సాక్షి, హైదరాబాద్: సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ పాల్గొన్న కార్యక్రమంలో భద్రతా వైఫల్యం బయటపడింది. రిపోర్టర్ల ముసుగులో ఆగంతకులు పోలీసుల కళ్లు గప్పి లోపలికి ప్రవేశించారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైటెక్ సిటీ ఆవాస హోటల్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో ఏకంగా 8 నేషనల్ మీడియా చానెల్స్‌కు చెందిన లోగోస్ పట్టుకుని ఓ వ్యక్తి వచ్చాడు. అతని వెంట మరో వ్యక్తి ఉన్నాడు. అయితే ఒరిజిల్ నేషనల్ మీడియా ప్రతినిధులు ఆ ఇద్దరి కదలికలపై అనుమానంతో ప్రశ్నించారు. చివరకు నకిలీ రిపోర్టర్లుగా నిర్ధారించుకుని పోలీసులకు అప్పగించారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు.. ఎంక్వైరీ ప్రారంభించారు.


