ట్రంప్‌పై నిషేధం యోచనలో ఫిఫా! | FIFA Likely To Ban Donald Trump From FIFA World Cup 2026 Pay Dues To WADA | Sakshi
Sakshi News home page

ట్రంప్‌పై నిషేధం యోచనలో ఫిఫా!

Mar 14 2026 9:28 PM | Updated on Mar 15 2026 11:38 AM

FIFA Likely To Ban Donald Trump From FIFA World Cup 2026 Pay Dues To WADA

పశ్చిమాసియాలోని ఇరాన్‌ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగలనుంది. ప్రపంచక ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) ఆయనపై నిషేధం విధించాలనే ఆలోచనతో ఉంది. పిఫా వరల్డ్‌కప్ పోటీలతో పాటు లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌ 2028కు హాజరవ్వకుండా ట్రంప్‌పై నిషేధం పడే అవకాశముంది. 

ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోవడమే అందుకు కారణమని సమాచారం. గత కొన్నేళ్లుగా యూఎస్‌ఏ ప్రభుత్వానికి, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు పొసగడం లేదు. దాంతో.. మూడేళ్ల నుంచి వాడాకు యూఎస్ ప్రభుత్వం ఒక్క డాలర్ కూడా ఇవ్వలేదు. 

ప్రస్తుతం యూఎస్ఏ చెల్లించాల్సిన బకాయిల మొత్తం 7.3 మిలియన్ డాలర్ల(రూ.67 కోట్లకు పైగా)గా ఉన్నాయి. దాంతో.. వాడాకు బాకీపడిన దేశాలకు చెందిన అధ్యక్షులను, ప్రతినిధులను ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ వంటి ప్రధాన క్రీడలకు, స్పోర్ట్స్ ఈవెంట్లకు అనుమతించకూడదనే ప్రతిపాదన ఉంది. 

కాబట్టి.. ఫిఫా వరల్డ్‌కప్‌తో పాటు లాస్ ఎంజెలెస్ ఒలింపిక్స్‌లో ఈవెంట్లో పాల్గొనకుండా అమెరికా అధినేతపై నిషేధం విధించే అవకాశముందని సమాచారం. అయితే.. వాడా అధికార ప్రతినిధి జేమ్స్ ఫిట్జెరాల్డ్ మాత్రం అదేమీ లేదని అంటుండడం గమనార్హం.

చదవండి: IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్‌!

Advertisement
 
Advertisement
Advertisement