తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ ప్రమాణ స్వీకారం | Jishnu Dev Verma Sworn In As Governor Of Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ ప్రమాణ స్వీకారం

Jul 31 2024 4:19 PM | Updated on Jul 31 2024 5:14 PM

Jishnu Dev Verma Sworn In As Governor Of Telangana

తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ రాజ్‌ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ రాజ్‌ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.

జిష్ణుదేవ్‌ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర నాలుగవ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ గవర్నర్లుగా ఇప్పటి వరకు ఈఎస్‌ఎల్‌ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, ఇన్‌చార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ వ్యవహరించిన సంగతి తెలిసిందే.

కాగా, జిష్ణుదేవ్ వర్మ బుధవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిష్ణుదేవ్ వర్మకు సాయుధ దళాలు గౌరవ వందనం చేశాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement