breaking news
independence day
-
న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)
-
బెర్లిన్‌లో ఘనంగా భారత్ దివస్ వేడుకలు
బెర్లిన్: జర్మనీలోని భారతీయ ప్రవాసులు ఆగస్టు 16న బెర్లిన్‌లోని చారిత్రక బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద భారత్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్మనీ నలుమూలల నుంచి భారతీయ సంఘాలు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భారతదేశ ఐక్యత, వైవిధ్యం, గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. తెలంగాణ అసోసియేషన్ చైర్పర్సన్, వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘు చెల్లిగంటి, యూపీ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్ అఖిల్ అగర్వాల్, కాశ్మీరీ సమాజానికి ప్రాతినిధ్యం వహించిన వీణా చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జర్మనీలోని పలు భారతీయ సంఘాలు, కమ్యూనిటీ సంస్థలు చురుకైన సహకారం అందించాయి.ఈ వేడుకలకు జర్మనీలో భారత రాయబారి అజిత్ గుప్తా తన సతీమణితో కలిసి హాజరయ్యారు. భారత రాయబార కార్యాలయానికి చెందిన కాన్సులర్ మంత్రి స్టాలిన్ బాబు చీకట్ల, పర్సనల్ మంత్రి డాక్టర్ మందీప్ సింగ్ తులితో పాటు పలువురు ప్రముఖ అధికారులు, అతిథులు పాల్గొన్నారు.బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద వందలాది మంది భారతీయ ప్రవాసులు ఒకచోట చేరడంతో దేశభక్తి, ఐక్యత, సోదరభావంతో కూడిన ప్రత్యేక వాతావరణం నెలకొంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశంలోని భిన్నత్వాన్ని చాటుతూ, అందరినీ త్రివర్ణ పతాకం కింద ఒక్కతాటిపైకి తీసుకువచ్చాయి.అనంతరం బ్రాండెన్‌బర్గ్ గేట్ నుంచి శాంతి స్తూపం వరకు యూనిటీ వాక్ నిర్వహించారు. శాంతి, స్నేహం, ఐక్యత, పరస్పర సహకారం అనే సందేశాన్ని ఈ వాక్ ద్వారా చాటారు.జర్మనీలోని భారతీయ సమాజానికి ఈ వేడుక ఒక గర్వించదగిన, చిరస్మరణీయమైన సందర్భంగా నిలిచింది. భారతదేశం పట్ల తమ అనుబంధాన్ని, ఉమ్మడి వారసత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తిని ప్రవాస భారతీయులు ఘనంగా చాటుకున్నారు.చదవండి: సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం -
పాక్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత దేశభక్తి పాట.. రఫ్ఫాడిస్తున్న నెటిజన్లు!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆ దేశ నటీమణులు చేసిన ఒక పొరపాటు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆగస్టు 14న పాకిస్థాన్ యౌమ్-ఏ-ఆజాదీ (స్వాతంత్ర్య దినోత్సవం) వేడుకలను పురస్కరించుకుని కొందరు పాకిస్థానీ ప్రముఖులు, నటీమణులు ఒక వీడియోను షేర్ చేశారు. అయితే, ఆ వీడియోలో వారు తమ దేశ జెండాలతో సంబరాలు చేసుకుంటూ, బ్యాక్‌గ్రౌండ్‌లో భారతీయ దేశభక్తి గీతాన్ని ఉపయోగించడం చర్చనీయాంశమైంది.బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించిన ‘రాజీ’ చిత్రంలోని దేశభక్తి గీతం ‘ఏ వతన్... వతన్ మేరే... ఆబాద్ రహే తూ...’ పాటను ఈ వేడుకల కోసం ఎంచుకోవడం విశేషం. పాకిస్థాన్ స్వాతంత్ర వేడుకల్లో భారత దేశానికి చెందిన పాటను ప్లే చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెలబ్రిటీలుగా ఉండి ఇలాంటి బాధ్యతారహిత్యమైన పని చేయడంపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఈ ఘటనపై పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ డ్రేజ్ వారిస్ స్పందించారు. ఆ నటీమణుల తీరును తప్పుపడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు.‘పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున మన దేశ జెండాను పట్టుకుని, ఒక భారతీయ దేశభక్తి పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో వాడుతూ వేడుకలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది బాలీవుడ్ సంగీతానికి వ్యతిరేకం కానప్పటికీ, జాతీయ ప్రాధాన్యాన్ని, స్పూర్తిని ప్రతిబింబించే విషయంలో ప్రముఖులు మరింత బాధ్యతగా వ్యవహరించాలి’ అని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, భారతీయ వ్లాగర్స్, నెటిజన్లు సైతం పాకిస్థాన్ సెలబ్రిటీల అజ్ఞానాన్ని ఎత్తిచూపుతూ ట్రోల్ చేస్తున్నారు. జాతీయ పర్వదినాల్లో కనీస ప్రాథమిక విషయాలపై అవగాహన లేకుండా ప్రముఖులే ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. View this post on Instagram A post shared by D R E J A Z W A R I S (@drejazwaris)ఇది కూడా చదవండి: బలూచ్‌లో రక్తపాతం: 8 రోజుల్లో 26 మంది పాక్ సైనికులు హతం! -
హైదరాబాద్‌లో సందడి చేసిన నటుడు సోనూసూద్ (ఫొటోలు)
-
చిట్టి గుండె ఆగింది
నిజామాబాద్ రూరల్ : పంద్రాగస్టు రోజు ఉదయాన్నే లేచి జెండా పండుగను సంబురంగా జరుపుకుందామనుకున్న విద్యార్థిని గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందింది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేశాపూర్‌కు చెందిన సుంకె మౌనిక కూతురు సుంకే సాత్విక(11) సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. చిన్నారి గుండెకు గతంలో శస్త్రచికిత్స జరిగింది. కాగా, రెండు రోజుల క్రితం సాతి్వకకు గుండెలో నొప్పి రావడంతో ప్రిన్సిపల్ నళిని తల్లికి సమాచారం అందించారు. దీంతో మౌనిక తన కూతురిని నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా గతంలో గుండె ఆపరేషన్ చేసిన ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారం పరిస్థితి విషమించి సాతి్వక ఆస్పత్రిలో మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. చిన్నారి మృతితో కేశాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మౌనిక భర్త గతంలోనే మృతి చెందగా, ఉన్న ఒక్కగానొక్క కూతురు మరణించడంతో గ్రామస్తులను కలచివేసింది. -
స్వాతంత్య్ర దినోత్సవం రోజూ నిరాటంకంగా మద్యం అమ్మకాలు
సాక్షి టాస్క్ ఫోర్స్: జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 2 తేదీల్లో దేశవ్యాప్తంగా మద్యం, మాంసం విక్రయించకూడదనే నిబంధన చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చాక అమలు కావడంలేదు. ఆయా తేదీల్లోను మద్యం, మాంసం విక్రయాలు నిరాటంకంగా సాగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజు శనివారం నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మద్యం, మాంసం విక్రయాలు జోరుగా జరిగాయి. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి సొంత నియోజకవర్గం బనగానపల్లెలో మద్యం ఏరులై పారింది. ఎక్సైజ్‌శాఖ అధికారులు మద్యం షాపులకు లక్క అతికించి మూసివేశారు. వైన్‌షాపుల యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ముందురోజే మద్యం బాటిళ్లను బయటకు తరలించి విక్రయాలు జరిపినట్లు తెలుస్తోంది. ఒక్కో బాటిల్‌పై ఎంఆర్పీ కంటే రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేసి సొమ్ము చేసుకున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలతోపాటు బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల తదితర మండలాల్లో శనివారం మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగినట్లు తెలిసింది. కోవెలకుంట్లలోని గుంజలపాడు రహదారి పక్కన ఉన్న వైన్‌షాపులో రెండోవైపు డోర్ నుంచి మద్యం విక్రయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడితోనే.. 'కులగణన'
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కులగణన చేసి దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. జనగణనలో కులగణన చే యాలన్న తెలంగాణ ఒత్తిడితోనే కేంద్రం కులగణనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో చేసిన కులగణన నివేదికను కేంద్రానికి పంపించాం. దీనితో కేంద్రం కులగణన చేయాలని నిర్ణయం తీసుకోవడానికి దోహదపడింది. దేశంలోనే సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను పకడ్బందీగా నిర్వహించి కులాల వారీగా సామాజిక స్థితిగతులను వెల్లడించాం. 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి వ ర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. బీసీలకు రాజకీయాలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపించాం. చివరగా దేశంలో 1931లో బ్రిటిష్ పాలనలో కులగణన జరిగింది’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఆయన పరేడ్ మైదానంలో అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఇక ఆన్లైన్లో ప్రజావాణి.. ఆన్లైన్ ప్రజావాణి పోర్టల్ ప్రారంభించి త్వరలోనే ఇక ఆన్లైన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా ఆర్జీలను నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తాం. వాటి పరిష్కార పురోగతిని ప్రత్యేక డ్యాష్‌బోర్డు ద్వారా నిరంతర పర్యవేక్షిస్తాం. ఈనెల 17 నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ స్కీమ్ అమల్లోకి తెచ్చాం. టీ–ఫైబర్ ద్వారా భారత్ నెట్ రెండో దశలో 8,895 గ్రామపంచాయతీలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరించాం. మూసీ బాధితులకు నష్టం కలిగించం... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి మొత్తం వ్యయంలో 12.4 శాతం కేటాయించాం. కనీస వేతనాలను సవరించి 1.11 కోట్ల మంది కార్మీకులకు ప్రయోజనం కల్పించాం. గిగ్ కార్మీకులకు చట్టబద్ధ గుర్తింపు కల్పించాం. సినీ కార్మీకుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చాం. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులపై వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల తెలంగాణ చట్టానికి రూపకల్పన చేస్తున్నాం. 55 కి.మీ. పరిధిలో మూసీ పునరుజ్జీవనంలో భాగంగా 39 కొత్త ఎస్టీపీల నిర్మాణంతోపాటు 2.5 టీఎంసీల గోదావరి నీళ్లను మూసీకి తరలించే ప్రణాళికను తీసుకెళ్తున్నాం. మూసీ పరీవాహకంలో నివాసితులకు ఎలాంటి కష్టం, నష్టం కలిగించం. మీ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఫ్యూచర్ సిటీ రైతులకు పరిహారం రాష్ట్రాన్ని 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశ జీడీపీలో రాష్ట్రవాటాను 10 శాతానికి పెంచే దిశగా ముందుకు సాగుతున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్–జీరో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం. 30వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి భూములిచ్చిన ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం. కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన రాష్ట్ర వాటా సాధించే విషయంలో రాజీ లేదు. అటు తుమ్మడిహెట్టి నుంచి ఇటు పాలమూరు వరకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. టీజీ–ఐపాస్‌తో రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయి. నెక్స్ట్–జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ–2026తో తెలంగాణను ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో నిలబెట్టేలా దిశా నిర్దేశం చేసుకున్నాం. కేపీహెచ్బీలో ఇందిరమ్మ టవర్స్.. తొలి దశలో 4.50 లక్షలు, రెండో విడతలో 2.50 లక్షల ఇందిమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నాం. అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెట్టాం. కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ విద్య ప్రారంభించాం. ప్రభుత్వ శాఖల్లో 72 వేల ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో మూడు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నాం. దక్షిణ భారత దేశంలో తొలి రోబోటిక్ కిడ్నీ మార్పిడి నిర్వహించిన తొలి ప్రభుత్వ ఆస్పత్రికి నిమ్స్ చరిత్ర సృష్టించింది. డ్రగ్స్, ఆహార కల్తీని ఎదుర్కొనేందుకు టీజీ సేఫ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేక లీగల్, ల్యాబొరేటరీ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల సమన్వయంతో విస్తృత తనిఖీలు చేసి కల్తీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాల నివారణకి టీజీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేసుకున్నాం. -
మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా
-
‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు)
-
ఎవరీ కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్? స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీకి..
భారతదేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోట వద్ద జరిగే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించారు. ఈ ఏడాది ‘వందే మాతరం’ 150 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తొలిసారిగా జాతీయ గేయం ‘వందే మాతరం’ను పూర్తిస్థాయిలో ఆలపించారు. ఈ కార్యక్రమంలో జెండా ఎగురవేసే సమయంలో ప్రధాని మోదీకి సమీపంలో నిలబడిన ఒక మహిళా సైనికాధికారి ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఇంతకీ ఎవరామె అంటే..ఆ ఆధికారిణి కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్. ఆమె భారత సైన్యంలో ఒక కమిషన్డ్ అధికారిణి. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో, ఎర్రకోట ప్రాకారాలపై ప్రధాన మంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తున్నప్పుడు ఆయనకు సహాయపడే ఒక నిర్దిష్ట లాంఛనప్రాయ బాధ్యతను ఆమెకు అప్పగించారు.ఎర్రకోటలో ఆమె పాత్ర ఏంటంటే..ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైనిక నియమావళి ప్రకారం జరుగుతాయి. ఇందులో గౌరవ వందనంగా(గార్డ్ ఆఫ్ ఆనర్) నుంచి జాతీయ పతాక వందనం (నేషనల్ ఫ్లాగ్ గార్డ్) వరకు ప్రతిదానికీ కేటాయించిన అధికారులు బాధ్యత వహిస్తారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం, జెండాను ఎగురవేసే క్షణంలో నేరుగా సహాయం చేయడమే కెప్టెన్ చౌహాన్ పని. ఈ కార్యక్రమం, స్వదేశీ 105mm లైట్ ఫీల్డ్ గన్లను ఉపయోగించి 1721 ఫీల్డ్ బ్యాటరీ కాల్చిన 21-గన్ సెల్యూట్‌తో నిర్వహిస్తారు.అందరి దృష్టిని ఆకర్షించడానికీ రీజన్..జెండా ఎగురవేసే సమయంలో ప్రధాని మోదీ పక్కనే కనిపించడంతో అందరి దృష్టిని ఆమె అమితంగా ఆకర్షించింది. పైగా ఈ దృశ్యం నారీ శక్తి లేదా మహిళా సాధికారతపై భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలిచింది. అలాగే ఇటీవల సంవత్సరాలలో భారత సాయుధ దళాలలో, పోరాట విధుల నుంచి భారతదేశపు అత్యంత ఎత్తైన పర్వత సరిహద్దులలోని పోస్టింగ్‌ల వరకు మహిళా అధికారుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న ధోరణికి అనుగుణంగా ఉంది. View this post on Instagram A post shared by ᴅᴇꜰᴇɴᴄᴇ ʟᴏᴠᴇʀꜱ (@defence_lovers121) (చదవండి: Independence Day 2026: ఎర్రకోటపై మోదీ ‘బంధనీ’ సఫా.. చుక్కల వెనుక వేల ఏళ్ల భారతీయ చరిత్ర!) -
YSRCP కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
-
80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన YS జగన్
-
జెన్‌జీతో మోదీ కనెక్ట్.. వందేమాతరం హైలైట్.. ఎర్రకోటపై కొత్త సందేశం (చిత్రాలు)
-
ఎర్రకోటపై మువ్వన్నెల జెండా.. 13వ సారి జెండా ఎగరేసిన మోదీ
-
Watch Live: గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు
-
ఆర్నెల్లకే.. చంద్రబాబు సర్కార్ మరో దుబారా!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ దుబారాకు ఇదో నిలువెత్తు నిదర్శనం..! జనవరిలో రాజధాని పరేడ్ గ్రౌండ్, పార్కింగ్ ప్రదేశం, అప్రోచ్ రోడ్లు సిద్ధం చేసేందుకు రూ.6.68 కోట్లు వ్యయం చేసింది. ఆర్నెల్లు తిరక్కముందే పరేడ్ గ్రౌండ్‌ను మెరుగుపర్చే పనులకు రూ.3.30 కోట్లు వ్యయం చేసింది. ఈ రెండు పనులను టెండర్ ద్వారా ఒకే సంస్థ ఎన్‌సీసీకే కట్టబెట్టడం గమనార్హం. పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేసేందుకు, మెరుగుపర్చేందుకు రూ.9.98 కోట్లు వ్యయం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించేది. అయితే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలను రాజధాని ప్రాంతంలో నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. తాత్కాలిక సచివాలయం వెనుక 22 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్, పార్కింగ్ ప్రదేశం, అప్రోచ్ రోడ్ల ఏర్పాటుకు రూ.6,58,07,360 అంచనాతో సీఆర్డీఏ ద్వారా టెండర్ పిలిచింది. రూ.6,68,27,374.08 కోట్‌చేసిన ఎన్సీసీ లిమిటెడ్ సంస్థకు ఆ పనులను కట్టబెట్టింది. ఆ గ్రౌండ్‌లోనే జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించింది. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గ్రౌండ్, పార్కింగ్ ప్రదేశాలను మెరుగుపర్చే పనులకు రూ.3,17,96,335 అంచనాతో జూలై 10న సీఆర్డీఏ ద్వారా టెండర్ పిలిచింది. ఈ టెండర్లోనూ రూ.3,30,61,829.13 కోట్ చేసిన ఎన్సీసీ లిమిటెడ్‌కు ఆ పనులను కట్టబెట్టింది. అంటే.. పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేసిన ఆర్నెల్లకే దాన్ని మెరుగుపర్చే పనులను రూ.3.30 కోట్లకు అప్పగించడంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి. -
ఏపీకి 27 పోలీసు పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ : 2026 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్రస్థాయి భద్రతా బలగాలకు అందించే ప్రతిష్టాత్మక సేవా, శౌర్య పతకాలను ప్రకటించింది. పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్స్, కరెక్షనల్ సర్వీసెస్ (జైళ్లు) శాఖల నుంచి మొత్తం 1,057 మంది అధికారులకు పతకాలను ఖరారు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 27 మంది ఎంపికయ్యారు. వీరిలో ఏఆర్ విభాగానికి చెందిన ఏడుగురికి శౌర్య పతకాలు లభించాయి. ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు కొర్లాన మల్లేష్, పైడి శ్రీరామమూర్తి, ఏఆర్ కానిస్టేబుళ్లు అడారి హేమ సుందరరావు, చింతపల్లి సత్యనారాయణ, రౌతు మహేష్, ఆబోతుల అప్పలనాయుడు, రుత్తల కన్నబాబు వీరిలో ఉన్నారు. పోలీసు విభాగంలో ఐజీలు విజయకుమార్ గుడి, వెంకటరావిురెడ్డి బలంకరి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. రాష్ట్రానికి మరో 18 ప్రతిభా సేవా పతకాలు కూడా దక్కాయి. ఇందులో పోలీసు విభాగం నుంచి 14 మంది, అగ్నిమాపక శాఖ నుంచి ఇద్దరు, జైళ్ల శాఖ నుంచి ఇద్దరు ఉన్నారు. పోలీసు విభాగం నుంచి ఎస్పీ గీతాదేవి వెలగ, ఏఎస్పీ ఐ. రామకృష్ణ, డీఎస్పీలు సుబ్బారావు తుమ్మల, జగ్గు నాయుడు పెంట, చంద్రమోహన్ సాదెపల్లి, కంజక్షన్ పసుపులేటి, అసిస్టెంట్ కమాండెంట్ మహబూబ్ బాషా సయ్యద్, ఆర్మ్డ్ పోలీస్ ఎస్ఐలు ఎం. రాంప్రసాద్, శేషపాణి పగడాల, బసవయ్య పొదిలి, ఏఎస్ఐలు మోహనరావు యలపు, చెంచురామయ్య నడిపినేని, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాసరాజు మంతెన, రాజారావు రోలుపల్లి ఎంఎస్ఎం పతకాలను సాధించారు. ఇక అగ్నిమాపక శాఖ నుంచి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ ఆఫీసర్ కాపు సత్యనారాయణ, ఫైర్‌మ్యాన్ జకరియా పెనుమాక ఎంపికయ్యారు. జైళ్ల శాఖ నుంచి సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ, హెడ్ వార్డర్ అద్దంకి సూర్యప్రకాశరావు ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. -
TG: ప్రజలకు గవర్నర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
హైదరాబాద్: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ధైర్యసాహసాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, సమగ్రతను పరిరక్షించేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి కృషిభారత్ను మరింత బలమైన, స్వావలంబనతో కూడిన ఆత్మనిర్భర్ భారత్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని శ్రీ శివప్రతాప్ శుక్లా కోరారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందేలా శాంతి, సౌభ్రాతృత్వం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.ఐక్యతతోనే అభివృద్ధిఐక్యత, సమగ్రత, అభివృద్ధి స్ఫూర్తితో ఉజ్వల భారతావని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. దేశ ప్రగతిలో యువత, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ గర్వంగా రెపరెపలాడాలని, దాని మూడు రంగులు దేశ ప్రజల్లో ధైర్యం, శాంతి, విశ్వాసానికి ప్రతీకలుగా నిలవాలని గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వికసిత్ భారత్ నిర్మాణానికి పునరంకితం కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు -
కేవలం ఒక్క రూపాయి.. 24 రోజుల వ్యాలిడిటీ!
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ఫ్రీడమ్ 2.0 పథకం కింద 2026 స్వాతంత్య్ర దినోత్సవం కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్లో భాగంగా.. వినియోగదారులు కేవలం రూ.1కే కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును పొందవచ్చు.ఈ ఆఫర్ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త వినియోగదారులు రోజూ 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా పొందుతారు. వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే. కొత్త సిమ్ కనెక్షన్ కోసం అధిక మొత్తం చెల్లించకుండా బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రయత్నించాలనుకునే వినియోగదారులకు ఈ ఆఫర్ ఉపయోగకరంగా ఉంటుంది.This Independence Day, why not start something better?Your first step towards a better connection is here.#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife #IndiaOnline #BSNLServices #SmartIndia #EverydayConnectivity #IndependenceOffer #FRC1 @CMDBSNL @robertravi21 pic.twitter.com/HObE4inHxD— BSNL India (@BSNLCorporate) August 12, 2026రూ.2,399 ప్లాన్!బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కూడా కేవలం సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.నిజానికి చాలా కంపెనీలు యాన్యువల్ ప్లాన్ కింద 365 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తాయి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం మరో 47 రోజుల వ్యాలిడిటీని అదనంగా అందిస్తుంది. అంటే ఏడాది పూర్తయినా ఇంకా కొన్ని రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
వికసిత్ భారత్ కోసం అందరూ కృషి చేయాలి: రాష్ట్రపతి
ఢిల్లీ భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 14న(శుక్రవారం) సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, దేశ భద్రత, ఐక్యత, మరియు ప్రగతికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆమె తన సందేశంలో పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ‘ వికసిత్ భారత్ కోసం అందరూ కృషి చేయాలి. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికీ అందించాలి. వందేమాతరం గీతాన్ని మనం గౌరవించాలి. యువత తమ స్పప్నాలను సాకారం చేసుకోవాలి. న్యాయవ్యవస్థ, చట్ట సభలను గౌరవించాలి. ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 కోట్ల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. కిసాన్ సమ్మాన్‌తో వ్యవసాయం, అనుబంధాల రంగాల బలోపేతం’ అని తన సందేశంలో పేర్కొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. -
ఐటీసీ ఎస్ఆర్ఏ 'వందేమాతరం' 150 వసంతాల వేడుకలు
న్యూఢిల్లీ: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, మన జాతీయ గీతం 'వందేమాతరం' 150 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ, ఐటీసీ లిమిటెడ్ ఘనంగా నివాళులర్పించింది. ఐటీసీ సంగీత్ రీసెర్చ్ అకాడమీ (ఐటీసీ ఎస్ఆర్ఏ) రూపొందించిన ‘దేశ్ ఏక్ రాగ్ 3’ అనే మ్యూజిక్ వీడియో ద్వారా ఈ సంగీత నివాళిని సమర్పించింది. ‘దేశ్’ రాగంలో స్వరపరిచిన ఈ గీతానికి ఐటీసీ ఎస్ఆర్ఏ గురువులు, విద్వాంసులు, సంగీత శిక్షకులు మరియు ఇతర సంగీతకారులు ప్రాణం పోశారు. దేశంలో జాతీయ మేల్కొలుపు, గర్వం మరియు ఐక్యతకు శాశ్వత చిహ్నంగా నిలిచిన ఈ గీతానికి ఐటీసీ అర్పించిన ఘన నివాళికి ఈ వీడియో ప్రతిరూపంగా నిలుస్తుంది.స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఐటీసీ చైర్మన్, ఐటీసీ ఎస్ఆర్ఏ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ సంజీవ్ పూరి ఈ వీడియోను లింక్డ్ఇన్లో పంచుకున్నారు. మాతృభూమి పట్ల భక్తి, ఐక్యత మరియు ప్రేమను చాటే వందేమాతరం సందేశం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గురువులు, సంగీత శిక్షకులు మరియు శిష్యులు ప్రత్యేకంగా రూపొందించిన ఈ ‘దేశ్ ఏక్ రాగ్ 3’.. మన గొప్ప దేశానికి, దాని అద్భుతమైన సాంస్కృతిక వారసత్వానికి ఐటీసీ అందిస్తున్న హృదయపూర్వక నివాళి అని ఆయన కొనియాడారు. ఐటీసీ ఎస్ఆర్ఏ దాదాపు ఐదు దశాబ్దాలుగా కాపాడుతున్న మన దేశ గాత్ర మరియు వాయిద్య సంప్రదాయాలకు ఈ వీడియో అద్దం పడుతోందని తెలిపారు. కాగా, ఈ సిరీస్‌లోని మూడవ ఎడిషన్ 2027లో రానున్న ఐటీసీ ఎస్ఆర్ఏ స్వర్ణోత్సవ ప్రయాణాన్ని కూడా సూచిస్తుంది.అకాడమీకి చెందిన విశిష్టమైన 'గురు-శిష్య పరంపర' ఈ ప్రదర్శనకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత స్ఫూర్తితో వందేమాతరాన్ని సమర్పించేందుకు గురువులు, విద్వాంసులు ఏకమయ్యారు. పండిట్ అజయ్ చక్రబర్తి, పండిట్ ఉల్హాస్ కశాల్కర్, పండిట్ పార్థ ఛటర్జీ, విదుషీ సుభ్రా గుహ, పండిట్ ఉదయ్ భవాల్కర్, శ్రీ ఓంకార్ దాదర్కర్, శ్రీ అబీర్ హుస్సేన్ మరియు శ్రీ బ్రజేశ్వర్ ముఖర్జీ వంటి ప్రముఖ గురువులు ఇందులో పాల్గొన్నారు. అకాడమీ మొదటి విద్యార్థి మరియు ప్రస్తుత గురువు అయిన పండిట్ అజయ్ చక్రబర్తి నుండి 11 ఏళ్ల విద్యార్థి వైభవ్ ముఖోపాధ్యాయ వరకు, వివిధ తరాలకు చెందిన దాదాపు 70 మంది కళాకారులు తమ గాత్రాన్ని, నైపుణ్యాన్ని అందించారు.ఐటీసీ ఎస్ఆర్ఏ గురువు శ్రీ అబీర్ హుస్సేన్ ఈ ప్రత్యేక కూర్పును రూపొందించగా, కోల్‌కతాకు చెందిన స్వతంత్ర ఫిల్మ్‌మేకర్ పృథా చక్రబర్తి ఈ వీడియోకు దర్శకత్వం వహించారు. ఈ వీడియోను యూట్యూబ్ లింక్ : https://youtu.be/lPqU_ROp4OQ ద్వారా వీక్షించవచ్చు.'దేశ్ ఏక్ రాగ్' ప్రయాణం రెండేళ్ల క్రితం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభమైంది. గురు-శిష్య పరంపరను కేంద్రంగా చేసుకుని, శాస్త్రీయ నృత్యాలను కూడా కలుపుతూ 2025లో ‘దేశ్ ఏక్ రాగ్ 2’ విడుదలైంది. ఈ రెండు ఎడిషన్లు వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో మిలియన్ల కొద్దీ వ్యూస్, ప్రశంసలు అందుకున్నాయి. -
భారతదేశపు విభిన్న శబ్దాలతో జాతీయ గీతానికి సరికొత్త రూపం
హైదరాబాద్:: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ప్రత్యేక నివాళిగా, హైదరాబాద్‌లోని అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్ట్ అయిన 'ది వరల్డ్ ఎట్ జూబ్లీ హిల్స్', జన గణ మన గీతానికి ఒక అందమైన రాగాన్ని సృష్టించడానికి దేశవ్యాప్తంగా 50 శబ్దాలను ఒకచోట చేర్చి ఒక వినూత్న సంగీత ప్రచారాన్ని సృష్టించింది.చెన్నైకి చెందిన ‘బీ పాజిటివ్ 24 ఇన్నోవేషన్ డిజైన్’ సంస్థ రూపొందించి, సృష్టించిన ఈ కొత్త ప్రచారంలో, దేశవ్యాప్తంగా సేకరించిన 50కి పైగా విభిన్న శబ్దాలను ఉపయోగించారు. రాకెట్ ప్రయోగం, వెళ్తున్న రైలు, పక్షులు, పాఠశాల గంటలు, దేవాలయ గంటలు, వీధులు, ప్రజలు, సంగీత వాయిద్యాలు, ప్రకృతి కదలికల వంటి శబ్దాలన్నింటినీ కలిపి జాతీయ గీతం బాణీలో ఒకే పాటగా మలిచారు."భారతదేశం మా ఇల్లు. మా అందమైన ఇంటికి ఇది ఒక సంగీత నివాళి. ఒక డెవలపర్‌గా, మేము ఎల్లప్పుడూ ఆవిష్కరణల ద్వారా ఆనందాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంటాము. ఆలోచనల పరంగా సరళంగా ఉంటూనే, భావోద్వేగ పరంగా ఒక శక్తివంతమైన పనిని మేము చేయాలని కోరుకున్నాము." అని 'ది వరల్డ్ ఎట్ జూబ్లీ హిల్స్' సీఈఓ సిద్ధార్థ్ రెడ్డి ఇందుకూరి అన్నారు."మేము 100కు పైగా శబ్దాలను రికార్డ్ చేసి, వాటితో వారాల తరబడి ప్రయోగాలు చేశాము. సంగీతపరంగా అర్థవంతంగా కలిసివచ్చే వాటిని ఎంచుకున్నాము. ఈ సౌండ్ మరియు ఫిల్మ్ 35 కంటే ఎక్కువ మార్పులకు గురయ్యాయి. అన్నింటినీ ఒకచోట చేర్చడానికి మాకు దాదాపు 100 రోజులు, పలువురు భాగస్వాములు అవసరమయ్యారు. ఇది చాలా శ్రమతో కూడుకున్నది అయినప్పటికీ అద్భుతమైన ఫలితం వచ్చింది " అని 'బీ పాజిటివ్ 24 ఇన్నోవేషన్ డిజైన్' వ్యవస్థాపకుడు అభిషేక్ డి షా అన్నారు. ఈ ప్రచార చిత్రం ఆగష్టు 12, 2026 నుంచి 'ది వరల్డ్ ఎట్ జూబ్లీ హిల్స్' యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం అవుతుంది. -
79 నుంచి 80కి.. మన జీవితంలో ఏం మారింది?
జాతీయ జెండా రెపరెపలాడుతుంది.. దేశభక్తి గీతాలు మార్మోగుతాయి.. ఎర్రకోట వేదికగా దేశ ప్రగతి ప్రస్థానం మరోసారి వినిపిస్తుంది. రహదారుల నుంచి రాకెట్ల వరకు.. డిజిటల్ చెల్లింపుల నుంచి ప్రపంచ రాజకీయాల వరకు భారత్ సాధించిన విజయాలను ప్రభుత్వం దేశం ముందుంచుతుంది. కానీ ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం కేవలం విజయాలను లెక్కించుకునే సందర్భమే కాదు.. ఆ అభివృద్ధి సామాన్యుడి జీవితంలో ఎంత మార్పు తీసుకొచ్చిందో సమీక్షించుకునే సమయం కూడా.79వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి 80వ దినోత్సవం వరకు భారత్ ఎన్నో రంగాల్లో ముందడుగు వేసింది. ఆర్థిక వృద్ధి, మౌలిక వసతులు, డిజిటల్ విప్లవం, అంతరిక్ష పరిశోధనలు, ప్రపంచ వేదికపై పెరిగిన ప్రాధాన్యం.. ఇవన్నీ కొత్త భారత్ చిత్రాన్ని చూపిస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగాలు, ధరల భారం, ఆదాయ అసమానతలు, వ్యవసాయ సమస్యలు వంటి ప్రశ్నలు కూడా కొనసాగుతున్నాయి. అభివృద్ధి వేగం పెరిగిన ఈ ఏడాదిలో.. ఆ మార్పు ప్రతి భారతీయుడి జీవితంలో ఎంతవరకు కనిపించింది? ఇదే 80వ స్వాతంత్ర్య దినోత్సవం ముందున్న అసలు ప్రశ్న.జీడీపీ నుంచి జేబు దాకా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. తయారీ రంగం, సేవల రంగం, మౌలిక వసతులు, స్టార్టప్ వ్యవస్థల్లో పెట్టుబడులు పెరిగాయి. దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు పరిశ్రమలకు ఊతమిస్తున్నాయి.భారత్ ఆర్థిక పరిమాణం పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిలో భారత మార్కెట్ ఆకర్షణీయంగా మారిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.అయితే మరోవైపు సామాన్య కుటుంబాల లెక్కలు వేరుగా ఉన్నాయి. నిత్యావసర ధరలు, విద్య, వైద్య ఖర్చులు, ఇళ్ల అద్దెలు పెరగడం మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. దేశ సంపద పెరుగుతున్న వేగం.. ప్రతి కుటుంబ ఆర్థిక భద్రత పెరుగుతున్న వేగంతో సమానమా? అనే చర్చ కొనసాగుతోంది.మన డిజిటల్ భారతం.. భారత్‌లో అత్యంత వేగంగా కనిపించిన మార్పుల్లో డిజిటల్ విప్లవం ఒకటి. ఒకప్పుడు బ్యాంకు సేవల కోసం రోజుల తరబడి వేచి చూసిన ప్రజలు ఇప్పుడు మొబైల్ ద్వారా క్షణాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. చిన్న వ్యాపారి, కూరగాయల విక్రేత, ఆటో డ్రైవర్.. ఇలా సామాన్యుడి జీవితంలోనూ డిజిటల్ చెల్లింపులు భాగమయ్యాయి. యూపీఐ వంటి వ్యవస్థలు భారత ఆర్థిక లావాదేవీల రూపాన్ని మార్చాయి.అదే సమయంలో కృత్రిమ మేధస్సు (AI) కొత్త అవకాశాలను తెస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, మీడియా రంగాల్లో సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్నాయి. అయితే AI కారణంగా ఉద్యోగాల స్వరూపం ఎలా మారుతుందన్న ఆందోళన కూడా పెరుగుతోంది.రయ్.. రయ్..తిరిగేయ్దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటిగా కొనసాగుతోంది. కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, రహదారులు, మెట్రో ప్రాజెక్టులు, రైల్వే ఆధునీకరణతో ప్రయాణ రూపం మారుతోంది. వందే భారత్ వంటి రైళ్లు ఆధునిక రైల్వేకు ప్రతీకగా నిలుస్తున్నాయి. నగరాల మధ్య కనెక్టివిటీ పెరుగుతోంది. విమానాశ్రయాల విస్తరణతో విమాన ప్రయాణం కూడా ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తోంది.అయితే మరోవైపు గ్రామీణ రహదారులు, ప్రజా రవాణా, నగరాల్లో ట్రాఫిక్, కాలుష్యం వంటి సమస్యలు ఇంకా సవాళ్లుగానే ఉన్నాయి. అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తికి చేరడం కూడా అంతే ముఖ్యం.అంతరిక్ష విజయాలే..చంద్రయాన్ విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మానవ సహిత అంతరిక్ష ప్రయాణం, ప్రైవేటు అంతరిక్ష సంస్థలకు అవకాశాలు, కొత్త పరిశోధనలపై దృష్టి పెరిగింది. అంతర్జాతీయ రాజకీయాల్లోనూ భారత్ పాత్ర పెరిగింది. అమెరికా, రష్యా, యూరప్, ఇండో-పసిఫిక్ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తూ ప్రపంచ సమస్యలపై తన అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తోంది. ప్రపంచ వేదికపై పెరిగిన ఈ ప్రాధాన్యం భారత్ ఆర్థిక, దౌత్య శక్తిని ప్రతిబింబిస్తోంది.యువ భారత్.. ఆశలు పెద్దవి, సవాళ్లు కూడాభారత్ యువ జనాభా దేశానికి అతిపెద్ద బలం. అదే సమయంలో వారికి అవకాశాలు కల్పించడం అతిపెద్ద బాధ్యత. ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, కొత్త పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నాలు చేస్తోంది. కొత్త రంగాల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే లక్షలాది మంది యువతకు స్థిరమైన ఉద్యోగం, మెరుగైన వేతనం, ఉద్యోగ భద్రత ఇప్పటికీ కీలక అంశాలుగానే ఉన్నాయి. పోటీ పరీక్షలు, నియామకాల ఆలస్యం వంటి అంశాలు యువతలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. జెన్‌జీ ఉద్యమాలు తెరపైకి వస్తున్నాయి.అభివృద్ధి కథలో మరో వైపు79 నుంచి 80కి భారత్ ప్రయాణం చూస్తే విజయాలు స్పష్టంగా కనిపిస్తాయి. డిజిటల్ శక్తి పెరిగింది. మౌలిక వసతులు విస్తరించాయి. అంతరిక్షం నుంచి ప్రపంచ రాజకీయాల వరకు భారత్ తన ముద్ర వేస్తోంది. కానీ ఒక దేశ అభివృద్ధిని కేవలం జీడీపీ, భారీ ప్రాజెక్టులు, అంతర్జాతీయ గుర్తింపుతో మాత్రమే కొలవలేం.ఒక రైతు ఆదాయం పెరిగిందా?ఒక యువకుడికి ఉద్యోగం దొరికిందా?ఒక కుటుంబానికి వైద్యం, విద్య భారం తగ్గిందా?ఒక సామాన్యుడి జీవన ప్రమాణం మెరుగుపడిందా?.. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే అసలు అభివృద్ధికి కొలమానం.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్ తన విజయాలను వేడుకగా జరుపుకుంటోంది. అదే సమయంలో ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలను గుర్తు చేసుకోవాల్సిన సందర్భమూ ఇదే. గత ఏడాదిలో భారత్ చాలా మారింది.. కానీ ఆ మార్పు ప్రతి భారతీయుడి జీవితంలో మరింత స్పష్టంగా కనిపించడమే వచ్చే ప్రయాణానికి అసలైన సవాల్.:::వెబ్ ప్రత్యేకం -
ఆగస్టు 15.. ఢిల్లీలో హైఅలర్ట్
సాక్షి, ఢిల్లీ: రేపు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట చుట్టూ బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎర్రకోట చూట్టూ వెయ్యి కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోకి వచ్చే వాహనాలన్నిటినీ తనిఖీ చేపడుతున్నారు.భారత్ రేపు తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రేపు ఆగస్టు 15 సందర్భంగా ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేస్తారు. మన జాతీయ గేయం 'వందేమాతరం' రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర్య దినోత్సవ చరిత్రలోనే మొదటిసారిగా ఎర్రకోటపై వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నారు.ఎర్రకోట నుండి ప్రధాని చేసే ప్రసంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత 'భాషిణి' అనువాదకం ద్వారా దేశంలోని 22 అధికారిక భాషల్లోకి ఒకే సమయంలో అనువదించి ప్రసారం చేస్తారు. దీనివల్ల ఎవరి మాతృభాషలో వారు ప్రసంగాన్ని స్పష్టంగా వినవచ్చు. -
ప్రభుత్వం మారితే సరిపోదు.. అదే నాకు బహుమతి: వాంగ్‌చుక్
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం ప్రభుత్వాలు మారడం సరిపోదని.. దేశ రాజకీయ వ్యవస్థలోనే మౌలిక మార్పులు రావాలని ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. దేశానికి ఇప్పుడు ఒక ‘శాంతియుత విప్లవం’ అవసరమని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి విద్యే పునాది అని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాకుండా దేశం ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్‌చుక్ భారత్ భవిష్యత్తుపై తన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఒకప్పుడు భారత్‌తో సమానంగా లేదా వెనుకబడి ఉన్న థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు నేడు వేగంగా ముందుకు దూసుకెళ్లాయని ఆయన గుర్తుచేశారు. ‘ఇదే వేగంతో కొనసాగితే 2047 నాటికి భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది’ అని ఆయన హెచ్చరించారు.విద్య వెనుకబడితే.. దేశ అభివృద్ధికి విద్యే పునాది అని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాకుండా దేశం ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నారు. ఇటీవల మార్పు కోసం ప్రజలు చేపట్టిన ఆందోళనలను ప్రస్తావించిన ఆయన.. కొన్ని సందర్భాల్లో మంత్రుల రాజీనామాలు జరిగినా, కేవలం వ్యక్తుల మార్పుతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఇదే సమయంలో తన విమర్శలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రజల గొంతుకలను అణచివేస్తున్నారనే ఆరోపణలు వివిధ ప్రభుత్వాలపై వస్తున్నాయని అన్నారు.2012-13లో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని గుర్తుచేస్తూ.. ఆ ఉద్యమం తర్వాత ప్రభుత్వం మారినా అవినీతి, అన్యాయం పూర్తిగా అంతం కాలేదని వ్యాఖ్యానించారు. సమస్యలు ఇప్పుడు మరో రూపంలో మరింత పెద్దవిగా కనిపిస్తున్నాయని అన్నారు. భారత్ రాజకీయ వ్యవస్థలో ప్రధాన సమస్య నాయకులను ఎన్నుకునే విధానమే అంటూ తన అభిప్రాయపడ్డారు. నాయకులు సరైనవారు కాకపోతే.. మొత్తం దేశమే తప్పుదారి పడుతుందని.. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్యపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.THIS INDIPENDENCE DAY, I NEED YOUR HELP...This country needs a peaceful revolution, at least in how we chose our leaders... if we are to remain even a respectable nation by 2047.Close to half of our MPs have criminal cases and a third have serious charges like murder, rape &… pic.twitter.com/10byPuzwtX— Sonam Wangchuk (@Wangchuk66) August 13, 2026అదే నాకు బహుమతి.. అయితే తాను అధికార పార్టీని కానీ, ప్రతిపక్షాన్ని కానీ లక్ష్యంగా చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘ఇది ఏ పార్టీ సమస్య కాదు.. దేశ సమస్య’ అని వ్యాఖ్యానించారు. దేశానికి కొత్త రాజకీయ దిశను చూపించగల వ్యక్తులను గుర్తించేందుకు ప్రజల సహకారం కోరారు. కేవలం మేధావులు మాత్రమే కాకుండా.. నిస్వార్థంగా పనిచేసే, మంచి వ్యక్తిత్వం కలిగిన, సూత్రాలకు కట్టుబడి ఉండే వ్యక్తులు కావాలని అన్నారు. దేశవ్యాప్తంగా అలాంటి వ్యక్తుల పేర్లను ప్రజలు సూచించాలని ఆయన కోరారు. వివిధ రాష్ట్రాలు, నగరాల్లో పర్యటించి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నట్లు తెలిపారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి నాకు ఇవ్వగలిగే ఉత్తమ బహుమతి.. అలాంటి మంచి వ్యక్తుల పేర్లను సూచించడమే అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. -
కళ నేర్చిన కాళ్లు కవాతు నేర్పాయి..
‘ఇంత లావణ్యరాశివి. నువ్వు తుపాకీ పట్టావా?’ అన్నాడు బ్రిటిష్ అధికారి.‘క్షమాపణ అడుగు. ఉరిశిక్ష రద్దు చేస్తాను’ అని కూడా అన్నాడు. ఆమె అడగలేదు. కాన్పూర్‌లో ఆమె నాట్యగత్తె మాత్రమే కాదుతన దేశభక్తితో బ్రిటిష్‌వారిని ఉరుకులెత్తించిన వీరనారి. 400 మంది మహిళలతో సైన్యం తయారు చేసిన దళనాయకి.పేరు అజ్జన్ బాయి. వృత్తికి ‘తవాయిఫ్’. కాని దేశానికి వీరపుత్రిక.ఆడు’... అంటే ఆడాలి. ‘పాడు’ అంటే పాడాలి. నవాబుల కాలంలో ఉత్తరభారతంలో ‘తవాయిఫ్’లుగా పేరుబడ్డ నాట్యగత్తెల జీవితం అది. దక్షిణాదిన ‘దేవదాసీ’లది, ఉత్తరాదిన ‘తవాయిఫ్’లది సమాజంలో ఒకేలాంటి స్థానం. కాని ఈ ‘దేవదాసీ’ల్లో ఈ ‘తవాయిఫ్’లలోనూ చరిత్రను లిఖించిన వారు ఎందరో ఉన్నారు. కాన్పూరుకు చెందిన అజ్జన్ బాయిది అలాంటి చరిత్ర. 1857 తిరుగుబాటులో కాన్పూర్ వేదికగా సిపాయిలను నడిపించి, నాట్యగత్తె ముసుగులో గూఢచారిగా మారి, చివరకు దేశం కోసం నవ్వుతూ ప్రాణాలర్పించిన అజ్జన్‌బాయి వీరగాథ నేటికీ ఒక అద్భుతం.లక్నో నుండి కాన్పూర్ కోఠా వరకుఅజ్జన్బాయిది లక్నో. అమె అసలు పేరు అజీజున్నిసా. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో ఆ రోజుల్లో అలాంటి ఆడపిల్లల్ని ‘కోఠా’ (నాట్యగత్తెలు ఉండే చోటు)లకు తరలించేవారు. అలా అజ్జన్‌బాయి లక్నో నుంచి కాన్పూర్‌కు మారి ‘లడ్కీ మహల్’ అనే కోఠాకు చేరింది. అయితే కాళ్లకు గజ్జెలు కట్టడం కంటే చేతిలో పుస్తకం పట్టడం గురించే అజ్జన్‌బాయి ధ్యాస. తన నాట్యం చూడటానికి వచ్చే పెద్దమనుషుల ద్వారా దేశ పరిస్థితులు తెలుసుకునేది. పెద్దమనుషులు ఇళ్లలోని స్త్రీలతో ఏ విషయాలూ పంచుకోకపోయినా ఇలాంటి చోట అనేకం విశదపరుస్తుంటారు. అప్పటికి తవాయఫ్ అంటే కేవలం సాహిత్యం, సంగీతం, సంస్కృతికి చిహ్నం. కానీ 1856లో బ్రిటిష్ వారు అవధ్‌ను ఆక్రమించిన తర్వాత తవాయిఫ్లను ‘వేశ్యలు’ అని ముద్ర వేశారు. దాంతో వారికి రాజాశ్రయం పోయింది. గౌరవం పోయింది. అప్పుడే అజ్జన్ గుండెలో కోపం పుట్టింది. ఆ కోపమే దేశభక్తి అయ్యింది.మస్తానీ దళం 1857 మే నెలలో మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు మొదలై విప్లవజ్వాలలు దేశవ్యాప్తంగా ఎగసిపడినప్పుడు అజ్జన్‌బాయి నేరుగా రంగంలో దిగింది. కాన్పూర్‌లో ఆమె తన తోటి మహిళలతో కలిసి ‘మస్తానీ దళం’ అనే ప్రత్యేక మహిళా సైనిక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మహిళలు పగటిపూట వీధుల్లో తిరుగుతూ విప్లవకారుల్లో ధైర్యాన్ని నింపేవారు. గాయపడిన భారతీయ సైనికులకు సేవలు చేస్తూ, వారికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసేవారు. రాత్రివేళల్లో బ్రిటిష్ అధికారుల ముందు నాట్యం చేస్తూ, వారు మత్తులో ఉన్నప్పుడు రహస్య సైనిక సమాచారాన్ని సేకరించేవారు. ఆ సమాచారాన్ని నానా సాహెబ్, తాంతియా తోపే వంటి విప్లవ నాయకులకు చేరవేస్తూ గూఢచారులుగా పని చేశారు.మగ దుస్తుల్లో యుద్ధరంగంలోకి...కాన్పూర్‌లో బ్రిటిష్ వారికి భారీ సైనిక హెడ్‌క్వార్టర్స్ ఉంది. జూన్‌లో నానాసాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటుదారులు ఈ హెడ్‌క్వార్టర్స్‌ను మూడు వారాలు దిగ్బంధించారు. దెబ్బకు బ్రిటిష్ వారు ఓటమి అంగీకరించి అలహాబాద్ వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. ఆ సమయంలో అజ్జన్‌బాయి స్వయంగా మగవారి దుస్తులు ధరించి, గుర్రమెక్కి, రెండు చేతుల్లో పిస్తోళ్లు పట్టుకుని సైనికుల కవాతులో పాల్గొంది. శత్రువుల ఫిరంగి గుండ్లు ముంచెత్తుతున్నా భయపడకుండా స్వయంగా బ్రిటిష్ సైన్యంతో పోరాడింది. కేవలం 25 ఏళ్ల వయస్సులో ఆమె చూపిన ఈ రణరూపం బ్రిటిష్ సైన్యాన్ని వణికించింది.హావ్లాక్ కోర్టు మార్షల్దెబ్బ తిన్న బ్రిటిష్‌వారు శక్తి కూడదీసుకొని చెలరేగారు. కాన్పూర్ను భారీ సైన్యంతో బ్రిటిష్ జనరల్ హావ్లాక్ తిరిగి స్వాధీనం చేసుకున్నప్పుడు కాన్పూర్ వాసులను ఊచకోత కోశాడు. అజ్జన్బాయిని బంధించాక ఆమెను చూసి ‘ఇంత అందమైన మహిళ ఇంతటి వీరత్వాన్ని ఎలా ప్రదర్శించిందో’ అని హావ్లాక్ ఆశ్చర్యపోయాడు. ‘నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి, విప్లవకారుల రహస్యాలిస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం’ అని ఆశ చూపాడు. దానికి అజ్జన్‌బాయి ‘నువ్వు నా ప్రాణాలు తీయగలవు కానీ నా తల వంచలేవు. నాకు కావాల్సింది బ్రిటిష్ సామ్రాజ్య నాశనం మాత్రమే’ అని గర్జించింది. కోపంతో ఊగిపోయిన హావ్లాక్ ఆమెను కాల్చి చంపాలని ఆదేశించాడు. ఫైరింగ్ స్క్వాడ్ ఆమె ముందు నిలబడి బుల్లెట్లు గుండెల్లోకి దింపుతున్నా చిరునవ్వుతో, దేశభక్తి నినాదాలు చేస్తూ ఆమె అమరురాలయ్యింది. ఇవాళ చరిత్ర పుస్తకాల్లో అజ్జన్‌బాయి పేరు లేదు. కానీ కాన్పూర్ గల్లీల్లో ఇప్పటికీ ఆమె కథ చెప్పుకుంటారు. నృత్యానికి ఆడించాల్సిన చేతులతో ఆమె తుపాకీ పట్టింది. ఎందుకంటే ఆమెకు తెలుసు సంస్కృతి బతకాలంటే స్వాతంత్య్రం ముఖ్యమని. భావితరాల మేలు కోసం తన వర్తమానాన్ని త్యాగం చేసిన అమర వీరురాలు అజ్జన్‌బాయి. అలాంటివారిని స్మరించుకునే వేళే మన సిసలైన స్వాతంత్య్ర దినోత్సవ వేడుక. -
హైదరాబాద్ : గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ రిహార్సల్స్ (ఫొటోలు)
-
సగర్వంగా, వైభవోపేతంగా స్వాతంత్య్ర దినోత్సవం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని సగర్వంగా, వైభవోపేతంగా నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘అభివృద్ధి చెందిన భారత్’కోసం ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికార ఎన్డీయే కూటమి మంగళవారం నిర్వహించిన ‘మంగళ్ మిలన్’కు మోదీ హాజరయ్యారు. సమావేశ ప్రాంగణానికి మోదీ చేరుకున్నప్పుడు ఎన్డీయే ఎంపీలు, కేంద్ర మంత్రులు త్రివర్ణ పతాకాలు చేతబూని వందేమాతరం, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఈ దృశ్యాలతో కూడిన వీడియోను మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేశారు. మన స్వాతంత్య్ర సమరయోధులకు ఘనంగా నివాళులు అర్పిద్దామని, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు.‘‘హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా (ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం, ప్రతి హృదయంలో త్రివర్ణ పతాకం). అందరూ కలిసి రండి. ప్రతి ఇంట్లోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం. భారత్ మాతా కీ జై, వందేమాతరం, వందేమాతరం, వందేమాతరం’’అని మోదీ ఈ వీడియోలో పిలుపునిచ్చారు. అంతకుముందు పార్లమెంట్ భవన సముదాయంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో మంగళ్ మిలన్ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి స్వయంగా జాతీయ జెండాను చేతబూనారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, ఎస్.జైశంకర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతి మంగళవారం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. -
మరో వీడియో పోస్ట్ చేసిన మోదీ.. దేశ ప్రజలకు కీలక పిలుపు
న్యూఢిల్లీ: దేశ ప్రజలు ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగస్వాములు కావాలని, స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ప్రతి ఇంట్లో దాన్ని ఒక వేడుకగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పిలుపునిచ్చారు. ఈ ప్రచారానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ పోస్ట్ చేశారు. “రండి, #హర్‌ఘర్‌తిరంగా ప్రతి ఇంటి వేడుకగా మార్చుకుందాం” అని పోస్టు చేశారు. ఈ ప్రకటన ఆగస్టు 15న జరిగే 80వ స్వాతంత్య్ర వేడుక సందర్భంగా చేశారు.“రండి, ఆగస్టు 15ను గర్వంతో, గౌరవంతో జరుపుకుందాం. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిద్దాం. అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) నిర్మాణానికి ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం, ప్రతి గృహంలో త్రివర్ణ పతాకం, ప్రతి హృదయంలో త్రివర్ణ పతాకం ఉండాలి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం” అని ప్రధాని అన్నారు. 2026 హర్ ఘర్ తిరంగా ప్రచారం ఆగస్టులో నిర్వహిస్తున్నారు. దేశ ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశవ్యాప్త వేడుకల్లో పాల్గొనాలని ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రచారం ద్వారా ప్రజలు త్రివర్ణ పతాకాన్ని తమ ఇళ్లకు తీసుకువచ్చి స్వాతంత్య్ర స్ఫూర్తిని జరుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఎర్రకోట వద్ద ‘వందే మాతరం’ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతానికి ముందు ఎర్రకోట ప్రాకారాలపై నుంచి ‘వందే మాతరం’ను సామూహికంగా ఆలపించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మంగళవారం తెలిపారు. ఎక్స్‌లో చేసిన గుప్తా స్పందిస్తూ దీనిని “గౌరవప్రదమైన, చారిత్రాత్మక ఘట్టం”గా అభివర్ణించారు. జాతీయ గీతానికి ముందు ఎర్రకోట వద్ద సామూహికంగా ‘వందే మాతరం’ ఆలపించడం ఇదే తొలిసారి అని చెప్పారు.భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ‘వందే మాతరం’ ఒక “అమర జాతీయ మంత్రం”గా నిలిచిందని, అది విప్లవకారులకు స్ఫూర్తినిచ్చిందని, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు స్వరంగా మారిందని గుప్తా పేర్కొన్నారు. ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవం, పార్లమెంట్లో ఆమోదించిన తీర్మానం, ప్రధాని మోదీ నాయకత్వాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇవన్నీ కలిసి భారత జాతీయ స్మృతి, సాంస్కృతిక గౌరవం, దేశభక్తికి గొప్ప ప్రకటనగా నిలుస్తాయని చెప్పారు. “వందే మాతరం. జై హింద్, భారత మాతాకీ జై!” అని గుప్తా తన పోస్టులో పేర్కొన్నారు.గోవాలో తిరంగా ర్యాలీహర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా గోవా రాజధాని పనాజీలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. మిరామార్ సర్కిల్ నుంచి కాలా అకాడమీ మీదుగా ఆజాద్ మైదాన్ వరకు నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. కాలా అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్.. పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగించారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) -
ఆగస్టు 15వ తేదీనే ఎందుకు ఫిక్స్ చేశారో మీకు తెలుసా?
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15వ తేదీన ఘనంగా జరుపుకుంటాం. అయితే ఈ తేదీని ఫిక్స్ చేయడానికి చాలానే చర్చలు జరిగాయట. మనకు స్వాత్వంత్యం వచ్చిన తర్వాత ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి ఒక తేదీని నిర్ణయించాలని అప్పటి పెద్దలు సమాలోచనలు చేశారట. 1946లో భారతదేశ స్వాతంత్ర్యం ఖరారైన తర్వాత 1947లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన నమ్మకస్తుడైన గోస్వామి గణేష్ దత్ మహారాజ్ ద్వారా ఉజ్జయిన్‌కు చెందిన జ్యోతిష్కుడు పండిట్ సూర్యనారాయణ వ్యాస్‌ను ఢిల్లీకి పిలిపించారు. పండిట్ సూర్యనారాయణ వ్యాస్ అనే ఆయన జ్యోతిష్యంలో సిద్ధహస్తుడు. అందులోనూ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సైతం జ్యోతిష్యం అంటే అమితమైన నమ్మకం. దాంతో పండిట్ సూర్యనారయణ ద్వారా ఒక తేదీని ఫిక్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.రెండింటిలో ఏది బెస్ట్..?భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరపడానికి రెండు తేదీలను ఫిక్స్ చేశారు. ఒకటి ఆగస్టు 14వ తేదీ కాగా, రెండోది ఆగస్గు 15వ తేదీ. అయితే ఈ రెండు తేదీలలో ఒకదాన్ని ఎంచుకోవడం సవాల్‌గా మారింది. బ్రిటిష్ వారి నుండి అధికారాన్ని బదిలీ చేయడానికి ఆగష్టు 14, 15 అనే రెండు తేదీలు అందుబాటులో ఉన్నాయని పండిట్ సూర్యనారాయణకు చెప్పారు.ఫలితంగా ప్రఖ్యాతగా జ్యోతిష్కునిగా ఉన్న పండిట్ సూర్యనారాయణ వ్యాన్ ఈ రెండు తేదీలను పరిశీలించిన తర్వాత ఆగస్టు 15వ తేదీకి మొగ్గుచూపారు. ఆగస్టు 14వ తేదీ లగ్న బలం లేదని, అంటే జాతక చక్రంలో తొలి స్థానంలో బాలేదని, అది అంత కూలమైనది కాదని తేల్చిచెప్పారు. అదే సమయంలో ఆగస్టు 15వ తేదీనే అనుకూలంగా ఉందని డేట్ ఫిక్స్ చేశారట. స్వాతంత్ర్యానికి ఆగస్టు 15వ తేదీ అత్యంత అనువైన తేదీ అని ఆయన ప్రకటించారుజాతకంలో ఆగస్టు 14వ తేదీన లగ్నం అస్థిరంగా ఉంటుందని ఆయన విశ్వసించారు. అందువల్ల, స్వాతంత్ర్యానికి ఆగస్టు 15వ తేదీ అత్యంత అనువైన తేదీ అని ఆయన ప్రకటించారు..ఇలా వచ్చింది ఆగస్టు 15వ తేదీ.ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పండిట్ సూర్యనారాయణ వ్యాస్ కుమారుడు, దూరదర్శన్ మాజీ డైరెక్టర్ జనరల్, రచయిత అయిన రాజశేఖర్ వ్యాస్ అందించారు. ఆయన ప్రకారం, శుభ సమయాన్ని నిర్ధారించిన తర్వాత, స్వాతంత్ర్యానికి అర్ధరాత్రి సమయం అనుకూలంగా ఉందని పండిట్ వ్యాస్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌తో చెప్పారట. జెండా ఎగురవేయడం, స్వాతంత్ర్య వేడుకను అర్ధరాత్రి నిర్వహించాలని, ఇతర కార్యక్రమాలను ఉదయాన్నే జరపాలని ఆయన సూచించారట.పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయన సలహాను పాటించి, అర్ధరాత్రి ఎర్రకోటపై జెండాను ఎగురవేశారని చెబుతారు. అయితే ఆగస్టు 15వ తేదీ ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్ భవనం (నాటి కౌన్సిల్ హౌస్) పై జరిగింది. ఆ సమయంలో లార్డ్ మౌంట్‌బాటన్ సమక్షంలో బ్రిటిష్ జెండా 'యూనియన్ జాక్'ను కిందకు దించి, మన భారత జాతీయ జెండాను తొలిసారిగా పైకి ఎగురవేశారు. మరి కొన్ని ఆసక్తికర విషయాలు.. పండిట్ సూర్యనారాయణ వ్యాస్ 1902లో జన్మించారు. ఆయనకు సంబంధించిన పుస్తకాల ప్రకారం, ఆయన 1921లోనే స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందని, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దేశానికి రాష్ట్రపతి అవుతారని ఆయన 1930లోనే జోస్యం చెప్పారని అంటారు.1952లో, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పదవీకాలం ముగింపు దశకు వస్తున్నప్పుడు, ఆయన తిరిగి రాష్ట్రపతిగా ఎన్నికవుతారని పండిట్ వ్యాస్ మరోసారి జోస్యం చెప్పారు. ఈ ప్రకటన ఆ తర్వాత నిజమని రుజువైంది. అప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తాను చెప్పినట్లే జరిగిందని అంగీకరిస్తూ పండిట్ వ్యాస్‌కు ఒక లేఖ రాసినట్లు సమాచారం.14వ తేదీని ఎంచుకున్న జిన్నా..పండిట్ వ్యాసుడు పాకిస్తాన్ గురించి కూడా ఒక జోస్యం చెప్పారు. భారతదేశ స్వాతంత్ర్యానికి శుభ ముహూర్తాన్ని లెక్కిస్తున్నప్పుడు, పండిట్ వ్యాసుడు పాకిస్తాన్ ఏర్పాటు గురించి కూడా హెచ్చరించారు. ఒకవేళ ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పడితే, అది శాశ్వతంగా అస్థిరంగా ఉంటుందని అంటారు. ఆ రోజున మేష లగ్నం ఉండటం, గురు గ్రహం శత్రు స్థానంలో ఉండటమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. మహమ్మద్ అలీ జిన్నా క్యాలెండర్‌ను, శుభ సమయాన్ని నమ్మేవారు కాదు. అందువల్ల, పాకిస్తాన్ స్వాతంత్ర్యం కోసం ఆగస్టు 14వ తేదీని ఎంచుకున్నారనేది సారాంశం. అలా పండిట్ సూర్యనారాయణ భారతదేశ స్వాతంత్య్ర తేదీని ఫిక్స్ చేయడంలో ముఖ్య భూమిక పోషించారట.ఇదీ చదవండి: 79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్? -
Tour: చరిత్ర చెప్పే భారత యాత్ర
కొన్ని ప్రదేశాలు మ్యాపులో కనిపించే లొకేషన్లు మాత్రమే కావు. అవి ఒక దేశ జ్ఞాపకాలు కూడా. అక్కడి నేల, గోడలు, దారులు అన్నీ అక్కడి త్యాగాల కథలను నేటికీ చెబుతూనే ఉంటాయి. భారత స్వాతంత్య్ర పోరాటం అనగానే కొన్ని ప్రముఖ నగరాలు ప్రదేశాలు, కట్టడాలు గుర్తొస్తాయి. అయితే దేశంలోని ప్రతిప్రాంతం తన వంతు పోరాట స్మృతులను రాసుకుంది. మన తెలుగు నేల కూడా అలాంటి వీర చరిత్రకు నిలయం.ఆంధ్రప్రదేశ్ అడవుల్లో వినిపించే మన్యం పోరాట స్వరాల నుంచి అండమాన్ సముద్రం మధ్యలో ఉన్న సెల్యులర్ జైలు వరకు ఈ ఫ్రీడమ్ ట్రెయిల్ యాత్ర (India Freedom Trail) భారత స్వాతంత్య్ర స్పూర్తిని పరిచయం చేస్తుంది. దేశం కోసం పోరాడిన వీరుల అడుగుజాడలను స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపే ఆనాటి పోరాట కథలు చెప్పే ప్రదేశాలను సందర్శించడానికి 5 రోజుల భారత్ ఫ్రీడమ్ ట్రెయిల్ ఇది..మన్యం అడవుల్లో స్వాతంత్య్ర పోరాట జాడలు...ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల మధ్యలో ఉన్న మన్యంప్రాంతం ప్రకృతి అందాలతో పాటు ఒక వీర చరిత్రను కూడా మోసుకొస్తుంది. అల్లూరి సీతారామ రాజు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నడిపిన రంపా పోరాటం తెలుగు స్వాతంత్య్ర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం.కొండలు, అడవులు, గిరిజన జీవన విధానం మధ్య ఆయన పోరాట జ్ఞాపకాలను ఇప్పటికీ ఆప్రాంతంలో ఫీల్ అవ్వవచ్చు. అల్లూరి పేరు వినగానే తెలుగు ప్రజల మనసులో ఒక వీరుడి రూపం కనిపిస్తుంది. మన్యం పోరాటం జరిగిన ప్రదేశాల్లో ప్రయాణం చేస్తే ప్రకతితో పాటు చరిత్ర కూడా మనతో నడుస్తున్నట్టు అనిపిస్తుంది.హైదరాబాద్ నుంచి రాజమండ్రికి లేక విశాఖపట్టణం చేరుకుని అక్కడి నుంచి రోడ్ జర్నీలో ఏజెన్సీప్రాంతాలకు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి రాజమండ్రి మార్గం కూడా అనుకూలంగా ఉంటుంది. రాజమండ్రి, రంపచోడవరం, మారేడుమిల్లిప్రాంతాల్లో స్టే ఆప్షన్స్ లభిస్తాయి.దండి మార్చ్‌కు నాంది పలికిన సబర్మతిగుజరాత్లోని అహ్మదాబాద్‌లో ఉన్న సబర్మతి ఆశ్రమం ఒక ప్రశాంతమైన చారిత్రక ప్రదేశం. సబర్మతి నదీ తీరంలో ఉన్న ఈ ఆశ్రమం నుంచి మహాత్మా గాంధీ అనేక ఉద్యమాలకు మార్గదర్శనం చేశారు. 1930లోప్రారంభమైన దాండీ మార్చ్ కూడా ఇక్కడేప్రారంభం అయింది.ఆశ్రమంలో మహాత్ముడు ఉపయోగించిన వస్తువులు, ఫొటోగ్రాఫ్స్, లెటర్స్ చరిత్రను దగ్గరగా పరిచయం చేస్తాయి.సబర్మతి ఆశ్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పర్యాటకుల కోసం తెరిచే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఎంట్రీ ఫీజు తీసుకోరు.ఈ ఆశ్రమాన్ని సందర్శించాలి అనుకుంటే ముందుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ లేక చెన్నై ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.అహ్మదాబాద్‌లో బడ్జెట్ హోటల్స్ రూ.1500 నుంచి రూ.3000, కంఫర్టబుల్ హోటల్స్ రూ.3000 నుంచి రూ.7500 వరకు బడ్జెట్లో లభిస్తాయి.కాలాపాని సెల్యులర్ జైలు.. స్వాతంత్య్ర సమరయోధుల కన్నీటి గాథసముద్రం మధ్యలో ఉన్న అండమాన్ ద్వీపాల్లో సెల్యులర్ జైల్ చరిత్ర తెలుసుకుంటే నాటి పోరాటం వెనక ఉన్న త్యాగాలు అర్థం అవుతాయి. బ్రిటిష్ కాలంలో వీర్ సావర్కర్తో పాటు అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులను ఇక్కడే బంధించారు. జైల్లో ఉన్న ప్రతి గది దేశ భక్తుల త్యాగం, వారి పోరాటం గురించి మౌనంగా వివరిస్తుంది. ఇప్పుడు సెల్యులర్ జైలును నేషనల్ మెమోరియల్‌గా మార్చి పర్యాటకుల కోసం తెరిచి ఉంచారు. సందర్శకులు మ్యూజియం, పాత కారాగారాలు, ఫ్రీడమ్ ఫైటర్స్ జ్ఞాపకాలను చూడవచ్చు.భారతీయ పర్యాటకులకు ఇక్కడికి వెళ్లేందుకు సుమారు రూ.30 ఎంట్రీ ఫీజు ఉంటుంది. సాయంత్రం జరిగే లైట్ అండ్ సౌండ్ షో ఈ ప్రదేశ చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. షో టికెట్ కాస్ట్ వచ్చేసి రూ.300.కాలాపాని వెళ్లాలి అనుకునే ప్రయాణికులు హైదరాబాద్ నుంచి చెన్నై లేక కోల్‌కతా ద్వారా పోర్ట్ బ్లెయిర్ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి చెన్నై రూట్లో వెళ్లడం సులువుగా ఉంటుంది.పోర్ట్ బ్లెయిర్‌లో బడ్జెట్ హోటల్స్ రూ.1500 నుంచి రూ.3000 వరకు లభిస్తాయి. కాస్త కంఫర్టబుల్ స్టే కావాలి అనుకుంటే మాత్రం రూ.3000 నుంచి రూ.6000 మధ్యలో లభిస్తాయి.సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని తెలిపే నేతాజీ భవన్పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో ఉన్న నేతాజి భవన్ అనేది సుభాష్ చంద్రబోస్ జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసే ఒక ముఖ్యమైన వారసత్వ సంపద. ఇక్కడ నేతాజి ఉపయోగించిన వస్తువులు, ఫోటోగ్రాఫ్స్, డాక్యుమెంట్స్ భద్రపరిచారు. దేశం కోసం ఆయన చేసిన పోరాటాల గురించి తెలుస్తాయి.నేతాజి భవన్ టూరిస్టుల కోసం తెరిచే ఉంటుంది. హైదరాబాద్ నుంచి కలకత్తా వరకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ లేక చెన్నై ద్వారా చేరుకోవచ్చు. కలకత్తాలో బడ్జెట్ స్టే రూ.1,000 నుంచి రూ.3000లో లభిస్తుంది.జలియన్ వాలా బాగ్.. నెత్తుటి చరిత్రకు సాక్ష్యంపంజాబ్లో ఉన్న జలియన్ వాలా బాగ్ భారత చరిత్రలో ఒక పీడకలగా మిగిలిపోయింది. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఘటన భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఒక కొత్త దిశను ఇచ్చింది. ఇప్పుడు ఇది ఒక మెమోరియల్‌గా నిలిచి, ఆ నాటి చేదు జ్ఞాపకాలను నేటి తరానికి అందిస్తోంది.టూరిస్టులు ఇక్కడ మెమోరియల్, మ్యూజియం, చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఎంట్రీ సాధారణంగా ఫ్రీగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి అమత్సర్ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి ఢిల్లీ రూట్ అనుకూలంగానే ఉంటుంది.అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్ దగ్గర స్టే ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. బడ్జెట్ హోటల్స్ రూ.1,000 నుంచి రూ.2500 మధ్యలో దొరుకుతాయి. కంఫర్టబుల్‌గా స్టే చేయాలి అంటే రూ.3000 నుంచి రూ.5000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.ప్రతి ప్రాంతంలోని ప్రత్యేకమైన రుచులుఈ యాత్రలో ప్రతిప్రాంతం తన రుచులతో పరిచయం చేస్తుంది. ఆంధ్రా మన్యంప్రాంతాల్లో లోకల్ గిరిజన రుచులు, గోదావరి స్పెషల్ వంటకాలను ఆస్వాదించవచ్చు.అండమాన్ లో సీఫుడ్‌తో పాటు దక్షిణాది వంటకాలు లభిస్తాయి. గుజరాత్లో ఢోక్లా, తెప్లా, గుజరాతీ థాలీ, పంజాబ్‌లో అమత్సర్ కుల్చా, కోల్‌కతాలో బెంగాలీ స్వీట్స్ ఈ ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్‌లో భాగం అవుతాయి.5 రోజుల ఫ్రీడమ్ ట్రెయిల్.. ఎంత బడ్జెట్ కావాలి?ఈ ఫ్రీడమ్ ట్రెయిల్స్ని 5 రోజుల ప్లాన్ లో కవర్ చేయాలి అంటే ఎక్కువగా విమాన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే విమాన చార్జీలు, వసతి, భోజనం, రవాణా, ప్రవేశ రుసుము కలిపి బడ్జెట్ ట్రావెల్ కోసం సుమారు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు అవసరం పడవచ్చు.కంఫర్టబుల్ స్టాండర్డ్ ట్రావెల్ కోసం రూ.50 వేల నుంచి రూ.70 వేల మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. ప్రీమియం ట్రావెల్ అనుభూతి కోసం రూ.80 వేలపైనే బడ్జెట్ అవసరం అవుతుంది.విజయవాడ నుంచి ప్రయాణం చేస్తే కనెక్టివిటీని బట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది. స్టే కోసం ప్రతి డెస్టినేషన్ లో సుమారు రూ.1500 నుంచి రూ.4000 వరకు ఖర్చు అవుతుంది. ఫుడ్ కోసం రోజుకు రూ.300 నుంచి రూ.1500 వరకు మీ ఛాయిస్‌ను బట్టి ఖర్చు చేయవచ్చు.ఈ ఫ్రీడమ్ ట్రెయిల్లో ఆసక్తికర విశేషాలు...సెల్యులర్ జైల్‌ని బ్రిటిష్ కాలంలో కాలాపానీ అని పిలిచేవారు.అల్లూరి సీతారామ రాజుని తెలుగులో ప్రజలు మన్యం వీరుడు అని గౌరవిస్తారు.దాండీ మార్చ్‌ను మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి పారంభించారు.జలియన్ వాలా బాగ్ ఘటన భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక మలుపు లాంటిది.నేతాజి భవన్ లో సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన అరుదైన విషయాలు తెసుకోవచ్చు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
80వ ఏట అడుగిడుతున్న స్వాతంత్య్రం
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఆగస్టు 15 నాటితో 79 ఏళ్లు పూర్తవుతున్నాయి. మన స్వాతంత్య్రం 80వ ఏట అడుగిడుతోంది. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌వారు మన దేశాన్ని దాదాపు రెండువందల సంవత్సరాలు పాలించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857లో సిపాయిల తిరుగుబాటు చెలరేగింది. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన తొలి పోరాటమది. ఆ పోరాటం విఫలమైన తర్వాత కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పలు ఉద్యమాలు నడిచాయి. దక్షిణాఫ్రికాలో 1906లో అహింసా పోరాటంతో విజయం సాధించిన గాంధీజీ స్వదేశానికి తిరిగి వచ్చాక 1917 ఏప్రిల్ 17న తొలిసారిగా ‘చంపారన్ సత్యాగ్రహ’ ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ నాయకత్వంలో ఏకమైన ప్రజానీకం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉద్ధృతం చేసింది. చివరకు బ్రిటిష్ పాలకులు గద్దె దిగడంతో 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది.భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రభుత్వం ‘స్వేచ్ఛను గౌరవిస్తూ, భవితకు స్ఫూర్తిన్తూ’ నినాదాన్ని నేపథ్యంగా ఎంచుకుంది. గడచిన 79 ఏళ్లలో అధిగమించాల్సిన సమస్యలు చాలానే ఉన్నా, మన దేశం శాస్త్ర సాంకేతిక ఆర్థిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించింది. ఈసారి ఆగస్టు 15న ఎర్రకోట వద్ద జరగనున్న వేడుకల్లో తొలిసారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సైనిక సామగ్రిని ప్రదర్శించనున్నారు. ప్రధాని ప్రసంగాన్ని ‘డిజిటల్ ఇండియా భాషిణి’ ద్వారా ఏకకాలంలో ఇరవై భాషల్లో అప్పటికప్పుడే ప్రసారం చేయనున్నారు.ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర పోరాటంలో కొన్ని కీలకమైన మైలురాళ్లు...1857ఆనాటి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది.1858భారత ప్రజల రాజకీయ ఆకాంక్షల సాధన కోసం భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది.1905బెంగాల్ విభజన. దీనికి పర్యవసానంగా స్వదేశీ ఉద్యమం మొదలైంది.1919జలియన్‌వాలాబాగ్ దురంతం జరిగింది. తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమజ్వాలలు ఎగసిపడ్డాయి.1920–22గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరకరణోద్యమం దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా నడిచింది.1930గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు.1942‘క్విట్ ఇండియా’ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో ఊరూరా నిరసనలు జరిగాయి.1947 ఆగస్టు15బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. -
కియా కార్లపై ఆగస్టు ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు
కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కియా ఇండియా ఆగస్టు నెలలో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కంపెనీ తన పలు మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనం, కార్పొరేట్ బెనిఫిట్, లాయల్టీ బోనస్ వంటి పలు రకాల ప్రోత్సాహకాలను అందిస్తోంది. అయితే ఈ ప్రయోజనాలు అన్ని మోడళ్లు, వేరియంట్లకు ఒకేలా ఉండవు. డీలర్, నగరం, స్టాక్ లభ్యతను బట్టి కూడా మారే అవకాశం ఉంది.కియా కార్నివాల్ఆగస్టులో అత్యధిక ప్రయోజనం ఈ ప్రీమియం ఎంపీవీపై లభిస్తోంది. MY2026 మోడళ్లపై రూ.1 లక్ష వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.50,000 వరకు కార్పొరేట్ ఆఫర్, స్క్రాపేజ్ ప్రయోజనాలు కలిపి గరిష్ఠంగా రూ.1.5 లక్ష నుంచి రూ.1.70 లక్ష వరకు ప్రయోజనం లభిస్తుందని వివిధ తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే అన్ని ప్రయోజనాలు ప్రతి కొనుగోలుదారుడికి వర్తించవు.కారెన్స్ క్లావిస్MY2026 పెట్రోల్ వెర్షన్‌పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.20,000 స్క్రాపేజ్, రూ.15,000 వరకు కార్పొరేట్ ప్రయోజనం కలిపి రూ.95,000 వరకు లభించవచ్చు. పాత MY2025 టర్బో-పెట్రోల్ స్టాక్‌పై ప్రయోజనం మరింత ఎక్కువగా ఉండొచ్చు.కారెన్స్ క్లావిస్ ఈవీMY2026 ఎలక్ట్రిక్ MPVపై ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ద్వారా రూ.20,000, రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.15,000 వరకు కార్పొరేట్ ప్రయోజనం కలిపి రూ.75,000 వరకు ప్రయోజనం లభిస్తుంది.కియా సైరోస్MY2026 టర్బో-పెట్రోల్ వెర్షన్‌పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.20,000 ఎక్స్ఛేంజ్, రూ.20,000 స్క్రాపేజ్, రూ.15,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్ ఉన్నాయి. అంటే గరిష్ఠంగా రూ.65,000 వరకు ప్రయోజనం లభించవచ్చు. డీజిల్ వెర్షన్‌పై ప్రయోజనం రూ.55,000 వరకు ఉంటుంది.కియా సోనెట్ MY2026 సోనెట్‌లో ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.60,000 వరకు ప్రయోజనం ఉంది. ముఖ్యంగా 1.2 HTK(O) వేరియంట్‌పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్, రూ.15,000 స్క్రాపేజ్, రూ.15,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్ లభిస్తాయి.కియా సెల్టోస్ కొత్త తరం సెల్టోస్‌పై గరిష్ఠంగా రూ.40,000 వరకు ప్రయోజనం ఉంది. ఇందులో రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.20,000 స్క్రాపేజ్ ప్రయోజనం ఉన్నాయి. పాత MY2025 స్టాక్‌పై మాత్రం ప్రధానంగా స్క్రాపేజ్ బెనిఫిట్ మాత్రమే లభిస్తోంది.కియా కారెన్స్ MY2026 కారెన్స్‌పై ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ద్వారా రూ.20,000, కార్పొరేట్ బెనిఫిట్‌గా రూ.15,000 వరకు కలిపి రూ.35,000 వరకు ప్రయోజనం పొందవచ్చు.పాత స్టాక్‌పై భారీ ప్రయోజనాలుఆగస్టు ఆఫర్లలో MY2025 స్టాక్‌కు ప్రత్యేక ప్రాధాన్యం కనిపిస్తోంది. ముఖ్యంగా కారెన్స్ క్లావిస్ టర్బో-పెట్రోల్ MY2025 మోడళ్లపై రూ.1.40 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుండగా, ఇందులో భారీ క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది. సైరోస్ MY2025 స్టాక్‌పై రూ.70,000 వరకు ప్రయోజనం లభించవచ్చు. అందువల్ల పాత స్టాక్ కొనుగోలు చేసే వారు తయారీ నెల, మోడల్ ఇయర్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయడం మంచిది.ఇదీ చదవండి: 165 Km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. -
పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగా చేయూత పింఛన్ల మంజూరు ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్టు అధికారవర్గాల సమాచారం. జిల్లాల్లో ఇన్చార్జీ మంత్రులు లబ్దిదారులకు పింఛన్ ప్రొసీడింగ్స్ అందజేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రంలోని తలసేమియా, సికిల్‌సెల్ అనీమియా బాధితులందరికీ నూతన సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వీటి మంజూరు ప్రక్రియ ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ సంతృప్తికర స్థాయిలో పింఛన్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు తక్షణమే పింఛన్లు ఇవ్వాలని సూచించారు. గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా సంస్థ (సెర్ప్) రికార్డుల ప్రకారం ఇప్పటికే ప్రాథమికంగా 1,599 మంది బాధితులను గుర్తించి సర్టిఫికెట్లు ఇచ్చారు. మిగిలిన అర్హులైన బాధితులు కూడా వైద్య ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 6 వేల తలసేమియా, 1,700 సికిల్‌సెల్ అనీమియా బాధితులున్నట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. వీరిలో ఆగస్టు 15 నుంచి ఎంత మందికి నెలకు రూ.2,016 చొప్పున చేయూత పింఛన్లు మంజూరు చేస్తారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. -
ఎర్రకోట నెల్లాళ్లు మూసివేత.. కారణం ఇదే!
న్యూఢిల్లీ: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల నేపథ్యంలో ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోటను మూసివేస్తున్నట్లు భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) ప్రకటించింది. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఎస్ఐ వెల్లడించింది.ఈ కాలంలో కోటలోకి సందర్శకులెవరికీ అనుమతి ఉండదు. 1959 నాటి పురావస్తు స్మారక చిహ్నాల నిబంధనల ప్రకారం, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని భద్రతా సంస్థల ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల రోజుల వ్యవధిలో కోట ప్రాంగణంలో వేదికల నిర్మాణం, సాంకేతిక పరికరాల ఏర్పాటు, భద్రతా తనిఖీలు చేపట్టనున్నారు.2022 నుంచి ప్రతి ఏటా ఇలా ఒక నెల రోజుల పాటు ఎర్రకోటను మూసివేసే సంప్రదాయం కొనసాగుతోంది. కాగా, ఆగస్టు 15న నిర్వహించే అధికారిక వేడుకలకు ప్రత్యేక పాస్‌లు ఉన్న వారికి మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ప్రధాన వేదికగా నిలుస్తున్నందున, భద్రత పరంగా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: వాంగ్‌చుక్ దీక్షపై రాహుల్ మౌనం వెనుక.. -
ఎప్పటికీ అగ్రస్థానంలోనే..
వాషింగ్టన్: అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఆనందకరమైన, అద్భుతమైన మైలురాళ్లలో ఒకటిగా అభివర్ణించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాజధాని వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్లో ‘సెల్యూట్ అమెరికా’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న యోధులతోపాటు పలువురు ప్రముఖులను సత్కరించారు. వియత్నాం యుద్ధరంగంలో ప్రత్యేక దళాలకు నాయకత్వం వహించిన తొలి నల్లజాతి అధికారిని సన్మానించారు.తనదైన శైలిలో ప్రసంగిస్తూ జనాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కమ్యూనిజంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మనం ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంటామని అమెరికన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికాను ఎట్టిపరిస్థితుల్లోనూ పతనం కానివ్వబోమని తేల్చిచెప్పారు. తాము ఎల్లప్పుడూ అత్యుత్తమంగానే ఉంటామన్నారు. ‘సేవ్ అమెరికా చట్టాన్ని’ ఆమోదించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు.‘‘రోజు మన దేశం మళ్లీ విజయం సాధిస్తోంది. మునుపెన్నడూ లేనంత గొప్పగా పునరాగమనం చేసింది. మనం అమెరికాను గొప్పగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తాం. దీని ప్రకారం ఓటర్లందరూ తమ ఓటరు గుర్తింపు కార్డును చూపించాలి. అలాగే పౌరసత్వానికి సంబంధించిన రుజువును తప్పనిసరిగా సమర్పించాలి’’ అని ట్రంప్ తేల్చిచెప్పారు. ఇది నాకు ‘మూడో పర్యాయం’మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతానని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. తన హయాంలో అమెరికా సైన్యం ఎన్నో విజయాలు సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. దేశ సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నానని వివరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. తన ప్రస్తుత అధ్యక్ష పదవీకాలాన్ని ‘రెండో పర్యాయం’ అని కాకుండా ‘మూడో పర్యాయం’ అని పిలిచి ఉండాల్సిందని చెప్పారు. 2020 నాటి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందుకే బైడెన్ గెలిచారని ట్రంప్ పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.వాస్తవానికి ఆ ఎన్నికల్లో విజయం తనదేనని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన, శక్తివంతమైన దేశంగా అమెరికా ఎదగడం చరిత్రలో యాదృచి్ఛకంగా జరిగిన పరిణామం కాదని ట్రంప్ తేల్చిచెప్పారు. అధ్యక్షుడిగా తన మొదటి పదవీ కాలంలో సైన్యాన్ని గొప్పగా పునరి్నరి్మంచామని అన్నారు. వాస్తవానికి సైన్యాన్ని మూడో పదవీకాలంలో ఉపయోగిస్తామని చెప్పాలని వెల్లడించారు. కానీ, అలా చెప్పే ఉద్దేశం లేదన్నారు. వివాదానికి ఆస్కారం కల్పించడం తనకు ఇష్టం లేదన్నారు. స్వర్ణయుగానికి ఆరంభం మాత్రమేఎంతోమంది వీరుల త్యాగంతో అమెరికా జెండా ఎల్లప్పుడూ స్వేచ్ఛ, న్యాయాలకు చిహ్నంగా నిలుస్తోందని ట్రంప్ అన్నారు. చరిత్రకు సాక్షిగా నిలిచిన పలు అమెరికా జాతీయ జెండాలను నేషనల్ మాల్లో ప్రదర్శించారు. అమెరికా తొలినాటి జెండా కూడా ఇందులో ఉంది. 1777 నాటి జెండాను ట్రంప్ చూపించారు. అప్పట్లో 13 రాష్ట్రాలకు ప్రతీకగా 13 నక్షత్రాలు, 13 పట్టీలు ఉన్న జెండా అని చెప్పారు. యార్క్‌టౌన్ యుద్ధ సమయంలో విజయగర్వంతో రెపరెపలాడిన నక్షత్రాలు, పట్టీల జెండాను గుర్తుచేసుకున్నారు.నిరంకుశత్వంపై స్వేచ్ఛ సాధించిన విజయాన్ని, అణచివేతపై స్వాతంత్య్రం పొందిన ఆధిక్యతను 1776 జూలై 4 నుంచి 2026 జూలై 4 వరకు అమెరికన్ స్ఫూర్తి సాధించిన చిరస్థాయి విజయాన్ని నేడు గొప్ప వేడుకగా నిర్వహించుకుంటున్నామని వివరించారు. అమెరికాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఇది అమెరికా స్వర్ణయుగానికి ఆరంభం మాత్రమే. రెండున్నర శతాబ్దాల క్రితం నాటి తరహాలోనే ఒక విషయాన్ని ప్రకటిస్తున్నాం. మా దేశం, మా పిల్లల కోసం, స్వేచ్ఛా ఆశయం కోసం మా దేశాన్ని ఎవరూ చేరుకోని సరికొత్త శిఖరాలకు చేరుస్తాం.దేశాన్ని మరింత గొప్పగా, మెరుగ్గా, శక్తివంతంగా తీర్చిదిద్దుతాం. అమెరికాను మరింతగా ప్రేమిస్తాం’’ అని ట్రంప్ స్పష్టంచేశారు. అనారోగ్యం, వైకల్యం, సైనిక విధి నిర్వహణ లేదా ప్రయాణం వంటి అనివార్య కారణాలు ఉంటే తప్ప ఇకపై పోస్ట్ ద్వారా ఓటు వేసే విధానం ఉండదని చెప్పారు. దాంతో ఎన్నికల్లో మోసాలకు అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇందులో అర్థం కాని విషయం ఏదీ లేదన్నారు.కమ్యూనిజాన్ని ట్రంప్ మళ్లీ తప్పుపట్టారు. ‘‘కమ్యూనిస్ట్ వ్యవస్థ అమెరికన్ వ్యవస్థకు పూర్తిగా భిన్నమైనది. కమ్యూనిస్ట్ వ్యవస్థ ఎప్పుడూ విజయవంతం కాలేదు. ఆ ప్రమాదకరమైన వ్యవస్థ తిరిగి అమెరికాలో తన వికృత రూపాన్ని చూపిస్తామంటే ఇక్కడ ఎవరూ ఒప్పుకోరు. అమెరికా ఎప్పటికీ కమ్యూనిస్ట్ దేశం కాదు’’ అని ట్రంప్ పునరుద్ఘాటించారు. -
మేం మంచివాళ్లం.. ఇరాన్‌కు వారం సెలవిచ్చాం
ఇరాన్లో మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి జరుగుతున్న వీడ్కోలు కార్యక్రమాల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మౌంట్ రష్మోర్ వద్ద జరిగిన భారీ సభలో ఆయన చేసిన సెటైరికల్ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.“మేం మంచివాళ్లం కాబట్టి ఇరాన్‌కు ఒక వారం సెలవిచ్చాం” అంటూ ట్రంప్ ప్రసంగించారు. అంతకుముందు ఇరాన్‌పై జరిగిన సైనిక చర్యలను ప్రస్తావిస్తూ ఆయన “మేం ఇరాన్‌ను గట్టిగా దెబ్బకొట్టాం… వాళ్లు చర్చలకు సిద్ధంగా ఉన్నారు” అని వ్యాఖ్యానించారు.మేము వెనెజువెలాను ఒక రోజులోనే ఓడించాం. ఇరాన్‌ను కూడా తీవ్రంగా దెబ్బతీశాం. వాళ్లు ఇప్పుడు ఒప్పందానికి రావడానికి ఎంతో తహతహలాడుతున్నారు. మేము మంచివాళ్లం కాబట్టి వారికి అంత్యక్రియల కోసం ఒక వారం సమయం ఇచ్చాం. వీలైనంత త్వరగా వాళ్లు మాతో డీల్ కుదుర్చుకుంటే మంచిది అని అన్నారాయన.ట్రంప్ వ్యాఖ్యలను సభలో ఉన్నవాళ్లు చప్పట్లు, నవ్వులతో స్వాగతించారు. ప్రస్తుతం.. అమెరికా అంతటా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.Trump on Iran: "We Gave Them a Week Off… Because We're Nice." pic.twitter.com/AcJ63EaUjO— GP Singh (@GanpatSinghDew5) July 4, 2026ఇక మరోవైపు ఇరాన్లో సంతాప దినాలు నడుస్తున్నాయి. రాజధాని టెహ్రాన్‌లో గ్రాండ్ మోసల్లా కేంద్రంగా ఖమేనీకి వీడ్కోలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు నల్ల దుస్తుల్లో హాజరై కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు.. ‘‘అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలి.. ట్రంప్‌ను హతమార్చాలి’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, ఫ్లకార్డులు ఆ కార్యక్రమంలో కనిపించడం గమనార్హం. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం సాధారణంగా 24 గంటల్లో అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, యుద్ధ పరిస్థితులు, భద్రతా కారణాల వల్ల ఇంతకాలం వాయిదా వేస్తూ వచ్చారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ సంతాప యాత్రలో ఖమేనీ పార్థివదేహాన్ని ఖోమ్, నజాఫ్, కర్బలా మీదుగా మష్హద్‌కు తరలించి జూలై 9న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు భారత్, పాకిస్థాన్, రష్యా, చైనా సహా అనేక దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇరాన్లో శోక వాతావరణం కొనసాగుతున్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ దీనికి ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఉద్రిక్తతల కారణంగా.. అమెరికా–ఇరాన్ సంబంధాల్లో కొత్త రాజకీయ దుమారానికి కారణమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
న్యూయార్క్ వీధుల్లో ఉప్పొంగిన భారతీయత
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలో ఎఫ్.ఐ.ఏ ఆధ్వర్యంలో జరిగిన 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నేనుసైతం అంటూ పాల్గొని మాతృభూమి పట్ల మమకారాన్ని చాటింది. నాట్స్ నాయకులు, సభ్యులు పాల్గొని జన్మభూమి పట్ల తమకు ప్రేమను ప్రదర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో తెలుగు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక కూడా పాల్గొని ఈ పరేడ్‌కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఎఫ్.ఐ.ఏ ఏర్పాటు చేసిన ర్యాలీలో నాట్స్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ పూర్వ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు శ్రీ హరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల, బోర్డ్ డైరెక్టర్ వెంకట్ శాఖమూరి, నాట్స్ జాయింట్ సెక్రటరీ రామ్ నరేష్ కొమ్మనబోయిన, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీ కృష్ణ మేడిచెర్ల, నాట్స్ నాయకులు నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్) కిరణ్ మందాడి, నార్త్ ఈస్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, న్యూ జెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ కుమార్ వెనిగళ్ల, కో- కోఆర్డినేటర్ ప్రసాద్ టేకి, న్యూ జెర్సీ చాప్టర్ అడ్వైజర్ వంశీ కృష్ణ వెనిగళ్ల, శ్రీకాంత్ పొనకాల, శంకర్ జెర్రిపోతుల, శ్రీదేవి పులిపాక, గాయత్రి చిట్లేటి, గీత, కృష్ణ నెక్కంటి, రాకేష్ వేలూరు,సూర్య గుత్తికొండ, సురేష్ బొల్లు, సురేష్ బొందుగుల, DJ శేఖర్ తదితరులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. నాట్స్ సభ్యులు, నాట్స్ కుటుంబ సభ్యుల చిన్నారులు ఈ పరేడ్‌లో చేసిన ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తారిక, తన్వి లు చేసిన టాలీవుడ్ డాన్స్, సింధూర చేసిన క్లాసికల్ నృత్యం విశేషం గా ఆకర్షించాయి. రంగ మేడిశెట్టి చేసిన కృష్ణ వేషధారణ, భాగవత సందేశాలు కూడా అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. భారత్ మాతా కీ – జై! వందేమాతరం! జై హింద్ వంటి నినాదాలతో న్యూయార్క్ నగరం హోరెత్తింది. మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. చక్కటి సమన్వయంతో న్యూ జెర్సీ, ఫిలడెల్ఫియా చాప్టర్స్ నుంచి వచ్చిన నాట్స్ మిత్రులందరికీ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందనలు తెలియచేసారు. -
ఎమ్మెల్యే మాధవి తీరు సరికాదు
కడప సెవెన్‌రోడ్స్: స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా శుక్రవారం కడప పోలీసు పెరేడ్ మైదానంలో కడప ఎమ్మెల్యే ఆర్.మాధవిరెడ్డి జిల్లా ఉన్నతాధికారులైన జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు తదితర అధికారులతో వ్యవహరించిన తీరుపై రెవెన్యూ అధికారులు భగ్గుమంటున్నారు. ఈ సంఘటనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వేశ్వరనాయుడు, ఏపీ రెవెన్యూ సరీ్వసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవన్ చంద్రశేఖర్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, ఇతర వర్గాలకు జిల్లా యంత్రాంగం పోలీసు మైదానం వద్ద తగిన సౌకర్యాలు కల్పించిందన్నారు. పండుగ వాతావరణంలో స్వాతంత్య్ర దిన వేడుకలు జరుగుతున్న సమయంలో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఒకటిన్నర గంట ఆలస్యంగా అక్కడికి వచ్చారని పేర్కొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం మంత్రి, కలెక్టర్, ఎస్పీ మాత్రమే వేదికపై ఆశీనులు అవుతారన్నారు. ప్రజాప్రతినిధుల కోసం వేదిక పక్కన వీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేశామన్నారు. కాగా, ఎమ్మెల్యే మాధవి రెడ్డి కార్యక్రమానికి ఆలస్యంగా రావడంతో పాటు.. ఆలస్యంగా వచ్చే విషయాన్ని కనీసం ముందస్తుగా తమ వ్యక్తిగత సహాయకుల ద్వారానైనా అధికారులకు తెలియజేయలేదన్నారు. అప్పటికే ఎమ్మెల్యేకు కేటాయించిన సీటులో ఇతరులు కూర్చొన్నారని తెలిపారు. దీన్ని గుర్తించిన అధికారులు వెంటనే కూర్చొన్న వారిని అక్కడి నుంచి పంపివేసి ఎమ్మెల్యేను ఆహ్వానించారన్నారు. ఎమ్మెల్యే మాధవీ అక్కడ కూర్చొనేందుకు విముఖత చూపారన్నారు. దీంతో వేదికపై ప్రత్యేకంగా కూర్చుని సమకూర్చి ఆహ్వానించుమన్నారు. ముందుగానే వేదికపై కుర్చీ వేయలేదని ఆమె అసహనం వ్యక్తం చేయడంతో పాటు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ స్వయంగా వెళ్లి వేదికపైకి రావాలంటూ ఆహ్వానించినా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరుషంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి సివిల్ సరీ్వసెస్ సాధించి జిల్లా ప్రజలకు సేవలు అందించేందుకు వచ్చిన జాయింట్ కలెక్టర్‌పై ఎమ్మెల్యే అమర్యాదకరంగా ప్రవర్తించడం జిల్లాకే అవమానకరమని వాపోయారు. ఎమ్మెల్యేతోపాటు అక్కడికి వచ్చిన అనధికార ప్రజాప్రతిని«ధి కూడా జిల్లా రెవెన్యూ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించడం గర్హనీయమన్నారు. అధికారులను అవమానించే విధంగా ప్రవర్తించడం ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదన్నారు. స్వయంగా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వెళ్లి వేదికపైకి రావాలంటూ ఎమ్మెల్యేను ఆహ్వానించినప్పటికీ ఆమె రాకుండా వెళ్లిపోయిందని తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలను స్మరించుకునేందుకు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో పాల్గొని ఆస్వాదించే బదులు తనకు కుర్చీ వేయలేదంటూ అధికారులపై రుసరుసలాడటం అత్యంత హేయమని దుయ్యబట్టారు. జిల్లా అధికారులనే ఆమె దురుసుగా మాట్లాడుతోందంటే ఇక కిందిస్థాయి అధికారులపై ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ప్రభుత్వాస్పత్రిలో ఐటీడీఏ పీవో సతీమణి ప్రసవం
భద్రాచలం టౌన్: భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ తన సతీమణి మనీషా కు భద్రా చలం ఏరియా ఆస్పత్రిలో ప్రసవం చేయించారు. ఈమేరకు ఆమె శుక్రవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రు ల్లో మెరుగైన వైద్యం అందుతోందని ప్రజలకు భరోసా కల్పించేందుకు.. గతంలో భద్రాద్రి కలెక్టర్‌గా పనిచేసిన అనుదీప్, ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తమ సతీ మణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం చేయించడం తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్స వం రోజు బిడ్డకు జన్మనిచ్చిన రాహుల్ దంపతులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు రామకృష్ణ, విజయ్ బృందం ఆధ్వర్యంలో మనీషాకు ప్రసవం చేశారు. -
ఎర్రకోట సాక్షిగా పాకిస్తాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక
-
అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుంది
న్యూఢిల్లీ: వెలుగులోకి వస్తున్న ఎన్నికల అక్రమాలను చూస్తే అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని అర్థమవుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జెండా ఎగురవేసిన అనంతరం నాయకులు, శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. జోరున వర్షం కురుస్తుండగానే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్యనేతలు జెండా వందనం కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ..బిహార్‌లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) పేరుతో బతికున్న వారిని సైతం చనిపోయినట్లుగా ధ్రువీకరించడం ద్వారా ప్రతిపక్షాలకు పడే ఓట్లను తొలగించారని ఆరోపించారు. తొలగింపునకు గురైన 65 లక్షల ఓట్లకు సంబంధించి బీజేపీ ఒక్క అభ్యంతరం కూడా వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఎస్ఐఆర్తో లాభం కలిగేది బీజేపీకి మాత్రమేనని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇలాంటి అక్రమాలు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఏ ప్రాతిపదికన ఓట్లను రద్దు చేసిందో తెలిపేందుకు ఈసీ సైతం సిద్ధంగా లేదని ఆరోపించారు. అధికారంలో కొనసాగేందుకు ఆ పార్టీ ఎంత అనైతికతకయినా సిద్ధమవుతోందని దీంతో స్పష్టమవుతోందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం సాగిస్తుందే తప్ప, ఎన్నికల్లో విజయం కోసం కాదని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు విభాగాలైన ఈడీ, సీబీఐలతోపాటు ఆదాయపన్ను శాఖను సైతం బీజేపీ సర్కార్ బాహాటంగా దుర్వినియోగం చేస్తోన్న విషయాన్ని ప్రత్యక్షంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పిందని ఆయన అన్నారు. అలీన విధానం ద్వారా కూడగట్టుకున్న ప్రతిçష్టను బీజేపీ సర్కార్ హయాంలో మన దేశం కోల్పోవాల్సి వచ్చిందని ఖర్గే విమర్శించారు.వర్షంలో తడుస్తూ రాహుల్ జెండా వందనంఇందిరా భవన్ ప్రాంగణంలో పార్టీ చీఫ్ ఖర్గే జెండా ఎగురవేస్తుండగా ఆయన పక్కనే అగ్రనేత రాహుల్ గాంధీ వర్షంలో మిగతా వారితో కలిసి తడుస్తూనే నిలబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో షేర్ చేసింది. ‘ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం. వీటి పరిరక్షణ కోసం ఇకపైనా పోరాడుతాం’అని ఆ పార్టీ పేర్కొంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
బ్రూనై తెలుగు సంఘం 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బ్రూనై దారుస్సలాంలో భారత హైకమిషన్ నిర్వహించిన 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బ్రూనై తెలుగు సంఘం, గర్వంగా పాల్గొంది.ఈ వేడుకల్లో సంఘానికి చెందిన పిల్లలు దేశభక్తి గీతాలకు నృత్యాలు, భారత మాత వేషధారణ, ప్రేరణాత్మక ప్రసంగాలు, ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. భారత హైకమిషనర్ శ్రీ రాము అబ్బగాని గారు భారత గౌరవనీయ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని వాచించారు మరియు కొత్తగా ప్రారంభించిన భారత హైకమిషన్ భవనంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు వెంకట రమణ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు: ఈ చారిత్రాత్మక వేడుకలో భాగం కావడం మా గర్వకారణం. ఇది మన చిన్నారుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా, భారతదేశం మరియు బ్రూనై దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తుందన్నారు. భారతీయ సాంస్కృతిక సంపదను విదేశాల్లో ప్రోత్సహించే సాంస్కృతిక, విద్యా సామాజిక కార్యక్రమాలలో బ్రూనై తెలుగు సంఘం చురుకుగా పాల్గొంటూనే ఉందని తెలిపారు. -
Independence Day: కోహ్లి అలా.. గంభీర్ ఇలా.. పోస్ట్ వైరల్
భారత స్వాతంత్య్ర దినోవత్సం సందర్భంగా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఉద్వేగపూరిత నోట్ రాశాడు. ఎంతో మంది వీరుల ప్రాణత్యాగాల వల్లే మనం ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నాడు. అలాంటి నిజమైన హీరోలకు సెల్యూట్ చేస్తున్నానంటూ... దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు.భారతీయుడినైనందుకు గర్విస్తున్నా‘‘ఈరోజు మనం ఇలా స్వేచ్ఛగా నవ్వగలుగుతున్నామంటే అందుకోసం నాడు వారంతా ధైర్యంగా ఒక్కటై పోరాడటమే కారణం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన వీరుల త్యాగాన్ని గౌరవిస్తూ.. వారికి సెల్యూట్ చేస్తున్నా. భారతీయుడినైనందుకు గర్విస్తున్నా. జై హింద్’’ అంటూ విరాట్ కోహ్లి ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అతడి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా అంతర్జాతీయ క్రికెట్లో 82 శతకాలు సాధించిన కోహ్లి.. ఇప్పటికే ఇంటర్నేషనల్ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డే, ఐపీఎల్లో కొనసాగుతున్న ఈ దిగ్గజ బ్యాటర్.. ఇటీవలే మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు అతడు సన్నద్ధమవుతున్నాడు.కాగా టీమిండియా తరఫున 123 టెస్టులు ఆడిన కోహ్లి.. 30 శతకాలు, ఏడు డబుల్ సెంచరీల సాయంతో 9230 పరుగులు సాధించాడు. అదే విధంగా.. 125 టీ20 మ్యాచ్‌లలో కలిపి 4188 రన్స్ చేశాడు. ఇందులో ఓ శతకంతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లండన్‌లో నివాసంమరోవైపు.. వన్డేల్లో ఛేజింగ్ కింగ్‌గా పేరొందిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్‌కు కూడా సాధ్యం కాని విధంగా.. 51 సెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.ఇక కోహ్లి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామికా, అకాయ్‌లతో కలిసి లండన్‌లోనే ఎక్కువగా నివాసం ఉంటున్నాడు. కెరీర్‌కు సంబంధించిన షెడ్యూల్ పూర్తికాగానే వెంటనే లండన్‌లో వాలిపోతున్నాడు. తమ పిల్లల గోప్యత, సంరక్షణ దృష్ట్యా కోహ్లి దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నారు.దిగ్గజాల శుభాకాంక్షలు.. నా దేశమే నా గుర్తింపుటీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను విజేతగా నిలిపిన తర్వాత మువ్వన్నెల జెండా చేతబట్టిన ఫొటోను షేర్ చేశాడు. ఇక టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే, మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ తదితరులు 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్.. ‘‘నా దేశం, నా గుర్తింపు.. నా జీవితం.. జై హింద్’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. చదవండి: ధోని జట్టు నుంచి నన్ను తప్పించాడు.. అప్పుడే రిటైర్ అయ్యేవాడిని.. కానీ..: సెహ్వాగ్ -
దేశీయ దిగ్గజం హవా.. ఒకేసారి నాలుగు కొత్త కార్లు
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా'.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒకేసారి నాలుగు (విజన్ ఎక్స్, విజన్ టీ, విజన్ ఎస్, విజన్ ఎన్ఎక్స్టీ) కొత్త కాన్సెప్ట్ ఎస్‌యూవీలను ఆవిష్కరించింది. ఈ నాలుగు కార్లు సరికొత్త డిజైన్ కలిగి.. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.మహీంద్రా ఆవిష్కరించిన కొత్త ''విజన్ ఎక్స్, విజన్ టీ, విజన్ ఎస్, విజన్ ఎన్ఎక్స్టీ'' కార్లు.. ఎన్యూ.ఐక్యూ (NU.IQ) అనే కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇవి ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర కార్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటాయి.మహీంద్రా విజన్ టీ & విజన్ ఎన్ఎక్స్టీమహీంద్రా విజన్ టీ & విజన్ ఎన్ఎక్స్టీ రెండూ కూడా చూడటానికి కొంత థార్ మాదిరిగా ఉంటాయి. విజన్ టీ కారు బాక్సీ బాడీని కలిగి ఉండగా, విజన్ ఎన్ఎక్స్టీ డెక్‌లోని స్పేర్ వీల్స్‌కు అనుగుణంగా ఉండే.. ట్రక్ లాంటి క్యాబిన్‌ను పొందుతుంది. మొత్తం మీద ఈ కార్లు దృఢంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వీటికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.మహీంద్రా విజన్ ఎస్మహీంద్రా విజన్ ఎస్ అనేది బాక్సీ అవుట్‌లైన్ పొందుతుంది. ఎల్ఈడీ లైట్స్, ట్విన్ పీక్స్ లోగో, హెడ్‌ల్యాంప్ కోసం సరికొత్త డిజైన్ వంటివి గమనించవచ్చు. ఇది ఆఫ్ రోడ్ మాదిరిగా అనిపిస్తుంది. కాబట్టి రూప్ మీద లైట్స్, దృఢమైన బంపర్, వీల్ ఆర్చ్‌లతో సైడ్ ప్లాస్టిక్ క్లాడింగ్ వంటివన్నీ గమనించవచ్చు. విజన్ ఎస్ కారులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, స్ట్రీమ్లైన్డ్ ఓఆర్వీఎం, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ గమనించవచ్చు.ఇదీ చదవండి: పెరగనున్న ఆ బ్రాండ్ కార్ల ధరలు: సెప్టెంబర్ 1 నుంచే..మహీంద్రా విజన్ ఎక్స్మహీంద్రా విజన్ ఎక్స్ కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ముందు భాగంలో సన్నని హెడ్‌ల్యాంప్, పొడవుగా ఉండే హుడ్ వంటివి ఈ కారులో గమనించవచ్చు. పైకప్పు క్రిందికి వాలుగా ఉంటుంది, ఇది కూపే లాంటి రూపాన్ని ఇస్తుంది. విజన్ ఎక్స్ ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌ను కలిగి ఉన్న వెనుక బంపర్ పొందుతుంది. -
విమెన్ వారియర్స్ ఆర్మీ అధికారులతో ఫెమినా ఇండియా వీడియోవైరల్
ఫెమినా ఇండియా ( Femina India )అంటే అందాల పోటీలు మాత్రమే కాదు. అత్యంత ధైర్య సాహసాలతో అత్యంత క్లిష్టమైన సమయాల్లో దేశానికి సేవచేసే ధీర వనితలను గౌరవించుకోవడం కూడా. ఫెమినా ఇండియా ఆగస్టు 2025 కవర్ పది మంది భారత ఆర్మీ మహిళా అధికారులతో రూపొందించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తోంది. “ప్రతి వందనం వెనుక ఒక ప్రయాణం ఉంటుంది. దేశంలోని వివిధ మూలల నుండి విభిన్నమైన, అద్భుతమైన కథలు. వారి గ్లామర్ కోసం కాదు అత్యంత ధైర్యసాహసాలకోసం..అంటూ సాగే ఈవీడియోను విశేషంగా నిలుస్తోంది.వారియర్ ఉమెన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ శీర్షికతో 1997-బ్యాచ్ IRAS అధికారి అనంత్ రూపనగుడి షేర్ చేసిన శక్తివంతమైన వీడియోను ఫెమినా ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కేవలం ఫ్యాషన్ షూట్ కాదు-యూనిఫాంలో అధికారులుగా దేశాన్ని రక్షించే మహిళలకు ఒక బోల్డ్ సెల్యూట్. ఇండియన్ ఆర్మీలో మహిళల ఇమేజ్ను ముఖ్యంగా, పది మంది విశిష్ట మహిళా అధికారులకు గొప్ప గౌరవ సూచకంగా దీన్ని రూపొందించింది. ఈ శక్తివంతమైన వీడియోలో, మ్యాగజైన్ కవర్ షూట్ దేశంలోని మహిళా యోధులకు సెల్యూట్ చేసింది. కల్నల్ల నుండి లాన్స్ నాయక్ వరకు పది మంది భారతీయ ఆర్మీ అధికారులు తమ ఆలివ్-గ్రీన్ యూనిఫామ్‌లలో సగర్వంగా ఇందులో కనిపిస్తారు. ప్రతీ ఫ్రేమ్‌లో వారి ధైర్య సాహసాలు, క్రమశిక్షణ, దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ఎన్నో అడ్డంకులను ఛేదించి, ఈ స్థాయికి చేరి దేశానికి గౌరవంగా సేవ చేస్తూ అచంచలమైన దేశభక్తి నిదర్శనంగా ఉన్నారు. అంతేకాదు ఎంతోమంది మహిళలకు తమ కలలను సాకారం చేసుకునేలా ప్రేరణనిచ్చేట్టుగా, దేశ సేవ ద్వారా తమ ధైర్యాన్ని పట్టుదలను నూరిపోసేట్టుగా ఉందీ వీడియో. View this post on Instagram A post shared by Femina (@feminaindia) ఈ వీడియోలో కల్నల్ సోఫియా ఖురేషి, కల్నల్ మేఘనా డేవ్, కల్నల్ పోనుంగ్ డోమింగ్, SM, కల్నల్ అన్షు జామ్వాల్, లెఫ్టినెంట్ కల్నల్ కృతికా పాటిల్, మేజర్ ద్విపన్నిత కలిత, కెప్టెన్ ఓజస్విత శ్రీ, కెప్టెన్ శ్రద్ధా శివదావ్కర్, లాన్స్ నాయక్ ఆషిక, లాన్స్ నాయక్ మంజును చూడవచ్చు.కల్నల్ సోఫియా ఖురేషి: సోఫియా ఖురేషి భారత సైన్యంలో సీనియర్ అధికారి ఆపరేషన్ సిందూర్ సమయంలో అధికారిక ప్రెస్ బ్రీఫింగ్‌కు నాయకత్వం వహించి వార్తల్లోనిలిచిన ధీర.మేజర్ డాక్టర్ దీపన్విత (ద్విపన్నిత) కలిత: అస్సాం మొట్టమొదటి మహిళా పారాట్రూపర్, ఆగ్రాలో శిక్షణ పొంది 2023లో ధేకియాజులి నుండి ఫెమినా ఇండియా కవర్ వరకు ఆమె ప్రయాణం ప్రేరణ యొక్క స్మారక చిహ్నంగా మారింది. ల్నల్ పోనుంగ్ డోమింగ్: అరుణాచల్ ప్రదేశ్ నుండి వచ్చిన మొదటి మహిళా కల్నల్. -
"నిశ్శబ్ద సంక్షోభం"గా ఊబకాయం: ప్రధాని మోదీ
స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రధాని మోదీ యువతకు, ప్రజలకు ఎన్నో వరాలజల్లు కురిపించేలా పథకాలను అందించడమే కాకుండా ప్రజా ఆరోగ్యంపై కూడా మాట్లాడారు. ఈమేరకు ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..ప్రస్తుతం ప్రజలంతా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యపై కీలక వ్యాఖ్యలతోపాటు కొన్ని సూచనలు కూడా అందించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని సుమారు 103 నిమిషాల పాటు జరిగిన ప్రసంగంలో లక్షలాది మంది పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ..జీవనశైలిలో వస్తున్న మార్పులు, సరైన ఆహారపు అలవాట్ల లేమి, తగిన శారీరక శ్రమ లేకపోవడం కారణంగా గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం ఎలా పెరిగిపోతోందో నొక్కి చెప్పారు. అంతేగాదు రాబోయే సంవత్సరాల్లో ఊబకాయం మన దేశానికి పెద్ద సవాలుగా మారవచ్చు అని కూడా అన్నారు. ప్రతి కుటుంబంలో నూనె వాడకాన్ని సుమారు 10% తగ్గిస్తే ఇది దేశ ఆరోగ్యానికే మేలు చేస్తుందని చెప్పారు. వంటనూనెతో వ్యాధుల కనెక్షన్..ప్రధాని మోదీ నూనె వాడకం గురించి ఇచ్చిన పిలుపు నిజంగా సరైనదేనా..అంటే..ముమ్మాటికి కరెక్టేనని చెబుతున్నారు నిపుణులు. అధిక నూనె వినియోగం వల్ల సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలో అధికమై బరువు పెరిగేందుకు దారితీస్తుందని తెలిపారు. అలాగే ఈ అధిక కొలెస్ట్రాల్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాని పెంచేస్తుందని పోషకాహారా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మోదీ భారతీయులు తక్కువ నూనెను ఉపయోగించే సాంప్రదాయ వంట పద్ధతులను స్వీకరించడం తోపాటు ఆవిరి పట్టడం, వేయించడం, ఉడకబెట్టడం, వంటి వాటిపై ఆధారపడాలని, మొక్కల ఆధారిత పదార్థాలను చేర్చుకోవాలని ప్రజలకు హితవు పలుకుతున్నారు. జీవనశైలిపై దృష్టి సారించాలి..ఒత్తిడి, ఆందోళనతో యువత బాధపడటానికి కారణం, యోగా ధ్యానం వంటి అలవాట్ల లేమి కారణమని చెబుతున్నారు మోదీ. కనీసం నడక, సైక్లింగ్, కొద్దిపాటి వ్యాయామాలు చేయాలని సూచించారు. ప్రాసెస్ చేసిన పదార్థాలకు దరిచేరనీయకుండా తృణధాన్యాలు, కూరగాయలు, కాలానుగుణ పండ్లను తీసుకోవాలని సూచించారు. చారిత్రాత్మకంగా భారత్ అనుసరించే సమతుల్య సాంప్రదాయ ఆహార జ్ఞానానికి మళ్లీ తిరిగి రావాలని ఆ ప్రసంగంలో కోరారు.ఎందకు ఈ హెచ్చరికలు అంటే..ఈ ఊబకాయం ప్రస్తుతం నగరాలకే పరిమితం కాలేదు. భారతదేశంలో 24% మంది మహిళలు, 23% మంది పురుషులు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. పట్టణ ప్రాంతంలో ఈ పరిస్థితి మరి ఎక్కువగా ఉంది. బాధకరం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉండటమేనని అన్నారు మోదీ. అందుకు ప్రధాన కారణం కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగమేనని చెప్పారు.ఇక 136 మిలియన్ల మందికి పైగా ప్రీ డయాబెటిస్ ఉంది. అందులో ఎక్కువ భాగం ఊబకాయం కారణంగా ఈ వ్యాధి బారినపడినవే.బడి వయసు పిల్లలు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ఊబకాయం కారణంగా వచ్చే వ్యాధుల ప్రమాదం..ఊబకాయం బహుళ దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..టైప్ 2 డయాబెటిస్రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులురొమ్ము, పెద్దప్రేగు కేన్సర్‌తో సహా కొన్ని రకాల కేన్సర్లుకీళ్ల ఒత్తిడి కారణంగా వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ తదితరాలు వస్తాయి.దీన్ని గనుక ఆదిలోనే అదుపులో ఉంచే ప్రయత్నం చేయకపోతే 2035 నాటికి, ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఈ అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబెసిటీ సమాఖ్య అంచనా వేసింది.ఆరోగ్యం కోసం జాతీయ మిషన్..ఊబకాయంపై వ్యతిరేకంగా పోరాడటాన్ని వ్యక్తిగత బాధ్యత, సమిష్టి లక్ష్యంగా రూపొందించారు మోదీ. నిజానికి చమురు వినియోగాన్ని 10% తగ్గించాలనే ఆయన సూచన పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు..పైగా అందరూ సులభంగా ఆచరించదగినదే. తర్వాతి తరాలకి ఆరోగ్యకరమైన దేశాన్ని బహుమతిగా ఇవ్వాలన్న ఆకాంక్షతో మోఈ ప్రజలకు ఈ ఆరోగ్య సూచనలిచ్చారు. ఆ నేపథ్యంనే మోదీ ఫిట్ ఇండియా ఉద్యమం, పోషన్ అభియాన్ వంటి ప్రచార కారక్రమాలను చేపట్టారు.ఆచరణలోకి తీసుకురాగలమా అంటే..ప్రధాని మోదీ పిలుపుని ఆచరణలో పెట్టేందుకు ఏమంత కష్టపడిపోవాల్సిన పనిలేదు..జస్ట్ ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు..వంట చేసే మందుకు నూనెను కొలత ప్రకారం ఉపయోగిస్తే చాలు. కంటైనర్ నుంచి నేరుగా కాకుండా ఒక స్పూన్ లేదా కొలతగా పెట్టుకున్న మరేదైనా చాలు. ఆరోగ్యకరమైన నూనెలు ఎంచుకోండి. అంటే ఆవాలు, వేరుశెనగ, బియ్యం ఊక నుంచి వచ్చే ఆయిల్ వంటి వాటిని ఎంచుకోండి. డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. రోజుకు 30 నిమిషాలు నడక లేదా కొద్దిపాటి వ్యాయమాలకి కేటాయించే ప్రయత్నం చేయండి చాలు.గమనిక: ఇది కేవలం అవగామన కోసంమ మాత్రమే ఇచ్చాం. పూర్తి వివ్రాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..) -
బాలీవుడ్ తారలు.. నిజ జీవితంలో సైనికులు..
పోరాటాలు, నిరసనలు, ప్రాణాత్యాగాలతోనే స్వాతంత్ర్యం వచ్చింది. భరతమాత తన సంకెళ్లు విదిలించుకుని స్వేచ్ఛను పొంది నేటి(ఆగస్టు 15)కి 79 ఏళ్లు. ఈ స్వాతంత్ర్య దినోత్సవంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. దేశభక్తిని చాటిచెప్పే పాటలెన్నో ఉన్నాయి. అయితే ఈ రోజు మనం దేశాన్ని శత్రువుల బారి నుంచి కంటికిరెప్పలా కాపాడుతున్న ఆర్మీలో పని చేసిన సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్న తారలకు సెల్యూట్ చేద్దాం..కెప్టెన్ రాజు80's, 90'sలో విలన్‌గా రాణించిన కెప్టెన్ రాజు ఒకప్పుడు భారత ఆర్మీకి కెప్టెన్‌గా వ్యవహరించారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాల్గొన్నారు. ఐదేళ్లు సైన్యంలో ఉన్న రాజు తర్వాత ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చారు.సునీల్ శెట్టిసునీల్ శెట్టి సైన్యంలో పని చేయలేదు, కానీ అతడి తండ్రి వీరప్ప శెట్టి లెఫ్టినెంట్ కల్నల్‌గా ఆర్మీలో సేవలందించారు.నానా పటేకర్నానాపటేకర్ మూడేళ్లపాటు ఆర్మీలో శిక్షణ తీసుకున్నారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో గౌరవ కెప్టెన్‌గా వ్యవహరించారు. కొంతకాలానికే గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను పొందారు. 2013లో ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.సంజయ్ దత్1947లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పాల్గొన్నాడు.అచ్యుత్ పోట్దార్నటుడు అచ్యుత్ చదువు పూర్తవగానే ఆర్మీలో చేరారు. ఆ తర్వాత సినిమాల్లో రంగప్రవేశం చేశారు.బిక్రంజీత్ కన్వర్పాల్బిక్రంజీత్ నటుడు కాకముందు ఒక జవాన్.. మేజర్‌గా ఉన్నప్పుడే ఆర్మీ నుంచి వైదొలిగారు.గుఫి పైంటల్మహాభారతం సీరియల్లో శకునిగా నటించిన గుఫి ఒకప్పుడు ఆర్మీలో పని చేసినవ్యక్తే.. భారత్-చైనా సరిహద్దులో జవాన్‌గా విధులు నిర్వర్తించారు.మహ్మద్ అలీ షాతండ్రి బాటలోనే నడుస్తూ అలీ షా కూడా సైన్యంలో చేరాడు. ఆర్మీలో మేజర్‌గా పని చేశారు. తర్వాత సినిమాల్లోకి వచ్చారు.రుద్రశిష్ ముజందార్చిచోరే, జెర్సీ ఫేమ్ రుద్రశిష్ ముజందార్ 2011లో సైన్యంలో చేరారు. 2018లో మేజర్‌గా ఉన్నప్పుడే రిటైర్మెంట్ తీసుకున్నారు.మనోజ్ బాజ్పాయ్సత్య నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee)కు ఆర్మీలో పని చేయాలన్నది కల. జాతీయ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్ష రాసి పాసయ్యాడు, కానీ ఇంటర్వ్యూలో ఫెయిలయ్యాడు. నిజ జీవితంలో ఆర్మీలో చేరలేకపోయాడు కానీ 1971 సినిమాలో జవాన్‌గా నటించాడు.చదవండి: ‘కూలీ’ కంటే ‘వార్ 2’కే తక్కువ కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే? -
22 రాష్ట్రాలు, 170 నగరాల్లో రాబిన్ హుడ్ ఆర్మీ మిషన్ సంకల్ప్
సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం అంటే కేవలం జాతీయ జెండా ఎగరేయడం మాత్రమే కాదు.. మనం సమాజానికి తిరిగి ఇచ్చే క్షణం కూడా.. ఈ ఆలోచనతోనే స్వచ్ఛంద సేవా సంస్థ రాబిన్ హుడ్ ఆర్మీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా మిషన్ సంకల్ప్ 78 ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఆగస్టు 1న మొదలైన ఈ యాత్రలో 22 రాష్ట్రాలు, 170 నగరాల్లో వెనుకబడిన 78 లక్షల పౌరులకు భోజనం, అవసరమైన వస్తువులు అందించనున్నారు. దీంతోపాటు 78 పార్కులు, లైబ్రరీలు, ఆట స్థలాలు, వారసత్వ కట్టడాలు, స్కిల్ సెంటర్లను పునరుద్ధరిస్తూ.. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రత్యేక అర్థాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిరుపేదల ఆశయాలను ప్రోత్సహించేలా.. మూడు లక్షల మందికి పైగా వాలంటీర్లతో పనిచేసే ఈ సంస్థకు యూనిలివర్, స్విగ్గీ, నోవోటెల్ వంటి అనేక కార్పొరేట్ భాగస్వాములు తోడయ్యారు. రణవీర్ అల్లాహబాదియా, హెల్లీ షా, శెహా్నజ్ గిల్ వంటి ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో దీనిపై ప్రచారం చేస్తున్నారు. ముంబయిలో మాన్కుర్డ్ స్టేషన్ ఆర్ట్ రెన్యువల్, లోనావాలా స్కూల్ సైన్స్ ల్యాబ్ పునరుద్ధరణ, ఢిల్లీలో దృష్టి లోపం ఉన్న బాలికల కోసం బ్రెయిలీ ఆర్ట్ హాల్ వంటి ప్రాజెక్టులు ఈ మిషన్ కృషిని ప్రతిబింబిస్తోంది. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ ఆర్మీ స్వదేశీ విభాగం హెడ్ సుస్మితా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. లక్షలాది మందికి భోజనం అందించడం మాత్రమే కాదు, వారి ఆశను, ఆశయాలను నెరవేర్చేలా కార్యాచరణను రూపొందించామన్నారు. 2014లో ప్రారంభమైన ఈ జీరో–ఫండ్స్ ఉద్యమం ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 162 మిలియన్ల భోజనాలను అందించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. -
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో పంద్రాగస్టు వేడుకలు (ఫోటోలు)
-
ప్రపంచ ఆటోమొబైల్ రంగం: తిరుగులేని శక్తిగా భారత్
సువిశాలమైన భారతదేశం ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తూ ప్రపంచానికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే.. ఇదంతా ఒక్క రోజులో జరిగిన పురోగతి కాదు, దశాబ్దాల తదేక కృషి ఫలితమే ఈ అభివృద్ధి. ఇండియాలో ఇతర రంగాలు ఒక ఎత్తయితే, ఆటో మొబైల్ రంగం మరో ఎత్తు అనే చెప్పాలి.1957 వరకు సొంతంగా కారుని ఉత్పత్తి చేయలేని భారత్ ఈ రోజు ప్రపంచ ఆటోమొబైల్ పవర్‌హౌస్‌లలో ఒకటిగా ఎదిగింది. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ.. అఖండ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడింది. నిజానికి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రయాణం చాలా బిన్నంగా ఉంటుంది. మన దేశంలో మొదటి వాహనం 1897లో అడుగుపెట్టినప్పటికీ దానిని ఒక ఆంగ్లేయుడు దిగుమతి చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది.టాటా కారును కలిగిన మొదటి భారతీయ సంతతి వ్యక్తి..ఇండియా.. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బొంబాయి, మద్రాస్, కలకత్తా వంటి నగరాల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే కార్లు ఉండేవి. 20వ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకు భారతదేశంలోని దాదాపు అన్ని కార్లు దిగుమతి చేసుకున్నవే. 1898లో జమ్సెట్జీ నుస్సర్వాన్జీ (Jamsetji Nusserwanji) టాటా కారును కలిగి ఉన్న భారతీయ సంతతికి చెందిన మొదటి వ్యక్తి అయ్యాడు.ఆవిరితో నడిచే వాహనాలు..తరువాత కాలక్రమంలో ఆవిరితో నడిచే వాహనాలు ఆధిపత్యం చెలాయించాయి. 1903వ సంవత్సరంలో మద్రాస్‌లోని సింప్సన్ & కోకి చెందిన 'శామ్యూల్ జాన్' భారతదేశపు మొట్టమొదటి ఆవిరి కారును నిర్మించాడు. అప్పట్లో ఈ కారు గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇది తరువాత వచ్చిన భవిష్యత్ ఆవిష్కరణలకు కూడా ఆధారంగా నిలిచింది. 1928లో జనరల్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తన బొంబాయి ఫ్యాక్టరీలో ట్రక్కులు, కార్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. 1930 నాటికి ఫోర్డ్ మోటార్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్రాస్‌లో ఆటోమొబైల్స్ అసెంబ్లీని ప్రారంభించింది.భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో 1948 నాటికి హిందుస్థాన్ మోటార్స్, మహీంద్రా, స్టాండర్డ్, ప్రీమియర్, టాటా మోటార్స్ వంటి ప్రధాన కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత కాలంలోనే దేశం కొత్త ప్రగతి యుగానికి నాంది పలికేందుకు సిద్ధమైంది. మహాత్మా గాంధీ స్వావలంబన సూత్రాలకు అనుగుణంగా, స్వదేశీ ఆటో పరిశ్రమను నిర్మించాలనే కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది.భారతీయ ఆటోరంగానికి ఆటంకం..ఆటోమోటివ్ భాగాలను మాత్రమే కాకుండా వాహనాల కోసం అంతర్గత పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే నిర్ణయం 1952 నాటి టారిఫ్ కమిషన్ సృష్టికి దారితీసింది. ఆ తరువాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో 1954 నాటికి, ఫోర్డ్, జనరల్ మోటార్స్, రూట్స్ వంటి కొన్ని అతిపెద్ద ఆటోమోటివ్ ఎగుమతిదారులు తక్షణమే దుకాణాన్ని మూసివేశారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి భారతీయ మార్కెట్‌ను దూరం చేశారు. అంతే కాకుండా స్థానిక కంపెనీలు తయారు చేసిన మోడల్స్ అమ్మకపు ధరలపై తీవ్రమైన షరతులను ఎదుర్కొంటున్నందున భారతీయ ఆటో రంగం దాదాపు ఆగిపోయినట్లయింది.అంబాసిడర్ & ప్రీమియర్ పద్మిని..అయినప్పటికీ ఆటోమొబైల్ పరిశ్రమ మళ్ళీ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 1957లో హిందుస్థాన్ అంబాసిడర్ రూపంలో మొట్టమొదటి ఆల్-ఇండియన్ కారు ఉనికిలోకి వచ్చింది. ఆ తరువాత 1964లో ప్రీమియర్ కంపెనీ అంబాసిడర్‌కు ప్రత్యర్థిగా 'పద్మిని' కారుని ప్రారంభించింది. ఈ రెండు కార్లు ఆటోమొబైల్ పరిశ్రమను తిరుగులేకుండా దశాబ్ద కాలం పాటు పాలించాయి.SIAM ఏర్పాటు..భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రారంభ రోజులలో స్థిరమైన పురోగతి, పరిశోధన ద్వారా పరిశ్రమకు మద్దతునిచ్చే లక్ష్యంతో దేశీయ సంస్థలు ఏర్పడ్డాయి. 1960లో, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (SIAM) భారతదేశంలో ఆటోమొబైల్స్ కోసం స్థిరమైన అభివృద్ధి వ్యవస్థను రూపొందించే దృష్టితో ఏర్పడింది.భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రను మనం పరిశీలిస్తే.. 1980లలో సాధించిన విజయాలే ఈ రోజు బలమైన పరిశ్రమలకు పునాదులని తెలుస్తోంది. 21వ శతాబ్దంలో మారుతీ సుజుకిగా పిలువబడే మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్, జపాన్ ఆటోమోటివ్ పవర్‌హౌస్ సుజుకితో జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. ఆ తరువాత బాలీవుడ్ రంగం ఈ పరిశ్రమను పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర వహించింది.ఇదీ చదవండి: 79 ఏళ్ల రూపాయి ప్రస్థానం ఇలా..వేగం పెరిగిన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్..విదేశీ ప్రభావంతో పాటు పెట్టుబడి పరంగా కూడా 1990 వ దశకంలో భారతీయ ఆటో మార్కెట్ వేగంగా ముందుకు సాగింది. పెట్టుబడులు వెల్లువెత్తడంతో 1993 & 1996 మధ్య కార్ల విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆ తరువాత మెర్సిడెస్ బెంజ్ 2004లో భారతదేశానికి వచ్చి దేశంలోని మొట్టమొదటి విదేశీ లగ్జరీ ఆటోమేకర్‌గా చరిత్ర సృష్టించింది. 2006లో బీఎండబ్ల్యూ, 2007లో ఆడి అరంగేట్రం చేశాయి. అప్పటి నుంచి ఈ మూడు జర్మన్ కంపెనీలు భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాము. కావున కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే ఆధునిక ఆటో పరిశ్రమ కొత్త మార్గాల్లో ప్రవేశించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఆధునిక హంగులను పొందగలిగింది.➢ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వాహనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలికింది. AI సామర్థ్యాలు కలిగిన కార్లు మునుపటి వాటికంటే మరింత ఆధునికంగా మారాయి. తయారీ ప్రక్రియ నుంచి మొత్తం ఉత్పత్తి వరకు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది.ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని వాహనాలు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతున్నాయి. నేడు బిఎస్ 4 వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. రానున్న రోజుల్లో డీజిల్ కార్లు కూడా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.➢ఎలక్ట్రిక్ మొబిలిటీ: ఒకప్పుడు నీటి ఆవిరి ద్వారా.. ఆ తరువాత డీజిల్, పెట్రోల్ వంటి కార్లు మార్కెట్లో అడుగుపెట్టాయి. ఆ తరువాత ఎలక్ట్రిక్ వాహనాలు అరంగేట్రం చేసి భారదేశాన్ని మరింత ప్రగతి మార్గంలో పయనించేలా చేశాయి. చాలామంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.➢స్వయంప్రతిపత్త వాహనాలు (Autonomous Vehicles): భారతీయ ఆటో పరిశ్రమలో చెప్పుకోదగ్గ మార్పు ఈ స్వయంప్రతిపత్తి వాహనాలు. అంటే ఈ వాహనాలు తనకు తానుగానే ముందుకు సాగుతాయి. ఇది మానవుడు కనిపెట్టిన అద్భుత సృష్టి అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వాహనాలు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ద్వారా ఆపరేట్ అయ్యే ఆ వాహనాలు ప్రమాదాల నుంచి మనుషులను కాపాడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.➢భద్రతపై దృష్టి: ఇప్పుడు మార్కెట్లో విడుదలయ్యే చాలా కంపెనీల వాహనాలు భద్రతాపరంగా చాలా ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే సంస్థలు ఈ విధమైన వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆధునిక కాలంలో ADAS టెక్నాలజీ కూడా ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. రానున్న రోజుల్లో ఎగిరే కార్లు కూడా భారతదేశంలో అరంగేట్రం చేయనున్నాయి.ఒకప్పుడు కారునే తయారు చేయలేని భారత్.. ఈ రోజు ఎన్నెన్నో దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి నాటికి మన దేశంలో 22,933,230 వాహనాలు ఉత్పత్తయ్యాయని SIAM నివేదించింది. ఇటీవల అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కూడా తన మొదటి కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. దీన్ని బట్టి చూస్తే భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు ఇట్టే అర్థమవుతుంది. -
స్వాతంత్య్రదినోత్సవ థీమ్...! ఒక్కొక్కరు ఒక్కొలా దేశభక్తి..
థీమ్ అనేది అలంకార్రప్రాయం కాదు. మన భవిష్యత్ లక్ష్యాల గురించి బలంగా చెప్పే... సంక్షిప్త సందేశం. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ, కొత్త శక్తులతో ముందడుగు వేసినప్పుడే కొత్త భారతాన్ని ఆవిష్కరించుకోగలుగుతాము. ఈ భావాన్ని ప్రతిబింబించేలా ‘నయా భారత్’ అని ఈ స్వాతంత్య్ర దినోత్సవం థీమ్‌ను నిర్ణయించారు.డాలీగారి దేశభక్తి‘దేశభక్తి మీకేనా? నాకు కూడా ఉంది’ అని చెప్పకనే చెప్పింది డాలీ. పెయింటర్ డాగ్‌గా పాపులర్ అయిన డాలీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తాజాగా త్రివర్ణ పతాకం పెయింట్ వేసి ‘ఆహా’ అనిపించేలా చేసింది డాలీ. ‘శునక రాజమా... నీ దేశభక్తికి జోహార్లు’ అంటున్నారు నెటిజనులు.ఈ అమెరికన్ మన జాతీయగీతం అద్భుతంగా ఆలపిస్తాడు!పదిహేడు సంవత్సరాల అమెరికన్ గేబ్ మెరిట్ ఆలపించిన మన జాతీయగీతం ‘జన గణ మన’ సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ‘ఓ మై గాడ్... నా హృదయం దేశభక్తితో ఉప్పొంగిపోయింది’ అనే కాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేసింది దిశ అనే నెటిజన్. ‘ఎన్నో దేశాల జాతీయగీతాలు పాడినప్పటికీ గేబ్‌కు మన జాతీయగీతం ఆలపించడం అంటే ప్రత్యేక అభిమానం’ అని రాసింది దిశ.తండ్రి పేరు వందేమాతరం..!‘పేరులో పవర్ ఉంటుంది’ అంటారు. కొన్ని పేర్లు వింటే ‘నిజమే!’ అనిపిస్తుంది. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఈ కుటుంబసభ్యుల పేర్లలో దేశభక్తి ధ్వనిస్తుంది. తండ్రి పేరు వందేమాతరం ప్రహ్లాద్ నాయక్, కుమారుడి పేరు తిరంగా ప్రియదర్శన్, కూతురు పేరు జైహింద్ జగ్యన్సేని. ‘మతాన్ని ప్రతిఫలించే పేర్లు కాకుండా దేశభక్తిని ప్రతిఫలించే పేర్లు అంటే నాకు ఇష్టం’ అంటున్న వందేమాతరం స్వచ్ఛందసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. వందేమాతరం ఇంటిలోని గదులు జాతీయజెండాలోని మూడు రంగులతో అలంకరించి ఉంటాయి.అంటార్కిటికాలో వందేమాతరంఅంటార్కిటికాలోని పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు ఆగస్ట్ పదిహేను పర్వదినాన్ని పురస్కరించుకొని జాతీయజెండా ఎగరేయడానికి సన్నద్ధం అవుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. వాతావరణ ప్రతికూలతలు ఉన్నప్పటికీ ‘మేము సైతం’ అంటూ జాతీయపతాకావిష్కరణకు సన్నద్ధం అవుతున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంది. ఉద్యోగులు మంచుపెకిలిస్తుంటే, నేపథ్యంలో ‘వందేమాతర గీతం’ వినిపిస్తుంటుంది. (చదవండి: ఒక్కొక్కరం ఒక్కో రంగు) -
ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
ఆపరేషన్ సిందూర్ యోధులకు వీర్‌చక్ర పురస్కారాలు
న్యూఢిల్లీ: ముష్కరమూకల స్థావరాలను నేలమట్టంచేసి భారత సైనిక సత్తాను చాటిన ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా అమలుచేసిన తొమ్మిది మంది వాయుసేన పైలెట్లకు భారత ప్రభుత్వం వీర్‌చక్ర పురస్కారం ప్రకటించింది. సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పలువురికి గ్యాలంట్రీ అవార్డ్‌లను ప్రకటించారు. యుద్ధకాలంలో ఇచ్చే మూడో అత్యున్నత గ్యాలంట్రీ అవార్డ్ అయిన వీర్‌చక్రను వాయుసేనకు చెందిన తొమ్మిది మంది పైలెట్లకు ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు రంజిత్ సింగ్ సిధూ, మనీశ్ అరోరా, అనిమేశ్ పట్నీ, కునాల్ కల్రాలకు వీర్‌చక్ర ప్రకటించారు. వింగ్ కమాండర్ జోయ్ చంద్ర, స్వాడ్రాన్ లీడర్లు సర్థాక్ కుమార్, సిద్ధాంత్ సింగ్, రిజ్వాన్ మాలిక్, ఫ్లయిట్ లెఫ్టినెంట్ ఏఎస్ ఠాకూర్‌లకూ వీర్‌చక్ర ప్రకటించారు. ఆర్మీ తరఫున కల్నల్ కోశాంగ్ లాంబా, లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిష్ట్, నాయిబ్ సుబేదార్ సతీశ్ కుమార్, రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్లకూ వీర్‌చక్ర దక్కింది. యుద్ధకాల గ్యాలంట్రీ అవార్డుల్లో పరమ్ వీర్‌చక్ర, మహావీర్ చక్ర తర్వాత వీర్‌చక్రను మూడో అత్యున్నత అవార్డ్‌గా పరిగణిస్తారు. గ్యాలంట్రీ అవార్డ్‌ల జాబితాను గురువారం మోదీ ప్రభుత్వం విడుదలచేసింది. మేలో పాక్‌నుంచి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను ఎస్–400 గగనతల రక్షణవ్యవస్థ సాయంతో నేలకూల్చిన భారతవాయుసేన సిబ్బందికి సైతం గ్యాలంట్రీ అవార్డ్లు దక్కాయి. మరికొందరికి సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడళ్లను ప్రకటించారు. పాక్‌లోని లష్కరే తోయిబా ఉగ్రస్థావరాలను నేలమట్టంచేసిన సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్, వెస్టర్న్ ఎయిర్ కమాండ్లకు సారథ్యం వహించిన ఎయిర్ మార్షల్ నగేశ్ కపూర్, ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రాలకూ సర్వోత్తమ్ యుద్ధసేవా మెడల్‌ను ప్రకటించారు. కేవలం వింగ్ కమాండర్ అభిమన్యు సింగ్‌కు మాత్రమే శౌర్య చక్ర ఇచ్చారు. మొత్తంగా భారతవాయుసేన నుంచి నలుగురికి సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడల్, నలుగురికి ఉత్తమ్ యుద్ధసేవా మెడల్, తొమ్మిది మందికి వీర్ చక్ర, ఒకరికి శౌర్య చక్ర, 13 మందికి యుద్ద సేవా మెడళ్లు, 26 మందికి యువసేవా మెడళ్లు, 162 మందికి ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నందుకు ‘మెన్సన్–ఇన్–డెస్పాచెస్’ దక్కాయి. రాష్ట్రపతి ముర్ము మొత్తంగా 127 గ్యాలంట్రీ అవార్డ్లు ప్రకటించారు. -
పాక్‌లో కొత్తగా ఆర్మీ రాకెట్ ఫోర్స్
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ వేళ భారత క్షిపణుల ధాటికి పూర్తిగా చేతులెత్తేసిన పాకిస్తాన్‌కు నెమ్మదిగా తత్వం బోధపడింది. దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసుకోవాలని ఎట్టకేలకు నిర్ణయించుకుంది. అందులోభాగంగా నూతనంగా ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ పేరిట నూతన విభాగాన్ని ఏర్పాటుచేసుకుంటోంది. పాక్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సంప్రదాయక యుద్ధ సామర్థ్యాలను మెరుగుపర్చుకునే లక్ష్యంతో ఈ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్న ట్లు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, త్రివిధ దళాధిపతుల సమక్షంలో షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. భూతలం నుంచి ప్రయోగించే అణు, అణ్వస్త్రయేతర బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూయిజ్ క్షిపణులతో ఈ కొత్త ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్‌ను తీర్చిది ద్దనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ తన క్షిపణుల సత్తాను పాక్‌కు రుచి చూపించాక ఎట్టకేలకు పాక్ ప్రభుత్వం మేల్కొంది. 2025– 2026 ఆర్థిక సంవత్సరంలో రక్షణరంగ బడ్జెట్‌ను 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందినప్పుడే...
భారతదేశం నేడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు ఎంతవరకు కృషి చేస్తున్నామో మనం ప్రశ్నించుకోవాలి. 2024 ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం, భారతదేశం 127 దేశాలలో 105వ స్థానంలో ఉంది. ‘సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్: ది ఇండియా స్టోరీ’ అనే శీర్షికతో ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ తాజా నివేదిక భారతదేశంలో గణనీయమైన ఆదాయ అసమానతను పేర్కొంది. అత్యంత ధనవంతులైన 1% మంది ఇప్పుడు దేశ మొత్తం సంపదలో 40% కంటే ఎక్కువ కలిగి ఉన్నారు. దిగువన ఉన్న 50% మంది కేవలం 3% మాత్రమే సంపద కలిగి ఉన్నారు. వీటితో పాటు 2024లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ‘కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్’ ప్రకారం భారతదేశం అవినీతి అవగాహన సూచికలో 180 దేశాలలో 96వ స్థానంలో ఉంది.2025 నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై చేసే మొత్తం వ్యయం జీడీపీలో 4.64%గా ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. అయితే ఇది నూతన విద్యా విధానం –2020 నిర్దేశించిన 6% లక్ష్యం కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 2025–26 కేంద్ర బడ్జెట్లో, భారతదేశం ఆరోగ్య రంగానికి రూ. 99,859 కోట్లు కేటాయించింది. ఇది గత సంవత్సరం సవరించిన అంచనాలతో పోలిస్తే 11% పెరుగుదలను సూచిస్తుంది. మొత్తం ఆరోగ్య బడ్జెట్లో 96%తో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు ఎక్కువ కేటాయింపులు లభించాయి. అయితే ఇది వార్షిక బడ్జెట్ కేటాయింపులు, విధాన మార్పుల ఆధారంగా మారవచ్చు. ఆర్థిక వ్యవస్థలో రెడ్ టేపిజం ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపుతోంది. బంధుప్రీతి దాదాపు అన్ని రంగాలలో కనిపిస్తోంది. ఇప్పటికీ మనం వరకట్నం, ఆడ శిశువుల హత్య, లింగ అసమానత, గృహ హింస, అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలతో కునారిల్లడం బాధాకరం.అయితే మన దేశం ఎన్ని ఆటంకాలు ఎదురైనా విభిన్న రంగాలలో చాలా అభివృద్ధిని సాధించింది. మానవ వనరులలో (జనాభా) భారతదేశం మొదటి స్థానంలో ఉంది. భారతదేశం ప్రపంచంలోనే పాలు, పప్పుధాన్యాలు, జనపనార ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. బియ్యం, గోధుమలు, చెర కు, వేరుసెనగ, కూరగాయలు, పండ్లు, పత్తి ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశంగా ఉంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్యలో అమెరికా, చైనాల తర్వాత మూడవ స్థానంలో ఉంది. ప్రపంచంలో 10వ అతిపెద్ద దిగుమతిదారుగా, 16వ అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. 2024లో, భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్వీకరించడంలో ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలో నిలిచింది. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణల నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా అనుసరిస్తున్న ట్రంప్ విధానాల నుండి, యుద్ధాల నుండి రక్షించుకోవడం కోసం నిరంతర ఆర్థికాభివృద్ధి, విభిన్న సంక్షేమ కార్యక్రమాలతో స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలపై అవగాహన ఉన్న పౌరుల భాగస్వామ్యంతోనే స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని అందుకుని అభివృద్ధి సాధించగలం.– డా‘‘ పి.ఎస్. చారి, కామర్స్– మేనేజ్మెంట్ స్టడీస్‌లో ప్రొఫెసర్ -
ఉగ్రవాదంపై మానవత్వ పోరాటం: ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల పాశవిక దాడికి దీటైన జవాబుగా ఉగ్రస్థావరాలను నేలమట్టంచేస్తూ భారత్ సర్కార్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శ్లాఘించారు. రక్షణరంగంలో స్వావలంబన దిశలో దూసుకెళ్తున్న భారత్‌ను రాష్ట్రపతి మెచ్చుకున్నారు. 79వ స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాష్ట్రపతి ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. కీలకాంశాలు ఆమె మాటల్లోనే..మానవీయ పోరాటానికి మచ్చుతునకసెలవుల్లో సరదాగా గడిపేందుకు పహల్గాంలోని లోయ ప్రాంతానికి వచ్చిన అమాయకుల ప్రాణాలను ఉగ్రవాదులు పొట్టన బెట్టుకోవడం అత్యంత అమానవీయం. దీనికి దీటైన జవాబిస్తూ సరిహద్దు వెంట, పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత త్రివిధదళాలు అత్యంత కచ్చిత త్వంతో, సాంకేతిక సామర్థ్యంతో ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశారు. ఉగ్రవాదంపై మానవత్వం చేసిన పోరాటానికి ఆపరేషన్ సిందూర్ ఒక ప్రబల నిదర్శనం. ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరులో ఆపరేషన్ సిందూర్ ఒక కీలక ఘట్టంగా నిలిచి పోతుంది. రక్షణరంగంలో ‘ఆత్మనిర్బర్ భారత్’ విజయానికి ఆపరేషన్ సిందూర్ కొలమానం.అవినీతిని సహించలేని సుపరిపాలన ప్రజాస్వామ్య వృక్షానికి అవినీతి, వంచన ఫలాలు కాయొద్దని గాంధీ హెచ్చరించారు. ఆయన ఆదేశా లను శిరసావహిస్తూ దేశం నుంచి అవినీతిని కూకటి వేళ్లతో పెకలించాలి. అవినీతిని సహించలేని సుపరి పాలన కావాలి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ వంటికి స్వదేశీ స్ఫూర్తిని కొనసాగిస్తున్నాయి. దేశీయ ఉత్ప త్తులను కొందాం, వినియోగిద్దాం అని సంకల్పం తీసుకుందాం. కశ్మీర్ రైలుతో పర్యాటకం, వాణిజ్యం పైపైకికశ్మీర్ లోయలో చినాబ్ నదిపై నూతన రైలు వంతెన మన భారతీయ ఇంజనీరింగ్ అద్భుతం. అంజీఖడ్ తీగల వంతెన సైతం కీలకమైంది. చినాబ్ నది మీదుగా కశ్మీర్‌కు తొలిసారిగా నూతన రైళ్ల రాక పోకలు ఆరంభమై కశ్మీర్లో పర్యాటకం, వాణిజ్యం మరింత ఊపందుకుంటోంది. రైళ్లు అక్కడికి కొత్త ఆర్థిక అవకాశాలను మోసుకొస్తాయి. రైల్వే అనుసంధానంతో ఆ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి బాటలు పడుతున్నాయి. -
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీర వనితలు
-
మళ్లీ సెలవులొచ్చాయ్.. ఈ శుక్రవారం ఓటీటీల్లో 26 సినిమాలు!
చూస్తుండగానే వీకెండ్ వచ్చేస్తోంది. గతవారం లాగే ఈసారి కూడా వరుసగా మూడు రోజులు రావడం సినీ ప్రియులకు పండగే. ఈ వారం థియేటర్లలో రెండు పెద్ద సినిమాలు కూలీ, వార్-2 ఇప్పటికే సందడి చేస్తున్నాయి. ఓకే రోజు రిలీజైన ఈ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ వారాంతంలో మూడు రోజుల పాటు సెలవులు రావడం ఈ చిత్రాలకు కలిసొచ్చే అవకాశముంది.మరోవైపు ఈ శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం, ఆ తర్వాత శ్రీ కృష్ణ జన్మాష్టమి, సండే సెలవులు కావడంతో ఓటీటీ ప్రియులు సైతం చిల్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈ వారంలో వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఒక్క రోజే సందడి చేసేందుకు సిద్ధమైపోయాయి. ఈ ఫ్రైడే ఓటీటీ మూవీస్‌లో కాజోల్ నటించిన మా, అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ డ్రామా జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో సూపర్ మ్యాన్ హాలీవుడ్ మూవీ, పలు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. మీకు నచ్చిన సినిమా ఏయే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో చూసేయండి మరి.నెట్ఫ్లిక్స్రోల్ మోడల్స్(మూవీ)- ఆగస్టు 15అవుట్ ల్యాండర్(వెబ్ సిరీస్) సీజన్-7- ఆగస్టు 15ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15సెల్ఫ్ రిలయన్స్ (మూవీ)-ఆగస్టు 15లవ్ ఈజ్ బ్లైండ్ యూకే(సీజన్-2)- ఆగస్టు 15సాంగ్స్ ఫ్రమ్ ది హోల్(మూవీ)- ఆగస్టు 15ఫిక్స్డ్(మూవీ)- ఆగస్టు 15ఫిట్ ఫర్ టీవీ(రియాలిటీ షో)- ఆగస్టు 15మిస్ గవర్నర్- (సీజన్-1)- ఆగస్టు 15ద ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 15ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15మా(హిందీ మూవీ)- ఆగస్టు 15అమెజాన్ ప్రైమ్సూపర్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 15ఎంఎక్స్ ప్లేయర్సేనా గార్డియన్స్ ఆఫ్ ది నేషన్- ఆగస్టు 15జియో హాట్స్టార్కృష్ణ కో లవ్ స్టోరీ(మూవీ)- ఆగస్టు 15మోజావే డైమండ్స్ (మూవీ)- ఆగస్టు 15బ్యూటీఫుల్ డిజాస్టర్ (మూవీ)- ఆగస్టు 15ఏలియన్ ఎర్త్ (మూవీ)- ఆగస్టు 15లిమిట్లెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15బ్లడీ ట్రోఫీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 17జీ5జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 15సన్ నెక్స్ట్..గుడ్ డే-(తమిళ మూవీ) ఆగస్టు-15గ్యాంబ్లర్స్ (తమిళ మూవీ)- ఆగస్టు 15అక్కేనామ్ (తమిళ మూవీ)- ఆగస్టు 15ఆహా తమిళం..యాదుమ్ అరియాన్- ఆగస్టు 15మూవీ సెయింట్స్ కట్లా కర్రీ (గుజరాతీ మూవీ) - ఆగస్టు 15ఆపిల్ ప్లస్ టీవీ స్నూపీ ప్రెజెంట్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15 -
విభజన భయానక స్మృతి దినం: 1947, ఆగస్టు 14న ఏం జరిగింది?
న్యూఢిల్లీ: 1947.. ఆగస్టు 14.. అది భారత ఉపఖండం చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని రోజు. ఆ రోజున భారతదేశ విభజన జరిగింది. పాకిస్తాన్ పేరుతో ప్రపంచ పటంలో ఒక కొత్త దేశం ఉద్భవించింది. నాటి దేశ విభజన కోట్లాదిమంది జీవితాలను శాశ్వతంగా మార్చివేసింది. లక్షలాదిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. దేశంలో భారీ స్థాయిలో మత అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు దక్షిణాసియా భౌగోళిక స్వరూపాన్ని , చరిత్రను మార్చివేశాయి.1947లో దేశ విభజన సమయంలో నిరాశ్రయులైన లక్షలాది మంది పోరాటాలను, త్యాగాలను గుర్తు చేసుకునేందుకు భారత్ ప్రతి సంవత్సరం ఆగస్టు 14న ‘విభజన భయానక స్మృతి దినం’ను పాటిస్తుంది. 1947లో బ్రిటిష్ వలస పాలకులు భారతదేశాన్ని విభజించారు. అదే ఏడాది ఆగస్టు 14 న భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ కరాచీకి వెళ్లారు. అక్కడ ఆయన పాకిస్తాన్ రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. కరాచీని కొత్త దేశపు రాజధానిగా ప్రకటించారు. తరువాత ఇస్లామాబాద్‌ను రాజధానిగా మార్చారు. పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్‌గా ముహమ్మద్ అలీ జిన్నా ప్రమాణ స్వీకారం చేశారు.విభజన అధికారిక ప్రకటనకు ముందుగానే, పెద్ద ఎత్తున వలసలు, మత హింస చోటుచేసుకుంది. లక్షలాది మంది హిందువులు, సిక్కులు, ముస్లింలు కొత్తగా విభజితమైన దేశాలలో భద్రత కోసం తమ స్థానాన్ని వెతుక్కోవలసి వచ్చింది. ఆగస్టు 14న పాకిస్తాన్ తన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుండగా, మరుసటి రోజు ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 2021లో తన రెండవ పదవీకాలంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 14న ‘విభజన భయానక స్మృతి దినం’గా పాటించాలని ప్రకటించారు. విభజన సమయంలో నాటి ప్రజలు అనుభవించిన బాధలను భవిష్యత్ తరాలకు గుర్తుచేసేందుకు ఆగస్టు 14న విభజన భయానక స్మృతి దినంగా పాటిస్టున్నట్లు హోం మంత్రిత్వ శాఖ ఒక గెజిట్ జారీ చేసింది. -
ఎందరో త్యాగధనులు : దేశభక్తిని రగిలించే స్వాతంత్ర్య సూక్తులు
Independence Day 2025 Inspiring Quotes: ఆగస్టు 15న దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం చేయనున్నారు. భరతమాత స్వేచ్ఛకోసం ఎందరో వీరులు ప్రాణత్యాగాలు చేశారు. వారి అమరత్వాన్ని, మరెందో త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ సమరయోధులు చెప్పిన గొప్ప సూక్తులను, నినాదాలను మననం చేసుకుందాం.భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న గొప్ప వ్యక్తులు, స్వాతంత్య్రం గురించి వారు చెప్పిన కొన్ని అభిప్రాయాలుబాలగంగాధర్ తిలక్ : ‘స్వరాజ్యం నా జన్మహక్కు, నేను దానిని సాధిస్తాను.’మహాత్మా గాంధీ: స్వాతంత్య్రం అంటే కేవలం రాజకీయ స్వాతంత్య్రం కాదు, ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం కూడా.జవహర్లాల్ నెహ్రూ: ‘స్వాతంత్య్రం అనేది ఒక అవకాశం, ఒక బాధ్యత. మనం దానిని సద్వినియోగం చేసుకోవాలి, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి.’ సర్దార్ వల్లభాయ్ పటేల్: ‘ఒకే దేశంగా ఉండాలంటే ఐక్యత ముఖ్యం, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఐక్యతను కాపాడు కోవాలి.’సుభాష్ చంద్ర బోస్: ‘మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను.’ రాజగోపాలాచారి: ‘స్వాతంత్య్రం అంటే మన దేశాన్ని మనమే పాలించుకోవడం, మన విధి విధానాలను మనమే నిర్ణయించు కోవడం.’భగత్ సింగ్: ‘నా జీవితం దేశం కోసం, నా మరణం కూడా దేశం కోసమే. నా మరణం తర్వాత కూడా నా ఆశయం బ్రతికే ఉంటుంది.’జైహింద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ నినాదం ఇప్పటికీ ప్రతి భారతీయుడి పెదవులపై ఉంటుంది.వందేమాతరం : బంకించంద్ర ఛటర్జీ రాంప్రసాద్ బిస్మిల్ : స్వాతంత్య్రం కోరిక ఇప్పుడు మన గుండెల్లో ఉంది, ఆ పక్క ఎంత బలం ఉందో చూడండి. చంద్రశేఖర్ ఆజాద్ : శత్రువుల తూటాలను ఎదుర్కొంటాం, మనం స్వేచ్ఛగా ఉంటాం. భగత్ సింగ్ : బాంబులు, తుపాకులు విప్లవాన్ని తీసుకురావు, విప్లవ ఖడ్గానికి ఆలోచనల అంచున పదును పెడతారు - లాల్ బహదూర్ శాస్త్రి : త్రివర్ణ పతాకం మనకు గర్వకారణం, భారతీయులకు గర్వకారణం.జై జవాన్ జై కిసాన్ - నేతాజీ సుభాష్ చంద్రబోస్: ఒక వ్యక్తి ఒక ఆలోచన కోసం చనిపోవచ్చు, కానీ ఆ ఆలోచన అతని మరణం తర్వాత, వెయ్యి జీవితాల్లో అవతరించుతుంది. -
Pakistan: స్వాతంత్ర్య సంబరాల్లో కాల్పుల మోత.. ముగ్గురు మృతి
కరాచీ: పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కరాచీ నగరంలో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అలాగే నగరంలో జరుగుతున్న దోపిడీలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఐదుగురు హతమయ్యారు.కరాచీలోని పలు ప్రాంతాలలో వైమానిక కాల్పులు జరిగినట్లు పాక్ మీడియా తెలిపింది. వివిధ ఘటనల్లో 20 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. పలువురి నుంచి తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. వైమానిక కాల్పులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారువైమానిక కాల్పుల కారణంగా కరాచీలో ఒక వృద్ధుడు, ఎనిమిదేళ్ల బాలిక, మరొక యువకుడు మరణించారని రెస్క్యూ అధికారులు పాకిస్తాన్ జియో న్యూస్‌కు తెలిపారు. నగరం అంతటా చోటు చేసుకున్న వేర్వేరు సంఘటనల్లో 64 మంది గాయపడ్డారు. పాకిస్తాన్‌లోని లియాఖతాబాద్, కోరంగి, లియారి, మెహమూదాబాద్, అక్తర్ కాలనీ, కీమారి, జాక్సన్, బాల్డియా, ఓరంగి టౌన్, పపోష్ నగర్లలో వైమానిక కాల్పుల సంఘటనలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. గాయపడిన వారిని సివిల్, జిన్నా, అబ్బాసి షహీద్ ఆసుపత్రులకు, ప్రైవేట్ వైద్య కేంద్రాలకు పోలీసులు తరలించారు. వైమానిక కాల్పులకు పాల్పడినవారిపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య సంబరాల్లో పాల్గొనాలంటే..!
దేశంలో ఎటు చూసినా.. పంద్రాగస్టు సంబరాల కోలహలమే. చారిత్రక ప్రదేశాల్లో ఈ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులతో సందడిగా ఉంది. ఎందరో అమర వీరుల త్యాగఫలమే ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక. ఆ సమరయోధుల అందర్నీ స్మరిస్తూ..సగర్వంగా ఈ వేడుకుని జరుపుకోనుంది భారతదేశం. ఈ వేడుక ఢిల్లీ ఎర్రకోటలో మరింత ప్రత్యేకం. వివిధ రాష్ట్రాల సాంస్కృతిక వైభవానికి అర్థంపట్టేలా విభిన్న శకటాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సాయుధ దళాల సాహస విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య వేడుకలు ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తూ కట్టిపడేసేలా మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అదీగాక ఈ వేడుకల్లో దేశ విదేశాల ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొంటారు. వారందరి సమక్షంలో ఈ వేడుకలను తిలకిస్తే కలిగే ఆ అనుభవం వేరెలెవెల్ . పైగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జెండా ఎగరువేసిన తదనంతరం ఇచ్చే స్పీచ్‌ని ప్రత్యక్షంగా చూడాలని చాలామంది కోరుకుంటారు. ఈ సంబరాల్లో ప్రత్యక్షంగా పాల్గొని మోదీ స్పీచ్‌ని వీక్షించాలనుకుంటే జస్ట్ ఇలా చేయండి చాలు..ఎర్రకోట వద్ద జరిగే స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలనుకుంటే ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుంటే చాలు. టిక్కెట్ల అమ్మకాలు ఆగస్టు 13, 2025 నుండి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక పోర్టల్లలో ప్రారంభమవుతాయి. అదెలాగంటే..ఆన్లైన్ ప్రక్రియ..అధికారిక వెబ్సైట్ aamantran.mod.gov.in లేదా e-invitations.mod.gov.in. సందర్శించి స్వాతంత్ర్య దినోత్సవం 2025 టికెట్ బుకింగ్ లింక్‌పై క్లిక్ చేయాలి. వివరాలను ఇలా పూరించాలి..పేరు, మొబైల్ నంబర్, టిక్కెట్ల సంఖ్య పూర్తి చేయాలివెరిఫికేషన్ కోసం మీ ఆధార్ కార్డ్ లేదా ఏదైనా చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ఫోటో IDని డౌన్లోడ్ చేసుకోండి.టికెట్ కేటగిరీని ఎంచుకోవాలి: రూ. 20 (జనరల్ కేటగిరీ), రూ. 100 (మధ్యతరగతి), రూ. 500 (ప్రీమియం కేటగిరీ)ఆ తర్వాత ఆన్లైన్లో చెల్లింపు చేసి QR కోడ్ సీటింగ్ వివరాలతో ఇ-టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఫోన్లో డిజిటల్ కాపీ లేదా ప్రింటవుట్ కాపీని ఉంచండి — అది గేట్ వద్ద అవసరం.ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవడం ఎలాప్రస్తుతం అంతా ఆన్లైన్ సేవలే వినియోగిస్తున్నప్పటికీ రక్షణ మంత్రిత్వ శాఖ ఆగస్టు 10, 12 తేదీల్లో ఎంపిక చేసిన ఢిల్లీలోని కొన్ని ప్రదేశాల్లో కౌంటర్లను ఏర్పాటు చేస్తుంది. దీన్ని సాధారణంగా ప్రభుత్వ భవనాలు, వార్తాపత్రికలు, అధికారికి వెబ్సైట్లో ప్రకటిస్తుందిఆఫ్లైన్ బుకింగ్ కోసం..చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి (ఆధార్, ఓటరు ఐడి, పాస్‌పోర్ట్) తీసుకెళ్లాలి.టికెట్ ధరను (రూ. 20, రూ. 100, లేదా రూ. 500) నగదుగా లేదా డిజిటల్ చెల్లింపుల్లో చెల్లించండి.టిక్కెట్‌ను తీసుకుని సురక్షితంగా ఉంచుకోవాలి. ఆఫ్‌లైన్ టికెట్లు పరిమిత సంఖ్యలో దొరకుతాయి కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.ఏవిధంగా చేరుకోవాలంటే..ఎర్రకోట చేరుకోవడానికి ఢిల్లీ మెట్రో అత్యంత అనుకూలమైన మార్గం. అందుకోసం లాల్ ఖిలా లేదా చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ మెట్రో సేవలు ఉదయం: 4.00 గంటలకు ప్రారంభమవుతాయి. కార్యక్రమం ఉదయం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఉదయం 6:30–7:00 గంటల మధ్య చేరుకునేలా ట్రావెల్‌ని ప్లాన్ చేసుకోవాలి. ప్రవేశానికి ముందు చాలా కఠినతరమైన భద్రత ఉంటుందనేది గుర్తు ఎరగాలి. చివరగా ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ఎర్రకోట నుంచి ప్రత్యక్షంగా వీక్షించే అనుభవాన్ని పొందాలనుకుంటే మాత్రం త్వరితగతిన టికెట్లు బుక్ చేసుకుని టైమ్‌కి చేరుకునేలా చక్కగా ట్రావెల్‌ని ప్లాన్ చేసుకోవాలనేది గ్రహించండి.(చదవండి: Goa Tourism 2025 Rules: గోవా వెళ్తున్నారా? ఈ విషయం తెలుసా? రూ.లక్ష కట్టాల్సిందే...) -
ఫ్లిప్‌కార్ట్ ఒక్కరోజు ప్రత్యేక సేల్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ‘క్రాఫ్టెడ్ బై భారత్’ (Crafted by Bharat) పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న ఈ సేల్ 10వ ఎడిషన్‌ది. భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశీయ కళాకారులు, చేనేతలు, మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ నిర్వహిస్తోంది.ఈ ఒక్కరోజు ప్రత్యేక సేల్‌లో 1.4 లక్షలకు పైగా హస్తకళా ఉత్పత్తుల విక్రయానికి అవకాశం కల్పిస్తారు. 2,200 మందికి పైగా కళాకారులు, స్వయం సహాయక సంఘాలు, మహిళా వ్యాపారవేత్తలు పాల్గొంటున్నారు. వార్లీ, పటచిత్ర, మధుబని, పిచ్వాయి, టెర్రకోటా, ప్రాంతీయ చెక్క కళాకృతులు, హోమ్ డెకోర్, ఫర్నిచర్, వంటగది వస్తువులు, దుస్తులు మొదలైనవి ఈ ప్రత్యేక సేల్‌లో అందుబాటులో ఉంటాయి. భదోహి, హత్రాస్, మధురై, కన్నౌజ్, రామనగర, ఉజ్జయిని వంటి చిన్న పట్టణాల మహిళలు తమ ఉత్పత్తులు విక్రయించుకునేందుకు ఈ సేల్ అవకాశం కల్పిస్తోంది.ఏటా నిర్వహించే ఈ సేల్‌లో ఈసారి 100 మందికిపైగా కొత్త విక్రేతలు చేరారు. ఎంఎస్ఎంఈలు, స్థానిక కళాకారులకు సాధికారత కల్పిస్తూ తమ ఉత్పత్తులను ఆన్లైన్లో ఈ-కామర్స్ వేదికగా విక్రయించుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ మిషన్ సహకారం అందిస్తోంది. -
నో ఫోన్ అవర్..! స్వేచ్ఛ కోసం ఆత్మీయ పిలుపు..
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘నో ఫోన్ అవర్’ అనే సరికొత్త ప్రచారం చక్కర్లు కొడుతోంది. నో ఫోన్ అవర్ ఒక సాధారణ ప్రచారం మాత్రమే కాదు.. నేటి అధునాతన జీవనశైలిలో స్వేచ్ఛను అన్వేషించుకునే ఆత్మీయ పిలుపు అని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోం అప్లయన్స్ బ్రాండ్ కెన్‌స్టార్ ఆధ్వర్యంలో ఈ ‘నో ఫోన్ అవర్’లో భాగంగా ఆగస్టు 15న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకూ మొబైల్ ఫోన్లు ఆఫ్ చేసి, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో ఆ సమయాన్ని గడపాలని పిలుపునిస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్ ప్రపంచపు గందరగోళం నుంచి బయటపడి, నిజమైన ఆనందాన్ని, అనుబంధాన్ని మళ్లీ ఆస్వాదించేలా కెన్‌స్టార్ ఆహ్వానిస్తోంది. కెన్‌స్టార్ సీఈఓ సునిల్ జైన్ మాట్లాడుతూ.. బాధ్యతగల పౌరులుగా మన మూలాలను గుర్తుచేసుకుంటూ, ముఖ్యమైన వారితో కలిసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు. ఈ డిజిటల్ యుగంలో మనకు వేలాది ఆన్లైన్ ఫాలోవర్స్ ఉన్నా, మనుషులతో కలిసుండాలన్న కోరిక ఇంకా బతికే ఉంది. ‘నో ఫోన్ అవర్’ ఆ కోరికను తీర్చగలిగే సరికొత్త ప్రయత్నమని తెలిపారు. ఈ అనుభవాలను సోషల్ మీడియాలో # NoPhoneHour హ్యాష్‌ట్యాగ్‌తో కథలు, వీడియోలు, ఆడియో సందేశాల రూపంలో పంచుకోవాలని పేర్కొన్నారు. (చదవండి: 'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ': నటి లిసా రే) -
హైదరాబాద్ : అమెరికా స్వాతంత్ర్య దిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)
-
ట్రంప్ సుంకాల జోరు.. దేశాలన్నీ బేజారు
న్యూఢిల్లీ: అమెరికాకు ‘విముక్తి దినం’గా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతూ వచ్చిన ఏప్రిల్ 2 మిగతా ప్రపంచం పాలిట దుర్దినంగా మిగిలిపోయింది. భారత్‌తో పాటు ఏకంగా 60 పై చిలుకు దేశాలపై ఆయన వాణిజ్య కొరడా ఝళిపించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెను కుదుపుకు లోనైంది. వాళ్లూ, వీళ్లూ అని తేడా చూపకుండా అన్ని దేశాల మీదా 10 నుంచి 50 శాతం దాకా సుంకాలు బాదడం ద్వారా ప్రపంచ వాణిజ్య యుద్ధానికి ట్రంప్ తెర తీశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై బుధవారం సంతకం చేశారు. భారత్‌ను తప్పుడు వాణిజ్య విధానాలు అనుసరిస్తున్న ‘దారుణ దేశం’గా ఈ సందర్భంగా అభివర్ణించారు! అన్నిరకాల భారత ఉత్పత్తుల మీదా 26 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించగా, అనంతరం దాన్ని 27 శాతంగా సవరించారు. అమెరికాకు అత్యవసరమైన ఫార్మాస్యూటికల్స్, సెమీ కండక్టర్లు, పలు ఖనిజాలు తదితరాలను మాత్రం సుంకాల బాదుడు నుంచి మినహాయించారు. అమెరికాలోకి ప్రవేశించే అన్ని వస్తూత్పత్తుల మీదా 10 శాతం బేసిక్ టారిఫ్ విధించారు. ఇది ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేస్తున్న భారత్ తదితర దేశాలను వాణిజ్యపరంగా ‘ధూర్త దేశాలు’గా ట్రంప్ ఆక్షేపిస్తుండటం తెలిసిందే. వాటిపై అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ లెక్కన భారత ఉత్పత్తులపై 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ ఏప్రిల్ 5 నుంచి, 27 శాతం అదనపు సుంకాల వసూలు ఏప్రిల్ 9 నుంచి మొదలవుతాయి. చైనాపై ఇటీవలే 20 శాతం సుంకాలు విధించగా మరో 34 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ తాజాగా ప్రకటించారు! ట్రంప్ నిర్ణయంతో అమెరికా వార్షిక పన్ను వసూళ్లు ఏటా 60 వేల కోట్ల డాలర్ల మేరకు పెరుగుతాయని వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో అంచనా వేశారు. ట్రంప్ ప్రకటనను దేశాలన్నీ దుయ్యబట్టాయి. అమెరికాపై ప్రతీకార సుంకాలు తప్పవని యూరోపియన్ యూనియన్, చైనా హెచ్చరించాయి. ట్రంప్ పునరాలోచించాలని పలు దేశాలు విజ్ఞప్తి చేశాయి. దీనిపై భారత్ ఆచితూచి స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ‘‘ట్రంప్‌కు అమెరికా ఫస్ట్ అయితే మోదీకి భారతే ఫస్ట్. దీనిపై ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తాం’’ అన్నారు. ట్రంప్ వలలో మోదీ: కాంగ్రెస్ భారత్‌పై అమెరికా తాజా సుంకాల మోతను మోదీ ప్రభుత్వ వైఫల్యంగా కాంగ్రెస్ అభివర్ణించింది. ‘‘మోదీ తన మిత్రుడంటూ ట్రంప్ ఆప్యాయత కనబరుస్తారు. బహిరంగంగా కౌగిలించుకున్నారు. కానీ తాను పక్కా వ్యాపారినని నిరూపించుకుంటూ మోదీపై చాకచక్యంగా వల విసిరారు. మనవాడు అందులో ఇరుక్కుపోయాడు’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. తాజా సుంకా లు భారత ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తా యని లోక్‌సభలో వి పక్ష నేత రాహుల్‌గాంధీ ఆందోళన వెలిబుచ్చా రు. వీటిని ఎలా ఎదుర్కోనున్నదీ కేంద్రం తక్షణం వివరించాలని డిమాండ్ చేశారు.మెరుగ్గా, బలంగా, దృఢంగా: ట్రంప్ప్రపంచ దేశాలపై తాను విధించిన తాజా సుంకాల మీద ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆపరేషన్ ముగిసింది. రోగి బతికాడు. భేషుగ్గా ఉన్నాడు. చక్కగా కోలుకుంటున్నాడు. మునపటి కంటే పెద్దగా, మెరుగ్గా, బలంగా, ఎన్నడూ లేనంత దృఢంగా తయారవుతాడని తేలింది’’ అని ట్రూత్‌సోషల్‌లో కామెంట్ చేశారు.ఇండియాపై ఇరవై ఆరా, ఇరవై ఏడా? ట్రంప్ ప్రకటన నేపథ్యంలో భారత్‌తో పాటు పలు దేశాలపై అమెరికా విధించనున్న తాజా టారిఫ్‌లు ఎంతన్న దానిపై సందిగ్ధత నెలకొంది. భారత్‌తో పాటు 14 దేశాలపై ట్రంప్ ప్రకటించిన సుంకాలకు, అనంతరం వైట్‌హౌస్ విడుదల చేసిన వివరాలకు మధ్య తేడా ఉండటమే ఇందుకు కారణం. ట్రంప్ ప్రకటన అనంతరం ఆయా దేశాలపై టారిఫ్‌లను అమెరికా సవరించడమే ఇందుకు కారణమని బ్లూంబర్గ్ వివరించింది. ఆ మేరకు భారత్‌పైనా సుంకం ఒక శాతం పెరిగింది. దాన్ని 26 శాతంగా ట్రంప్ పేర్కొనగా తర్వాత దాన్ని 27 శాతంగా సవరించారు. గురువారం అనుబంధ ప్రకటనలో వైట్‌హౌస్ ఈ మేరకు పేర్కొంది. భారత్‌తో పాటు దక్షిణకొరియ సహా మొత్తం 14 దేశాలపై సుంకాలను సవరించారు. కెనడా ప్రతీకార సుంకాలు అమెరికా చర్యలకు ప్రతీకారం తప్పదని ఇప్పటికే ప్రకటించిన కెనడా అన్నంత పనీ చేసింది. అమెరికాకు చెందిన ఆటో ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీని ప్రభా వం అమె రికా ఆటో రంగంపై తీవ్రంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.కెనడా, మెక్సికోలకు మినహాయింపుఐఈఈపీఏ స్టాండింగ్ ఆర్డరే కారణంఆ దేశాలపై ఇప్పటికే 25 శాతం బాదుడుడొనాల్డ్ ట్రంప్ వడ్డించిన తాజా సుంకాల నుంచి కెనడా, మెక్సికోలకు మినహాయింపు లభించింది. కైనడా, మెక్సికోలపై భారీ సుంకాలు తప్పవని పదేపదే చెబుతూ వచ్చినా తాజా టారిఫ్‌ల జాబితాలో వాటిని చేర్చలేదు. ఫెంటానిల్, వలసలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపీఏ) కింద స్టాండింగ్ ఆర్డర్ల కారణంగా కెనడా, మెక్సికోలకు కొత్త టారిఫ్‌లు వర్తించవని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. అమెరికా–మెక్సికో–కెనడా ఒప్పందం (యూఎస్ఎంసీఏ) కింద అమెరికాలోకి ప్రవేశించే వస్తువులకు కూడా కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే చైనాతో పాటుగా కెనడా, మెక్సికోలపై ట్రంప్ ఇటీవలే 25 శాతం సుంకాలు విధించడం తెలిసిందే. కనుక తాజా మినహాయింపు వాటికి పెద్దగా ఉపశమనం కలిగించబోదు. -
రాజ్యాంగ అమలులో చిత్తశుద్ధి ఉందా?
దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి చర్చలు తుది రూపంలోకి వస్తున్న తరుణంలోనే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ‘రాజ్యాంగ సభ’ను ఏర్పాటు చేశారు. బి.ఆర్. అంబేడ్కర్ ముసాయిదా కమిటి చైర్మన్‌గా, బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించారు. వివిధ రాజ్యాంగ రచనా కమిటీలకు నిష్ణాతులు సేవలందించారు. వీరి కృషి ఫలితంగా రూపొందిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 నాడు రాజ్యాంగ సభ ఆమోదించింది. నాటి రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉన్నాయి (ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు, 486 పైగా అధిక రణలు). చివరకు 1950 జనవరి 26 నాడు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అంటే 2025 జనవరి 26 నాటికి రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లన్నమాట! ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో దేశం పరిపాలనా పరంగా, జనాభా పరంగా, సంస్థాగతంగా, సాంకేతికంగా చాలా ప్రగతిని సాధించిందని చెప్పగలం. కానీ ఆ అభివృద్ధి అన్ని రంగాల్లో ఆశించిన స్థాయిలో జరగకపోవడం, రాజ్యాంగంలో పేర్కొన్నట్లు అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా పంపిణీ కాకపోవడం బాధాకరం. రాజ్యాంగ ప్రవేశికలో లేని ‘సామ్యవాద’, ‘లౌకిక’ పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం చేర్చింది. మొత్తం మీద ఇప్పటికి 106 రాజ్యాంగ సవరణలు జరగడం గమనార్హం. ఏ దేశ రాజ్యాంగం అయినా మారుతున్న అవసరా లకు అనుగుణంగా తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. ఆనాడు రాజ్యాంగ సభలో అంబేడ్కరే స్వయంగా ‘ఒకవేళ రాజ్యాంగం విఫలం అయితే ఆ తప్పు రాజ్యాంగానిది కాదు, దానిని అమలు చేసే పాలకులదే’ అన్నారు. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టా’న్ని చేశారు. కానీ దీన్ని చాలా రాజకీయ పార్టీలు ఎంతగా నీరుగార్చాయో తెలిసిందే కదా! 6–14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ‘విద్యా హక్కు చట్టం’ తెచ్చారు. కానీ అమలును మరచారు. నేటికీ బడి బయట కోట్లాదిమంది పిల్లలు బాలకార్మికులుగా బతుకు తున్నారు. దేశంలో అంతర్గతంగా పెరుగుతున్న కులం, మతం భావాలు విద్వేషాన్ని నింపుతున్నాయి. ఈ మధ్యనే ఫ్యూచర్ రీసెర్చ్ సెంటర్ నివేదికలో మత విద్వేషం బుసలు కొడుతున్న దేశాల్లో మనదేశం మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది.రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశ సూత్రాలు సరిగ్గా అమలుకు నోచుకోవడం లేదు. ప్రాథమిక హక్కు లదీ దాదాపు అదే స్థితి. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వాలు ఎలా నీరుగారుస్తున్నాయో జైళ్లలో మగ్గుతున్న అనేక మంది హక్కుల కార్యకర్తలూ, ప్రజా ఉద్యమకారులూ, మేధావులను చూస్తే అర్థమవు తుంది. అలాగే అమానవీయమైన అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించినా ఇప్పటికీ గ్రామాల్లో వివక్ష కొన సాగుతూనే ఉంది. ‘రాజ్యాంగం’ మీద కనీస అవగాహన లేనివారు చట్టసభలలో అడుగుపెట్టడం శోచనీయం. ఇక వారు ఎటువంటి చట్టాలు చేస్తారో చెప్పవలసిన పనేముంది! ఒక అందమైన భవంతిని నిర్మించుకొని దానిని సక్రమంగా వాడుకోకపోతే అది త్వరలోనే శిథిల స్థితికి చేరుతుంది. ఈ సూత్రం ఏ దేశ రాజ్యాంగానికైనా వర్తిస్తుంది. ‘భారత ప్రజలమైన మేము దేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్య్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్నీ, ఆలోచన, భావ ప్రకటన స్వేచ్ఛ, మతవిశ్వాస ఆరాధనా స్వేచ్ఛలనూ, అవకాశాల్లో సమానత్వాన్ని సాధించేందుకు, వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు శాసనం (రాజ్యాంగం రూపంలో) చేసి, ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాం’ అని రాజ్యాంగ ప్రవేశికలోనే ఉంది. అంటే ఆనాడు మన లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగానే అది రూపొందించబడింది. కానీ దాని అమలులోనే పాలకులకు చిత్తశుద్ధి కొరవడింది. ఇది గర్హనీయం. డా‘‘ మహ్మద్ హసన్ వ్యాసకర్త పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ -
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది.ఇటీవల ఉక్రెయిన్ సైన్యం రష్యాపై దాడిని పెంచింది. ఉక్రెయిన్ మిలటరీ.. రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోతోంది. యుద్దం మొదలైన తర్వాత జరుపుకోనున్న ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఇరు దేశాలు సుమారు 100 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నారు. రష్యా దాడులు ప్రారంభించిని మొదటి నెలలోనే 115 మంది ఉక్రెయిన్ సైనికులను క్రెమ్లిన్ నిర్బంధించిందని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. వారిలో దాదాపు 50 మంది సైనికులను మారియుపోల్‌లోని అజోవ్‌స్టాల్ స్టీల్‌వర్క్స్ నుంచి రష్యన్ దళాలు తమ అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రెండువారాల క్రితం ఊహించని రీతిలో ఉక్రెయిన్ సైన్యం తమ సరిహద్దుల్లోని భూభాగాల్లోకి చొచ్చుకువచ్చిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ దాడుల్లో కూర్స్క్ ప్రాంతంలో 115 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌కు పట్టుపడ్డారని తెలిపారు. వారంతా ప్రస్తుతం బెలారస్లో ఉన్నారని అయితే తాజాగా యుద్ధ ఖైదీలలో మార్పిడిలో భాగంగా వారికి వైద్య చికిత్స, పునరావాసం అందించటంల కోసం రష్యాకు తీసుకువెళ్లనున్నట్ల పేర్కొంది. 22 ఫిబ్రవరి 2022లో యుద్దం మొదలైనప్పటి నుంచి ఇది 55వసారి యుద్ధఖైదీల మార్పిడి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వంతో సైనికుల మార్పిడి జరిగిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘మాకు ప్రతిఒక్కరూ గుర్తున్నారు. అందరీని స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని అన్నారు. -
న్యూజెర్సీ సాయిదత్త పీఠంలో అట్టహాసంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
మెల్బోర్న్లో మైండ్ బ్లోయింగ్ క్రేజ్.. వరల్డ్ కప్ తో రామ్ చరణ్ (ఫొటోలు) (ఫొటోలు)
-
డాలస్‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
డాలస్, టెక్సస్: డాలస్‌లో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద వందలాది మంది ప్రవాస భారతీయులు భారతదేశ 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ కార్యదర్శి రావు కల్వాల అందరికీ స్వాగతం పలుకుతూ వారాంతం కాకపోయినప్పటికీ అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ఆనందదాయకమని, మహాత్మాగాంధీ మెమోరియల్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిందని, ఈ స్మారకస్థలి అన్ని విశేష కార్యక్రమాలకు ప్రధాన వేదిక అయిందని, దీన్ని సాకారం చెయ్యడానికి విశేష కృషిచేసి, నాయకత్వం వహించిన ప్రవాసభారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూరకు, సహకరించిన అధికారులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్యదేశం అమెరికాలో, ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామ్యదేశం భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషమని, స్వాతంత్ర్య సముపార్జనలో ముఖ్యపాత్ర పోషించిన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద ఈ వేడుకలు జరుపుకోవడం ఇంకా విశేషమని, దేశస్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగంచేసిన సమరయోధులు అయినా గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభభాయి పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి నాయకులు చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ ఘన నివాళులర్పించారు.ఎన్నో దశాబ్దాలగా ఇక్కడ నివాసముంటున్న ప్రవాస భారతీయులు అమెరికాదేశ విధి విధానాలను గౌరవిస్తూ, ఎన్నికలలో పాల్గొంటూ, ఇక్కడి జనజీవన స్రవంతిలో మమేకం అవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు... మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డు సభ్యులు, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డ్ సభ్యులు సుష్మా మల్హోత్రా, బి.ఎన్ రావు, జస్టిన్ వర్ఘీస్, జగజిత్లు అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు - సత్యన్ కల్యాణ్ దుర్గ్, శాంటే చారి, లెనిన్ బాబు వేముల, నాగలక్ష్మి, గాయని భారతి, కమల్ ఫులాని మొదలైన వారు పాల్గొన్నారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన “జనయిత్రీ దివ్యధాత్రి” గీతం లెనిన్ వేముల శ్రావ్యంగా గానంచేసి అందరినీ పరవశుల్ని చేశారు. -
ఖైరతాబాద్ నియోజకవర్గంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (ఫొటోలు)
-
చిన్నబాబు కోసం.. పంద్రాగస్టు శకటాల ప్రదర్శనలో విద్యా శకటానికి ఫస్ట్ ప్రైజ్
-
పంద్రాగస్టు వేడుకల్లో వైఎస్సార్సీపీ
-
దేశానికి లౌకిక పౌరస్మృతి తక్షణావసరం.. : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పేదరికాన్ని పీ4తో తరిమేస్తాం
సాక్షి, అమరావతి: ‘పేదరికం లేని సమాజం మా ప్రభుత్వ విధానం. గతంలో పీ–3 (పబ్లిక్, ప్రైవేటు, పార్ట్నర్షిప్ విధానంతో సంపద సృష్టించాం. ఇప్పుడు పీ–4 (పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్)తో పేదరికాన్ని నిర్మూలిస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి.. సాయుధ దళాల వందనాన్ని స్వీకరించారు. ఆయన ఏమన్నారంటే.. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం.. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం. తొలిరోజే 5 కీలక అంశాలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నాం. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసి నియామక ప్రక్రియ మొదలెట్టాం. సామాజిక పింఛన్లను పెంచి ప్రతి నెలా 1వ తేదీనే వలంటీర్లతో పని లేకుండా ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థ్ధిక సాయం అందిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాం. ఆదాయాన్ని కాదని ఉచిత ఇసుక.. ప్రభుత్వానికి ఆదాయాన్ని వదులుకుని ఉచిత ఇసుక విధానం మొదలు పెట్టాం. మరింత పకడ్బందీగా దీన్ని అమలు చేస్తాం. 3.54 కోట్ల మందికి నైపుణ్య గణన చేపట్టి మెరుగైన ఉపాధి కల్పించేలా కార్యాచరణ అమలు చేస్తాం. అన్న క్యాంటీన్లకు విరాళాలు పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో నేటి నుంచి 100 అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నాం. వీటి సంఖ్యను 203కు పెంచుతాం. పుట్టిన రోజు, పెళ్లి రోజు, శుభకార్యాల సందర్భంగా విరాళాలు ఇచ్చేవారి పేరిట ఆ రోజు అన్న క్యాంటీన్లలో భోజనం పెడతాం. పోర్టులు–రహదారుల అనుసంధానం పోర్టులు, ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారులను అనుసంధానం చేసి సంపద సృష్టిస్తాం. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టును మళ్లీ పట్టాలు ఎక్కిస్తాం. వంశధార – నాగావళి – గోదావరి – కృష్ణా –పెన్నా నదులను అనుసంధానిస్తాం. కళాశాలల ఖాతాల్లో నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ములు జమ చేసేలా పాత విధానాన్ని పునరుద్ధరిస్తాం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఆరోగ్యశ్రీ బిల్లులను దశలవారీగా చెల్లిస్తున్నాం. ఎన్టీఆర్ బేబీ కిట్స్’ను తిరిగి ప్రవేశ పెడతాం. మా ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులకు తావులేదు. ఎస్సీల వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రూ.9.74 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పులు రాష్ట్ర అప్పులు రూ.9.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి. తలసరి అప్పు రూ.74,790 నుంచి రూ.1,44,336కి పెరిగింది. తలసరి ఆదాయం 13.2 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణం పెరిగింది. పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలేవీ గత ప్రభుత్వం అమలు చేయలేదు. 100 రోజుల ప్రణాళిక వచ్చే వంద రోజుల్లో పారిశ్రామికరంగంతో పాటు ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎల్రక్టానిక్, ఐటీ అండ్ క్లౌడ్, టెక్స్టైల్, టూరిజం పాలసీలు తెస్తున్నాం. సులభతర వాణిజ్యంలో మళ్లీ రాష్ట్రాన్ని అగ్రగామిగా చేస్తాం. మెడ్‌టెక్ జోన్ స్ఫూర్తిగా మరో 100 పారిశ్రామిక పార్కులు ఏర్పాట్లు చేస్తాం. -
సత్వర న్యాయం కోసం సంస్కరణలు
సాక్షి, అమరావతి: సామాన్యులకు సత్వర న్యాయాన్ని అందించడంలో జాప్యాన్ని, అవరోధాలను అధిగమించేందుకు న్యాయ వ్యవస్థలో పలు సంస్కరణలను అమలు చేస్తున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ చెప్పారు. గురువారం హైకోర్టులో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో జస్టిస్ ఠాకూర్ జాతీయ జెండా ఎగురవేశారు. అంతకు ముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల స్వాతంత్య్రోద్యమాల్లో భారతదేశ స్వాతంత్రోద్యమం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, సైబర్ నేరాలు, ఉగ్రవాదం, ప్రకృతి విపత్తులు, పర్యావరణ మార్పులు వంటి సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తూ మన దేశం పురోగతి వైపు పరుగులు పెడుతోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.ద్వారకనాథరెడ్డి, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిలిగినీడి చిదంబరం, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు ఎన్.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి నన్నపనేని శ్రీహరి పాల్గొన్నారు. లోకాయుక్తలో.. కర్నూలు (సెంట్రల్, అగ్రికల్చర్): దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని లోకాయుక్త చైర్మన్ జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం కర్నూలులోని లోకాయుక్త కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజినీ, రిజి్రస్టార్ టి.వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఏపీఈఆర్సీలో..కర్నూలులోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీ ఈఆర్సీ) భవనంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కమిషన్ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రాంసింగ్, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. -
జోరు వానలో ఎట్ హోమ్
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం సాయంత్రం రాజ్‌భవన్ ప్రాంగణంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేతలు కె.కేశవరావు, చిన్నారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఎంపీలు మల్లు రవి, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే భారీ వర్షం మొదలైంది. అయితే వాటర్‌ప్రూఫ్ టెంట్లు వేసి ఉండటంతో జోరు వానలోనూ కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, పద్మ పురస్కార గ్రహీతల వద్దకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లి పలకరించారు. చివర్లో గవర్నర్ అతిథుల టేబుల్స్ వద్దకు వెళ్లి అందరినీ పలకరించారు. కాగా, వర్షపు నీటి ప్రవాహం టేబుల్స్ కిందకి చేరడంతో చివర్లో కొంత అసౌకర్యం కలిగింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.భిన్నత్వంలో ఏకత్వమే మన బలంమాతృభూమికి స్వాతంత్య్రం కోసం పోరాడిన అసంఖ్యాక దేశభక్తుల నిస్వార్థ త్యాగాలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన రాజ్‌భవన్ దర్బార్ హాల్ ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. గడిచిన ఏడు దశాబ్దాల్లో దేశం అద్భుత ప్రగతిని సాధించిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన అతిపెద్ద బలమని స్పష్టం చేశారు. దేశం, రాష్ట్ర అభివృద్ధికి అకుంఠిత దీక్షతో పనిచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్‌భవన్ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ చాంపియనే
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందాన్ని గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం న్యూఢిల్లీలోని తన నివాసంలో అథ్లెట్ల బృందంతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పారిస్ క్రీడల్లో రెండు పతకాలు సాధించి కొత్త చరిత్ర లిఖించిన షూటర్ మనూ భాకర్.. ఒలింపిక్స్‌లో వినియోగించిన పిస్టల్ ను ప్రధానికి చూపించింది. ఇక వరుసగా రెండో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్, కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌తో మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా జట్టు ఆటగాళ్లంతా సంతకాలు చేసిన జెర్సీతో పాటు ఓ హాకీ స్టిక్‌ను ప్రధానికి అందించారు. పారిస్ క్రీడల్లో కాంస్య పతకం అందుకున్న రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా భారత జెర్సీని ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్‌తో కలిసి కాంస్య పతకం గెలిచిన సరబ్‌జ్యోత్ సింగ్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో కాంస్యం నెగ్గిన స్వప్నిల్ కుసాలేను కూడా ప్రధాని అభినందించారు. అనంతరం క్రీడాకారుల మధ్య కలియదిరిగిన ప్రధాని వారితో సంభాíÙంచారు. ఒలింపిక్స్‌లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష పాల్గొన్నారు. ‘పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. విశ్వక్రీడల్లో వారి అనుభవాలు వినడం.. వారి విజయాలను ప్రశంసించడం తృప్తినిచ్చింది. పారిస్‌కు వెళ్లిన ప్రతీ భారత క్రీడాకారుడు చాంపియనే. ప్రభుత్వం క్రీడలకు మద్దతునిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటుంది’ అని ప్రధాని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. పారిస్ క్రీడలు ముగిసిన వెంటనే చికిత్స కోసం జర్మనీకి వెళ్లడంతో అతడు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. త్రుటిలో పతకానికి దూరమైన షట్లర్ లక్ష్యసేన్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్తో పాటు ఇతర అథ్లెట్లతోనూ ప్రధాని సంభాషించారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలోకి దిగారు. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో దేశానికి ఆరు (ఒక రజతం, 5 కాంస్యాలు) పతకాలు వచ్చాయి. అంతకుముందు ఎర్రకోట వద్ద జరిగిన 78వ స్వాతంత్య్ర వేడుకల్లో ఒలింపిక్ అథ్లెట్ల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ప్రధాని ‘పారిస్’ క్రీడల్లో పాల్గొన్న అథ్లెట్లకు ధైర్యం చెబుతూనే.. పారాలింపిక్స్‌కు వేళ్లనున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం భారత్ కల అని.. 2036లో విశ్వక్రీడలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని పునరుద్ఘాటించారు. ఫీల్డ్ గోల్స్‌తోనే అది సాధ్యం: శ్రీజేశ్ న్యూఢిల్లీ: విశ్వక్రీడల్లో నిలకడగా పతకాలు సాధించాలంటే.. ఫీల్డ్ గోల్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరముందని అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన భారత గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ అన్నాడు. ఒలింపిక్స్ వంటి మెగా టోర్నీల్లో సత్తా చాటాలంటే.. పెనాల్టీ కార్నర్లను వినియోగించుకోవడంతో పాటు.. ఫీల్డ్‌గోల్స్ ఎక్కువ చేయాలని శ్రీజేశ్ పేర్కొన్నాడు. పారిస్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత జట్టు మెగా టోరీ్నలో మొత్తం 15 గోల్స్ చేసింది. అందులో 9 పెనాల్టీ కార్నర్లు, మూడు పెనాల్టీ స్ట్రోక్స్ ఉన్నాయి. అంటే కేవలం మూడే ఫీల్డ్ గోల్స్ చేయగలిగింది. అదే సమయంలో స్వర్ణం గెలిచిన నెదర్లాండ్స్ 14 ఫీల్డ్ గోల్స్, రజతం నెగ్గిన జర్మనీ 15 ఫీల్డ్ గోల్స్ చేశాయి. కాంస్య పతక పోరులో భారత్ చేతిలో ఓడి నాలుగో స్థానంలో నిలిచిన స్పెయిన్ కూడా 10 ఫీల్డ్ గోల్స్‌తో ఆకట్టుకుంది. ‘పెనాల్టీ కార్నర్ల విషయంలో మన ప్లేయర్ల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరముంది. వరుస విజయాలు సాధించాలంటే మనం ఎందులో మెరుగ్గా ఉన్నామో దానిపైనే కాకుండా.. ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టాలి. ఫీల్డ్ గోల్స్‌లో సత్తా చాటితే హాకీలో పూర్వవైభవం సాధ్యమే’ అని శ్రీజేశ్ అన్నాడు. -
గోల్కొండ కోటపై ఘనంగా పంద్రాగష్టు పండుగ (ఫొటోలు)
-
పంద్రాగస్టు స్పీచ్‌తో సరికొత్త రికార్డు
-
తెలంగాణ పార్టీ ఆఫీసుల్లో స్వాతంత్ర్య వేడుకలు
-
తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
పవన్ కళ్యాణ్ ఇండిపెండెన్స్ డే స్పీచ్
-
జవాన్ ల స్వాతంత్య్ర దినోత్సవ విన్యాసాలు
-
ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం
-
2047 నాటికి వికసిత భారత్ మన లక్ష్యం
-
న్యూఢిల్లీ : ఎర్రకోటపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
వాఘా బార్డర్ లో జవాన్ ల స్వాతంత్య్ర వేడుకలు
-
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
-
గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి
-
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
-
పంద్రాగస్టు వేడుకలు : జాతీయ జెండా ఎగురవేసిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
ప్రధాని మోదీ కాన్వాయ్ విజువల్స్
-
Watch Live: ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
-
ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండే రోజు..: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2024తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాసేపట్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు. -
భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సోవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని మోదీ. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ అవసరమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రజలందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలన్ని ప్రధాని.. దేశ అభివృద్ధి కోసం వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అవసరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు నెలలకు ఓసారి ఎన్నికలు వస్తున్నాయని, దీనివల్ల అభివృద్ధికి, వనరులకు విఘాతం కలుగుతుందన్నారు. దీనిపై రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చాలని ప్రజలకు సూచించారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమన్నారు ప్రధాని మోదీ. మహిళలపై నేరాలను అరికట్టేందుకు సమాజమంతా బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలని, రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని కుటుంబాలను నుంచి లక్షల మంది రావాలన్నారు. ఏ పార్టీ నుంచి అయినా వారు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికన పక్షంలో కొత్త ఆలోచనలు, కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చినట్లు అవుతుందన్నారు. తద్వారా వారసత్వ రాజకీయాలు, కుల, మత రాజకీయాలకు అడ్డుకట్టపడుతుందన్నారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు👉భారత్ ప్రస్థానం ప్రపంచానికి స్పూర్తిదాయకం 👉అంతరిక్ష రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదిగింది👉భారీ సంస్కరణలు తీసుకొచ్చేందుకు భారత్ సంకల్పం తీసుకుంది👉దేశాభివృద్ధికి భారీ ప్రణాళికలు అవసరం👉వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రభుత్వ నినాదం👉వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం దేశ ఆర్ధిక వ్యవ్యస్థలో అనేక మార్పులు తీసుకొచ్చింది👉దేశాభివృద్ధికి భారీ ప్రణాళికలు అవసరం👉సర్జికల్ స్ట్రైక్‌ను దేశ ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారు👉తయారీ రంగంలో భారత్ గ్లోబుల్ హబ్‌గా మారాలి👉భారత్ తర్వలోనే ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది👉మౌలిక సదుపాయాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చాం. 👉విదేశాలకు వెళ్లి చదివే దుస్థితిని తగ్గిస్తాం👉మెడికల్ సీట్ల సంఖ్యను భారీగా పెంచబోతున్నాం👉మెడిసిన్ చదివేందుకు యువత విదేశాలకు వెళ్తోంది👉దేశంలో అత్యాచారం ఘటనలను తీవ్రంగా ఖండిస్తాం👉నిందితులకు కఠిన శిక్ష పడిన సందర్భాలకు ప్రచారం జరిగితే నేరస్తుల్లో భయం పుడుతుంది👉మెడికల్ సీట్ల సంఖ్యను భారీగా పెంచబోతున్నాం👉మెడిసిన్ చదివేందుకు యువత విదేశాలకు వెళ్తోంది👉నిందితులకు కఠిన శిక్ష పడిన సందర్భాలకు ప్రచారం జరిగితే నేరస్తుల్లో భయం పుడుతుంది #WATCH | PM Narendra Modi says, "...I would like to express my pain once again, from the Red Fort today. As a society, we will have to think seriously about the atrocities against women that are happening - there is outrage against this in the country. I can feel this outrage.… pic.twitter.com/2gQ53VrsGk— ANI (@ANI) August 15, 2024👉దోషులను అంత కఠినంగా శిక్షిస్తే అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు 👉దేశంలో ఎక్కడ అత్యాచారాలు జరిగినా మీడియా హైలెట్ చేస్తోంది👉మాతృభాషను ఎవరు విస్మరించొద్దు👉ఉపాధి కల్పనలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాం #WATCH | On the 78th Independence Day, PM Modi urges all levels of government, from panchayat to central government, to work on improving ease of living at a mission mode(Video source: PM Modi/YouTube) pic.twitter.com/zT9zVN7uNX— ANI (@ANI) August 15, 2024👉జల్ జీవన్ మిషన్ ద్వారా 15కోట్ల మందికి లబ్ధి చేకూరరింది👉బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతమైతే దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత వృద్దిని సాధిస్తుంది 👉ప్రపంచ స్థాయిలో మన బ్యాంకుల్ని బలోపేతం చేశాం👉యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి 👉మరో 10 కోట్ల మంది మహిళలు కొత్తగా స్వయం సంఘాల్లో చేరారు 👉కోటిమంది మహిళలను లక్షాదికారులుగా మారుస్తాం#IndependenceDay2024 | From the ramparts of Red Fort, PM Modi says, "For Viksit Bharat 2047, we invited suggestions from the countrymen. The many suggestions we received reflect the dreams and aspirations of our citizens. Some people suggested making India the skill capital, some… pic.twitter.com/vR8aG79uVw— ANI (@ANI) August 15, 2024 During his #IndependenceDay2024 speech, PM Modi says, "Be it tourism, education, health, MSME, transport, farming and agriculture sectors- in every sector a new modern system is being created. We want to move forward by adopting best practices by integration of technology."… pic.twitter.com/TNUUlcSSy0— ANI (@ANI) August 15, 2024👉దళితులు, పీడితులు,పండితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలి👉జీ.20 సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించాం👉ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయి భారత్ ఎదగాలి👉దేశాభివృద్దికి పాలనా సంస్కరణలు అవసరం👉అంతరిక్షంలో భారత్ స్పేస్ సెంటర్ కల సాకరం కావాలి👉భారత్ ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మారాలి👉గత కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బంది పెడుతున్నాయి👉ప్రకృతి విపత్తులతో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం👉భారత్ ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మారాలి👉న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం👉 40కోట్ల మంది స్వాతంత్య్రం సంపాదిస్తే.. 140 కోట్ల మంది ఎంతైనా సాధించవచ్చు.👉లక్ష్యాన్ని నిర్ధేవించుకొని ముందుకు సాగాలి👉ఎందరో మహానుభావులు ఈ దేశం కోసం వారి జీవితాల్ని పణంగా పెట్టారు. 👉దేశం కోసం పోరాడిన మహనీయుల్ని స్మరించుకుందాం #WATCH | PM Modi as he left from his official residence for Red Fort to address the nation on 78th #IndependenceDay pic.twitter.com/wrPo7v9znm— ANI (@ANI) August 15, 2024 -
మాటలకు అందని ఆటోమొబైల్ చరిత్ర! తొలిసారి కారు వాడకం ఎప్పుడంటే?
సువిశాలమైన భారతదేశం ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తూ ప్రపంచానికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే.. ఇదంతా ఒక్క రోజులో జరిగిన పురోగతి కాదు, దశాబ్దాల తదేక కృషి ఫలితమే ఈ అభివృద్ధి. ఇండియాలో ఇతర రంగాలు ఒక ఎత్తయితే, ఆటో మొబైల్ రంగం మరో ఎత్తు అనే చెప్పాలి.1957 వరకు కూడా సొంతంగా కారుని ఉత్పత్తి చేయలేని భారత్ ఈ రోజు ప్రపంచ ఆటోమొబైల్ పవర్‌హౌస్‌లలో ఒకటిగా ఎదిగింది. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ.. అఖండ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడింది. నిజానికి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రయాణం చాలా బిన్నంగా ఉంటుంది. మన దేశంలో మొదటి వాహనం 1897లో అడుగుపెట్టినప్పటికీ దానిని ఒక ఆంగ్లేయుడు దిగుమతి చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది.టాటా కారును కలిగిన మొదటి భారతీయ సంతతి వ్యక్తి..ఇండియా.. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బొంబాయి, మద్రాస్, కలకత్తా వంటి నగరాల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే కార్లు ఉండేవి. 20వ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకు భారతదేశంలోని దాదాపు అన్ని కార్లు దిగుమతి చేసుకున్నవే. 1898లో జమ్సెట్జీ నుస్సర్వాన్జీ (Jamsetji Nusserwanji) టాటా కారును కలిగి ఉన్న భారతీయ సంతతికి చెందిన మొదటి వ్యక్తి అయ్యాడు.ఆవిరితో నడిచే వాహనాలు..తరువాత కాలక్రమంలో ఆవిరితో నడిచే వాహనాలు ఆధిపత్యం చెలాయించాయి. 1903వ సంవత్సరంలో మద్రాస్‌లోని సింప్సన్ & కోకి చెందిన 'శామ్యూల్ జాన్' భారతదేశపు మొట్టమొదటి ఆవిరి కారును నిర్మించాడు. అప్పట్లో ఈ కారు గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇది తరువాత వచ్చిన భవిష్యత్ ఆవిష్కరణలకు కూడా ఆధారంగా నిలిచింది. 1928లో జనరల్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తన బొంబాయి ఫ్యాక్టరీలో ట్రక్కులు, కార్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. 1930 నాటికి ఫోర్డ్ మోటార్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్రాస్‌లో ఆటోమొబైల్స్ అసెంబ్లీని ప్రారంభించింది.భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో 1948 నాటికి హిందుస్థాన్ మోటార్స్, మహీంద్రా, స్టాండర్డ్, ప్రీమియర్, టాటా మోటార్స్ వంటి ప్రధాన కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత కాలంలోనే దేశం కొత్త ప్రగతి యుగానికి నాంది పలికేందుకు సిద్ధమైంది. మహాత్మా గాంధీ స్వావలంబన సూత్రాలకు అనుగుణంగా, స్వదేశీ ఆటో పరిశ్రమను నిర్మించాలనే కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది.భారతీయ ఆటోరంగానికి ఆటంకం..ఆటోమోటివ్ భాగాలను మాత్రమే కాకుండా వాహనాల కోసం అంతర్గత పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే నిర్ణయం 1952 నాటి టారిఫ్ కమిషన్ సృష్టికి దారితీసింది. ఆ తరువాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో 1954 నాటికి, ఫోర్డ్, జనరల్ మోటార్స్, రూట్స్ వంటి కొన్ని అతిపెద్ద ఆటోమోటివ్ ఎగుమతిదారులు తక్షణమే దుకాణాన్ని మూసివేశారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి భారతీయ మార్కెట్‌ను దూరం చేశారు. అంతే కాకుండా స్థానిక కంపెనీలు తయారు చేసిన మోడల్స్ అమ్మకపు ధరలపై తీవ్రమైన షరతులను ఎదుర్కొంటున్నందున భారతీయ ఆటో రంగం దాదాపు ఆగిపోయినట్లయింది.అంబాసిడర్ & ప్రీమియర్ పద్మిని..అయినప్పటికీ ఆటోమొబైల్ పరిశ్రమ మళ్ళీ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 1957లో హిందుస్థాన్ అంబాసిడర్ రూపంలో మొట్టమొదటి ఆల్-ఇండియన్ కారు ఉనికిలోకి వచ్చింది. ఆ తరువాత 1964లో ప్రీమియర్ కంపెనీ అంబాసిడర్‌కు ప్రత్యర్థిగా 'పద్మిని' కారుని ప్రారంభించింది. ఈ రెండు కార్లు ఆటోమొబైల్ పరిశ్రమను తిరుగులేకుండా దశాబ్ద కాలం పాటు పాలించాయి.SIAM ఏర్పాటు..భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రారంభ రోజులలో స్థిరమైన పురోగతి, పరిశోధన ద్వారా పరిశ్రమకు మద్దతునిచ్చే లక్ష్యంతో దేశీయ సంస్థలు ఏర్పడ్డాయి. 1960లో, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (SIAM) భారతదేశంలో ఆటోమొబైల్స్ కోసం స్థిరమైన అభివృద్ధి వ్యవస్థను రూపొందించే దృష్టితో ఏర్పడింది.భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రను మనం పరిశీలిస్తే.. 1980లలో సాధించిన విజయాలే ఈ రోజు బలమైన పరిశ్రమలకు పునాదులని తెలుస్తోంది. 21వ శతాబ్దంలో మారుతీ సుజుకిగా పిలువబడే మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్, జపాన్ ఆటోమోటివ్ పవర్‌హౌస్ సుజుకితో జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. ఆ తరువాత బాలీవుడ్ రంగం ఈ పరిశ్రమను పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర వహించింది.వేగం పెరిగిన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్..విదేశీ ప్రభావంతో పాటు పెట్టుబడి పరంగా కూడా 1990 వ దశకంలో భారతీయ ఆటో మార్కెట్ వేగంగా ముందుకు సాగింది. పెట్టుబడులు వెల్లువెత్తడంతో 1993 & 1996 మధ్య కార్ల విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆ తరువాత మెర్సిడెస్ బెంజ్ 2004లో భారతదేశానికి వచ్చి దేశంలోని మొట్టమొదటి విదేశీ లగ్జరీ ఆటోమేకర్‌గా చరిత్ర సృష్టించింది. 2006లో బీఎండబ్ల్యూ, 2007లో ఆడి అరంగేట్రం చేశాయి. అప్పటి నుంచి ఈ మూడు జర్మన్ కంపెనీలు భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాము. కావున కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే ఆధునిక ఆటో పరిశ్రమ కొత్త మార్గాల్లో ప్రవేశించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఆధునిక హంగులను పొందగలిగింది.➤ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వాహనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలికింది. AI సామర్థ్యాలు కలిగిన కార్లు మునుపటి వాటికంటే మరింత ఆధునికంగా మారాయి. తయారీ ప్రక్రియ నుంచి మొత్తం ఉత్పత్తి వరకు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది.ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని వాహనాలు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతున్నాయి. నేడు బిఎస్ 4 వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. రానున్న రోజుల్లో డీజిల్ కార్లు కూడా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.➤ఎలక్ట్రిక్ మొబిలిటీ: ఒకప్పుడు నీటి ఆవిరి ద్వారా.. ఆ తరువాత డీజిల్, పెట్రోల్ వంటి కార్లు మార్కెట్లో అడుగుపెట్టాయి. ఆ తరువాత ఎలక్ట్రిక్ వాహనాలు అరంగేట్రం చేసి భారదేశాన్ని మరింత ప్రగతి మార్గంలో పయనించేలా చేశాయి. చాలామంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.➤స్వయంప్రతిపత్త వాహనాలు (Autonomous Vehicles): భారతీయ ఆటో పరిశ్రమలో చెప్పుకోదగ్గ మార్పు ఈ స్వయంప్రతిపత్తి వాహనాలు. అంటే ఈ వాహనాలు తనకు తానుగానే ముందుకు సాగుతాయి. ఇది మానవుడు కనిపెట్టిన అద్భుత సృష్టి అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వాహనాలు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ద్వారా ఆపరేట్ అయ్యే ఆ వాహనాలు ప్రమాదాల నుంచి మనుషులను కాపాడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.➤భద్రతపై దృష్టి: ఇప్పుడు మార్కెట్లో విడుదలయ్యే చాలా కంపెనీల వాహనాలు భద్రతాపరంగా చాలా ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే సంస్థలు ఈ విధమైన వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆధునిక కాలంలో ADAS టెక్నాలజీ కూడా ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. రానున్న రోజుల్లో ఎగిరే కార్లు కూడా భారతదేశంలో అరంగేట్రం చేయనున్నాయి.ఒకప్పుడు కారునే తయారు చేయలేని భారత్.. ఈ రోజు ఎన్నెన్నో దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి నాటికి మన దేశంలో 22,933,230 వాహనాలు ఉత్పత్తయ్యాయని SIAM నివేదించింది. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు ఇట్టే అర్థమవుతుంది. రానున్న రోజుల్లో మరింత ఎత్తుకి ఎదుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
Independence Day 2024: మేరా భారత్ మహాన్
దేశం అంటే భక్తి... ప్రేమ ఉన్నవాళ్లు దేశం కోసం ప్రాణాలను వదిలేయడానికి కూడా వెనకడుగు వేయరు. ‘మేరా భారత్ మహాన్’ అంటూ నిజజీవితంలోప్రాణాలను పణంగా పెట్టిన అలాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. కొందరి జీవితాల ఆదర్శంగా వెండితెరపైకి వచ్చిన సినిమాలనూ చూశాం. ప్రస్తుతం నిర్మాణంలో అలాంటి నిజ జీవిత వీరుల నేపథ్యంలో, కల్పిత పాత్రలతోనూ రూపొందుతున్న దేశభక్తి చిత్రాలు చాలా ఉన్నాయి. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.భూతల్లిపై ఒట్టేయ్... ‘‘భూతల్లిపై ఒట్టేయ్... తెలుగోడి వాడి చూపెట్టేయ్... తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పట్టేయ్’ అంటూ ప్రజలను చైతన్యపరిచేలా, వారిలో దేశభక్తి ఉ΄÷్పంగేలా పాట పాడుతున్నాడు వీరశేఖరన్. ఇతని గురించి బాగా తెలిసిన వ్యక్తి సేనాపతి. ఎందుకంటే సేనాపతి తండ్రి వీర శేఖరన్. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వీర శేఖరన్ (కల్పిత పాత్ర) ఏ విధంగా పోరాడాడు? అనేది వెండితెరపై ‘ఇండియన్ 3’ సినిమాలో చూడొచ్చు. హీరో కమల్‌హాసన్–దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఇండియన్’ (‘భారతీయుడు’) ఫ్రాంచైజీలో త్వరలో రానున్న చిత్రం ‘ఇండియన్ 3’. ఈ చిత్రంలో వీరశేఖరన్, సేనాపతి పాత్రల్లో తండ్రీకొడుకుగా కమల్‌హాసన్ కనిపిస్తారు. 1806 సమయంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వీర శేఖరన్ ఏ విధంగా పోరాడాడు? అతని పోరాట స్ఫూర్తితో 1940లలో సేనాపతి ఏం చేశాడు? అనే అంశాలతో ‘ఇండియన్ 3’ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. భారత్ మాతా కీ జై ‘తేరే పాకిస్తానీ అడ్డా మే బైట్ కే బతా రహా హూ... భారత్ మాతా కీ జై...’ అంటూ నాగచైతన్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ‘తండేల్’ సినిమాలోనిది. విజయనగరం, శ్రీకాకుళంప్రాంతాలకు చెందిన మత్య్సకారులు జీవనోపాధి కోసం గుజరాత్ తీరప్రాంతానికి వలస వెళ్తారు. వేటలో భాగంగా వారికి తెలియకుండానే పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్తారు. పాకిస్తాన్ కోస్ట్ గార్డులు ఈ భారత మత్స్యకారులను బంధీలుగా పట్టుకుని జైల్లో వేస్తారు. పాకిస్తాన్ జైల్లో వీరి పరిస్థితి ఏంటి? వీరి కుటుంబ సభ్యులు వీరి కోసం ఏమైనా పోరాటం చేశారా? అనే అంశాల నేపథ్యంలో ‘తండేల్’ కథనం ఉంటుందని తెలిసింది. వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, అతని భార్య పాత్రలో సాయి పల్లవి కనిపిస్తారు. దేశభక్తి అంశాలతో పాటు ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాలు మిళితమైన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.మార్టిన్... ఇండియన్ పాకిస్తాన్ ఆర్మీ మార్టిన్ అనే భారతీయుడిని క్రూరంగా శిక్షించాలనుకుంటుంది. మార్టిన్‌కు దేశభక్తి ఎక్కువ. ఎంతలా అంటే... అతని చేతిపై ఇండియన్ అనే ట్యాటూ ఉంటుంది. అసలు పాకిస్తాన్ జైల్లో మార్టిన్ ఎందుకు ఉండాల్సి వచ్చింది? అనేది కన్నడ చిత్రం ‘మార్టిన్’ చూస్తే తెలుస్తుంది. ధ్రువ్ సర్జా హీరోగా నటించిన చిత్రం ఇది. ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ దేశభక్తి, యాక్షన్, ఎమోషనల్ మూవీ అక్టోబరు 11న రిలీజ్ కానుంది.అమరన్ ‘రమణ (తెలుగులో ‘ఠాగూర్’గా రీమేక్ అయింది), తుపాకీ, కత్తి’ వంటి సినిమాల్లో సామాజిక బాధ్యతతో పాటు కాస్త దేశభక్తిని కూడా మిళితం చేసి, హిట్ సాధించారు తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ప్రస్తుతం హీరో శివ కార్తికేయన్‌తో ‘అమరన్’ సినిమా చేస్తున్నారాయన. ఈ చిత్రంలో సైనికుడి పాత్రలో కనిపిస్తారు శివ కార్తికేయన్. సాయిపల్లవి హీరోయిన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని టాక్. ఈ చిత్రం అక్టోబరు 31న రిలీజ్ కానుంది. అలాగే ప్రస్తుతం మురుగదాస్ హిందీలో సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న ‘సికందర్’ కూడా దేశభక్తి నేపథ్యంలోనే ఉంటుందని టాక్.సరిహద్దు యుద్ధం దేశభక్తి ప్రధానాంశంగా ఉన్న చిత్రాల్లో నటించేందుకు అక్షయ్ కుమార్ ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన చేసిన ‘బేబీ, ఎయిర్ లిఫ్ట్, ‘మిషన్ మంగళ్’ వంటి చిత్రాలు ఇందుకు ఓ నిదర్శనం. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన చిత్రం ‘స్కై ఫోర్స్’. 1965లో ఇండియా–పాకిస్తాన్ల మధ్య జరిగిన వార్ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. వీర్ పహారియా, నిమ్రత్ కౌర్, సారా అలీఖాన్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. సందీప్ కెవ్లానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబరు 2న రిలీజ్ కానుంది. అలాగే 1971లో ఇండియా–పాకిస్తాన్ల మధ్య జరిగిన వార్ నేపథ్యంలో 1997లో హిందీలో ‘బోర్డర్’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటించారు. కాగా ఇటీవల సన్నీ డియోల్ ‘బోర్డర్ 2’ను ప్రకటించారు. ఇంకా భారత్–పాకిస్తాన్ విడిపోయిన నాటి పరిస్థితుల నేపథ్యంలో ‘లాహోర్ –1947’ సినిమా కూడా చేస్తున్నారు సన్నీ డియోల్. ఇక పాకిస్తాన్ చిన్నారిని ఆమె దేశంలో విడిచిపెట్టేందుకు ‘భజరంగీ భాయిజాన్’ (2015)గా సల్మాన్ ఖాన్ చేసిన సాహసాలను సులభంగా మర్చిపోలేం. ఈ ఫిల్మ్‌కు సీక్వెల్ ఉంటుందని చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ముంబయి-ఢిల్లీ టికెట్ కంటే తులం బంగారం చీప్!
భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టమో అందరికీ తెలిసిందే కదా. పెళ్లిళ్లు, పండగలు, పుట్టినరోజు, పెళ్లి రోజు..ఇలా ప్రత్యేక దినాల్లో మరింత స్పెషల్‌గా ఆత్మీయులకు ఆనందాన్ని పంచేందుకు బంగారాన్ని కొంటూంటారు. అంతేకాదు గోల్డ్‌ను స్థిరంగా వృద్ధి చెందే సురక్షితమైన పెట్టుబడిగా భావించి అందులో ఇన్వెస్ట్ చేస్తారు. చైనా తర్వాత బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్ పసిడి ప్రయాణం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది.1947లో రూ.88.62 రెట్టింపు అయింది.1947లో ముంబయి నుంచి ఢిల్లీ వెళ్లే టికెట్ ధర కంటే 10 గ్రాముల బంగారం ధర తక్కువ.స్వాతంత్ర్యం తర్వాత బంగారం ధరలో అతిపెద్ద పతనం 1964లో జరిగింది. ఆ సమయంలో 10 గ్రాముల బంగారం రూ.63.25 మాత్రమే.1950-60 దశాబ్దంలో బంగారం దాదాపు 12 శాతం ఎగిసింది.1970లో 10 గ్రాముల బంగారం సగటు ధర రూ.184కు చేరింది.1980లో రూ.1,330కు, 1990 నాటికి రూ.3,200 దాటింది.2001 ఏడాదికి సుమారు 15శాతం చొప్పున పెరిగింది.2008-2009లో ఆర్థిక సంక్షోభం మార్కెట్లను కుదిపేసినప్పటికీ 2000-2010 మధ్య కాలంలో బంగారం ధర రూ 4,400 నుంచి రూ.18,500 వరకు పెరిగింది.2021లో సగటు బంగారం ధర 10 గ్రాములకు రూ.48,720.2023లో రూ.60వేల వద్ద రికార్డు స్థాయిని బ్రేక్ చేసింది.2024 మేలో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా గరిష్ఠంగా రూ.76,450ను తాకింది. ప్రస్తుతం ఈరోజు(ఆగస్టు 14, 2024) రూ.71,150గా ఉంది.బంగారం ధరను ప్రభావితం చేసే కొన్ని అంశాలు..గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర ప్రభావంభౌగోళిక, రాజకీయ అనిశ్చితులుఆర్థికమాంద్యం భయాలుఆర్థిక, రాజకీయ పరిస్థితులుప్రభుత్వ విధానాలుడాలర్ విలువద్రవ్యోల్బణంభారత్ దిగుమతి చేసుకునే బంగారంలో దాదాపు 44 శాతం స్విట్జర్ల్యాండ్ నుంచే వస్తోంది. తర్వాత యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి సుమారు 11 శాతం పసిడి దిగుమతి అవుతుంది. తర్వాత స్థానంలో సౌత్ ఆఫ్రికా, గినియా ఉంటాయి.ఇదీ చదవండి: పెరుగుతున్న సౌర విద్యుత్ సామర్థ్యంఎక్కువ కొనుగోలు చేసేది ఎప్పుడంటే..పెళ్లిళ్లుపుట్టినరోజుపెళ్లిరోజుదీపావళిఆక్షయ తృతియదంతేరాస్ఇతర ప్రత్యేక రోజులు, పండగలు -
ఇదీ ఫ్లాగ్ కోడ్.. అగౌరవపరిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు!!
సాక్షి, సిటీబ్యూరో: దేశ ప్రాథమిక, ప్రధాన చిహ్నం.. భారత గౌరవ ప్రతీక.. శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వాన్ని ప్రతిబింబించేది జాతీయ జెండా. ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో పాటు పలు ప్రత్యేక రోజుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తుంటాం. అంతేకాకుండా దేశభక్తిని, భారత ప్రతిష్టను ప్రదర్శించే వివిధ సందర్భాల్లోనూ జాతీయ పతాకాన్ని వినియోగిస్తాం. ఇటీవలి కాలంలో హర్ ఘర్ తిరంగా నినాదంతో ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడుతోంది. అయితే జాతీయ జెండా ఎగరవేయడానికి, ప్రదర్శించడానికి ప్రత్యేక నిబంధనలున్నాయి. ఈ నియమావళికి ఏ మాత్రం అవాంతరం ఎదురైనా దేశ ప్రతిష్టకే అవమానం. ఈ నేపథ్యంలో రాజ్యాంగం సూచించిన ఫ్లాగ్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలి. ఆ వివరాలు తెలుసుకుందాం..జాతీయ జెండా కేవలం ప్రభుత్వ భవంతుల మీద, ప్రభుత్వాధికారులకు మాత్రమే ఎగరవేసే ఆధికారముండేది. 2001లో నవీన్ జిందాల్ సుప్రీం కోర్టు కేసులో భాగంగా ప్రతి పౌరుడూ జెండాను ఎగరేయొచ్చని సవరించింది. జాతీయ జెండా పరిరక్షణకు సంబంధించి 1950, 1971 చట్టాలతో పాటు 2002, 2005లో సవరించిన అంశాలతో నూతన జాతీయపతాక నియమావళిని రూపొందించింది. ఈ నియమావళిలో భాగంగా పతాకం నేలనుగానీ, నీటినిగానీ తాకరాదు. టేబుల్ క్లాత్‌గా, వేదికకు ముందు భాగంలో వాడకూడదు.ఉద్దేశపూర్వకంగా జెండాను తలకిందులు చేయకూడదు, విగ్రహాలమీద, ఇతర వస్తువులకు కప్పకూడదు. నడుం కింది భాగంలో, లోదుస్తులమీద జెండాను వాడకూడదు. ఆవిష్కరణకు ముందు పువ్వులు తప్ప ఇతర వస్తువులను జెండాలో ఉంచడం, జెండా మీద ఏదైనా రాయడం నిషిద్ధం. సాధారణంగా సూర్యోదయంలో జెండాను ఎగరవేసి, సూర్యాస్తమయంలో దించివేయాలి. కాషాయరంగు పైన ఉండేటట్లు, నిలువుగా వేలాడదీసినట్లైతే కాషాయరంగు చూసేవారికి ఎడమచేతివైపున ఉండాలి. మురికిగా ఉన్న జెండాను ప్రదర్శించకూడదు. రెండు జాతీయపతాకాలను ఎక్స్ ఆకారంలో కర్రలకు తగిలించినట్లైతే రెండు జెండాలూ వ్యతిరేకదిశల్లో తగిలించాలి. పోడియంలు, బిల్డింగుల మీద కప్పడానికి గానీ, రెయిలింగుల మీద అలంకరణ కోసంగానీ వాడకూడదు.వీరి ఆదేశాల మేరకు..రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం మాత్రమే సంతాపసూచకంగా పతాకాన్ని అవనతం (జెండా కర్రకు సగం ఎత్తులో ఎగరెయ్యడం) చెయ్యాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల్లో ఎవరు మరణించినా దేశవ్యాప్తంగా అవనతం చేస్తారు. అధికార, సైనిక, పారామిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేటప్పుడు శవపేటిక మీద తలవైపు కాషాయరంగు వచ్చేటట్లు కప్పాలి. ఐతే దానిని ఖననం చేసే ముందు తీసేయాలి. శవంతో పాటు సమాధిలోకి దించడం, కాల్చడం చెయ్యరాదు.ఇవి తప్పనిసరి..ఇతర దేశాల జాతీయపతాకాలతో కలిపి ఎగరేసే సమయంలో వరుసలో మొదటి స్థానంలో కుడివైపు (చూసేవారి ఎడమచేతివైపు) ఉండాలి. మిగతా పతాకాలు ఇంగ్లి‹Ùలో ఆయాదేశాల పేర్లను బట్టి అక్షరక్రమంలో అమర్చాలి. అన్ని పతాకాలూ దాదాపు ఒకే పరిమాణంలో ఉండాలి. అన్ని పతాకాలూ విడివిడిగా వేర్వేరు జెండాకర్రలమీద ఎగరెయ్యాలి. వృత్తాకారంలో ఎగరేసినప్పుడు భారత పతాకం దగ్గరే వృత్తం మొదలై, సవ్యదిశలో తిరిగిరావాలి. మన పతాకాన్ని ముందు ఎగరేసి అన్నిటికంటే చివర అవనతం చెయ్యాలి. పతాకాన్ని సమావేశాల్లో వేదికల మీద ప్రదర్శించేటప్పుడు కుడివైపునే (చూసేవారికి ఎడమవైపున) ఉండాలి. వక్తలు ఉపన్యసించేచోట ఉన్నట్లైతే వారికి కుడిచేతి వైపునే ఉండాలి. ఇతర జెండాలతో కలిపి ఊరేగింపులో తీసుకెళ్ళే సమయంలో మొదట్లో ఉండాలి. జెండాలన్నిటినీ ఒకే వరసలో తీసుకెళ్లేటప్పుడు కుడివైపున మొదటిదిగా లేదా మధ్యలో అన్నిటికంటే ముందు ఉండాలి. దేనికీ/ఎవరికీ గౌరవసూచకంగా జాతీయ జెండాను కిందికి దించరాదు.వాహనాలపై..జాతీయపతాకాన్ని వాహనాల మీద ఎగరేసే అధికారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, పార్లమెంటు, శాసనసభల సభ్యులు, లోక్‌సభ, శాసనసభల స్పీకర్లు, రాజ్యసభ, రాష్ట్రాల శాసనమండళ్ల అధ్యక్షులు, సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, సైనిక, నావికాదళ, వాయుసేనల్లోని ఉన్నతాధికారులకు మాత్రమే ఉంది. ఇతర దేశాల నాయకులు భారత ప్రభుత్వ వాహనంలో తిరుగుతున్నప్పుడు భారత జాతీయపతాకం కుడి వైపు చివరన, వారి జాతీయపతాకం ఎడమవైపు చివరన ఉండాలి. -
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న గోల్కొండ కోట (ఫొటోలు)
-
హైదరాబాద్ : సగర్వంగా..‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ (ఫొటోలు)
-
Har Ghar tiranga : ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ (ఫొటోలు)
-
ఎర్రకోట : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్ (ఫొటోలు)
-
కేజ్రీవాల్ జైలు నిబంధనలు ఉల్లంఘన!
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాకు లేఖ రాయడాన్ని జైలు అధికారులు తప్పు పట్టారు. జైలు నిబంధనలు ఉల్లంఘించటమేని తెలిపారు. వచ్చే ఆగస్టు 15 తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి అతిశీ జాతీయజెండాను ఎగరవేస్తారని తెలుపుతూ సీఎం కేజ్రీవాల్ ఎల్జీకి లేఖ రాసినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. దీనిపై తిహార్ జైలు నంబర్ 2, సుపరింటెండెంట్ స్పందించారు. సీఎం కేజ్రీవాల్ ఎల్జీకి లేఖ రాసి ఢిల్లీ జైలు నింబంధనలు-2018ను ఉల్లంఘించారని అన్నారు. ఆయన రాసిన లేఖకు సంబంధించిన సమాచారం మీడియాలో రావటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి అనుమతిలేని చర్యలు పాల్పడితే.. జైలులో సీఎంకు ఉన్న అధికారాలను కూడా కుదించాల్సి వస్తుందని కేజ్రీవాల్‌కు సూచించారు. కేజ్రీవాల్ ఆగస్టు 6వ తేదీన ఎల్జీకి లేఖ రాసినట్లు జైలు అధికారులు నిర్ధారించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం. ఇక. ఈడీ కేసులో ఇటీవల సుప్రీం కోర్టు ఆయను బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ ఆరెస్ట్ చేయగా ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. మరోవైపు.. అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖ తమకు చేరలేదని ఎల్జీ కార్యాలయం పేర్కొనటం గమనార్హం. ఇదిలా ఉండగా.. స్వాతంత్ర్య దినోత్సవం (అగస్టు15) సందర్భంగా రాష్ట్ర మంత్రి అతిశీ జాతీయ జెండాను ఎగురవేస్తారని సీఎం కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. -
17, 18లలో అమెరికాలో భారత స్వాతంత్య్ర సంబరాలు
రాబోయే పంద్రాగస్టున భారతదేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరగనున్నాయి. ఇదే సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ నెల 17, 18 తేదీలలో 32వ ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ ఇండియా డే పరేడ్ జరగనుంది. ఆరోజున భారత్- అమెరికాల సంస్కృతుల సంగమం వెల్లివిరియనుంది. ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ గ్లోబ్ (ఎఫ్‌ఓజీ),ఫెడరేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఫ్ఐఏ) సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భారతదేశం-యుఎస్ఏ సాంస్కృతిక వారసత్వం కనిపించనుంది. ఇండియా డే పరేడ్, ఫెయిర్‌లో వేలాది మంది పాల్గొననున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వెల్నెస్ ఫెయిర్, ఫుడ్ ఫెస్టివల్, చిన్నారులను ఉత్సాహపరిచే కార్యక్రమాలు, కవాతు నిర్వహించనున్నారు.ఈ వేడుకల్లో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో 250కి పైగా నృత్య బృందాలు తమ కళలను ప్రదర్శించనున్నాయి. క్లాసికల్, ఫోక్, బాలీవుడ్, కాంటెంపరరీ, హిప్-హాప్ తదితర కేటగిరీలలో ఈ ప్రదర్శనలు జరగనున్నాయి. ఎఫ్‌ఓజీ వ్యవస్థాపకుడు, కన్వీనర్ డాక్టర్ రోమేష్ జప్రా మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా తమ ఫెడరేషన్ అమెరికాలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నదన్నారు. -
ఆ తడబాటుతోనే ఈ ఎడబాటు..
శతాబ్దాల పాటు విదేశీ పాలనలో సర్వం కోల్పోయిన జాతి మేల్కొని స్వాతంత్య్రం సాధించుకోవడం చరిత్రాత్మకమే! భారత స్వాతంత్య్రోద్యమం ప్రధానంగా అహింసాయుతంగా సాగినా, స్వరాజ్యం రక్తపుటడుగుల మీదనే వచ్చిందన్న సత్యం దాచకూడనిది. స్వాతంత్య్రం, దేశ విభజన ఏకకాలంలో జరిగాయి. నాటి హింసకు ఇరవై లక్షల మంది బలయ్యారు. కోటీ నలభయ్ లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారత విభజన ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్తపాతంతో కూడిన ఘటనగా నమోదైంది.విస్మరించలేని వాస్తవాలు స్వాతంత్య్ర సమరంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రస్థానంలో నిలిచిన సంగతితో పాటు గిరిజన, రైతాంగ పోరాటాలు, విదేశీ గడ్డ మీద నుంచి జరిగిన ఆందోళనలు, తీవ్ర జాతీయవాదులు సాగించిన ఉద్యమాలు, బ్రిటిష్ ఇండియా చట్టసభలలో ప్రవేశించిన భారతీయ మేధావులు నాటి చట్టాలను దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మలచడానికి చేసిన కృషి విస్మరించలేనివి. అటవీ చట్టాల బాధతో కొండకోనలలో ప్రతిధ్వనించిన గిరిజనుల ఆర్తనాదాలు, అండమాన్ జైలు గోడలు అణచివేసిన దేశభక్తుల కంఠశోష ఇప్పటికైనా వినడం ధర్మం.విభజన సృష్టించిన హింసాకాండ..రెండో ప్రపంచయుద్ధం ప్రారంభమైన రెండేళ్లకే వలసల నుంచి ఇంగ్లండ్ వైదొలగడం అవసరమన్న అభిప్రాయం ఆ దేశ నేతలలో బలపడింది. ఆ నేపథ్యంలోనే 1942 నాటి క్విట్ ఇండియా ఘట్టం భారత్ స్వాతంత్య్రోద్యమాన్ని చివరి అంకంలోకి ప్రవేశపెట్టింది. ‘భారత్‌ను విడిచి వెళ్లండి!’ అన్నది భారత జాతీయ కాంగ్రెస్ నినాదం. ‘భారత్‌ను విభజించి వెళ్లండి!’ అన్నది ముస్లిం లీగ్ సూత్రం. ఇదే ప్రతిష్టంభనను సృష్టించింది. స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా సంవత్సరం ముందు (16 ఆగస్ట్ 1946) ముస్లిం లీగ్ ఇచ్చిన ‘ప్రత్యక్ష చర్య’ పిలుపు, పర్యవసానాలు ఆ ప్రతిష్టంభనకు అవాంఛనీయమైన ముగింపును ఇచ్చాయి. భారత్‌లో అంతర్యుద్ధం తప్పదన్న భయాలు ఇంగ్లండ్‌కు కలిగించిన పరిణామం కూడా అదే! అంతర్యుద్ధం అనుమానం కాదు, నిజమేనని పంజాబ్ ప్రాంత ప్రముఖుడు మాస్టర్ తారాసింగ్ ప్రకటించారు.అటు పంజాబ్లోను, ఇటు బెంగాల్లోను మతఘర్షణలు తారస్థాయికి చేరాయి. ఈ దృశ్యానికి పూర్తి భిన్నమైన చిత్రం మరొకటి ఉంది. 1946లో జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ భాగస్వాములుగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం విభేదాలతో సతమతమవుతున్నది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో విభజన ప్రయత్నాలు శరవేగంగా జరిగాయి. భారత స్వాతంత్య్రానికి 1947 ఫిబ్రవరి 20న లేబర్ పార్టీ ప్రధాని క్లెమెంట్ అట్లీ ముహూర్తం ఖరారు చేశాడు. 1947 మార్చి 5న బ్రిటిష్ పార్లమెంట్లో చర్చ జరిగింది. నిజానికి అది భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే అంశం కాదు. ఉపఖండ విభజన గురించి. ఫిబ్రవరి 20 నాటి ప్రకటన ప్రకారం 1948 జూన్ మాసాంతానికి భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలి. కానీ ఆ ఘట్టాన్ని 11 మాసాల ముందుకు తెచ్చినవాడు లార్డ్ లూయీ మౌంట్‌బాటన్ , ఆఖరి వైస్రాయ్. ఈ తడబాటే, ఈ తొందరపాటే ఉపఖండాన్ని నెత్తురుటేరులలో ముంచింది.గాంధీజీకి నెరవేరని కోరిక..విభజన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాడన్న నెపంతో 1947 ఫిబ్రవరిలో వైస్రాయ్ వేవెల్ను వెనక్కి పిలిపించి, 1947 మార్చి 22న మౌంట్‌బాటన్ ను పంపించారు. భారత్ విభజనను ఆగమేఘాల మీద పూర్తి చేసేందుకే మౌంట్‌బాటన్ ను నియమించారు. ఈ దశలోనే గాంధీజీకీ, జాతీయ కాంగ్రెస్‌కూ మధ్య ‘మౌన’సమరం మొదలయింది. ‘విభజనను కాంగ్రెస్ ఆమోదిస్తే అది నా శవం మీద నుంచే జరగాలి’ అని మౌలానా అబుల్ కలాం ఆజాద్‌తో గాంధీజీ వ్యాఖ్యానించినా దాని ప్రభావం కనిపించలేదు. 1947 మేలో మౌంట్‌బాటన్ విభజన ప్రణాళికను కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ల ముందు పెట్టాడు. ఇది స్వదేశీ సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చింది. దీనిని మొదట నెహ్రూ వ్యతిరేకించినా, తరువాత అంగీకరించారు. స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితులలో 565 సంస్థానాలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారాన్ని విభజన ప్రణాళిక ఇచ్చింది.గాంధీజీ లేకుండానే విభజన నిర్ణయం..1947 జూన్ 3న మౌంట్‌బాటన్ భారత్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, విభజన గురించి ప్రకటించారు. కేవలం తొమ్మిది మంది సమక్షంలో విభజన నిర్ణయం ఖరారైంది. నెహ్రూ, పటేల్, జేబీ కృపలానీ (కాంగ్రెస్), జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ (లీగ్) బల్దేవ్సింగ్ తదితరులు మాత్రమే ఉన్నారు. ఈ కీలక సమావేశంలో గాంధీజీ లేని సంగతి గమనించాలి. మౌంట్‌బాటన్ పథకానికే 1947 జూలై 5న ఇంగ్లండ్ సింహాసనం ఆమోదముద్ర వేసింది. మూడు రోజుల తరువాత బ్రిటిష్ పార్లమెంట్ అంగీకారం తెలియచేసింది. ఆగస్ట్ 15వ తేదీకి ఐదు వారాల ముందు 1947 జూలై 8న సరిహద్దు కమిషన్ ఆ పని ఆరంభించింది. కాంగ్రెస్, లీగ్‌ల నుంచి చెరొక నలుగురు సభ్యులుగా ఉన్నారు. సర్ సిరిల్ జాన్ రాడ్‌క్లిఫ్ ఆ కమిషన్ అధ్యక్షుడు. భారతదేశం గురించి ఏమాత్రం అవగాహన లేనివాడని ఆయన మీద ఆరోపణ. కాలదోషం పట్టి మ్యాపుల ఆధారంగా విభజన రేఖలు వచ్చాయి. బెంగాల్, పంజాబ్‌ల విభజనకు కూడా కమిషన్ లు ఏర్పడినాయి.ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పటేల్, మేనన్..యూనియన్ జాక్ దిగితే భారత్‌కు సార్వభౌమాధికారం వస్తుంది. కానీ సంస్థానాలు స్వయం నిర్ణయం తీసుకుంటే కొత్త సార్వభౌమాధికారానికి పెను సవాలు ఎదురవుతుంది. ఈ ప్రమాదాన్ని సకాలంలో గుర్తించిన వారు సర్దార్ పటేల్, బ్రిటిష్ ఇండియాలో రాష్ట్రాల వ్యవహారాల ఇన్ చార్జ్ వీపీ మేనన్ . ఆ సమస్యను పరిష్కరించినవారూ వారే! దేశం మీద స్వతంత్ర భారత పతాకం ఎగిరే నాటికే కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని సంస్థానాలను వారు భారత యూనియన్ లోకి తేగలిగారు. ఇది స్వతంత్ర భారతావని భవిష్యత్తును తీర్చిదిద్దిన నిర్మాణాత్మక ఘట్టం. సాంస్కృతిక ఐక్యతకు రాజకీయ ఐక్యతను జోడిరచిన పరిణామం. 1947 ఆగస్ట్ 15న భారత్ స్వతంత్ర దేశమైంది. – డాక్టర్ గోపరాజు నారాయణరావు -
ఆ రాష్ట్రంలో ఏటా రెండుసార్లు స్వాతంత్య్ర వేడుకలు
ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే మనదేశంలోని ఆ రాష్ట్రంలో రెండుసార్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. దీనివెనుక చారిత్రక కారణం ఉంది.గోవాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటారు. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. భారతదేశం 1947, ఆగష్టు 15న బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్య్రం పొందింది. బ్రిటీష్ వారు భారతదేశానికి రాకముందే పోర్చుగీస్‌వారు గోవాలో స్థిరపడ్డారు. భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసినప్పటికీ, పోర్చుగీస్‌వారు 14 ఏళ్ల తర్వాత గోవాకు స్వాతంత్య్రాన్ని అందించారు. పోర్చుగీసువారు 1510 నుండి గోవాలో తిష్టవేశారు. అక్కడ నివసిస్తున్న హిందువులను నానా హింసలకు గురిచేశారు. పోర్చుగీస్ ప్రభుత్వం ఎవరైనా హిందువులు స్వచ్ఛందంగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే, వారికి 15 ఏళ్లపాటు పాటు భూమి పన్ను నుండి విముక్తి కల్పిస్తామని ప్రకటించింది.భారతదేశనికి స్వాతంత్య్రం లభించాక గోవాను భారత్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే పోర్చుగీస్ వారు దీనిని వ్యతిరేకించారు. ఈ నేపధ్యంలో 1940 నుంచి గోవాలో స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రమయ్యింది. పలు సత్యాగ్రహాలు నిర్వహించారు. గోవాను మహారాష్ట్రలో కలపాలని కొందరు, కర్ణాటకలో కలపాలని మరికొందరు డిమాండ్ చేశారు. కొందరు పోర్చుగీసు వారి ఆధీనంలో ఉంటూ, స్వయంప్రతిపత్తిని కోరుకున్నారు. మరికొందరైతే పూర్తి స్వాతంత్ర్యం కోరుకున్నారు.ఈ పరిస్థితులను గమనించిన మహాత్మాగాంధీ గోవా విముక్తి విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాలని సూచించారు. 1947లో పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమయ్యింది. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పోర్చుగీస్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది. 1961, డిసెంబరు18న నేవీ, ఎయిర్ ఫోర్స్‌తో పాటు 30 వేల మంది భారతీయ సైనికులు గోవాపై దాడి చేసి ఫోర్చుగీసువారిని గోవా నుంచి తరిమికొట్టారు. ఈ మొత్తం ఆపరేషన్‌కు భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ అనే పేరు పెట్టింది. సందర్భాన్ని పురస్కరించుకుని గోవాలో ప్రతీయేటా డిసెంబరు 19న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. అలాగే భారత్‌లో గోవా భాగమైనందున ఆగస్టు 15న కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంటాయి. -
కొత్త కార్ల పండగ!
సార్వత్రిక ఎన్నికలు.. మండుటెండలు.. కుండపోత వర్షాలు.. కార్ల కంపెనీల అమ్మకాలను గత మూడు నాలుగు నెలలూ గట్టిగానే దెబ్బకొట్టాయి. గ్రామీణ డిమాండ్‌తో జూలైలో మాత్రం కాస్త పుంజుకుని ఊరటనిచ్చాయి. నిండు కుండలా కార్ల నిల్వలు పేరుకుపోవడంతో డీలర్లు పండగ సీజన్ కోసం అవురావురుమని ఎదురుచూస్తున్నారు. మరోపక్క, అమ్మకాలు మందగించడంతో.. కార్ల కంపెనీలు గేరు మారుస్తున్నాయి. కొంగొత్త వాహన మోడళ్లను కారు ప్రియుల కోసం రెడీ చేస్తున్నాయి. ఆటోమొబైల్ సంస్థలు సేల్స్ పెంపుతో పండుగ చేసుకోవాలని చూస్తుండగా.. కస్టమర్లకు కూడా కొత్త కార్ల జాతర కనువిందు చేయనుంది. రాబోయే పండుగ సీజన్ కోసం కార్ల కంపెనీలన్నీ ‘కొత్త’ వ్యూహంతో సిద్ధమవుతున్నాయి. దాదాపు 20 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అంచనా. ఇందులో 12 కార్లు పూర్తిగా కొత్తవి కావడం విశేషం. ప్రస్తుతం దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ)పైనే కంపెనీలన్నీ ఎక్కువగా గురి పెట్టాయి. కొత్తగా విడుదలయ్యే వాటిలో 13 ఎస్యూవీ మోడల్స్ ఉండటం దీనికి నిదర్శనం. టాటా మోటార్స్, నిస్సాన్, సిట్రాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎంజీ మోటార్స్, కియా, హ్యుందాయ్, ఫోక్స్వ్యాగన్తో పాటు లగ్జరీ కార్ దిగ్గజాలు మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ తదితర కంపెనీలు వచ్చే మూడు నెలల్లో కొత్త ఎస్‌యూవీలతో మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. ఇక మారుతీ సుజుకీ, మెర్సిడెస్ నయా సెడాన్లతో అలరించనుండగా.. కియా, ఎంజీ మల్టీ పర్పస్ వాహనాలను (ఎంపీవీ) రంగంలోకి దించుతున్నాయి. సేల్స్ తగ్గినా.. నిల్వల పెంపు.. ఈ ఆరి్థక సంవత్సరం మొదలు (ఏప్రిల్ నుంచి) వాహన అమ్మకాలు మందకొడిగానే సాగుతున్నాయి. ఎన్నికలతో పాటు మండుటెండలు కూడా వాహన విక్రయాలపై ప్రభావం చూపాయి. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేయడం కంపెనీల ఆశలపై నీళ్లు చల్లింది. అయితే, గ్రా మీణ డిమాండ్ మళ్లీ పుంజుకోవడంతో జూలైలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 10% పెరగ డం విశేషం. కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేయడం.. పండుగల్లో భారీ డిమాండ్ ఆశలతో వాహన కంపెనీలు భారీగా నిల్వలు పెంచుకున్నాయి. డీలర్ల వద్ద సగటున 25–30 రోజుల నిల్వలు ఉంటాయని, ప్రస్తుతం 60–65 రోజుల నిల్వలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటి విలువ రూ.73,000 కోట్లుగా అంచనా. సెపె్టంబర్‌తో షురూ... దక్షిణాదిన కేరళ ‘ఓనమ్’ తో పండుగ సేల్స్ మొదలవుతాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయకచవితి, దుర్గాపూజ, దసరా, దీపావళి ఇలా వరుసగా అటు జనాలకు ఇటు కంపెనీలకూ పండుగే. మూడు నెలలుగా పేరుకున్న నిల్వలను పండుగల్లో విక్రయించడంతో పాటు కొత్త మోడళ్లతో కస్టమర్లను షోరూమ్‌లకు క్యూ కట్టించాలనేది వాహన సంస్థల వ్యూహం. మహీంద్రా సక్సెస్ఫుల్ ఎస్యూవీ ‘థార్’లో (ప్రస్తుతం మూడు డోర్ల మోడల్ ఉంది) కొత్తగా ఐదు డోర్ల థార్ ‘రాక్స్’ను తీసుకొస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దీన్ని ఆవిష్కరించి.. పండుగ సీజన్లో మార్కెట్లోకి తీసుకొచ్చేలా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ‘ఐదు డోర్ల థార్ కోసం మేము ముందుగా ప్లాన్ చేసిన ఉత్పత్తికి మరో 3,000–4,000 అదనంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నాం’ అని ఎంఅండ్ఎం సీఈఓ (ఆటో, ట్రాక్టర్ల విభాగం) రాజేష్ జెజూరికర్ క్యూ1 ఆరి్థక ఫలితాల సందర్భంగా వెల్లడించారు.ఈవీలు, హైబ్రిడ్లు కూడా... కొత్తగా లైన్ కడుతున్న వాహన మోడల్స్ కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా రకరకాల ఇంజిన్ ఆప్షన్లతో లభించనున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ (ఈవీ) హైబ్రిడ్ (సీఎన్జీ+పెట్రోల్ వంటివి) ఇంజిన్లు సైతం వీటిలో ఉన్నాయి. ఈవీ విభాగాన్ని శాసిస్తున్న టాటా మోటార్స్ సరికొత్త ఎస్యూవీ కూప్ ‘కర్వ్’తో పండగ చేసుకోవాలనుకుంటోంది. ఈ మోడల్లో పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో పాటు ఈవీ వేరియంట్‌ను కూడా తీసుకొస్తోంది. ముందుగా ఈవీ ‘కర్వ్’ను ప్రవేశపెట్టడం విశేషం. గత నెలలో నిస్సాన్ ఆవిష్కరించిన ప్రీమియం ఎస్యూవీ ఎక్స్–ట్రెయిల్ కూడా పండుగల్లో రోడ్డెక్కనుంది.పండుగ రేసు గుర్రాలు (అంచనా ధర రూ.లలో).. → టాటా మోటార్స్–కర్వ్ ఈవీ (18–25 లక్షలు), → కర్వ్ (రూ.10.5–20 లక్షలు), → మారుతీ–స్విఫ్ట్ హైబ్రిడ్ (10 లక్షలు), డిజైర్–2024 (7–10 లక్షలు) → మహీంద్రా–థార్ రాక్స్ (13–23 లక్షలు) → నిస్సాన్ – ఎక్స్ట్రెయిల్ (49 లక్షల నుంచి)→ టయోటా బెల్టా – (9.5–12 లక్షలు) → మెర్సిడెజ్–బెంజ్ – ఈక్యూఎస్ ఎస్యూవీ (2 కోట్లు) → బీఎండబ్ల్యూ–ఎం3 (1.47 కోట్లు) → రెనో–కార్డియన్ (10–12 లక్షలు) → ఎంజీ–క్లౌడ్ ఈవీ (29–30 లక్షలు), → గ్లోస్టర్–2024 (40 లక్షలు) → స్కోడా–కొడియాక్–2024 (40–50 లక్షలు) → బీవైడీ–సీగల్ ఈవీ (10 లక్షలు) → కియా–ఈవీ9 (75–82 లక్షలు)→ ఆడి–క్యూ8 ఫేస్‌లిఫ్ట్ (రూ.1.17 కోట్లు) → సిట్రాన్ – సీ3ఎక్స్ (రూ.11.5 –15 లక్షలు), బసాల్ట్ (రూ.8 లక్షలు) – సాక్షి, బిజినెస్ డెస్క్ -
Independence Day 2024: 16 రాష్ట్రాలకు గ్వాలియర్ త్రివర్ణ పతాకాలు
కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్వాలియర్‌లో తయారైన త్రివర్ణ పతాకాలను 16 రాష్ట్రాల్లో ఎగురవేయనున్నారు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి 14 రాష్ట్రాలకు అందించేందుకు త్రివర్ణ పతాకాలను తయారు చేసేవారు. ఇప్పుడు కేరళ, కర్నాటక రాష్ట్రాలకు అందించేందుకు కూడా ఇక్కడే జాతీయ జెండాలను తయారుస్తున్నారు. గ్వాలియర్ నుంచి వివిధ రాష్ట్రాలకు ఎనిమిది వేల త్రివర్ణ పతాకాలను పంపించారు.తాజాగా మరో రెండు వేల త్రివర్ణ పతాకాలకు ఆర్డర్లు అందాయి. ఈ సందర్భంగా కేంద్ర భారత ఖాదీ యూనియన్ కార్యదర్శి రమాకాంత్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ త్రివర్ణ పతాకం అనే ప్రభుత్వ నినాదం చురుగ్గా సాగుతున్నదన్నారు. గ్వాలియర్‌కు చెందిన 196 మందితో కూడిన బృందం త్రివర్ణ పతాకాలను రూపొందిస్తోంది. -
Independence Day- 2024: అమరవీరులను గుర్తుచేసే ఆరు ప్రాంతాలు
1947, ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించింది. ఆరోజు నుంచి ప్రతీయేటా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దేశ స్వాతంత్ర్యం కోసం పలువురు సమరయోధులు పోరాటాలు సాగించారు. వీరి త్యాగానికి గుర్తుగా దేశంలోని పలు ప్రాంతాల్లో స్మారకాలు ఉన్నాయి. ఇదేవిధంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వారి స్మారకాలు కూడా మనకు కనిపిస్తాయి. ఆగస్టు 15న ఆయా ప్రాంతాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పిస్తారు.1. కార్గిల్ వార్ మెమోరియల్ (లధాఖ్)పాకిస్తాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో అమరులైనవారి గౌరవార్థం 1990ల చివరలో భారత సైన్యం కార్గిల్ వార్ మెమోరియల్‌ని నిర్మించింది. ఈ స్మారక చిహ్నంపై యుద్ధంలో వీరమరణం పొందిన భారతీయ సైనికులందరి పేర్లను చెక్కారు.2. ఎర్రకోట (ఢిల్లీ)ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని ఎర్రకోటపై జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట నుంచి ప్రసంగించారు.ఈ ఎర్రకోటను షాజహాన్ నిర్మించారు. ఎరుపు రంగు ఇసుకరాయితో నిర్మించినందున దీనికి ఎర్రకోట అని పేరు పెట్టారు.3. జలియన్ వాలా బాగ్ (అమృత్సర్)1919లో జలియన్‌వాలాబాగ్‌లో స్వాతంత్ర్య సమరయోధులు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఎటువంటి హెచ్చరిక లేకుండా జనరల్ డయ్యర్ కాల్పులు జరపాలని ఆదేశించాడు. నాటి జలియన్ వాలాబాగ్ మారణకాండలో వందల మంది అమరులయ్యారు. వారి జ్ఞాపకార్థం జలియన్‌వాలాబాగ్‌లో స్మారక చిహ్నం నిర్మించారు.4. ఇండియా గేట్(ఢిల్లీ)దేశ రాజధాని ఢిల్లీ మధ్యలో ఉన్న ఇండియా గేట్ మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో ప్రాణాలను అర్పించిన 82 వేల మంది భారతీయ ఆర్మీ సైనికుల గౌరవార్థం నిర్మితమయ్యింది. ఈ అమరవీరుల పేర్లు ఇండియా గేట్ గోడలపై కనిపిస్తాయి.5. పోరుబందర్(గుజరాత్)గుజరాత్‌లోని పోర్బందర్ జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలం. కీర్తి మందిర్, మహాత్మా గాంధీ నివసించిన ఇల్లు ఇక్కడ ఉన్నాయి. వీటిని గాంధీ జీవితంతో పాటు ఆయన రచనలను వివరించే మ్యూజియంలుగా మార్చారు.6. చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ (ప్రయాగ్‌రాజ్)1931లో చంద్రశేఖర్ ఆజాద్ ఈ ప్రయాగ్‌రాజ్ పార్కులో బ్రిటిష్ సైనికులతో పోరాడారు. అతను తన 25 ఏళ్ల వయస్సులోనే జీవితాన్ని త్యాగం చేశారు. చంద్రశేఖర్ ఆజాద్‌ను బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టినప్పుడు, వారి తూటాలకు బలికావడం ఇష్టం లేక ఈ పార్కులో తనను తాను తుపాకీతో కాల్చుకున్నారు. ఈ పార్కులో చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహం ఉంది. -
పంద్రాగస్టుకు ఎర్రకోటపై నారీశక్తి ప్రదర్శన
ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. ఈసారి ఎర్రకోటపై జరిగే వేడుకలలో నారీశక్తి ప్రదర్శన ప్రధాన ఆకర్షణ కానుంది. వివిధ సమస్యల నుంచి తమ పంచాయతీలకు విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించిన మహిళా ప్రతినిధులు ఎర్రకోట నుంచి మహిళా సాధికారత సందేశాన్ని ఇవ్వనున్నారు.పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలవారీగా ఎంపికచేసిన 150 మంది మహిళా సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ అధ్యక్షురాళ్లు, జిల్లా పంచాయతీ అధ్యక్షురాళ్లు తదితర మహిళా పంచాయతీ ప్రతినిధులు ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. వారిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించనుంది. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పాటుపడుతోంది.ఇటీవల పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక లేఖ రాసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆయా రాష్ట్రాలకు చెందిన మహిళా పంచాయతీ ప్రతినిధులను ఆహ్వానించింది. వీరికి ఆగస్టు 14న న్యూఢిల్లీలోని డాక్టర్ భీంరావు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఉదయం 10 గంటల నుంచి ‘పంచాయతీరాజ్‌లో మహిళా నాయకత్వం’ అనే అంశంపై జాతీయ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. -
టార్గెట్ పంద్రాగస్ట్.. గెలుపు జెండా ఎగరేసేది ఎవరు?
వరుసగా సెలవులు వస్తే సినిమాలకు పండగే పండగ. ఆగస్ట్ రెండో వారం అలాంటి పండగే కానుంది. ఆగస్ట్ 15 గురువారం... స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి గవర్నమెంట్ హాలిడే. ఆ రోజుతో పాటు శుక్ర, శని, ఆదివారాల వసూళ్లు రాబట్టుకోవచ్చు. సోమవారం రక్షా బంధన్... అది కూడా కలిసొస్తుంది. అందుకే పంద్రాగస్ట్ టార్గెట్‌గా థియేటర్స్‌లో గెలుపు జెండా ఎగురవేయడానికి కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఆ తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.మిస్టర్ బచ్చన్ రెడీరవితేజ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14 లేదా 15న థియేటర్స్‌లోకి రానుందని సమాచారం.కేజీఎఫ్ కథకేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. 18వ శతాబ్దం నేపథ్యంలో పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు. పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో విడుదల కాలేదు. అలా వాయిదా పడి ఫైనల్‌గా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. కేజీఎఫ్‌లోని బంగారం కోసం జరిగే అక్రమ తవ్వకాలకు, అక్కడి ఓ గిరిజన తెగకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఇందులో ఆ తెగ నాయకుడిగా విక్రమ్ కనిపిస్తారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తెలుగులోనూ ఆగస్ట్ 15నే రిలీజ్ కానుంది. డబుల్ ఎనర్జీపంద్రాగస్ట్కు థియేటర్స్‌లోకి వచ్చేందుకు డబుల్ ఎనర్జీతో రెడీ అయ్యాడు ‘డబుల్ ఇస్మార్ట్’. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. సీక్వెల్లో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రధారులు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఓ సీబీఐ ఆఫీసర్ మెమొరీని ఓ సైన్స్ చిప్ సాయంతో కిరాయి హంతకుడు శంకర్ (రామ్) మొదడులోకి ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత శంకర్ జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? అనే కోణంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కథ సాగిన విషయం తెలిసిందే. ఈ కథకు కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.చిన్న కథ కాదు‘అమ్మ టెన్త్ ఫెయిల్... కొడుకు ఫిఫ్త్ ఫెయిల్... చిన్న కథ కాదు..’ అనే డైలాగ్ ‘35: చిన్న కథ కాదు’ సినిమాలోనిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఇది. నంద కిశోర్ ఈమాని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రసాద్ (విశ్వతేజ్), సరస్వతి (నివేదా థామస్) భార్యాభర్తలు. వీరి కొడుక్కి 35 పాస్ మార్కులు కూడా రావు. దీంతో వాళ్ల కుటుంబం కాస్త నిరాశకు లోనవుతుంది. నిజంగా... 35 పాస్ మార్కులు ముఖ్యమా? ఆ ఊర్లోని మాస్టర్ (ప్రియదర్శి) వల్ల సరస్వతి కొడుకు పడిన ఇబ్బందులు ఏంటి? అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.స్ఫూర్తిదాయక పోరాటం కీర్తీ సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘుతాత’. తన గ్రామం కోసం కయల్విళి అనే ఓ యువతి చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సుమన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బేనర్ నిర్మించింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్‌పై మరో అప్డేట్ రాలేదు. మరి.. ఆగస్టు 15 బరిలో కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమా ఉంటుందా? లేదా అనేది చూడాలి. ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. మేం ఫ్రెండ్సండి....మేం ఫ్రెండ్సండి అంటూ థియేటర్స్‌లోకి వస్తున్నారు కార్తీక్, సబ్బు, హరి. మరి... వీళ్ల కథ ఏంటి? అనేది ఆగస్టు 15న థియేటర్స్‌లో తెలియనుంది. ఈ చిత్రంలో కార్తీక్‌గా నార్నే నితిన్, అతని ప్రేయసి పల్లవి పాత్రలో నయన్ సారిక, సుబ్బుగా రాజ్‌కుమార్ కసిరెడ్డి, హరిగా అంకిత్ నటించారు. ప్రేమ, స్నేహం అంశాల మేళవింపుతో అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పుష్ప వాయిదా పడటంవల్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప: ది రూల్’ సినిమా రానుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడాలనుకోవడం లేదని, అందుకే విడుదలను వాయిదా వేశామని యూనిట్ పేర్కొంది. ఆ తర్వాత ‘పుష్ప: ది రూల్’ను డిసెంబరు 6న విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 15కి ‘పుష్ప’ రాకపోవడంవల్ల, లాంగ్ వీకెండ్, రక్షాబంధన్ ఫెస్టివల్ కూడా కలిసొచ్చి తమ సినిమాలకు లాభాలు వస్తాయని ఆయా చిత్రయూనిట్లు ఆలోచన చేసి ఆగస్టు 15ను టార్గెట్‌గా చేసుకుని ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15కి ఇంకా సమయం ఉంది. సో... ఈ విడుదల జాబితా ఇంకా పెరిగే చాన్స్ ఉంది. -
అట్టహాసంగా అమెరికా స్వాతంత్ర్య వేడుకలు
-
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
బ్లూ ఎకానమీ గురించి మాట్లాడరా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ఐదవ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ ఆగస్టు 15న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి – ‘అంటరానితనం’ అనే పదాన్ని తన అధికారిక ప్రసంగంలో ప్రస్తావించి, అనూహ్యంగా మరోసారి పరిశీలకుల దృష్టిని తన వైపుకు తిప్పు కున్నారు. ప్రగతిశీల వాదులు సైతం – ఇంకా అదెక్కడ ఉందంటూ కనిపిస్తున్న దాన్ని – ‘కార్పెట్’ కిందికి తోస్తుంటే; అదేమీ కాదని జగన్ పని మాల– ‘అంటరానితనం’ ప్రస్తావనను అధికారిక వేదికపై తెచ్చారు. దాంతో ఇంతకూ అదిప్పుడు ఉందా లేదా? ఉంటే ఏమిటి? అనే చర్చను మన ముందుకు తెచ్చారు. ఇక ఇప్పుడు కార్య సాధకులు కనుక ఎవరైనా ఉంటే వారు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను అబద్ధం చేసే పని చేపట్టవచ్చు. సీఎం మాటల్లోనే అది– ‘ఈ నాలుగేళ్ల పాలనలోనే, రూపం మార్చుకున్న అంటరానితనం మీద, పేద వర్గాలను అణచి వేస్తున్న ధోరణుల మీద యుద్ధాన్ని ప్రకటించాం. అంటరాని తనం అంటే, ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోటానికి వీల్లేదని దూరం పెట్టటం మాత్రమే కాదు, పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్న మెంట్ బడిని పాడుపెట్టటం, పేదలు ఏ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారో ఆ ఉచిత సేవలు వారికి అందకుండా ఖరీదు చేయటం, పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం, పేదలు కోరుకునే చిన్నపాటి ఇళ్ళ స్థలాన్నీ ఇంటినీ వారికి ఇవ్వకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం... ఇవన్నీ రూపం మార్చుకున్న అంటరానితనంలో పేదల మీద పెత్తందారీ భావజాలంలో భాగాలే. పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడేవరకూ ఇటువంటి అంటరానితనం మీద ఈ యుద్ధం కొనసాగుతుంది.’ ఇలా సాగింది ఆ సందేశం. ఈ సందేశం– ‘గ్రామర్’ ఏమై ఉంటుంది అని చూసి నప్పుడు, సీఎంగా తన రెండవ టర్మ్‌లో చేపట్టబోయే కార్యా చరణకు జగన్ తొమ్మిది నెలలు ముందుగానే ‘సామాజిక వాతావరణ’ ముందస్తు హెచ్చరికను జారీ చేశారేమోనని అనిపిస్తున్నది. అయితే, విమర్శకులు అనొచ్చు, ఎన్నికల ముందు రాజ కీయ నాయకులు ఇలా కాకుండా మరెలా మాట్లాడతారు? అని. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పైకి కనిపించకుండా అమలవుతున్నసాంఘిక వివక్షను ఎదుర్కోవడానికి ఈ ప్రభుత్వం చేపడుతున్న చర్యల ప్రతిఫలానాలు – ‘నీతి అయోగ్’ వంటి స్వతంత్ర ప్రతి పత్తిగల సంస్థలు సైతం వెల్లడిస్తున్న నివేదికల్లో చూడవచ్చు. పైకి కనిపించని సూక్ష్మం అనిపించే ఇటువంటి అంతర్గత అంతరాన్ని ఈ ప్రభుత్వం పట్టుకుంది. దాని మీద అది ’ఫోకస్’ వేసి తగు నివారణా చర్యలు మొదలుపెట్టింది. అయితే, ఈదృష్టికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అది – రెండు వందల ఏళ్ళపాటు ఈ సర్కారు జిల్లాలు బ్రిటిష్ పాలనలో ఉండడం. దాంతో – ’మిషన్ అప్రోచ్’తో ప్రజల వద్దకు వెళితే వాళ్ళతో ‘కనెక్ట్’ కావడం కష్టం కాదు అని నమ్మి, దాన్ని– సర్కారే కాదు, నైజాం జిల్లాల్లో కూడా అమలుచేసి; అవును నిజమే అని నిరూపించినవాడు వైఎస్సార్. దానికి కొనసాగింపుగా ఈ చారిత్రక నేపథ్యాన్ని – ‘నాయకుడు’గా తననుతాను ‘ప్రూవ్’ చేసుకోవడానికి జగన్ గరిష్ఠ స్థాయిలో వాడుకోవడం వెలుగులోకి రాని అంశం. ఇప్పటికి మూడేళ్ళ క్రితమే తమ పార్టీ శ్రేణుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి నోటినుంచి– ‘అవుట్ రీచ్’ అనే పదం రావడం; ‘మిషన్ అప్రోచ్’కి కొనసాగింపుగా ఇక్కడ గుర్తుచేసుకోవడం అవసరం. ఇటీవల – ‘సోషల్ ఇంజనీరింగ్’ వంటి పదాలను పొలిటి కల్ సర్కిల్స్‌లో దేశమంతా విరివిగా వాడుతున్నారు. అయితే, జగన్ విషయంలో దాన్ని ఆలా చూడడం కుదరడం లేదు.అందుకు కారణం – ఆయనలా గతంలో సామాజిక దొంతర్ల పొరల్లోకి ఛేదించుకుంటూ లోపలికి వెళ్లినవారు మనకు కనిపించరు. ఆర్థిక ప్రయోజనాలు అందే పథకాలు అంటే సరే, కానీ ‘పవర్ పాలిటిక్స్’లోకి వచ్చే కొత్త సామాజిక వర్గాలకు– ‘లెవెల్ ప్లేగ్రౌండ్’ గతంలో ఎక్కడిది? ప్రముఖ తెలుగు నవల ’మాలపల్లి’ (1922) లో రచయిత ఉన్నవ లక్ష్మినారాయణ ప్రతిపాదించిన ‘నిమ్న వర్గాల రాజకీయ నాయకత్వాని’కి, ఇది 21వ శతాబ్ది ’వెర్షనా’ అన్నట్టుగా... కొత్త ఆశలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కొందరికి అది పొసగకపోవడం అంటారా, అది వేరే విషయం.సంక్షేమం సరే, ‘అభివృద్ధి’ ఏది? అనేది ఈ ప్రభుత్వం వైపు వేలు చూపించేవారి అతి తేలికైన ప్రశ్న. ఈ ప్రశ్న తర్వాత వెంటనే వీరు – ‘హైదరాబాద్’ అంటారు. ఇక్కడి సంపన్న జిల్లాల సొమ్ము అక్కడ అనుత్పాదక రంగాల్లో పెట్టుబడులై, జరిగిన – అర్బన్ ‘అభివృద్ధి’ నమూనా ఇప్పుడు ఇక్కడ వద్దా? అనేది వీరి ప్రశ్న. కనీస భౌగోళిక వాస్తవిక స్పృహ లేని వాదనలివి. రాష్ట్ర విభజన జరిగాక, 2014–19 మధ్య– ‘సన్ రైజ్ స్టేట్’ అంటూ తీరాన్ని ‘బ్రాండింగ్’ చేస్తూ, ‘కార్పొరేట్’ తరహా ‘పబ్లిసిటీ’కి దాన్ని పరిమితం చేయడం మాత్రమే జరిగింది తప్ప; అప్పట్లోనే ఆ సూర్యోదయ తూర్పుచూపుతో ప్రణాళికా రచన మొదల యివుంటే, ఇప్పటికి పరిస్థితి మరోలా ఉండేది. సముద్రతీర రాష్ట్రానికి ‘బ్లూ ఎకానమీ’ లక్ష్యంగా విశాఖ పట్టణం కేంద్రిత చూపు కాకుండా, ఇంకా హైదరాబాద్ అంటూ పాతపాట ఏమిటి? అనే ఇంగితం పదేళ్ల తర్వాత కూడా ఈ విమర్శకులకు తట్టకపోవడం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 15,375 కోట్లతో– రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టులు; రూ. 3,521 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం త్వరితగతిన పూర్తి అవుతున్నాయని వీరికి పట్టదు. కారణం ఇక్కడ కూడా వివక్షే. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లలో ఉపాధి అనేసరికి వీటిలో సంపన్న వర్గాల యువతకంటే, దిగువ మధ్య తరగతి యువత ఉపాధికి జరిగే ప్రయో జనం ఎక్కువ. వీటి గురించి మాట్లాడకుండా ఉండడం అంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తిరస్కరిస్తున్నట్టే! జాన్సన్ చోరగుడి వ్యాసకర్త సామాజిక, అభివృద్ధి అంశాల విశ్లేషకులు -
పంద్రాగస్టున 10 మిలియన్ల మంది బస్సు ప్రయాణం
హైదరాబాద్: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 10 మిలియన్ల మంది బస్సు ప్రయాణాన్ని ఎంచుకున్నారని ప్రముఖ ఆన్లైన్ బస్–టికెటింగ్ వేదికై న ‘అభిబస్’ వెల్లడించింది. స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో పీక్ ట్రావెల్ సీజన్‌తో అధిక విమాన ప్రయాణ ఖర్చులు, రైలు టిక్కెట్ల పరిమిత లభ్యత వంటి కారణాలతో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్సులను ఎంచుకున్నారని వారు పేర్కొన్నారు. ఆగస్టు 15వ తేదీన హైదరాబాద్ నుంచి గోవాకు రౌండ్–ట్రిప్ రైలు టిక్కెట్ల ధర సుమారుగా రూ.10 వేలు ఉండగా, బస్సు ప్రయాణికులు అదే గమ్యస్థానానికి దాదాపు రూ.2 వేలకే చేరుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్–బెంగుళూరు, హైదరాబాద్–గోవా, బెంగుళూరు–చైన్నె, చైన్నె–కోయంబత్తూర్, లక్నో–దిల్లీ, దిల్లీ–డెహ్రాడూన్ వంటి ప్రధాన నగరాలను కలిపే వాటితో సహా ప్రముఖ మార్గాలలో బస్సు ప్రయాణంలో పెరుగుదల గణనీయంగా చోటు చేసుకుందని అభిబస్ సీఓఓ రోహిత్ శర్మ తెలిపారు. అంతేగాకుండా పొడిగించిన వారాంతంలో ఇతర మార్గాలలో 30 శాతం వృద్ధి కనిపించిందని ఆయన వివరించారు. -
త్రివర్ణ పతాక రెపరెపలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం స్వాతంత్ర్యదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, ఇతర స్వాతంత్య్ర పోరాట వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. స్వతంత్ర పోరాటం గురించి, ఇన్నేళ్లలో సాధించిన ప్రగతి గురించి పలువురు ప్రసంగించారు. మిఠాయిలు పంచి పరస్పరం అభినందించుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్‌లో.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ జెండా ఎగురవేశారు. ముఖ్యమంత్రి జగన్ అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గృహనిర్మాణసంస్థ ప్రధాన కార్యాలయంలో.. విజయవాడలోని గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ, సచివాలయాల విభాగం డైరెక్టర్ లక్ష్మీషా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సచివాలయాల విభాగం అదనపు డైరెక్టర్లు ధ్యానచంద్ర, భావన వశిష్ట పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో.. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకాతిరుమలరావు, ఈడీలు కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, ఎ.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సౌధలో.. విజయవాడలోని విద్యుత్ సౌధలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఏపీ జెన్కో ఎండీ కె.వి.ఎన్.చక్రధర్‌బాబు, ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ బి.మల్లారెడ్డి, జెన్కో విజిలెన్స్ ఆఫీసర్ పనసరెడ్డి, డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనకు అభివృద్ధి, సంక్షేమం: సీఎస్ జవహర్‌రెడ్డి రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికి స్వాతంత్య్ర ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పేదల సంక్షేమానికి.. ముఖ్యంగా పేదరిక నిర్మూలనకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. ఈ పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి పేదవానికి సక్రమంగా అందించడంలో మనమంతా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ చీఫ్ సెక్యురిటీ అధికారి కె.కృష్ణమూర్తి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రావిురెడ్డి, జీఏడీ డిప్యూటీ సెక్రటరి రామసుబ్బయ్య, పలువురు సచివాలయ అధికారులు, సిబ్బంది, ఎస్పీఎఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వెయ్యి అడుగుల జాతీయ పతాకం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలో పేస్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు వెయ్యి అడుగుల జాతీయ పతాకాన్ని తమ కళాశాల వద్ద జాతీయ రహదారి వెంట ప్రదర్శించారు. – ఒంగోలు సాగరగర్భంలో.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రుషికొండ బీచ్‌లో లివిన్ అడ్వెంచర్స్ డైరెక్టర్ బలరామ్‌నాయుడు ఆధ్వర్యంలో స్కూబా డైవింగ్ వారు 60 అడుగుల సముద్రగర్భంలో జాతీయ జెండాను ఎగురవేశారు. – కొమ్మాది తిరుపతిలో వంద అడుగుల ఎత్తైన జాతీయ పతాకం జిల్లా కేంద్రం తిరుపతిలోని సామవాయి మార్గంలో వంద అడుగుల ఎత్తైన జాతీయజెండాను ఎంపీ మద్దిల గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డితో కలిసి టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో శ్రీనివాససేతు వారధిని సెప్టెంబర్ 18న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారని చెప్పారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్లో క్లీన్ ఇండియా–న్యూ ఇండియా సెల్ఫీ పాయింట్ విజయవాడ రైల్వే మినీ స్టేడియంలో డీఆర్ఎం నరేంద్ర ఎ.పాటిల్ జాతీయ జెండాను ఎగురవేశారు. విజయవాడ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన ‘క్లీన్ ఇండియా–న్యూ ఇండియా’ సెల్ఫీ పాయింట్‌ను ప్రారంభించారు. ఏడీఆర్‌ఎంలు డి.శ్రీనివాసరావు, ఎమ్.శ్రీకాంత్, సీనియర్ డీపీవో బాలమురళీధర్, సీనియర్ డీసీఎం వి.రాంబాబు, ఏసీఎం డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. కృష్ణానదిలో స్విమ్మర్ల జెండా వందనం కృష్ణాజిల్లా నాగాయలంకలోని శ్రీరామ పాదక్షేత్రం ఘాట్ వద్ద గ్రామానికి చెందిన కొందరు స్విమ్మర్లు కృష్ణానదిలో జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. రేమాల చంటి, వేములపల్లి ప్రసాద్, సనకా మురళి, తలశిల రఘుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.– నాగాయలంక -
అంటరానితనంపై యుద్ధం
అంటరానితనం అంటే ఫలానా వ్యక్తులు తాకటానికి వీల్లేదని భౌతికంగా దూరం పెట్టటం మాత్రమే కాదు.. వారికి అందాల్సిన సంక్షేమాన్ని అడ్డుకోవడం కూడా అంటరానితనమే.. అలాంటి రూపం మార్చుకున్న అంటరానితనంపై ఈ రోజు మనం యుద్ధం చేస్తున్నాం! పేదలు గెలిచేదాకా, వారి బతుకులు బాగుపడే వరకు ఇది కొనసాగుతుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రూపం మార్చుకున్న అంటరానితనం, పేద వర్గాలను అణచివేస్తున్న పెత్తందారీ భావజాలం ధోరణులపై ఈ నాలుగేళ్ల పాలనలో యుద్ధాన్ని ప్రకటించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మహనీయుల త్యాగనిరతి, స్వాతంత్య్ర సమర యోధుల బలి దానాలను గుర్తు చేస్తూ ప్రసంగించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో మరే ప్రభుత్వం, రాష్ట్రం చేయని గొప్ప మార్పులు, గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్ధాన్ని నాలుగేళ్లలోనే తెచ్చామని చెప్పారు. ‘76 ఏళ్ల ప్రయాణంలో మన దేశం, రాష్ట్రం ఎంతో పురోగమించాయని చెప్పేందుకు పలు ఉదాహరణలు కనిపిస్తాయి. ఆర్థిక వ్యవస్థకు మూలమైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు లాంటి మూడు రంగాలలో ఎంతో ప్రగతి కనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఈ వేగాన్ని అందుకోలేని, అందుకునే అవకాశాలు తగినంతగా లభించని కుటుంబాలు, వర్గాలు, సామాజిక వర్గాలు, ప్రాంతాలు ఈ ఏడు దశాబ్దాల ప్రయాణంలో ఇంకా వెనకబడే ఉన్నాయి’ అని పేర్కొన్నారు. సీఎం జగన్ తన ప్రసంగంలో ఇంకా ఏమన్నారంటే.. విజయవాడలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న సీఎం వైఎస్ జగన్ రూపం మార్చుకున్న అంటరానితనం, పెత్తందారీ భావజాలం.. అంటరానితనం అంటే కేవలం భౌతికంగా దూరం పెట్టటం మాత్రమే కాదు! పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం! డబ్బున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేదల పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటిస్తూ పేదబిడ్డలు తెలుగు మీడియంలోనే చదవాలని బరితెగించి వాదించటం కూడా అంటరానితనమే! పేదలు ఏ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారో అక్కడ ఉచిత సేవలు అందకుండా చేయటం, పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేట్‌కు విక్రయించాలని చూడటం, పేదలు కోరుకునే చిన్నపాటి ఇంటి స్థలం, ఇంటిని వారికి ఇవ్వకుండా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం, చివరికి కోర్టుల్లో రకరకాల కేసులు వేసి పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇవ్వటానికి వీల్లేదని అడ్డుకోవటం కూడా అంటరానితనమే! పౌర సేవలు ఏవి కావాలన్నా పేదలు, మధ్యతరగతి వర్గాల వారు కార్యాలయాలు, కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించటం, అవ్వాతాతలు పెన్షన్ అందుకోవాలన్నా, రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడవాటి క్యూల్లో నిలబడి, చివరికి ఆ క్యూ లైన్లలో మనుషులు చనిపోతున్నా పాలకుల గుండెలు కరగకపోవటం... ఇవన్నీ రూపం మార్చుకున్న అంటరానితనం, పెత్తందారీ భావజాలంలో భాగాలే. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అలాగే మిగిలి ఉన్న, రూపం మార్చుకున్న అంటరానితనంపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వం మనది. పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడేవరకూ ఈ యుద్ధం కొనసాగుతుంది. అంబేడ్కర్ సాక్షిగా.. విజయవాడ నడిబొడ్డున వచ్చే నవంబర్ 26న రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం రోజు మనం ఆవిష్కరించబోతున్న ఒక మహానుభావుడి ఆకాశమంత వ్యక్తిత్వం సాక్షిగా, మనందరికీ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను మీ అందరి ముందు ఉంచుతున్నా. ‘‘భౌతికంగా ఒక మనిషికి సంకెళ్లు లేకపోయినా భావాలపరంగా స్వేచ్ఛ లేకుంటే స్వతంత్రంగా బతుకుతున్నట్లు కాదు. అతడు బానిసగా బతుకుతున్నట్టే. భావాల పరంగా అతడు ఖైదీనే’’ అని బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పారు. ఒక మనిషి అస్తిత్వానికి మూలం, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు అర్థం ఏమిటంటే? ఆలోచనలు, భావాల పరంగా స్వాతంత్య్రం కలిగి ఉండటం. తన అభివృద్ధి, తన కుటుంబం అభివృద్ధికి అవకాశాలు ఉండటం. రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా స్వాతంత్య్రాలను వారు కలిగి ఉండటం. తరతరాల పెత్తందారీ సంకెళ్ల నుంచి పేదలు బయటపడి ఎదిగే వాతావరణం ఉండటం. పేద వర్గాలకు అటువంటి భావపరమైన, ఆలోచనల పరమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కల్పించేందుకు త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉన్నాం. దుష్ట సంప్రదాయాన్ని తుదముట్టించాం ఎన్నికల సమయంలో ప్రకటించే మేనిఫెస్టోను ఆ త రువాత చెత్తబుట్టలో పడేసే దుష్ట సంప్రదాయాన్ని మనం తుదముట్టించాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ ఇందులో ఇవి చెప్పాం.. ఇవి చేశాం.. 98.5% వాగ్దానాలను ఇప్పటికే అమలు చేశామని ప్రింట్ తీసి మరీ గడప గడపకూ వెళ్లి చూ పిస్తూ ప్రజల ఆశీస్సులు తీసుకుంటున్నాం. అర్హత ఉండి కూడా సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోవటం, వెరిఫికేషన్ సమయంలో అందుబాటులో లేక పోవటం, ఇతరత్రా మరే కారణాలతోనైనా సంక్షేమ పథకాలను అందుకోలేకపోయిన వారందరికీ మళ్లీ అవకాశం కల్పిస్తూ మిగిలిపోయిన వారికీ లబ్ధి చేకూరుస్తున్న ప్రభుత్వం దేశ చరిత్రలో మనది మాత్రమే. వికేంద్రీకరణ మన విధానం.. సామాజిక న్యాయం అన్నది కేవలం నినాదం కాదు.. అది అమలు చేయాల్సిన విధానమని నిరూపిస్తూ మంత్రి మండలిలో ఏకంగా 68 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చాం. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. ఆలయ బోర్డులు మొదలు వ్యవసాయ మార్కెట్ కమిటీల వరకు అన్నింటా చట్టం చేసి మరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం మనదే. వికేంద్రీకరణను విధానంగా మార్చుకుని రాష్ట్రం ఏర్పడిన తరవాత మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. రాజధానులను కూడా మూడు ప్రాంతాల హక్కుగా, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా వికేంద్రీకరణ చేయబోతున్న ప్రభుత్వం కూడా మనదే. ఏకంగా 15 వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయటం ద్వారా వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది కూడా మనందరి ప్రభుత్వమే. ప్రజల అవసరాలు, ప్రగతి లక్ష్యంగా.. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ అర్బీకేలు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, విలేజ్ క్లినిక్స్, బ్రాడ్ బ్యాండ్ సదుపాయంతో డిజిటల్ లైబ్రరీలు గ్రామాల్లో మన కళ్ల ఎదుటే నిర్మాణంలో ఉన్నాయి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ఇది నిదర్శనం. బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, పెన్షన్, రేషన్, ప్రభుత్వ పథకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థి తిని తొలగించి ఇంటివద్దే డెలివరీ చేసే సచివాల యాలు, వలంటీర్ వ్యవస్థను తెచ్చాం. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే లబ్ధిదారులైన ప్రజలకు చేరుతున్నాయని 38 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. 50 నెలల్లో ఎలాంటి అవినీ తి, లంచాలు, వివక్షకు తావులేకుండా ఏకంగా రూ. 2.31 లక్షల కోట్లను అత్యంత పారదర్శకంగా పేద లకు అందించాం. డీబీటీతో నేరుగా ఖాతాల్లోకి జమ చేశాం. సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మహిళా సాధికా రతకు బాటలు వేశాం. సోషల్ ఆడిట్‌ను తప్పనిసరి చేసి పారదర్శకంగా లబ్ధి చేకూరుస్తున్నాం. -
మళ్లీ నేనే!
2047 నాటికి సౌభాగ్యవంతమైన భారత్ అనే కలను సాకారం చేసుకునే దిశగా రాబోయే ఐదేళ్ల కాలం ఒక స్వర్ణయుగమే అవుతుంది. మరో ఐదేళ్లలో ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రజలకు ఇది ‘మోదీ కీ గ్యారంటీ’. దేశంలో 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక 6జీ టెక్నాలజీ కోసం భారత్ సన్నద్ధమవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేశాం. అవినీతి అరికట్టడానికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. –ప్రధాని మోదీ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేస్తానని, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి, మళ్లీ తానే ప్రధానమంత్రి అవుతానని పరోక్షంగా తేల్చిచెప్పారు. ‘2047 నాటికి సౌభాగ్యవంతమైన భారత్’ అనే కలను సాకారం చేసుకొనే దిశగా రాబోయే ఐదేళ్ల కాలం ఒక స్వర్ణయుగమే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి 90 నిమిషాలపాటు ప్రసంగించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. రెండోసారి ప్రధానిగా మోదీకి ఇదే చివరి పంద్రాగస్టు ప్రసంగం కావడం విశేషం. ఎర్రకోటపై ప్రసంగించడం ఇది వరుసగా పదోసారి. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... దుష్ట రాజకీయాలపై యుద్ధమే వారసత్వ పార్టీలను ప్రజలంతా వ్యతిరేకించాలి. బుజ్జగింపు రాజకీయాలు సామాజిక న్యాయానికి చాలా హాని కలిగించాయి. అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు కొన్ని దశాబ్దాలుగా మన వ్యవస్థలో ఒక భాగంగా మారిపోయాయి. దుష్ట రాజకీయాలపై ప్రజలు యుద్ధం ప్రకటించాలి. రాబోయే ఐదేళ్లు చాలా కీలకం. ఈ ఐదేళ్ల కాలంలో మనం చేసే పనులు మరో 1,000 సంవత్సరాలపాటు ప్రభావం చూపుతాయి. మనకు సమర్థవంతమైన యువ జనాభా ఉంది, గొప్ప ప్రజాస్వామ్యం ఉంది, వైవిధ్యం ఉంది. మన ప్రతి కల నెరవేరడానికి ఈ మూడు అంశాలు(త్రివేణి) చాలు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ అవినీతి పార్టీలతో నిండిపోయింది. బుజ్జగింపు రాజకీయాలకు, కుటుంబ పాలనకు పెద్దపీట వేసే పార్టీలు ‘ఇండియా’ పేరిట ఒక్కటయ్యాయి. ఎన్డీయే పాలనలో ‘న్యూ ఇండియా’ ఆత్మవిశ్వాసంతో ప్రకాశిస్తోంది. ‘బంగారు పక్షి’గా భారత్ మనం గత 1,000 సంవత్సరాల బానిసత్వం, 1,000 సంవత్సరాల భవ్యమైన భవిష్యత్తు మధ్య మైలురాయి వద్ద ఉన్నాం. పరుగు ఆపొద్దు. కోల్పోయిన వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలి. రాబోయే వెయ్యేళ్ల దిశగా మన అడుగులను నిర్దేశించుకోవాలి. 2047 నాటికి మనదేశం అభివృద్ది చెందిన దేశంగా మారుతుంది. ఇది కేవలం ఒక కల కాదు, 140 కోట్ల మంది సంకల్పం. మనలో ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు కొదవ లేదని 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్ర నిరూపించింది. ‘బంగారు పక్షి’గా మన దేశం మళ్లీ మారడం ఖాయం. మణిపూర్‌లో శాంతి నెలకొంటుంది. ధరల నియంత్రణకు మరిన్ని చర్యలు ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటాం. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. 6జీ టెక్నాలజీకి దేశం సన్నద్ధం దేశంలో 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక 6జీ టెక్నాలజీ కోసం భారత్ సన్నద్ధమవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేశాం. దేశంలో ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ చేరుకుంది. క్వాంటమ్ కంపూటర్ల రాక కోసం దేశం ఎదురు చూస్తోంది. ఆధునిక ప్రపంచాన్ని సాంకేతికత ప్రభావితం చేస్తోంది. ‘డిజిటల్ ఇండియా’ విజయగాథలను తెలుసుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. అవినీతి అరికట్టడానికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. మన దేశంలో సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయబోతున్నాం. గతంతో పోలిస్తే డేటా చార్జీలు భారీగా తగ్గాయి. దీనివల్ల ప్రజలకు డబ్బు ఆదా అవుతోంది. శక్తివంతమైన జి–20 కూటమికి ఈసారి మనమే సారథ్యం వహిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలకు అగ్రి–డ్రోన్లు వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి కొత్త పథకం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా వేలాది మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ల వాడకంలో, మరమ్మతుల్లో శిక్షణ ఇస్తాం. తొలుత 15,000 స్వయం సహాయక సంఘాలతో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. వారికి అగ్రి–డ్రోన్లు అందజేస్తాం. మహిళల సారథ్యంలోనే దేశాభివృద్ది జరగాలని కోరుకుంటున్నాం, ఆ దిశగా కృషి చేస్తున్నాం. 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలన్నదే నా లక్ష్యం. రైతాంగ ప్రయోజనం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.2.5 లక్షల కోట్లకుపైగా సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేశాం. ఎరువులపై భారీగా రాయితీలు ఇస్తున్నాం. అలాగే చౌక ధరలకే ఔషధాలు విక్రయించే ‘జన ఔషధి కేంద్రాల’ సంఖ్యను 25,000కు పెంచుతాం. నగరాల్లో సొంత ఇల్లు సమకూర్చుకోవాలని భావించే మధ్యతరగతి ప్రజలకు బ్యాంకు రుణాల వడ్డీల నుంచి ఉపశమనం కలిగించడానికి పథకం ప్రారంభిస్తాం. 9 కోట్ల మంది అనర్హులను ఏరిపారేశాం గత తొమ్మిదేళ్లలో సంక్షేమ పథకాలను ప్రక్షాళన చేశాం. పారదర్శకత తీసుకొచ్చాం. 9 కోట్ల మంది అనర్హులను ఏరిపారేశాం. అవినీతిపరుల ఆస్తుల స్వాదీనం తొమ్మిదేళ్లలో 20 రెట్లు పెరిగింది. అవినీతిపరులకు కోర్టుల నుంచి బెయిల్ దొరకడం కష్టంగా మారింది. ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. పునాదిరాళ్లు వేశాం. వాటిని నేనే ప్రారంభిస్తానన్న విశ్వాసం ఉంది. పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తిచేశాం. 2014లో మనది ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 140 కోట్ల మంది శ్రమతో ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగాం. ఇదంతా సులభంగా జరగలేదు. అవినీతిని అరికట్టాం. బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించాం. గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ ఇప్పుడు ముఖ్యమైన భాగస్వామి. మన దేశం సాధించిన విజయాలు ప్రపంచ స్థిరత్వానికి ఒక హామీగా నిలుస్తాయి. భారత్‌కు ఇక తిరుగులేదని ప్రపంచ నిపుణులు చెబుతున్నారు. శషభిషలకు ఇక తావులేదు. మన పట్ల ప్రపంచానికి నమ్మకం పెరిగింది. బంతి మన కోర్టులోనే ఉంది. ఈ అవకాశం జారవిడుచుకోవద్దు. మన స్టార్టప్‌లు భేష్ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మనదేశంలోనే ఉంది. మన యువత కృషితోపాటు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహమే ఇందుకు కారణం. యువ శక్తిపై నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 98,119 స్టార్టప్‌లను ప్రభుత్వం గుర్తించింది. వాటికి నిధులతోపాటు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోంది. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మనం ముందంజలో ఉన్నాం. నిర్దేశిత హరిత లక్ష్యాలను గడువు కంటే ముందే సాధించాం. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. మన సైనిక దళాలను ఆధునీకరించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. గతంలో బాంబుపేలుళ్ల గురించి వినేవాళ్లం. ఇప్పుడు దేశం భద్రంగా ఉంది. శాంతి భద్రతలు ఉన్నప్పుడే అభివృద్ధిపై దృష్టి పెట్టగలుగుతాం. స్పేస్ టెక్నాలజీలో అభివృద్ధి సాధిస్తున్నాం. వందే భారత్ రైళ్లు ప్రారంభించుకుంటున్నాం. బుల్లెట్ రైళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నా ప్రతి కల జనం కోసమే ప్రజలంతా నా వాళ్లే. నేను ప్రజల నుంచే వచ్చా. ప్రజల కోసమే జీవిస్తా. నేను ఏదైనా కల కన్నానంటే అది జనం కోసమే. వారి కోసం కష్టపడి పని చేస్తున్నా. ఇదంతా కేవలం ఒక బాధ్యత అప్పగించారు కాబట్టి చేయట్లేదు, ప్రజలను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను కాబట్టి చేస్తున్నా. ప్రజల్లో ఒకడిగా ఆ ప్రజల బాధలను, కష్టాలను సహించలేను. ప్రజల కలలు విచ్ఛిన్నమైపోవడాన్ని అనుమతించను. ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో జనం కోసం పని చేస్తున్నా. విశ్వకర్మ యోజన రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లతో విశ్వకర్మ యోజన అమలు చేస్తాం. వడ్రంగులు, స్వర్ణకారుల వంటి సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి జీవనోపాధి అవకాశాలు పెంచడమే ఈ పథకం లక్ష్యం. దీంతో ప్రధానంగా ఓబీసీలు ప్రయోజనం పొందుతారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెపె్టంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తాం. పేదరికం తగ్గితే మధ్య తరగతి ప్రజల బలం పెరుగుతుంది. దేశంలో గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇంతకంటే జీవితంలో సంతృప్తి ఇంకేమీ ఉండదు. -
Kamal Haasan Indian 2 New Poster: ‘ఇండియన్ 2’ కొత్త పోస్టర్ విడుదల
కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్, శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ‘ఇండియన్ 2’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. లైకా ప్రోడక్షన్స్, ది రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
సాంప్రదాయాన్ని బ్రేక్ చేసిన ఖర్గే..
ఢిల్లీ: ఎర్రకోట వద్ద జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకలకు హాజరుకాని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తన సొంత నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. పార్టీ అధ్యక్షునిగా మొదటిసారి కాంగ్రెస్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. అయితే.. ఏ కాంగ్రెస్ అధ్యక్షుడు చేయని విధంగా, పార్టీ సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారు ఖర్గే. సోనియా గాంధీ హయాంలో ఇలా జరగలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంతకూ ఎం చేశారు..? గౌర్హాజరుకు కారణం..: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరవలేదు. తనకు కంటి సమస్య కారణంగా రావడం కుదరదని చెప్పారు. సెక్యూరిటీ సమస్యల వల్ల ఒక్కసారి ఎంట్రీ ఇస్తే.. ప్రధాని, రక్షణ మంత్రి, స్పీకర్లు వెళ్లేవరకు ఎవరినీ బయటకు వెళ్లనివ్వరు.. తాను ఇంటివద్ద, కాంగ్రెస్ అధికారిక భవనంలో జెండా ఎగురవేయాల్సిన ఉన్నందున రాలేకపోతున్నానని చెప్పారు. సాంప్రదాయానికి విరుద్ధంగా..: స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునే క్షణాన రాజకీయాలకు వెళ్లకూడదనే నియమం పార్టీలో ఉండేది. అందుకు అనుగుణంగానే ఇప్పటివరకు ఉన్న అధ్యక్షులు పాటించారు. కానీ నేడు మల్లిఖార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వం తన హయాంలోనే భారత్ అభివృద్ధి చెందినట్లు చెప్పడంపై విమర్శలు కురిపించారు. కేవలం గతంలో ఏర్పాటు చేసిన పథకాలనే రూపుమార్చి కొత్త పేరుతో ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. చివరికి ప్రధాని వాజ్‌పేయి సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవని ఖర్గే అన్నారు. అలాగే.. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన త్యాగమూర్తులను ఖర్గే కొనియాడారు. గాంధీజీ, నెహ్రూ, పటేల్, నేతాజీ, అంబేద్కర్లను తలుచుకున్నారు. దేశ భవితవ్యాన్ని నిర్మించడంలో గత ప్రధానులు చేసిన పనిని గుర్తు చేశారు. आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ व बधाई। लोकतंत्र और संविधान हमारी देश की आत्मा है। हम यह प्रण लेते हैं कि हम देश की एकता और अखंडता के लिये, प्रेम और भाईचारे के लिए, सौहार्द और सद्भाव के लिए लोकतंत्र और संविधान की स्वतंत्रता क़ायम रखेंगे। जय हिन्द 🇮🇳 pic.twitter.com/d5EurpcRNM — Mallikarjun Kharge (@kharge) August 15, 2023 అటు.. స్వాతంత్య్ర ఉపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మూడు భూతాలను దేశం నుంచి పారదోలాలని అన్నారు. గత 75 ఏళ్ల నుంచి దేశంలో కొన్ని సమస్యలు వెంటాడాయని చెప్పారు. రాజరిక పాలన, ఇంకా ఓ పార్టీ కుటుంబానికి, కుటుంబం చేత, కుటుంబం కోసం అనే మూలసూత్రాల మీద పనిచేసిందని కాంగ్రెస్ పేరు ఎత్తకుండానే నిప్పులు చెరిగారు. ఇదీ చదవండి: వీడియో: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన ఆరోగ్యశాఖ మంత్రి -
ప్రేమించిన వ్యక్తితో సహజీవనం.. పుట్టిన పిల్లలకు ఆస్తి వస్తుందా?
భారత చట్టాల గురించి మీకు ఈ విషయాలు తెలుసా? హిందూ అడాప్షన్ అండ్ మెయిన్టెనెన్స్ యాక్ట్ 1956 దేశంలోని ఏ ఒంటరి స్త్రీ అయినా పిల్లలను దత్తత తీసుకునే హక్కును కల్పిస్తోంది ఈ చట్టం. అమ్మాయి.. అబ్బాయి అనే తేడా లేకుండా వాళ్లకు నచ్చిన పిల్లల్ని దత్తత తీసుకునే వెసులుబాటును ఇస్తోంది. అయితే ఇదే వెసులుబాటును ఒంటరి పురుషులకు ఇవ్వడం లేదు ఈ చట్టం. ఒకవేళ ఒంటరి పురుషుడెవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలను కుంటే కేవలం అబ్బాయిని మాత్రమే దత్తత తీసుకోవచ్చు. అమ్మాయిని కాదు. ఒకవేళ అమ్మాయినే దత్తత తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ చట్టంలోని సెక్షన్ 11 (3) ప్రకారం తన కన్నా 21 ఏళ్లు చిన్నదైన అమ్మాయిని మాత్రమే దత్తత తీసుకునే వీలు కల్పిస్తోంది. అంటే దత్తత తీసుకోవాలనుకుంటున్న వ్యక్తికి.. దత్తతకు వెళ్లబోతున్న అమ్మాయికి కనీసం 21 ఏళ్ల వయసు అంతరం ఉండాలన్నమాట. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మేజర్లు అయిన అమ్మాయి, అబ్బాయి సహజీవనం చేస్తుంటే దాన్ని చట్టబద్ధమైన బంధంగానే భావించాలని చెబుతోంది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21. దీని ప్రకారం ఏ వ్యక్తికైనా జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. సహజీవనం కూడా దాని కిందకే వస్తుంది. దేశంలో.. 2005 నుంచి సహజీవనం చట్టబద్ధం అయింది. సహజీవనం చేస్తున్న జంటకు పుట్టిన పిల్లలకు ఆస్తిహక్కునూ కల్పిస్తోందిది. జీవించే హక్కు,ఆర్టికల్ 21 దేశంలోని పౌరులు అందరికీ జీవించే హక్కును కల్పిస్తోంది ఈ ఆర్టికల్. ప్రభుత్వంతో సహా ఎవరికీ ఎవరి జీవితాన్ని హరించే హక్కు లేదు. పైపెచ్చు దేశంలోని ప్రతి పౌరుడి జీవితానికి ప్రభుత్వం భద్రత కల్పించాలి. ఎవరి జీవితమైనా ప్రమాదంలో పడితే వారిని రక్షించేందుకు కావలసిన చర్యలను ప్రభుత్వం చేపట్టాలి. జీవించే హక్కుకు అవరోధం కల్పిస్తున్నవారిలో ప్రభుత్వ అధికారులనూ బాధ్యులను చేస్తుందీ ఆర్టికల్. ప్రభుత్వాల జోక్యం వల్ల కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే బాధ్యుల మీద విచారణను కోరే హక్కును పౌరులకు అందిస్తోందీ ఆర్టికల్. చదువుకునే హక్కు, ఆర్టికల్ 21 (ఏ).. ఇది దేశంలోని ఆరేళ్ల నుంచి పద్నాలుగేళ్ల లోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్య హక్కును కల్పిస్తోంది. దీని ప్రకారం దేశంలోని ప్రైవేట్ బడులన్నీ ఉచిత విద్య కింద 25 శాతం సీట్లను రిజర్వ్ చేయాలి. ఆ ఖర్చును ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వామ్యం కింద ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు ప్రభుత్వ గుర్తింపు లేని బడులను రద్దు చేస్తుంది. అలాగే డొనేషన్లు, కార్పొరేట్ ఫీజులు వసూలు చేయకూడదని చెబుతోంది. స్కూళ్లల్లో పిల్లల ప్రవేశ సమయంలో స్కూల్ సిబ్బంది.. పిల్లలను, పిల్లల తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడాన్నీ నిషేధిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఎలిమెంటరీ స్కూల్ విద్య అయిపోయే సమయానికి ఏ విద్యార్థినీ ఫెయిల్ చేయడం కానీ.. పై తరగతికి పంపకుండా మళ్లీ అదే తరగతిలో ఉంచడం కానీ.. బడి నుంచి బహిష్కరించడం కానీ చేయకూడదు. అంతేకాదు బోర్డ్ ఎగ్జామ్ తప్పకుండా పాస్ కావాలనీ బలవంతపెట్టకూడదు. చదువులో వెనుకబడిన పిల్లలను అలా వదిలేయకుండా తోటివారికి సమంగా తయారు చేయాలనీ చెబుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ 1988 మోటార్ వెహికిల్ యాక్ట్, సెక్షన్ 185, 202 ప్రకారం.. మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నప్పుడు.. వంద మిల్లిలీటర్ల రక్తం నమూనాలో 30 మిల్లీ గ్రాముల మద్యం ఉంటే గనుక అరెస్ట్ వారెంట్ లేకుండానే పోలీసులు వాహనం నడుపుతున్న వారిని అరెస్ట్ చేయొచ్చు. ఇదే చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం.. టూ వీలర్‌ను నడిపేవాళ్లు తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందే. పార్ట్ 128.. టూ వీలర్ మీద ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయాలని చెబుతోంది. ఒకవేళ.. ఏ కారణం లేకుండా ట్రాఫిక్ పోలీసులు.. పౌరుల వాహనం తాళం చెవిని లేదా డాక్యుమెంట్స్‌ను తీసుకుంటే ఆ దృశ్యాన్ని ఫొటో తీసి.. ట్రాఫిక్ పోలీసుల మీద ఫిర్యాదు చేసే హక్కునూ కల్పిస్తోందీ చట్టం. -
స్వాత్రంత్య వేడుకల్లో షాకింగ్ ఘటన.. సీఎం ప్రసంగిస్తుండగా దూసుకొచ్చిన యువకుడు
పట్నా: బిహార్ స్వాత్రంత్య వేడుకల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీష్‌కుమార్ ప్రసంగిస్తుండగా.. ఓ యువకుడు ఆయన హై సెక్యూరిటీ జోన్లోకి దూసుకొచ్చాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గాంధీ మైదాన్‌లో జరిగిన స్వాత్రంత్య దినోత్సవాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. అనంతరం ప్రసంగిస్తుండగా.. ఓ యువకుడు చేతిలో పోస్టర్ పట్టుకుని వేదిక వద్దకు దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. ఆ యువకుడిని ముంగేర్ జిల్లాకు చెందిన రాజేశ్వర్ పాశ్వాన్ కుమారుడు నితీష్ కుమార్ (26)గా గుర్తించారు. అతడిని భద్రతా అధికారులు ప్రశ్నిస్తున్నారు. యువకుడి తండ్రి రాజేశ్వర్ పాశ్వాన్ బిహార్ మిలిటరీ పోలీసు విభాగంలో పనిచేస్తూ కొన్నేళ్ల క్రితం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎంను కలిసేందుకు అక్కడకు వచ్చాడని పట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై పాట్నా జిల్లా యంత్రాంగం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. చదవండి: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన మంత్రి -
జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన మంత్రి
భోపాల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో అపశృతి చోటుచేసుకుంది. జెండా వందనం చేసే క్రమంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి డా. ప్రభురామ్ చౌధరి స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయారు. అటు.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా వేడుకల సందర్భంగా ఇచ్చే ఉపన్యాసంలో కుప్పకూలారు. एमपी विधानसभा के अध्यक्ष गिरीश गौतम को मऊगंज में स्पीच देते हुए आया चक्कर, सुरक्षाकर्मियों ने संभाला @NavbharatTimes #NBTMP #MPNews pic.twitter.com/4VGlyux9Nc — NBTMadhyapradesh (@NBTMP) August 15, 2023 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 'హర్ గర్ తిరంగ అభియాన్' కార్యక్రమంలో భాగంగా సోమవారం తివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులు, పోలీసులు, అధికారులతో సహా ప్రజలందరూ కలిసి భారీ ఎత్తున ర్యాలీలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభురామ్ చౌధరి స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. నేడు రాష్ట్ర ప్రజలందరికి మంత్రి ప్రభురామ్ చౌధరి శుభాకాంక్షలు తెలిపారు. తివర్ణ జెండాను ఎగురవేసి, చురుకుగా వేడుకల్లో పాల్గొన్నారు. అయితే.. ఉన్నట్టుండి అకస్మాత్తుగా కిందపడిపోయారు. దీంతో మంత్రిని ఆస్పత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలోనే ఉన్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటు.. స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. रायसेन में परेड सलामी के दौरान चक्कर खा कर गिरे MP के स्वास्थ्य मंत्री Dr. Prabhuram Choudhary। #PrabhuramChoudhary #IndependenceDay2023 #IndependenceDay #raisen #Madhyapradesh #flaghosting @DrPRChoudhary pic.twitter.com/jsLsVYACfk — New India Live (खबर सातों पहर) (@Newindialive24) August 15, 2023 ఇదీ చదవండి: వారి వాహనాలపైనే త్రివర్ణ పతాకం రెపరెపలు.. కాదని మరొకరు ఈ పనిచేస్తే.. -
రెపరెపలాడిన మువ్వన్నెల జాతీయ జెండా
-
మీకు తెలుసా?ఆఫీస్‌లో గర్భిణీలతో అలాంటి పనులు చేయించకూడదు
మీరు టూ వీలర్ డ్రైవ్ చేస్తున్నారు.. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఫాలో అవుతూ! హెల్మెట్ పెట్టుకున్నారు.. ఆర్సీ.. డ్రైవింగ్ లైసెన్స్‌ను క్యారీ చేస్తున్నారు.. బండికి ఇన్సూరెన్స్ ఉంది.. పొల్యూషన్ ఫ్రీ సర్టిఫికెట్ కూడా ఉంది.. అయినా ట్రాఫిక్ పోలీస్ మిమ్మల్ని ఆపారు.. మీ బండి కీ లాక్కున్నారు! ఓ ప్రైవేట్ సంస్థ.. తన ఉద్యోగులకు నెల నెలా సరిగ్గా జీతాలే ఇవ్వట్లేదంట!ఇలా చెప్పుకుంటే బోలెడు.. ట్రాఫిక్ పోలీస్ హెరాస్మెంట్ నుంచి ఎమ్ఆర్పీని మించి ధరను వసూలు చేసే దుకాణదారు దాకా! ఎఫ్ఐఆర్ నమోదు చేయననే పోలీస్ నుంచి చెల్లని చెక్ ఇచ్చే పరిచయస్తుల వరకు!అన్నీ సమస్యలే.. అంతటా మోసాలే!అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష అన్నట్టుగానే పైవాటన్నిటీకీ పరిష్కారం హక్కుల రూపంలో మన రాజ్యాంగంలోనే ఉంది! చట్టాలుగా వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం..!! పోలీస్ యాక్ట్ 1861 ప్రతి భారతీయ పౌరుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన యాక్ట్ ఇది. దీని ప్రకారం పోలీస్‌లు 24 గంటలూ విధినిర్వహణలో ఉండాలి యూనిఫామ్ వేసుకున్నా, వేసుకోకపోయినా! మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 దీని ప్రకారం.. ప్రెగ్నెన్సీ వల్ల విధులకు హాజరు కాలేకపోతున్న ఉద్యోగినిని ఉద్యోగంలోంచి తీసేసే హక్కు ఏ యజమానికి, ఏ అధికారికీ లేదు. తీస్తే అది శిక్షార్హమవుతుంది. గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. పదిమంది ఉద్యోగులున్న ప్రతి ప్రైవేట్ సంస్థ గర్భిణీ ఉద్యోగులకు 84రోజుల పాటు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలి. గర్భిణీ ఉద్యోగులతో ఇలాంటి పనులు చేయించకూడదు ఉద్యోగం కోసం వచ్చిన మహిళ.. ప్రసవమై లేదా గర్భస్రావమై ఆరువారాలు దాటలేదని తెలిస్తే.. ఆమెను వెంటనే ఉద్యోగంలో నియమించకూడదు. ఆరువారాలు దాటితేనే నియమించాలి. ప్రసవమై లేదా గర్భస్రావమైన ఉద్యోగిని ఆరు వారాలు దాటితే కాని తిరిగి విధుల్లో చేర్చుకోకూడదు. అలాగే విధులకు సంబంధించి ఎంతటి అత్యవసర పరిస్థితుల్లోనైనా.. గర్భిణీ ఉద్యోగికి గంటలు గంటలు.. అదీ నిలబడి చేసే పనిని అస్సలు అప్పగించకూడదు. అంతేకాదు గర్భస్థ శిశువు మీద ప్రభావం చూపేంత ఒత్తడినీ ఆమె మీద పెట్టకూడదు. గర్భస్రావానికి దారి తీసే పరిస్థితి.. లేదా ఆమె ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపేంత పనినీ ఆమెకు పురమాయించకూడదు. 1955 హిందూ వివాహ చట్టం భార్యభర్తలు విడాకులు పొందాలనుకుంటే ఈ చట్టం ప్రకారం ఆ జంట పెళ్లయిన ఏడాది వరకు ఆగాల్సిందే. పెళ్లయిన ఏడాదిలోపు విడాకులను మంజూరు చేయదీ చట్టం. అయితే ప్రతి చట్టం ఏదో ఒక వెసులుబాటును ఇస్తున్నట్టే ఫ్యామిలీ లా కూడా ఓ వెసులుబాటును కల్పిస్తోంది. అదేంటంటే.. భార్య, భర్తలు ‘పరస్పర అంగీకారంతో’ పెళ్లయిన ఏడాదిలోపు కూడా విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివాహేతర సంబంధం, శారీరక, మానసిక హింస, నపుంసకత్వం, ఇంట్లోంచి చెప్పకుండా వెళ్లిపోవడం, హిందూ మతంలో ఉన్న భాగస్వామి వేరే మతాన్ని స్వీకరించడం, మానసిక వ్యాధులు, మొండి జబ్బులు, ఏడేళ్ల వరకు భాగస్వామి జాడ తెలియకపోవడం వంటి కారణాల కింద భార్య, భర్తల్లో ఎవరైనా విడాకులు కోరవచ్చు. సమాన పనికి సమాన వేతనం 1976, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ప్రకారం.. ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది ఒకేరకమైన వాతావరణం.. ఒకేరకమైన పరిస్థితుల్లో ఒకేరకమైన పనిని ఒకేరకమైన సామర్థ్యంతో చేస్తున్నట్లయితే ఎలాంటి భేదభావం చూపకుండా అందరికీ సమాన వేతనమే ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వనట్లయితే సంబంధిత లేబర్ అధికారికి యజమాని మీద ఫిర్యాదు చేయవచ్చు. ఆ అధికారులు విచారణ చేపట్టి.. అవసరమైన చర్యలు తీసుకుంటారు. -
స్వాతంత్య్ర వేళ పాకిస్తాన్‌కు ఘోర అవమానం
దుబాయ్: ఏదైనా దేశం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటే వారికి శుభాకాంక్షలు చెబుతూ బుర్జ్ ఖలీఫాపై ఆ దేశపతాకాన్ని గౌరవ ప్రదర్శనగా లైట్లతో ప్రదర్శించడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇదే క్రమంలో భారత దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ బుర్జ్ ఖలీఫాపై భారత జెండా ఆవిష్కృతమైంది. భారత దేశానికి ఒక రోజు ముందుగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న పాకిస్తాన్ తమ జెండా కూడా ప్రదర్శిస్తారేమోనని భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు పాకిస్తానీయులు. కానీ వారిని నిరాశ పరుస్తూ వారి జెండాను అక్కడ ఆవిష్కరించలేదు. నిరాశ చెందిన పాకిస్తానీయులు దుబాయ్ అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆగస్టు 15, భారత దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోన్న వేళ దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై లైట్ల వెలుగు జిలుగులతో భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. కానీ అంతకు ముందు రోజున భారతదేశం లాగే పాకిస్తాన్ జెండా కూడా ప్రదర్శిస్తారేమోనని భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు పాకిస్తానీయులు. కానీ వారిని నిరాశ పరుస్తూ వారి జెండాను ఆవిష్కరించలేదు. దీంతో నిరాశ చెందిన పాకిస్తానీయులు బుర్జ్ ఖళీఫా అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వేళా సంఖ్యలో వచ్చి బుర్జ్ ఖలీఫా వద్ద గుమికూడిన పాకిస్తాన్ దేశీయులు 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఒక పాకిస్తానీ మహిళ మాట్లాడుతూ.. ఇప్పుడు సమయం 12.01, కానీ బుర్జ్ ఖలీఫాపై పాకిస్తాన్ జెండాను ఆవిష్కరించడం లేదని దుబాయ్ అధికారులు తెలిపారు. ఇప్పుడిది మాకు పరువు సమస్యగా మారింది. అక్కడితో ఆగకుండా వేలాది సంఖ్యలో పాకిస్తానీయులు ఇక్కడ చేరి నినదిస్తున్నారు.. అయినా కూడా వారు పట్టించుకోవడంలేదు. ఇది పాకిస్తాన్ దేశాన్ని అవమానించడమేనని అన్నారు. A Pakistani lady narrates, How Pakistan flag didn't show up on Burj Khalifa on their Independence day😂😂🤣🤣 pic.twitter.com/WNbEOetANL — Gems of Politics (@GemsOf_Politics) August 14, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకలకు చిరుద్యోగిని -
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా భారత ప్రధాని 'X(ఒకప్పటి ట్విట్టర్)' వేదికగా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించి వారు కన్నా కళలను సాకారం చేతియడానికి కృషి చేయాలన్నారు. ఎర్రకోటపై వరుసగా పదోసారి జాతీయా జెండాను ఆవిష్కరించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ కార్యక్రమానికి ముందే సోషల్ మీడియాలో భారత్ ప్రజానీకానికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన ట్వీట్ చేస్తూ ఏమని రాశారంటే.. " అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులకు నా ఘానా నివాళులు. వారు కన్న కలలను సాకారం చేయడానికి మనవంతుగా నిబద్ధతతో కలిసి కృషి చేద్దాం. జై హింద్." అని రాశారు. आप सभी को स्वतंत्रता दिवस की अनेकानेक शुभकामनाएं। आइए, इस ऐतिहासिक अवसर पर अमृतकाल में विकसित भारत के संकल्प को और सशक्त बनाएं। जय हिंद! Best wishes on Independence Day. We pay homage to our great freedom fighters and reaffirm our commitment to fulfilling their vision. Jai Hind! — Narendra Modi (@narendramodi) August 15, 2023 ఇది కూడా చదవండి: చంద్రయాన్–3కి నాలుగోసారి కక్ష్య తగ్గింపు -
అడిషనల్ డీజీ విజయ్‌కుమార్‌కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్ / న్యూఢిల్లీ: పోలీస్‌శాఖలో విశిష్ట సేవలకుగాను సీనియర్ ఐపీఎస్ అధికారి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, సంగారెడ్డి ఎస్పీ మదాడి రమణకుమార్‌లకు కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ పోలీస్ పతకాలు దక్కాయి. ఈ ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం (ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్ట్వ్ గిష్డ్ సర్విస్) కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 954 మందికి పోలీస్ పతకాలు సోమవారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీటిలో ఒకరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్యపతకం, 229 మందికి పోలీస్ శౌర్యపతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 642 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు దక్కాయి. విజయ్‌కుమార్ : తెలంగాణ నుంచి జాతీయస్థాయిలో పోలీస్ పతకాలు దక్కిన వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ 1997 బ్యాచ్ ఐపీఎస్‌కు చెందినవారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ అ డిషనల్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన గతంలో కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్‌పై ఇంటెలిజెన్స్‌లో పదేళ్లపాటు పనిచేశారు. హైదరాబాద్ సిటీ, మాదాపూర్ డీసీపీగా, కడప, నల్లగొండ జిల్లాల ఎస్పీగా కూడా పనిచేశారు. రమణకుమార్: రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం దక్కిన మరో అధికారి మదాడి రమణకుమార్ ప్రస్తుతం సంగారెడ్డి ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన సుదీర్ఘకాలంపాటు ఏసీబీలో పనిచేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో పనిచేస్తున్న ఎస్పీ భాస్కరన్‌కు పోలీస్ శౌర్య పతకం దక్కింది. భాస్కరన్ సహా మొత్తం 22 మందికి పోలీస్ శౌర్య పతకాలు(పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ–పీఎంజీ) , ఉత్తమ ప్రతిభా పోలీస్ పతకాలు (పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పది మందికి దక్కాయి. నలుగురు జైలు అధికారులకు కూడా... నలుగురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ గౌరి రామచంద్రన్, డిప్యూటీ జైలర్ చెరుకూరి విజయ, అసిస్టింట్ డిప్యూటీ జైలర్ సీ.హెచ్.కైలాశ్, హెడ్‌వార్డర్ జి.మల్లారెడ్డిలు ప్రతిభా పతకాలకు ఎంపికయ్యారు. జహీరాబాద్ ఫైర్‌స్టేషన్‌కు చెందిన లీడింగ్ ఫైర్‌మ్యాన్ శ్రీనివాస్‌కు ఫైర్ సర్విస్ ప్రతిభా పురస్కారం దక్కింది. హోంగార్డులు కె.సుందర్‌లాల్, చీర్ల కృష్ణ సాగర్లకు హోమ్గార్డ్స్ – సివిల్ డిఫెన్స్ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరిద్దరూ బీచ్పల్లి వద్ద కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న తల్లి, ఇద్దరు పిల్లలను రక్షించడంతో ఈ అవార్డుకు ఎంపిక చేశారు. -
ఇండిపెండెన్స్ డే స్పెషల్: ఆగస్టు 15న చూడదగిన సినిమాలేవో తెలుసా?
ఈ ఏడాది స్వాతంత్య్ర సంబురాలకు యావత్ భారవతావని సిద్ధమవుతోంది. ఎంతోమంది వీరుల త్యాగాలతో మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంగతి తెలిసిందే. బ్రిటీష్ వారికి తమ ప్రాణాలను ఎదురొడ్డి నిలిచిన వీరులెందరో భారతమాత ఒడిలో చేరారు. వారిలో ముఖ్యంగా అల్లూరి సీతరామరాజు, సుభాశ్ చంద్రబోస్ పేర్లు వినిపిస్తాయి. స్వాతంత్ర పోరాటంలో అమరులైన వారి చరిత్ర గురించి మనం చాలా సినిమాల్లో చూశాం. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనలో దేశభక్తి గురించి తెలిపే టాలీవుడ్ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. 1.అల్లూరి సీతారామ రాజు ఎన్ని ఏళ్లు గడిచినా అందరికీ గుర్తుండి పోయే సినిమా 'అల్లూరి సీతారామ రాజు'. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకంగా 1922-24 మద్రాసు ప్రెసిడెన్సీలో స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన కథాంశంగా ఈ చిత్రం రూపొందించారు. అనేకమంది జీవితాలకు స్ఫూర్తిగా నిలిచిన అల్లూరి.. బ్రిటిష్ వారిపై యుద్ధంలో తన దళాన్ని ముందుకు నడిపించారు. ఈ 'అల్లూరి సీతారామ రాజు' రిలీజై 175 రోజులు విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించారు. అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు చిత్రానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించారు. జి హనుమంత రావు, జి ఆదిశేషగిరి నిర్మించిన చిత్రంలో విజయ నిర్మల, కొంగర జగ్గయ్య, చంద్ర మోహన్ కీలక పాత్రల్లో నటించారు. భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో విప్లవకారుడు, మన్యం దొర అల్లూరి సీతారామ రాజు జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. 2.సర్దార్ పాప రాయుడు స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో 1980లో వచ్చిన చారిత్రాత్మక చిత్రం సర్దార్ పాపరాయుడు. ఈ చిత్రాన్ని దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కొన్ని థియేటర్లలో అయితే ఏకంగా 300 రోజులపాటు ప్రదర్శించారు. ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా సర్దార్ పాపరాయుడు ఘనత సాధించింది. శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై క్రాంతి కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీదేవి, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. 3.మేజర్ చంద్రకాంత్ ఎన్టీఆర్, మోహన్ బాబు, శారద ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'మేజర్ చంద్రకాంత్'. 1993లో విడుదలైన ఈ చిత్రం ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే లక్ష్యంలో ఉన్న సైనికుడి జీవితం చుట్టు తిరుగుతుంది. నగ్మా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ దేశభక్తి చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని 'పుణ్యభూమి నాదేశం', 'ముద్దులతో ఓనమాలు' వంటి పాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాయి. 4. బొబ్బిలి పులి దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం బొబ్బిలి పులి. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కొంగర జగ్గయ్య, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, జయచిత్ర, మురళీమోహన్, ఎం. ప్రభాకర్ రెడ్డి, ప్రసాద్ బాబు, అల్లు రామలింగయ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 5.భారతీయుడు తమిళ స్టా హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భారతీయుడు. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారిపై సాధించిన విజయాన్ని అందంగా చిత్రీకరించారు. స్వాతంత్రద్యోమంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాన్ని ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. 6.ఖడ్గం దేశభక్తిపై రూపొందించిన చిత్రాల్లో ఖడ్గం మూవీకి ప్రత్యేకస్థానం ఉంటుంది. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. ఈ టాలీవుడ్ ఐకానిక్ చిత్రం కమర్షియల్ హిట్‌గా నిలిచింది. శ్రీకాంత్, సోనాలి బింద్రే, ప్రకాష్ రాజ్, రవితేజ కీలక పాత్రల్లో నటించిన ఖడ్గం థియేటర్లను దద్దరిల్లేలా చేసింది. 2002లో వచ్చిన ఈ చిత్రానికి సరోజిని అవార్డు, ఐదు నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ముగ్గురు యువకుల జీవితాలను ప్రభావితం చేసే అమానవీయ ఉగ్రవాద చర్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 7.సుభాష్ చంద్రబోస్ 2005లో విడుదలైన హిస్టారికల్ డ్రామా స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కించారు. వెంకటేష్, శ్రియ శరణ్, జెనీలియా డిసౌజా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మూడు నంది అవార్డులను గెలుచుకుంది. బ్రిటీష్ వారితో పోరాడి చింతపల్లి గ్రామాన్ని రక్షించే సుభాష్ చంద్రబోస్ అనుచరుడి చుట్టూ కథను రూపొందించారు. 8.మహాత్మ టాలీవుడ్‌లోని ఉత్తమ దేశభక్తి చిత్రాలలో మహాత్మ ఒకటి. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రధానపాత్ర పోషించారు. ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు, త్యాగం ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా తెరకెక్కించారు. 9. సైరా నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. బ్రిటీశ్ పాలనలో వారిని ఎదురించి నిలిచిన ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. రామ్ చరణ్ నిర్మించారు. 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. 10. ఆర్ఆర్ఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. బ్రిటీష్ కాలంలో ఓ మన్యం వీరుడైన కొమురం భీం జీవితం ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ బ్రిటీష్ పోలీసు అధికారి పాత్రలో కనిపించగా.. ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లూ సాధించగా.. ఆస్కార్ అవార్డ్‌ను సైతం సాధించింది. వీటితో పాటు స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వీటిలో పల్నాటి యుద్ధం, నేటి భారతం(1983), వందేమాతరం(1985), ఆంధ్ర కేసరి, మరో ప్రపంచం(1970), మనదేశం(1949) ఘాజీ(2017), మేజర్, సైరా నరసింహా రెడ్డి(2019), గౌతమి పుత్ర శాతకర్ణి, పరమవీరచక్ర చిత్రాలు కూడా ఉన్నాయి. -
సరికొత్తగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకొటకు 1800 మంది ప్రత్యేక అతిథులు..
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 77వ స్వాతంత్య్ర వేడుకలు ఎర్రకోట వేదికగా అట్టహాసంగా జరగనున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే.. ఈసారి వినూత్నంగా వేడుకలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది దాదాపు 1800 మంది అతిథులు తమతమ జీవిత భాగస్వామితో కలిసి ఉత్సవాల్లో పాలుపంచుకోనున్నారు. ఇందులో రైతులు, చేపలు పట్టేవారు, నర్సులు సహా వివిధ కులవృత్తులు చేసేవారు ఉండనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 75 జంటలు సాంప్రదాయ శైలిలో వేడుకల్లో కనువిందు చేయనున్నారు. ప్రత్యేక అతిథుల్లో 660 గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు, 250 మంది రైతు సంఘాల సభ్యులు, 50 చొప్పున ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన సభ్యులు, సెంట్రల్ విస్టాకు చెందిన 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ కార్మికులు, స్కూల్ టీచర్లు, నర్సులు, చేపలు పట్టేవారు ఇందులో పాలు పంచుకోనున్నారు. ఈ ప్రత్యేక అతిథులు కొంత మంది జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్నారు. జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ఈ ప్రత్యేక అతిథులకు వసతి సౌకర్యం కల్పించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు 75 జంటలు తమతమ సాంప్రదాయ శైలిలో వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ జెండాకు వందనం చేయనున్నారు. జాతిని ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తారు. ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్.. దేశంలో ఉన్న పథకాలపై 12 సెల్ఫీ లొకేషన్స్‌ను వేడుకల్లో ఏర్పాట్లు చేశారు. వాక్సిన్, యోగా, ఉజ్వల్ యోజన, స్పేస్ పవర్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా సహా తదితర స్కీలకు సంబంధించిన లొకేషన్స్‌ను ఏర్పాటు చేశారు. ఆగష్టు 15 నుంచి ఆగష్టు 20 వరకు ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఆయా ప్రదేశాల్లో సెల్ఫీ దిగి మై గౌవ్ పోర్టల్‌లో అప్లోడ్ చేసిన 12 మందిని విజేతలుగా నిర్ణయిస్తారు. వారికి రూ.10,000 చొప్పున ప్రైజ్‌మనీని కూడా ఇస్తారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకల్లో ఉగ్రదాడులకు ప్లాన్.. హై అలర్ట్ జారీ.. -
స్వాతంత్య్ర వేడుకలపై ఉగ్రకన్ను.. హై అలర్ట్..
ఢిల్లీ: స్వాతంత్య్ర వేడుకల్లో ఉగ్రదాడులు జరగనున్నాయనే సమాచారం అందడంతో ఢిల్లీలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రధాన రహదారులే లక్ష్యంగా దాడి చేయనున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. లష్కరే-ఈ-తోయిబా(ఎల్ఈటీ), జైషే-ఈ-మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడులకు ప్లాన్ వేశారని ఇంటెలిజెన్స్ బృందాలు తెలిపాయి. దేశ రాజధానితో పాటు ప్రధాన నగరాల్లో దాడులకు పాల్పడే సూచనలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దేశంలో భద్రతా వైఫల్యాన్ని సృష్టించాలని ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. గత ఫిబ్రవరిలోనే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన ప్రదేశాల్లో ఉగ్రదాడులు జరగనున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ఢిల్లీలో ప్రధాన ప్రదేశాల్లో, రద్దీగా ఉండే స్థలాల్లో దాడులు చేపట్టాలని ఎల్ఈటీ తన సభ్యులకు సమాచారం పంపించినట్లు ఇంటెలిజెన్స్‌కు తెలిసింది. నేషనల్ ఇన్వెష్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రధానం కేంద్రంపై దాడి చేసి భద్రతా వైఫల్యాన్ని సృష్టించాలని కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసింది. భారత్‌లో ప్రధాన నగరాల్లో దాడులు జరపాలని 2023 మేలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జైషే-ఈ-మహ్మద్‌కు చెందిన ఓ వీడియో విడుదలైంది. పాక్ ఆధారిత ఉగ్రవాదులు, గ్లోబల్ జిహాదీలు స్వాతంత్య్ర వేడుకలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భద్రత కట్టుదిట్టం.. ఉగ్రదాడుల సమాచారంతో స్వాతంత్య్ర వేడుకలకు భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. పెట్రోలింగ్ వ్యవస్థలను పెంచారు. ఢిల్లీలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వేడుకల్లో భద్రత కోసం దాదాపు 10,000 పోలీసులను మోహరించారు. 1000 ఫేస్ రికగ్నీషన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్, సర్వెలెన్స్‌ను పెంచారు. కాగా.. ఆగష్టు 15న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసం ఇస్తారు. ఇదీ చదవండి: సీమా హైదర్ తిరంగ జెండా ఎత్తితే అట్లుంటది..! జేజేలు కొడుతూ.. దృశ్యాలు వైరల్.. -
సామాన్యులే అతిథులు
-
హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2023: భారత తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల చిత్రాలు
-
Inspiration is freedom: స్ఫూర్తిదాయకం స్వాతంత్య్రం
ఏ దేశానికైనా ప్రధానంగా ఉండాల్సింది స్వాతంత్య్రం. ప్రపంచంలో పలుదేశాలు ఏదో సందర్భంలో ఇతర దేశాల పాలనకు లోబడి అటుపైన స్వాతంత్య్రాన్ని సాధించు కున్నవే. స్వాతంత్య్రాన్ని సాధించుకున్న దినాన్ని ఉత్సవ దినంగా ప్రతి దేశమూ జరుపుకుంటూ ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి దేశానికి స్ఫూర్తిదాయకమే. ‘దేశానికి రూపకల్పన చేసేది ఏది? ఎత్తైన నిర్మాణాలు, భవనాల గోపురాలతో ఉండే గొప్ప నగరాలు కాదు; విశాలమైన ఓడరేవులు కాదు, కాదు; మనుషులు, గొప్ప మనుషులు’ అని ఒక గ్రీక్ చాటువును ఆధారంగా తీసుకుని ఇంగ్లిష్ కవి విలిఅమ్ జోన్స్ చెప్పారు. ఆ మాటల్ని తీసుకుని గురజాడ అప్పారావు ‘దేశమంటే మట్టికాదోయ్ /దేశమంటే మనుషులోయ్’ అని చెప్పారు. ఔను, దేశం అంటే మనుషులే. ‘నువ్వు నీ దేశాన్ని ప్రేమించు’ అని ఇంగ్లిష్ కవి ఆల్ఫెడ్ టెన్నిసన్ అన్నారు. ఆ మాటల్ని తీసుకునే గురజాడ అప్పారావు ‘దేశమును ప్రేమించుమన్నా‘ అని అన్నారు. దేశాన్ని ప్రేమించడం దేశ ప్రజల్ని ప్రేమించడం ఔతుంది; దేశప్రజల్ని ప్రేమించడం దేశాన్ని ప్రేమించడం ఔతుంది. దేశాన్ని ప్రేమించలేనివాళ్లు దేశ పౌరులుగా ఉండేందుకు ఎంతమాత్రమూ అర్హులు అవరు; వాళ్లు దేశానికి హానికరం ఔతారు. ‘నితాంత స్వాతంత్య్రమ్ము వెల్లి విరియు స్వర్గాన/నా మాతృదేశమును మేలుకొన నిమ్ము ప్రభూ’ ఈ మాటల్లో పలికిన రవీంద్రనాథ్ ఠాగూర్ భావం మాతృదేశం, దేశ స్వాతంత్య్రం ఆవశ్యకత నూ, ప్రాముఖ్యతనూ ఘోషిస్తూ ఉంది. విదేశీ ఆక్రమణ దారుల క్రూరమైన, భయానకమైన పాలనలో పెనుబాధను అనుభవించి, లెక్కలేనంత సంపదను కోల్పోయి, ఎన్నిటినో వదులుకున్న మనదేశం వందల సంవత్సరాల పరపీడన నుండి విముక్తమై 75 యేళ్లుగా స్వాతంత్య్రాన్ని శ్వాసిస్తోంది. మనం ఇవాళ స్వతంత్ర దేశంలో ఉన్నాం; మన దేశంలో మనం మనదేశ పౌరులుగా ఉన్నాం. ఈ దేశం మనది; ఈ మనదేశం మన సంతతికి పదిలంగా అందాలి. ఈ చింతన మనల్ని నడిపించే ఆశయమై మనలో, మనతో సర్వదా, సర్వథా ఉండాలి. ‘నువ్వు, నీ దేశం నీకు ఏం చేస్తుంది అని అడిగే రాజకీయవాదివా? లేకపోతే నువ్వు, నీ దేశానికి ఏం చెయ్యగలను అని ఆడిగే పట్టుదల ఉన్నవాడివా? మొదటి ప్రశ్న అడిగేవాడివి ఐతే నువ్వు పరాన్నజీవివైన పురుగువి, రెండవ ప్రశ్న అడిగేవాడివి ఐతే నువ్వు ఎడారిలో ఉద్యానవనంవి’ అని ఖలీల్ జిబ్రాన్ మాటలు మన మెదళ్లను కదిలించాలి; మనదేశానికి మనం ఉద్యానవనాలం అవ్వాలి. ‘జంబూద్వీపే వైవస్వత మన్వంతరే భరతఖండే... ‘ఇలా ఆలయాల్లో సంకల్పం చెప్పడం మనకు తెలిసిందే. ఈ సంకల్పం చెప్పడం కాశ్మీర్ నుండీ కన్యాకుమారి వరకూ ఉండే ఆలయాల్లో ఉంది. ఇప్పటి పాకిస్తాన్ ప్రాంతంలోనూ, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోనూ ఉండే ఆలయాల్లోనూ ఉండేది. దీని ద్వారా భరతఖండం సాంస్కృతికంగా ఒకటే అన్న సత్యం విశదం ఔతోంది. 2,000 ఏళ్లకు పూర్వందైన తమిళ్ సాహిత్యం పుఱనానూఱులో ఉత్తరాన హిమాలయాల నుండీ దక్షిణాన కన్యాకుమారి వరకు ఉన్న దేశం ఇది అని చెప్పబడింది. దీని ద్వారా ఎప్పటి నుండో భారతం భౌగోళికంగా ఒకటే అన్న సత్యం అవగతం ఔతోంది. 2,300 యేళ్ల క్రితంనాటి గ్రీక్ చరిత్రకారుడు మెగస్తనీస్ హిమాలయం నుండీ దక్షిణాన కడలి వరకు ‘ఇండికా’ అని గుర్తించాడు. అవగాహనారాహిత్యంతో కొందరు మనదేశం అసలు ఒక దేశమే కాదని, మరొకటని మనలో దేశవ్యతిరేక భావ అనలాన్ని రగిలిస్తూ ఉంటారు. ఆ అనలాన్ని చదువుతోనూ, విజ్ఞతతోనూ మనం ఆర్పేసుకోవాలి. ‘నా తల్లీ, తండ్రీ సంతోషంగా ఉన్నది ఈ దేశంలోనే’ అనీ, ‘తియ్యనైన ఊపిరినిచ్చి కని, పెంచి అనుగ్రహించింది ఈ దేశమే’ అని అన్నారు తమిళ్ మహాకవి సుబ్రమణియ బారతి. ఆయన జాతీయతా సమైక్యతను కాంక్షిస్తూ ‘కాశి నగర పండితుల ప్రసంగాన్ని కంచిలో వినడానికి ఒక పరికరాన్ని చేద్దాం’ అనీ అన్నారు. జాతీయతా సమైక్యత ఆపై సమగ్రత దేశానికి ముమ్మాటికీ ముఖ్యం. ‘వందేమాతరం జయ వందేమాతరం; ఆర్యభూమిలో నారీమణులూ, నరసూర్యులూ చేసే వీరనినాదం వందేమాతరం’ అనీ, ‘వందేమాతరం అందాం; మా దేశమాతను పూజిస్తాం అందాం’ అనీ నినదించారు సుబ్రమణియ బారతి. మనదేశాన్ని ప్రేమిస్తూ ఉందాం, మనదేశాన్ని పూజిస్తూ ఉందాం, మనం దేశభక్తులుగా మసలుతూ ఉందాం. దేశభక్తితో, భారతీయతతో బతుకుతూ ఉందాం. భారతీయులమై మనసారా, నోరారా అందాం, అంటూ ఉందాం ‘వందేమాతరం’. ‘దేశవాసులు అందరికీ జాతీయతా భావం ఉండాలి. జాతీయతా భావం లేకపోవడం క్షంతవ్యం కాదు. జాతీయతా వ్యతిరేకత, దేశ వ్యతిరేకత అనేవి భయంకరమైన మానసికవ్యాధులు. అవి ఉండకూడదు. జాతీయత–దేశ విద్వేషవాదం నుండి మనల్ని, మనదేశాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి’ ‘భారత(ప్ర)దేశం... ‘భా’ అంటే ‘కాంతి’ లేదా ‘ప్రకాశం’ అనీ, ‘రత’ అంటే అంకితమైన, అసక్తి కల అనీ అర్థాలు. భగవంతుడు కాంతిరూపుడు. ‘భారతం’ అంటే ‘భగవంతుడికి అంకితమైంది’ లేదా ‘భగవంతుడిపై ఆసక్తి కలది’ అని అర్థం. ఈ అర్థాన్ని మనం ఆకళింపు చేసుకుందాం‘ – రోచిష్మాన్ -
సైనిక దళాల డ్రస్ రిహార్సల్.. రాజధానిలో ట్రాఫిక్ ఆంక్షలు..
ఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దేశ రాజధానిలో నేడు సైనిక దళాల డ్రస్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు అధికారులు. స్వాతంత్య్ర వేడుకలకు దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగష్టు 15న జరగనున్న వేడుకలకు వివిధ సైనిక దళాలు నేడు ఎర్రకోట వద్ద డ్రెస్ రిహార్సల్స్ చేస్తున్నాయి. 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఇక్కడ నుంచే ఉపన్యాసం ఇవ్వనున్నారు. డ్రెస్ రిహార్సల్‌కు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. #WATCH | Ahead of Independence Day, full dress rehearsal of different armed forces under way at Red Fort in #Delhi (ANI) pic.twitter.com/84euGIuIe7 — TOI Delhi (@TOIDelhi) August 13, 2023 ఆగష్టు 15న ఎలాంటి ఇబ్బందులు తెలత్తకుండా మొత్తం కార్యక్రమాన్ని ముందే రిహార్సల్స్ చేస్తున్నారు. వివిధ మార్గాల్లో ట్రాఫిక్ నిబంధనలు విధించారు. రిహార్సల్స్ జరిగే మార్గాల్లో వాహనాలు రాకుండా దారి మళ్లించారు. నోయిడా నుంచి వచ్చే ప్రయాణికులకు వేరే మార్గాలను సూచించారు. ఎర్రకోట మార్గంలో ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు రాకపోకలను నిలిపివేశారు. Traffic Advisory In view of #IndependenceDay Full Dress Rehearsal on August 13, 2023, #DelhiTrafficPolice advises commuters to avoid these roads and take alternate routes at the mentioned timings. pic.twitter.com/5oAxPbkjkR — Delhi Traffic Police (@dtptraffic) August 12, 2023 యూపీలోనూ వర్కింగ్ డే.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు చేసుకోవడానికి ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం పాఠశాలలకు ఆదివారం వర్కిండే డే అని ప్రకటించారు. హర్ గర్ తిరంగ, మేరీ మాత మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా ఆగష్టు 15 వేడుకల కోసం స్కూళ్లకు ఆదివారం సెలవును రద్దు చేశారు. డుస్తుంది. ఆదివారం సెలవు అయినప్పటికీ నేరుగా అధికార వర్గాలు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశాయి. విద్యార్థులు పాఠశాలలకు యధావిథిగా వచ్చి.. వేడుకల్లో పాలు పంచుకుంటారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నేడు మధ్యాహ్నం భోజనం స్కీం కూడా నడుస్తుంది. ఇదీ చదవండి: మోదీ దేశానికి రాజు కావాలనుకుంటున్నారు -
ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు..
History Of The Indian Rupee: భారతదేశానికి స్వాతంత్యం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. అయితే 1947 నుంచి ఇండియన్ రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఎలా ఉండేది? ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామం ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. 1947లో అమెరికన్ డాలర్‌తో రూపాయి ఎక్సేంజ్ రేట్ రూ. 3.30గా ఉండేది. అయితే ఈ విలువ క్రమంగా ప్రతి సంవత్సరం పడిపోతూ వచ్చింది. ఇప్పుడు అమెరికన్ డాలర్ విలువ ఏకంగా 82.73 రూపాయలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే మన కరెన్సీ విలువ ఎంతగా తగ్గిపోయిందో స్పష్టంగా తెలుస్తోంది. కాగా 1949 నుంచి 1966 వరకు USD-INR ఎక్సేంజ్ రేటు రూ. 4.76 వద్ద కొనసాగింది. ఆ తరువాత క్రమంగా పడిపోతూ వచ్చింది. 1947 నుంచి 2023 వరకు ఇండియన్ రూపాయి హిస్టరీ.. సంవత్సరం - ఎక్సేంజ్ రేట్(USD/INR) 1947 3.30 1949 4.76 1966 7.50 1975 8.39 1980 7.86 1985 12.38 1990 17.01 1995 32.427 2000 43.50 2005 (జనవరి) 43.47 2006 (జనవరి) 45.19 2007 (జనవరి) 39.42 2008 (అక్టోబర్) 48.88 2009 (అక్టోబర్) 46.37 2010 (జనవరి) 46.21 2011 (ఏప్రిల్) 44.17 2011 (సెప్టెంబర్) 48.24 2011 (నవంబర్) 55.39 2012 (జూన్) 57.15 2013 (మే) 54.73 2013 (సెప్టెంబర్) 62.92 2014 (మే) 59.44 2014 (సెప్టెంబర్) 60.95 2015 (ఏప్రిల్) 62.30 2015 (మే) 64.22 2015 (సెప్టెంబర్) 65.87 2015(నవంబర్) 66.79 2016(జనవరి) 68.01 2016(జనవరి) 67.63 2016(ఫిబ్రవరి) 68.82 2016 (ఏప్రిల్) 66.56 2016 (సెప్టెంబర్) 67.02 2016 (నవంబర్) 67.63 2017 (మార్చి) 65.04 2017 (ఏప్రిల్) 64.27 2017 (మే) 64.05 2017 (ఆగస్టు) 64.13 2017 (అక్టోబర్) 64.94 2018 (మే) 64.80 2018 (అక్టోబర్) 74.00 2019 (అక్టోబర్) 70.85 2020 (జనవరి) 70.96 2020 (డిసెంబర్) 73.78 2021 (జనవరి) 73.78 2021 (డిసెంబర్) 73.78 2022 (జనవరి) 75.50 2022 (డిసెంబర్) 81.32 2023 (జనవరి) 82.81 2023 (జూన్) 83.94 నిజానికి 1950 లలో ఒక రూపాయికి 16 అణాలు, 64 పైసలుగా విభజించారు. ఆ తరువాత 1 రూపాయికి 100 పైసలుగా ఫిక్స్ చేశారు. కాలక్రమంలో రూపాయి మాదిరిగానే అమెరికన్ డాలర్ కూడా ద్రవ్యోల్భణ ప్రభావానికి గురైంది. కొన్ని నివేదికల ప్రకారం స్వాతంత్య్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో రూపాయి & డాలర్ రెండూ సమానమే అని నమ్మేవాళ్ళు. దీనిపైనా అనేక వాదనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో మెట్రిక్ సిస్టం వంటివి లేదు కాబట్టి అన్ని కరెన్సీలు ఒక విలువను కలిగి ఉండేవని భావించేవారు. అధికారిక రికార్డుల ప్రకారం ఇది ఎప్పటికి సమానం కాదని తెలుస్తోంది. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! ప్రపంచమే సలాం కొట్టేలా.. 1947కి ముందు భారతదేశం బ్రిటిష్ పాలిత రాష్ట్రంగా ఉండేది, కాబట్టి పౌండ్ విలువ ఎక్కువగా ఉన్నందున INR విలువ ఎక్కువగా ఉండేది. ఇక్కడ 1947లో 1 పౌండ్ 13.37 రూపాయలకు సమానమని నమ్మేవారు. 1944లో బ్రిటన్ వుడ్స్ ఒప్పందాన్ని ఆమోదించినప్పటి నుంచి చరిత్ర ప్రధానంగా ప్రారంభమవుతుంది. ఈ ఒప్పందం ప్రపంచంలోని ప్రతి కరెన్సీ విలువను నిర్ణయించింది. -
స్వాతంత్య్ర దినోత్సవం: క్విజ్, ఎస్సే, డ్రాయింగ్ పోటీలు.. విజేతలకు నగదు బహుమతులు
సాక్షి, హైదరాబాద్: భారత్ 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేక పోటీలను నిర్వహిస్తుంది.విద్యార్థులు క్విజ్, జనరల్ ఎస్సే, Art/ Drawing లలో పాల్గొనవచ్చును. ☛ క్విజ్ పోటీ : http://special.sakshi.com/independence_day_quiz/ ఈ లింక్ ద్వారా క్విజ్ పోటీలో పాల్గొనాలి. ఈ క్వీజ్‌లో పాల్గొనే అవకాశం.. ఆగస్టు 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. ☛ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 'టెక్నాలజీ' ఎలా అభివృద్ధి చెందింది? అనే అంశం పై ఒక జనరల్ ఎస్సేను, అలాగే Independenceకి సంబంధించిన Art/ Drawing ని 9010050984 నెంబర్‌కు వాట్సప్ (లేదా) sakshieduinfo@gmail.comకి పంపండి. ఈ పోటీలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇవి పూర్తి ఉచితంగా రాయవచ్చును. మీరు జనరల్ ఎస్సే, Art/ Drawingని పంపాల్సిన చివరి తేదీ ఆగస్టు 15, 2023. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులు ఇవ్వబడును. అలాగే పోటీలో పాల్గొన్న అందరికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. విజేతల ఫోటోతో పాటు పేరుని కూడా www.sakshieducation.comలో ప్రచురిస్తాము. ఇంకేందుకు ఆలస్యం ఇప్పుడే మీ తెలివికి పదును పెట్టండి.. నగదు బహుమతి పొందండి. ఆల్ ది బెస్ట్.. -
హస్తినకు ‘పొందూరు’ కళాకారులు
పొందూరు: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరుగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన ముగ్గురు ఖాదీ కార్మికులకు ప్రత్యేక ఆహ్వనం అందింది. కేంద్ర ప్రభుత్వ ‘జన్ భాగీదారి’ దార్శనికతకు అనుగుణంగా దేశంలోని 75 మంది వడుకు, నేత కార్మికులకు ఎర్రకోటలోని వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. అందులో పొందూరుకు చెందిన బల్ల భద్రయ్య–లక్ష్మి దంపతులతో పాటు జల్లేపల్లి సూర్యకాంతంకు అదృష్టం దక్కింది. గుర్తింపు లభించిందిలా.. పొందూరులోని చేనేతవాడకు చెందిన బల్ల భద్రయ్య 35 ఏళ్లుగా చేనేత వృత్తిలో ఉన్నారు. పొందూరు ఏఎఫ్‌కేకే సంఘంలో 15 ఏళ్లు ఫైన్ ఖాదీ పంచెలు (దోవత్) నేయడంలో ఎంతో నైపుణ్యం గల వ్యక్తిగా గుర్తింపు పొందారు. నూరవ కౌంట్ (ఫైన్) చిలపను తయారు చేసి వస్త్రం నేసేందుకు సంప్రదాయంగా అవసరమైన దారాన్ని తీయడంలో జల్లేపల్లి సూర్యకాంతం మంచి నేర్పరితనం కనబరచడంతో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఆమెకు అవకాశం వచ్చింది. -
సీతకు అరుదైన అవకాశం
విజయనగరం ఫోర్ట్: ఢిల్లీలోని ఎర్రకోటలో ఈనెల 15న జరగనున్న స్వాతంత్య్ర వేడుకలను వీక్షించేందుకు చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామానికి చెందిన ఉపాధిహామీ వేతనదారు యందవ సీతకు ఆహ్వా నం అందింది. దేశవ్యాప్తంగా 1800 మందికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తోంది. వీరిలో సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, రైతులు, నర్సులు, మత్య్సకారులు, కూలీలు తదితర వర్గాలకు చెందిన వారు ఉంటారు. ఉపాధిహామీ వేతనదారుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి అవకాశం లభించగా అందులో సీత ఒకరు. ఈ నెల 13వ తేదీన గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. సంతోషంగా ఉంది ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు టీవీలో చూస్తేనే ఎంతో గొప్పగా ఉంటాయి. అలాంటి వేడుకులకు దగ్గరుండి వీక్షించేందుకు అవకాశం లభించడం ఆనందంగా ఉంది. మూడు రోజుల కిందట ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఆ తరువాత జిల్లా అధికారులు ఫోన్ చేశారు. ఈనెల 13న గన్నవరం నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. జీవితంలో మరిచిపోలేని సంఘటన ఇది. డిగ్రీవరకు చదువుకున్నాను. డైట్ శిక్షణ కూడా పొందాను. గత ఏడాది డిసెంబర్ వరకు ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేశాను. ఆరోగ్య సమస్య తలెత్తడంతో మానేసి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాను. – యందవ సీత, రామలింగాపురం గ్రామం, చీపురుపల్లి మండలం -
జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. సూపర్ ప్లాన్ అంటే ఇదే, రూ.6వేల వరకు బెనిఫిట్స్ కూడా!
కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇవి పండుగల లాంటి సమయాల్లో వీటి డోస్ మరింత పెంచుతూ పోతుంటాయి. తాజాగా రిలయన్స్ సంస్థ స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా తన కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త ప్లాన్‌ని తీసుకొచ్చింది. లాంగ్ టర్న్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్లాన్‌పై ఓ లుక్కేస్తే.. రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ కింద రూ.2,999తో ఏడాది వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ ప్లాన్ లో భాగంగా దాదాపు రూ.5000 వరకు విలువైన కూపన్లను జియో తన కస్టమర్ల కోసం జత చేసింది. కాలింగ్, డేటాతో పాటు, Jio నుంచి అనేక రకాల ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇందులో ప్రముఖ ఫుడ్ డెలివరీ, ట్రావెల్, ఆన్లైన్ షాపింగ్‌తో పాటు మరిన్నింటిపై తగ్గింపులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్లాన్‌లో ఏమున్నాయంటే.. వినియోగదారులు రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్ ప్రయోజనాలు, 365 రోజుల పాటు రోజుకు 100 SMSలను పొందుతారు. వినియోగదారులకు మొత్తం 912.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్యాక్ వినియోగదారులకు 5G డేటాను కూడా అందిస్తుంది. వీటితో పాటు రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్విగ్గీ ఆర్డర్లపై రూ. 100 తగ్గింపు, అలాగే యాత్ర ద్వారా బుక్ చేసుకున్న విమానాలపై రూ. 1,500 వరకు పొదుపు పొందే అవకాశం ఉంది. దేశీయ హోటల్ బుకింగ్‌లపై 15 శాతం తగ్గింపు (రూ. 4,000 వరకు) పొందవచ్చు. Ajioలో ఎంపిక చేసిన ఉత్పత్తుల కోసం రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్లపై రూ. 200 తగ్గింపు కూడా ఉంది. నెట్‌మెడ్స్‌లో అదనపు NMS సూపర్క్యాష్తో పాటు రూ. 999 కంటే ఎక్కువ ఆర్డర్లపై 20 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. అంతేకాకుండా, ఈ ఆఫర్ నిర్దిష్ట ఆడియో ఉత్పత్తులు, రిలయన్స్ డిజిటల్ నుంచి కొనుగోలు చేసిన దేశీయ ఉపకరణాలపై ఫ్లాట్ 10 శాతం తగ్గింపును అందిస్తుంది. ఇలా దాదాపు ఈ ప్యాక్‌తో రూ.6000 అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. చదవండి: China Company: భారీ నష్టాల్లో చైనా కంపెనీ.. అదే జరిగితే 70 వేల మంది ఉద్యోగాలు పోతాయ్! -
మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! ప్రపంచమే సలాం కొట్టేలా..
Indian Automobile History: సువిశాలమైన భారతదేశం ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తూ ప్రపంచానికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే.. ఇదంతా ఒక్క రోజులో జరిగిన పురోగతి కాదు, దశాబ్దాల తదేక కృషి ఫలితమే ఈ అభివృద్ధి. ఇండియాలో ఇతర రంగాలు ఒక ఎత్తయితే, ఆటో మొబైల్ రంగం మరో ఎత్తు అనే చెప్పాలి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో పూర్తి తెలుసుకుందాం. 1957 వరకు కూడా సొంతంగా కారుని ఉత్పత్తి చేయలేని భారత్ ఈ రోజు ప్రపంచ ఆటోమొబైల్ పవర్‌హౌస్‌లలో ఒకటిగా ఎదిగింది. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ.. అఖండ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడింది. నిజానికి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రయాణం చాలా బిన్నంగా ఉంటుంది. మన దేశంలో మొదటి వాహనం 1897లో అడుగుపెట్టినప్పటికీ దానిని ఒక ఆంగ్లేయుడు దిగుమతి చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. టాటా కారును కలిగిన మొదటి భారతీయ సంతతి వ్యక్తి.. ఇండియా.. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బొంబాయి, మద్రాస్, కలకత్తా వంటి నగరాల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే కార్లు ఉండేవి. 20వ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకు భారతదేశంలోని దాదాపు అన్ని కార్లు దిగుమతి చేసుకున్నవే. 1898లో జమ్సెట్జీ నుస్సర్వాన్జీ (Jamsetji Nusserwanji) టాటా కారును కలిగి ఉన్న భారతీయ సంతతికి చెందిన మొదటి వ్యక్తి అయ్యాడు. ఆవిరితో నడిచే వాహనాలు.. తరువాత కాలక్రమంలో ఆవిరితో నడిచే వాహనాలు ఆధిపత్యం చెలాయించాయి. 1903వ సంవత్సరంలో మద్రాస్‌లోని సింప్సన్ & కోకి చెందిన 'శామ్యూల్ జాన్' భారతదేశపు మొట్టమొదటి ఆవిరి కారును నిర్మించాడు. అప్పట్లో ఈ కారు గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇది తరువాత వచ్చిన భవిష్యత్ ఆవిష్కరణలకు కూడా ఆధారంగా నిలిచింది. 1928లో జనరల్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తన బొంబాయి ఫ్యాక్టరీలో ట్రక్కులు, కార్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. 1930 నాటికి ఫోర్డ్ మోటార్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్రాస్‌లో ఆటోమొబైల్స్ అసెంబ్లీని ప్రారంభించింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో 1948 నాటికి హిందుస్థాన్ మోటార్స్, మహీంద్రా, స్టాండర్డ్, ప్రీమియర్, టాటా మోటార్స్ వంటి ప్రధాన కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత కాలంలోనే దేశం కొత్త ప్రగతి యుగానికి నాంది పలికేందుకు సిద్ధమైంది. మహాత్మా గాంధీ స్వావలంబన సూత్రాలకు అనుగుణంగా, స్వదేశీ ఆటో పరిశ్రమను నిర్మించాలనే కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది. భారతీయ ఆటోరంగానికి ఆటంకం.. ఆటోమోటివ్ భాగాలను మాత్రమే కాకుండా వాహనాల కోసం అంతర్గత పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే నిర్ణయం 1952 నాటి టారిఫ్ కమిషన్ సృష్టికి దారితీసింది. ఆ తరువాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో 1954 నాటికి, ఫోర్డ్, జనరల్ మోటార్స్, రూట్స్ వంటి కొన్ని అతిపెద్ద ఆటోమోటివ్ ఎగుమతిదారులు తక్షణమే దుకాణాన్ని మూసివేశారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి భారతీయ మార్కెట్‌ను దూరం చేశారు. అంతే కాకుండా స్థానిక కంపెనీలు తయారు చేసిన మోడల్స్ అమ్మకపు ధరలపై తీవ్రమైన షరతులను ఎదుర్కొంటున్నందున భారతీయ ఆటో రంగం దాదాపు ఆగిపోయినట్లయింది. అంబాసిడర్ & ప్రీమియర్ పద్మిని.. అయినప్పటికీ ఆటోమొబైల్ పరిశ్రమ మళ్ళీ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 1957లో హిందుస్థాన్ అంబాసిడర్ రూపంలో మొట్టమొదటి ఆల్-ఇండియన్ కారు ఉనికిలోకి వచ్చింది. ఆ తరువాత 1964లో ప్రీమియర్ కంపెనీ అంబాసిడర్‌కు ప్రత్యర్థిగా 'పద్మిని' కారుని ప్రారంభించింది. ఈ రెండు కార్లు ఆటోమొబైల్ పరిశ్రమను తిరుగులేకుండా దశాబ్ద కాలం పాటు పాలించాయి. SIAM ఏర్పాటు.. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రారంభ రోజులలో స్థిరమైన పురోగతి, పరిశోధన ద్వారా పరిశ్రమకు మద్దతునిచ్చే లక్ష్యంతో దేశీయ సంస్థలు ఏర్పడ్డాయి. 1960లో, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (SIAM) భారతదేశంలో ఆటోమొబైల్స్ కోసం స్థిరమైన అభివృద్ధి వ్యవస్థను రూపొందించే దృష్టితో ఏర్పడింది. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రను మనం పరిశీలిస్తే.. 1980లలో సాధించిన విజయాలే ఈ రోజు బలమైన పరిశ్రమలకు పునాదులని తెలుస్తోంది. 21వ శతాబ్దంలో మారుతీ సుజుకిగా పిలువబడే మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్, జపాన్ ఆటోమోటివ్ పవర్‌హౌస్ సుజుకితో జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. ఆ తరువాత బాలీవుడ్ రంగం ఈ పరిశ్రమను పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర వహించింది. వేగం పెరిగిన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్.. విదేశీ ప్రభావంతో పాటు పెట్టుబడి పరంగా కూడా 1990 వ దశకంలో భారతీయ ఆటో మార్కెట్ వేగంగా ముందుకు సాగింది. పెట్టుబడులు వెల్లువెత్తడంతో 1993 & 1996 మధ్య కార్ల విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆ తరువాత మెర్సిడెస్ బెంజ్ 2004లో భారతదేశానికి వచ్చి దేశంలోని మొట్టమొదటి విదేశీ లగ్జరీ ఆటోమేకర్‌గా చరిత్ర సృష్టించింది. 2006లో బీఎండబ్ల్యూ, 2007లో ఆడి అరంగేట్రం చేశాయి. అప్పటి నుంచి ఈ మూడు జర్మన్ కంపెనీలు భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాము. కావున కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే ఆధునిక ఆటో పరిశ్రమ కొత్త మార్గాల్లో ప్రవేశించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఆధునిక హంగులను పొందగలిగింది. ➤ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వాహనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలికింది. AI సామర్థ్యాలు కలిగిన కార్లు మునుపటి వాటికంటే మరింత ఆధునికంగా మారాయి. తయారీ ప్రక్రియ నుంచి మొత్తం ఉత్పత్తి వరకు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని వాహనాలు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతున్నాయి. నేడు బిఎస్ 4 వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. రానున్న రోజుల్లో డీజిల్ కార్లు కూడా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ➤ఎలక్ట్రిక్ మొబిలిటీ: ఒకప్పుడు నీటి ఆవిరి ద్వారా.. ఆ తరువాత డీజిల్, పెట్రోల్ వంటి కార్లు మార్కెట్లో అడుగుపెట్టాయి. ఆ తరువాత ఎలక్ట్రిక్ వాహనాలు అరంగేట్రం చేసి భారదేశాన్ని మరింత ప్రగతి మార్గంలో పయనించేలా చేశాయి. చాలామంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ➤స్వయంప్రతిపత్త వాహనాలు (Autonomous Vehicles): భారతీయ ఆటో పరిశ్రమలో చెప్పుకోదగ్గ మార్పు ఈ స్వయంప్రతిపత్తి వాహనాలు. అంటే ఈ వాహనాలు తనకు తానుగానే ముందుకు సాగుతాయి. ఇది మానవుడు కనిపెట్టిన అద్భుత సృష్టి అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వాహనాలు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ద్వారా ఆపరేట్ అయ్యే ఆ వాహనాలు ప్రమాదాల నుంచి మనుషులను కాపాడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ➤భద్రతపై దృష్టి: ఇప్పుడు మార్కెట్లో విడుదలయ్యే చాలా కంపెనీల వాహనాలు భద్రతాపరంగా చాలా ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే సంస్థలు ఈ విధమైన వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆధునిక కాలంలో ADAS టెక్నాలజీ కూడా ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. రానున్న రోజుల్లో ఎగిరే కార్లు కూడా భారతదేశంలో అరంగేట్రం చేయనున్నాయి. ఇదీ చదవండి: స్వాతంత్య్రానికి ముందు దేశంలో ఎన్ని బ్యాంకులు ఉండేవో తెలుసా? ఒకప్పుడు కారునే తయారు చేయలేని భారత్.. ఈ రోజు ఎన్నెన్నో దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి నాటికి మన దేశంలో 22,933,230 వాహనాలు ఉత్పత్తయ్యాయని SIAM నివేదించింది. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు ఇట్టే అర్థమవుతుంది. రానున్న రోజుల్లో మరింత ఎత్తుకి ఎదుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
స్వాతంత్య్రానికి ముందే వందలాది బ్యాంకులు! ఘనమైన మన బ్యాంకింగ్ చరిత్ర
బ్యాంకులు చాలా కాలంగా మన జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయాయి. బ్యాంకింగ్ రంగం మన ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్ర చాలా దశలు, సంస్కరణలను చూసింది. అప్పటి నుంచి నిరంతరం అభివృద్ధి చెందుతోంది. 1949 బ్యాంకింగ్ కంపెనీల చట్టం ప్రకారం, బ్యాంకింగ్ అనేది ప్రజల నుంచి రుణాలు లేదా పెట్టుబడి కోసం డిపాజిట్లను తీసుకునే ఆర్థిక సంస్థగా నిర్వచించారు. ఖాతాదారులకు అవసరమైనప్పుడు డిపాజిట్లను బ్యాంకులు తిరిగి చెల్లిస్తాయి. ప్రాథమికంగా బ్యాంకులు అందించే సేవలు ఇవే అయినప్పటికీ కాలానుగుణంగా బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. (మేకింగ్ ఇండియా ప్రౌడ్! ఈ గౌరవం వారికి అంత ఈజీగా రాలే!) భారతీయ బ్యాంకింగ్ చరిత్ర వేద కాలం నుంచి భారతదేశంలో బ్యాంకింగ్ ప్రాబల్యం ఉంది. భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్రను మూడు దశలుగా వర్గీకరించవచ్చు. 1947 స్వాతంత్య్రానికి ముందుది మొదటి దశ, 1947 నుంచి 1991 వరకు రెండో దశ, 1991 తర్వాతది మూడో దశ. 600లకు పైగా బ్యాంకులు స్వాతంత్ర్య పూర్వ దశలో భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్రలో అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆ దశలో దేశంలో 600 కంటే ఎక్కువ బ్యాంకులు ఉండేవి. భారతదేశంలో మొదటి బ్యాంక్ 1770లో ఏర్పాటైంది. అదే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. తద్వారా భారతదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ పునాదిగా మారింది. మొదటి దశలో దేశంలో మూడు బ్యాంకులు విలీనం అయ్యాయి. అవి బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. అవన్ని విలీనమై తర్వాత ఇంపీరియల్ బ్యాంక్‌గా ఉనికిలోకి వచ్చాయి. తరువాత 1955లో అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇదే కాలంలో మరికొన్ని ఇతర బ్యాంకులు కూడా ఏర్పాటయ్యాయి. అలహాబాద్ బ్యాంక్ 1865లో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894లో, బ్యాంక్ ఆఫ్ ఇండియా 1906లో, బ్యాంక్ ఆఫ్ బరోడా 1908లో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో ఏర్పాటయ్యాయి. -
Independence Day 2023: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసుల రిహార్సల్స్ (ఫొటోలు)
-
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్.. ప్రయాణికులకు కీలక సూచన
సాక్షి, హైదరాబాద్: ఆగష్టు 15 పంద్రాగస్టుపై శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ విధించారు. సీఐఎస్ఎఫ్, పోలీసుల తనిఖీలతో ముమ్మరం చేయనున్నారు. అంతేకాదు.. ఆగష్టు 15 వరకు సందర్శకులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ప్రయాణికులతో వెళ్లేవారికి అధికారులు సూచనలు చేస్తున్నారు. వీడ్కోలు పలికేందుకు ఒకరిద్దరే రావాలని సూచిస్తున్నారు. -
కత్తి మీద సాములా సాగిన కపిల్ దేవ్ జమానా.. వరల్డ్‌కప్ విజయం మినహా..!
భారత క్రికెట్ అంటే సగటు క్రికెట్ అభిమానికి ముందుగా గుర్తొచ్చేది 1983 వరల్డ్‌కప్. ఆ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్.. నాటి అగ్రశ్రేణి జట్లైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి జగజ్జేతగా అవతరిచింది. ఈ వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కపిల్ ఆడిన ఇన్నింగ్స్ (175 నాటౌట్), విండీస్‌తో జరిగిన ఫైనల్లో మొహిందర్ అమర్నాథ్ మ్యాజిక్ బౌలింగ్ (7-0-12-3) భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతాయి. అలాగే ఈ టోర్నీలో కపిల్ దేవ్ భారత జట్టును విజయవంతంగా ముందుండి నడిపించిన తీరును భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. ఈ గెలుపు తర్వాత ప్రతి భారతీయుడు గర్వంతో పొంగియాడు. ఈ విజయం ప్రతి భారత క్రీడాకారుడిలో స్పూర్తి నింపింది. సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజం కపిల్ డెవిల్స్ అందించిన స్పూర్తితోనే తన కెరీర్‌ను విజయవంతంగా సాగించాడు. అయితే, ఇంత గొప్ప విజయం సాధించి, విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన కపిల్‌కు కెప్టెన్‌గా ఆ తర్వాతి కాలం మాత్రం అంత సాఫీగా సాగలేదు. వరుస పరాజయాలు, ఫామ్ లేమి, సహచరుడు, మాజీ కెప్టెన్ గవాస్కర్‌తో విభేదాల కారణంగా వరల్డ్‌కప్ గెలిచిన ఏడాదిలోపే కెప్టెన్సీని కోల్పోయాడు. వరల్డ్‌కప్‌కు ముందు 1982లో సారథ్య బాధ్యతలు చేపట్టిన కపిల్ రెండేళ్ల పాటు కెప్టెన్‌గా కొనసాగాడు. కెప్టెన్‌గా తన టర్మ్‌లో కపిల్ వరల్డ్‌కప్ విజయం, అంతకుముందు విండీస్ పర్యటనలో ఓ వన్డేలో విజయం మినహా పెద్దగా సాధించింది లేదు. అయితే వరల్డ్‌కప్‌కు ముందు విండీస్ పర్యటనలో మాత్రం కపిల్ వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించాడు. ఆ సిరీస్‌లో అతను ఓ మ్యాచ్ సేవింగ్ సెంచరీతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు. కపిల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాక సెలెక్టర్లు మళ్లీ భారత జట్టు పగ్గాలు గవాస్కర్‌కు అప్పగించారు. ఈ విడత గవాస్కర్ ఏడాది పాటు కెప్టెన్‌గా వ్యవహరించారు. అనంతరం మళ్లీ 1985 మార్చిలో కపిల్ టీమిండియా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కెప్టెన్‌గా ఘనంగా పునరాగమనం చేసిన కపిల్.. 1986లో భారత్‌కు అపురూప విజయాలను అందించాడు. ఆ ఏడాది భారత్.. ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది. ఇదే ఊపులో 1987 వరల్డ్‌కప్ బరిలోకి దిగిన భారత్.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఈ టోర్నీలో కపిల్ నిజాయితీ భారత్ కొంపముంచింది. ఆసీస్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో కపిల్ అంపైర్ చేసిన ఓ పొరపాటును సరిచేయగా.. అప్పటివరకు 268 పరుగులుగా ఉన్న ఆసీస్ స్కోర్ 270కి చేరింది. ఆ మ్యాచ్‌లో అంపైర్ పొరపాటున సిక్సర్‌ను ఫోర్‌గా పరిగణించగా, కపిల్ ఆసీస్ ఇన్నింగ్స్ అనంతరం స్వచ్ఛందంగా వెళ్లి ఈ విషయాన్ని అంపైర్‌తో చెప్పాడు. దీంతో ఆసీస్ స్కోర్ 270 అయ్యింది. ఛేదనలో భారత్ 269 పరుగులకు పరిమితం కావడంతో పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఈ వరల్డ్‌కప్‌లో భారత్ ఓటమి తర్వాత కపిల్ భారత సారధ్య బాధ్యతలను ఎప్పుడూ చేపట్టలేదు. భారత్‌కు వరల్డ్‌కప్ అందించానన్న తృప్తి తప్ప కెప్టెన్‌గా కపిల్‌కు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ లేవు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత క్రికెట్లో చెప్పుకోగదగ్గ, చారిత్రాత్మక విజయాన్ని అందించిన సారథిగా మాత్రం కపిల్ దేవ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వ్యక్తిగతంగా అతను సాధించిన పలు రికార్డులు క్రికెట్ అభిమానులకు సదా గుర్తుండిపోతాయి. సంచలనాలకు ఆధ్యుడిగా కపిల్ చరిత్రలో నిలిచిపోతాడు. కాగా, 1983 వరల్డ్‌కప్‌లో కపిల్ డెవిల్స్ అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగి, అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన వెస్టిండీస్‌కు ఓటమిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. -
America Independence Day : అట్టహాసంగా అమెరికా స్వాతంత్య్ర వేడుకలు (ఫొటోలు)


