రాజీ పడేదే లే! తాడో పేడో తేల్చుకుంటాం!: జెలెన్‌స్కీ

Volodymyr Zelensky Told 31 Years Of Independence Ukraine Is Reborn - Sakshi

Volodymyr Zelensky  emotional speech: రష్యాతో  ఆధిపత్యం నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఉక్రెయిన్‌కు ఇది 'పునర్జన్మ' అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌ స్కీ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ ఎప్పటికీ తన పోరాట స్ఫూర్తిని వదులుకోదు అని ఉక్రెయిన్‌ 31వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం చేసిన ప్రసంగంలో భావోద్వేగంగా మాట్లాడారు.

ఈ మేరకు జెలెన్‌ స్కీ మాట్లాడుతూ... ఫిబ్రవరి 24 తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమైంది యుద్ధం. ఆ రోజు ప్రపంచంలో ఒక కొత్త దేశం కనిపించింది. ఏడ్చి కేకలు వేయని, భయపడని దేశం. తమ దేశాన్ని పరుల వశం కానివ్వం. ఆ దురాక్రమణను అంత తేలిగ్గా మరిచిపోం అని అన్నారు. గత ఆరు నెలల యుద్ధ కాలంలో తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న రష్యాతో ఇక రాజీపడేది లేదని, తాడో పేడో తేల్చుకోవడమేనని నొక్కి చెప్పారు.

తలపై తుపాకి పెట్టినా తాము భయపడమని, తమను యుద్ధ ట్యాంకులు, విమానాలు, క్షిపణులు భయపట్టవని, కేవలం తమ స్వేచ్ఛను బంధించే సంకెళ్లను చూసే భయపడతామని అ‍న్నారు. అంతేకాదు 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పంతో పాటు తూర్పున పారిశ్రామిక డాన్‌బాస్ ప్రాంతంలోని కోల్పోయిన భూభాగాన్ని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌ స్వాతంత్య్ర దినోత్సవ వేళ రష్యా మరింతగా విధ్వసం సృష్టింస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాజధాని కీవ్‌ వీధులన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. 
చదవండి: యుద్ధంపై విమర్శ... రష్యాన్‌ రాజకీయవేత్తపై వేటు..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top