కోల్‌కతా: కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఈరోజు (శనివారం) ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ కార్యక్రమంలో జరిగిన గందరగోళంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆమె.. ‘ఈరోజు సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన గందరగోళాన్ని చూసి నేను తీవ్రంగా కలత చెందాను. షాక్ అయ్యాను. అభిమాన ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీని చూసేందుకు వేలాది మంది క్రీడా ప్రేమికులు, అభిమానులతో పాటు నేను కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి స్టేడియంనకు వెళ్తున్నాను’ అని రాశారు. మమతా బెనర్జీ తన ‘ఎక్స్’ పోస్టులో క్రీడాకారుడు మెస్సీతో పాటు అభిమానులకు కూడా క్షమాపణలు కూడా చెప్పారు.
ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు
సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన అల్లర్లపై కలకత్తా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అశిం కుమార్ రే నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా ప్రకటించారు. ఈ ప్యానెల్ వివరణాత్మక దర్యాప్తు నిర్వహించనుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు దిద్దుబాటు చర్యలను సిఫార్సు చేస్తుంది.
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన ముగిసింది. అయితే సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగినప మోహన్ బగన్ మెస్సీ ఆల్ స్టార్స్ వర్సెస్ డైమండ్ హార్బర్ మెస్సీ ఆల్ స్టార్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా గందరగోళం నెలకొంది. మెస్సీ మ్యాచ్ ఆడకుండానే త్వరగా వెళ్లిపోయాడని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాటర్ బాటిల్స్‌ను, కూర్చీలను మైదానంలోకి విసిరి రచ్చ రచ్చ చేశారు. ఫ్లెక్సీలు ద్వంసం చేస్తూ, బ్యారికేడ్లను దాటుకుంటూ మైదానంలో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
ఈ గందరగోళ పరిస్ధితుల నేపథ్యంలో మెస్సీ టీమ్‌ను సొరంగం గుండా బయటకు పంపించారు. మెస్సీ మైదానంలో కేవలం ఐదు నిమిషాల మాత్రమే ఉన్నాడు. అతడిని చూసేందుకు బెంగాల్ పక్కరాష్ట్రాల నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు. వాస్తవానికి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాల్సి ఉండేది.
West Bengal CM Mamata Banerjee (@MamataOfficial) posts, "I am deeply disturbed and shocked by the mismanagement witnessed today at Salt Lake Stadium. I was on my way to the stadium to attend the event along with thousands of sports lovers and fans who had gathered to catch a… pic.twitter.com/Ew7azrl1o2
— Press Trust of India (@PTI_News) December 13, 2025


