రంగారెడ్డి జిల్లా: తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సర్పంచ్ అభ్యర్థి రాయికంటి భిక్షపతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో ఉన్నానని, తనను ఆశీర్వదిస్తే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో నిధులు తెస్తానని తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఓటర్లకు సాష్టాంగ నమస్కారం చేసి ఓటు వేయమని అభ్యర్థించారు.
నాలుగుసార్లు ఆ కుటుంబానికే సర్పంచ్ పదవి
మెట్‌పల్లిరూరల్ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవి నాలుగు పర్యాయాలు ఒకే కుటుంబానికి వరించింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గూడూరు తిరుపతి ఎన్నికయ్యారు. తిరుపతి భార్య రజిని 2019లో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేసి, గెలుపొందారు. తిరుపతి తండ్రి అప్పట్లో రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు.


