సాక్షి, హన్మకొండ: బీజేపీ నేత ఈటెల రాజేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎంపీ బండి సంజయ్ PRO సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
నేను బీజేపీ పార్టీ ఎంపీని. నేను కూడా కొన్ని పోస్టులు చూశాను. అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. అసలు అవగాహన ఉన్నోడు అలా పోస్టులు పెడతాడా? ఈటెల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలు తేల్చుకుంటారు. వీటిపైన పార్టీ తేలుస్తుంది.. టైమ్ విల్ డిసైడ్. ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెప్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది. సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. రెండో, మూడో విడత ఎన్నికలు అయ్యాక జరిగిన పరిణామాలన్నీ అధిష్ఠానానికి చెప్తానని ఈటెల పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీ అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియా పోస్టులపై ఈటెల అసహనం వ్యక్తం చేయడం, పార్టీ లోపల విభేదాలు ఉన్నాయనే సంకేతాలను ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


