ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్.. టక్కీట్ సహకారంతో.. మొత్తం లేదు మెట్రో స్టేషన్లలో స్మార్ట్ స్టోరేజ్ లాకర్లను ప్రారంభించింది. ఇది ప్రయాణికుల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్టోరేజ్ లాకర్లు.. హెల్మెట్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు & ఇతర వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా భద్రపరచుకోవచ్చు. చేతిలో వస్తువులు లేకుండా.. తిరగాలనుకునే ప్రయాణికులకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. వీటి ప్రారంభోత్సవం.. ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో జరిగింది.
ఎలా ఉపయోగించుకోవాలంటే?
లాకర్ ప్యానెల్‌లో కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, మీ వస్తువులు ఎన్ని ఉన్నాయి, ఎంత పరిమాణంలో లాకర్ కావాలనే విషయాన్ని ఎందుకోవాలి. మీరు ఎంతసేపు మీ వస్తువులను అక్కడ ఉంచాలో.. దానికి డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ మొత్తం కేవలం 30 సెకన్లలోపు పూర్తవుతుంది.
ఏడు మెట్రో స్టేషన్స్
మియాపూర్
అమీర్‌పేట్
పంజాగుట్ట
LB నగర్
ఉప్పల్
పరేడ్ గ్రౌండ్
హై-టెక్ సిటీ


