తు చేసుకున్నారు. 

కాగా, తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ ఇటీవల జరిగిన ప్రసంగంలో కరూర్ తొక్కిసలాట ఘటనను ప్రస్తావించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ ఘటన 2025 సెప్టెంబర్‌లో కరూర్‌లో జరిగిన టీవీకే సభ సందర్భంగా చోటుచేసుకుంది. నాడు సభ కోసం భారీ సంఖ్యలో ప్రజలు ఒక్కసారిగా వేదిక వైపు దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారు. విచారణలో సభా నిర్వహణలో లోపాలు, జనసమూహ నియంత్రణలో వైఫల్యాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్‌ను కూడా సీబీఐ విచారించింది. ఇటీవల అసెంబ్లీలో ఆయన ఈ విషాదాన్ని ప్రస్తావిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతాయని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement