
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వు గవర్నర్ లిసా కుక్‌ను తొలగించారు. ఈ విషయాన్ని సోమవారం రాత్రి సొంత ట్రూత్ మీడియాలో ట్రంప్ ప్రకటించారు. ఆమె మోసానికి పాల్పడినట్లు వచి్చన ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని తెలిపారు. మిషిగన్, జార్జియాలోని భవనా లను ప్రాథమిక నివాసాలుగా ప్రకటిస్తూ ఆమె సంతకాలు చేసిన పత్రాలను ట్రంప్ అటాచ్ చేశారు.
రెండు వారాల వ్యవధిల్లోనే రెండిళ్లను ఆమె కోరారని, బహుశా మొదటి నివాసం విషయం మ ర్చిపోయి ఉంటారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మార్టిగేజ్(తనఖా) విభాగానికి ట్రంప్ నియమించిన బిల్ పాల్ట్ గత వారం స్వయంగా లిసాపై ఆరోపణలు చేయడం గమనార్హం. స్వల్పకాలిక వడ్డీ రేట్లలో కోత విధించాలంటూ ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్‌పై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. చెప్పింది చేయకుంటే పదవి నుంచి తొలగిస్తానని హెచ్చరిక సైతం చేయడం గమనార్హం.
అదేవిధంగా, సెంట్రల్ బ్యాంకు బోర్డులోని ఏడుగురు సభ్యుల్లో లిసా ఒకరు. మొత్తం 12 మంది సభ్యుల్లో లిసా సహా ఏడుగురికి మాత్రం వడ్డీ రేట్లు తగ్గించే అధికారముంది. వడ్డీ రేటు తగ్గించేందుకు లిసా అంగీకరించడం లేదు. జూలైలో జరిగిన బోర్డు సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు పావెల్‌తోపాటు ఓటేసిన వారిలో లిసా కుక్ ఉన్నారు. దీంతో, ఇటీవల రాజీనామా చేయాలంటూ ట్రంప్ కోరినా ఆమె కొనసాగుతూనే ఉన్నారు. ఇది నచ్చని ట్రంప్ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారంతోనే లిసా కుక్‌ను తొలగించినట్లు తాజాగా సమర్థించుకున్నారు.
ఆ అధికారం అధ్యక్షుడికి లేదు
ఫెడరల్ రిజర్వు గవర్నర్ లిసా కుక్ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. వేధింపులకు భయపడి రాజీనామా చేయబోనని తెగేసి చెప్పారు. తనను తొలగించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేశారు. అమెరికా ప్రజలకు సేవలందించేందుకు 2022 నుంచి కొనసాగుతున్నానన్నారు. ట్రంప్ చర్యకు తగు కారణం లేదన్నారు. ట్రంప్ చూపుతున్న పత్రాలు నాలుగేళ్ల క్రితం తాను సెంట్రల్ బ్యాంకులో చేరకముందునాటివని తెలిపారు.