హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ ప్రాంతంలో నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్‌తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది.వివాహానంతరం యశ్వంత్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు వచ్చి, భార్య జ్యోతి కలిసి మూసాపేట్‌లో నివాసం ఉంటున్నాడు. యశ్వంత్ ఓ ప్రైవేటు సంస్థ అయిన మెడ్‌ప్లస్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో మనస్తాపానికి గురైన చందన జ్యోతి నిన్న(శుక్రవారం) రాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది.
ఈ విషయం గమనించిన భర్త యశ్వంత్ 108కి ఫోన్ చేయగా స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు .


