ఒక ఉద్యోగికగా తాను చేసిన సేవలకు గుర్తింపు లభించడం అంటే ఆస్కార్ వరించినంత ఆనందం. అది వ్యక్తిగత లేదా,బహిరంగ ప్రశంస అయినా, అవార్డులు, రివార్డు, నగదు బహుమతి అయినా, ఏదైనా ఎంత చిన్నదైనా కూడా గొప్ప గౌరవమే. అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాదు, నిబద్దతను పెంచుతుంది. తమ కృషికి విలువ లభిస్తుందనే భావన, ఆరోగ్యకరమైన పోటీ, పనితీరును మెరుగుకు దారితీస్తుంది. అంతిమంగా ఇది సంస్థకు ఎనలేని మేలు చేస్తుంది. ఇపుడు ఇదంతా ఎందుకూ అంటే.. భారత సంతతి వ్యక్తికి తన సంస్థనుంచి లభించిన అరుదైన గౌరవంగా నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
మెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన ఉద్యోగి బల్బీర్ సింగ్‌ను సంస్థ చాగా గొప్పగా సత్కరించుకుంది 40 ఏళ్ల పాటు అంకిత భావంతో పనిచేసిన మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజ్ లిండ్సే వాలిన్‌కు సుమారు రూ. 35 లక్షల బహుమతిని (40 వేల డాలర్లు) అందించింది. ఈవెంట్ వేదిక వద్దకు బల్బీర్ సింగ్‌ను లిమోజిన్ కారులో తీసుకువచ్చి, రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికి మరీ దీనికి సంబంధించిన చెక్కును అందించారు. అలాగే సేవా పురస్కారం, స్మారక "వన్ ఇన్ ఎయిట్" జాకెట్‌నుకూడా అందుకున్నారు. ఈసందర్బంగా ఫ్రాంచైజ్ యజమాని లిండ్సే వాలిన్ మాట్లాడుతూ, బల్బీర్ సింగ్ తమ సంస్థకు గుండెలాంటి వారని కొనియాడారు. మొత్తం తొమ్మిది అవుట్‌లెట్‌లను కలిగి ఉన్న లిండ్సే వాలిన్, సింగ్ ఈ విజయాన్ని ఇతర ఉద్యోగులతో ఘనంగా సెలబ్రేట్ చేశారు. బల్బీర్ తనతో కలిసి చేసిన 40 ఏళ్ల ప్రయాణం గురించి చెప్పలేమని చెప్పలేననీ, తొమ్మిది రెస్టారెంట్లలో నాలుగు రెస్టారెంట్లను చాలా గొప్పగా, అచంచల దృష్టితో నడుపుతున్నాడు ఆమె ప్రశంసించారు.
చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్‌లో ఆ కంపెనీల జోరు
బల్బీర్ సింగ్ కెరీర్
బల్బీర్ సింగ్ 40 ఏళ్ల క్రితం భారతదేశం నుండి అమెరికాకు వచ్చిన కొద్ది రోజులకే మెక్‌డొనాల్డ్స్‌లో కెరీర్ ప్రారంభించారు. తొలుత 1985లో సోమర్‌విల్లేలోని రెస్టారెంట్ కిచెన్‌లో పనిచేశారు. అలా కష్టపడి, పూర్తి నిబద్ధతతో పనిచేసి, ఒక్కో మెట్టు ఎదుగుతూ తాను పనిచేస్తున్న సంస్థలోని తొమ్మిది రెస్టారెంట్లలో నాలుగుంటిని పర్యవేక్షించే స్థాయికి చేరుకోవడం విశేషం. మొదట బల్పీర్ సింగ్ తన తండ్రి బాబ్‌కింగ్ వద్ద పనిచేసేవారని కంపెనీ మోటో అయిన వై నాట్ అనే పద్ధతిని స్వీకరించారని, ఇంకా ఎదగాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఆలోచనా విధానమే మా విజయానికి కారణమని లిండ్సే వాలిన్. మరోవైపు ఈ కంపెనీలో పనిచేయడం తనకు చాలా గర్వకారణమంటూ సంతోషాన్ని ప్రకటించారు బల్బీర్ సింగ్ .


