బెంగాల్‌ సీఎంపై రాష్ట్రపతి ముర్ము ఆగ్రహం | President Murmu slams Mamata over choice of venue | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ సీఎంపై రాష్ట్రపతి ముర్ము ఆగ్రహం

Mar 7 2026 8:45 PM | Updated on Mar 7 2026 8:56 PM

President Murmu slams Mamata over choice of venue

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగ్రహg వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని సిలిగురిలో తన పర్యటనకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై  ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక ఎంపిక అంశానికి సంబంధించి  ఏర్పాట్లను సరిగా చేయకపోవడాన్ని ముర్ము ఆక్షేపించారు. 

9వ అంతర్జాతీయ సంతల్ సదస్సులో పాల్గొనడానికి సిలిగురికి వచ్చిన ముర్ము.. ముఖ్యమంత్రి నుంచి, రాష్ట్ర  మంత్రుల  నుంచి కూడా తనకు ఆహ్వానం అందలేదన్నారు. ‘మమత నా చెల్లెలు లాంటిది. బహుశా ఆమె కోపంగా ఉండవచ్చు.  నేను బెంగాల్‌ పర్యటనకు వస్తే ఆమె నన్ను పట్టించుకోలేదు. సంతాల్‌ దివస్‌కు సరైన ఏర్పాట్లు చేయలేదు.  ఆ కార్యక్రమానికి మమత హాజరు కాకపోవడం నన్ను బాధించింది.

ఆమె అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఇంత ఇరుకైన ప్రదేశంలో నిర్వహించాలని ఎంచుకుందో నాకు తెలియదు. వేదిక పెద్దదిగా ఉంటే, సమావేశానికి ఎక్కువ మంది హాజరయ్యేవారు అని ఆమె బిధాన్‌నగర్‌లో జరిగిన మరో కార్యక్రమంలో స్పష్టం చేశారు.. బిధాన్‌నగర్‌లో సమావేశం జరిగి ఉంటే ఐదు లక్షల మంది సులభంగా హాజరయ్యేవారని కూడా ముర్ము ప్రధానంగా  ప్రస్తావించారు.

రాష్ట్రపతితో రాజకీయాలు సరికాదు
రాష్ట్రపతితో కూడా రాజకీయాలు చేయాలనుకోవడం సరైనది కాదని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  బెంగాల్‌ పర్యటనలో రాష్ట్రపతిని టీఎంసీ అవమానించింది. టీఎంసీ హద్దు మీరి ప్రవర్తిస్తోంది’ అని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement