ఢిల్లీ భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 14న(శుక్రవారం) సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, దేశ భద్రత, ఐక్యత, మరియు ప్రగతికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆమె తన సందేశంలో పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ‘ వికసిత్ భారత్ కోసం అందరూ కృషి చేయాలి. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి.
అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికీ అందించాలి. వందేమాతరం గీతాన్ని మనం గౌరవించాలి. యువత తమ స్పప్నాలను సాకారం చేసుకోవాలి. న్యాయవ్యవస్థ, చట్ట సభలను గౌరవించాలి. ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 కోట్ల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. కిసాన్ సమ్మాన్‌తో వ్యవసాయం, అనుబంధాల రంగాల బలోపేతం’ అని తన సందేశంలో పేర్కొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.


