governor
-
‘డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం’
సాక్షి,విశాఖ: యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. విశాఖలో మంగళవారం బొత్స మీడియాతో మాట్లాడారు.‘డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. వ్యవస్థను కూటమి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పదివేల ఉద్యోగాలు భర్తీ చేశామ’ని గుర్తు చేశారు. -
ట్రాఫిక్ ఆపేశారని.. గవర్నర్ కాన్వాయ్ వస్తుంటే అడ్డుగా కూర్చొని..
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ వాహనదారులను ఎంతగా సమస్యలకు గురి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. దానికి తోడు వీఐపీ కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎవరూ అడ్డురాకుండా ట్రాఫిక్‌ను ఆపేస్తుంటారు. ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ వ్యక్తి నిరసన తెలిపాడు. ఇండియా ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ వ్యక్తి గాంధేయ మార్గంలో నిరసన తెలిపాడు. గర్భిణీ అయిన తన భార్యతో కారులో అతడు ప్రయాణిస్తున్న సమయంలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్.. మోటర్కేడ్ వెళ్లేందుకు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డును పోలీసులు ఖాళీ చేయించారు. ఆ సమయంలో మిగతా వైపుల ఉన్న రోడ్లపై వాహనాలను ముందుకు వెళ్లనివ్వలేదు. చాలా సేపు ఆలస్యం కావడంతో ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిరసనగా అతడు రోడ్డుకు మధ్యలో కూర్చున్నాడు. ఎంత చెప్పినా అక్కడి నుంచి కదల్లేదు. సాధారణ పౌరుడి సమయం కూడా రాజకీయ నాయకుడి సమయంతో సమానంగా విలువైనదేనని వాదించాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో అతడు వాగ్వివాదానికి దిగాడు.వారి మధ్య జరిగిన సంభాషణనిరసన తెలిపిన వ్యక్తి: "నా భార్య గర్భిణీ. మాకూ పనులు ఉంటాయి కదా?"ట్రాఫిక్ పోలీసులు: "పక్కకు జరగండి. అక్కడ నిలబడండి"వ్యక్తి: "నా భార్య గర్భిణీ. సిగ్నల్ ఎందుకు ఆపేశారు? గవర్నర్ వీఐపీ అయినంత మాత్రాన మాకు విలువ లేదా?"ట్రాఫిక్ పోలీసులు: "మీరు కూడా వీఐపీనే. ఇప్పుడు లేచి పక్కకు వెళ్లండి. లేస్తారా లేదా?"వ్యక్తి: "లేవను"ట్రాఫిక్ పోలీసులు: "లేస్తారా లేదా?"వ్యక్తి: "లేవను"కాన్వాయ్ చివరకు జనంతో నిండిన రహదారి పక్క నుంచి వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఆ గొడవ ఎలా ముగిసింది, ఆ వ్యక్తి అక్కడి నుంచి ఎలా వెళ్లిపోయాడు అన్న విషయం స్పష్టంగా తెలియలేదు.ఈ ఘటన "వీఐపీ సంస్కృతి"పై పెరుగుతున్న అసంతృప్తిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో స్పందించారు. అధికారిక విధివిధానాల్లో మంత్రులు, అధికారులు, వ్యయ నియంత్రణ పాటించాలని, అధికార ప్రదర్శన కంటే సాదాసీదా విధానం, సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచించారు.Traffic stopped for 30 minutes in Bengaluru for Governor’s VVIP movement.A man carrying his pregnant wife to the hospital was stuck and sat in protest.99% of us do not even know who the Governor of Karnataka is but the city traffic is halted every-time he passes by.This…— Roshan Rai (@RoshanKrRaii) June 1, 2026 -
తిరువళ్లువర్ ‘కాషాయ’ కలకలం
చెన్నై: ప్రాచీన తమిళ మహాకవి, తత్వవేత్త తిరువళ్లువర్ చిత్రపటాన్ని కాషాయ వ్రస్తాల్లో చిత్రీకరించడం వివాదాస్పదంగా మారింది. వైకాశి అనుషం వేడుకల సందర్భంగా మే 30వ తేదీన లోక్ భవన్లో కాషాయ వ్రస్తాల్లో ఉన్న తిరువళ్లువర్ చిత్రపటానికి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నివాళులర్పించారు. దీనిపై అధికార తమిళగ వెట్రి కళగం, విపక్ష డీఎంకేసహా పలు పారీ్టలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అధికారికంగా గుర్తించిన తిరువళ్లువర్ చిత్రంలో ఆయన తెల్లని వస్త్రం ధరించి కనిపిస్తారు. దానికి బదులుగా లోక్‌భవన్‌లో నివాళులర్పించిన చిత్రాన్ని తిరువళ్లువర్ కాషాయ రంగు వస్త్రం ధరించినట్లు చిత్రీకరించడంతో వివాదం రేగింది. ఈ ఘటనపై తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అరుణ్‌రాజ్ తీవ్రంగా స్పందించారు. మహాకవిని కాషాయ వ్రస్తాలలో ప్రదర్శించడాన్ని ఖండించారు. ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తను ఒక సంకుచిత గుర్తింపులో బంధించే ఏ ప్రయత్నమైనా ఆయన విశ్వ దృష్టిని కించపరచడమేనని పేర్కొన్నారు. తిరువళ్లువర్ ఏ ఒక్క మతానికీ, కులానికీ, జాతికీ, దేశానికీ పరిమితమైన కవి కాదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి విజయ్ నిరంతరం మౌనంగా ఉండటం వల్లే గవర్నర్ కార్యాలయం తిరువళ్లువర్‌కు కాషాయ రంగు వేయడానికి సాహసించిందని డీఎంకే అగ్రనేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. లోక్ భవన్‌ను కాషాయమయంగా మార్చడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరువళ్లువర్‌కు కాషాయ రంగు అద్దడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా తిరువళ్లువర్ దినోత్సవాన్ని జనవరిలో నిర్వహిస్తుందని గుర్తుచేశారు. మరి వైకాశి అనుషం రోజు నిర్వహించడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. డీఎంకే పాలనలో అప్పటి గవర్నర్ ఇలాంటి ప్రయత్నమే చేసినప్పుడు తాము తీవ్రంగా వ్యతిరేకించామని చెప్పారు. ఇప్పుడు మరోసారి తమిళ ప్రజల ఆత్మగౌరవాన్ని పరీక్షిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ చర్యను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తదితరులు ఖండించారు. -
కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం
-
కేరళ అసెంబ్లీలో బీజేపీ వర్సెస్ సతీశన్-విజయన్!
కేరళ రాజకీయాల్లో మరోసారి “వందేమాతరం” వివాదం చెలరేగింది. కొత్త అసెంబ్లీ సమావేశాల తొలి రోజే జాతీయ గీతం ఆలాపన చుట్టూ మొదలైన వివాదం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. గవర్నర్ సమక్షంలో పూర్తి “వందేమాతరం” వినిపించాల్సిన కేంద్ర మార్గదర్శకాలను పాటించలేదంటూ బీజేపీ మండిపడుతుండగా.. ఇది ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న సంప్రదాయమేనని ప్రభుత్వం సమర్థించుకోవడం, దానికి ప్రధాన ప్రతిపక్షం మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.తిరువనంతపురంలోని అసెంబ్లీలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రసంగానికి ముందు “వందేమాతరం”లో తొలి రెండు చరణాలనే ఆలపించారు. అయితే 2026 ఫిబ్రవరిలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాల్లో పూర్తి ఆరు చరణాలు వినిపించాలని సూచించిందని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై గవర్నర్ అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ షమ్షీర్ దృష్టికి ప్రోటోకాల్ అంశాన్ని తీసుకెళ్లారు.VIDEO | Thiruvananthapuram: Kerala Governor Rajendra Vishwanath Arlekar on truncated 'Vande Mataram' being reportedly played ahead of his address in the state Assembly, says, "What we had insisted that there has to be, whenever Governor is present, it is the protocol, you are… pic.twitter.com/liuZK9IBsx— Press Trust of India (@PTI_News) May 29, 2026అయితే ఈ వ్యవహారంపై కేరళ ప్రభుత్వం మాత్రం ఇది కొత్త విషయం కాదని స్పష్టం చేసింది. అసెంబ్లీలో గతం నుంచే “వందేమాతరం”లో తొలి రెండు చరణాలనే ఆలపిస్తున్న సంప్రదాయం కొనసాగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత పినరయి విజయన్ కూడా ప్రభుత్వ వైఖరినే సమర్థించారు. పూర్తి “వందేమాతరం” ఆలాపన తప్పనిసరి కాదని, 2026 మార్చిలో సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. దీంతో ఇది కేవలం ప్రోటోకాల్ వివాదమా? లేక రాజకీయ సంకేతమా? అన్న చర్చ మొదలైంది.ఇక బీజేపీ నేతలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. “వందేమాతరం”కు 150 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఇలా చేయడం జాతీయ గీతానికే అవమానమని విమర్శించారు. గవర్నర్‌ను, లోక్‌భవన్‌ను, జాతీయ వారసత్వాన్ని కూడా అవమానించినట్లేనని ఆరోపించారు. అంతేకాదు.. ప్రభుత్వం జమాత్-ఏ-ఇస్లామీ, సీపీఎం అభిప్రాయాలకు తలొగ్గుతోందంటూ ఆరోపణలు గుప్పించారు.ചരിത്രത്തിൽ ആദ്യമായി കേരള നിയമസഭയിൽ❤️ വന്ദേ മാതരം ❤️For the first time in history, “Vande Mataram” was sung in the Kerala Legislative Assembly.🔥🔥 pic.twitter.com/f0URhQmPGd— ശിവ (@Rathees19362122) May 29, 2026మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వివాదం తలెత్తడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ 102 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి అసెంబ్లీలో “వందేమాతరం” ఆలాపన కూడా చారిత్రక పరిణామమేనని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. 1957 తర్వాత ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. “వందేమాతరం”లో ఎన్ని చరణాలు పాడాలి అనే అంశం ఇప్పుడు కేరళలో రాజకీయ, సాంస్కృతిక, రాజ్యాంగ చర్చకు దారితీసింది. -
‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి’
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంతో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాల కు కనెక్టివిటీ నీ కేంద్ర ప్రభుత్వం పెంచిందని తద్వారా ఈశాన్య రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలకు మరింతగా సాంస్కృతికంగా చేరువయ్యాయని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్-యువ సంగమ్ ఫేజ్-6’ కార్యక్రమంలో భాగంగా మేఘాలయ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) షిల్లాంగ్‌కు చెందిన 50 మంది విద్యార్థులు గురువారం లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. దేశంలోని విభిన్న రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానాల పరస్పర అవగాహన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.యువత దేశ సమైక్యత, జాతీయ సమగ్రత బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అభివృద్ధి విశేషాలను విద్యార్థులకు అధికారులు వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్, ఎన్ఐటీ వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్ కిరణ్ కుమార్, సునీల్ కుమార్, ప్రొఫెసర్ పెరుగు శ్యామ్ (కో-నోడల్ ఆఫీసర్), ప్రొఫెసర్ హరిప్రసాద్ రెడ్డి (నోడల్ ఆఫీసర్) పాల్గొన్నారు.గవర్నర్‌ను కలిసిన ఎన్ఎస్జీ గ్రూప్ కమాండర్నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), ముంబై 28 స్పెషల్ కాంపోజిట్ గ్రూప్ (ఎస్సీజీ) గ్రూప్ కమాండర్ కల్నల్ అభిషేక్ సింగ్ గురువారం లోక్ భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. -
నిన్న తమిళనాడు.. ఇవాళ కర్ణాటకలో ‘గవర్నర్ ట్విస్ట్’
కర్ణాటకలో సీఎం మార్పు చుట్టూ ఇప్పటికే రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరగా.. ఇప్పుడు గవర్నర్ ఎంట్రీ మరో కొత్త ట్విస్ట్‌కు దారి తీసింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేసే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ.. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వ్యక్తిగత పనులపై ముంబై వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. సీఎం కార్యాలయం ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం రావడం.. మరోవైపు గవర్నర్ తిరుగు ప్రయాణ టికెట్ కూడా ఇంకా బుక్ చేయలేదన్న వార్తలు బయటకు రావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం గవర్నర్ అందుబాటులో లేకపోయినా సిద్దరామయ్య రాజీనామా చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ కార్యదర్శిని కలిసి రాజీనామా లేఖ సమర్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. రాజీనామా ప్రక్రియ, తదుపరి ప్రభుత్వ ఏర్పాటు, డీకే శివకుమార్‌కు ఆహ్వానం వంటి అంశాల్లో ఆలస్యం జరిగితే రాజకీయంగా కొత్త సంక్షోభం తలెత్తొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్దరామయ్య-డీకే శివకుమార్ మధ్య అధికార సమీకరణాలపై గత కొన్ని నెలలుగా అంతర్గత పోరు కొనసాగుతోంది. అలాంటి సమయంలో గవర్నర్ అందుబాటులో లేకపోవడం, నిర్ణయాల్లో జాప్యం జరగడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.ఇక్కడే మరో ఆసక్తికర పోలిక కూడా తెరపైకి వస్తోంది. ఇటీవల తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ వ్యవహారించిన తీరు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు వెంటనే ఆహ్వానం ఇవ్వకుండా, పూర్తి మెజారిటీ లేదంటూ పలుమార్లు ఆలస్యం చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.ఇప్పుడు కర్ణాటకలో కూడా అలాంటి రాజకీయ హైడ్రామా చోటుచేసుకునే అవకాశాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. గవర్నర్ వ్యవస్థను రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోందంటూ కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నాయి. కర్ణాటకలో కూడా అదే తరహా వ్యూహం అమలు చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఒకవేళ సీఎం మార్పు ప్రక్రియలో ఆలస్యం జరిగితే.. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో డీకే శివకుమార్ వర్గం, సిద్దరామయ్య వర్గం మధ్య అసంతృప్తులు మరింత పెరిగే అవకాశమూ కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే.. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఎప్పుడు తిరిగి వస్తారు? సిద్దరామయ్య నిజంగా ఎప్పుడు రాజీనామా చేస్తారు? డీకే శివకుమార్‌కు సీఎం బాధ్యతలు అప్పగింపు ఎప్పుడు జరుగుతుంది? అనే దానిపైనే నిలిచింది. కర్ణాటక రాజకీయాల్లో ఇప్పటికే వేడెక్కిన పవర్ గేమ్‌కు ఇప్పుడు ‘గవర్నర్ ట్విస్ట్’ మరింత హీట్ పెంచింది. -
ప్రధాని బాటలో కేరళ గవర్నర్.. వీఐపీ కల్చర్‌కు చెక్!
తిరువనంతపురం: సాధారణంగా వీఐపీల ప్రయాణం అంటే భారీ కాన్వాయ్, సైరన్ల మోతతో మార్మోగిపోతుంది. అయితే పెరుగుతున్న ఇంధన ఖర్చులను అరికట్టేందుకు, పర్యావరణ పరిరక్షణకు ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఆదర్శంగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దిశగా కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తన అధికారిక కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించి, అందరి దృష్టిని ఆకర్షించారు.మంత్రివర్గ ప్రమాణస్వీకారం నుంచే అమలుప్రభుత్వ కార్యకలాపాల్లో ఇంధన వినియోగాన్ని వీలైనంత తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాజ్ భవన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ అధికారిక కాన్వాయ్ వాహనాల సంఖ్యను తొమ్మిది నుంచి ఆరుకు కుదించారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సహా ఇకపై జరిగే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఈ నిబంధన తక్షణం అమల్లోకి రానుందని అధికారులు తెలిపారు. ఒకేసారి మూడో వంతు వాహనాలను తగ్గించడం ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.ఏయే వాహనాలకు కోత పడిందంటే?అధికారిక వర్గాల తాజా సమాచారం ప్రకారం, గవర్నర్ కాన్వాయ్ నుండి ఒక ఎస్కార్ట్ వాహనాన్ని, అలాగే రెండు స్టాండ్ బై (అదనపు) వాహనాలను పూర్తిగా తొలగించారు. మారిన తాజా ప్రోటోకాల్ ప్రకారం ఇకపై ఆయన పర్యటనల్లో కేవలం ఆరు వాహనాలు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వ లాజిస్టిక్స్‌లో అనవసరమైన ఇంధన వృథాను అరికట్టేందుకు తీసుకున్న ఈ నిర్ణయం అధికార యంత్రాంగానికి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఇలాంటి పొదుపు చర్యలను రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా విస్తృతంగా ప్రోత్సహిస్తున్నారు.దేశవ్యాప్తంగా మారుతున్న ట్రెండ్వీఐపీల కాన్వాయ్ కుదింపు అనేది ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక కొత్త ట్రెండ్ గా మారుతోంది. గతంలో ప్రధాని మోదీ స్వయంగా తన కాన్వాయ్ సైజును తగ్గించుకోవడమే కాకుండా, ఎలక్ట్రిక్ పైలట్ వాహనాలను ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచారు. ఇదే బాటలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా తన భద్రతా వాహనాలను కుదించారు. మరోవైపు సుప్రీంకోర్టు సైతం పర్యావరణ పరిరక్షణ, లాజిస్టిక్ ఖర్చుల నియంత్రణ కోసం డిజిటల్ విచారణలు, కార్ పూలింగ్ విధానాలను ప్రోత్సహిస్తోంది. ఈ సస్టైనబిలిటీ ప్రయత్నాలకు ఇప్పుడు కేరళ గవర్నర్ కూడా తమ మద్దతు తెలిపారు.ఇది కూడా చదవండి: మనీలాండరింగ్ కేసు: రాబర్ట్ వాద్రాకు భారీ ఉపశమనం -
విజయ్ కి అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్
-
తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్‌లు
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. కేరళం పర్యటనను గవర్నర్ రద్దు చేసుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే, విజయ్‌కు గవర్నర్ తొలుత.. అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో లోక్‌భవన్‌కు వచ్చిన విజయ్.. వెనుదిరిగారు. కేరళంకు వెళ్లడానికి సిద్ధమైన గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో విజయ్‌కు సమయం ఇవ్వలేదు.విజయ్ కంటే ముందుగా లోక్‌భవన్‌కు సీపీఎం నేతలు చేరుకోగా.. వారిని కూడా లోక్‌భవన్ సిబ్బంది వెనక్కి పంపించారు. అయితే, చివరి క్షణంలో గవర్నర్ తన మనస్సు మార్చుకున్నారు. కేరళం పర్యటనను రద్దు చేసుకున్నారు. విజయ్‌కు అపాయింట్మెంట్ ఇచ్చారు. టీవీకేకు వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీసీకే నుంచి మద్దతు లేఖ కూడా టీవీకే బృందం అందుకుంది. దీంతో వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది.ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్‌కు ఎమ్మెల్యేల మద్దతు 121కి చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. వీసీకే, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేయడానికి.. మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ను విజయ్ కోరారు. ఇవాళ(శనివారం) సాయంత్రం గవర్నర్‌ను కలిసిన విజయ్.. తనకు మద్దతు ఇస్తున్న వారి పేర్లతో లేఖను అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంటీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. రేపు(మే 10, ఆదివారం) నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు జాబితా గవర్నర్‌కు అందజేశారు. -
తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో లోక్‌భవన్‌కు వచ్చిన విజయ్.. మళ్లీ వెనుదిరిగారు. కేరళకు వెళ్తున్న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్.. విజయ్‌కు సమయం ఇవ్వలేదు. గవర్నర్‌కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో విజయ్‌కు సమయం ఇవ్వలేదు. విజయ్ కంటే ముందుగా లోక్‌భవన్‌కు సీపీఎం నేతలు చేరుకోగా.. వారిని కూడా లోక్‌భవన్ సిబ్బంది వెనక్కి పంపించారు.టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగాయన్న సంబరపడిన లోపే గవర్నర్.. విజయ్‌కు మరో షాక్ ఇచ్చారు. ఈ ట్విస్టులు కొనసాగుతుండగా.. గవర్నర్ తన మనసు మార్చకున్నారు. తన కేరళం పర్యటనను రద్దు చేసుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. గవర్నర్‌కు కలిసిన విజయ్.. 121 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందించారు.టీవీకేకు వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీసీకే నుంచి మద్దతు లేఖ కూడా టీవీకే బృందం అందుకుంది. దీంతో వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్‌కు ఎమ్మెల్యేల మద్దతు 121కి చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. -
విజయ్‌కి ఛాన్స్ : కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమిళనాడులో అనూహ్యం సాగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం స్పందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీని ఆహ్వానించాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ని కోరారు. అసెంబ్లీలో 108 స్థానాలు గెలుచుకుని, టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.విజయ్‌కు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ పూర్తి కాని నేపథ్యంలో వాతావరణం వేడెక్కింది. మరోవైపు నటుడు విజయ్ తమిళనాడు సీఎం కావడం ఖాయం అనుకుంటున్న తరుణంలో గవర్నర్ నిర్ణయాలు వివాదంగా మారాయి. మొదట ప్రభుత్ ఏర్పాటుకు ఆహ్వానించి, ఆ తరువాత శరవేగంగామారుతున్న గవర్నర్ నిర్ణయాలను ఇప్పటికే పలువురు నేతలు, రాజకీయ నిపుణులు తప్పుబట్టారు. బీజేపీ డైరెక్షన్లోనే గవర్నర్ పనిచేస్తున్నారని, రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల పూర్తి వివరాలను సమర్పించాలని గవర్నర్ కోరడంపై టీవీకే నాయకులు కూడా మండిపడు తున్నారు.சட்டமன்றத் தேர்தலில் எந்த அரசியல் கூட்டணிக்கும் அல்லது அரசியல் கட்சிக்கும் தனிப் பெரும்பான்மை கிடைக்கவில்லை என்றால், ஆளுநரின் கடமை என்ன? சட்டமன்ற உறுப்பினர்களின் எண்ணிக்கை அடிப்படையில் முதன்மைக் கட்சியின் தலைவரை ஆட்சி அமைக்க அழைக்க வேண்டும்.இது தான் அரசியல் விதி. இது தான்…— P. Chidambaram (@PChidambaram_IN) May 8, 2026తాజాగా ఈ వివాదంపై స్పందించిన చిదంబరం కీలకవ్యాఖ్యలు చేశారు. 108 స్థానాలు గెలుచుకున్న టీవీకే అత్యంత పెద్ద పార్టీగా అవతరించింది, పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, అతిపెద్ద పార్టీ నాయకుడిని (విజయ్) తొలుత ఆహ్వానించడం గవర్నర్ బాధ్యత అని చిదంబరం పేర్కొన్నారు. అంతేకాదు మెజారిటీని నిరూపించుకోవాల్సింది లోక్ భవన్లో కాదు, అసెంబ్లీ వేదికగా అని చిదంబరం స్పష్టం చేశారు. దీనిపై ఎస్.ఆర్. బొమ్మై కేసులో 1994 సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆయన ఉదహరించారు. సంఖ్యాబలం ఆధారంగా మెజారిటీ నిరూపించుకునే అవకాశం విజయ్‌కు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా తమిళ రాజకీయ పక్షాలు ఈ నిబంధనను నొక్కి చెప్పడాన్ని ఆయన అభినందించారు.ఇదీ చదవండి : వరుడు అనూహ్య మరణం, పెద్దల షాకింగ్ నిర్ణయంకాగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన కనీస మెజారిటీ మార్కుకు టీవీకే కూటమి స్వల్ప దూరంలో ఉంది. కాంగ్రెస్ మద్దతోతో టీవీకే బలం ఇపుడు (టీవీకే-108, కాంగ్రెస్-5) 113 చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే ఈ కూటమి ఇంకా 5 స్థానాల కావాల్సి ఉంది. ఇదీ చదవండి: హంటా వైరస్ కలకలం : బాధితుల్లో ఇద్దరు భారతీయులు -
తమిళనాడులో రాష్ట్రపతి పాలన? లేకుంటే..
దేశం మొత్తం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తోంది. ఒక అగ్రనటుడు పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పూర్తి బలం లేకున్నా ప్రభుత్వ ఏర్పాట్లకు ప్రయత్నించడం.. మ్యాజిక్ ఫిగర్ లేదంటూ గవర్నర్ అందుకు అనుమతించకపోవడం విమర్శలకూ తావిచ్చింది. ఈ తరుణంలో తమిళనాడులో మే 10 దాటితే ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో.. విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ 118.. అంటే ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 స్థానాలు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్ తన ఐదుగురు ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించింది. విజయ్ రెండు చోట్ల పోటీ చేసి నెగ్గడంతో.. ఇంకో సీటు అదనంగా అవసరం కానుంది. అంటే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే సరిపోతుందన్నమాట.ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఆ తర్వాత బలనిరూపణ చేసుకుంటామని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు విజయ్ రెండుసార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో.. ఇలాంటి సందర్భాల్లో గవర్నర్లు సానుకూలంగా వ్యవహరించిన సందర్భాలే అధికంగా ఉన్నాయి. కానీ, తమిళనాడు విషయంలోనే గవర్నర్ ఆర్లేకర్ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి బలం చూపించాకే సీఎంగా ప్రమాణం చేయాలని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని విజయ్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో..విజయ్‌కు ఇతర పార్టీల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో.. తమిళనాడు 16వ అసెంబ్లీ గడువు ముగియడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈలోపు ప్రభుత్వ ఏర్పాటు అంశం కచ్చితంగా ఓ కొలిక్కి రావాలని లేదు. కాకుంటే గవర్నర్ తన విశిష్ట అధికారాల్ని (Discretionary Powers) ఉపయోగించే అవకాశమూ లేకపోలేదు. ఒకటి.. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేదాకా కొనసాగమని కోరడం.. రెండోది టీవీకేను పక్కనపెట్టి ఇతర కూటములను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడం.. మూడోది రాష్ట్రపతి పాలన విధించే అవకాశం!.తమిళనాడులో గతంలో నాలుగుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. కరుణానిధి హయాంలో 1976 జనవరి నుంచి 516 రోజులపాటు, ఎంజీఆర్ సీఎంగా ఉన్న టైంలో 1980 ఫిబ్రవరి నుంచి 113 రోజులపాటు, 1988లో ఎంజీఆర్ మరణాంతరం ఆయన సతీమణి జానకీ సీఎంగా ఉన్నప్పుడు 363 రోజులపాటు, చివరగా.. 1991లో కరుణానిధి హయాంలో 145 రోజులపాటు రాష్ట్రపతి పాలన విధించారు.రాజకీయ విశ్లేషకులు చెబుతోంది ఏంటంటే.. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధించాలనే కచ్చితమైన రూల్ రాజ్యాంగంలో లేదు. కాకుంటే.. మెజారిటీ నిరూపించలేకపోయినా.. ప్రభుత్వం ఏర్పడకపోయినా "రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది" అని కారణాన్ని చూపిస్తూ కేంద్రానికి గవర్నర్ నివేదిక పంపే అవకాశం ఉంది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడవడం లేదని/ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం కొనసాగడం అసాధ్యమని కేంద్రం భావిస్తే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఆ అవకాశం లేకపోలేదు.సాధారణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ముందుగా అవకాశం ఇవ్వడం ఒక సంప్రదాయం. అయినప్పటికీ, అది రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉండదు. గవర్నర్ తన నిర్ణయాన్ని మెజారిటీ నిరూపణ ఆధారంగా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. అయితే తాజా తమిళనాడు ఎపిసోడ్ నేపథ్యంలో.. గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు అప్పుడు గవర్నర్లు రాష్ట్రపతి పాలనకు సిఫార్సులు చేసిన సందర్భాలు ఉన్నాయి.1996లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 174 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ టైంలో మేజిక్ ఫిగర్ 213. బీజేపీకి అది సాధ్యం కాలేదు. ఏ కూటమి కూడా మెజారిటీ సాధించలేకపోవడంతో అప్పటి గవర్నర్ రాష్ట్రపతి పాలన కొనసాగించారు(ఎస్పీ-బీఎస్పీ కూటమి కూలిపోవడంతో 1995లోనే గవర్నర్ మోతీలాల్ వోరా రాష్ట్రపతి పాలన విధించారు). ఆ తర్వాత ఏడాదికి బీజేపీ-బీఎస్పీ కూటమి ఏర్పడి మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కేసు.. ఇక్కడ ఒక పార్టీ అత్యధిక సీట్లు గెలుపొందడం ముఖ్యం కాదు అని చెప్పింది. ఇక.. 2005 బీహార్ ఎన్నికల్లోనూ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే ఒకవైపు కూటమి ప్రయత్నాలు జరుగుతుండగానే అప్పటి గవర్నర్ బూటా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదటి సమావేశం జరగకముందే ఆ అసెంబ్లీని రద్దు చేసి.. ‘‘హార్స్ ట్రేడింగ్ జరుగుతోంది’’ అని కేంద్రానికి నివేదిక పంపి రాష్ట్రపతి పాలన విధించారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరడం.. గవర్నర్ వ్యవహరించిన తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టడం.. అది రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయమని.. గవర్నర్ అధికారాలను పరిమితం చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగాయి. అయితే అప్పటికే ఎన్నికల తేదీలు ప్రకటించడంతో కోర్టు ఈ వ్యవహారంలో జోక్యం ఇక్కడికే పరిమితం చేసింది.విజయ్ పార్టీ (TVK) అత్యధిక స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ మెజారిటీకి కావలసిన 118 సీట్లు దాటలేకపోవడంతో గవర్నర్ మద్దతు లేఖలు కోరుతున్నారు. ఆయన అడిగిన దాంట్లో తప్పుందని కూడా అనలేం. 2006లో డీఎంకేకు 96 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ, మిత్రపక్షాల మద్దతు లేఖలతో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకొచ్చింది. మెజారిటీ ఉండడంతో గవర్నర్ అందుకు అనుమతించారు. ఆ తర్వాత బలనిరూపణలో ప్రభుత్వం నెగ్గింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన ఒక అత్యవసర పరిస్థితిలో మాత్రమే అమలు చేసే చర్య. ప్రస్తుత తమిళనాడు విషయంలో గవర్నర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే వివాదాలకు దారి తీసే అవకాశం కూడా. గవర్నర్ నివేదికలు, ఆర్టికల్ 356 వినియోగం.. కోర్టు సమీక్షకు లోబడి ఉండాలని గతంలో న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. అలాగే ఎన్నికల ద్వారా వచ్చిన అసెంబ్లీని రద్దు చేయడం అత్యంత అసాధారణం కూడా. ఒకవేళ.. తమిళనాడు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ గనుక ఏదైనా అసాధారణ నిర్ణయం తీసుకుంటే టీవీకే పార్టీ సుప్రీం కోర్టు తలుపు తట్టే అవకాశం లేకపోలేదు. -
తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్
టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు వీసీకే అంగీకారం తెలిపింది. లెఫ్ట్, వీసీకే మద్దతుతో విజయ్‌కు పూర్తి మెజార్టీ దక్కింది. ఉదయం ఎమ్మెల్యేలతో చర్చించిన విజయ్ .. అనంతరం వీసీకేతో మద్దతు కోరగా అందుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను విజయ్ మరోసారి కలిశారు. తమకు పూర్తి సంఖ్యాబలం ఉందన్న విజయ్.. అందుకు సంబంధించిన మద్దతు పత్రాలను గవర్నర్‌కు సమర్పించారు. ఈ క్రమంలో మరో బిగ్‌ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సిందిగ్ధంలోక్భవన్ కొత్త మెలికవిజయ్కు 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందన్న లోక్భవన్వీసీకే, ఐయూఎంలు తమ మద్దతు లేఖలు ఇవ్వలేదన్న లోక్భవన్తద్వారా విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంపై టెన్షన్ వాతావారణంరేపే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం రేపు ఉదయం 11గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారంరేపే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారంటీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతితమిళనాడు గవర్నర్‌తో ముగిసిన టీవీకే చీఫ్ భేటీ ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్ అనుమతి తమిళనాడులో కొలువు దీరనున్న విజయ్ సర్కార్గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్ మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేత లోక్‌భవన్‌కు బయల్దేరిన టీవీకే అధినేత విజయ్ లోక్‌భవన్‌కు బయల్దేరిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన మెజార్టీ ఉందని చెప్పనున్న విజయ్ సీపీఐ,సీపీఎం,వీసీకే మద్దతుతో 118కి చేరిన సంఖ్యాబలంలోక్భవన్లో గవర్నర్ రాజేంద్రకు 118 ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించనున్న విజయ్గవర్నర్తో భేటీ ముగిసిన అనంతరం సీపీఎం,సీపీఐ,వీసీకే కార్యాలయాలకు వెళ్లనున్న విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకై మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు చెప్పనున్న టీవీకే అధినేత విజయ్ కోసం కాన్వాయ్ సిద్ధంలోక్భవన్కు చేరుకున్న ప్రభుత్వ కాన్వాయ్మొన్న విజయ్‌కు కాన్వాయ్ ఇవ్వడంపై గవర్నర్ ఆగ్రహంమద్దతు లేఖ ఇచ్చాక అదే కాన్వాయ్‌లో వెళ్లనున్న విజయ్టీవీకేకు కాంగ్రెస్ కండీషన్మతతత్వ పార్టీతో కలొద్దని కాంగ్రెస్ షరతుతిరుచ్చి ఈస్ట్ సీటు, మంత్రి పదవి ఇవ్వాలని వీసీకే కండీషన్టీవీకేకు బేషరతు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయంకేవలం మద్దతు మాత్రమే ఇవ్వాలని సీపీఎం నిర్ణయంటీవీకేకు వామపక్షాల మద్దతుమద్దతు లేఖను టీవీకేకు అందజేసిన వామపక్షాలువీసీకే, వామపక్షాలకు కేబినెట్ బెర్త్లువీసీకే, సీపీఎం, సీపీఐకి చెరో మంత్రి పదవి దక్కే చాన్స్కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశంటీవీకే ప్రధాన కార్యాలయం వద్ద సందడిమెజార్టీ మార్క్ దాటడంతో టీవీకే శ్రేణుల సంబరాలుచెన్నైలోని లెఫ్ట్ కార్యాలయానికి టీవీకే నేత నిర్మల్ కుమార్మద్దతు లేఖలను తీసుకోనున్న నిర్మల్‌కుమార్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్టీవీకే మద్దతుగా సీపీఎం, సీపీఐ, వీసీకేఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోనున్న టీవీకేకాంగ్రెస్-5, వామపక్షాలు-4, వీసీకే-2దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 118కి చేరనున్న టీవీకే సంఖ్యాబలంకాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్ మరోసారి గవర్నర్‌ను కలవనున్న విజయ్మరికాసేపట్లో లోక్‌భవన్‌కు వెళ్లనున్న విజయ్గవర్నర్తో భేటీకానున్న విజయ్ ఇదివరకే రెండుసార్లు గవర్నర్‌ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్ఇళంగోవన్ ఆసక్తికర వ్యాఖ్యలుఅన్నాడీఎంకేతో జట్టు ప్రచారంపై స్పందించిన డీఎంకే సీనియర్ నేత ఇళంగోవన్డీఎంకే.. అన్నాడీఎంకే రెండు ప్రధాన ప్రత్యర్థులుఈ రెండు కలవడం అసాధ్యంఇంక కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కుదిరే పని కాదులోక్భవన్.. మళ్లీ అదే ప్రకటనమ్యాజిక్ ఫిగర్‌తోనే ముందుకు రావాలని టీవీకే పార్టీకి లోక్‌భవన్ వర్గాల స్పష్టీకరణఎవరు ముందుకు వచ్చినా.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ సమ్మతిస్తారని వెల్లడిటీవీకే చేతులెత్తేస్తే.. డీఎంకే-అన్నాడీఎంకే కూటమికి చాన్స్?గవర్నర్ వ్యాఖ్యలు ఆ కోణంలోనే ఉన్నాయంటున్న టీవీకే-కాంగ్రెస్అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకి అవకాశం ఇవ్వకపోవడమేంటని సూటి ప్రశ్నలోక్భవన్ ముట్టడికి యత్నం.. పలువురు కార్యాకర్తల అరెస్ట్మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో టీవీకే ఆఖరి అస్త్రంగా.. గవర్నర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లే యోచన న్యాయ, రాజ్యాంగ నిపుణులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన టీవీకే అధినేత విజయ్‌మా మద్దతుపై రేపు ప్రకటన చేస్తాం: వీసీకేవిదుతలై చిరుతైగల్ కట్చి కీలక ప్రకటనతమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గిన వీసీకే పార్టీప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగస్వామిగా వీసీకేవిజయ్ పార్టీకి ప్రభుత్వ ఇచ్చే విషయంలో సస్పెన్స్ కంటిన్యూవీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌తో భేటీ అయిన టీవీకే నేత అధవ్ అర్జునఇవాళ సాయంత్రం వీసీకే పార్టీ హైలెవల్ సమావేశంమీటింగ్లో చర్చించి.. రేపు స్పష్టమైన ప్రకటన చేస్తామన్న తిరుమావళవన్ఇటు విజయ్.. అటు పళనితమిళనాడు రాజకీయాల్లో పూటకో ట్విస్టులుపార్టీ ముఖ్యనేతలతో భేటీ అయిన టీవీకే అధినేత విజయ్అటు పళనిస్వామి ఆధ్వర్యంలో అన్నాడీఎంకే సీనియర్ నేతల మీటింగ్వామపక్షాలు, వీసీకే నిర్ణయం కోసం ఇరు పార్టీలు ఎదురు చూపులుఆరుగురు సభ్యుల మద్దతు దొరికితే విజయ్ ప్రభుత్వం ఏర్పడినట్లేమద్దతు ఇవ్వకుంటే అన్నాడీఎంకే రంగంలోకి దిగే చాన్స్విజయ్కు అన్నాడీఎంకే మద్దతు ఇస్తుందా?.. లేకుంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు సొంతంగా చేస్తుందా? అనే ఉత్కంఠఅన్నాడీఎంకేలో విజయ్‌కు మద్దుతు ఇచ్చే అంశంపై చర్చ.. చీలిక కూడాడీఎంకే-అన్నాడీఎంకే కలుస్తాయంటూ రెండ్రోజులుగా ఊహాగానాలుసాయంత్రంకల్లా తమిళనాడు సస్పెన్స్‌కు తెర పడే చాన్స్శత్రువులు మిత్రులవుతున్నారుకాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలుడీఎంకే, అన్నాడీఎంకేలు కలుస్తున్నాయంటూ వ్యాఖ్యశత్రువులు మిత్రులవుతున్నారువిజయ్ను అడ్డుకునేందుకు ఒక్కటవుతున్నారుడీఎంకే, అన్నాడీఎంకేలు బీజేపీకి బీ టీంలుతమిళనాడు మరో బిగ్ ట్విస్ట్!తెరపైకి సీఎం అభ్యర్థిగా సూపర్ స్టార్ రజనీకాంత్డీఎంకే సపోర్ట్‌తో రజనీకాంత్ ను ముఖ్యమంత్రి చేసేందుకు సన్నాహాలు...?అన్నాడీఎంకే కలిసి వస్తే రజనీకాంత్ తమిళనాడుకు కాబోయే సీఎం ..?రహస్యంగా పావులు కదుపుతున్న డీఎంకే అధినేత స్టాలిన్రజనీకాంత్ సీఎం అయితే రాష్ట్రంలో అల్లర్లు ఉండవని అంచనాఎడపాటి పళనిస్వామిని స్పీకర్‌గా ఎన్నుకునే అవకాశంమొన్న స్టాలిన్ ఇంటికి రజనీకాంత్ వెళ్ళారు..నిన్న రజనీకాంత్ ఇంటికి వెళ్లిన డీఎంకే సీనియర్ నేత వేలునేడు మళ్లీ రజనీకాంత్ ను కలవనున్న ఇరు పార్టీ నేతలుటీవీకే కీలక భేటీటీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో కీలక సమావేశంసమావేశానికి హాజరైన నూతన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశంప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు.. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలపై చర్చదేనికైనా సిద్ధంగా ఉండాలని పిలుపుఅన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందిఅన్నాడీఎంకే ఎంపీ తంబిదురై సంచలన వ్యాఖ్యలుతమిళ ప్రజలు అన్నాడీఎంకే సర్కార్‌ను కోరుకుంటున్నారు: తంబిదురైమేం అధికారంలోకి వస్తాం: తంబిదురైచెన్నైలో ఉద్రిక్తత!తమిళనాడు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ తీరుపై టీవీకే అసహనంప్రజలు విజయ్‌కు పట్టం కడితే.. సీఎం కాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలోక్భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన టీవీకే కార్యకర్తలుఅదుపులోకి తీసుకున్న పోలీసులులోక్భవన్తో పాటు చెన్నైలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణంపళని ఏం చేస్తారో?తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంనేడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తో పళనిస్వామి భేటీనిన్ననే అపాయింట్మెంట్ కోరిన అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీఇవాళ్టి మీటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠవిజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో చీలికబీజేపీ పొత్తు తెంచుకుని.. విజయ్‌కు మద్దతు ఇద్దామంటున్న షణ్ముగం నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గంవద్దని వారిస్తున్న పళనిస్వామిఅన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ జరిపిన పళనిస్వామిఎన్నికల్లో 47 సీట్లు నెగ్గిన అన్నాడీఎంకేతమ పార్టీ సభ్యుల సంతకాలను గవర్నర్‌కు సమర్పించే అవకాశంవిజయ్కు మద్దతు ఇస్తారా? ఎవరికీ మద్దతు ఉండదని చెబుతారా? లేదంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలేమైనా చేస్తారా? అనే ఉత్కంఠతమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై నేడు రానున్న స్పష్టతమ్యాజిక్ ఫిగర్ 118.. టీవీకే బలం 112 (107+కాంగ్రెస్ 5)కీలకంగా సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల నిర్ణయంతలో రెండేసి సీట్లు నెగ్గిన డీఎంకే కూటమి పార్టీలుస్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని కూటమి నేత స్టాలిన్ సూచనప్రభుత్వ ఏర్పాటునకు డీఎంకే అడ్డుపడబోదని స్టాలిన్ వ్యాఖ్యఇవాళ మూడు పార్టీల హైలెవల్ మీటింగ్లుమీటింగ్ల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై రానున్న స్పష్టతఇప్పటికే కమ్యూనిస్ట్ నేతలతో ఫోన్లో మాట్లాడిన విజయ్సానుకూలంగా స్పందించిన సీపీఐ!సాయంత్రం కల్లా రానున్న స్పష్టత118 మంది మద్దతుదారుల సంతకాలు చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటునకు అనుమతిస్తానని గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ స్పష్టీకరణఏం చేద్దాం?తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొందిన టీవీకే108 స్థానాలతో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేప్రభుత్వ ఏర్పాటునకు 10 సీట్ల దూరంకాంగ్రెస్ మద్దతుతో కాస్త పెరిగిన బలంఅయినా ప్రభుత్వ ఏర్పాటునకు అంగీకరించని గవర్నర్113 సరిపోదని.. 118 ఎమ్మెల్యేల సంతకాలతోనే ముందుకు రావాలని టీవీకేకు స్పష్టీకరణరెండు రోజుల్లో.. రెండుసార్లు కలిసినా ఇదే సమాధానంన్యాయనిపుణులతో చర్చించానని.. బలం చూపించాకే సీఎంగా ప్రమాణం చేయమని విజయ్‌కు గవర్నర్ సమాధానంనెంబర్ ముఖ్యమని.. ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానిస్తానని వ్యాఖ్యరాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న విజయ్మరోవైపు.. నెగ్గిన ఎమ్మెల్యేలతోనూ వరుస భేటీలుమద్దతు ఉంటుందా? ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందా? అనే దానిపై నేడు రానున్న స్పష్టతసంబంధిత వార్త: విజయ్‌కి షాక్.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలునేడు లోక్‌భవన్ ముట్టడిటీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నోగవర్నర్ అడ్డం పడుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపణలువిజయ్కు తమ ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించిన కాంగ్రెస్గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తీరుపై సీపీఐతో పాటు పలువురి ప్రముఖుల అసంతృప్తిగవర్నర్ తీరుకు నిరసనగా నేడు లోక్‌భవన్ ముట్టడికి పిలుపుచెన్నైలోని లోక్‌భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపుఆ మూడు ముందుకు వస్తేనే.. లెఫ్ట్ పార్టీల మద్దతు కోసం విజయ్ తీవ్ర ప్రయత్నంవిజయ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నానికి మాత్రమే మద్దతు ఇచ్చిన సీపీఐ(2)ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇస్తుందో లేదో లేని స్పష్టతమరోవైపు ఏ విషయం తేల్చని సీపీఎం(2)నేడు ఏ విషయం చెబుతామంటున్న వామపక్ష పార్టీలువీసీకే(2) పార్టీ నిర్ణయంపైనా ఉత్కంఠనేడు వీసీకే కీలక సమావేశం.. ఆ తర్వాతే మద్దతుపై స్పష్టత వచ్చే చాన్స్ఈ మూడు పార్టీలు మద్దతు ఇస్తే మద్దతు ఇస్తే.. విజయ్ సర్కార్‌కు లైన్ క్లియర్ఆ రెండూ కలిస్తే నేను అంగీకరించనుతమిళ రాజకీయాలపై నటుడు విశాల్ ఆసక్తికర పోస్ట్ఆ రెండూ కలిస్తే నేను అంగీకరించనంటూ ఎక్స్‌లో పోస్ట్డీఎంకే-అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తాయంటూ ఉధృతంగా జరుగుతున్న ప్రచారంప్రచారాన్ని ఇప్పటికే ఖండించిన డీఎంకేవిజయ్కు ఇప్పటికే మద్దతు ప్రకటించిన విశాల్ If it’s not #Tvk and if it’s going to be anything else but the unimaginable/shellshocking combination of DMK/AIADMK alliance to form the next government , then I as a citizen and voter foresee a disastrous and catastrophic consequential turnout amidst common public. Will not go…— Vishal (@VishalKOfficial) May 7, 2026తమిళనాడు సస్పెన్స్ కంటిన్యూస్తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం108 స్థానాల్లో విజయ్ పార్టీ విజయంమ్యాజిక్ ఫిగర్‌కు 10 స్థానాలు తక్కువవామపక్షాలు, ఇతర చిన్న పార్టీల మద్దతు కోరిన విజయ్మద్దతుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోని డీఎంకే మిత్రపక్షాలుటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ససేమీరాతొలుత.. బలంతో వస్తే టీవీకేకే అవకాశం అంటూ గవర్నర్ వ్యాఖ్యానించినట్లు ప్రచారంకాసేపటికే.. పూర్తి మెజారిటీ వచ్చే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటునైనా అంగీకరిస్తానంటూ వ్యాఖ్యానించారని మరో ప్రచారండీఎంకే-అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలుతమిళనాట ఏం జరుగుతుందోననే ఉత్కంఠ -
తమిళనాడు గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. ఇలాంటి తరుణంలో గవర్నర్ ఆర్లేకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మెజారిటీ చూపిస్తూ ఏ పార్టీ తన వద్దకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో, డీఎంకే, అన్నాడీఎంకేలు జత కడతాయా? అనే చర్చ తెరపైకి వచ్చింది.ప్రభుత్వ ఏర్పాటు విషయమై గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్‌తో టీవీకే చీఫ్ విజయ్.. గురువారం రెండోసారి సమావేశమైన విషయం తెలిసిందే. వీరి భేటీ అనంతరం, ఆర్లేకర్ పొలిటికల్ బాంబు పేల్చారు. మెజారిటీపై తాను సంతృప్తి చెందాకే టీవీకేకు అవకాశమిస్తానని స్పష్టంచేశారు. ఆయన గురువారం రాత్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని టీవీకే ఏర్పాటు చేయకుండా తాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న వాదనను ఖండించారు. అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆర్లేకర్..‘ప్రభుత్వ ఏర్పాటుకు నా వద్దకు వచ్చిన పార్టీని అందుకు కావాల్సిన మెజారిటీ చూపించాలని అడిగాను. టీవీకేనే కాదు, ఏ పార్టీ వచ్చినా అదే అడుగుతాను. తర్వాత అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవచ్చు. ప్రక్రియను నేనేమీ ఆలస్యం చేయడం లేదు. విజయ్ 118 నంబరును రాతపూర్వకంగా ఇస్తే చాలు’ అని అన్నారు.అనంతరం, ఒకవేళ డీఎంకే, అన్నాడీఎంకే వచ్చి 118 మందిని చూపిస్తామంటే అంగీకరిస్తారా అని ప్రశ్నించగా.. ఎవరు మెజార్టీ చూపించినా నాకు ఓకే. అది సాధ్యమైనా సరే.. తప్పో, ఒప్పో వారికి మెజారిటీ ఉంది కాబట్టి కాదనలేను. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియ. నేను ప్రజల్ని మర్చిపోను. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఇక్కడున్నాను. వెరిఫై చేయకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా అనుమతిస్తాను? ముందు నేను సంతృప్తి చెందాకే ఆ పనిచేస్తా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడు రాజకీయం మరో పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, విజయ్ మరో 2-3 రోజుల్లో మెజారిటీ చూపించుకోలేకపోతే ఏం చేస్తారని అడగ్గా, తనకున్న అవకాశాల మేరకు తదుపరి ప్రక్రియకు వెళ్తానని చెప్పారు. తనకు సలహా బృందం ఉందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యవహారంపై కాంగ్రెస్.. నేడు తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు సిద్దమైంది. ఇందులో భాగంగా లోక్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు నిచ్చింది. అయితే, కాంగ్రెస్ నిరసనలో టీవీకే పాల్గొంటుందా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. కేంద్రంలోని బీజేపీ ఆదేశాలతోనే గవర్నర్.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
అలా చేస్తే బేరసారాలకు అవకాశం.. తమిళనాడు గవర్నర్
చెన్నై: ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరిగా చూపించాల్సిందేనని ఆ రాష్ట్ర గవర్నర్ తేల్చిచెప్పడంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎమ్మెల్యేల బేరసారలకు పరోక్షంగా అనుమతి ఇవ్వలేమన్నారు.తమిళనాడు గవర్నర్ తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆయన తీరును కాంగ్రెస్‌తో పాటు అక్కడి పలువురు నేతలు ఖండించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో E ఆ రాష్ట్రంలోని ఓ పత్రికకు గవర్నర్ ఇంటర్వూ ఇచ్చారు.విశ్వనాథ్ అర్లేకర్ మాట్లాడుతూ.."మెజారిటీ లేకపోవడం అన్నది ఒక్క విజయ్ సమస్య మాత్రమే కాదు. తమిళనాడు సమస్య మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బేరసారాలకు అనుమతించలేం. విజయ్‌ని మోజారిటీ నిరూపించమని మేము అనలేదు. మోజార్టీతో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తాం అని తెలిపాం. కాని వారు అలా చేయలేదు. దీనికి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఎలా అడ్డుకుంటున్నట్లు. ఏఐడీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎస్.ఆర్ బొమ్మై కేసులోని ఉత్తర్వు దీనికి వర్తించదు" అని అన్నారు. కాగా విజయ్‌కు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ కల్పించడంపైనా ఆ రాష్ట్ర గవర్నర్ డీజీపీపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు డీజీపీ శాంతిభద్రతలపై నివేదిక అందించారు. మరోవైపు రేపు గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ రేవు రాష్ట్ర వ్యాప్తం ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. -
వాళ్లకు ఛాన్స్ ఇవ్వను.. విజయ్ కి గవర్నర్ గుడ్ న్యూస్
-
అలా ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు?
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రూపంలో అవాంతరం ఎదురవుతోంది. మెజారిటీ బలంతో వస్తేనే అందుకు అనుమతిస్తానంటూ గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఇవాళైనా సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురు చూస్తున్న టీవీకే ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది. బుధవారం లోక్‌భవన్‌లో టీవీకే అధినేత విజయ్‌కు చుక్కెదురైంది. ఆ పార్టీ సమర్పించిన మద్దతుదారుల లిస్ట్‌పై గవర్నర్ పెదవి విరిచారు. పూర్తి స్థాయి బలం లేదు కదా? అని ప్రశ్నించారు. దీంతో గురువారం ఉదయం మరోసారి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో చర్చలు జరిపారు. 113 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన సంతకాలతో పాటు 20 మంత్రుల జాబితాను సమర్పించారు. సుమారు 40 నిమిషాల పాటు ఇందుకు సంబంధించిన చర్చలు జరిగాయి. అయితే.. 113 మందితోనే ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారని ఆ సందర్భంలో గవర్నర్ ఆర్లేకర్, టీవీకే అధినేతను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోసారి న్యాయ నిపుణులతో చర్చించాకే నిర్ణయం చెబుతానని విజయ్ను పంపించేశారు. ఆ వెంటనే సానుకూల ప్రకటన రావొచ్చంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ,లోక్‌భవన్ నుంచి టీవీకే పార్టీకి ఫోన్‌కాల్ వెళ్లింది. విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి మెజారిటీ లేకున్నా ప్రభుత్వ ఎలా ఏర్పాటు చేస్తారని.. 118 ఎమ్మెల్యేల మద్దతు సమర్పించాకే సీఎంగా ప్రమాణం చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ, సీపీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాల్లో గెలుపొందిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. విజయ్ పార్టీకి బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. మరోవైపు ప్రముఖులు సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని.. తమిళనాడు గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, .. ప్రజల ఆకాంక్షలను అవమానిస్తున్నారని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ట్వీట్ చేశారు. రాజ్యంగబద్ధ హోదాలో ఉన్నవాళ్లు ప్రజా తీర్పును గౌరవించాలని..తమ విధుల్ని సరిగా నిర్వర్తించాలని హితవు పలికారు. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలోనని.. లోక్‌భవన్‌లో కాదని అన్నారాయన. ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికైనా విజయ్‌ని ఆహ్వానించాలని ఆయన అన్నారు. మరో నటుడు ప్రకాశ్‌రాజ్ సైతం విజయ్ మద్దతుగా పోస్ట్ చేశారు. విజయ్‌కు ప్రజలు పట్టం కట్టారు. బలనిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వాల్సిందేనని ట్వీట్ చేశారు.తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆ బలం 113కి చేరింది. ప్రభుత్వ ఏర్పాటునకు మరో ఐదు స్థానాలు అవసరం. ఈ క్రమంలో డీఎంకే కూటమి పార్టీల మద్దతును విజయ్ కోరారు. అయితే అవి విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశంలో ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. మరోవైపు అన్నాడీఎంకే లేదంటే దాని కూటమిలోని చిన్నపార్టీల తరఫు నుంచైనా విజయ్‌కు మద్దతు లభిస్తుందేమోనన్న చర్చ తమిళనాట జోరందుకుంది. -
విజయ్ దూకుడు షురూ... గవర్నర్ గ్రీన్ సిగ్నల్.?
-
విజయ్ మద్దతు పెరిగిందా? పళనిస్వామి ప్లాన్ పై సస్పెన్స్
-
విజయ్ ప్రభుత్వానికి.. గవర్నర్ గ్రీన్ సిగ్నల్
-
విజయ్ ప్రమాణస్వీకారం అనుమానమే
-
మెజార్టీపై గవర్నర్ ను ఒప్పించలేకపోయిన విజయ్
-
విజయ్‌కు బిగ్ షాక్ TVKప్రభుత్వ ఏర్పాటులో ట్వీస్ట్
-
పలు కీలక అంశాలపై గవర్నర్ తో టీవీకే భేటీ
-
ఒహియోలో వివేక్ రామస్వామి సంచలనం
ఒహియో: అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నేత, రిపబ్లికన్ పార్టీ నాయకుడు వివేక్ రామస్వామి మరోసారి సంచలనం సృష్టించారు. ఒహియో రాష్ట్ర గవర్నర్ అభ్యర్థిత్వానికి జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, నవంబర్‌లో జరిగే తుది సమరానికి సమరశంఖం పూరించారు. బయోటెక్ వ్యాపారవేత్త అయిన వివేక్ రామస్వామి మంగళవారం జరిగిన రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, వ్యాపారవేత్త కేసీ పుచ్పై భారీ మెజారిటీతో గెలుపొందారు.ఈ విజయం దరిమిలా డెమొక్రాటిక్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా నామినేట్ అయిన ఒహియో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మాజీ డైరెక్టర్ ఎమీ ఆక్టన్‌తో ఆయన నేరుగా తలపడనున్నారు. అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఘన విజయం అనంతరం వివేక్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు, కానీ మన అసలు గమ్యం నవంబర్‌లో ఉంది’ అని అన్నారు. రామస్వామి గెలుపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ‘వివేక్ యువకుడు, చాలా తెలివైనవాడు. దేశాన్ని ప్రేమించే మంచి వ్యక్తి. ఒహియోకు ఆయన గవర్నర్ అవుతారు. అతనికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని ట్రంప్ ప్రకటించారు. ప్రముఖ కన్జర్వేటివ్ నేత లారా లూమర్.. ఇది అతిపెద్ద విజయమని అభివర్ణిస్తూ, వర్ణ వివక్షతో ఆయనను అణగదొక్కాలని చూసిన వారికి ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.నవంబర్ సమరానికి సై 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంతో జాతీయ స్థాయిలో అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకున్న వివేక్ రామస్వామి, ఆ తర్వాత వ్యూహాత్మకంగా ట్రంప్ కు మద్దతు ప్రకటించారు. ప్రైమరీ దశలో రిపబ్లికన్ ప్రత్యర్థులను ఎదుర్కొంటూనే, ఆయన తన ప్రచారాన్ని ప్రధానంగా డెమొక్రాట్ అభ్యర్థి ఎమీ ఆక్టన్ లక్ష్యంగా సాగించడం విశేషం. మరోవైపు కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఒహియో రాష్ట్రానికి సమర్థవంతంగా నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆక్టన్ కు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుత గవర్నర్ మైక్ డివైన్ పదవీకాలం ముగియడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు బలమైన అభ్యర్థుల మధ్య నవంబర్‌లో జరగబోయే ఈ పోరు రసవత్తరంగా మారనుంది. -
గవర్నర్‌కు టీవీకే విజయ్ లేఖ
చెన్నై: తమిళనాడు గవర్నర్‌కు టీవీకే చీఫ్ విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. రెండు వారాల్లో మెజారిటీ నిరూపిస్తామని.. అవకాశం ఇవ్వాలంటూ విజయ్ కోరారు. లోక్‌భవన్‌కు ఈ-మెయిల్ ద్వారా ఆయన లేఖ పంపినట్లు సమాచారం. విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ మార్క్) 118. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలను గెలుచుకుంది.స్వతంత్ర అభ్యర్థులు, ఒకట్రెండు సీట్లు గెలుచుకున్న చిన్న పార్టీలపై విజయ్ దృష్టి సారించారు. సంఖ్యా బలం పరంగా చూస్తే.. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు అవసరమైనందున.. ఇతర పార్టీల నుంచి చీలిక తీసుకురావడం కంటే స్వతంత్రుల మద్దతు కూడగట్టడం సులభంగా టీవీకే భావిస్తోంది. వీరికి మంత్రి పదవులు, ప్రత్యేక నిధుల హామీ ఇవ్వడం ద్వారా మద్దతు పొందవచ్చని టీవీకే ప్లాన్ చేసినట్లు సమాచారం.ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం అనే నినాదంతో విజయ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. ప్రతిపక్ష కూటముల్లోని అసంతృప్త ఎమ్మెల్యేలు విజయ్ వైపు చూసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్.. గవర్నర్‌కు లేఖ రాయగా.. రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ 14 రోజుల సమయం.. ఇతర పార్టీలతో చర్చలు జరపడానికి పొత్తులు కుదుర్చుకోవడానికి చాలా కీలకం. -
ఆదా శర్మ.. మరో సెన్సేషనల్ సినిమా
ది కేరళ స్టోరీ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన హీరోయిన్ ఆదా శర్మ. ఈ మూవీపై ఎన్ని వివాదాలొచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2023లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్ల చెదిరే కలెక్షన్స్ రాబ్టటింది. ఇటీవలే ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ది కేరళ స్టోరీ-2 రిలీజై హిట్‌గా నిలిచింది.తాజాగా ఆదా శర్మ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది ముద్దుగుమ్మ. గవర్నర్ ది సైలెంట్ సేవియర్ పేరుతో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా షేర్ చేసింది ఆదా శర్మ. 'ఈనాడు మనం ఒక ప్రపంచ శక్తిగా నిలిచామంటే.. దానికి కారణం ఒక అజ్ఞాత వీరుడు సాగించిన ఒక అప్రకటిత యుద్ధమే' అంటూ గవర్నర్ పోస్టర్ పంచుకుంది. ఈ చిత్రం జూన్ 12, 2026న థియేటర్లలో విడుదల కానుందని పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి చిన్మయి దీపక్ మండ్లేకర్ దర్శకత్వం వహించగా.. విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఆర్బీఐ బ్యాంక్, మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో జరిగే అవతవకలు, మోసాలే లక్ష్యంగా ఈ మూవీని రూపొందించినట్లు పోస్టర్లో చూస్తే అర్థమవుతోంది. గవర్నర్ టైటిల్‌తోనే ఈ మూవీ థీమ్ ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. My next ❤️GOVERNOR releasing in cinemas on 12th June, 2026.We are a world power todaybecause an unsung hero fought an untold war.GOVERNOR releasing in cinemas on 12th June, 2026.@BajpayeeManoj @adah_sharma #NoushadMohamedKunju @madhoo69 #ParitoshSand @KurupKrisha… pic.twitter.com/QdlMFeeM0v— Adah Sharma (@adah_sharma) April 23, 2026 -
అనిశ్చితి సమయాల్లో ‘వెయిట్ అండ్ వాచ్’
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసులో అంతరాయాలు వంటి అనిశ్చిత పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుసరిస్తున్న వేచి చూసే ధోరణి అత్యంత కీలకమని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఇటీవల అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ద్రవ్య విధానంలో చురుకైన మార్పులు చేయడం అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రసంగ సారాంశాన్ని తాజాగా ఆర్బీఐ తన వెబ్సైట్లో అధికారికంగా అందుబాటులో ఉంచింది.తటస్థ వైఖరితోనే వెసులుబాటుఆర్బీఐ గవర్నర్ తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని ద్రవ్య విధాన సమీక్షల్లో ఆర్బీఐ తటస్థ వైఖరినే కొనసాగిస్తోంది. ఇది దేశీయ ద్రవ్యోల్బణం, వృద్ధి గమనానికి అనుగుణంగా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్‌కు అవసరమైన సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మా విధానం పూర్తిగా డేటా ఆధారితంగా ఉంటుంది. ప్రమాదాల సమతుల్యతను మేము నిరంతరం అంచనా వేస్తున్నాం. అందుకే ప్రస్తుతానికి వేచి చూడటం అనే పంథాను ఎంచుకున్నాం’ అని ఆయన తెలిపారు.అంతర్జాతీయ సవాళ్లుపశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ సవాళ్లపై స్పందిస్తూ సరఫరా వ్యవస్థలో తలెత్తే అంతరాయాలు ద్రవ్యోల్బణంపై చూపే ప్రభావం పట్ల అప్రమత్తంగా ఉండాలని మల్హోత్రా హెచ్చరించారు. సరఫరా అంతరాయాలు దీర్ఘకాలం కొనసాగి అవి ఇతర రంగాలకు వ్యాపించి ద్రవ్యోల్బణ అంచనాలను పెంచితే అది ఆందోళన కలిగిస్తుంది. అటువంటి సమయంలో కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన సూచించారు.ప్రపంచ వృద్ధిలో అగ్రగామిగా భారత్గత దశాబ్ద కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన వృద్ధిని వివరిస్తూ చైనా వంటి అగ్ర దేశాల కంటే భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచిందని మల్హోత్రా ప్రకటించారు.భారత సగటు వార్షిక వృద్ధి: 6.1%చైనా: 5.6%ఇండోనేషియా: 4.2%ప్రపంచ ఆర్థిక వృద్ధి: 3.2%భారతదేశ వృద్ధికి అవసరమైన సులభతర పర్యావరణ వ్యవస్థను అందించడంలో రిజర్వ్ బ్యాంక్ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తోందన్నారు. భవిష్యత్తులోనూ స్థిరత్వమే లక్ష్యంగా ముందడుగు వేస్తామని గవర్నర్ తెలిపారు.ఇదీ చదవండి: చైనాలో రివర్స్ మైగ్రేషన్.. -
ఏపీ అప్పుల తప్పుడు లెక్కలపై గవర్నర్‌కు ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పూర్తి వాస్తవాలు, గణాంకాల వివరాలతో బుధవారం ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఓ లేఖ రాశారాయన. ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు. కానీ ఆ వివరాల్లో తప్పుడు సమాచారం చూపుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న తప్పుడు సమాచారంపై చర్యలు తీసుకోవాలి అని బొత్స మొత్తం ఏడు పేజీల ఆ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. -
టెన్త్ విద్యార్థులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా, తమ జ్ఞానం, ప్రతిభను చూపించే మంచి అవకాశంగా భావించాలని.. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని గవర్నర్ పిలుపునిచ్చారు.పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలన్న శివ ప్రతాప్ శుక్లా.. ఆత్మ విశ్వాసం విజయానికి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. -
సుసంపన్న తెలంగాణ నిర్మిద్దాం
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రివర్గ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. మనమందరం కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ లక్ష్యాలను గౌరవిస్తూ ముందుకు సాగుదాం. రాష్ట్ర గవర్నర్‌గా సమగ్రత, సమైక్యత, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంటా. నా విధులను న్యాయబద్ధంగా, నిజాయితీగా, భారత రాజ్యాంగానికి లోబడి అంకితభావంతో నిర్వహిస్తా. మనమందరం సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడానికి కలిసి పని చేద్దాం..’అని రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు లోక్‌భవన్‌లో ఆయన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తన సందేశాన్ని విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడం అదృష్టం ‘తెలంగాణ ప్రజలకు సేవ చేయడం గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అంటే సాంస్కృతిక సంపద, గొప్ప సంప్రదాయాలు, అసాధారణ పురోగతికి నిదర్శనం. ఈ ప్రాంతం ఆశలు, ఆవిష్కరణలు, సహన శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. ప్రజల అకుంఠిత దీక్ష, రాష్ట్రంలోని సమృద్ధ వనరులు, వ్యూహాత్మక దృష్టి.. సమగ్ర అభివృద్ధికి, స్థిరమైన ప్రగతికి బలమైన ప్రాతిపదికను అందిస్తాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన నా అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. తెలంగాణ జై తెలంగాణ..’అని గవర్నర్ శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలను అప్పగించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, డీజీపీ శివధర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం, ఆయన మంత్రివర్గ బృందంతో గవర్నర్ గ్రూపు ఫొటో దిగారు. తెలుగులో ప్రమాణం గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయనకు తెలుగు భాషతో ఇప్పటివరకు ఎలాంటి పరిచయం లేకపోయినా తెలుగులో ప్రమాణస్వీకారం చేయడానికి బాగా ప్రాక్టీస్ చేసినట్టు లోక్‌భవన్ వర్గాలు తెలిపాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం తెలుగులోనే ‘అనే నేను..’అనే పదాలతో ప్రమాణాన్ని ప్రారంభించగా, శివపత్రాప్ శుక్లా అనే నేను.. అంటూ గవర్నర్ పూర్తిగా తెలుగులో ప్రమాణం చేశారు. భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చార్మినార్: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ కుమార్తె, అల్లుడు, కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్లతో కలిపి దాదాపు 19 మంది వరకు ఆయన వెంట ఉన్నారు. ఆలయ ట్రస్టీ శశికళ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వారిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్ వేదికగా గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. శివ్ ప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణస్వీకారం చేయడం విశేషం. గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు, మండలి చైర్మన్ హాజరయ్యారు. కలిసి పని చేద్దాంతెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శివ్ ప్రతాప్ శుక్లా తన సందేశం ఇచ్చారు. ''తెలంగాణ ప్రజలకు సేవ చేయడం గర్వంగా భావిస్తున్నాను. రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలంగాణ సాంస్కృతిక సంపద, గొప్ప సంప్రదాయాల రాష్ట్రం. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అనుభవం తెలంగాణకు ఉపయోగపడుతుంది.తెలంగాణ ఆశలు, ఆవిష్కరణలు, సహనశక్తికి ప్రతీక. ప్రజల దీక్షతో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి దిశగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్‌కు అభినందనలు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ లక్ష్యాలతో ముందుకు సాగుదాం. సమైక్యత, సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటాను. రాజ్యాంగానికి అనుగుణంగా నిజాయితీగా విధులు నిర్వహిస్తాను. సుసంపన్నమైన తెలంగాణ కోసం కలిసి పని చేద్దామ''ని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. -
తెలంగాణ గవర్నర్ గా శివప్రతాప్ శుక్ల
-
పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. బెంగాల్ గవర్నర్‌గా ఆయన మూడున్నరేళ్లు పనిచేశారు. అయితే, రాజీనామాకు గల కారణాలు మాత్రం ఆయన తెలపలేదు. బెంగాల్ కొత్త గవర్నర్‌గా తమిళనాడు గవర్నర్ రవిని కేంద్రం నియమించింది.వ్యక్తిగత నిర్ణయంతోనే తాను రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. గవర్నర్ కార్యాలయంలో తాను తగినంత సమయం గడిపానన్న ఆనంద బోస్.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ పీటీఐకి ఆయన తెలిపారు. 2022లో గవర్నర్‌గా ఆనంద బోస్.. బాధ్యతలు చేపట్టారు.సుమారు మూడున్నరేళ్ల పాటు తన సేవలను అందించారు. ఆనంద బోస్ రాజీనామా షాక్‌కు గురిచేసిందని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఆయన రాజీనామా వెనుక గల కారణాలు ప్రస్తుతానికి తనకు తెలియవన్నారు. ఆర్ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి తనకు ఇప్పుడే తెలియజేశారంటూ ఎక్స్‌లో ఆమె పేర్కొన్నారు.I am shocked and deeply concerned by the sudden news of the resignation of Shri C. V. Ananda Bose, the Governor of West Bengal.The reasons behind his resignation are not known to me at this moment. However, given the prevailing circumstances, I would not be surprised if the…— Mamata Banerjee (@MamataOfficial) March 5, 2026 -
అసెంబ్లీలో గవర్నర్ అబద్దాలు.. MLC కల్పలత రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
గవర్నర్ వద్దకు BRS నేతలు..
-
కర్ణాటక గవర్నర్ పంతం.. ‘సుప్రీం’కు సిద్ధరామయ్య సర్కార్!
కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. గురువారం నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రసంగించకూడదని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తనకు సమర్పించిన గవర్నర్ ప్రసంగం కాపీలో అభ్యంతరాల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తే పరిస్థితి ఏర్పడింది.గవర్నర్ ప్రసంగం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు.. గత ఏడాది పని తీరును ప్రతిబింబించే అధికారిక ప్రకటన. ఏ రాష్ట్రంలోనైనా సరే శాసనసభ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభం కావాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ఈ విషయాన్నే స్పష్టంగా చెబుతోంది. ఒకవేళ.. గవర్నర్ ప్రారంభోపన్యాసం ఇవ్వకపోతే శాసనసభ ప్రారంభం జరగదు!. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియలో అంతరాయం కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మార్గం ఉంది.గవర్నర్ గనుక ప్రసంగం ఇవ్వనని చెబితే.. ఆ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌ను ఆశ్రయించవచ్చు. ఇవాళ జరగబోయే ఉమ్మడి శాసనసభ సమావేశంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్(Thawar Chand Gehlot) ప్రసంగం ఇవ్వకపోతే.. సిద్ధరామయ్య ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌ను ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.గవర్నర్ అభ్యంతరాలివే.. ఈ వివాదానికి మూలం గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేర్చిన కొన్ని పేరాలు. ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ (MGNREGA) రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని విమర్శించడం, కర్ణాటకకు నిధుల పంపిణీ విషయంలో అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు ఉండడం. థావర్ చంద్ గెహ్లాట్ వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. తొలగించాలని కోరారు. తొలగించకపోతే ప్రసంగం ఇవ్వబోనని లోక్‌భవన్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి కబురు పంపారు.గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమే. గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పే వేదిక కాదు. ప్రసంగం ఇవ్వకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ అంశం మీదే సుప్రీం కోర్టులో వాదనలు జరిగే చాన్స్ ఉంది.కోర్టు ఏం చెప్పిందంటే..గతంలో గవర్నర్లు ప్రసంగాలు చదవకపోవడం.. మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం లాంటి ఘటనలు జరిగాయి. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2023లో అప్పటి కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ప్రసంగం మొత్తం చదవకుండా మధ్యలో వెళ్లిపోయారు. ఆ సమయంలో పినరయి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే.. ప్రసంగం మొత్తం చదవడం గవర్నర్‌కున్న రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని ఆ టైంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2024-2025 మధ్యకాలంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా ఇలా మూడుసార్లు చేశారు. ఆ సమయంలోనూ తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ప్రసంగం తప్పనిసరి.. అది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమేనని స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో గవర్నర్–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రచ్చ నడుస్తోంది. మొన్న తమిళనాడు, నిన్న కేరళలో కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి.సభ ఆగిపోతుందా?.. రకరకాల కారణాలతో.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసానికి దూరం కావడం, లేదంటే మధ్యలో వెళ్లిపోవడం లాంటి పనులు గవర్నర్లు చేసిన సందర్భాలు భారత దేశ చరిత్రలోనే అనేకం ఉన్నాయి. అయితే.. గవర్నర్ ప్రసంగం ఇవ్వకపోయినా సరే ప్రభుత్వం తాను సిద్ధం చేసిన ప్రసంగాన్ని అధికారికంగా రికార్డులోకి తీసుకుని సమావేశాలను నిర్వహించుకోవచ్చు. తద్వారా రాజ్యాంగ ప్రక్రియ కొనసాగుతుంది. గవర్నర్ ప్రసంగం అనేది కేవలం రాజ్యాంగపరమైన బాధ్యతేకాని సభ ఆగిపోయేంత కారణం కాదన్నమాట. -
అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్..
-
గవర్నర్ల కోసం ప్రత్యేక చట్టాలేవి లేవు: స్టాలిన్
తమిళనాడు గవర్నర్ RN రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య మరోసారి వైరం ముదిరిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనను అవమానించారని అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. గవర్నర్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న వ్యక్తి అలా వ్యవహరించడం సరికాదని అన్నారు. స్టాలిన్ మాట్లాడుతూ " సభనుంచి గవర్నర్ వాకౌట్ చేయడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు భంగం కలిగించడమే. గవర్నర్ తన అభిప్రాయాలను పంచుకునేలా, ఎదైనా చెప్పేలా ఉండే చట్టాలేవి లేవు. వాస్తవానికి ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైనా గవర్నర్ మద్దతు ప్రకటించాలి కాని RNరవి అలా చేయడం లేదు" అని స్టాలిన్ అన్నారు.రాష్ట్ర గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రవర్తిస్తుని ఇటువంటి చర్యలు చేయడం వల్ల సభను అవమానపరుస్తున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. అయితే ఈ రోజు ఉదయం సభను వాకౌట్ చేసిన గవర్నర్ అనంతరం అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడారు. జతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వలేదని తాను చదవాల్సిన ప్రసంగంలో అనేక తప్పులున్నాయని, తన మైక్ ఆప్ చేశారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.అయితే గతంలోనూ తమిళనాడు గవర్నర్ RN రవి తీరు వివాదాస్పదమైంది. ప్రభుత్వం రూపొందించన ప్రసంగం కాకుండా తన స్వంత ప్రసంగాన్ని చదివారు. ఈ వివాదం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశంమైంది. -
Ys Jagan Rally : భారీ ర్యాలీతో గవర్నర్ ఆఫీసుకు..!
-
కోటి సంతకాల పేపర్లతో గవర్నర్ ను కలవనున్న జగన్
-
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
గవర్నర్ తో జగన్ భేటీ.. క్యూ కట్టిన వాహనాలు
-
రేపు గవర్నర్‌తో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (డిసెంబర్ 18) సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ కానున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి సంబంధించిన పత్రాలను గవర్నర్‌కు అందజేయనున్నారు. ఈ భేటీలో వైఎస్ జగన్ వెంట పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, ఎంపీలు ఉంటారు. దీనికి ముందు ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలు నిండిన వాహనాలను వైఎస్ జగన్ జెండా ఊపి లోక్ భవన్‌కు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.ఈ కార్యక్రమం తర్వాత వీరితో వైఎస్ జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమవుతారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ నివాసం లోక్ భవన్‌కు బయల్దేరి వెళ్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కోటి మందికిపైగా చేసిన సంతకాల పత్రాలతో నిండిన వాహనాలు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. -
బాబుకు బిగ్ షాక్.. గవర్నర్ తో YS జగన్ భేటీ
-
ఈనెల 17న గవర్నర్‌తో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్‌కు నివేదించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17న ఆయనతో భేటీ కానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్ జగన్.. గవర్నర్‌ను కలవనున్నారు.ఈ మేరకు గవర్నర్ స్పెషల్ సీఎస్ నుంచి వైఎస్సార్సీపీకి లేఖ అందింది. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌కు నివేదించడంతో పాటు, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్‌కు చూపించనున్నారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు. -
గవర్నర్ మనవడిపై హత్యాయత్నం కేసు
భోపాల్: కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కుటుంబం వరకట్న వేధింపుల ఆరోపణల్లో చిక్కుకుంది. గవర్నర్ మనవడు దేవేంద్ర గెహ్లాట్ భార్య దివ్య గెహ్లాట్, తన భర్తతో పాటు మామ, అతని కుటుంబంపై వరకట్న వేధింపులు, హత్యాయత్నం, గృహ హింస, తన మైనర్ కుమార్తె అపహరణ తదితర ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్‌కు దివ్య లిఖితపూర్వకంగా ఈ మేరకు ఫిర్యాదు చేశారు. రూ. 50 లక్షల కట్నం డిమాండ్ చేస్తూ, తన అత్తమామలు కొన్నేళ్లుగా తనను వేధిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.దివ్య ఆరోపణల ప్రకారం.. 2018, ఏప్రిల్ 29న వారి వివాహం జరిగింది. అయితే అంతకు ముందు తన భర్త దేవేంద్ర గెహ్లాట్ మద్యపానం, మాదకద్రవ్య వ్యసనంలో మునిగితేలేవాడని, ఇతర మహిళలతో సంబంధాలున్నాయని, అయితే అవి తనకు తెలియకుండా దాచిపెట్టాడని దివ్య ఆరోపించారు. తమ వివాహం ముఖ్యమంత్రి కన్యాదాన యోజన కింద సీనియర్ నేతలు మాజీ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, థావర్‌చంద్ గెహ్లాట్ తదితర ప్రముఖుల సమక్షంలో జరిగిందన్నారు. పెళ్లి తర్వాత కూడా దేవేంద్ర తన వ్యసనాలను మానుకోలేదని, ఇతర మహిళలతో సంబంధాలు కొనసాగించాడని దివ్య ఆరోపించారు.2021లో తాను గర్భవతిగా ఉన్నప్పుడు వేధింపులు మరింత తీవ్రమయ్యాయని, తనకు ఆహారం ఇచ్చేవారు కాదని, తీవ్రంగా కొట్లేవారని, మానసికంగా హింసించారని దివ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జనవరి 26న తన భర్త తాగి వచ్చి, తనను దారుణంగా కొట్టి ‘ఈ రోజు డబ్బు తీసుకురాకపోతే చంపేస్తాను’ అని బెదిరించాడని, తరువాత పైనుంచి తోసేశాడని, దీంతో తన వెన్నెముక, భుజం, నడుముకు తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. పైగా ఆరోజు రాత్రంతా తనకు వైద్య సహాయం అందించలేదని ఆమె ఆరోపించారు.గాయాలతో బాధపడుతున్న తనను మరుసటి రోజు ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ తన పరిస్థితిని గుర్తించి, ఇండోర్‌లోని బాంబే ఆసుపత్రికి తరలించారని దివ్య తెలిపారు. అయితే ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పలేదని, పైగా తన వైద్య ఖర్చులు భరించాలని తన తండ్రిపై ఒత్తిడి తెచ్చారని దివ్య ఆరోపించారు. తన నాలుగేళ్ల కుమార్తెను తన అత్తమామలు వారితోనే ఉంచుకున్నారని, తాను తన కుమార్తెను కలుసుకునేందుకు పాఠశాలకు వెళ్ళినప్పుడు, తన భర్త అడ్డుకొని, తన తల్లిదండ్రుల నుండి డబ్బు తీసుకువచ్చాకనే, కూతురిని చూడాలని హెచ్చరించాడని దివ్య ఆరోపించారు.దివ్య ప్రస్తుతం రత్లంలో తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. ఈ ఉదంతంలోని పలు సంఘటనలు ఉజ్జయిని జిల్లాలోని నాగ్డాలో జరగడంతో, రత్లాం పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించి, తదుపరి చర్యల కోసం ఉజ్జయిని అధికారులకు పంపారు. ఈ ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గెహ్లాట్ (దివ్య మామ) స్పందించారు. ఆరోపణలు ఎవరైనా చేయవచ్చని, తను అన్ని వాస్తవాలను మీడియా ముందు ఉంచుతానని అన్నారు.ఇది కూడా చదవండి: పుతిన్ సెక్యూరిటీ: ల్యాబ్, టాయిలెట్.. అంతా రహస్యమే! -
HYD: గవర్నర్ ప్రోగ్రామ్‌లో ఫేక్ రిపోర్టర్లు!
సాక్షి, హైదరాబాద్: సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ పాల్గొన్న కార్యక్రమంలో భద్రతా వైఫల్యం బయటపడింది. రిపోర్టర్ల ముసుగులో ఆగంతకులు పోలీసుల కళ్లు గప్పి లోపలికి ప్రవేశించారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైటెక్ సిటీ ఆవాస హోటల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో ఏకంగా 8 నేషనల్ మీడియా చానెల్స్‌కు చెందిన లోగోస్ పట్టుకుని ఓ వ్యక్తి వచ్చాడు. అతని వెంట మరో వ్యక్తి ఉన్నాడు. అయితే ఒరిజిల్ నేషనల్ మీడియా ప్రతినిధులు ఆ ఇద్దరి కదలికలపై అనుమానంతో ప్రశ్నించారు. చివరకు నకిలీ రిపోర్టర్లుగా నిర్ధారించుకుని పోలీసులకు అప్పగించారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు.. ఎంక్వైరీ ప్రారంభించారు. -
కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.54.88 కోట్ల హెచ్ఎండీఏ నిధులు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు చెల్లించారంటూ నమోదైన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మాజీ మంత్రి కేటీ రామారావును ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. ఈ మేరకు రెండురోజుల క్రితమే గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి సమాచారం వెళ్లిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది.ప్రజా ప్రతినిధి కావడంతో పాటు, గతంలో మంత్రిగా పని చేసినందున.. కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి కోరుతూ ఏసీబీ గతంలో లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఈ కేసులో ఏసీబీ వేగం పెంచే అవకాశాలున్నాయని అంటున్నారు. గవర్నర్ అనుమతి రావడంతో ఈ కేసులో చార్జిషీట్ వేసేందుకు ఏసీబీ అధికారులకు అవకాశం చిక్కినట్టయ్యింది. అయితే ఇదే కేసులో ఏ–2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ పైనా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అందుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ అనుమతి తప్పనిసరి. ఆ అనుమతి వస్తేనే ఈ కేసులో చార్జిషీట్ ప్రక్రియ వేగవంతం అవుతుందని ఏసీబీ అధికారులు అంటున్నారు.ఇదీ కేసు నేపథ్యం.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్‌సాగర్ వద్ద ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహించారు. అయితే ఈ రేస్ నిర్వహణ కోసం బ్రిటన్‌కు చెందిన ఫార్ములా–ఈ ఆపరేషన్స్, హైదరాబాద్‌కు చెందిన గ్రీన్కో సిస్టర్ కంపెనీ ఏస్ నెక్ట్స్ జెన్, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) మధ్య 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.ఈ ఒప్పందం మేరకు హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో సీజన్ 9, 10, 11, 12 నిర్వహణ కోసం ట్రాక్ నిర్మాణం సహా ఇతర మౌలిక సదుపాయాలను ఎంఏయూడీ కల్పించాలి. 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించారు. అయితే వివిధ కారణాలతో ఏస్ నెక్ట్స్ జెన్, ఫార్ములా–ఈ ఆపరేషన్స్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌కు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో కార్ రేస్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి ఆ సంస్థ సమాచారం అందించింది. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అరి్వంద్‌కుమార్ నేతృత్వంలో.. ఫార్ములా–ఈ ఆపరేషన్స్, ఎంఏయూడీ మధ్య 2023 అక్టోబర్‌లో మరో కొత్త ఒప్పందం జరిగింది. రూ.54.88 కోట్ల దుర్వినియోగం ఆరోపణలతో ఏసీబీ కేసు ఈ– కార్ రేస్ ఈవెంట్ నిర్వహణ కోసం స్పాన్సర్ ఫీజు, పన్నులు కలిపి మొత్తం రూ.110 కోట్లు (గ్రేట్ బ్రిటన్ పౌండ్లు 90,00,000) చెల్లించాలని అగ్రిమెంట్లో పేర్కొన్నారు. ఈవెంట్ నిర్వహణకు అవసరమైన మున్సిపల్ సేవలు, సివిల్ వర్క్స్ కోసం మరో రూ.50 కోట్లు ఖర్చు చేసే విధంగా అండర్ టేకింగ్ తీసుకున్నారు. ఇలా హెచ్ఎండీఏ బోర్డుకు సంబంధించిన నిధుల నుంచి మొత్తం రూ.160 కోట్లు మంజూరు చేసేలా ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీజన్ 10 నిర్వహణకు సంబంధించి 2023 అక్టోబర్ 3, 11వ తేదీలలో హెచ్ఎండీఏ బోర్డు సాధారణ నిధుల నుంచి ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌కు రూ.45,71,60,625 సొమ్మును విదేశీ కరెన్సీ రూపంలో ట్రాన్స్ఫర్ చేశారు.అయితే ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ ఐటీ శాఖ హెచ్ఎండీఏకి రూ.8.07 కోట్ల జరిమానా విధించింది. ఇలా ఈ మొత్తం వ్యవహారంలో హెచ్ఎండీఏ బోర్డు ఖజానా నుంచి మొత్తం రూ.54,88,87,043 దురి్వనియోగం అయ్యాయని ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. రూ.54.88 కోట్ల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 10 మందిపై కేసులు ఈ కేసులో ఏ–1గా కేటీఆర్, ఏ–2గాఅరి్వంద్కుమార్, ఏ–3గా హెచ్ఎండీఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి ఉన్నారు. అలాగే నెక్ట్స్ జెన్‌కు చెందిన కిరణ్‌రావు, ఫార్ములా–ఈ ఆపరేషన్స్ ప్రతినిధులు సహా మొత్తం 10 మందిపై కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు పలు దఫాలుగా నిందితులను ఇప్పటికే విచారించారు. కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్రెడ్డిలను రెండుసార్లు ప్రశ్నించారు. ఫార్ములా–ఈ ఆపరేషన్స్ ప్రతినిధులను సైతం ఆన్లైన్లో విచారించారు.కాగా ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ కేసు గురించి పలుమార్లు ప్రస్తావించారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కవడం వల్లే కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. అయితే ప్రస్తుతం కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయం తాజా పరిణామంతో రుజువయ్యిందని బీఆర్ఎస్కు చెందిన సీనియర్ నేతలు పలువురు వ్యాఖ్యానించారు. -
సుప్రీంకోర్టు కీలక ప్రకటన రాష్ట్రపతి, గవర్నర్లకు ఉపశమనం
-
గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయనకు కర్నాటక లా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించటంపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన అబ్దుల్ నజీర్.. నేడు గవర్నర్‌గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో ముందున్నారని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం. ఇది వారి అంకితభావానికి లభించిన గుర్తింపు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ఎక్స్‌లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన అబ్దుల్ నజీర్ గారు, నేడు గవర్నర్‌గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో ముందున్నారు. చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ (Honorary Doctor of Laws) ప్రకటించడం రాష్ట్రానికి… pic.twitter.com/BDwSNSHr50— YS Jagan Mohan Reddy (@ysjagan) November 5, 2025 -
వర్జీనియా గవర్నర్‌గా అబిగైల్ స్పాన్‌బెర్గర్
వర్జీనియా: అమెరికాలోని వర్జీనియా మేయర్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదయ్యింది. డెమొక్రాట్ అబిగైల్ స్పాన్‌బెర్గర్ మంగళవారం జరిగిన వర్జీనియా గవర్నర్ ఎన్నికల్లో గెలిచారు. రిపబ్లికన్ లెఫ్టినెంట్ గవర్నర్ విన్సమ్ ఎర్లే-సియర్స్‌ను ఓడించిన ఆమె 2026 మధ్యంతర ఎన్నికలకు వెళ్లే డెమొక్రాట్లకు కీలక విజయాన్ని అందించి, సరికొత్త చరిత్ర సృష్టించారు.కామన్వెల్త్కు నాయకత్వం వహించిన తొలి మహిళగా నిలిచిన అబిగైల్ స్పాన్‌బెర్గర్ ఇటీవలే పదవీ విరమణ చేసిన రిపబ్లికన్ గవర్నర్ గ్లెన్ యంగ్‌కిన్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఈ విజయంతో తాము కామన్వెల్త్లోని ప్రతి మూలకు ఒక సందేశాన్ని పంపామని, దేశవ్యాప్తంగా ఉన్న మా తోటి అమెరికన్లకు తమ సత్తా చూపామని స్పాన్‌బెర్గర్ రిచ్మండ్ తన ఉత్సాహభరిత ప్రసంగంలో పేర్కొన్నారు.మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ గజాలా ఎఫ్. హష్మీ లెఫ్టినెంట్ గవర్నర్ రేసులో గెలిచారు. ఈ పదవిని దక్కించకున్న తొలిమహిళగా హష్మీ నిలిచారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ(సీఐఏ) అధికారి అయిన స్పాన్‌బెర్గర్ ప్రచార సమయంలో దేశంలోని ఆర్థిక సమస్యలను ఎత్తిచూపారు. ఆమె అనుసరించిన వ్యూహం వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో ఇతర డెమొక్రాట్లకు ఒక నమూనాగా ఉపయోగపడనుంది.తన ప్రచారంలో స్పాన్‌బెర్గర్ .. అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా, ఆయన రూపొందించిన ఆర్థిక ప్రణాళికలను ఎండగట్టారు. ఆమె రిపబ్లికన్ మద్దతు కలిగిన ప్రాంతాలతో సహా వర్జీనియా అంతటా ప్రచారం సాగించారు. యూఎస్ ప్రభుత్వ షట్‌డౌన్, సమాఖ్య ఉద్యోగులున్న వర్జీనియాపై దాని ప్రతికూల ప్రభావాన్ని స్పాన్‌బెర్గర్ సమర్థవంతంగా వివరించారు. ఆమె అనుసరించిన ప్రచార విధానం డెమొక్రాట్లను ఏకం చేయడంలో సహాయపడింది. -
ప్రభుత్వ వర్సిటీల్లో హెచ్–1బీని ఆపేయండి
న్యూయార్క్: స్థానిక అమెరికన్లకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలంటూ తరచూ ప్రసంగాలిచ్చే అమెరికా అధ్యక్షుడి బాటలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ పయనిస్తున్నారు. హెచ్–1బీ వీసాదారులకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వివిధ ఉద్యోగాల్లో నియమించుకునే పద్ధతికి స్వస్తి పలకాలని వర్సిటీలకు ఆయన సూచించారు. ఇప్పటికే ఈ మేరకు ఫ్లోరిడా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ను ఆదేశించానని ఆయన చెప్పారు. బుధవారం యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో ఆయన ప్రసంగించారు. ‘‘ ఫ్లోరిడాలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో హెచ్–1బీ వీసాదారులు స్థానికులను తోసిరాజని అన్ని రకాల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు. హెచ్–1బీ వీసాదారులంతా ఒకరకంగా వలస కూలీలు. మధ్యలో బ్రోకర్ల సాయంతో ఇక్కడికొచ్చి బాగా సంపాదిస్తున్నారు. ఇదంతా పెద్ద కుంభకోణం. వర్సిటీల ఆడిటింగ్‌లో ఎన్నో అంశాలు వెలుగుచూశాయి. వర్సిటీల్లో విదేశీయులు అధ్యాపకులుగా, నిపుణులుగా, చివరకు స్విమ్కోచ్ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది. కనీసం స్విమ్కోచ్ అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా అమెరికన్ పనికిరాడా?. ఇకనైనా వర్సిటీలు ఉద్యోగాల్లో అమెరికన్లను నియమించుకోవాలి’’ అని డీశాంటిస్ అన్నారు. -
టెక్సాస్ గవర్నర్ అధికార నివాసభవనంలోవైభవంగా దీపావళి వేడుకలు
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ , సిసిలీయా అబ్బాట్ దంపతులు రాష్ట్రంలోని కొంతమంది ప్రవాస భారతీయనాయకులను ఆహ్వానించి, తమ అధికార నివాసభవనంలో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. గత 11 సంవత్సరాలుగా ప్రతీ ఏడాదీ గవర్నర్ దంపతులు దీపావళి పండుగ జరుపుకోవడం విశేషం. గౌరవ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దంపతులు వివిధరంగాలలో విశేషంగా కృషి చేస్తూ, టెక్సస్ రాష్ట్ర శరవేగ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలతోపాటు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ వంటకాలతో దీపావళి విందు ఏర్పాట్లు చెయ్యడమేగాక అందరికీ దీపావళి కానుకలిచ్చి సత్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనురాగ్ జైన్ దంపతులు ఈ సంవత్సరపు దీపావళి వేడుక ఏర్పాట్లను సమన్వయపరచారు. గౌరవ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ దంపతులు, టెక్సస్ రాష్ట్ర కార్యదర్శి జేన్ నెల్సన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. టెక్సాస్ రాష్ట్రంలోని వివిధ నగరాలైన డాలస్, హూస్టన్, ఆస్టిన్, శాన్అంటానియో, కార్పస్ క్రిస్టీ, మిడ్‌ల్యాండ్, ఓడిస్సా మొదలైన నగరాలనుండి 100 మందికి పైగా పాల్గొన్న ప్రవాస భారతీయులలో ప్రవాసాంధ్రులైన డా. ప్రసాద్ తోటకూర, చిన సత్యం వీర్నపు, కుమార్ నందిగం, వెంకట్ ఏరుబండి, వెంకట్ గొట్టిపాటి, సతీష్ మండువ, నీలిమ గోనుగుంట్ల, ఆషా రెడ్డి, సుజిత్ ద్రాక్షారామ్, బంగార్ రెడ్డి, రాజ్ కళ్యాణ్ దుర్గ్ వారి కుటుంబ సభ్యులున్నారు.భారత అమెరికా దేశాలమధ్య సంభందాల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ కు ప్రవాసభారతీయులందరి తరపున డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రవాసభారతీయుల ముఖ్యమైన అన్ని ఉత్సవాలకు హాజరయ్యే గవర్నర్ మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డాలస్ లో జరిగిన మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా హాజరైన సంఘటన గుర్తుచేసుకుని గవర్నర్ కు మరోసారి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. -
తమిళనాడులో మరో ట్విస్ట్.. గవర్నర్‌కు వ్యతిరేకంగా ‘సుప్రీం’లో పిటిషన్
సాక్షి, చెన్నై: గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేసింది. అందులో కలైంజ్ఞర్ కరుణానిధి పేరిట వర్సిటీ ఏర్పాటుకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్(RN Ravi) ఎడతెగని జాప్యం చేస్తూ చివరకు రాష్ట్రపతికి పంపించినట్లు ఆరోపించింది.వివరాలు ఇలా ఉన్నాయి.. రాష్ట్ర గవర్నర్, డీఎంకే ప్రభుత్వం(MK Stalin) మధ్య వివిధ అంశాలపై నెలకొన్న వివాదాలు ఇప్పటికే సుప్రీంకోర్టు(Supreme Court) వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ‘సుప్రీం’ ఉత్తర్వులతో రాష్ట్ర ప్రభుత్వం పలు వర్సిటీల వ్యవహారాలకు సంబంధించిన ముసాయిదాలను ఆమోదించుకుంది. ఈ పరిస్థితుల్లో కుంభకోణంలో కలైంజ్ఞర్ కరుణానిధి పేరిట వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో నిర్ణయించింది.అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ ముసాయిదా రాజ్‌భవన్‌కు చేరింది. ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు రాజ్‌భవన్ నుంచి ఆమోదం రాలేదు. తాజాగా.. ఈ ముసాయిదాను రాష్ట్రపతికి పంపించినట్లు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఈ వర్సిటీ సాధన కోసం డీఎంకే ప్రభుత్వం మళ్లీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేసింది. ఇది కూడా చదవండి: మీరేం ఒంటరి కాదు.. విజయ్‌కు దన్నుగా ఢిల్లీ పెద్దలు! -
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించిన ప్రిజన్ డ్యూటీ మీట్–2025 (ఫొటోలు)
-
ఫెడరల్ రిజర్వు గవర్నర్‌కు ట్రంప్ ఉద్వాసన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వు గవర్నర్ లిసా కుక్‌ను తొలగించారు. ఈ విషయాన్ని సోమవారం రాత్రి సొంత ట్రూత్ మీడియాలో ట్రంప్ ప్రకటించారు. ఆమె మోసానికి పాల్పడినట్లు వచి్చన ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని తెలిపారు. మిషిగన్, జార్జియాలోని భవనా లను ప్రాథమిక నివాసాలుగా ప్రకటిస్తూ ఆమె సంతకాలు చేసిన పత్రాలను ట్రంప్ అటాచ్ చేశారు. రెండు వారాల వ్యవధిల్లోనే రెండిళ్లను ఆమె కోరారని, బహుశా మొదటి నివాసం విషయం మ ర్చిపోయి ఉంటారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మార్టిగేజ్(తనఖా) విభాగానికి ట్రంప్ నియమించిన బిల్ పాల్ట్ గత వారం స్వయంగా లిసాపై ఆరోపణలు చేయడం గమనార్హం. స్వల్పకాలిక వడ్డీ రేట్లలో కోత విధించాలంటూ ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్‌పై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. చెప్పింది చేయకుంటే పదవి నుంచి తొలగిస్తానని హెచ్చరిక సైతం చేయడం గమనార్హం. అదేవిధంగా, సెంట్రల్ బ్యాంకు బోర్డులోని ఏడుగురు సభ్యుల్లో లిసా ఒకరు. మొత్తం 12 మంది సభ్యుల్లో లిసా సహా ఏడుగురికి మాత్రం వడ్డీ రేట్లు తగ్గించే అధికారముంది. వడ్డీ రేటు తగ్గించేందుకు లిసా అంగీకరించడం లేదు. జూలైలో జరిగిన బోర్డు సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు పావెల్‌తోపాటు ఓటేసిన వారిలో లిసా కుక్ ఉన్నారు. దీంతో, ఇటీవల రాజీనామా చేయాలంటూ ట్రంప్ కోరినా ఆమె కొనసాగుతూనే ఉన్నారు. ఇది నచ్చని ట్రంప్ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారంతోనే లిసా కుక్‌ను తొలగించినట్లు తాజాగా సమర్థించుకున్నారు. ఆ అధికారం అధ్యక్షుడికి లేదు ఫెడరల్ రిజర్వు గవర్నర్ లిసా కుక్ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. వేధింపులకు భయపడి రాజీనామా చేయబోనని తెగేసి చెప్పారు. తనను తొలగించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేశారు. అమెరికా ప్రజలకు సేవలందించేందుకు 2022 నుంచి కొనసాగుతున్నానన్నారు. ట్రంప్ చర్యకు తగు కారణం లేదన్నారు. ట్రంప్ చూపుతున్న పత్రాలు నాలుగేళ్ల క్రితం తాను సెంట్రల్ బ్యాంకులో చేరకముందునాటివని తెలిపారు. -
ప్రజా ప్రభుత్వాల మనుగడ గవర్నర్ల దయపైనా?
న్యూఢిల్లీ: ‘‘దేశ పాలన వ్యవస్థలో అతి కీలకమైన గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సామరస్యం ఉందా? అతి పెద్ద అధికార కేంద్రాలైన ఈ రెండు వ్యవస్థల నడుమ పలు కీలక అంశాలపై రాజ్యాంగంలో పేర్కొన్న మేరకు ప్రజా ప్రయోజనాలే పరమావధిగా సజావుగా సంప్రదింపుల ప్రక్రియ అసలు జరుగుతోందా?’’అని సర్వోన్నత న్యాయస్థానం కీలక సందేహాలు లేవనెత్తింది. రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలను నెరవేర్చడంలో దేశం ఏ మేరకు సఫలమైందో అర్థం కాని పరిస్థితి నెలకొందంటూ ఆవేదన వెలిబుచ్చింది.‘‘అసెంబ్లీలు ఆమోదించే బిల్లులను గవర్నర్ నిరవధికంగా పెండింగ్‌లో ఉంచితే పరిస్థితేమిటి? మెజారిటీ ప్రజల తీర్పు ఆధారంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ మనుగడ గవర్నర్ల చపలత్వంపై ఆధారపడ్డట్టేగా! ఇది ఏ మేరకు సబబు? రాష్ట్రంలో పాలన తదితరాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండదా?’’అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించింది. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపే బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం గవర్నర్లకు లేదని పునరుద్ఘాటించింది. ‘‘ఆర్టికల్ 200 ప్రకారం ఈ విషయంలో గవర్నర్ ముందు నాలుగు మార్గాలున్నాయి. బిల్లుకు ఆమోదం, పెండింగ్, రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, అసెంబ్లీ పరిశీలనకే తిప్పి పంపడం. అసెంబ్లీ గనక బిల్లును మళ్లీ ఆమోదించి పంపితే దాన్ని రెండోసారి రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం గవర్నర్‌కు లేదు’’అని స్పష్టం చేసింది.రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్ర వేసే విషయంలో గవర్నర్లతో పాటు ఏకంగా రాష్ట్రపతికి కూడా గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలనాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. ఈ విషయంలో సుప్రీంకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని పలువురు న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. అనంతరం ఈ విషయమై సర్వోన్నత న్యాయస్థానానికి ఉన్న అధికార పరిధిపై పలు రాజ్యాంగపరమైన సందేహాలు లేవనెత్తుతూ ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్రపతి ఏకంగా ప్రశ్నావళి పంపడం మరింత కలకలం రేపింది. సీజేఐకి రాష్ట్రపతి ప్రశ్నావళి పంపడం తాలూకు రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం సుదీర్ఘంగా విచారణ జరిపింది.గవర్నర్ల నియామకం, అధికారాలకు సంబంధించి రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన చర్చలను ఉటంకిస్తూ కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్పించారు. కొందరు ఆరోపిస్తున్నట్టుగా గవర్నర్ పదవి రాజకీయ ఆశ్రయానికి ఉద్దేశించినది కానే కాదని మెహతా స్పష్టం చేశారు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు గవర్నర్‌కు పలు కీలక అధికారాలు, బాధ్యతలు దఖలు పడ్డాయని గుర్తు చేశారు. ‘‘రాష్ట్రపతికి, గవర్నర్లకు ఇలా గడువు నిర్దేశించడమంటే అత్యున్నత వ్యవస్థల్లో ఒక వ్యవస్థ రాజ్యాంగం తనకు దఖలు పరచని అధికారాలను నెత్తిన వేసుకోవడమే తప్ప మరోటి కాదు. అంతిమంగా ఇది రాజ్యాంగపరమైన అవ్యవస్థకే దారి తీస్తుంది’’అని హెచ్చరించారు.గవర్నర్లు తమ విచక్షణాధికారాన్ని అత్యంత పరిమితంగా మాత్రమే ఉపయోగిస్తారని చెప్పుకొచ్చారు. దీనిపై ధర్మాసనం సూటిగా స్పందించింది. ‘‘చట్టం అమలు తాలూకు తీరుతెన్నులపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తామే తప్ప తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ కేసులో రాష్ట్రపతికి, గవర్నర్లకు గడువు విధిస్తూ సుప్రీం ధర్మాసనం వెలువరించిన నిర్ణయంపై కాదు. ఈ విషయంలో సలహాపూర్వక న్యాయపరిధికే పరిమితం అవుతాం తప్ప అపీల్ కోర్టులా వ్యవహరించబోం’’అని స్పష్టం చేసింది. సీజేఐ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ఉన్నారు. -
RN Ravi: గవర్నర్‌ను అవమానించిన విద్యార్థిని
చెన్నై: యూనివర్సిటీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ రవిని (ఆర్.ఎన్.రవి) ఓ విద్యార్ధిని అవమానించింది. డాక్టరేట్‌ను గవర్నర్ చేతులు మీదిగా తీసుకునేందుకు తిరస్కరించింది. గవర్నర్ ఆర్.ఎన్ రవి పిలుస్తున్నా.. పట్టించుకోకుండా వెళ్లిపోయింది. దీంతో తమిళనాడు ప్రభుత్వానికి..ఆ రాష్ట్ర గవర్నర్ల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగంగా బయటపడ్డాయి. మనోన్మణియం సుందరనార్ యూనివర్సిటీలో 32వ కాన్వికేషన్ వేడుక జరిగింది. ఈ వేడుకలో విద్యార్ధిని, అధికార డీఎంకే నేత రాజన్ సతీమణి జీన్‌జోసెఫ్ తన డిగ్రీని అందుకునేందుకు వేదికపైకి వచ్చారు. వాస్తవానికి డిగ్రీ పట్టాను గవర్నర్ తన చేతులకు మీదిగా విద్యార్ధులకు అందించడం ఆనవాయితి. కానీ మనోన్మణియం సుందరనార్ కాన్వకేషన్ వేడుకల్లో విద్యార్థులు గవర్నర్ చేత డిగ్రీలు తీసుకుంటుండగా..జీన్ జోసెఫ్ గవర్నర్ ఆర్.ఎన్ రవిని కాదని పక్కన ఉన్న వైస్ చాన్సలర్ చంద్రశేఖర్ చేతులు మీదిగా తీసుకున్నారు. గవర్నర్ ఆమెను పిలిచినా పట్టించుకోలేదు. వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ చేతులు మీదిగా పట్టాను అందుకున్నారు. గవర్నర్ ఆర్.ఎన్.రవి ఏం చేశారని..మైక్రో ఫైనాన్స్‌లో డాక్టరేట్ పొందిన జీన్ జోసెఫ్ గవర్నర్‌కు బదులుగా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ నుండి డాక్టరేట్‌ను తీసుకోవడం స్థానిక మీడియా ఆమెను ప్రశ్నించింది. ‘గవర్నర్ ఆర్.ఎన్.రవి తమిళనాడు రాష్ట్రానికి, ప్రజలకు వ్యతిరేకం. ఆయన తమిళ ప్రజల కోసం ఏమీ చేయలేదు. అందుకే ఆయన చేతి నుండి డాక్టరేట్‌ను స్వీకరించాలనుకోలేదు’ అని జీన్ జోసెఫ్ పేర్కొన్నారు.தமிழுக்கும், தமிழ்நாட்டுக்கும் எதிராக செயல்படுவதால் ஆளுநர் கையில் பட்டத்தை வாங்காமல் தவிர்த்த மனோன்மணியம் சுந்தரனார் பல்கலைக்கழக மாணவி ஜீன் ஜோசப் அவர்கள்.ஆளுநரை தமிழ்நாட்டு மக்கள் எவ்வாறு புரிந்து கொண்டுள்ளார்கள் என்பது ரவி அவர்களுக்கு தெரிந்து இருக்கும், சங்கிகளுக்கு… pic.twitter.com/zIB8e8or5D— DMK Updates (@DMK_Updates) August 13, 2025 తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ ఆర్.ఎన్ రవి నవంబర్ 2020 నుండి ఏప్రిల్ 2023 వరకు తమిళనాడు అసెంబ్లీ 13 బిల్లులను ఆమోదించింది. వాటిలో 10 బిల్లులను గవర్నర్ తిరస్కరించారు. కొన్నింటి తిరిగి పంపించారు. అసెంబ్లీ మళ్లీ ఆ బిల్లులను మార్పులు లేకుండా ఆమోదించినా, గవర్నర్ వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. దీంతో గవర్నర్ తీరును తప్పుబడుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు గవర్నర్ తీరును ప్రశ్నించింది. ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదం తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. నాటి నుంచి తమిళనాడు ప్రభుత్వానికి.. గవర్నర్ ఆర్.ఎన్ రవి విభేదాలు కొనసాగుతున్నాయి. తాజా స్నాతకోత్సవ ఘటనతో మరోసారి భయటపడింది -
టీడీపీ గూండాల అరాచకంపై గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ గూండాల అరాచకం, నిర్వీర్యమైన శాంతిభద్రతలు, అధికారపార్టీకి అండగా నిలుస్తున్న పోలీస్ యంత్రాంగంపై విజయవాడలో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు నాయకులు గవర్నర్‌ను కలిశారు.ఈ సందర్బంగా పులివెందుల్లో టీడీపీ గూండాలు పట్టపగలు మారణాయుధాలతో దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, వైఎస్సార్సీపీ నేతలను హతమార్చేందుకు ప్రయత్నించిన తీరు, పోలీసులు పట్టించుకోకుండా అధికార పార్టీకి ఎలా అండగా నిలుస్తున్నారో అన్ని ఆధారాలతో సహా గవర్నర్‌కు వివరించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడి చేసి, ఎలా గాయపరిచారో తెలియచేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రాజ్‌భవన్ వెలుపల బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే...కడప జిల్లా పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్బంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో పాటు పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా టీడీపీకి చెందిన గూండాలు పది వాహనాల్లో వచ్చి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రవి, ఇతరులను హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ దాడులు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. బీసీ నాయకుడు రమేష్ యాదవ్ శాసనమండలి సభ్యుడుగా ఉన్నారు. ఆయనకు కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు దాడి జరుగుతుంటే, పట్టించుకోకుండా ఉన్నారు.కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలు చూస్తేనే ఇది అర్థమవుతోంది. ఆయన మాటలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. తక్షణం గవర్నర్ దీనిపై దృష్టి సారించాలని కోరాం. ఎన్నికల కమిషన్‌కు కూడా దీనిపై ఫిర్యాదు చేశాం. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా, చట్టబద్దంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరాం.ఆ విషయాన్ని కూడా గవర్నర్‌కు వివరించాం. కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వైనంను ఆధారాలతో సహా గవర్నర్‌కు తెలియచేశాం. డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడిన మాటలు పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటు. అన్ని సందర్భాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. వ్యవస్థలు చట్టప్రకారం పనిచేయాలే తప్ప రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారకూడదు.గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రమేష్ యాదవ్, కల్పలతారెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నేతలు దేవినేని అవినాష్, నౌడు వెంకటరమణ తదితరులు ఉన్నారు. -
గవర్నర్‌ను కలవనున్న వైఎస్సార్సీపీ బృందం
సాక్షి, తాడేపల్లి: పులివెందులలో టీడీపీ అరాచకాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై టీడీపీ గుండాలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ విషయమై.. గురువారం సాయంత్రం వైఎస్సార్సీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని బృందం ఆయన్ని కలిసి జరిగిన పరిణామాలను వివరించనుంది. అదే సమయంలో దాడికి పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోకుండా ఏకపక్షంగా బాధితులమీద కేసులు నమోదు అవుతున్న విషయం పైనా ఫిర్యాదు చేయనుంది. పులివెందులలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని బొత్స బృందం గవర్నర్‌ను కోరనున్నట్లు సమాచారం. -
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(79) కన్నుమూశారు. అతని ఎక్స్ ఖాతాను నిర్వహించే బృందం ఈమేరకు తన మరణాన్ని ధ్రువీకరించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి(ఆర్ఎంఎల్)లో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. ఆయన పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆర్కే పురంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. రేపు లోధి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.మాలిక్ 1970వ దశకంలో ఎమ్మెల్యేగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాజకీయ నాయకుడిగా దాదాపు 50 ఏళ్ల సుధీర్ఘ అనుభవం ఉంది. పశ్చిమ యూపీలోని బాగ్‌పట్‌కు చెందిన ఆయన మొదట చౌదరి చరణ్ సింగ్ ఆధ్వర్యంలోని భారతీయ క్రాంతి దళ్ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో చరణ్ సింగ్ నేతృత్వంలోని లోక్‌దళ్ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. కానీ 1984లో కాంగ్రెస్‌లో చేరి 1986లో రాజ్యసభకు వెళ్లారు.ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఆయన ఏడాది కాలం పని చేశారు. గోవా, మేఘాలయ రాష్ట్రాలకు కూడా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా పని చేసిన సత్యపాల్ మలిక్ చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ఈయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆర్మీ జవాన్లను హెలికాప్టర్లో తరలించాలన్న తన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం మన్నించి ఉంటే పుల్వామా ఘటన జరిగేదే కాదని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని నెలల క్రితం జరిగిన పహల్గామ్ దాడి విషయంలోనూ ఆయన మోడీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. నిఘాలోపం కారణంగానే ఈ ఘటన జరిగిందని, ఈ ప్రభుత్వం సిగ్గులేనిదని అంటూనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.पूर्व गवर्नर चौधरी सत्यपाल सिंह मलिक जी नहीं रहें।#satyapalmalik— Satyapal Malik (@SatyapalMalik6) August 5, 2025జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత 2024లో మాలిక్ నివాస స్థలంతోపాటు సుమారు 30 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది. అయితే ఇందులో రూ.21 లక్షల నగదును, కొన్ని డిజిటల్ పరికరాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. లంచం తీసుకున్న కేసులో ప్రశ్నించేందుకు హాజరు కావాల్సిందిగా సీబీఐ ఆదేశించింది కూడా. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని మాలిక్ స్పష్టం చేశారు. గవర్నర్‌గా ఉండగా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే విషయంలో తనకు రూ.300 కోట్ల లంచం ఇవ్వజూపారని మాలిక్ ఆరోపించారు. ఈ ఏడాది మే నెలలో సీబీఐ మాలిక్‌తోపాటు మరో ఐదుగురిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సుమారు రూ.2200 కోట్ల సివిల్ కాంట్రాక్ట్‌ల జారీ విషయంలో అక్రమాలు జరిగాయన్నది ఆయనపై సీబీఐ చేసిన ఆరోపణ. -
యనమల.. సలసల!
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సమకాలీకుడైన యనమల రామకృష్ణుడు పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానాలతో రగిలిపోతున్నారు. చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ తనపట్ల అనుసరిస్తున్న వైఖరిని ఆయన ఏమాత్రం జీర్జించుకోలేకపోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుకి గవర్నర్ పదవి రావడంతో యనమలలో అసంతృప్తి తారస్థాయికి చేరింది.తనకి కాకుండా అశోక్‌కి చంద్రబాబు గవర్నర్ పదవి ఇప్పించడం ఆయనకు అస్సలు నచ్చకపోగా పెద్ద అవమానంగా భావిస్తున్నారు. గవర్నర్ పదవికి తాను ఎందుకు అర్హుడిని కానని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. చంద్రబాబు ఈ స్థాయికి రావడానికి అన్ని విధాలా సహకరించడంతోపాటు రాజ్యాంగపరమైన సమస్యలు, ఇబ్బందులు వచి్చనప్పుడు కూడా అవన్నీ తన భుజానే వేసుకుని పరిష్కరించే వాడినని.. అలాంటి తనను కాదని అశోక్‌కి పదవి ఇవ్వడం అన్యాయమని యనమల మథనపడుతున్నారు. ప్రతీ అవసరానికి వాడుకున్నారు.. టీడీపీకి మరో గవర్నర్ పదవి దక్కే పరిస్థితి లేకపోవడం, భవిష్యత్తులోనూ అలాంటి అవకాశాలు వస్తాయో లేదో తెలీని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో.. యనమల తాను గౌరవప్రదమైన పదవిని పొంది ఆ తర్వాత రాజకీయాల నుంచి ని్రష్కమించే అవకాశం లేకుండా చేశారని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అన్ని అవసరాలకు చంద్రబాబు తనను వాడుకుని ఇప్పుడు పట్టించుకోకుండా వదిలేశారని, రాజకీయాల నుంచిఅవమానకరంగా రిటైర్ అయ్యేలా చేశారని ఆయన మండిపడుతున్నారు.ఇటీవల తన ఎమ్మెల్సీ పదవి గడువు ముగిసినా రెన్యువల్ చేయకుండా ఇబ్బందికరంగా పక్కకు తప్పించి జూనియర్లు, కొత్తగా వచి్చన వారికి అవకాశం ఇవ్వడం తనను అవమానించడమేనని ఆయన చెబుతున్నట్లు సమాచారం. చంద్రబాబు రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదగడానికి.. టీడీపీ నిలబడడానికి తాను కూడా కారణమనే విషయాన్ని మరచిపోయి ఇప్పుడు తన పట్ల ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారని ఆయన కారాలుమిరియాలు నూరుతున్నారు. వెన్నుపోటు ఎపిసోడ్లో నేను లేకపోతే ఏమయ్యేది? ఎనీ్టఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని ఆయన చేతుల్లో నుంచి చంద్రబాబు చేతుల్లోకి వచ్చేలా చేయడంలో యనమల రామకృష్ణుడిది అత్యంత కీలకపాత్ర. అప్పట్లో అసెంబ్లీ స్పీకర్‌గా ఉండి సభలో ఎన్టీఆర్‌కు కనీసం మాట్లాడ్డానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఆ ఎపిసోడ్లో అన్ని విధాలా సహకరించడంతో చంద్రబాబు సీఎంతో పాటు టీడీపీ సారథి అయ్యారు. ఈ మొత్తం ఉదంతంలో యనమల ఆయన వెన్నంటే ఉండి సహకరించారు.ఆ తర్వాత కూడా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలు రాజ్యాంగపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు తనను ఉపయోగించుకున్నారని గుర్తుచేస్తున్నారు. అలాంటి తాను రాజకీయాల నుంచి హుందాగా రిటైర్ అయ్యే ఉద్దేశంతో 2014–19 మధ్య రాజ్యసభకు పంపాలని అడిగితే మంత్రి బాద్యతలు అప్పగించారని చెబుతున్నారు. కనీసం ఇప్పుడైనా రాజ్యసభ ఇవ్వాలని అడిగినా పట్టించుకోకపోగా కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా రెన్యువల్ చేయలేదని వాపోతున్నారు. గవర్నర్ పదవి అడిగితే బాబు స్పందించలేదు.. కేంద్రంలో ఎన్డీయే కూటమిలో కలిసి ఉండడంతో ఈసారి కచి్చతంగా టీడీపీకి ఒక గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉండడంతో అది తనకు ఇప్పించాలని యనమల కొద్దిరోజుల క్రితం నోరుతెరిచి అడిగినా చంద్రబాబు స్పందించలేదని సమాచారం. చంద్రబాబు దృష్టి అశోక్‌పై ఉండడంతో ఆయనకు పదవి ఇచ్చి తనను అవమానించారని యనమల భావిస్తున్నారు. అశోక్ కంటే తాను ఎందులో తక్కువని, పార్టీకి తాను చేసిన సేవలు, అశోక్ చేసిన సేవలు పోల్చి చూస్తే ఎవరు ఎక్కువ చేశారో తెలుస్తుందని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.బీసీల పార్టీ అని చెప్పుకుంటూ పార్టీలో అత్యంత సీనియర్ బీసీ నేతగా ఉన్న యనమల రామకృష్ణుడిని అవమానించడంపై టీడీపీలోని బీసీ నేతలు సైతం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కాకినాడ పోర్టు వ్యవహారంలో కేవీ రావుకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక దాన్ని ప్రశ్నిస్తూ ఆయన చంద్రబాబుకు లేఖ రాసినప్పుడు ఆయనపై ఎదురుదాడి చేయించారు.చంద్రబాబు తెలివిగా పార్టీలోని బీసీ నేతలతోనే ఆయనపై ఆరోపణలు, విమర్శలు చేయించడంతోపాటు సోషల్ మీడియాలో ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేసేలా చేశారు. అప్పటి నుంచి చంద్రబాబుకు, యనమలకు గ్యాప్ వచ్చినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, ఇప్పుడు గవర్నర్ పదవి అశోక్‌గజపతిరాజుకు ఇవ్వడంతో ఇక పార్టీలో తనకు తలుపులు మూసుకుపోయినట్లేనని, ఇది తనకు తీరని అవమానమని యనమల కుమిలిపోతున్నట్లు సమాచారం. -
కాలిఫోర్నియా గవర్నర్ పోటీపై కమలా హారిస్ ఆసక్తికర ప్రకటన
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో 2028లో జరగబోయే గవర్నర్ ఎన్నికల్లో తన పోటీపై మాజీ ఉపాధ్యక్షురాలు, అమెరికన్ డెమొక్రాటిక్ పార్టీ సభ్యురాలు కమలా హారిస్ ఆసక్తికర ప్రకటన చేశారు. గతంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్, యూఎస్ సెనేటర్‌గా పనిచేసిన కమలా హారిస్ తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికలను సూచన ప్రాయంగా వెల్లడించారు.2026లో కాలిఫోర్నియా గవర్నర్ పదవికి జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కమలా హారిస్ తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేశారు. ఈ ప్రకటన నేపధ్యంలో ఆమె 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తన పోస్టులో కమలా హారిస్.. ‘గత ఆరు నెలలుగా తాను అమెరికన్ ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం కొనసాగించేందుకు ఉత్తమ మార్గం గురించి ఆలోచిస్తున్నాను. నా కెరీర్ తొలి రోజుల నుండి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి, మెరుగైన భవిష్యత్తు కోసం పోరాడుతున్నాను. ఇందుకు ఉత్తమ మార్గం వ్యవస్థను సంస్కరించడమేనని నేను నమ్ముతున్నాను. ప్రాసిక్యూటర్, అటార్నీ జనరల్, యునైటెడ్ స్టేట్స్ సెనేటర్, వైస్ ప్రెసిడెంట్‌గా దేశానికి సేవ చేయడం నాకు గౌరవప్రదంగా ఉంది’ అని అన్నారు. My statement on the California governor's race and the fight ahead. pic.twitter.com/HYzK1BIlhD— Kamala Harris (@KamalaHarris) July 30, 2025అలాగే 'ఇటీవల కొంతకాలంగా కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీ చేస్తారా? అని కొందరు అడిగిన దరిమిలా దీనిపై నేను ఆలోచించాను. నేను ఈ రాష్ట్రాన్ని, ఇక్కడి ప్రజలను ప్రేమిస్తున్నాను. అయితే లోతుగా ఆలోచించిన తర్వాత, ఈ ఎన్నికల్లో గవర్నర్ పదవికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతానికి నేను ఏ ఎన్నికైన పదవిలోనూ ఉండకూడదని అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో నా భవిష్యత్ ప్రణాళికల గురించి మరింత సమాచారాన్ని పంచుకుంటాను’ అని కమలా హారిస్ అన్నారు. ఆమె గతంలో రెండుసార్లు అధ్యక్ష పోటీలో నిలిచారు. అయితే రెండు సార్లూ ఓటమి పాలయ్యారు. 2024లో కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ట్రంప్ చేతిలో ఓడిపోయారు. -
రాష్ట్రపతికి గడువుపై మీరేమంటారు?
న్యూఢిల్లీ: అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతికి కాల పరిమితి విధించడంపై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీలోగా సమాధానాలను అందజేయాలంటూ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది.ఈ అంశంపై ఆగస్ట్‌లో విచారణ చేపడతామని వెల్లడించింది. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతి న్యాయస్థానాలు కాల పరిమితి విధించవచ్చా అంటూ మేలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలతో లేఖ రాయడం తెల్సిందే. పరిశీలన కోసం గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి అవి అందిన నాటి నుంచి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఏప్రిల్‌లో జారీ చేసిన ఉత్తర్వులు సంచలనం రేపడం తెల్సిందే. -
గవర్నర్ కు వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
-
Raj Bhavan: నేను మీకు చెప్పను గవర్నర్‌కే చెబుతా..
పంజగుట్ట: గవర్నర్‌ను కలవాలంటూ రాజ్‌భవన్ ముందు ఒక మహిళ బైఠాయించింది. గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ రాజ్‌భవన్ గేటు ముందు బైఠాయించడంతో పోలీసులు ఆమెను పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే..రిసాలబజార్‌కు చెందిన నాగమణి శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్ వద్దకు వచ్చి గేటు ముందు బైఠాయించింది. అక్కడున్న సెక్యురిటీ సిబ్బంది ఏం కావాలి అని అడిగితే బోరున ఏడుస్తూ తాను గవర్నర్‌ను కలవాలి అని చెప్పింది. సమస్య ఏమిటో చెప్పు అంటే నేను మీకు చెప్పను గవర్నర్‌కే చెబుతాను అంటూ అక్కడే బైఠాయించింది. దీంతో పోలీసులు వచ్చి ఆమెను స్టేషన్‌కు తరలించారు. ముంబైలో తన ఇంట్లో రూ.24 లక్షల చోరీ జరిగిందని, ఇదే విషయమై బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోవడంలేదని, ముఖ్యమంత్రి ఇంటికి వారం రోజులు తిరిగాను, పోలీస్ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లాను అయినా ఏం ఫలితం లేదంటూ ఏదేదో చెబుతుందని పోలీసులు తెలిపారు. నాగమణి మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉండి..పొంతన లేకుండా మాట్లాడుతుందని పోలీసులు తెలిపారు. -
అన్ని విధాలుగా అండగా నిలుస్తాం
కోల్‌కతా: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్ల బాధితులను గవర్నర్ ఆనందబోస్ పరామర్శించారు. సాధ్యమైనంత మేర అన్ని విధాలుగా అండగా నిలుస్తామని వారికి హామీ ఇచ్చారు. అల్లర్ల సమయంలో దుండగులు షంషేర్‌గంజ్ ప్రాంతం జఫ్రాబాద్‌లో ఓ ఇంట్లో ఉన్న తండ్రి హర గోవింద్ దాస్, అతని కుమారుడు చందన్ దాస్‌లను కత్తితో పొడిచి చంపారు. వీరి కుటుంబీకులు శనివారం తమ ఇంటికి వచ్చిన గవర్నర్ కాళ్లపై పడి, న్యాయం చేయాలని వేడుకున్నారు. ‘వీరి అభ్యర్థనలను పరిశీలిస్తాం. బాధితుల నుంచి మూడు, నాలుగు సూచనలందాయి. స్థానికంగా బీఎస్ఎఫ్ పోస్టులను ఏర్పాటు చేయడం ఇందులో ఒకటి. ఈ అంశాన్ని సంబంధిత యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తా. సానుకూల చర్యలను కచ్చితంగా తీసుకుంటాం. రాజ్‌భవన్‌లో అందుబాటులోకి తెచ్చిన హెల్ప్‌లైన్ నంబర్‌ను వారికి అందజేశా’అని గవర్నర్ మీడియాకు తెలిపారు. అనంతరం ధులియన్ బజార్ ప్రాంతంలో బాధితులను కలుసుకున్నారు. బాధితులు కోరిన ప్రకారం న్యాయం దక్కేలా చూస్తామన్నారు. జఫ్రాబాద్‌లోని బెట్బోనా గ్రామం వద్ద స్థానికులు రోడ్డుపై అడ్డంకులు ఏర్పాటు చేయగా గవర్నర్ ఆగి, వారిని శాంతపరిచారు. అంతకుముందు, ఫరక్కాలోని అతిథి గృహం వద్ద కూడా గవర్నర్ అల్లర్ల బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగిన అల్లర్లలో తండ్రి, కుమారుడు సహా ముగ్గురు చనిపోవడంతోపాటు భారీగా ఆస్తినష్టం సంభవించిన ఘటనలపై పోలీసులు 274 మందిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం గవర్నర్ ఆనందబోస్ మాల్డా జిల్లాలో తాత్కాలిక శిబిరంలో తలదాచుకుంటున్న అల్లర్ల బాధిత ముర్షిదాబాద్ వాసులను పరామర్శించడం తెల్సిందే. బాధితుల గోడు విన్న మహిళా కమిషన్ జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ విజయా రాహత్కర్ శనివారం బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ధులియన్ తదితర వక్ఫ్ అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బెట్బోనా గ్రామంలో దుండగులు తమను భయభ్రాంతులకు గురి చేశారంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, బీఎస్ఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలి, దాడులపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలి అంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు. హింసాత్మక ఘటనల తీవ్రత అనూహ్య స్థాయిలో ఉందని తెలిసిందని అనంతరం రాహత్కర్ మీడియాకు తెలిపారు. బాధితుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని వారికి హామీ ఇచ్చామన్నారు. ఇక్కడి బాధిత మహిళల డిమాండ్లపై హోం మంత్రి అమిత్ షాకు నివేదిక అందజేస్తామని ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు అర్చనా మజుందార్ తెలిపారు. శుక్రవారం మాల్డాలో అల్లర్ల బాధితులను రాహత్కర్ సారథ్యంలోని బృందం కలుసుకోవడం తెల్సిందే. రాష్ట్రపతి పాలన విధించాలి: వీహెచ్‌పీ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్‌లో చోటుచేసుకున్న అల్లర్లను నిరసిస్తూ శనివారం విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలను నిర్వహించింది. బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. బెంగాల్లో హిందువులకు రక్షణ కలి్పంచాలని, ముర్షిదాబాద్ అల్లర్ల బాధితులకు తగు పరిహారం అందజేయాలని కోరింది. బెంగాల్లో బంగ్లాదేశీ–రొహింగ్యా చొరబాటుదార్లను గుర్తించి, వెళ్లగొట్టాలంది. సోమవారం కూడా నిరసనలు తెలుపుతామని తెలిపింది. -
KTR: ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా’
హైదరాబాద్,సాక్షి: సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ల నిర్ణయాలకు కాలపరిమితిని నిర్ధేశించిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆదివారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. పాలనలో అడ్డంకులు సృష్టించడానికి బీజేపీ,కాంగ్రెస్ జాతీయ పార్టీలు లెక్కలేనన్ని సార్లు గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేశాయి. అసెంబ్లీ స్పీకర్లచే రాజ్యాంగ దుర్వినియోగాన్ని కూడా.. సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి నిర్ణయించాలని ఎక్స్‌లో పేర్కొన్నారు. Welcome the Hon’ble Supreme Court’s decision to set a timeline for decisions of GovernorsCountless times, both BJP and Congress have abused the institution of Governor to create hindrances in Governance Supreme Court should also take into cognisance the rampant abuse of… https://t.co/Oj2hTA2hWd— KTR (@KTRBRS) April 13, 2025 -
సుప్రీంకోర్టు తీర్పు సబబే
సాక్షి, అమరావతి: శాసనసభ ఆమోదించిన బిల్లులపై తమ నిర్ణయం వెలువరించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కాల పరిమితిని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును న్యాయ నిపుణులు స్వాగతిస్తున్నారు. రాష్ట్రపతికి, గవర్నర్లకు కాలపరిమితి విధించడం తప్పేమీ కాదని స్పష్టంచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందేనని, ఇందుకు రాష్ట్రపతి, గవర్నర్లు అతీతులు కాదంటున్నారు. బిల్లుల విషయంలో గవర్నర్లు చేస్తున్న అసాధారణ, రాజకీయ జాప్యం వల్ల ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడకుండా సుప్రీంకోర్టు తీర్పు రక్షిస్తుందని పేర్కొంటున్నారు. ఇది చారిత్రక తీర్పుగా అభివర్ణిస్తున్నారు.ప్రజా తీర్పును గవర్నర్లు అడ్డుకోలేరుచట్టసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను, మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతిని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్థిస్తున్నా. చట్టసభల నిర్ణయాల్లో ప్రజల ప్రయోజనాలే ప్రతిబింబిస్తుంటాయి. చట్టసభలు తీసుకునే నిర్ణయాలను రాష్ట్రపతి చేత నామినేట్ అయ్యే ఓ గవర్నర్ తన ఇష్టానుసారం అడ్డుకోవడం సబబు కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. – సీవీ నాగార్జునరెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిఇది సరైన తీర్పేసుప్రీంకోర్టు సరైన తీర్పే ఇచ్చింది. గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా నడుచుకోకపోవడం, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నచోట ఆ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. ఇటీవల గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. పరిధులు దాటుతున్నారు. రాజ్యాంగ విలువలకు, సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోవడం లేదు. గవర్నర్ల తీరుతో సుప్రీంకోర్టు విధిలేని పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా తాజా తీర్పునిచ్చింది. – సీవీ మోహన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదిన్యాయ సమీక్ష తప్పేమీ కాదుచట్టసభల ఆమోదం పొందిన బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతికి నిర్దిష్ట గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేక కోణంలో చూడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగానికి లోబడే సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. తన వద్దకు వచ్చే బిల్లుల విషయంలో నిర్ణయానికి సంబంధించి రాష్ట్రపతికి ఇప్పటివరకు నిర్దిష్ట గడువు అంటూ లేదు. గడువు లేదన్న నెపంతో ఏళ్ల తరబడి ఆ బిల్లులను అలా పెండింగ్‌లో పెట్టుకుంటామంటే ఎలా? ప్రజల ఆకాంక్షలు ఏం కావాలి? శాసనసభ చేసిన బిల్లులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అందులో రాష్ట్రపతి, గవర్నర్లు జోక్యం చేసుకోవచ్చు. అలాగే ఆ బిల్లులు ఏకపక్షంగా, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. గవర్నర్ల తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పుడు, వారి నిర్ణయాలు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కోర్టులు న్యాయ సమీక్ష చేయడం తప్పేమీ లేదు. సుప్రీంకోర్టు అదే చేసింది.– చిత్తరవు నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది -
గవర్నర్ల నుంచి రాష్ట్రపతికి బిల్లులు .. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
మూడు నెలల్లో తేల్చేయాల్సిందే.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి దేశసర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల నిలుపుదల విషయంలో గవర్నర్లకు, రాష్ట్రాలకు రాజ్యాంగ బద్ధమైన ప్రత్యేక అధికారాలేవీ ఉండబోవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.ఇంతకు ముందు గవర్నర్ల విషయంలోనూ ఇలాంటి గడువును నిర్దేశించిన సుప్రీం కోర్టు.. ఇప్పుడు రాష్ట్రపతి విషయంలోనూ ఈ తరహా సూచన చేయడం తెలిసిందే. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో..ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను మూడు నెలలకు మించి ఉంచకూడదని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని తాజాగా బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ జాప్యం జరిగితే గనుక సరైన రాష్ట్రపతి భవన్ ఆ కారణాలను రాష్ట్రాలకు వివరించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ నిర్ణీత సమయంలోపూ రాష్ట్రపతి నుంచి సరైన స్పందన లేకుంటే మాండమస్ రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సూచించింది.అంతకు ముందు గవర్నర్ విషయంలోనూ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రి మండలి సలహా సూచనల మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదంది. ఇక.. తాజాగా ఆర్టికల్ 201 రాష్ట్రపతి విషయంలోనూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ బిల్లు గనుక రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే.. రాష్ట్రపతి ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీం కోర్టును సంప్రదించడానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
సుప్రీంకోర్టులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి షాక్
ఢిల్లీ: సుప్రీం కోర్టులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎంకే స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట దక్కింది. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ వెంటనే ఆమోదం తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.తమిళనాడు ఎంకే స్టాలిన్ ప్రభుత్వం పదిబిల్లులను ప్రతిపాదించింది. అయితే, ఆ బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలపలేదు. ఇదే అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి తీరును సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. గవర్నర్ చట్టవిరుద్ధంగా వ్యవహించారనే అభిప్రాయం వ్యక్తం చేసింది. వెంటనే ప్రభుత్వం ప్రతిపాదించిన పది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాలని స్పష్టం చేసింది. Key pointers from Supreme Court judgement in Tamil Nadu Governer RN Ravi case:➡️ Reservation of 10 bills for consideration by parliament after they were reconsidered by State assembly is illegal. ➡️Any consequential steps taken by President on the 10 bills is NON EST ➡️ Court… pic.twitter.com/1nlANNi7Gs— Bar and Bench (@barandbench) April 8, 2025గవర్నర్ పది బిల్లులను రిజర్వ్ చేయడం అనేది చట్ట విరుద్ధం. అందువల్ల, ఆ చర్యను రద్దు చేస్తున్నాం. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న పది బిల్లులకు క్లియరెన్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ బిల్లులు గవర్నర్‌కు సమర్పించిన తేదీ నుండి ఆమోదించబడినట్లుగా పరిగణించబడతాయి’ అని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై సీఎం డీఎంకే స్టాలిన్ హర్షంసుప్రీం కోర్టు తీర్పుపై తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు చారిత్రాత్మకమైందని’ అభివర్ణించారు. ఈ తీర్పు కేవలం ఒక్క తమిళనాడుకే కాదు. దేశంలోని అన్నీ రాష్ట్రాలకు గర్వ కారణం’ అని అన్నారు. 2021లో తమిళనాడు గవర్నర్‌గా ఆర్ఎన్ రవిసీబీఐలో పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎన్. రవి 2021లో తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వంతో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు.బీజేపీ అధికార ప్రతినిధి అంటూ విమర్శలుఇదే అంశంపై డీఎంకే ప్రభుత్వం గవర్నర్ ఆర్ఎన్ రవిపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చింది. గవర్నర్ ఆర్ రవి బీజేపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మండి పడిందది. కావాలనే రాష్ట్ర శాసనసభ బిల్లులకు ఆమోదం తెలపకపోవడం , నియామకాలపై అనుమతి నిరాకరించారని ధ్వజమెత్తింది. అయితే, గవర్నర్ రవి మాత్రం తనకు రాజ్యాంగం అందించిన అధికారాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నానంటూ సర్థించుకున్నారు. అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ గవర్నర్ తన పదవిలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లోనూ వివాదాలు కొనసాగుతున్నాయి. గత ఏడాది, గవర్నర్ ప్రారంభపు ఉపన్యాసం సందర్భంగా జాతీయ గీతం పాడకపోవడంపై గవర్నర్ టీఎన్ రవి నిరసనగా సభనుంచి వెళ్లిపోయారు. తమిళనాడు అసెంబ్లీలో సాంప్రదాయం ప్రకారం ప్రసంగం ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వళ్తు' అనే రాష్ట్ర గీతం పాడడం, ముగింపులో జాతీయ గీతం పాడటం జరుగుతుంది. కానీ గవర్నర్ రవి మాత్రం ప్రారంభంలోను, ముగింపులోను జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలని అభిప్రాయపడ్డారు.గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వంగా 2023లో, గవర్నర్ అసెంబ్లీకి రాసిన సంప్రదాయ ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించారు. ఎందుకంటే ఆ ప్రసంగంలో ఉన్న విషయాలు నిజానికి భిన్నంగా ఉన్నాయన్నారు. అంతకంటే ముందు ఏడాది, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, పేరియార్, సి.ఎన్. అన్నాదురై పేర్లు, ‘ద్రవిడ మోడల్’ అనే పదబంధం, రాష్ట్రంలోని చట్టం, శాంతి పరిపాలన గురించి మాట్లాడకుండా వదిలేశారు. ఇలా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య తరచూ వివాదాలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో ఇవాళ సుప్రీం కోర్టు తీర్పుతో గవర్నర్ విషయంలో తాము చేస్తున్న పోరాటానికి ఫలితంగా దక్కిందని ఆ రాష్ట్ర అధికార పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. -
‘కూటమి’ కుట్రలు.. గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతున్న నేపథ్యంలో తక్షణం గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరింది. అనంతరం రాజ్‌భవన్ బయట పలువురు మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.ఇటీవల గంగాధర నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు తెలుగుదేశం వారికే చేయాలి.. వైఎస్సార్సీపీ వారికి ఏ పనీ చేయకూడదు.. అలా చేస్తే పాముకు పాలుపోసినట్లేనంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ సమదృష్టితో పాలనను అందిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు, దానికి విరుద్దంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజాస్వామిక స్పూర్తికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో సంక్షేమాన్ని అందుకునే లబ్దిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలతో అర్హతను బట్టి పథకాలను వర్తింపచేస్తారని, కానీ చంద్రబాబు మాత్రం ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని, కొందరి పట్ల వివక్ష చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చంద్రబాబులా మాట్లాడలేదన్నారు.రాష్ట్రంలోని ఏ రాజకీయపార్టీ అయినా వారి సిద్ధాంతాలు, విధానాల ప్రకారం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలన్నదే వారి లక్ష్యంగా పెట్టుకుంటారని అన్నారు. ఏ పార్టీ అయినా వ్యక్తిగత ఏజెండాతో పనిచేయవని, కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న విధానాలపై తక్షణం స్పందించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. సామాన్యుల అవసరాలకు కూడా రాజకీయ పార్టీ రంగు పులమడం దారుణమన్నారు.ప్రతిపక్ష పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసమే వైఎస్సార్సీపీ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు, చివరికి జర్నలిస్ట్‌లపైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని బొత్స సత్యనారాయణ తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, విడదల రజనీ, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు వున్నారు. -
రాజ్యాంగ ఉలంఘనకు పాల్పడిన చంద్రబాబు
-
ఫైటింగేల్ ఆఫ్ ఇండియా..! ఆ ముగ్గురే..
కోకిల పాడుతుందని అంటారు. మరి, కోకిల పాటలు వింటుందా? 1949 మార్చి 1 రాత్రి సరోజినీ నాయుడు తనకు చికిత్స చేస్తున్న నర్సును పిలిచి పాట పాడమని కోరారని అంటారు. ఆ పాటే ఆమెను నిద్రపుచ్చిందట! సరోజినిని గాంధీజీ ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ అన్నారు. సరోజిని ఎప్పుడైనా పాటలు కూడా పాడారేమో! గాంధీజీ అన్నది మాత్రం ఆమె కవిత్వం గురించి! ఆ కవిత్వంలోని భావయుక్తమైన లాలిత్యం ఆయనకు ఉద్యమ పోరాట గానంలా అనిపించి ఉండాలి. అలాగైతే ఆమెను ‘ఫైటింగేల్’ ఆఫ్ ఇండియా అని కూడా అనొచ్చు.సరోజినీ నాయుడుకి, ఈ ఏడాదికి ఒక ‘చారిత్రకత’ ఉంది. అలాగే ఈ యేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి, సరోజినీ నాయుడి ఆశయానికి ఒక ‘సారూప్యం’ ఉంది. ఇక నేడైతే (2, మార్చి) సరోజినీ నాయుడు ఈ లోకానికి ‘వీడ్కోలు’ చెప్పిన రోజు. రాజకీయ కార్యకర్తగా, మహిళా హక్కుల ఉద్యమ నేతగా, అంతిమ క్షణాల వరకు జీవితాన్ని ప్రేమించిన మనిషిగా ఆమె నుంచి స్ఫూర్తిగా తీసుకోవలసినవి ఈ మూడు సందర్భాలూ! చారిత్రకత (1925–2025)ఈ ఏడాది డిసెంబర్ 28కి, భారత జాతీయ కాంగ్రెస్‌కు 140 ఏళ్లు నిండుతాయి. ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీకి సరిగ్గా 100 ఏళ్ల క్రితం 1925లో అధ్యక్షురాలయ్యారు సరోజినీ నాయుడు. స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్న భారత జాతీయ కాంగ్రెస్‌కు అప్పటివరకు ఒక భారతీయ మహిళ అధ్యక్షురాలిగా లేరు. తొలి మహిళా అధ్యక్షురాలు అనీబిసెంట్ (1917) అయితే, తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. ఆ తర్వాత నెల్లీ సేన్‌గుప్తా (1933) అధ్యక్షురాలయ్యారు. మొత్తం మీద స్వాతంత్య్రానికి పూర్వం జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షులు అయింది ముగ్గురే మహిళలు.సరోజినీ నాయుడుకు ముందరి ఏడాది 1924లో మహాత్మా గాంధీ జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇద్దరి మధ్య వయసులో పదేళ్ల వ్యత్యాసం. ఇద్దరి మధ్య ముప్పై ఏళ్ల స్నేహం. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ఇద్దరిదీ దాదాపుగా సమానమైన భాగస్వామ్యం. గాంధీజీని తొలిసారిగా 1914లో లండన్‌లో చూశారు సరోజిని. తనే ఆయన్ని వెదుక్కుంటూ వెళ్లి కలిశారు. ఆయన్ని చూసీ చూడగానే ఆమెకు నవ్వొచ్చింది. ‘‘బక్కపల్చని మనిషి, నున్నటి గుండు. నేల మీద కూర్చొని.. చిదిపిన టమాటా ముక్కలు, ఆలివ్ నూనె కలిపి తింటూ కనిపించారు. ఒక ఉద్యమ నాయకుడు ఇలా వినోదాత్మకంగా కనిపించడంతో పగలబడి నవ్వాను..’’ అని సరోజిని ఆ తర్వాత ఒక చోట రాసుకున్నారు. తనను చూసి ఆమె నవ్వగానే : ‘‘అయితే నువ్వు సరోజినీ నాయుడివి అయుండాలి. ఇలా ప్రవర్తించే ధైర్యం వేరే ఎవరికుంటుంది?’’ అంటూ ఆమెను నవ్వుతూ పలకరించారు గాంధీజీ! అప్పటికే ఈ జాతీయవాద ఉద్యమ యువ నాయకురాలి గురించి ఆయన విని ఉన్నారు. 1917 తర్వాత ఆమె గాంధీ సత్యాగ్రహ ఉద్యమంలో చేరారు. సారూప్యం (1930 ఉప్పు సత్యాగ్రహం–2025 విమెన్స్ డే థీమ్)ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ప్రకటించిన థీమ్.. ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ : రైట్స్. ఈక్వాలిటీ. ఎంపవర్ మెంట్ (మహిళలు, బాలికలందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత). ఈ థీమ్‌కు, జాతీయవాద ఉద్యమంతో సమాంతరంగా సరోజినీ నాయుడు నడిపిన మహిళా హక్కుల పోరాటానికీ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. సరోజిని కవయిత్రి. స్త్రీవిద్యను ప్రోత్సహించే క్రమంలో ఆమె మంచి వక్తగా కూడా అవతరించారు. ఆమె కవిత్వం, ప్రసంగ నైపుణ్యం.. రెండూ, మహిళా ఉద్యమానికి పదును పెట్టాయి. విద్యతోనే హక్కులు, సమానత్వం, సాధికారత సిద్ధిస్తాయని ఆమె ప్రబోధించారు. మహిళల చురుకైన సహకారం లేకుండా జాతీయవాద ఉద్యమం ముందుకు సాగలేదని ధైర్యంగా గాంధీజీకే చెప్పారు! ఇందుకొక ఉదాహరణ : ఉప్పు సత్యాగ్రహం లాంటి కార్యక్రమాలలో పాల్గొనడం మహిళలకు కఠినంగా ఉంటుందని భావించిన గాంధీజీ సుమారు 70 మంది మగవాళ్లతో కలిసి దండి యాత్రకు వెళుతున్నారు. ఈలోపు సరోజినీ నాయుడు నాయకత్వంలో కొందరు మహిళలు ఆ ఊరేగింపులోకి వచ్చి చేరారు! అనుకోని ఆ పరిణామానికి గాంధీజీ ముచ్చట పడ్డారు తప్ప ఆశ్చర్యపోలేదు. అసలు మహిళలు వాడే ఉప్పుకు సంబంధించిన సత్యాగ్రహాన్ని మగవారికి వదిలేయడం ఏమిటన్నది సరోజినీ నాయుడు ప్రశ్న. వీడ్కోలు (2, మార్చి 1949)దేశంలోనే తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే ఆమె ఉత్తరప్రదేశ్ (నాటి యునైటెడ్ ప్రావిన్సెస్) గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్‌గా ఉండగానే 1949లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆ ముందు రోజు రాత్రి ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. తీవ్రమైన తలనొప్పి. ఉపశమన చికిత్స చేశారు. ఆ కొద్ది సేపటికే కుప్పకూలి పోయారు. మర్నాడు కన్నుమూశారు. మరణానంతరం గోమతి నది ఒడ్డున సరోజిని అంత్యక్రియలు జరిగాయి. ‘‘జీవితం ఒక పాట. పాడండి. జీవితం ఒక ఆట. ఆడండి. జీవితం ఒక సవాలు. ఎదుర్కొండి. జీవితం ఒక కల. నిజం చేసుకోండి. జీవితం ఒక త్యాగం. అర్పించండి. జీవితం ఒక ప్రేమ. ఆస్వాదించండి..’’ అంటారు సరోజిని. అయితే వీటన్నిటికీ కూడా పోరాట పటిమ అవసరం అని కూడా తన కవితల్లో చెబుతారు ఈ ‘ఫైటింగేల్’ ఆఫ్ ఇండియా. (చదవండి: నెస్ట్..ఆర్కిటెక్చర్లో బెస్ట్..!) -
గవర్నర్ రేసు..వివేక్ రామస్వామికి ట్రంప్ మద్దతు
వాషింగ్టన్:భారత సంతతికి చెందిన బయోటెక్ బిలియనీర్ వివేక్రామస్వామిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయనను ఒహియో గవర్నర్ అభ్యర్థిగా బలపరుస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో వివేక్‌ను కొనియాడుతూ పోస్టు చేశారు. ‘గొప్ప రాష్ట్రమైన ఒహియో గవర్నర్ పదవికి వివేక్ రామస్వామి పోటీలో ఉన్నారు. నాకు వివేక్ బాగా తెలుసు. అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అధ్యక్ష అభ్యర్థిగా నాతో పోటీ పడ్డాడు. అమెరికాను ప్రేమించే వ్యక్తి వివేక్. అతడు ఒహియోకు గొప్ప గవర్నర్ అవుతాడు. వివేక్‌కు నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా’అని ట్రంప్ తన ట్వీట్లో పేర్కొన్నారు. VIVEK RAMASWAMY is running for Governor of the Great State of Ohio. I know him well, competed against him, and he is something SPECIAL. He’s Young, Strong, and Smart! Vivek is also a very good person, who truly loves our Country. He will be a GREAT Governor of Ohio, will never…— Donald J. Trump Posts From His Truth Social (@TrumpDailyPosts) February 25, 2025వచ్చే ఏడాది జరగనున్న ఒహియో గవర్నర్ ఎన్నికల కోసం వివేక్ రామస్వామి సోమవారం సిన్సినాటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిలియనీర్ ఇలాన్ మస్క్ కూడా వివేక్‌కు మద్దతు ప్రకటించి గుడ్‌లక్ చెప్పడం విశేషం. అయితే వివేక్ ఒహియో గవర్నర్‌గా రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయాలంటే ముందు పార్టీ ప్రైమీరీల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ప్రైమరీల్లో వివేక్‌తో ఇద్దరు రిపబ్లికన్ నేతలు పోటీ పడుతున్నారు. Thank you Elon. Let’s roll! https://t.co/2QDheoUSVj— Vivek Ramaswamy (@VivekGRamaswamy) February 25, 2025 -
ప్రతిపక్షంగా గుర్తించేంత దాకా పోరాటం ఆగదు: YSRCP
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనని వైఎస్సార్సీపీ పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఇటు గవర్నర్ నుంచి, అటు స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) వైఎస్సార్సీపీ బాయ్‌కాట్ చేసింది.సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం మొదలైన కాసేపటికే వైఎస్సార్సీపీ(YSRCP) సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలు వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, రెడ్‌బుక్ రాజ్యాంగం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో వైఎస్సార్సీపీ నిరసనకు దిగింది. ఈ క్రమంలో వైఎస్ జగన్(YS Jagan) నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా బయటకు వచ్చేశారు.సభలో ఉండేది ఒకటి అధికార పక్షం, మరోకటి ప్రతిపక్ష పక్షం. ఆ హోదాకు ఎంతో విలువ ఉంటుంది. ప్రజల గొంతుక వినపడాలంటే.. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వా ల్సిందే. ప్రజలు, రైతుల కష్టాలు చెప్పాలంటే ప్రతిపక్షం ఉండాల్సిందే. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించాం అని వైఎస్సార్సీ ఎమ్మెల్సీ బొత్స అన్నారు.రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతుల బాధలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. కేంద్రంతో మాట్లాడుతున్నాం.. ప్రయత్నిస్తున్నాం అని మాత్రమే చెబుతున్నారు. మిర్చికి వెంటనే మద్ధతు ధర ప్రకటించాలి. మేం రైతుల తరఫున పోరాడితే కేసులు పెడుతున్నారు. కూటమి గ్యారెంటీ అంటేనే మోసం అని అర్థం అవుతుంది. తొమ్మది నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీల అమలు నోచుకోలేదు. అందుకే ప్రజా సమస్యలపై ప్రజా క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తాం. ప్రభుత్వ చొక్కా పట్టుకుంటాం అని బొత్స అన్నారు. అబద్ధాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వానికి తాలిబన్లకు పెద్ద తేడా లేదు. వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని సీనియర్ నేత పెద్దిరెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా?: MLC వరుదుకల్యాణిఏపీలో ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు?నిరుద్యోగులు...రైతులు.. మహిళలు.. చిన్నపిల్లలను అందరినీ మోసం చేశారు15 వేల కోట్లు విద్యుత్ ధరలు పెంచారునిత్యావసర ధరలు 60% పెంచారుప్రజల తరపున ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదుతొమ్మిది నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారుచంద్రబాబుకి కూడా అప్పు రత్న అవార్డు ఇస్తావా పవన్ సమాధానం చెప్పాలిపథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారువైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేహోదా ఇచ్చే వరకూ పోరాడుతాం కూటమి నిరంకుశత్వంగా వ్యహరిస్తోందిప్రతిపక్ష గొంతు నొక్కడం కోసమే ఇలా చేస్తున్నారునోటీసులు కూడా ఇవ్వకుండా ఛానల్స్ బహిష్కరించిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా?: ఎమ్నెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అసెంబ్లీ సమావేశాల కవరేజ్‌కు సాక్షి(Sakhi TV) సహా పలు ఛానెల్స్‌పై కూటమి ప్రభుత్వం నిషేధం విధించడాన్ని YSRCP సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. -
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన YSRCP నేతలు
-
జగన్ భద్రతపై గవర్నర్ కు ఫిర్యాదు
-
గవర్నర్ తో అసత్యాలు, అబాద్ధాలు చదివించింది కూటమి సర్కార్
-
ఆర్బీఐ కొత్త గవర్నర్.. ఎవరీ 'సంజయ్ మల్హోత్రా'?
-
మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేత కాళిదాస్ కొలాంబ్కర్
ముంబై: బీజేపీ సీనియర్ నేత కాళిదాస్ కొలాంబ్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. కొలాంబ్కర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో కాళిదాస్ కొలాంబ్కర్ ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 288 మంది ఎమ్మెల్యేలతో కొలాంబ్కర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. డిసెంబర్ 7 నుంచి 15వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ ప్రత్యేక సమావేశాల్లో సెంబ్లీకి శాశ్వత స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. త్వరలో నూతన అసెంబ్లీ కొలువుదీరనుంది.#WATCH | Mumbai: BJP leader Kalidas Kolambkar takes oath as the Maharashtra Assembly Protem Speaker at Maharashtra Raj Bhawan administered by state Governor CP Radhakrishnan in the presence of Maharashtra CM Devendra Fadnavis. pic.twitter.com/IHSA6Ube6z— ANI (@ANI) December 6, 2024కాగా మహారాష్ట్రలో ఎట్టకేలకు దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవాల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మోంశాఖమంత్రి అమిత్ షా సహా బీజేపీ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు, బాలీవుడ్ నటీనటుటు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. -
ఇవాళ సత్యసాయి జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన
-
రేవంత్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘రాష్ట్ర గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంత జాప్యం జరగడం సహజం. అంతమాత్రానికే తొందరపాటు వ్యాఖ్యలు చేయడం సరికాదు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని చెప్పడం అవివేకం’అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. గురువారం భారత్ మండపంలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్– 2024లో కేంద్ర గనుల శాఖ, కోలిండియా పెవిలియన్లను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు పెవిలియన్‌లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల స్టాళ్లను కేంద్రమంత్రి సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అవినీతి ఎక్కడ జరిగినా నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాము హైకోర్టుకు వెళ్లామని, ఈ వ్యవహారాన్ని కూడా సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విచారణ సరిగ్గా జరిగితేనే తప్పు ఎవరు చేశారో ప్రజలకు అర్థమవుతుంది కదా అని చెప్పారు. కేంద్ర మంత్రులు ఏం చేయాలి? ఏం చేస్తున్నారనే విషయంలో.. కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఒకరిపైఒకరు బురదజల్లుకునే ప్రయత్నంలో బీజేపీ గురించి అసత్యాలు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద జరిగిన దాడి ఘటనను ఖండిస్తున్నామన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనపై ఆయన ప్రజలతో మాట్లాడాలి.. అంతే తప్ప ఈ విషయంలో రాజకీయ ప్రయోజనం ఆశించడం సరికాదని సూచించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని.. ఇందులో సందేహం అక్కర్లేదని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఆఫ్‌షోర్‌పై 10 బ్లాకుల వేలం: సముద్రాల్లో ఉన్న మినలర్స్ను సద్వినియోగం చేసుకునేందుకు ఆఫ్‌షోర్ మైనింగ్‌పైనా ప్రత్యేకంగా దృష్టి సారించామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆఫ్‌షోర్‌పై 10 బ్లాకుల వేలానికి అంతా సిద్ధమైందని, రెండుమూడు నెలల్లో ఈ బ్లాకులను వేలం వేస్తామని చెప్పారు. ఇప్పటికే అర్జెంటీనాలో పలు బ్లాక్‌లను వేలంలో దక్కించుకున్నామని, అక్కడ తవ్వకాల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. భారతదేశం బొ గ్గు, గనుల రంగంలో సాధిస్తున్న ప్రగతి, ఆధునిక సాంకేతికత వినియోగం, కా రి్మకుల భద్రత, సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచర ణ తదితర అంశాలను భారత్‌మండపంలో ప్రారంభించిన పెవిలియన్ ద్వారా సందర్శకులకు వివరిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని వివరించారు. ప్రపంచంలోనే కోలిండియా మూడో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ.. ఈ ఏడాది స్వర్ణోత్సవాలు జరుపుకుంటోందన్నా రు. సంవత్సరంపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని కిషన్‌రెడ్డి తెలిపారు. -
గవర్నర్ కుటుంబ సభ్యుల వివరాలను సేకరించిన అధికారులు
-
కేటీఆర్‌పై కేసుకు అనుమతినివ్వండి... గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు తెలంగాణ ప్రభుత్వం లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ బుధవారం అయ్యారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో సీఎం వెంట ఉప ముఖయమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, నేటి నుంచి ప్రారంభమైన కులగణన వివరాలను గవర్నర్‌కు సీఎం వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించి సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, సర్వే తీరు, పూర్తి స్థాయి వివరాలను గవర్నర్‌కు అందించారు.కులగణన అంశంతో తెలంగాణ దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మగ్ర సర్వేను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్‌ను రేవంత్ ఆహ్వానించారు. -
తొలిసారిగా గవర్నర్ ప్రతిభా అవార్డులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిసారిగా ‘గవర్న ర్ ప్రతిభా అవార్డులు’ఇచ్చేందుకు గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ నిర్ణయించారు. ఈ అవార్డులను వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘గవర్నర్ ఎట్ హోం’కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రదానం చేస్తారని గవర్నర్ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఒక్కో అవార్డుకు రూ.2 లక్షలతో పాటు ఒక మెడల్ కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.రాజ్భవ న్లో శుక్రవారం బుర్రా వెంకటేశం విలేకరులతో మాట్లాడుతూ...అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణలో పనిచేసిన వారు, తెలంగాణేతరులైనా దరఖాస్తు చేసుకోవచ్చని అయితే రాష్ట్రంలో కనీసం ఐదేళ్లు పని చేస్తూ ఉండాలని చెప్పారు. ఈ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 2 నుంచి ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.నాలుగు విభాగాల నుంచి ఆహ్వానం...దరఖాస్తులను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని బుర్రా వెంకటేశం వెల్లడించారు. https://governor.telangana.gov.in లేదంటే గవర్నర్ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ సెక్రటేరియట్, రాజ్‌భవన్, సోమాజిగూడ, హైదరాబాద్ – 500041 కు స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా అన్ని డాక్యుమెంట్లతో పాటు సమర్పించాలని కోరారు. గవర్నర్ ఎంపిక చేసిన కమిటీ అన్ని దరఖాస్తులను పరిశీలించి అవార్డులను ఎంపిక చేస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, ఆటల విభాగం, సాంస్కృతిక రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వాస్తున్నారు. ఇందులో ఎనిమిది మందికి అవార్డులు ఇవ్వనున్నారు. -
గవర్నర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు..
సాక్షి, విజయవాడ: ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వరద బాధితులకు జరిగిన అన్యాయం మీద గవర్నర్‌కు వైఎస్సార్సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,వెస్ట్ నియోజకవర్గ ఇంఛార్జి ,మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు,సెంట్రల్ నియోజకవర్గ ఇంఛార్జి మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా,మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లందుర్గ, వైఎస్సార్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి ఉన్నారు. -
డ్రగ్స్‌కు హబ్‌గా గుజరాత్: తమిళనాడు మంత్రి
అహ్మదాబాద్:గుజరాత్‌పై తమిళనాడు మంత్రి రేగుపతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే గుజరాత్ డ్రగ్స్‌కు హబ్‌గా మారిందన్నారు.డ్రగ్స్ రవాణాను అదుపు చేయడంలో తమిళనాడు పోలీసులు విఫలమయ్యారన్న గవర్నర్ రవి వ్యాఖ్యలకు కౌంటర్‌గా రేగుపతి ఈ వ్యాఖ్యలు చేశారు.గవర్నర్‌కు గుజరాత్ కనిపించడం లేదా ప్రశ్నించారు.నిజానిజాలు తెలియకుండా తమిళనాడు గురించి గవర్నర్ మాట్లాడుతున్నారన్నారు.అసలు గవర్నర్‌కు డ్రగ్స్ కేసులపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అన్నాడీఎంకే నేతలను డ్రగ్స్ కేసుల్లో విచారించేందుకుగాను అనుమతివ్వడానికి ఏడాదికిపైగా సమయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాతే డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యేక పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. ఇదీ చదవండి: జిలేబీ నచ్చిందా నాయనా -
‘హైడ్రా’కు చట్టబద్ధత.. ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన తెలంగాణ గవర్నర్
-
హైడ్రా ఆర్డినెన్స్ అధికారిక ఉత్తర్వులు జారీ
-
గవర్నర్‌ను కలిసిన హీరో నాగార్జున
టాలీవుడ్ హీరో నాగార్జున ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును ఆయన పరామర్శించారు. ఇటీవల ఆయన అస్వస్థకు గురయ్యారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న హరిబాబును కలిసి యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నాగార్జున ఓ మూవీ షూటింగ్ కోసం విశాఖ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే మీడియాతో మాట్లాడేందుకు నాగార్జున నిరాకరించారు.(ఇది చదవండి: మీ హెడ్‌లైన్స్ కోసం మా జీవితాలే దొరికాయా?: నాగచైతన్య)కాగా.. ఇప్పటికే నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. సమంత- నాగచైతన్య విడాకులను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఈ విషయంపై టాలీవుడ్ సినీ ప్రముఖులంతా మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వాటిని ఊపేక్షించేది లేదని చిరంజీవి, మంచువిష్ణు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్, అల్లు అర్జున్, నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పారు.విశాఖ: మిజోరాం గవర్నర్ ను కలిసిన సినీ హీరో అక్కినేని నాగార్జున ఆనారోగ్యంతో బాధపడుతున్న గవర్నర్ హరి బాబుకు నాగార్జున పరామర్శ అనారోగ్యం నుంచి కోలుకుంటున్న హరిబాబుఅక్కినేని తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న హరిబాబు@iamnagarjuna #Vizag #Nagarjuna #Meets #MizoramGovernor pic.twitter.com/fcndH5nFNu— Akhil Raj (@RRajkumar135192) October 3, 2024 -
అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా ఎందుకు?: హెచ్డీ కుమారస్వామి
బెంగళూరు: ముడా కుంభకోణంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి శనివారం విమర్శలు గుప్పించారు. గవర్నర్ విషయంలో సీఎం సిద్దరామయ్య రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపించారు. ‘గతంలో సిద్ధరామయ్య అధికారంలో ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై ప్రాసిక్యూషన్‌కు అనుమతించినందుకు గవర్నర్‌ను ప్రశంసించారు.అదే గవర్నర్ ఇప్పుడు తనపై(సీఎం) ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తే సిద్ధరామయ్యతో సహా పార్టీ నేతలందరూ గవర్నర్‌ను అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో దివంగత హన్సరాజ్ భరద్వాజ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒకలా వ్యవహరించిందని..ప్రస్తుతం థావర్‌చంద్ గెహ్లాట్‌తో భిన్న వైఖరితో ఉందని విమర్శలు గుప్పించారు.‘ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలు అత్యంత అవమానకరంగా ప్రవర్తించారు. గవర్నర్ చిత్రపటానికి చెప్పులు వేసి, దిష్టిబొమ్మలను తగులబెట్టి అవమానించారు. ఇప్పుడు ఎవరిపైకి చెప్పులు విసిరి, ఎవరి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రే తప్పు చేశారు. గతంలో సిద్ధరామయ్య స్వయంగా చెప్పినట్లుగా ప్రభుత్వం నుండి వివరణ కోరడం గవర్నర్ హక్కు. ఆయన ఇప్పుడు తన మాటలను మరచిపోయినట్లున్నారు. అప్పట్లో ఆయన చేసిన సొంత ప్రకటనలను ఆయనకు చూపించాలి’ అని కుమారస్వామి పేర్కొన్నారు.చదవండి: కశ్మీర్లో బీజేపీదే గెలుపు: ప్రధాని మోదీ -
రామకృష్ణ మఠం సేవలు ఎనలేనివి: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
హైదరాబాద్: యువత వ్యక్తిత్వ వికాసానికి, శీల నిర్మాణానికి రామకృష్ణ మఠం అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొనియాడారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగించేందుకు, రామకృష్ణ మఠం దశాబ్దాలుగా చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. వ్యక్తుల సౌశీల్యంపై దేశ సౌశీల్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో అంతర్భాగమైన వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రజతోత్సవ వేడుక సభ కు గవర్నర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. నిరంతర అభ్యాసంతోనే పరిపూర్ణత సాధ్యమవుతుందని కార్య్రక్రమానికి హాజరైన విద్యార్థులకు సూచించారు. 1893 సెప్టెంబర్ 11 న చికాగో విశ్వవేదిక సాక్షిగా స్వామి వివేకానంద హిందూ ధర్మ గొప్పతనాన్ని చాటిచెప్పారని గవర్నర్ గుర్తుచేశారు. స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు జిష్ణు దేవ్ వర్మ సూచించారు. ఇరవై ఐదేళ్ళ క్రితం సెప్టెంబర్ 11 న హైదరాబాద్ రామకృష్ణ మఠంలో నాటి రామకృష్ణ మఠం, మిషన్ జాతీయ సర్వాధ్యక్షుడు స్వామి రంగనాథానంద వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ విభాగాన్ని ప్రారంభించారని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. ఇప్పటివరకు ఇరవై లక్షల మందికి పైగా యువత కు వ్యక్తిత్వ వికాసం, శీల నిర్మాణం, యోగ, ధ్యానం, కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చామన్నారు. యువతకు విలువలను, నైపుణ్యాలను అందించేందుకు వి.ఐ.హెచ్.ఈ ఇరవై ఐదు ఏళ్లుగా పని చేస్తోందని చెప్పారు. కార్యక్రమం లో రామకృష్ణ మిషన్, మఠం జాతీయ ఉపాధ్యక్షుడు స్వామి సుహితానంద, డెక్స్ టెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకుడు శరద్ సాగర్, వి.ఐ.హెచ్.ఈ ఫాకల్టీ సభ్యులు, వాలంటీర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూచిపూడి నృత్యకళాకారిణి రాచర్ల నవ్య నేతృత్వంలో బాల్ వికాస్ విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
అభయ కేసు : సీఎం దీదీకి గవర్నర్ హుకుం జారీ
కోల్‌కతా: ఆర్జీ కర్ ఆస్పత్రి అభయ ఘటన కేసుతో పశ్చిమ బెంగాల్ ఆందోళనతో అట్టుడికిపోతుంది. ఈ తరుణంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ సీఎం మమతా బెనర్జీకి ఆదేశాలు జారీచేశారు. వెంటనే అత్యవసర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి, సమస్యపై చర్చించాలని ఆదేశించినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.మరోవైపు ఇదే కేసులో కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌పై విమర్శలు వెల్లువెత్తతున్నాయి. వినీత్ గోయల్‌పై వేటు వేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రజల డిమాండ్‌పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని గవర్నర్ సీవీ ఆనంద బోస్.. దీదీకి సూచించినట్లు సమాచారం. ఇదీ చదవండి : 25 దేశాలు.. 135 నగరాల్లో ఆందోళనలురాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనకర పరిణామాలపై ప్రభుత్వం బాధ్యత వహించాలి. మౌనంగా ఉండకూడదు. రాష్ట్రం.. రాజ్యాంగం,చట్టబద్ధమైన పాలనలో పనిచేయాలి. వైద్యురాలి ఘటన కేసులో సమస్యను గుర్తించకుండా, అలసత్వం ప్రదర్శించకూడదు. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను తొలగించాలనే ప్రజల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి’ అని సీవీ ఆనంద బోస్ ప్రభుత్వానికి ఆదేశించినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. #KolkataHorror | #ShaktiFightback The Governor's directives to W.B CM Mamata Banerjee, as per sources: - Hold emergency state cabinet meeting. - Have state cabinet discuss the RG Kar case. - Address demand to replace Kolkata top cop. On the other hand, TMC's… pic.twitter.com/hp84HL0LxR— TIMES NOW (@TimesNow) September 9, 2024 -
ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర: డీకే శివకుమార్
బెంగుళూరు: గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఆరోపించారు. శుక్రవారం(ఆగస్టు) ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారని విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. బిల్లులకు సంబంధించి గవర్నర్‌కు ఏవైనా అనుమానాలుంటే ప్రభుత్వం సమాధానమిస్తుందని పేర్కొన్నారు. ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతివ్వడాన్ని శివకుమార్ తప్పుబట్టారు.ఈ విషయంలో సీఎంకు పార్టీ సభ్యులంతా అండగా నిలుస్తారన్నారు. ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ,జేడీఎస్‌లు ప్రయత్నిస్తున్నాయని, వారి ప్రయత్నాలు ఫలించవన్నారు. -
MUDA Scam: హైకోర్టులో సిద్దరామయ్యకు ఊరట..
బెంగళూరు: తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడం చట్టవిరుద్దమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా.. గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజకీయంగా ప్రేరేపితమైనవన్నారు. వాటిని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు.మైసూరు నగర అభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తనను విచారించేందుకు గవర్నర్ ఉత్తర్వులు ఇవ్వడంపై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గవర్నర్ తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని హైకోర్టుకు తెలిపారు.వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆర్డర్‌ను ఆమోదించారని విమర్శించారు. గవర్నర్ ఆదేశాలు అమలైతే రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు దారి తీస్తుందని తెలిపారు. తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా అధికారులను నిరోధించేలా ఆదేశించాలని ముఖ్యమంత్రి కోరారు. తనకు మధ్యంతర ఉపశమనం కల్పించకపోతే తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని తెలిపారు.సీఎంకు ఊరటముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరటనిస్తూ, ఆరోపించిన ముడా కుంభకోణానికి సంబంధించి ఆయనపై ప్రత్యేక కోర్టులో విచారణను కర్ణాటక హైకోర్టు సోమవారం వాయిదా వేసింది.సిద్ధరామయ్యపై సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. టీజే అబ్రహం వేసిన మరో పిటిషన్‌పై బుధవారం వాదనలు జరగాల్సి ఉంది. ఇప్పుడు, హైకోర్టు తదుపరి విచారణ ఆగస్టు 29 వరకు జరగదు.అంతకముందు సీఎం మాట్లాడుతూ.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు. భవిష్యత్తులోనూ చేయనని అన్నారు. గవర్నర్ నిర్ణయం తననేమీ ఆశ్చర్యపరచలేదన్న ఆయన.. రాజకీయంగా సవాళ్లు ఎదురైనప్పుడు తనలో మరింత జోష్ పెరుగుతుందన్నారు. ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు బీజేపీ, జేడీఎస్‌లు కుట్ర పన్నాయని మండిపడ్డారు. -
కోల్‌కతా ఘటన: కొనసాగుతున్న ఆందోళనలు.. రేపు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనతో కోల్‌కతా అట్టుడుకుతోంది. ఈ దుశ్చర్యపై దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లోని జూనియర్ వైద్యులు చేస్తున్న ఆందోళనలు సోమవారానికి 11వ రోజుకు చేరుకున్నాయి. డాక్టర్ల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో అసలైన దోషులను చట్టం ముందు నిలబెట్టాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట డాక్టర్లు ఆందోళన చేపట్టారు. దీంతో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా అవుట్ పేషెంట్ సేవలూ నిలిచిపోయాయి. గవర్నర్ అత్యవసర సమావేశంవైద్యురాలిపై హత్యాచార ఘటనలో ఇప్పటి వరకూ విచారణ వేగవంతం కాకపోవడాన్ని ఆప్ రాజ్యసభ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాసిన లేఖపై బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ స్పందించారు. దీనిపై వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాజ్‌భవన్ కార్యాలయాన్ని ఆదేశించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ ఆనంద బోస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఈ రాష్ట్రం మహిళలకు సురక్షితం కాదు. ఆడపిల్లలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం అసమర్థత వల్లే ఈ రోజు మహిళలు భయపడుతూ బతుకుతున్నారు’’ అని మండిపడ్డారు. ఈ ఘటనలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.సీబీఐ దర్యాప్తు ముమ్మరంఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేయగా.. ఆర్జీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ దత్‌ను వరుసగాా నాలుగోరోజు విచారిస్తోంది. నిందితుడు సంజయ్ రాయ్‌కు సైకాలాజికల్ బిహేవియర్ అనాలసిస్ చేశారు. ఆదివారం ఆయన్ను విచారించిన సందర్భంగా సంఘటనకు ముందు, తరువాత చేసిన ఫోన్‌కాల్స్ వివరాలపైనే ప్రశ్నించారు.సుప్రీం విచారణమరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. చీఫ్ జస్టీస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఈ ఘటనపై మంగళవారం విచారణకు సిద్ధమైంది. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. నిందితులను ఉరి తీయాలని మమత బెనర్జీ డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంపై పద్మ అవార్డు పొందిన 70 మందికి పైగా వైద్యులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోల్‌కతా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో ప్రధానిని కోరారు. ఇక కోల్‌కతా పోలీసులు ఆగస్టు 18 నుంచి ఆగస్టు 24 వరకు ఆర్జీ కార్ ఆస్పత్రి సమీపంలో నిషేధాజ్ఞలను విధించారు. -
Karnataka: గవర్నర్ V/s సీఎం.. హైకోర్టుకు సిద్దరామయ్య
బెంగళూరు: మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలపై తనను విచారించేందుకు గవర్నర్ అనుమతించడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు దీనిపై విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముడా అధికారులు తన భార్యకు భూమి కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవే ఆరోపణలతో సామాజిక కార్యకర్తలు, తదితరులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వీటిపై వివరణ ఇచ్చేందుకు విచారణకు హాజరు కావాలని జులై 26న ముఖ్యమంత్రికి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ నోటీసులిచ్చారు. ఈ క్రమంలోనే గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం హైకోర్టును ఆశ్రయించారు.కాగా సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు-విజయనగరలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక అదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి..సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.అయితే ఆ ఆరోపణలను సిద్దరామయ్య తోసిపుచ్చారు. అతాను ఏ తప్పు చేయలేదని అన్నారు. తనపై విచారణకు ఆమోదిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్టానికి విరుద్ధమని మండిపడ్డారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్ ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. విచారణ కోసం తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ, జేడీ(ఎస్) చేస్తున్న కుట్ర ఇది అని విమర్శించారు. -
MUDA Scam: ‘కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే కుట్రే ఇది’
బెంగళూరు: మైసూరు అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కర్ణాటకలో ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ కేసులో విచారణ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీంతో సీఎంకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఈ పరిణామంపై తాజాగా సిద్ధరామయ్య స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. తనపై విచారణకు ఆమోదిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్టానికి విరుద్ధమని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సీఎం మాట్లాడుతూ..గవర్నర్ చర్యను కోర్టులో ప్రశ్నిస్తానని, తాను రాజీనామా చేసేంత తప్పు ఏం చేయలేదని పేర్కొన్నారు.‘మొత్తం కేబినెట్, పార్టీ హైకమాండ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ రాజ్యసభ ఎంపీలు నా వెంట ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ, జేడీ(ఎస్) చేస్తున్న కుట్ర ఇది’ అని విమర్శించారు.కేబినెట్ అత్యవసర భేటీ..మరోవైపు ఈ వ్యవహారంపై చర్చించేందుకు సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన నేటి సాయంత్రం కర్నాటక కేబినెట్ అత్యవసర సమావేశమవుతోంది. ఇదిలా ఉండగా గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో సీఎం సిద్ధరామయ్య ఉన్నారు.చదవండి: చిక్కుల్లో సిద్దరామయ్య.. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి -
తెలంగాణ రాజ్ భవన్ లో జెండా ఎగురవేసిన గవర్నర్
-
మమతా బెనర్జీ ‘నాట్ మై కప్ ఆఫ్ టీ’.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీని వ్యక్తి గతంగా గౌరవిస్తానని, ఆమెతో వృత్తి పరమైన సంబంధాలు ఉన్నాయని, అయితే రాజకీయవేత్త మమతా బెనర్జీ.. నాట్ మై కప్ ఆఫ్ టీ’ అని అన్నారు.మమతా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆనంద బోస్ వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీలో జరిగిన గవర్నర్ల సమావేశం అనంతరం పీటీఐతో జరిపిన ఇంటర్వ్యూలో గవర్నర్ ఆనంద్ బోస్ మాట్లాడారు. మమతా బెనర్జీతో ఉన్న సంబంధాల గురించి అడిగిన ప్రశ్నకు ఆనంద్ బోస్ మాట్లాడారు.మీరు ఏ మమతా బెనర్జీ గురించి అడుగుతున్నారు. నా ముందు ముగ్గురు మమతా బెనర్జీలు ఉన్నారు. ఒకరు వ్యక్తి మమతా బెనర్జీ..ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. రెండవ వ్యక్తి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..ఆమెతో నాకు వృత్తిపరమైన సంబంధాలు ఉన్నాయి. మూడవ వ్యక్తి రాజకీయ నాయకురాలు మమతా బెనర్జీ నాట్ మై కప్ ఆఫ్ టీ అని వ్యాఖ్యానించారు.వరుస వివాదాలుగత కొంతకాలంగా సీఎం మమతకు..గవర్నర్ ఆనందబోస్ మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ప్రభుత్వం పంపిన బిల్లుల్ని గవర్నర్ ఆమోదించడం లేదని మమతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు రాజ్ భవన్లో ఆనందబోస్ ఓ మహిళాతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు గుప్పించింది. ఈ వరుస పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆనందబోస్ పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై కోల్‌కతా హైకోర్టులో దావా వేశారు. విచారణ చేపట్టిన కోర్టు హైకోర్టు ఆగష్టు 14 వరకు మధ్యంతర ఉత్తర్వులో గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి పరువు నష్టం కలిగించే లేదా తప్పుడు ప్రకటన చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. STORY | Concept of passive governor is gone: West Bengal Governor CV Anand BoseREAD: https://t.co/GNKBobRarN pic.twitter.com/niOE5dO3D4— Press Trust of India (@PTI_News) August 4, 2024 -
కోదండరామ్‌కు ఎమ్మెల్సీ వద్దు: గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ లేఖ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణకు గవర్నర్లు మారుతున్నా గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల నియమాక వివాదం కొనసాగుతూనే ఉంది. టీజేఎస్ నేత కోదండరామ్, మీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించవద్దని కొత్త గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు కోరారు. ఈ మేరకు జిష్ణుదేవ్‌శర్మకు శుక్రవారం(ఆగస్టు2) వారు ఒక లేఖ రాశారు. ఎమ్మెల్సీల నియమాకం విషయమై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున తుది నిర్ణయం తీసుకోవద్దని లేఖలో కోరారు. కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపిన కోదండరామ్, అలీఖాన్ పేర్లపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.గతంలో బీఆర్ఎస్ హాయంలో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్‌కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో క్యాబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఉందా లేదా అన్న అంశంపై దాసోజు,కుర్ర కోర్టుకు వెళ్లారు. అప్పటిదాకా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎవరినీ నియమించవద్దని కోరారు. -
AP: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ
సాక్షి, విజయవాడ: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసింది. రూ.1.29 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ గవర్నర్ ఆమోదం తెలిపారు. 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. నవంబర్ 30వ తేదీ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది.కాగా, ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ప్రజలకిచ్చిన హామీల అమలును ఎగ్గొట్టేందుకే ఈ నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. అంతకుముందు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి నాలుగు నెలల వ్యయానికి సభ అనుమతి తీసుకుంది. ఈ గడువు నేటితో (జూలై 31తో) ముగిసింది.సాధారణంగా అయితే.. ఎన్నికల ఫలితాలు అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈనెల 23న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. -
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర నాలుగవ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ గవర్నర్లుగా ఇప్పటి వరకు ఈఎస్ఎల్ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, ఇన్చార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.కాగా, జిష్ణుదేవ్ వర్మ బుధవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిష్ణుదేవ్ వర్మకు సాయుధ దళాలు గౌరవ వందనం చేశాయి. -
నేడు గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం 5గంటలకు రాజ్ భవన్లో ప్రమాణ స్వీకా రం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష నేత కేసీఆర్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్, ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం వెళ్లింది.జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర నాలుగవ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ గవర్నర్లుగా ఇప్పటి వరకు ఈఎస్ఎల్ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, ఇన్చార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. రాజవంశీకుడైన ఆయన రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లలో బీజేపీలో చేరారు. 2018–23 వరకు త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కూడా. జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధా దేవ్‌వర్మ. వర్మను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసింది.అలాగే ఓంప్రకాశ్ మాథుర్ సిక్కిం గవర్నర్‌గా, హరిభావు కిషన్‌రావు బాగ్డే రాజస్తాన్ గవర్నర్, సి.హెచ్.విజయశంకర్ మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు. సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్‌కు, రామెన్ డేకా చత్తీస్‌గఢ్‌కు గవర్నర్లుగా నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌ను మహారాష్ట్రకు మార్చారు. అలాగే అస్సాం గవర్నర్ గులాబ్‌చంద్ కటారియాను పంజాబ్‌కు మార్చి చండీగఢ్ అడ్మిని్రస్టేటర్‌గా కూడా బాధ్యతలు అప్పగించారు. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్‌గా నియమించి మణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చా రు. కె.కైలాస్‌నాథ్‌ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు. -
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్ జగన్ లేఖ
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. జూలై 22, 2024న జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం కొన్ని అంశాలపై చేసిన వక్రీకరణలను వైఎస్ జగన్ లేఖలో వివరించారు.ఏపీ అప్పులు, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను లేఖలో ప్రస్తావించారు. వాస్తవాలను రికార్డులతో సహా లేఖలో వైఎస్ జగన్ తెలియజేశారు. ఎకనామిక్ సర్వే, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కాగ్, ఆర్బీఐ నివేదికల్లోని వాస్తవాలను పొందుపరుస్తూ లేఖ రాశారు. (లేఖ పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రసంగమంతా చంద్రబాబు భజనే: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు గురించి భజన చేయకుండా..రాష్ట్రంలో జరగుతున్న అరాచకపాలన గురించి మాట్లాడితే బాగుండేదని ఎర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ అన్నారు. తాడేపల్లిలో వైఎస్సాఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గవర్నర్ ప్రసంగంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. ఈ సందర్భంగా తాడిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగమంతా చంద్రబాబు భజనే కనపడింది. ప్రతిపక్ష పార్టీపై దుమ్మెత్తిపోయటానికే సరిపోయిందని మండిపడ్డారు. పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పలేదు. అమరావతి, ప్రత్యేక హోదా గురించి కనీస ప్రస్థావనే లేదని అన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ చెప్తారనుకున్నాం. కానీ దాని గురించి మాట్లాడలేదు. మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ అమలు గురించి కూడా మాట్లాడలేదు. అంటే హామీలన్నింటినీ తుంగలో తొక్కేసినట్టేనని అర్థం అవుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి గవర్నర్ మాట్లాడకపోవడం దారుణమన్నారు. 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి వంద కోట్లు కూడా లేవు. కానీ 2024నాటికి ప్రభుత్వ ఖజానాలో రూ.7 వేల కోట్ల పైనే ఉందన్న తోట చంద్రశేఖర్..ఎన్నికల హామీలను చంద్రబాబు ఇప్పటి వరకు అములు చేయకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదవటమే తప్ప గవర్నర్ వాస్తవాలను మరిచిపోయారు. 2014-19 మధ్యలో 54 సంస్థలను ప్రయివేటుపరం చేశారు.వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? అని ధ్వజమెత్తారు.చంద్రబాబుకు లబ్ధి చేకూరేలా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహరించడం సర్వసాధారణమైందని వ్యాఖ్యానించారు.షర్మిళ ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణలు చేయటం సిగ్గుచేటని తెలిపారు.షర్మిల వైఖరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 50 రోజుల్లోనే రాష్ట్రం అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా షర్మిల నోరెందుకు మెదపటం లేదు? చంద్రబాబు కోసమే తప్ప ప్రజల కోసం షర్మిల ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.ఓట్ ఆన్ బడ్జెట్ ఏడు నెలలపాటు నిర్వహించాలనుకోవటం సిగ్గుచేటు.మేనిఫెస్టో పథకాలకు ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే ఓట్ ఆన్ బడ్జెట్ పెడుతున్నారు. ప్రజాస్వామ్య యుతంగా మేము నిరసనలు తెలిపితే పోలీసులు మాపై దాడి చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తే కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అసెంబ్లీలో ప్లకార్డులను చూపిస్తే చంద్రబాబు వణుకిపోతున్నారు. అరాచకాలపై అసెంబ్లీలో నిలదీశాం.ప్రభుత్వం స్పందించలేదనే బాయ్ కాట్ చేశామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. -
ఆఖరికి.. ఏపీ అసెంబ్లీలోనూ అబద్ధాలు!
అమరావతి, సాక్షి: ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి రాగానే పాలన మీద ఫోకస్ చేస్తుంది. కానీ, చంద్రబాబు మాత్రం శ్వేత పత్రాల పేరుతో, సమీక్షల పేరిట జగన్ పాలనపై నిత్యం నిందలు వేస్తున్నారు. చూస్తుంటే.. ఇలాగే ఐదేళ్లు గడిపిస్తారేమో అనిపించేలా ఉంది ఆయన వ్యవహారం. అయితే తాజాగా అసెంబ్లీ సాక్షిగా.. అదీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించింది కూటమి ప్రభుత్వం.తన పాలనలో ఏనాడూ సంక్షేమం, కనీస మౌలిక వసతుల గురించి పట్టించుకోని చంద్రబాబు.. విజనరీ నాయకుడని, విభజిత ఏపీ అభివృద్ధికి కృషి చేశారని గవర్నర్ ప్రసంగంలో చెప్పించుకున్నారు. అంతేకాదు 2014-19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగిందని, 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయని, పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో అబద్ధపు ప్రసంగాన్ని చదివించారు. వాస్తవానికి.. జగన్ పాలన చేపట్టే నాటికి అభివృద్ధి కుంటుపడి ఉంది. ఆ కారణంగానే 2019లో అధికార మార్పిడి జరిగింది కూడా. అయితే కరోనా లాంటి విపత్తుతో రెండేళ్లు గడిచినప్పటికీ.. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండింటి మీద ఫోకస్‌తోనే జగన్ పాలన కొనసాగింది. సంబంధిత వార్త: జగన్ వల్లే పెట్టుబడులు పైపైకి..అమరావతిని కొంత మంది పెట్టుబడిదారుల కోసమే చంద్రబాబు తెర మీదకు తెచ్చారు. కానీ, జగన్ అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. ఈ మూడింటిలో అమరావతి కూడా ఒక రాజధానిగానే ఉంది కదా!. సంబంధిత వార్త: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు సహేతుకమే!గత ఐదేళ్లలో ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్న గవర్నర్ ప్రసంగం.. కూటమి ప్రభుత్వంలో గత 45 రోజులుగా శాంతి భద్రతల ఏ స్థాయిలో ఘోరంగా దెబ్బ తిన్నాయో స్పందించలేదు. కనీసం లా అండ్ ఆర్డర్ పునరుద్ధరణ ప్రస్తావన కూడా లేదు. వివిధ రంగాల్లో నష్టాలు వచ్చాయంటూ కాకి లెక్కలతో సాగింది గవర్నర్ ప్రసంగం. పైగా గత ఐదేళ్లుగా అవి ఎల్లో మీడియాలో వచ్చిన ఊహాగాన కథనాలు.. కల్పిత రాతలే. సంబంధిత వార్త: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ ముందడుగుఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించామన్న చంద్రబాబు ప్రభుత్వం.. సూపర్‌సిక్స్ వాగ్దానాలు ఎన్ని నెరవేర్చారో మాత్రం చెప్పలేదు కానీ రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలన్న మాటతో గవర్నర్ ప్రసంగం ముగిసింది. అయితే.. ఇప్పటికే జగన్ వల్లే ఖజానా ఖాళీగా ఉందంటూ చెబుతూ వస్తున్న చంద్రబాబు.. మళ్లీ ఎన్నికలొచ్చేదాకా ఇదే మాట చెబుతారేమో అనే అనుమానాలు ఉన్నాయి. దీనికి తోడు అసెంబ్లీలో శ్వేత పత్రాల పేరుతో అబద్ధాలకు ఆయన రెడీ అయ్యాడు కూడా. జనాలు కోరుకునేది తమకు ఇచ్చిన హామీల అమలు. అంతేకానీ ఇలా నిందలు వేస్తూ వెళ్లడం కాదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం.. చంద్రబాబును, ఆయన మాటలను, కూటమి పాలనను ప్రజలు అసహ్యించుకునే రోజులు తొందరగానే వస్తాయి. -
టీడీపీ అరాచకాలు.. గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
-
ఏపీలో అరాచక, ఆటవిక పాలన.. గవర్నర్‌తో భేటీలో వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత సాగుతున్న అరాచక పాలన, పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలపై, వైఎస్సార్సీపీ లక్ష్యంగా చేస్తున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాలతో సహా వినతిపత్రాన్ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సమర్పించారు. ఈ క్రమంలో గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గవర్నర్‌కు అందజేసిన వినతిపత్రంలోని విషయాలు ఇలా ఉన్నాయి.. ‘‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులను, క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయి. యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొంది.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి, ఆ వెంటనే.. ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా మా పార్టీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను వేధించడమే పనిగా పెట్టుకుంది. వారిని కొట్టడం, చంపడం, దారుణంగా వేధించి భయానక పరిస్థితులు సృష్టించడం వంటివన్నీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు. ఇళ్లు, భవనాలు కూల్చేస్తున్నారు. వ్యాపార సంస్థలపైనా దాడులు చేస్తున్నారు. చివరకు వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ.. రోడ్డు పక్కనే చిరు వ్యాపారం చేసుకుంటున్న వారినీ వదలడం లేదు. వారిపై దాడులు చేసి, ఉపాధిని దెబ్బ కొడుతున్నారు.కేవలం మా పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లు, ఆస్తులు, వ్యాపార సంస్థలపై మాత్రమే కాకుండా.. చివరకు ప్రభుత్వ ఆస్తులపైనా వారి దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. అలా ప్రభుత్వ ఆస్తులనూ వారు విధ్వంసం చేస్తున్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలతో పాటు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లను సైతం టీడీపీ శ్రేణులు వదిలి పెట్టడం లేదు. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న కక్షతోనే, అధికార పక్షం ఈ పని చేస్తోంది. చివరకు రాష్ట్రంలో చాలా చోట్ల దివంగత మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను కూడా యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు.తాజాగా, ఈనెల 17న, పల్నాడు జిల్లా వినుకొండలో మా పార్టీ కార్యకర్త రషీద్‌ను దారుణంగా హత్య చేశారు. నడిరోడ్డు మీద ప్రజలందరూ తిరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దారుణ హత్య రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా జరిగాయి.వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పార్లమెంటుకు ఎన్నికైన వారు, శాసనసభకు ఎన్నికైన వారు, ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులకూ రక్షణ కూడా లేకుండా పోయింది. గత గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్పగారిని పరామర్శించడానికి వెళ్లిన మా పార్టీ లోక్‌సభ పక్ష నాయకుడు, ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నం చేశాయి. పోలీసుల సమక్షంలోనే ఈదాడి జరిగింది. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వారు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న విధానం వీటన్నింటితో అందరికీ అర్ధమవుతోంది.రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కనిపించడం లేదు. రాజ్యాంగం, చట్టం, పోలీసు వ్యవస్థ.. అన్నీ నిర్వీర్యమయ్యాయి. నామమాత్రంగా మిగిలాయి. అన్నింటికీ భిన్నంగా, చట్ట విరుద్ధంగా అధికార పక్షం ఏర్పాటు చేసుకున్న తమ సొంత రాజ్యాంగ వ్యవస్థ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం గత 45 రోజులుగా ఇక్కడ పని చేస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు పేట్రేగిపోతున్నాయి.గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అంటే మంచి విద్య, మంచి వైద్యం, రైతుకు భరోసా, అక్కచెల్లెమ్మలకు సాధికారిత, పటిష్టమైన లా అండ్ ఆర్డర్. సుస్థిర, సమగ్రమైన అభివృద్ధి కొనసాగింది. వాటన్నింటిలో ఆనాడు ఈ రాష్ట్రం పేరు గొప్పగా చెప్పుకుంటే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. రాష్ట్రంలో అరాచకాలు తప్ప, పరిపాలన అనేది ఎక్కడా కనిపించడం లేదు.ప్రభుత్వం ఏర్పాటైన నెలన్నర వ్యవధిలోనే 36 మంది హత్యకు గురయ్యారు. 300 మందిపై హత్యాయత్నం జరిగింది. టీడీపీ వాళ్ల వేధింపులు భరించ లేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వీళ్ల అరాచకాలు భరించలేక దాదాపు 2,700 కుటుంబాలు గ్రామాలు విడిచి వెళ్లిపోయాయి. ఇవన్నీ కాక, 1,050కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి.ఈ ఘటనలన్నీ అనుకోకుండానో లేక యాదృఛ్చికంగానో జరిగిన ఘటనలు కావు. ఒక పథకం ప్రకారం ఒక మోడస్ ఆపరండీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి చేస్తున్న దుర్మార్గాలు ఇవన్నీ. రాష్ట్రంలో అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వంలో ఉన్నవారు.. పైస్థాయి అధికారులు మొదలు కింది స్థాయి వరకూ సిగ్నల్ పంపారు. ఏకంగా ఈ రాష్ట్రంలో ఒక మంత్రి రెడ్‌బుక్ పేరిట హోర్డింగులు పెట్టి, నేరుగా దాడులు చేయమని కేడర్‌కు చెప్పకనే చెప్పాడు. వాటిని అడ్డుకోవద్దని అధికారులనూ నిర్దేశించాడు. దీంతో ఎక్కడికక్కడ టీడీపీ గూండాలు రెచ్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు.ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరి ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించాల్సింది పోయి.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా రాజకీయమయం చేశారు. హత్యలను, దాడులను, అకృత్యాలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు. దాదాపు 27 మంది ఐఏఎస్, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా చేశారంటే.. చంద్రబాబు లక్ష్యాలు, ఉద్దేశాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి.మొత్తంగా చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయి. తక్షణం శాంతిస్థాపన జరగాల్సిన అవసరం ఉంది. సాధారణ పరిస్థితులు నెలకొనాల్సి ఉంది. అందుకే రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న ఘటనలన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరపాలని కోరుతున్నాను. ఈ వినతిపత్రంతో పాటు, పై అంశాలన్నింటికి సంబంధించిన ఫోటోలు, వీడియో సాక్ష్యాలను కూడా మీకు అందజేస్తున్నాను’’ అని వైఎస్ జగన్ వినతిపత్రంలో పేర్కొన్నారు. సంబంధిత వార్త: యావత్ దేశం దృష్టికి 'ఆటవిక పాలన': వైఎస్ జగన్ -
గవర్నర్‌ను కలిసిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్‌పై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు పాల్గొన్నారు. నిరుద్యోగులపై పెట్టిన కేసులు, పార్టీ ఫిరాయింపుల అంశం, ప్రోటోకాల్ ఉల్లంఘన, రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.గవర్నర్‌తో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువత, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు తుంగలో తొక్కారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులపై కేసులు, దాడులు జరుగుతున్నాయని.. హైదరాబాద్‌లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. మొదటి సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే లేదని అన్నారు. గతంలో భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినవని తెలిపారు. సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్న విద్యార్థులను ఈడ్చుకొచ్చి అరెస్టులు చేశారన్నారు.‘రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఖననంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. పార్టీ ఫిరాయింపులపై ఆయనకు ఫిర్యాదు చేశాం. భయపెట్టి పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. తేదీలతో సహా గవర్నర్‌కు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశాం. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మరో పార్టీ గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని వివరించాం. ఈ రెండు అంశాలపై గవర్నర్‌కు సుదీర్ఘంగా మా అభ్యర్థన వినిపించాం. హోమ్ శాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని గవర్నర్ చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడుతానని తెలిపారు. ఎమ్మెల్యేలపై ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరుగుతుంది. మాలో ఎవరికి కూడా నియోజకవర్గాల్లో గౌరవం దక్కడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలందరినీ, ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కలుస్తాం. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుంది. అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి ఈ విషయంపై వివరిస్తాం. కాళేశ్వరంలో జరిగిన చిన్నతప్పి దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూపెట్టింది. త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డను సందర్శిస్తాం’ అని తెలిపారు -
జులై 7న జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం
జార్ఖండ్‌లో మరోసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వ ఏర్పాటుకు పనులు చకచకా జరిగిపోతున్నాయి. బుధవారమే చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసి గవర్నర్‌కు సమర్పించగా.. జేఎంఎం చీఫ్ నేడు హేమంత్ సోరెన్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆయనతోపాటు ఇండియా కూటమి నేతలు కూడా ఉన్నారుఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను గవర్నర్ ఆహ్వానించారు. జులై 7న హేమంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్నిజేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య తెలిపారు. హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా జార్ఖండ్ హైకోర్టు సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈడీ ఆరోపించిన విధంగా నేరానికి పాల్పడలేదు’అని తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. -
గవర్నర్ ను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
‘మమత’ వర్సెస్ గవర్నర్: తారాస్థాయికి విభేదాలు..!
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రభుత్వం, గవర్నర్ ఆనంద బోస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కోల్‌కతా నగర పోలీసు కమిషనర్ వినీత్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని గవర్నర్ బోస్ సీఎం మమతకు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్ డిమాండ్‌ను మమత ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. రాజ్‌భవన్‌ను ఆనుకోని పోలీసులు ఓ కంటట్రోల్‌ను నిర్మించి తన కదలికలపై నిఘా ఉంచినట్లు గవర్నర్ భావిస్తున్నరని తెలుస్తోంది. దీంతో ఆయన కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌ను తప్పించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. అయితే కంట్రోల్ రూమ్ కొత్తగా నిర్మించి కాదని, రాజ్‌భవన్ భద్రత కోసం గత ప్రభుత్వాల హయాం నుంచే అక్కడ ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, రాజ్‌భవన్‌లో మహిళలకు రక్షణ లేదని సీఎం మమత చేసిన ఆరోపణలపై గవర్నర్ ఇప్పటికే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. -
మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ పరువు నష్టం దావా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరువు నష్టం దావా వేశారు. బెంగాల్ రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకే మహిళలు భయపడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయన ఈ చర్యలకు దిగారు. శుక్రవారం కలకత్తా హైకోర్టులో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలో రాజ్‌భవన్‌లో పని చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగిణి.. గవర్నర్ ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఇది కుట్ర అని, ముందు ముందు ఇలాంటి ఆరోపణలు చాలానే వస్తాయని ఆ టైంలోనే గవర్నర్ ఆనంద బోస్ అన్నారు. మరోవైపు ఈ ఆరోపణల పర్వం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా సచివాలయంలో జరిగిన పాలక భేటీలో ‘‘రాజ్‌భవన్‌కు వెళ్లాలంటే మహిళలు భయపడుతున్నారని, తనకు ఫిర్యాదులు చేస్తున్నారని’’ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అంతకు ముందు టీఎంసీ నేతలు కొందరు గవర్నర్ ఆనందబోస్‌పై ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. దీంతో మమతా బెనర్జీతో పాటు టీఎంసీ నేతలపైనా గవర్నర్ పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.ఈ పరిణామంపై టీఎంసీ సీనియర్ నేత డోలా సేన్ మీడియా స్పందన కోరింది. అయితే ఇది సున్నితమైన అంశం కాబట్టి పార్టీతో చర్చించాకే తమ నిర్ణయం ఏంటో చెబుతామని అన్నారాయన. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై బీజేపీ మద్దతు తెలిపింది. గవర్నర్ ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని, ఆలస్యమైనా సరైన నిర్ణయం తీసుకున్నారని, ఆయనకు తమ మద్దతు ఉంటుందని బీజేపీ సీనియర్ రాహుల్ సిన్హా చెబుతున్నారు. మరోవైపు సీపీఐ(ఎం) నేత సుజాన్ చక్రవర్తి తాజా పరిణామాలతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఒరగదని, పైగా జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీస్తాయని అంటున్నారు. -
చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ గవర్నర్‌కు గుంటూరు ఆర్డీవో శ్రీకర్, పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన సీఎం నివాసానికి బయలుదేరి వెళ్లిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్.. చంద్రబాబును కలిశారు. -
రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ విభేదాలు మరోసారి తెరమీదకొచ్చాయి. గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న బెంగాల్ పోలీసు బృందంతో మనకు ముప్పు ఉందని గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో డ్యూటీలో ఉన్న పోలీసులంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించిన కొద్దిరోజులకే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘‘ ప్రస్తుత ఆఫీసర్–ఇన్చార్జ్, ఆయన బృందం వల్ల నా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేశా. అయినా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చుట్టూ ఉన్న కోల్‌కతా పోలీసులతో నాలో అభద్రతా భావం గూడుకట్టుకుపోయింది’’ అని గవర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఇక్కడి పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రాజ్‌భవన్‌కు వ్యతిరేకంగా వాళ్లు పనిచేస్తున్నట్లు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పోలీసులు గతంలో రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో పనిచేశారు. ఒకరి కోసం వీళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేరు నేను చెప్పదల్చుకోలేదు’’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
టీడీపీకి గవర్నర్?.. రేసులో యనమల, అశోక్ గజపతి
ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న టిడిపి సీనియర్లు ఎన్డీఎ కోటాలో గవర్నర్ పదవివైపు ఆశగా ఎదురు చూస్తున్నారు...యనమల, అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్లు గవర్నర్ పదవి కోసం రేసులో ఉన్నారు...ఎన్డీఎలో టిడిపి అత్యంత కీలకం కావడంతో సీనియర్లలో ఒకరికి గవర్నర్ పదవి వస్తుందనే వార్తలు వస్తున్నాయి...గవర్నర్ రేసులో రేసులో ఎవరున్నారు...తెలుగుదేశం పార్టీలో గవర్నర్ పదవిపై జోరుగా చర్చ సాగుతోంది..సీనియర్లలో ఒకరికి గవర్నర్ వస్తుందంటూ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎన్డీఎలో కీలక భాగస్వామిగా ఉండటంతో కేంద్రంలో టిడిపి సీనియర్లు కీలక పదవులను ఆశిస్తున్నారు..ముఖ్యంగా కొందరు సీనియర్లైతే గవర్నర్ పదవిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్లు అయితే గవర్నర్ పదవిని ఆశిస్తున్నట్లు టిడిపిలో ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటికే యనమల, అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్లు ప్రత్యక్ష రాజకీయాలకి దూరమై తమ వారసులను రంగంలోకి దించి విజయం సాధించారు. చంద్రబాబు టిడిపి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా ఈ ఇద్దరూ కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు.యాదవ సామాజకి వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు 1983 లో రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి టిడిపి తరపున పోటీ చేసి గెలుపొందారు. లా పూర్తి చేసిన యనమల తొలి ప్రయత్నంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అప్పటి నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా కీలకమైన మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి కూడా నిర్వహించారు. స్పీకర్ గా వ్యవహరించిన యనమల 1994 టిడిపి సంక్షోభంలో ఎన్టీఆర్ వైపు కాకుండా చంద్రబాబు వైపు నిలిచి చంద్రబాబుకి దగ్గరయ్యారు. ఆ సమయంలో యనమల తీసుకున్న నిర్ణయమే చంద్రబాబుని ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది. అప్పటి నుంచి కూడా చంద్రబాబుకి యనమల అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు.చంద్రబాబు ఎపుడు అధికారంలో ఉన్నా కూడా యనమలకి అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖ ఇస్తూ వచ్చారు.1999 నుంచి 2004 వరకు టిడిపి ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ మంత్రిగా వ్యవహరించిన యనమల తొలిసారి వైఎస్సార్ హవాలో 2009 లో తొలిసారి ఓటమి చవి చూశారు.ఆ తర్వాత నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనకుండా 2014 లో ఎమ్మెల్సీగా ఎన్నికై మళ్లీ చంద్రబాబు క్యాబినెట్ లో రెండవ సారి ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ఆ సమయంలోనే ఆయన రాజ్యసభ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో రాజ్యసభ దక్కకపోవడంతో ఆయన నిరాశ పడ్డారు. మళ్లీ ఈ ఎన్నికలలో తుని నియోజకవర్గంలో తన సోదరుడు యనమల కృష్ణుడు బదులు తన కూతురు దివ్యను రంగంలోకి దింపారు. యనమల కృష్ణుడు వైఎస్సార్ సిపిలో చేరినప్పటికీ కూడా యనమల తన కూతురు దివ్యను తుని నియోజకవర్గంలో నెగ్గించుకున్నారు. టిడిపి అధికారంలోకి రావడంతో యనమలకి మళ్లీ క్యాబినెట్ లో కీలక అమాత్య పదవి ఉంటుందని టిడిపి వర్గాలు భావించాయి. అయితే యనమల ఆలోచనలకి తగిన విధంగా కీలకమైన పదవి ఇవ్వడానికే చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యనమలని గవర్నర్ గా ఏదో ఒక రాష్ట్రానికి పంపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు టిడిపిలో చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఎన్డీఎలో టిడిపి అత్యంత కీలకమైన పార్టీ కావడంతో ఒక గవర్నర్ పదవి తీసుకోవాలని టిడిపి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యనమల కూడా ఈసారైనా గవర్నర్ పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఉత్తరాంద్రలో చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైన అశోక్ గజపతి రాజు కూడా గవర్నర్ పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయనగరం పూసపాటి రాజవంశానికి చెందిన అశోక్ గజపతి రాజు 1978లో తొలిసారి రాజకీయాలలోకి అడుగుపెట్టి జనతాపార్టీ అభ్యర్థిగా విజయనగరం విధాన సభనుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్ధాపించిన తెలుగుదేశం పార్టీ లో 1983, 1985, 1989, 1994, 1999, 2009 వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఆర్థిక, రెవెన్యూ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఇక 2014 లో విజయనగరం లోక్ సభ నుంచి పోటీ చేసి గెలుపొంది ఎన్డీఎ ప్రభుత్వంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ సారి ఎన్నికలలో ఆయన నేరుగా పోటీ చేయకుండా తన కుమార్తె ఆదితి గజపతిరాజుని రంగంలోకి దింపి ప్రత్యక్ష రాజకీయాలకి దూరమయ్యారు. తొలిసారి తన వారసురాలిని రంగంలోకి దింపిన అశోక్ గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా గెలుపించుకోగలిగారు. దీంతో ఆయన కూడా కేంద్రంలో కీలక పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.చంద్రబాబుకి ఉత్తరాంద్రలో అత్యంత సన్నిహితుడిగా అశోక్ గజపతి రాజు ఉండటంతో గవర్నర్ పదవి రేసులో ఆయన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అటు యనమల...ఇటు అశోక్ గజపతిరాజులలో ఒకరికి గవర్నర్ పదవి ఖాయమని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఒకవేళ అశోక్ గజపతిరాజుకి గవర్నర్ అవకాశం రాకపోతే రాజ్యసభకైనా పంపవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే సిఎం చంద్రబాబు ప్రధాని మోదీ వద్ద టిడిపికి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే కేంద్రంలో టిడిపికి రెండు మంత్రి పదవులు దక్కాయి. ఉత్తరాంద్రకి చెందిన రామ్మోహననాయుడికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా క్యాబినెట్ పదవి దక్కింది. ఇక తొలిసారి రాజకీయాలలోకి అడుగుపెట్టి గుంటూరు ఎంపిగా గెలుపొందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి కూడా కేంద్ర సహాయ మంత్రి పదవి లబించింది. టిడిపి నుంచి 16 మంది ఎంపిలగా గెలుపొందడంతో మూడు పదవులు ఆశించినప్పటికీ కూడా తాజా క్యాబినెట్ లో రెండే పదవులు దక్కాయి. విస్తరణలో మరో కేంద్ర సహాయమంత్రి పదవి వస్తుందని టిడిపి అంచనా వేస్తోంది. అదే సమయంలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ల కోసం ఒక గవర్నర్ పదవి ప్రతిపాధన కూడా మోదీ ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది..మరి టిడిపి సీనియర్ల ఆశలు నెరవేరతాయా...గవర్నర్ దక్కుతుందా...చూడాలి... -
వైఎస్సార్సీపీ జెండా మోసిన వాళ్లపై టీడీపీ దాడులు: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని అన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగింది. దీంతో వైఎస్సార్సీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి.. ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గవర్నర్ నజీర్‌ను కలిసిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులే టార్గెట్‌గా టీడీపీ దాడులు జరిపిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. బిహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని మండిపడ్డారు. బిహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. టీడీపీ నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారు.నూజివీడులో పట్టపగలే కత్తులతో దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు పేర్ని నాని. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వసం చేస్తున్నారని మండ్డారు. టీడీపీ దాడులు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? లేనట్టా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి కమిటీలు వేశామని, 26 జిల్లాల్లోనూ మా లీగల్ టీమ్‌లు యాక్టివేట్ అయ్యాయని తెలిపారు. బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. టీడీపీ గుండాల దాడులతోపాటు.. పోలీసుల తీరుపై కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.వైఎస్సార్సీపీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. గవర్నర్‌ను కలిసిన వాళ్లలో తాజా ఎంపీలు గురుమూర్తి, తనుజా, ఎమ్మెల్యేలు శివప్రసాద్, మత్యలింగం, విశ్వేశ్వర రాజు, పర్చూర్ నేత బాలాజీ ఉన్నారు. -
గవర్నర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ బృందం
సాక్షి, విజయవాడ: రాజ్ భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ బృందం గురువారం కలిసింది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైఎస్సార్సీపీపై టీడీపీ చేసిన దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి ఫిర్యాదు చేశారు. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాలలో పోలీసు అధికారుల వైఫల్యం పైనా వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది.పోలీస్ అధికారులను ఈసీ మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువ చోటుచేసుకున్నాయని వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు హింసాత్మక ఘటనలకి దిగారని.. చంద్రబాబుతో పాటు ఘటనకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వైఎస్సార్సీపీ పేర్కొంది. మంత్రి బొత్సతో పాటు గవర్నర్‌ని కలిసిన వారిలో మేరుగ నాగార్జున, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, కావలి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు.బాబు ప్రోద్భలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులు: మంత్రి బొత్స బాబు ప్రోద్భలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. బాబుతో పాటు హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాము. అబర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారు. అబర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రా పై న్యాయ విచారణ చేయాలి. ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెచ్చుకుని దీపక్ మిశ్రాను మార్చాలని కోరాముదీపక్ మిశ్రా అధికారులను బెదిరిస్తున్నారు: పేర్ని నానిఉద్దేశ పూర్వకంగా దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ-టీడీపీ తెచ్చింది. అతని వల్లే ఈ విధ్వంసం. రాష్ట్రంలో హింస జరుగుతున్న ప్రాంతాల్లో వారితో సీఎం జగన్ ఇప్పటికే మాట్లాడారు. సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారు. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారు. జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారు. పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదు. జిల్లాల్లో ఉన్న అందరూ అధికారులను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్‌లో ఉన్న అధికారిని ఏర్పాటు చేయాలని గవర్నర్‌ను కోరాము -
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
కోల్‌కతా: గవర్నర్ బోస్ ఎందుకు రాజీనామా చేయరో చెప్పాలని వెస్ట్‌బెంగాల్ సీఎం మమతాబెనర్జీ డిమాండ్ చేశారు. రాజ్‌భవన్‌లో మహిళా ఉద్యోగిపై గవర్నర్ లైంగిక వేధింపులకు పాల్పడడంపై శనివారం సప్తగ్రామ్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత విమర్శలు గుప్పించారు. బోస్ గవర్నర్‌గా ఉన్నంతకాలం తాను రాజ్‌భవన్‌లో అడుగుపెట్టనని మమత స్పష్టం చేశారు.‘దీదీగిరి పనిచేయదని గవర్నర్ అంటున్నారు. కానీ గవర్నర్ నీ దాదాగిరి కూడా పనిచేయదు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా గవర్నర్ ఎందుకు రాజీనామా చేయరో చెప్పాలి. గవర్నర్ నీ ప్రవర్తన సిగ్గుచేటు’అని మమత అన్నారు. -
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఆరోపణలపై విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని నలుగురు రాజ్‌భవన్ ఉద్యోగులకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సెట్)సమన్లు జారీ చేసింది. ఇంతేకాకుండా రాజ్‌భవన్‌లోని సీసీటీవీ వీడియోలను తమకు ఇవ్వాలని సెట్ అక్కడి అధికారులను కోరింది. ‘గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. ఈ బృందం రానున్న రోజుల్లో కొందరు సాక్షులను విచారించనుంది.లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కొన్ని వీడియోలు కావాలని రాజ్‌భవన్‌ను ఇప్పటికే కోరాం’అని ఒక పోలీసు అధికారి చెప్పారు. కాగా, రాజ్‌భవన్‌లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి గవర్నర్‌పై రాతపూర్వక ఫిర్యాదు చేసింది. తనను గవర్నర్ సివి ఆనంద్‌బోస్ లైంగిక వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొంది.అయితే గవర్నర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉండటం వల్ల పోలీసులు, కోర్టులు క్రిమినల్ చర్యలు ప్రారంభించడానికి వీలు లేదు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని గవర్నర్ స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లోకి పోలీసులను రానివ్వద్దని సిబ్బందికి ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
బెంగాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై ఓ మహిళా ఉద్యోగి లైంగిన వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో, ఈ ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. బెంగాల్ రాజ్‌భవన్‌లో పని చేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి.. గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. గవర్నర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ.. హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఆశచూపి గవర్నర్ తనపై పలుసార్లు లైంగికంగా వేధించారని సదరు మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. సదురు ఉద్యోగిని ఆరోపణలను గవర్నర్ ఆనంద బోస్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా ఆనంద్ బోస్ స్పందిస్తూ..‘ఇది దురుద్దేశంతో అల్లిన కట్టుకథ. ఇదంతా కల్పితమే. ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైనా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల ప్రయోజనాలను కోరుకుంటే.. వారికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. బెంగాల్లో హింస, అవినీతికి వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఎవరూ ఆపలేరు’ అని కామెంట్స్ చేశారు. “Truth shall triumph. I refuse to be cowed down by engineered narratives. If anybody wants some election benefits by maligning me, God Bless them. But they cannot stop my fight against corruption and violence in Bengal.”— Raj Bhavan Kolkata (@BengalGovernor) May 2, 2024 మరోవైపు.. ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ బెంగాల్లో రెండు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఇలాంటి నేపథ్యంలో గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం బీజేపీకి షాకిచ్చినట్టు అయ్యింది. ఇక, ఈ వ్యవహారంపై అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం గవర్నర్‌పై మండిపడుతున్నారు. -
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 'పొన్ముడి'
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి శుక్రవారం చెన్నైలోని రాజ్‌భవన్‌లో డీఎంకే ఎమ్మెల్యే కే పొన్ముడితో ప్రమాణం చేయించారు. పొన్ముడిని తిరిగి తన కేబినెట్లో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన సిఫార్సును గవర్నర్ ఆమోదించారు. ప్రస్తుతం మంత్రి ఆర్ఎస్ రాజకన్నప్పన్ నిర్వహిస్తున్న సాంకేతిక విద్య, ఎలక్ట్రానిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఉన్నత విద్య వంటి వాటిని పొన్ముడికి కేటాయించాలని స్టాలిన్ గవర్నర్‌కు సిఫార్సు చేశారు. #WATCH | Tamil Nadu Governor RN Ravi administers oath to DMK leader K.Ponmudy as a minister in the state cabinet pic.twitter.com/1DcWbBYD5Y — ANI (@ANI) March 22, 2024 పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు నిరాకరిస్తూ వచ్చిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టు చీవాట్లు పెడుతూ.. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఈ రోజు గవర్నర్ పొన్ముడి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పొన్ముడి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించారు. పొన్ముడి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత, సీఎం స్టాలిన్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సుప్రీంకోర్టు సకాలంలో జోక్యం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. On behalf of the people of Tamil Nadu, I thank the Hon'ble Supreme Court, the custodian of the Constitution, for its timely intervention & upholding the spirit of the Constitution and saving the democracy. In the last decade, the people of #INDIA witnessed the dithering of… pic.twitter.com/zthecHWbXL — M.K.Stalin (@mkstalin) March 22, 2024 -
TN: ‘సుప్రీం’ దెబ్బకు దిగొచ్చిన తమిళనాడు గవర్నర్
చెన్నై: డీఎంకే నేత కె.పొన్ముడి తమిళనాడు మంత్రిగా శుక్రవారం(మార్చ్ 22) మధ్యాహ్నం 3.30గంటలకు మళ్లీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పొన్ముడి ప్రమాణస్వీకారాన్ని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 24 గంటల్లో గవర్నర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో పొన్ముడి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చకచకా చేయడం గమనార్హం. అక్రమాస్తుల కేసులో పొన్ముడికి పడిన మూడేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అనంతరం పొన్ముడిని సీఎం స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. అయితే పొన్ముడితో ప్రమాణస్వీకారం చేయించడానికి గవర్నర్ రవి నిరాకరించారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు కన్నెర్ర జేయడంతో గవర్నర్ దిగిరాక తప్పలేదు. కాగా, తమిళనాడు ప్రభుత్వంలో గతంలో మంత్రిగా ఉన్న పొన్ముడిని అక్రమాస్తుల కేసులో దోషిగా తేలుస్తూ మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన తన శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. శిక్షపై సుప్రీంస్టే తర్వాత ఆయన తన శాసనసభ్యత్వాన్ని తిరిగి పొందారు. ఆ వెంటనే పొన్ముడిని మంతత్రివర్గంలోకి తిరిగి తీసుకోవాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఇదీ చదవండి.. కేజ్రీవాల్ పిటిషన్ విత్ డ్రా -
తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్ లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం.. ఇంఛార్జి గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశాల పై రాధాకృష్ణన్‌కు సీఎం రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్, తెలంగాణకు ఇన్‌ఛార్జి గవర్నర్‌గా, అలాగే పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. తమిళనాడు బీజేపీలో రాధాకృష్ణన్ సీనియర్ నేత. గతంలో బీజేపీకి ఆ రాష్ట్ర చీఫ్‌గా, కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా, పలు కీలక పదవులను నిర్వహించారాయన. రెండుసార్లు లోక్‌సభకు కొయంబత్తూరు నుంచి ప్రాతినిద్యం వహించారు. -
తెలంగాణ గవర్నర్‌గా రేపు సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియామకమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్.. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రికి రాధాకృష్ణన్ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ఉదయం 11:15 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను రాధాకృష్ణన్‌కు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. పూర్తి స్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలను నిర్వర్తించాలని రాధాకృష్ణన్‌ను కోరుతూ రాష్ట్రపతి భవన్ ఓ లేఖ విడుదల చేసింది. -
తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌కు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం జరగాల్సి ఉంది. అయితే ఈలోపు జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ ఆయనే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరిగేదాకా సీపీ రాధాకృష్ణన్ గవర్నర్‌గా కొనసాగనున్నట్లు ఆ ఉత్తర్వుల సారాంశం. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్.. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్. 1998, 99 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. తమిళనాడులో బీజేపీ బలపడేందుకు ఎన్నో పోరాటాలు చేశారాయన. అలాగే.. బీజేపీ తరఫున ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఆయన జార్ఖండ్‌కు గవర్నర్‌గా నియమితులయ్యారు. -
రాజీనామాపై స్పందించిన తమిళిసై.. దానికి మాత్రం నో రిప్లై
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్ తాజాగా స్పందించారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నానని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తున్నందుకు బాధగా ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ తనకెప్పుడూ అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్లేనని అన్నారు. కాగా తెలంగాణ గవర్నర్ పదవికి సోమవారం తమిళిసై రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి బీజేపీ తరఫున ఆమె బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేగాక గవర్నర్ పదవి చేపట్టకముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. తనపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలను ఎన్నటికీ మరవనని.. అందరితో కలుస్తూ ఉంటానని చెప్పారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రశ్నను.. ఆమె దాటవేస్తూ వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై.. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. -
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా (ఫొటోలు)
-
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
-
తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజ్‌భవన్ అధికారిక ప్రకటన ప్రకారం.. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి, అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. అనంతరం, రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఆమె చెన్నైకి వెళ్తారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై తమిళనాడు పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. తమిళనాడులోని తుత్తుకూడి, చెన్నై సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాజకీయపరంగా తమిళిసై కుటుంబానికి కాంగ్రెస్ నేపథ్యం ఉంది. అయితే తర్వాతి కాలంలో బీజేపీ వైపు ఆమె మొగ్గు చూపించారు. -
గవర్నర్‌గా హ్యాండిల్ చేయలేననుకున్నారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రాయదుర్గం/నిజామాబాద్ అర్బన్: ‘నన్ను గవర్నర్‌గా నియమించినప్పుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని (న్యూబార్న్ బేబీ) హ్యాండిల్ చేయలేనని అందరూ అనుకున్నారు.. కానీ ఓ గైనకాలజిస్టుగా న్యూబార్న్ బేబీకి ఎలా చికిత్స చేయాలో నాకు తెలుసు.. అలా గే పుదుచ్చేరి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చి నప్పుడు కూడా రెండు రాష్ట్రాలను ఎలా హ్యాండిల్ చేస్తారని అన్నారు.. ఓ డాక్టర్‌గా ట్విన్స్ (తెలంగాణ, పుదుచ్చేరి)కు ఎలాంటి చికిత్స చేయాలో కూడా తెలుసు.. నాకు ఈ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది చదువే..’అంటూ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ–హైదరాబాద్‌లో క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలో మరో రెండు జాతీయ విద్యాసంస్థల్లో భవనాలను ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటీ–హెచ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై ప్రసంగించారు. ప్రభుత్వం ఉన్నత మౌలిక సదుపాయాలతో నెలకొల్పుతున్న ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు దేశం కోసం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని గవర్నర్ పిలుపునిచ్చారు. సేవా రూపంలో గానీ, నూతన ఆవిష్కరణల రూపంలో గానీ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించారు. కొలనులో నీటిమట్టం పెరిగితే కమలం పువ్వు పైపైకి వచ్చినట్లుగానే.. సమాజంలో విద్యా సంబంధిత మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే.. ప్రజల జీవన ప్రమాణాలు కూడా పైపైకి వస్తాయని వివరించారు. గతంలో ఈ ఆస్తులను తన తండ్రి సంపాదించి ఇచ్చారని పిల్లలు చెప్పుకునే వారని, ఇప్పుడు పరిస్థితి మారిందని, కుటుంబ బాధ్యతలను పిల్లలే తీసుకుంటున్నారని, ఇది ఒక్క విద్యతోనే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ‘మనూ’లో రూ.64.41 కోట్లతో భవనాలు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ)లో రూ.64.41 కోట్ల వ్యయంతో నిర్మించిన వివిధ భవనాలను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రాయదుర్గం క్యాంపస్‌లో రూ.11.19 కోట్లతో నిర్మించిన రెండంతస్తుల కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం భవనాన్ని, రూ.25 కోట్లతో మూడంతస్తుల ఇంజనీరింగ్ వర్క్‌షాప్ భవనాన్ని. రూ.28.22 కోట్లతో నిర్మించిన ఒడిశా కటక్‌లోని ‘మనూ’పాలిటెక్నిక్ భవనాన్ని మోదీ జాతికి అంకితం చేశారు. ‘మనూ’క్యాంపస్‌లో నిర్వహించిన ప్రత్యక్ష ప్రత్యేక కార్యక్రమంలో వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్, ఇతర ప్రొఫెసర్లు పాల్గొన్నారు. నిజామాబాద్‌లో కేవీ నూతన భవనం నిజామాబాద్‌లో కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ నిజామాబాద్‌లో 7.5 ఎకరాల్లో రూ. 22 కోట్లు వెచ్చించి అన్ని వసతులతో కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
TN: తమిళనాడు సర్కారుకు గవర్నర్ షాక్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ ఆర్.ఎన్ రవి అసెంబ్లీకి వచ్చారు. ప్రారంభించిన కొద్ది నిమిషాలకే గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. సీఎం స్టాలిన్, స్పీకర్, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు చెప్పి అనంతరం తాను ప్రసంగం చదవడం లేదని తెలిపారు. ప్రసంగంలోని అంశాలు సరిగా లేవని, ప్రసంగం ప్రారంభించే ముందు, పూర్తయిన తర్వాత జాతీయ గీతం ఆలపించాలని తాను చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఇందుకే తాను ప్రసంగం చదవ లేదని గవర్నర్ తెలిపారు. #WATCH | Tamil Nadu Governor RN Ravi, who refused to read the address given by the government to him at the Legislative Assembly, leaves from the Assembly https://t.co/9IvBmDvMp6 pic.twitter.com/gYv8RjNmq7 — ANI (@ANI) February 12, 2024 ప్రసంగంలోని చాలా అంశాలపై తనకు అభ్యంతరాలున్నాయని గవర్నర్ చెప్పారు. అసలు నిజాలు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ప్రసంగంలోని అంశాలు ప్రతిబింబించడం లేదని గవర్నర్ చెప్పారు. ఇటీవలే కేరళలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా ప్రసంగంలోని కేవలం లాస్ట్ పేరా చదవి గవర్నర్ ప్రసంగాన్ని ముగించారు. ఇదీ చదవండి.. నేడు బీహార్‌లో ఏం జరగనుంది.. ఎవరి బలం ఎంత -
Jharkhand: గవర్నర్‌పై జేఎంఎం నేత కీలక వ్యాఖ్యలు
రాంచీ: జార్ఖండ్‌లో అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఆ రాష్ట్ర గవర్నర్‌పై ఫైర్ అయ్యింది. తమ ప్రభుత్వాన్ని మళ్లీ బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ నేరుగా ఎందుకు ఆదేశించారని, ఈ విషయంలో ఆయనను ఎవరు ప్రభావితం చేశారో చెప్పాలని జేఎంఎం జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య డిమాండ్ చేశారు. ‘ఎక్కడైనా ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే గవర్నర్ కేర్‌టేకర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ గవర్నర్ అలాంటిదేమీ చేయలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జనవరి 31వ తేదీనే మేం సంసిద్ధతను వ్యక్తం చేశాం. మా లెజిస్లేచర్ పార్టీ నేతను ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా గవర్నర్ ఎందుకు ఆహ్వానించలేదు. ప్రజల నుంచి ఉన్న ఒత్తిడి వచ్చిన తర్వాతే గవర్నర్ మమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా పిలిచారు. కానీ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఫ్లోర్ టెస్ట్‌కు ఎందుకు ఆదేశించారు. దీనికి హేతుబద్దత ఏంటో తెలియదు. మాకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది’ అని సుప్రియో భట్టాచార్య తెలిపారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం సోమవారం(ఫిబ్రవరి 5) మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంది. మెజార్టీ నిరూపించుకోవడానికి కావాల్సిన సభ్యుల బలం ఇండియా కూటమి ప్రభుత్వానికి ఉందని జేఎంఎం, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదీచదవండి.. విమానంలో మహిళతో అసభ్య ప్రవర్తన -
పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ రాజీనామా
చండీగఢ్: పంజాబ్ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిపాలనాధికారిగా ఉన్న బన్వారీలాల్ పురోహిత్ పదవులకు రాజీనామా చేశారు. శనివారం ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమరి్పంచారు. ‘‘వ్యక్తిగత కారణాలతోపాటు కొన్ని ఇతర బాధ్యతలను నెరవేర్చాల్సిన దృష్ట్యా పంజాబ్ గవర్నర్ పదవితోపాటు, చండీగఢ్ పరిపాలనాధికారి బాధ్యతలకు రాజీనామా సమరి్పస్తున్నాను’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన మరునాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ పాలనాధికారిగా 2021లో బన్వారీలాల్ బాధ్యతలు చేపట్టారు. -
Jharkhand politics 2024: సీఎంగా చంపయ్ ప్రమాణం
రాంచీ: జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) శాసనసభాపక్ష నేత చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ఆయనతో సీఎంగా ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అలంగీర్ అలాం, రాష్రీ్టయ జనతాదళ్(ఆర్జేడీ) నేత సత్యానంద్ భోక్తా రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 67 ఏళ్ల గిరిజన నాయకుడు చంపయ్ సోరెన్ జార్ఖండ్‌కు 12వ ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న జేఎంఎం అగ్రనేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పార్టీ శాసనసభాపక్ష నేతగా చంపయ్ సోరెన్‌ను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హేమంత్ సోరెన్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ చేరుకున్న జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తరలించారు. తమ ఎమ్మెల్యేలపై విపక్ష బీజేపీ వల విసిరే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా వారిని బయటకు తరలించినట్లు కూటమి నేతలు చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్‌తో చంపయ్ సోరెన్ -
గవర్నర్‌ను కలిసిన మెగా కోడలు ఉపాసన.. ఎందుకంటే?
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను మెగా కోడలు ఉపాసన కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు. గిరిజనుల కోసం గవర్నర్ తీసుకుంటున్న చర్యలను ఉపాసన కొనియాడారు. వారి అభివృద్ధి, సంక్షేమ కోసం చేస్తున్న గవర్నర్ చేస్తున్న పనులు నా హృదయాన్ని కదిలించాయని అన్నారు. మీరు చేస్తున్న ఈ పనులకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ.. ఉపాసన తన ట్విటర్ ద్వారా ఫోటోలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Met with the Honorable Tamilisai Soundararajan Garu, the esteemed Governor of Telangana. Getting a deeper understanding of what she is doing for tribal welfare has really touched my heart.❤️ Kudos to u Ma’am, for your remarkable work. 🙏🏼✨@DrTamilisaiGuv #tribalwelfare pic.twitter.com/dUAXqZ5Zi4 — Upasana Konidela (@upasanakonidela) February 1, 2024 -
2 నిమిషాల్లోనే ప్రసంగం ముగిసింది
తిరువనంతపురం: కేరళలోని వామపక్ష ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. గురువారం కేరళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ప్రభుత్వ విధివిధానాలను వివరించాల్సిన గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రసంగ పాఠంలోని చివరి పేరాను మాత్రమే చదివి కేవలం రెండు నిమిషాల్లోనే ప్రసంగం ముగించారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ 9.02 గంటలకల్లా ప్రసంగం ముగించారు. 9.04 గంటలకు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. కొన్ని బిల్లుల పెండింగ్, యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించిన అంశాలపై గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం
-
TS: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్‌ను ఎంపిక చేస్తూ గవర్నర్ ఆమోదం తెలిపారు. వారం రోజుల క్రితం ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్‌కు ప్రభుత్వం పంపింది. దావోస్ పర్యటనకు ముందు పేర్లను గవర్నర్‌కు పంపగా, నిన్న గవర్నర్ తో భేటీ సందర్భంగా ఎమ్మెల్సీల అంశం చర్చకు వచ్చింది. ఇవాళ లేదా రేపు గవర్నర్ అధికారిక ప్రకటన చేయనున్నారు. కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్‌గా ఎం. మహేందర్‌రెడ్డిని నియామకం ఖరారైంది. మాజీ డీజీపీ అయిన మహేందర్‌రెడ్డి నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీఎస్పీఎస్సీ సభ్యులుగా రిటైరర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రాంమోహన్‌రావు నియమితులయ్యారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టింగ్ కోసం మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఆ పేరును గవర్నర్‌కు పరిశీలనకు పంపింది. చివరకు గవర్నర్ ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు. ఇదీ చదవండి: బాలకృష్ణ అక్రమార్జన.. అధికారులే కంగుతినేలా..! -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీపై తమిళిసై కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో రిట్ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ భర్తీ నిలిపివేయాలని తమిళిసై నిర్ణయించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. -
గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు ఇటీవల వరుసగా హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ఈ అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డీపీలు మార్చడం, సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీటర్ అకౌంట్లు కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. మొన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. తాజాగా గవర్నర్ తమిళిసై ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ హ్యాక్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కేరళ గవర్నర్‌పై బృందాకారత్ సంచలన వ్యాఖలు
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌పై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కావాలంటే ఖాన్ త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాలని సూచించారు. ‘గౌరవ గవర్నర్‌కు ఒకవేళ రాజకీయాలంటే ఆసక్తి ఉంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలి. పోటీచేసి రాజకీయాల్లో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. బీజేపీ టికెట్ తీసుకుని కేరళలోని ఏ స్థానం నుంచి అయినా ఆయన పోటీ చేయొచ్చు. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోతాయి. గవర్నర్ రోజూ పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చే బదులు సీఎంతో ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటే మంచిది’అని బృందా కారత్ సూచించారు. కేరళ ప్రభుత్వం పంపిన యూనివర్సిటీ బిల్లులపై సంతకాలు చేయకుండా గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. దీంతో గవర్నర్‌కు ప్రభుత్వానికి మధ్య సంబంధాలు చెడిపోయాయి. యూనివర్సిటీ బిల్లులు మనీ బిల్లులయినందున గవర్నర్ ఆమోదం లేకుండా వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కుదరదు. దీంతో ఆ బిల్లులపై ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోంది. గవర్నర్‌కు ఈ బిల్లులపై డైరెక్షన్స్ ఇదీచదవండి..విజయ్‌కాంత్‌ను తల్చుకుని ప్రధాని భావోద్వేగం -
నా రాజీనామా ఊహాగానమే
సాక్షి హైదరాబాద్/కంటోన్మెంట్: తాను గవర్నర్‌గా రాజీనామా చేసి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలేనని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. శనివారం ఆమె హైదరాబాద్‌లోని అనురాధా టింబర్స్‌ను సందర్శించినప్పుడు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం గవర్నర్‌గా సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తు శ్రీరాముడితో పాటు ప్రధాన మంత్రి మోదీ చేతుల్లో ఉందన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. పూల బొకేలు వద్దు.. బుక్స్ తీసుకురండి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ సోమవారం ఉదయం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు రాజ్‌భవన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులను గవర్నర్ ఆహ్వనించినట్టు తెలిసింది. కాగా, ఈ కార్యక్రమానికి హాజరయ్యేవాళ్లు పూల బొకేలకు బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులను తీసుకురావాలని గవర్నర్ విజ్ఞప్తి చేసినట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.


