కోల్‌కత్తా ఎఫెక్ట్‌.. ఉప్పల్‌ స్టేడియంలో హైఅలర్ట్‌ | Telangana Police High Security At Uppal Stadium Over Messi Game | Sakshi
Sakshi News home page

కోల్‌కత్తా ఎఫెక్ట్‌.. ఉప్పల్‌ స్టేడియంలో హైఅలర్ట్‌

Dec 13 2025 1:04 PM | Updated on Dec 13 2025 1:55 PM

Telangana Police High Security At Uppal Stadium Over Messi Game

సాక్షి, హైదరాబాద్‌: కాసేపట్లో ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కత్తా స్టేడియంలో జరిగిన పరిస్థితుల దృష్టా ఉప్పల్‌ స్టేడియంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్చలు తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో, ఉప్పల్‌ స్టేడియం వద్ద హైఅలర్ట్‌ కొనసాగుతోంది.కోల్‌కత్తా ఘటనతో రాచకొండ పోలీసులు అప్రమత్తం.

కోల్‌కత్తా ఘటన కారణంగా ఉప్పల్‌ స్టేడియం వద్ద అదనపు బలగాల మోహరించారు. అభిమానులు గ్రౌండ్‌లోకి రాకుండా పోలీసుల చర్యలు తీసుకున్నారు. మెస్సీ పర్యటన దృష్ట్యా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. జెడ్‌ కేటగిరి భద్రతతో పాటు ప్రత్యేక బలగాల మోహరించినట్టు చెప్పారు. కాగా, 20 వాహనాల కాన్వాయ్‌లో ఉప్పల్‌ స్టేడియానికి మెస్సీ రానున్నారు. మరోవైపు.. మెస్సీ వస్తున్న నేపథ్యంలో ఫలక్‌నామా ప్యాలెస్‌ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 

మరోవైపు.. మెస్సీ ‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’ లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీని దగ్గరి నుంచి చూడాలని, అతడి ఆటను వీక్షించాలని కొన్ని రోజులుగా అభిమానులు ఎదురుచూశారు. ఇలాంటి సమయంలో కోల్‌కత్తా స్టేడియంకు వచ్చిన మెస్సీ.. అలా వచ్చి.. ఇలా స్టేడియం నుంచి వెళ్లిపోవడాన్ని అభిమానులు తట్టుకోలేకపోయారు. స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి తమ అసహనం వ్యక్తంచేశారు. దీంతో, కోల్‌కత్తాలోని స్టేడియంలో ఉద్రికత్త చోటుచేసుకుంది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement