ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సికంద్రారావు నోరంగాబాద్ ప్రాంతంలోని పశ్చిమి ప్రాంతంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కుమార్తె కోచింగ్ సెంటర్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి ఆమెను వేధించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దాంతో బాధితులు సదరు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Molestation in daylight! 🚨⚠️
Three youths on a bike molested two girls returning from coaching in Hathras, UP. In the CCTV video, they were seen touching the girls' cheeks inappropriately. Shameful!
If Hathras victim had got justice, incidents like this wouldn't happen today. pic.twitter.com/VEihF68JUQ— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) December 12, 2025
రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపనున్నట్లు డీఎస్పీ హిమాన్షు మాథుర్ తెలిపారు. ఇంకా పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. సదరు ఘటన స్థానికంగా కలకలం రేపడంతో విద్యార్థినులు, మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


