ఈ రోజుల్లో ఐఫోన్ కొనుగోలు చేయడం అనేది.. చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. ఈ కారణంగానే కొత్త మోడల్ మార్కెట్లోకి రాగానే ఎగబడిమరీ కొనేస్తుంటారు. ధరలు ఎంత ఉన్నప్పటికీ.. తగ్గేదే అన్నట్టు ఈఎంఐ ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవల రూ. 26వేలు జీతం ఉన్న వ్యక్తి.. రూ. 70000 ఐఫోన్ కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీకి చెందిన కవల్జీత్ సింగ్ (ఖడక్ సింగ్ దా ధాబా కో ఫౌండర్, ది చైనా డోర్ ఫౌండర్) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన సమాచారం ప్రకారం.. రూ. 26,000 జీతం ఉన్న తన ఉద్యోగి రూ. 70,000 ఐఫోన్‌ను ఎలా కొన్నారో వివరించారు. తన ఉద్యోగి ఇంత బాధ్యతారహితమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం.. తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోయారు.
ఐఫోన్ కొన్న ఉద్యోగి.. తన కంపెనీలో డెలివరీ డ్రైవర్‌గా చేరారని, కొన్ని సంవత్సరాలలోనే అతడు స్థానిక కార్యకలాపాలను చూసుకుంటున్నారని కవల్జీత్ సింగ్ అన్నారు. అయితే ఈ మధ్యకాలంలో సంస్థ నుంచి రూ. 14000 అడ్వాన్స్ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని 12 నెలల ఈఎంఐ ఆప్షన్ కింద చెల్లింపు ఎంచుకున్నాడు.
తన జీతం రూ. 26000, ఇప్పుడు ఐఫోన్ కోసం అడ్వాన్స్ తీసుకున్నాడు, ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నాడు. అయితే అతనిపై తన ముగ్గురు పిల్లలు, భార్య ఆధారపడి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. అతడు ఐఫోన్ కొనడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందని కవల్జీత్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కొందరు అతని నిర్ణయాన్ని తప్పుపట్టారు. మరికొందరు కవల్జీత్ సింగ్ తక్కువ జీతం ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుని.. తాను తీసుకునే నిర్ణయం తప్పు అని చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు.
One of my Operations Manager with 26k salary has just bought a ~70 k iPhone.
His financing plan⬇️
1 month salary advance from us
14k cash payment
30k online financing with approx 3k monthly EMI for 12 months.
& btw he has 3 kids & a dependent wife at home
Mind= Blown !— Kawaljeet Singh (@kawal279) November 26, 2025


