అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం | Shooting During Final Exam At Brown University In US Leaves Two Died And Eight Injured, Watch News Video | Sakshi
Sakshi News home page

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

Dec 14 2025 7:15 AM | Updated on Dec 14 2025 11:13 AM

Shooting During Final Exam At Brown University In US

వాషింగ్టన్‌: అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లో ఉన్న బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో విద్యార్థులు తుది పరీక్షలు రాస్తున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. నల్లటి దుస్తులు ధరించిన ఒక  ఆగంతకుడు ఈ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.  నిందితుని జాడ ఇంకా తెలియరాలేదు. పోలీసు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

బారస్ అండ్‌ హోలీ భవనంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇది ఏడు అంతస్తుల భవనం. ఇందులో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ విభాగం ఉన్నాయి. కాల్పులు జరిగిన సమయంలో ఇంజనీరింగ్ డిజైన్ పరీక్ష జరుగుతోంది. డిప్యూటీ చీఫ్ ఆఫ్ పోలీస్ టిమోతీ ఓ'హారా ప్రకారం.. నిందితుడు ముదురు రంగు దుస్తులు ధరించాడు. దాడి జరిగిన ఇంజనీరింగ్ భవనం నుండి అతను బయటకు వెళ్లడం చివరిసారిగా కనిపించింది. ఈ సందర్భంగా మేయర్ బ్రెట్ స్మైలీ మాట్లాడుతూ ఆ ప్రాంతంలో ‘షెల్టర్-ఇన్-ప్లేస్’ అమలులో ఉందని ప్రకటించారు. క్యాంపస్ సమీపంలో నివసించే ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, పరిస్థితి సద్దుమణిగే వరకు బయలకు రాకూడదని కోరారు.

గాయపడిన ఎనిమిది మంది పరిస్థితి నిలకడగా ఉందని మేయర్ స్మైలీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన విద్యార్థులలో తీవ్ర భయాందోళనను సృష్టించింది. ఒక విద్యార్థి తన వసతి గృహంలో ప్రాజెక్ట్‌పై పని చేస్తుండగా సైరన్‌లు, సందేశం విని తన భయపడ్డానని తెలిపారు. మరో ల్యాబ్‌లోని విద్యార్థులు హెచ్చరిక అందగానే డెస్క్‌ల కింద దాక్కుని, లైట్లు ఆపివేశామన్నారు.
 


 అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ ఈ ఘటన గురించి మాట్లాడుతూ ప్రస్తుతం మనం బాధితుల కోసం ప్రార్థించడం తప్ప మరేమీ చేయలేమని అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో, ఎఫ్‌బిఐ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారని తెలిపారు. అయితే, నిందితుడు అదుపులో ఉన్నాడని మొదట చెప్పినప్పటికీ, తరువాత  అతను పోలీసుల అదుపులో లేడని స్పష్టం చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేస్తూ, ఈ వార్తను తాను విన్నానని ఎఫ్‌బిఐ  పరిస్థితులను పర్యవేక్షిస్తున్నదని, బాధితుల కోసం ప్రార్థిస్తున్నామని అన్నారు. 

ఇది కూడా చదవండి: ‘షాక్ అయ్యాను’.. మెస్సీ కార్యక్రమంపై మమతా క్షమాపణలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement