breaking news
Brown
-
బ్రౌన్, గ్రీన్ రంగుల్లోనూ దేశీ పత్తి!
పత్తి అంటే తెల్లని దూదే అందరికీ గుర్తొస్తుంది. అయితే, గోధుమ (బ్రౌన్), ఆకుపచ్చ వంటి రంగుల్లో దూదిని అందించే సహజ పత్తి వంగడాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా?హైదరాబాద్‌కు చెందిన హస్తకళల పునరాభివృద్ధి నిపుణుడు రామనాధం రమేశ్ దగ్గర ఏకంగా 12 రకాల పత్తి విత్తనాలు ఉన్నాయి. ఇందులో పది దేశీ పత్తి వంగడాలు కాగా రెండు అమెరికన్ బ్రౌన్ కాటన్ రకాలు. వీటికి సంబంధించిన గింజల దూది, దారాలను ఆయన చాలా కాలంగా భద్రపరచి ఉంచారు. ఆయన దగ్గర ఉన్న వంగడాల్లో లేత ఆకుపచ్చ పత్తి రకం ఒకటి. గోధుమ రంగు పత్తిలో స్వల్ప తేడాలతో 8 వేరియంట్లున్నాయి. ఇవి కాకుండా, తెలుపు రంగు దేశీ రకాలైన గిరిధర్ (తూ.గో. జిల్లా పిఠాపురం ప్రాంత వంగడం), కొండపత్తి శ్రీకాకుళం జిల్లాలో పొందూరు ఖద్దరు వస్త్రాలను ఈ దూదితోనే నేస్తారు) విత్తనాలు కూడా రమేశ్ దగ్గర ఉన్నాయి. ఈ వంగడాలను సాగు చేయించటం ద్వారా ఒరిజినల్ ఖాదీ సంస్కృతికి తిరిగి ప్రాణంపోయటం.. ఖాదీ వస్త్రాలకు మంచి ధర దక్కేలా చేయటం.. చేనేత కళాకారులకు తిరిగి గౌరవం, ఆర్థిక పుష్టి కలిగించటమే తన లక్ష్యాలని రమేశ్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.ఈ అపురూప పత్తి రకాలను ప్రకృతి వ్యవసాయంలో పండించటంతో పాటు.. ఏ దశలోనూ యంత్రాలు వాడకుండా స్వాభావిక ఖాదీ పద్ధతుల్లో దారం వడికి, బట్ట నేయించే నిబద్ధత, ఆసక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలకు ఈ 12 రకాల వివిధ రంగుల పత్తి విత్తనాలను ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నానని రమేశ్ (94400 55266) తెలిపారు. -
శృతి హాసన్ ధరించి బ్రౌన్‌కలర్ చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
కోలివుడ్‌కి చెందిన శ్రుతి హాసన్.. స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చినా నటన, గాత్ర ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న నటి. అయితే ఆమె అదృష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మదట. ఎందుకంటే..‘ఒకప్పుడు నన్ను అన్లకీ అన్నవాళ్లే తర్వాత లకీ అనడం మొదలుపెట్టారు. అందుకే తానస్సలు దాన్న నమ్మను అంటోంది. కేవలం హార్డ్ వర్క్‌ని, దేవుడిని నమ్ముతాను అని నర్మగర్భంగా చెప్పింది. చెక్కిన శిలంలా చూపులను కట్టిపడేసేలా ఉండే శృతి అందాన్ని మరింత పెంచే ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో తెలుసా!.. అర్పితా మెహతా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్పితా బాల్యంలోనే.. తన ప్యాషన్‌ని ఫ్యాషనే అని గ్రహించి, పెద్దయ్యాక ముంబైలోని ఎన్ఎన్డీటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. కొంతకాలం ప్రముఖ డిజైనర్ల దగ్గర పనిచేసి.. 2009లో సొంత లేబుల్ ‘అర్పితా మెహతా’ను ప్రారంభించింది. వైవిధ్యమైన, ఆధునిక డిజైన్స్‌ని క్రియేట్ చేస్తూ, అనతికాలంలోనే అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. అందుకే వీటి ధరలూ అదే స్థాయిలో ఉంటాయి. ఆన్లైన్లో లభ్యం. ఇక్కడ శృతి ధరించిన అర్పితా మెహతా డిజైన్ చేసిన చీర ధర ఏకంగా రూ. 1,05,000/-. అపాలా బై సుమిత్ సుమిత్ సాహ్నీని జ్యూలరీ డిజైనర్ అనడం కంటే వెండి సంప్రదాయ నగల పరిరక్షకుడు అనొచ్చు. వెండి అంటే అంత పిచ్చి అతనికి! 2006లో ‘అపాలా బై సుమిత్’ బ్రాండ్ ప్రారంభించి, వెండి హస్తకళ సరిహద్దులను పెంచుతూ అసాధారణ.. అందమైన డిజైన్స్‌ను సృష్టిస్తున్నాడు. ప్రభుత్వ ఆత్మసమ్మాన్ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యాన్ని పొంది, ఢిల్లీలోని ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్ (అఆఇఈ)లో అద్భుతమైన అపాలా ఆభరణాలను ప్రదర్శించాడు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. --దీపిక కొండి (చదవండి: యానిమల్ చిత్రంతో ఓవరనైట్ స్టార్ అయిన తృప్తి డిమ్రీ ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే!) -
బ్రౌన్‌ని అంటారా?....
స్పందన ‘బ్రౌన్ నిఘంటువులో బ్రౌన్ కృషి ఎంత?’ అనే పేరుతో మే 3న సాక్షి సాహిత్యం పేజీలో ఒక వ్యాసం లాంటిది వచ్చింది. ఈ రచనకు కర్తలు పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు. బ్రౌన్కు మనం ఇవ్వవలసిన గౌరవం కంటే ఎక్కువ ఇస్తున్నామనీ బ్రౌన్ పట్ల తెలుగువారికి గల ఆరాధన వెనుక వలసవాద ధోరణి- అంటే బానిస ధోరణి ఉన్నదనీ బ్రౌన్ నిఘంటువులో బ్రౌన్ అవగాహన ఎంతో చెప్పడానికి అవకాశాలు లేవనీ రచయితలు అభిప్రాయపడ్డారు. బ్రౌన్ గురించి తెలుసుకోవడానికి అచ్చయిన అతని రచనలు అందరికీ అందుబాటులో ఉన్నవే. అయితే తన గురించి తాను చెప్పుకున్న విషయాలు వాస్తవాలేనని గుడ్డిగా నమ్మక్కరలేదు. బ్రౌన్ ఆలోచనా విధానాన్నీ కొంత వరకు ఆయన స్వభావాన్నీ తెలుసుకోవడానికి వేల పేజీలలో ఉన్న అచ్చుకాని ఆయన రాసుకున్న నోట్సు ఒక మంచి ఆధారం. మద్రాసు యూనివర్సిటీలోని ఓరియంటల్ మానుస్క్రిప్ట్ లైబ్రరీలో ఈ నోట్సు సంపుటాలున్నాయి. జి.ఎన్.రెడ్డి పర్యవేక్షకులుగా బంగోరె స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న బ్రౌన్ ప్రాజెక్టు (ఎస్.వి.యు, తిరుపతి) పని చేసిన కాలంలో లండన్ నుంచి వారు తెప్పించిన బ్రౌన్ నిఘంటువుకు సంబంధించిన మరికొంత నోట్సు మైక్రోఫిల్మ్ రూపంలో ఉంది. వీటిలో బ్రౌన్ ధోరణి, స్వభావం, భాష పట్ల దృక్పథం మరింత స్పష్టంగా అర్థం అవుతాయి. బ్రౌన్ పుట్టింది భారతదేశంలోని కలకత్తాలో. 12 సంవత్సరాల వరకూ అతని బాల్యం కూడా ఇక్కడే గడిచింది. ఆ తర్వాత తల్లిదండ్రులతో కొంతకాలం బ్రిటన్‌కు వెళ్లిపోయాడు. నవయవ్వన దశలోనే బ్రిటిష్ అధికారిగా భారతదేశానికొచ్చాడు. తెలుగుతో బాటు మరికొన్ని భారతీయ భాషలూ నేర్చుకున్నాడు. వేమన పద్యాల సేకరణ, పరిష్కరణ, అచ్చులతో ప్రారంభమైన బ్రౌన్ తెలుగు సాహిత్య కృషి తెలుగు కావ్య పరిష్కరణలతో ఆగక తెలుగు నిఘంటువుల దాకా విస్తృతంగా సాగింది. బ్రౌన్ స్వభావం గమనించండి. 1. బ్రౌన్ గుంటూరు కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఏర్పడ్డ దుర్భర పరిస్థితిని వివరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక రిపోర్టు పంపాడు. అందులో ఊఅకఐూఉ (కరువు) అనే మాట ఉపయోగించాడు. అందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహించింది. అయినా బ్రౌన్ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. 2. పదాలకు అర్థాలు నిర్ణయించడంలో బ్రౌన్ తనకు సహాయకులుగా ఉన్న పండితులపై ఆధారపడటం ఒక కోణం మాత్రమే. పండితుల నుంచి సామాన్యుల దాకా అందరూ తన గురువులే అని స్వీయ చరిత్రలో చెప్పుకున్నాడు. ‘అలవోక’ అనే పదానికి రావిపాటి గురుమూర్తిశాస్త్రి బ్రౌనుకు చెప్పిన అర్థాలు స్వేచ్ఛ, అప్రయత్నము. బ్రౌన్ ఇచ్చిన అర్థాలలో వేడుకగా, విలాసముగా, ఆట్లాటగా, అవలీలగా అనేవి ఉన్నాయి. ఎవరో చెప్పిన విషయాలతోనే తృప్తి పడకుండా తనకు సంతృప్తి దొరికే దాకా పరిశీలించడం బ్రౌనుకు అలవాటు. 3. తెలుగువాడైన బహుజనపల్లి సీతారామచార్యులు తయారు చేసిన ‘శబ్ద రత్నాకరం’ 1885లో అచ్చయింది. కాని బ్రౌన్ నిఘంటువు దానికి చాలాకాలం ముందే 1852లో వచ్చింది. అయినప్పటికీ బ్రౌన్ నిఘంటువులో ఉన్న అనేక పదాలు అర్థాలు ఆ తర్వాతి కాలంలో వచ్చిన శబ్ద రత్నాకరంలో లేవు. 4. ‘మామిడి గుత్తులు’ అనే పదానికి శబ్ద రత్నాకరం ధాన్య విశేషము అని అర్థం చెప్పింది. బ్రౌను ‘వడ్లల్లో భేదము’ అని ఇచ్చాడు. 5. ‘చిక్కుడు’ అనే పదానికి బ్రౌను ఎర్ర, తెల్ల, గోరు, ఆనప, ఏనుగ, కోడి, తొండ, ఉలవ, సొన- అని తొమ్మిది రకాల చిక్కుడు భేదాలను ప్రస్తావించాడు. శబ్దరత్నాకర రచయిత ‘ఒకానొక తీగ’ అని మాత్రమే సరిపెట్టాడు. దీని వల్ల అదొక కూరగాయ అని కూడా తెలియదు. 6. ‘మున్నూరు’ అనే పదానికి శబ్దరత్నాకరంలో ‘మూడు నూఱులు’ అని మాత్రమే ఉంది. బ్రౌను దాంతోబాటు మున్నూటి కులం అని కూడా ఇచ్చాడు. 7. ‘థ’ అనే వర్ణం అనవసరం అన్నాడు బ్రౌన్. చాలాకాలానికి భద్రిరాజు కృష్ణమూర్తి కూడా అదే మాట అన్నారు. 8. శకట రేఫ (ఱ), అరసున్నాలను బ్రౌన్ ఆనాడే తొలగించాడు. పై విషయాల్ని చూస్తే బ్రౌన్ సామ్రాజ్యవాద స్వభావంతోనే ఈ పని చేశాడని అనిపిస్తుందా? తెలుగు భాషా సాహిత్యాల గురించి ఆయన ఆలోచనలలో కొన్ని తప్పులంటే ఉండొచ్చుగాని ఏదో కడుపులో పెట్టుకున్నట్టుగా మాత్రం లేవు. ‘కవులు భాషను సృష్టిస్తారు. వ్యాకరణవేత్తలు దానిని అనుసరిస్తారు’ అన్నాడు బ్రౌన్. మన వ్యాకరణవేత్తలు చాలామంది కవులకు సంకెళ్లు వేసే పద్ధతినే అనుసరించారు. మనలో వలసవాద భావాలంటే దానికి బ్రౌన్ కారణం కాదు. వ్యాసకర్తలన్నట్టు మనలో సాంస్కృతిక దైన్యం ఉంది. దాన్ని ధిక్కరించి, అధిగమించే స్వభావం కూడా కొంతమందిలోనైనా ఉంది. బ్రౌన్ చవకగా జీతాలిచ్చాడని మరో ఆరోపణ. ఇవాళ మన భూస్వాములూ, పెట్టుబడిదారులూ మన శ్రమజీవుల్ని చేసే దోపిడీ ముందు, దేశాన్ని విదేశాలకు అమ్మే మన పాలక వర్గాల స్వభావం ముందు బ్రౌన్ ఇచ్చిన ‘చవక‘ జీతాల్ని గురించి ప్రశ్నించడం చవకబారు ఆలోచన కాదా? బ్రౌన్ ఆ రోజుల్లోనే తెలుగు తాళపత్ర ప్రతులు సేకరించడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఒకసారి గుర్రం మీంచి కిందపడి కుడి చేతి బొటనవేలు దెబ్బ తింటే ఎడమ చేత్తో రాయటం అలవాటు చేసుకున్నాడు తప్ప కొన్ని నెలలైనా ఊరికే కూర్చోవడానికి ఇష్టపడలేదు. బ్రౌన్ తెలుగు భాషా సాహిత్యాల కృషిని విమర్శనాత్మకంగా విశ్లేషించుకోవడం అవసరంగాని ఆ విశ్లేషణ ఈ వ్యాసకర్తలు చేసిన పద్ధతిలో మాత్రం కాదు. - వి. చెంచయ్య 9440638035 -
యువ సైనికులపైనే దేశరక్షణ
వాయుసేనాధిపతి బ్రౌన్ ఉద్ఘాటన దుండిగల్ వాయుసేన అకాడమీలో ఆఫీసర్ల పాసింగ్ అవుట్ పరేడ్ దేశరక్షణ వ్యవస్థ యువ సైనికులపైనే ఆధారపడి ఉందని భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బ్రౌన్ అన్నారు. దుండిగల్‌లోని వాయుసేన అకాడమీలో ఆరు నెలల పాటు శిక్షణ పొందిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం ఉదయం జరిగింది. ఇదే అకాడమీలో శిక్షణ పొంది 1972, జూన్14న బయటకు వచ్చిన బ్రౌన్ తాజా పాసింగ్ అవుట్ పరేడ్‌కు వాయుసేన చీఫ్‌గా హాజరు కావడం విశేషం. కింది ఉద్యోగుల పట్ల, వాయుసేన పతాకం పట్ల, దేశం పట్ల నిజాయతీగా ఉండాలని యువ అధికారులకు బ్రౌన్ సూచించారు. దేశరక్షణలో భాగస్వాములై.. తమ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించాలని పిలుపునిచ్చారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయిం చారు. మొత్తం 202 మంది శిక్షణ పూర్తి చేసుకోగా ఇందులో 37 మంది మహిళలున్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా.. బ్రౌన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారికి ఫ్లాగ్‌లను బహూకరించారు. అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రవీణ్‌కుమార్‌ను ‘స్వార్డ్ ఆఫ్ హానర్’గా గుర్తించి అతనికి ఖడ్గధారణ చేశారు. గ్రౌండ్ డ్యూటీలో ప్రతిభ చూపిన విపిన్‌కుమార్ , నావిగేషన్ కోర్సులో ప్రతిభ కనబరిచిన ఫిర్దోస్ అహ్మద్‌దార్‌లకుజ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వాయుసేనలో శిక్షణ పొందిన అధికారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చేతక్ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో చేసిన సాహసోపేత ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి. కార్యక్రమంలో ఎయిర్ మార్షల్ పరమ్‌జిత్ సింగ్ గిల్, ఎయిర్ మార్షల్ ఆర్జీ బుర్లీతోపాటు వాయుసేన అకాడమీ అధికారులు, కేడెట్ల తల్లిదండ్రులు పాల్గొన్నారు.