న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకపోవడం కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రానికి రాష్టపతి వస్తే.. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ కనీసం పట్టించుకోరా అంటూ మండిపడింది. దీనికి సమాధానం చెప్పాలంటూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తిని కేంద హోం సెక్రటరీ గోవింద్ మోహన్ వివరణ కోరారు.
సాధారణంగా రాష్ట్రపతి ఒక రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు స్వాగతం పలకడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు రాష్ట్రం నుంచి ఎటువంటి స్వాగతం కానీ ఆహ్వానం కానీ లభించలేదు. దీన్నే కేంద్రం ప్రధానంగా ప్రస్తావించింది.
ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్‌లు.. రాష్ట్రపతిని ఆహ్వానించడానికి కానీ వీడ్కోలు చెప్పడానికి కానీ ఎందుకు హాజరు కాలేదు? రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్‌రూమ్‌లో నీరు లేదు 3) రాష్ట్రపతి వచ్చే మార్గం చెత్తతో నిండి ఉంది 4) డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్, సిలిగురి పోలీసు కమిషనర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ బాధ్యులు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. దీనికి ఐదు గంటల్లోగా సమాధానం చెప్పండి’ అంటూ కేంద హోం సెక్రటరీ గోవింద్ మోహన్ ఆదేశించారు.
అదొక ప్రైవేట్ ఆర్గనైజేషన్: సీఎం మమతా
సిలిగురిలో జరిగిన 9వ అంతర్జాతీయ ఆదివాసీ సంతల్ సమావేశానికి గౌరవనీయులైన రాష్ట్రపతిని ఆహ్వానించారు. అంతర్జాతీయ సంతల్ కౌన్సిల్ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఈ కార్యక్రమం ఏర్పాట్లకు సిబ్బంది తగినంత లేరని జిల్లా యంత్రాంగం రాష్ట్రపతి కార్యాలయానికి లిఖిత పూర్వకంగా తెలియజేసింది. ఫోన్ ద్వారా కూడా తెలియజేశాం.
గౌరవనీయులైన రాష్ట్రపతిని మేయర్ సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్, డిఎం డార్జిలింగ్ సిలిగురి పోలీస్ కమిషనరేట్ స్వాగతించి, వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి సచివాలయం ఆమోదించిన లైనప్ ప్రకారం ఇది జరిగింది. ఈ లైనప్‌లో కానీ వేదిక ప్రణాళికలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి భాగం కాలేదు. జిల్లా యంత్రాంగం వైపు నుండి ఎటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదు’ అని మమతా ట్వీట్ చేశారు.
కాగా, 9వ అంతర్జాతీయ సంతల్ సదస్సులో పాల్గొనడానికి సిలిగురికి వచ్చిన తనకు.. ముఖ్యమంత్రి నుంచి, రాష్ట్ర మంత్రుల నుంచి కూడా తనకు ఆహ్వానం అందలేదన్నారు ముర్ము. ‘మమత నా చెల్లెలు లాంటిది. బహుశా ఆమె కోపంగా ఉండవచ్చు. నేను బెంగాల్ పర్యటనకు వస్తే ఆమె నన్ను పట్టించుకోలేదు. సంతాల్ దివస్‌కు సరైన ఏర్పాట్లు చేయలేదు. ఆ కార్యక్రమానికి మమత హాజరు కాకపోవడం నన్ను బాధించింది.
ఆమె అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఇంత ఇరుకైన ప్రదేశంలో నిర్వహించాలని ఎంచుకుందో నాకు తెలియదు. వేదిక పెద్దదిగా ఉంటే, సమావేశానికి ఎక్కువ మంది హాజరయ్యేవారు అని ఆమె బిధాన్‌నగర్‌లో జరిగిన మరో కార్యక్రమంలో స్పష్టం చేశారు.. బిధాన్‌నగర్‌లో సమావేశం జరిగి ఉంటే ఐదు లక్షల మంది సులభంగా హాజరయ్యేవారని కూడా ముర్ము ప్రధానంగా ప్రస్తావించారు.
రాష్ట్రపతితో రాజకీయాలు సరికాదు
రాష్ట్రపతితో కూడా రాజకీయాలు చేయాలనుకోవడం సరైనది కాదని ప్రధాని మోదీ నిన్ననే(శనివారం, మార్చి 7వ తేదీ) ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతిని టీఎంసీ అవమానించింది. టీఎంసీ హద్దు మీరి ప్రవర్తిస్తోంది’ అని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు.


