మెస్సీ.. మెస్సీ.. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఇదే పేరు వినిపిస్తోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం ది గోట్ టూర్‌లో భాగంగా భారత్‌కు చేరుకున్నాడు. శనివారం తెల్లవారుజామున 2.26 గంటలకు కోల్‌కతా విమానాశ్రయంలో అడుగుపెట్టిన మెస్సీకి ఘన స్వాగతం లభించింది.
తమ ఆరాధ్య ఆటగాడిని చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు. మెస్సీతో పాటు అతని ఇంటర్ మియామీ జట్టు సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా ఇండియా టూర్‌కు వచ్చారు. ది గోట్ రాకతో కోలకతా సాకర్ సిటీని తలపిస్తోంది.
ఎక్కడ చూసిన మెస్సీ కటౌట్‌లే కన్పిస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ.. కోల్‌కతా లేక్ టౌన్‌లోని శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెస్సీతో పాటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పాల్గోన్నారు.
అయితే తన విగ్రహాం ఏర్పాటుపై మెస్సీ చాలా సంతోషంగా ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ మంత్రి, శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు సుజిత్ బోస్ తెలిపారు. "మేము ఇప్పటికే మెస్సీ మేనేజర్‌తో మాట్లాడాము. ఈ రోజు మెస్సీని కలుస్తాము. తన విగ్రహాన్ని నిర్మించేందుకు అతడు అనుమతి ఇచ్చాడు.
తన విగ్రహంపై కూడా మెస్సీ సంతోషంగా ఉన్నాడు. ఇది చాలా పెద్ద విగ్రహం. 70 అడుగుల ఎత్తు ఉంది. ప్రపంచంలో మెస్సీకి ఇంత పెద్ద విగ్రహం మరొకటి లేదు. అతడి రాకతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారని" సుజిత్ బోస్ ఎఎన్‌ఐతో పేర్కొన్నారు.
City of Joy welcomes the G.O.A.T
Lionel Messi enters a packed Salt Lake Stadium #MessiInIndia #Messi𓃵 pic.twitter.com/zGdlRFQPUL— Kamit Solanki (@KamitSolanki) December 13, 2025



