ధర్నా వేదికపై ‘చిత్రం’ | Mamata Banerjee Continues Dharna In Kolkata Over Voter Roll Deletions, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ధర్నా వేదికపై ‘చిత్రం’

Mar 11 2026 5:44 AM | Updated on Mar 16 2026 5:24 PM

Mamata Banerjee continues dharna in Kolkata over voter roll deletions

సర్, వ్యానిష్‌.. అంటూ కుంచెతో మమత పెయింటింగ్‌

నిరసనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటన

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో సర్‌ ప్రక్రియలో పెద్దసంఖ్యలో ఓటర్ల తొలగింపునకు నిరసనగా కోల్‌కతాలో ధర్నా కొనసాగిస్తున్న సీఎం మమతా బెనర్జీ మంగళవారం కుంచె పట్టారు. నిరసన వేదికపై ఏర్పాటు చేసిన పచ్చ రంగు కాన్వాస్‌పై తెల్ల రంగుతో సర్‌ అంటూ రాసిన ఆమె..ఓటర్ల తొలగింపును సూచికగా నల్లరంగు బాక్సులను చిత్రించారు. అదేవిధంగా, కాన్వాస్‌ మధ్యలో వ్యానిష్‌(మాయం) అని రాసి, నల్ల రంగుతో పెద్దబాక్సును గీశారు.

సీఎం మమత గతంలో పలుమార్లు గతంలో ప్రధాన ఎన్నికల కమిష నర్‌ను వ్యానిష్‌ కుమార్‌గా పేర్కొనడం గమనా ర్హం. ఇలా ఉండగా, సర్‌ను నిరసిస్తూ ఈ నెల 6వ తేదీ నుంచి ఐదు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న మమత ధర్నాను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపు అభ్యంతరాలపై అప్పిల్లేట్‌ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement