ఘనంగా శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి | Sankara Nethralaya fundraising campaign musical event grand success | Sakshi
Sakshi News home page

ఘనంగా శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి

Dec 15 2025 3:31 PM | Updated on Dec 15 2025 3:44 PM

Sankara Nethralaya fundraising campaign musical event grand success

శంకర నేత్రాలయ దృష్టి సేవా కార్యక్రమాల కోసం నిధులు సమీకరించేందుకు 2025 నవంబర్ 22న బోటెల్ నగరంలోని ఎంపైర్ బ్యాంక్వెట్ హాల్‌లో నిర్వహించిన ఫండ్‌రైజింగ్ కార్యక్రమం సంగీత విభావరి ఘనంగా, అత్యంత విజయవంతంగా జరిగింది.

కార్యక్రమం చిన్నారులు మిత్రా, మీనాక్షి, విష్ణు, జస్‌మితా ఆలపించిన పవిత్ర గణేశ వందనాలతో ఆరంభమైంది. కార్యక్రమం నిరంతరాయంగా సాగాలని వినాయకుడిని ప్రార్థించిన ఈ చిన్నారుల గాన ప్రదర్శన సభలోని ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. కార్యక్రమాన్ని సుందరంగా, శ్రద్ధగా ముందుకు తీసుకెళ్లిన ఎంసీలు వర అక్కెల్ల, సృజనా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ గాయకులు సుమంగళి, అంజనా సోమ్య, పార్థు, మల్లికార్జున అందించిన సంగీత ప్రదర్శనలు కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

స్థానిక కమ్యూనిటీ సభ్యులు, కమ్యూనిటీ సంస్థలు, నాయకులు, వాలంటీర్లు మరియు మిత్రుల సమిష్టి సహకారంతో ఈ సంగీత విభావరి విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బోటెల్ సిటీ డిప్యూటీ మేయర్ రామి గారు, అలాగే కొత్తగా ఎన్నికైన సిటీ కౌన్సిల్ సభ్యుడు అంగులూరి తమ భార్యతో కలిసి హాజరై, శంకర నేత్రాలయ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ తమ మద్దతును తెలియజేశారు.

2023 ‘Adopt a Village’ స్పాన్సర్లుగా శ్భాస్కర్ గంగిపాముల, శ్రీ రామ్ కొట్టీ;
2024 స్పాన్సర్లుగా Quadrant Technologies (వంశీ రెడ్డి , శ్రీ రామ్ పాలూరి, భాస్కర్ జీ ), విక్రమ్ గార్లపాటి, వర అక్కెల్ల గారు, రాహుల్ & అనీలా, నంద కిషోర్ గజుల ;

అలాగే 2025 స్పాన్సర్లుగా అశోక్ గల్లా, రాజేశ్ గుడవల్లి, అశోక్ పసుపులేటి, వినోద్ నాగుల, కృష్ణ ఉంగర్ల, శ్వేత సానగపు, రాజేశ్ అర్జా Seattle Boys Club — తదితరాలు ముందుకు వచ్చి ఈ మహత్తర సేవా కార్యక్రమానికి అందించిన మద్దతుకు శంకర నేత్రాలయ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

డెకరేషన్ టీమ్ – Seattle Decors and Events కార్యక్రమాన్ని అద్భుతంగా అలంకరించగా, ప్రతి క్షణాన్ని అందంగా బంధించిన హ్యాష్‌ట్యాగ్ ఫోటోగ్రఫీ, అలాగే రుచికరమైన భోజనం అందించిన Aroma Bothell, Biryani Bistro, Curry Point ఫుడ్ వెండర్ల సేవలు సభలోని వారి నుంచి విశేష ప్రశంసలు అందుకున్నాయి.

SNUSA జాతీయ అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందూర్తి నాయకత్వం, మార్గదర్శకత్వం, SNUSA బృందంలోని మూర్తి రేకపల్లి, డా. రెడ్డి ఊరిమిండి, వంశి ఏరువారం, శ్యామ్ అప్పలీ, రత్నకుమార్ కవుటూరు, త్యాగరాజన్ గారి కీలక మద్దతు, అలాగే స్థానిక చాప్టర్‌కు సకాలంలో అందిన సహకారం ఈ కార్యక్రమం ఘనవిజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

శంకర నేత్రాలయ బోర్డ్ ట్రస్టీలు సోమ జగదీశ్ కుటుంబం, వినోద్ కుటుంబంతో ముందుండి కీలక పాత్ర పోషించగా, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ జయపాల్ రెడ్డి దొడ్డ మార్గదర్శకత్వంలో చాప్టర్ లీడర్లు, వాలంటీర్లు సమిష్టిగా శ్రమించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో దృష్టి సేవలు అందించే శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలకు ఈ ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి విలువైన మద్దతును అందించింది.

(చదవండి: ఘనంగా ‘ఆటా’ అంతర్జాతీయ సాహిత్య సదస్సు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement