ఆగస్టు 15.. ఢిల్లీలో హైఅలర్ట్‌ | High Alert in Delhi for 80th Independence Day; Red Fort Security Beefed Up | Sakshi
Sakshi News home page

ఆగస్టు 15.. ఢిల్లీలో హైఅలర్ట్‌

Aug 14 2026 11:10 AM | Updated on Aug 14 2026 11:22 AM

High alert in Delhi ahead of Independence Day

సాక్షి, ఢిల్లీ: రేపు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట చుట్టూ బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎర్రకోట చూట్టూ వెయ్యి కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోకి వచ్చే వాహనాలన్నిటినీ తనిఖీ చేపడుతున్నారు.

భారత్ రేపు తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రేపు ఆగస్టు 15 సందర్భంగా ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేస్తారు. మన జాతీయ గేయం 'వందేమాతరం' రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర్య దినోత్సవ చరిత్రలోనే మొదటిసారిగా ఎర్రకోటపై  వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నారు.

ఎర్రకోట నుండి ప్రధాని చేసే ప్రసంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత 'భాషిణి' అనువాదకం ద్వారా దేశంలోని 22 అధికారిక భాషల్లోకి ఒకే సమయంలో అనువదించి ప్రసారం చేస్తారు. దీనివల్ల ఎవరి మాతృభాషలో వారు ప్రసంగాన్ని స్పష్టంగా వినవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement