అమెరికాలో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలో భారత సంతతికి చెందిన 60 ఏళ్ల మహిళకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాలో 30 ఏళ్లుగా నివసిస్తున్నమహిళను గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి రౌండ్‌లో అరెస్ట్ చేయడం కలకలం రేపింది. బబ్లీజీత్ కౌర్ అలియాస్ బబ్లీ అనే మహిళ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్‌మెంట్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి దశలో ఉండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు తన తల్లిని అదుపులోకి తీసుకున్నారని ఆమె కుమార్తె జోతి మీడియాకు తెలిపారు. 1994 నుండి అమెరికాలో నివసిస్తున్న బబుల్జిత్ "బబ్లీ" కౌర్, పెండింగ్‌లో ఉన్న ఆమె గ్రీన్ కార్డ్ దరఖాస్తు కోసం బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్‌మెంట్ సమయంలో ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 1న తన తల్లి యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) కార్యాలయం డెస్క్ వద్ద ఉన్నప్పుడు, పలువురు ఫెడరల్ ఏజెంట్లు భవనంలోకి ప్రవేశించారని జ్యోతి చెప్పింది. ఆ తర్వాత ఫెడరల్ ఏజెంట్లు వెళ్లిన గదిలోకి కౌర్‌ను పిలిచి, ఆమెను అరెస్టు చేస్తున్నట్లు చెప్పారని ఆమె తెలిపింది. కౌర్‌కు తన న్యాయవాదితో ఫోన్‌లో మాట్లాడే అవకాశం కల్పించినప్పటికీ, ఆమెను నిర్బంధంలోనే ఉంచారని ఆమె కుమార్తె చెప్పింది. కొన్ని గంటల పాటు కౌర్‌ను ఎక్కడికి తీసుకెళ్లారో కుటుంబ సభ్యులైన తమకు తెలపకుండానే, రాత్రికి రాత్రే అడెలాంటోకు బదిలీ చేశారని ఆరోపించారు. మరోవైపు అమెరికా పౌరురాలైన ఆమె మరో కుమార్తె, గ్రీన్ కార్డ్ ఉన్న ఆమె భర్త నుండి ఆమోదించబడిన గ్రీన్ కార్డ్ హోదాలో ఉన్నారని లాంగ్ బీచ్ వాచ్‌డాగ్ తన కథనంలో వివరించింది.
ఎవరీ బబ్లీ కౌర్
కౌర్ కుటుంబం USకి వలస వచ్చిన తర్వాత, మొదట లగున బీచ్‌లో స్థిరపడ్డారు, తర్వాత లాంగ్ బీచ్‌కు వెళ్లారు. తరువాత ఉద్యోగ బాధతలరీత్యా బెల్మాంట్ షోర్ ప్రాంతానికి మారారు. కౌర్‌కు ముగ్గురు పిల్లలున్నారు. 34 ఏళ్ల జోతి, DACA (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్) కింద USలో చట్టపరమైన హోదాను కలిగి ఉన్నారు ,ఆమె అన్నయ్య, సోదరి, ఇద్దరూ అమెరికా పౌరులుగా ఉన్నారు.
రెండు దశాబ్దాలకు పైగా, కౌర్ , ఆమె భర్త బెల్మాంట్ షోర్‌లోని 2వ వీధిలో నటరాజ్ క్యూసిన్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్ అనే తినుబండారాల ఔట్‌లెట్‌ను నిర్వహిస్తున్నారు. లాంగ్ బీచ్ కమ్యూనిటీలో మంచి ఆదరణను కూడా పొందింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఫార్మసీ చైన్ దాని మిగిలిన స్థానాలను మూసివేసేంs వరకు ఆమె బెల్మాంట్ షోర్ రైట్ ఎయిడ్‌లో దాదాపు 25 సంవత్సరాలు పనిచేసింది. ఇటీవల, ఆమె రాయల్ ఇండియన్ కర్రీ హౌస్‌లో రెస్టారెంట్ పనిలోకి రావడానికి తిరిగి సిద్ధమవుతోంది.
బబ్లీ కౌర్‌ను విడుదల చేయాలని పిలుపు
లాంగ్ బీచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా, కౌర్ విడుదల కోసం పిలుపునిచ్చారు. ఆమె కుటుంబం ఆమె కేసు కొనసాగుతున్నందున కౌర్‌ను బాండ్‌పై విడుదల చేయడానికి అనుమతించే అదనపు చట్టపరమైన దాఖలును సిద్ధం చేస్తున్నందున, ఈ విషయంపై అతను ఫెడరల్ అధికారులతో సంప్రదింపులు జరుపు తున్నట్లు ఆయన సిబ్బంది తెలిపారు.


