సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ ఫ్యాన్స్‌ రచ్చ.. | Lionel Messi Leaves Stadium Early, Fans Agitated | Sakshi
Sakshi News home page

GOAT Tour India 2025: సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ ఫ్యాన్స్‌ రచ్చ..

Dec 13 2025 12:34 PM | Updated on Dec 13 2025 1:24 PM

Lionel Messi Leaves Stadium Early, Fans Agitated

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌క‌తా ప‌ర్య‌ట‌న ముగిసింది. అయితే సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగినప మోహన్ బగన్ మెస్సీ ఆల్ స్టార్స్ వ‌ర్సెస్‌ డైమండ్ హార్బర్ మెస్సీ ఆల్ స్టార్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ సంద‌ర్భంగా గంద‌ర‌గోళం నెల‌కొంది. మెస్సీ మ్యాచ్ ఆడ‌కుండానే త్వ‌రగా వెళ్లిపోయాడ‌ని అభిమానులు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. 

ఈ క్రమంలో వాటర్ బాటిల్స్‌ను, కూర్చీల‌ను మైదానంలోకి విసిరి ర‌చ్చ రచ్చ చేశారు. ఫ్లెక్సీలు ద్వంసం చేస్తూ, బ్యారికేడ్ల‌ను దాటుకుంటూ మైదానంలో చొచ్చుకెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేశారు. దీంతో పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. 

ఈ గందరగోళ పరిస్ధితుల నేపథ్యంలో మెస్సీ టీమ్‌ను సొరంగం గుండా బయటకు పంపించారు. మెస్సీ మైదానంలో కేవలం ఐదు నిమిషాల మాత్రమే ఉన్నాడు. అతడిని చూసేందుకు బెంగాల్‌ పక్కరాష్ట్రాల నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు. వాస్తవానికి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడాల్సి ఉండేది.

 

 

కానీ మెస్సీ మ్యాచ్‌ ఆడకుండానే వెళ్లిపోవడంతో ఫ్యాన్స్‌ తీవ్రనిరాశకు గురయ్యారు. ఈవెంట్‌ నిర్వహకులపై అభిమానులు మండిపడుతున్నారు. అంతకుముందు శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్‌గా అవిష్కరించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement