యుద్ధంపై విమర్శ... రష్యాన్‌ రాజకీయవేత్తపై వేటు..

Russian Authorities Detained Politician Criticising Ukraine Invasion - Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌ పై యుద్ధం చేయడం గురించి రష్యన్‌ రాజకీయవేత్త ఒకరు విమర్శించారు. ఇలా ఉక్రెయిన్‌ పై అమానుషంగా యుద్ధం చేసి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకోవడం తప్పు అంటూ పలు విమర్శలు చేశారు. అంతే సదరు రాజకీయవేత్త, మాజీ మేయర్‌ యెవ్జెనీ రోయిజ్‌ మాన్‌ పై రష్యాన్‌ అధికారులు సీరియస్‌ అవ్వడమే కాకుండా అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇలాంటి చర్యలు రష్యా బలగాలను అప్రతిష్టపాలు చేసేలా చేయడమేనంటూ మండిపడ్డారు. అతను ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశాడని కూలంకషంగా రష్యా అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అతను రష్యాలో ప్రధాన ప్రతిపక్షం అభ్యర్థి, పైగా పలు మేయర్‌ పదువులను అలంకరించిన ప్రముఖ వ్యక్తి. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్‌ పై చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ప్రత్యేక సైనిక చర్యగా అభివర్ణించుకుంటోంది.

ఈ తరుణంలో ఎవరైన క్రెమ్లిన్‌ని తప్పుపట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కన్నెరజేస్తోంది రష్యా. ఆయా వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అరెస్టు చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. గతంలో ఒక యాంకర్‌ కూడా ఇలానే యుద్ధం వద్దంటూ ప్లకార్డులు పట్టుకున్నందుకు ఆమెను రష్యా భధ్రతా బలగాలు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉక్రెయిన్‌ దళాలు కూడా ఈ దాడిని ప్రతిఘటించడమే కాకుండా రష్యా తన బలగాలను ఉపసంహరించుకునేలా పశ్చిమ దేశాలు రష్యా పై కఠిన ఆంక్షలు విధించాయి కూడా. ఆఖరికి ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తిని తోసిపుచ్చి తనదైన శైలిలో ఉక్రెయిన్‌ పట్ల దురుసుగా వ్యవహరిస్తోంది.

(చదవండి: ఉక్రెయిన్‌ని విడిచిపెట్టి వచ్చేయండి!... హెచ్చరించిన యూఎస్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top