పేరులో ఏముంది? విడాకుల వరకూ తీసుకెళ్లింది | China divorce drama over baby name dispute delays birth certificate, vital vaccinations | Sakshi
Sakshi News home page

పేరులో ఏముంది? విడాకుల వరకూ తీసుకెళ్లింది

Nov 30 2025 9:29 AM | Updated on Nov 30 2025 11:06 AM

China divorce drama over baby name dispute delays birth certificate, vital vaccinations

కసి ఉండటానికి కారణాలు అవసరం లేదు కానీ, విడిపోవడానికి చాలా వెతుక్కోవచ్చు. తమ పిల్లాడికి పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయం లేక చైనాలో ఓ జంట విడాకుల కోసం కోర్టుకెక్కింది. షాంఘైలోని పుడాంగ్‌ న్యూ ఏరియాలో ఓ జంటకు 2023లో వివాహమైంది. మరుసటి ఏడాది బాబుకు జన్మనిచ్చారు. అయితే, ఆ పిల్లాడి నామకరణం పెద్ద రణంగా మారింది. నేను చెప్పిన పేరే పెట్టాలని ఇరువురూ పట్టుబట్టారు. చివరకు కలిసి ఉండలేం అని కోర్టుకెక్కారు. కేసు పూర్వాపరాలు చూసిన న్యా­య­మూర్తి ఆశ్చర్యపోయారు. బాబుకు ఏడాది వయసు దాటినా ఇంకా జనన ధ్రువీకరణ పత్రం లేకపోవడం, పేరు పెట్టకపోవడం వల్ల టీకాలు వేయడానికీ కుదరకపోవడం మైనర్‌ హక్కుల ఉల్లంఘనే అని హెచ్చరించారు. భావోద్వేగ సంఘర్షణలలో పిల్లలను బేరసారాలుగా ఉపయోగించకూడదని మందలించారు. నిర్దిష్ట కాలవ్యవధిలోగా పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయానికి రావాల్సిందేనని చెకప్పారు. ఈ కేసు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. పేరులో ఏముంది అని అంటారు.. కానీ ఎంత ఉందో చూశారా?  

Advertisement
 
Advertisement
Advertisement