ట్రంప్‌ బిగ్‌ షాక్‌.. భారత్‌పై ఏకంగా 500 శాతం టారిఫ్స్? | Bill Threatening 500 percent Tariff On India For Russia Oil Trade Gets Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ బిగ్‌ షాక్‌.. భారత్‌పై ఏకంగా 500 శాతం టారిఫ్స్?

Jan 8 2026 11:56 AM | Updated on Jan 8 2026 12:27 PM

Bill Threatening 500 percent Tariff On India For Russia Oil Trade Gets Trump

వాష్టింగన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు భారీ షాక్‌ ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు లబ్ధి చేకూరుస్తున్నారంటూ ఆయా దేశాలపై భారీ సుంకాల భారం మోపుతున్నారు. తాజాగా, భారత్‌పై మరోసారి టారిఫ్‌ పిడుగు వేసేందుకు సిద్ధమయ్యారు.యూఎస్ సెనెటర్ లిండ్సే గ్రాహం రూపొందించిన శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్- 2025 కు ట్రంప్ మద్దతు ప్రకటించారు.

ఈ బిల్లు ప్రకారం..ఈ కొత్త బిల్లు ప్రకారం.. రష్యా నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని వస్తువులు, సేవలపై కనీసం 500 శాతం సుంకం విధించనున్నారు. రష్యా దాని సాన్నిహిత్య దేశాలైన బ్రెజిల్, చైనాతో పాటు  భారత్‌పై 500శాతం టారిఫ్‌ విధించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగే భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్య,వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయని విశ్లేషకుల అంచనా  

ఉక్రెయిన్‌పై యుద్ధంలో  రష్యా పరోక్షంగా సహకరిస్తూ చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై చర్యలు తీసుకునేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్- 2025కును రూపొందిస్తుంది. ఆ చట్టంపై యూఎస్ సెనెటర్ లిండ్సే గ్రాహం నెలల తరబడి పనిచేస్తున్నారు. తాజాగా, చట్టం రూపకల్పన తుది అంకానికి చేరడంతో ఆయన ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రష్యాను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే బిల్లుకు ట్రంప్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు లిండ్సే గ్రాహం ధృవీకరించారు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement