పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా | West Bengal Governor Cv Ananda Bose Resigns | Sakshi
Sakshi News home page

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా

Mar 5 2026 7:51 PM | Updated on Mar 5 2026 8:35 PM

West Bengal Governor Cv Ananda Bose Resigns

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. బెంగాల్‌ గవర్నర్‌గా ఆయన మూడున్నరేళ్లు పనిచేశారు. అయితే, రాజీనామాకు గల కారణాలు మాత్రం ఆయన తెలపలేదు. బెంగాల్‌ కొత్త గవర్నర్‌గా తమిళనాడు గవర్నర్‌ రవిని కేంద్రం నియమించింది.

వ్యక్తిగత నిర్ణయంతోనే తాను రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. గవర్నర్ కార్యాలయంలో తాను తగినంత సమయం గడిపానన్న ఆనంద బోస్‌.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ పీటీఐకి ఆయన తెలిపారు. 2022లో గవర్నర్‌గా ఆనంద బోస్‌.. బాధ్యతలు చేపట్టారు.

సుమారు మూడున్నరేళ్ల పాటు తన సేవలను అందించారు. ఆనంద బోస్‌ రాజీనామా షాక్‌కు గురిచేసిందని మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. ఆయన రాజీనామా వెనుక గల కారణాలు ప్రస్తుతానికి తనకు తెలియవన్నారు. ఆర్ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి తనకు ఇప్పుడే తెలియజేశారంటూ ఎక్స్‌లో ఆమె పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement